Passage 10
Passages 1–16
భగవానుడైన శ్రీకృష్ణుడు ఇంకనూ ఇట్లు చెప్పబోదగెను. “దీనినే అపరా ప్రకృతి అని కూడనూ అందురు. అది కేవలము నా శక్తి ప్రభావమే! బావా! స్థూలదృష్టికి ప్రపంచమున అనేకములు ఉండినట్లు కనిపించిననూ అందులో అనేకములు లేవు; ఏక స్వరూపమే. అంతఃకరణ వృత్తి (దీనినే దృష్టి అని అందురు) జ్ఞానమయము అయిన జగతంతయూ బ్రహ్మమయముగా తోచును. కాని అంతఃకరణ వృత్తి జ్ఞానమయము కావలెను. జగతంతయూ నిండియుండినది జగదీశుడే. “ఈశావాస్యమిదం సర్వం” అని ఉన్నది.
ఉన్నది ఒకటే అయినప్పటికిని అనేకములుగా గోచరించునని కృష్ణపరమాత్మ చెప్పిన విషయములలో మనమొక ఉదాహరణమును స్మరింతము. ఒక సాయంకాల సమయమున మసక మసక గల మబ్బులలో మనము ప్రయాణము చేయుదారిలో మధ్య మడతలు మడతలుగా చుట్టుకొన్న త్రాడు పడిఉండును. అది నిజమునకు త్రాడు. త్రాడుగనే యున్ననూ ఆ దారిని నడుచు ప్రయాణీకులు ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన వస్తువుగా భ్రాంతి పడుదురు. ఒకరు అది దండ అని తలంచి దాటిపోవుదురు. మరొకరు జలధార అని తలంచి త్రొక్కి పోవుదురు. మరొకరు ఏదో తీగపడినదని తలంతురు. మరికొందరు పామేమో? అని దూరము దూరమే నిలిచి పరిశీలింతురు భయపడుదురు కూడా!
అటులనే పరబ్రహ్మ, తన స్వరూపమునకు భంగము లేని మాయ వలన నానా నామ రూప ప్రపంచముగా భాసిస్తాడు. ఎన్ని రకములుగా కనిపించిననూ, భావించిననూ, భ్రమించిననూ త్రాడు తప్ప అన్యమెట్లు కాదో, అటులనే భగవంతుని యెన్ని విధములుగా తలంచి, భావించి, భ్రమించిననూ, అతను బ్రహ్మము తప్ప అన్యము కాడు. పరమాత్ముడు అన్నింటికీ ఆధారమైయున్నాడు. అతని ఆధారము లేక ప్రపంచము నిలువజాలదు. పూలమాలకు దారమెట్లు ఆధారమో, కట్టిన అంతస్తుల మేడకు పునాది యెంత ఆధారమో, పరమాత్ముడు కూడనూ జీవులను పూలకూ, ప్రకృతి సౌధమునకు అంత ఆధారము. అయితే పూలమాలలోని పూలూ, కట్టిన అంతస్తుల మేడా ముందు కనిపించును. కాని మాలలోని దారమూ, భూమిలోని పునాది ముందుగా కనిపించవు. కనిపించనంత మాత్రమున అవి లేవనరాదు. వాటి ఆధారమే లేకున్న పూలమాల లేదు. అంతస్తుల భవనమూ లేదు.
అయితే, వాటిని మనము చూడవలెనన్న కొంత విచారణ అవసరము. పరిశీలన చేయక అవి కనిపించవు. మాలలో పరిశీలించి చూచిన దారము, భూమిలో త్రవ్విచూచిన పునాదులా మనకు తెలియునే కాని కనిపించు పై అంతస్తులందా, కట్టిన పూలమాలపైనా పునాదులు, దారము కనిపించవు. కనుక కనిపించు ఆధేయాన్ని మనము ప్రధానముగా తీసుకొని అంతటితోనే ఉండి మన బుద్ధిని పరిశీలనకు దింపకున్న మనకు సత్యమేమాత్రమూ తెలియదు. కనిపించిన దానికి కనిపించని ఆధారమొకటున్నదని, దీనిని తెలుసుకొనుటకు విచారణ సలుపుట చక్కని మార్గము. దీనిని అనుభవమునకు తెచ్చుకొనువారలకు అనేక విధముల చెప్పవనసరము లేదు. అంతే కాని పూసలైన జీవుల యోగ్యతా, అయోగ్యతా మనకు ప్రధానముకాదు. దీనికి ఆధారమైన సూత్రము బ్రహ్మము; అదే మనకు ప్రధానము. కేవలము మాల అందమునకు అయోగ్యమైన పూవులు కూడనూ చేర్చవచ్చును. అనగా జీవులు తామసిక, రాజసిక, సాత్త్వికములైన భేదములతో ఉన్ననూ పరమాత్మ వాటిని పాటించక అతీతస్థాయిలో సత్యనిత్య నిర్లిప్తుడై నిండియుండును. దండకు దారము అందమై యుండును. దారము లేక పూవులు దండ కాలేవు. అటులనే బ్రహ్మములేక జీవులను వేరుచేయ వీలులేదు, సాధ్యము కాదు.
ప్రపంచమున సర్వ పదార్థములందూ, పంచభూతములందూ, నిండియుండియూ పైకి గోచరముకాక అంతర్యామియై అన్నింటిలో ఉన్నాడు. అందుకనే కృష్ణపరమాత్మ, జలములో నేను రసస్వరూపముగను, సూర్యచంద్రాదులలో ప్రకాశముగను, వేదములో ప్రణవముగను, ఆకాశమందు శబ్దముగను, మానవులయందు శక్తి, పౌరుషముగానూ ఉన్నాను” అని తెలిపెను. ఇక్కడ ప్రణవ విషయము విచారింతము. వేదములకు ప్రణవము జీవమని అన్నాడు కదా! వేదములు అనాదివని ప్రసిద్ధి. అనాది అయిన వేదములకు ప్రణవము ప్రాణమన్న, ఇక సృష్టికి ఆ పవిత్ర ప్రణవమెంత ప్రధానమో, బుద్ధిమంతులు బాగా యోచించవచ్చును. ప్రతివస్తువు యొక్క సూక్ష్మ స్వరూపమూ ప్రణవమనే భావించవలెను.
ప్రపంచమందలి సర్వ పదార్థములూ రెండు భాగములుగా నున్నవి. అవియే రూప నామములు. ఈ రూప నామములను తీసివేసిన ప్రపంచమే లేదు. రూపమును స్వాధీనము చేసుకొన్నది నామము; నామమును ఆశ్రయించి యున్నది రూపము, ఇందులో ఏది నిత్యము? అని యోచించిన నామము నిత్యము, రూపము అనిత్యము. లోమున ఎన్నియో సత్కార్యములను చేసి కొన్ని ఘనకార్యములను సాధించి యుండవచ్చును. కొన్ని వైద్యశాలలో, విద్యాసౌకర్యములో, భగవత్సన్నిధానాలలో, అనేక ప్రజా ప్రధాన సదుపాయములు చేసియుండవచ్చును. కానీ, వారు నేడు స్వరూపకముగా లోకములో లేనప్పటికిని వారు చేసి సాధించిన కార్యములు, కర్తలు లోకమున నేటికిని నిలిచియున్నవి కదా! రూపము కొంతకాలముండి పోయిననూ, నామము మరికొంత ఎక్కువ కాలము నిలిచియుండును. నామములు అసంఖ్యాకములయినప్పుడు స్వరూపములూ అసంఖ్యాకములయి ఉండును. అయితే యుచ్చట మనకు నిత్యానుభవము నందు పండితుని మొదలు పామరుని వరకూ సులభముగా అర్థమయ్యే అక్షరములను విచారింతము. తెలుగునందు చూచిన యెడల యాభైరెండు అక్షరములు, ఆంగ్లమునందు చూచిన ఇరవదియారు అక్షరములు. లోకంలో గొప్ప గొప్ప సాహిత్యములన్నింటిని కొండలు కొండలుగా కుప్పలు వేసిననూ, ఈ తెలుగు నందు గల యాభైరెండు అక్షరములే తప్ప మరేవీ ఎక్కువ ఉండవు. ఆంగ్లమున చూచిన ఇరవది ఆరు అక్షరములే తప్ప కొత్తవేవీ అందులో లేవు, రావు. అటులనే, మానవుని దేహమందు కూడనూ, ప్రాముఖ్యమైన ఆరు నాడీ కేంద్రములున్నవి. అది కమలాకారమును చెంది యుండును. ఆ ఆరు కమలాకారములు చేరి మొత్తము యాభైరెండు రేఖలుండును. ఒక్కొక్క రేఖపై కూడ ఒక్కొక్క అక్షరము ఏర్పడియుండును. హార్మోనియంలో ఉండే “రీడ్స్” వలె ఒక్కొక్క రేఖయు కదలు సమయమున ఒక్కొక్క విధమైన శబ్దము బహిర్గతమగుచుండును. ఇచ్చట బుద్ధిమంతులకు ఒక సందేహము కలుగవచ్చును. ఈ రేఖలందలి అక్షరములు కదలలేనన్న, ఏదో ఒక కదిలించు శక్తి ఆధారమై యుండవలెను కదా! అది నిజమే. ఆ కదిలించు శక్తియే ప్రణవము. ఇది అనాహతమైన ధ్వని. ఇది అప్రయత్నమున కలుగును. ప్రయత్నములతో కలిగే ధ్వనిని ఆహత ధ్వని అని అందురు.
దారములో పూసలు గ్రుచ్చబడినట్లు అనాహత ధ్వనియైన ప్రణవములో వేదములను పూసలు గ్రుచ్చబడినవి. రసస్వరూపమైన తనలో జలము చేర్చబడినది. ఇట్టి సర్వాధారమైన ప్రణవములోనే మనస్సును లీనము చేయవలెననే కృష్ణపరమాత్మ యొక్క బోధ. శబ్దములో మనస్సును లయము చేసే స్వభావము కలదు. మనస్సు ఏది చూచితే అది అంతా కావాలని కోరును. ప్రతి దానిని ఆశించడమే దానికి పని. అట్టి చంచల మనస్సునే శబ్దమున లయము చేయవచ్చును. అందువలననే మనస్సును సర్వమునకు పోల్చాలి.
పాముకు రెండు పిచ్చి గుణములు కలవు. ఒకటి వంకర టింకరి నడక, రెండవది చూచినదానినంతా, అడ్డము వచ్చిన వాటినన్నింటిని కరచుట. ఈ రెండునూ మానవునిలో అక్షరాల ప్రత్యక్షమగుచున్నవి. చక్కని నడకలేదు, చూచినవన్నింటిని పట్టుకొనుటకు ప్రయత్నించును.
అయితే పాములో ఒక పవిత్రమైన స్వభావమున్నది. అది ఏదనిన నాగస్వరము పట్టిన ఎట్టి విషసర్పమైనా ఆనందముగా అందులో పడగవిప్పి ఆడుతూ, తన సర్వస్వమునూ ఆ స్వరమున లీనము చేయును. అటులనే మానవుడును అభ్యాసము ద్వారా ప్రణవములో మనస్సును లీనము చేయవచ్చును. కనుక శబ్దోపాసన పరమాత్ముని పాండుటకు ప్రధాన మార్గమై యున్నది. శబ్దమే పరమాత్మ. అందుకనే మానవునియందలి పురుషార్థ శక్తిని నేనే అని పరమాత్ముడు తెలిపెను. పురుషాకారమే మానవుని ప్రాణము. అట్టి పురుషాకారమునకు ప్రాణమే లేకున్న మానవత్వమే లేదు. ఎట్టి ప్రాణబలమునకూ పురుషాకారమునకు అణిగి మణిగి ఉండవలసినదే. ప్రాణబలమున కంటే పురుషాకారము ముందుగలదు. ఇది తెలియక ప్రాణబలము ప్రాణబలమని ప్రాణబలమును బట్టి ప్రాకులాడుదురు వెట్టి మానవులు! ప్రతి మానవుడూ పురుషాకారమును అనుసరించియే తీరవలెను. చేయకుండిన అట్టివాడు లోకమున అర నిమిషము కూడనూ నివసించలేడు. ఈ లోకమున పురుషార్థమును అనుసరించి దాని శక్తిలో ధన్యుడవు కమ్మనే మానవుని పరమాత్మ సృజించెను. కాని, ఊరికే తిండికి చేరు, భూమికి బరువుగా సార్థకము కాని పనులతో పశువాంఛలతో భోగములు అనుభవింపమని పంపలేడు. నడుమవంచి పనిపాటలు చేయక, సోమరియై కండలు పెంచుకొని, లొట్టలు కొడుతూ, దిట్టంగా బలమని పంపలేడు.
పరమాత్ముని మరిచి ఆత్మవిశ్వాసమును కోల్పోయి పశువువలె జ్ఞానహీనుడయి అనుభవించునంత వరకూ ఆ ఫలితమును స్మరించి తదుపరి దానికి కృతజ్ఞతే లేక క్రూరుడయి తిరుగుమని సృజించలేడు. ప్రకృతి అంతయూ పరమాత్మ రూపముగా భావించి, విశ్వసించి, చక్కగా వినియోగించుకొమ్మని కూడా తెలిపెను. కాని ఇది నాది, అది నాది, నావారిది అని అహంకారములతో ప్రకృతిని వినియోగించుకొంటూ ప్రకృతియొక్క చట్టమును ఉల్లంఘించి తన ఇచ్చానుసారము ప్రవర్తించు వారికి ప్రకృతే తగిన ప్రాయశ్చిత్తము చేయును. పతనానికి దారితీయును. అందుకనే కృష్ణపరమాత్మ తనను ఉపాసించు విషయమును విపులముగా అర్జునునకు తెలుపుచున్నాడు.
బావా! అనేకమంది నన్ను ఉపాసించుటకు కారడవులకు పోవుచుందురు; అది ఒక విధమైన వెర్రితనము, మూఢనమ్మకము. ఉపాసించవలెనన్న ఎక్కడికో, ఏ అడవులకో పోనవసరంలేదు. నేను లేని స్థానముకాని, నాది కాని రూపము కాని, లేదు. పంచభూతములూ నేనే. ఏ భూతము లేనిచోటు ఎచ్చట ఉన్నది? అంతటా నిండియున్న నన్ను అనుభవించుటకు ప్రత్యేకించి ఒక స్థానమునది లేదు. విను! భూమిలోని గంధము నేను, అగ్నియందలి తేజస్సు నా స్వరూపం. సర్వ భూతములలోని జీవిని నేనే అయి ఉన్నాను. ఇంతయేకాక బలవంతులలోని కామ రాగ రహితమైన బలమును నేనే ఉన్నాను. సర్వభూతముల లోని ధర్మమునకు విరుద్ధము కాని కామము నాస్వరూపముగా నున్నది (ఇచ్చట బలమునగా బుద్ధి బలమని తలంచవలెను). లోకమున అనేక విధములైన బలములున్నవి; ధనబలము, బుద్ధిబలము, విద్యాబలము, జనబలము, మనోబలము, దేహబలము అని కలవు. ఇవన్నియూ పరమేశ్వరుడైన నా బలమనే భావించవలెను. కాని అది కామ రాగ రహితమై ఉండవలెను. అట్టివి మాత్రమే భగవత్ స్వరూపములనబడును. అట్టు కాక కామరాగ సహితమైన బలములు పశుబలములనవచ్చును. కాని పశుపతి బలము కానేరదు. కామమునగా లభించే అవకాశము, దాని చిహ్నములు కనిపించకున్ననూ, లేకపోయిననూ వస్తువుల కొరకే ఆశను కామమందురు.
ప్రాప్తించిన వస్తువు స్థిరమైనది కాకుండా నశించిపోయేదయినప్పటికిని అది స్థిరముగా తనకే ఉండవలెనను పట్టుదలనే రాగము అని అందురు. రంజననే రాగమందురు. ఇట్టి కామ రాగములను రెండింటితోను దూషితమైన బలము భగవత్ బలము కాదు. అయితే కొన్ని కొన్ని స్థానబలమును బట్టి, విశేషబలమును బట్టి యోగ్యతా అయోగ్యతలను పొందును. ఉదాహరణమునకు ఒక్కటి చూతము; ధనమున్నది, అది దుష్పనిచేరి మదకారణమౌతుంది. సజ్జనులను చేరి దానధర్మములకు సత్కర్మలకు ఉపయోగమౌతుంది. అటులనే బలము దుర్మార్గుల చేత చేరి పరపీడనకు ప్రాకుతుంది. సజ్జనుల చేత చేరి పరరక్షణకు ప్రయోగింపబడుతుంది.
ఇచ్చట మరొకటి గమనించవలెను. ధర్మవిరుద్ధ కామ, క్రోధ, లోభములు కూడనూ భగవత్ స్వరూపములని కృష్ణపరమాత్మ అన్నాడు. కాని, వేయేటికి? “సర్వభావములా, సర్వరూపములా, సర్వ వస్తువులా నా అపరా పరాశక్తి వల్ల సంభవించినవే” అని అన్నాడు. కాని, ఉపాసనకు ఉత్తమ భావన లభించుటకోసం మొట్టమొదటిది, ఉత్తమభావం, ఉత్తమరూపం, ఉత్తమభూతంలో నా స్వరూపమని తెలిపెను. ఇంత మాత్రమునకే మంచిది మాత్రము భగవత్ స్వరూప లక్షణములనియూ తక్కినవన్నియూ కాదనియూ తలంచుట తత్త్వజ్ఞానము కాదు. త్రిగుణములయిన రాజసిక, తామసిక, సాత్త్విక వస్తువులు, భూతములా, భావములా భగవంతునియందే ఉద్భవించినవని స్ఫురము చేసుకొనుటకు విచారణ, ప్రయత్నమూ జరుపవలెను. ఇట్లు ఆ భగవంతుడే స్వయముగా తెలిపెను.
“అర్జునా! అన్నియూ నా యందే పుట్టి, నాయందే ఉండును. కాని నేను మాత్రము వాటి అధీనమందుండక వాటితో ఏ సంబంధము లేనివానివలె యుండును” ఇచ్చట రెండు దృష్టులు కలవు. ఒకటి జీవదృష్టి. రెండవది భగవత్ దృష్టి. జీవదృష్టిలో చూచినప్పుడు మంచిచెడ్డలను ద్వంద్వాలు కలవు. భగవత్ దృష్టిలో చూచినప్పుడు ద్వంద్వములు లేక సర్వమూ భగవంతుడే, మరేమీ లేనిది సర్వ భూతాంతరాత్మ తత్త్వమును బోధించెను.
ఈ విషయమున సామాన్య మానవులకు కొంత సందేహమునకు స్థానము కలుగవచ్చును. సమస్త మంచి చెడ్డలకు తానే కారణమనియూ, సర్వమూ తననుండే పుట్టినవనియూ, అట్లుండియూ వాటి దోషములు తన నే మాత్రము బంధించుటకాని, బాధించుట కాని చేయవనియూ, వాటితో తనకేమీ సంబంధము లేదనియూ, అన్నింటికిని అతీతమై యున్నాననియూ తెలుపుటలో మానవుడు చేయు మంచి చెడ్డలకు మానవుడు ఏ మాత్రమూ కర్తకాని, కారణము కాని కాదనియూ, ఎట్టి మంచి చెడ్డలయిననూ భగవంతుని ప్రేరణవలననే ననియూ, మానవుడు ఎట్టి పాప పుణ్యములకు బాధ్యుడు కాదనియూ తలంచ వచ్చును. నిజమే. అయితే, ఇట్టి విశ్వాసము నిశ్చలమైన, నిర్లిప్తమైన, నిస్వార్థమైన ప్రేమ పరమాత్మునిపై కలిగి యుండిన ఇంతకంటే ధన్యము, పుణ్యము మరేమున్నది? తెలిసికొనవలసినది స్ఫురము చేసుకొనవలసినది ఇదే. “సర్వమూ భగవంతుడే” నాకే మాత్రమూ ఈ లోకముతో కాని, భావములతో కాని సంబంధములేదని, నేను “వీటన్నింటికీ అతీతమైనవాడ” నని ఏ మానవుడు తెలిసికొనునో వాడే సత్యజీవి. అయితే మాటల్లో మాత్రము “సర్వమూ భగవంతుడే, నేనతని చేతిలో కీలుబొమ్మ. అతని అధీనంలో ఉన్నవాడను, నాదేమీ లేదు” ని చిలుక పలుకులు పలుకుచూ, మంచిదానిని మాత్రము “నేను చేసిన” దనియూ, చెడ్డ మాత్రము భగవత్ ప్రేరణ అనియూ, కీర్తిమర్యాదలు గౌరవప్రతిష్ఠలు వచ్చు పనులు, ఉపదేశములు నా సాధనా శక్తి నా కల్పితము అని సభలో గొంతు చించుకొని అరచుట, తప్పులో, అపకీర్తిలో, అగౌరవములో జరిగిన అవన్నియూ, నావి కాదు, నేను నిమిత్త మాత్రమైనవాడను సర్వమూ భగవంతుడు చేయించుచున్నాడనుట” నేటి మానవులకు పరిపాటైనది. అది ఒక నూతన “ఫ్యాషన్” కూడా! ఇట్టి గడియారం “పెండ్యులం” వంటి మాటలు, ఆటలు, సత్యములు కాలేవు. మనోవాక్కాయ కర్మలందు కూడ సర్వమూ భగవంతుని లీలావిభూతియే అన్న దృఢవిశ్వాసమును కలిగియుండుట చక్కటి తత్త్వము. మంచి చెడ్డలు మానవుని దృష్టి దోషములే; వీటిని భగవంతుని యందు నిరూపించుట ధర్మవిరుద్ధము.
అట్టి లోపములు భగవంతుని కూడనూ ఆవరించినట్లు అప్పుడప్పుడు తెలియుచుండును, అనిపించును. కాని, అవి సత్యములు కావు. మేఘములు ఆకాశమునందే పుట్టినవి. అందే సంచరించుచున్నవి. అయితే ఆకాశము మేఘములను ఆశ్రయించి ఉన్నదా? లేదు. పొగనిప్పునందే పుట్టినది కాని నిప్పు పొగ నాశ్రయించి యుండలేదు. అటులనే గుణములు పరమాత్మ యందే పుట్టిననూ పరమాత్ముడు గుణముల నాశ్రయించి యుండలేదు. పైజెప్పినట్లు పూసలు, పూవులు దారము నాశ్రయించియుండినట్లు సర్వమూ తనలో తననే ఆశ్రయించి యుండును. తాను భూతములను కాని, వస్తువులను కాని, గుణములను కాని ఆశ్రయించి యుండలేడు. ప్రపంచమంతయూ పరమాత్మలోనే ఉన్నది. కాని పరమాత్మ ప్రపంచమును ఆధారముగా తీసుకొనలేడు. ఎట్లన ఇప్పుడొక వస్త్రము ఉన్నదనుకొనుడు; వస్త్రము దారము నాశ్రయించి యున్నది కాని దారము వస్త్రము నాశ్రయించి లేదు. మట్టి నాశ్రయించి కుండ ఉన్నది కాని కుండ నాశ్రయించి మట్టి లేదు. మట్టి వేరు, కుండ వేరు కాదు. దారము వేరు, వస్త్రము వేరు కాదు. మట్టి బ్రహ్మము, కుండ ప్రకృతి. దారము బ్రహ్మము, వస్త్రము ప్రకృతి. ఆకారము వికారములు ఎన్నిమారినా మట్టి మట్టిగానే యుండును. దారము దారముగానే ఉండును. మట్టి లేక కుండ కాలేదు. దారము లేక వస్త్రము కాలేదు. అటులనే బ్రహ్మము లేక ప్రకృతి కాలేదు. బ్రహ్మమును దారమును ఆధారము చేసుకొని వస్త్రమును ప్రకృతిగా తయారైనది. దీనివలన అన్నింటియందు సర్వత్రా పరమాత్మున్నాడనుటలో ఎంతో ఆనందమున్నది. అన్ని పూసలయందు దారమున్నదనుట కంటే పూసలన్నియూ దారమందే ఉన్నాయనుట యెంతటి సత్యము! ఎంతటి తత్త్వము! కాని సర్వభూతాంతర వర్తియని పరమాత్ముని పిలుచుటకంటే సర్వాధారము అని పిలుచుట సార్థకము, సత్యము.
1Bhagavān Śrī Kṛṣṇa continued: “This is also called Aparā Prakṛti, and it is only the manifestation of My power. Bāvā! To gross vision the world seems to contain countless separate things, but in truth its essence is One. When the vṛtti of the antaḥkaraṇa—what we call our vision—is made luminous with Jñāna, the whole universe is seen as Brahmamaya, pervaded by Brahman. But that inner vision must itself become Jñānamaya. Jagadīśvara alone fills the universe: ‘Īśāvāsyam idaṁ sarvam—all this is indwelt by the Lord.’” 2Though Reality is one, it appears as many. Consider a familiar example. At dusk, in dim light, a rope lies coiled across a path. It is truly only a rope, yet different travellers mistake it for different things: one thinks it is a staff and steps across; another imagines a stream and treads through; another sees a creeper; another fears it may be a snake and stands at a distance trembling. The object has not changed; only the vision has. 3So too Parabrahman, without any change in Its own Svarūpa, appears through Māyā as this world of countless names and forms. However many ways we imagine or misperceive it, just as the rope never becomes anything other than rope, Bhagavān never becomes other than Brahman. Paramātma is the support of all. Without that support the world cannot stand. As thread supports a garland, and a hidden foundation supports a many-storeyed building, Paramātma supports all jīvas and the whole mansion of Prakṛti. The flowers and the building are visible first; the thread and the buried foundation are not. Their invisibility does not mean they are absent. Without the thread there is no garland; without the foundation no building can stand. 4To recognise that unseen support requires vicāra. Without enquiry it remains hidden. By examining the garland one discovers the thread; by digging beneath the building one finds the foundation. If we stop with the visible ādhēya—the thing supported—and never turn Buddhi toward its unseen ādhāra, we do not know Satya. Therefore enquire into the unseen support of what is seen. For one who brings this into experience, lengthy explanations are unnecessary. Nor is the differing fitness of the “flowers,” the individual jīvas, the central concern. The thread that supports them all is Brahman. Flowers may differ in quality, and beings may express Tāmasic, Rājasic, or Sāttvic tendencies, but Paramātma remains beyond these, Satya, Nitya, and untouched. Without thread the flowers cannot become a garland; without Brahman the jīvas cannot be truly separated into independent realities. 5Though present in every object and throughout the five elements, He remains unseen, the Antaryāmin dwelling within all. Therefore Kṛṣṇa says: “In water I am rasa, the essence and taste; in sun and moon I am light; in the Vedas I am Praṇava; in space I am sound; in human beings I am strength and Pauruṣa.” Let us consider Praṇava. If Praṇava is the very life of the beginningless Vedas, how fundamental must that sacred Praṇava be to creation itself? Understand Praṇava as the subtle essence of every thing. 6Everything in the world is apprehended through two aspects: nāma and rūpa, name and form. Remove name and form and the world as we ordinarily know it disappears. Which is more enduring? The text points to nāma as outlasting form. A person may perform noble works—establishing hospitals, education, service, or sacred institutions—and even after the bodily form is gone, the name and deeds may remain in human memory. Forms pass sooner; names may endure longer. Yet innumerable names are built from a limited set of sounds and letters. Telugu literature, however vast, is formed from its finite alphabet; English likewise from its finite letters. The text then relates this to six principal subtle centres in the human body, pictured as lotuses whose petals together bear the seed-sounds. As reeds of a harmonium sound when moved, the subtle centres are said to give rise to distinct sounds. What is the power that sets them in motion? That moving power is Praṇava—the anāhata-dhvani, the unstruck sound, arising without external impact. Sound produced by deliberate striking is āhata-dhvani. 7As beads are strung upon a thread, so the Vedas are strung upon Praṇava, the anāhata sound. Kṛṣṇa teaches that Manas should be dissolved into this all-supporting Praṇava. Sound has a power to gather and absorb the mind. The mind runs after whatever it sees, longing for one object after another; this restless Manas can be led toward laya through sacred sound. Therefore the mind must be trained to take the Divine as its measure and support. 8A snake is described as having two troublesome habits: it moves crookedly and it strikes whatever comes in its path. The human mind displays something similar—it rarely moves straight, and it tries to seize whatever it encounters. 9Yet the snake also shows a striking responsiveness to sound. When the nāgasvara is played, even a venomous serpent is pictured as spreading its hood and becoming absorbed in the melody. In the same way, through abhyāsa, the human mind can become absorbed in Praṇava. Śabdopāsanā, worship through sacred sound, is therefore a powerful path toward Paramātma. Śabda itself is a manifestation of Paramātma. Bhagavān also says that the power of true Pauruṣa in the human being is Himself. Human life requires purposeful effort. One was not sent into the world merely to eat, burden the earth, indulge animal desires, avoid useful labour, and call bodily bulk “strength.” Human birth is meant to be made fruitful through right Puruṣārtha. 10Paramātma did not create the human being to forget Him, lose Ātma-viśvāsa, live without Jñāna, consume the fruits of Prakṛti without gratitude, and roam in cruelty. He teaches us instead to recognise all Prakṛti as His form, to trust this truth, and to use nature rightly. When people say “this is mine, that is mine, these are mine,” exploit Prakṛti through Ahaṅkāra, violate its laws, and act only by personal whim, Prakṛti itself brings the corrective consequence and leads such conduct toward downfall. Therefore Kṛṣṇa explains to Arjuna how He is to be worshipped. 11“Bāvā! Many go into deep forests thinking they must find a special place in order to worship Me. This is a kind of delusion. To worship Me you need not go to any particular forest or distant place. There is no place where I am not, no form that is utterly outside Me. The five elements are Myself; where is a place without them? To experience Me who fills all, no special location is indispensable. Listen: I am fragrance in the earth, brilliance in fire, the life in all beings. In the strong I am strength free from kāma and rāga; in all beings I am desire that does not oppose Dharma. Understand ‘strength’ here especially as the strength of Buddhi. There are many forms of strength—wealth, intelligence, learning, numbers, mental power, bodily power. See them all as deriving from Me, Parameśvara, but when strength is free of selfish kāma and rāga it reveals the Divine. Strength polluted by craving and attachment becomes paśu-bala, animal force, not the power of Paśupati.” 12Kāma is the desire for an object even before the means or opportunity to possess it appears. Rāga is the insistence that an object already obtained—though by nature impermanent—must remain permanently one’s own. Strength polluted by these two is not Bhagavad-bala. Yet the same power takes its moral quality from the place and purpose to which it is joined. Wealth in the hands of the selfish may become intoxication; in the hands of the good it supports dāna, Dharma, and noble action. Power in the hands of the cruel becomes oppression; in the hands of the good it becomes protection. 13One more point must be understood. Kṛṣṇa also says that all Rājasic, Tāmasic, and Sāttvic things, states, and tendencies arise through His Aparā and Parā Śakti. At the beginning of Upāsanā, however, He directs the mind toward the noblest bhāva, form, and being as an accessible manifestation of Himself. From this one must not conclude that only what we call “good” belongs to Bhagavān while everything else lies outside Him. True Tattva-jñāna recognises that all three guṇas and the whole field of manifested nature arise within the Divine power, while also discerning how each should be related to in spiritual life. 14“Arjuna! Everything arises in Me and abides in Me; yet I am not subject to any of it, nor bound by relation to it.” Here there are two standpoints: jīva-dṛṣṭi and Bhagavad-dṛṣṭi. From jīva-dṛṣṭi, good and bad and the pairs of opposites appear. From Bhagavad-dṛṣṭi, duality falls away and everything is seen in the one Bhagavān, the Sarva-bhūtāntarātma dwelling within all beings. 15A doubt may arise: if all good and bad arise from Him, and yet their defects neither bind nor touch Him, does that mean human beings are not responsible for their own good or bad actions, since all impulses ultimately arise within the Divine order? The text’s answer lies in the depth and steadiness of one’s realisation. If one truly possesses unwavering, selfless Prema for Paramātma and knows with lived conviction, “Everything is Bhagavān; I have no separate claim over this world or these movements; I am beyond them,” that is a blessed state. But merely parroting “God does everything; I am only a puppet” while claiming every successful act as “my achievement” and blaming failures, wrongs, and disgrace upon “God’s prompting” is hypocrisy. Such pendulum-like talk is not Satya. The true vision is an unbroken conviction, in mind, speech, and action, that all is Bhagavān’s Līlā-vibhūti, while taking responsibility for purifying one’s own vision. Good and bad as we perceive them belong to the conditioned human standpoint; it is against Dharma to use God as an excuse for our defects. 16At times those defects may seem to cover Bhagavān Himself, but they do not truly touch Him. Clouds arise in the sky and move within it, yet the sky does not depend upon the clouds. Smoke arises from fire, yet fire is not supported by smoke. Likewise guṇas arise within the power of Paramātma, but Paramātma is not dependent upon them. All beings, objects, and qualities rest in Him; He does not rest upon them. A cloth depends upon thread, but thread does not depend upon the finished cloth. A pot depends upon clay, but clay does not depend upon the pot. Clay and pot are not two independent substances; thread and cloth are not two independent realities. Clay is compared to Brahman and pot to Prakṛti; thread to Brahman and cloth to Prakṛti. However forms change, clay remains clay and thread remains thread. Without Brahman there is no Prakṛti. It is therefore deeply meaningful not merely to say that Paramātma dwells “inside” all things, but that all things themselves rest in Paramātma, the Sarvādhāra, the support of all.