Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1961 · The Ānanda of Yoga and the Ānanda of Pleasure
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Ānanda of Yoga and the Ānanda of Pleasure
27 February 1961, Public meeting, Udumalpet
1
▾
Meaning
Keep
యోగానందమే
శాశ్వతము.
భోగానందము
క్షణికము,
క్షుద్రము.
ఇది
అందరికీ
తెలిసిన
విషయమైననూ,
యోగానందమున
నున్న
మహత్వమును
గురించి
పొగడేదేగాని
ప్రవర్తనలో
యేమాత్రమూ
మార్పు
రావటములేదు.
ఇది
ఒక
ఆశ్చర్యకరమైన
సంగతి.
తన
లక్ష్యమేమి,
తన
జీవితముయొక్క
నిజార్థమేమి
అని
తెలుసుకొనవలెను.
ఐన,
ఇప్పటికి
అర్థము
తెలియదు.
అనుభవానికి
రాదు.
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలను
క్రియారూపములో
ఆచరించాలి.
ఆకులో
వుండే
పదార్థములన్నీ
భుజించక
ఆకలి
తీరుతుందా?
సత్ప్రవర్తనలో
ఎప్పుడూ
అలసట
రాకూడదు.
ప్రేమలో
మూడువిధములున్నవి.
స్వార్థప్రేమ
అనగా
ఒకే
రూమును
మాత్రము
వెలిగించే
బల్బువంటిది.
అన్యోన్య
ప్రేమ
అథవా
సమంజస
ప్రేమ,
అనగా
వెన్నెల
వంటిది.
లోపల
బయట
రెండునూ
వెలిగిస్తుంది.
అయితే
ప్రకాశము
తక్కువ.
వస్తువులు
బాగా
కనబడవు.
చీకటి
సంపూర్ణముగా
నాశము
కాదు.
పరార్థప్రేమ
అనగా
సూర్యుని
ప్రకాశము
వంటిది.
అన్ని
ప్రదేశములను
బాగా
ప్రకాశింపచేస్తుంది.
అట్లనే
భూతదయ,
పశ్చాత్తాపము,
పాపభీతి,
దైవభీతి
అనే
వాక్కులతో
ఏమి
ప్రయోజనము?
సత్ప్రవర్తనలే
భక్తి,
దేహబలము,
బుద్ధిబలము,
వివేకబలము.
వీటన్నింటికన్న
అనుభవబలమే
ముఖ్యము.
భక్తి
బాహ్యము
కాదు.
భావము.
దానికి
భాష
లేదు.
మౌనమే
దాని
లక్షణము.
దేవుని
చూడాలంటే
భక్తినేత్రము,
జ్ఞాననేత్రము
కావలయును.
భక్తులే
పరమాత్మునికి
అతిప్రియులు.
వారికి
పీడ,
హింస,
బాధలు
ఎక్కువ
జరిగితే
పరమాత్ముడు
సహించడు.
అప్పుడే
సాధుపోషణార్థము
మానవరూపముతో
రావటము.
పరమాత్ముని
దృష్టిలో
నాస్తికుడు
లేడు.
దేవుడు
లేడు
అనేది
నాస్తికము
కాదు.
నాస్తికుడు
అని
లోకము
దూషించేవాడికి
తనపైన
ఆయనకు
ప్రీతిలేదా?
నమ్మకములేదా?
విశ్వాసములేదా?
ఆ
ప్రీతియే
భగవత్స్వరూపము.
ఆ
విశ్వాసమే
ఆస్తికము.
ఆ
విశ్వాసాన్ని
చల్లగింపచేయకూడదు.
హృదయపీఠములో
ప్రతిష్ఠితుడైన
దేవుడు
వెంటనే,
కంటనే,
జంటనే
వుండే
దేవుడు.
లేదంటే
పోతాడా?
మీలో
మీరు
యదార్థమును
చూచుకొని
నీతి,
నియమము,
ధర్మము,
ఆచారము
వీటితో
మీ
మనస్సును
అణగద్రొక్కి
అహంకారమును,
వాసనలను
నాశనము
చేసుకోండి.
క్రమశిక్షణముతో
మనసును
దిద్దితే
అది
మంచి
కర్మలనే
చేస్తుంది.
మంచి
భావాలతోనే
విహరిస్తుంది.
గట్టి
ఇనుముకూడా
అగ్ని
సంస్కారముచేత
మెత్తనైపోతుందికదా!
అట్లే,
రాయివంటి
హృదయముకూడా
సాధనవల్ల
కరగి,
కరుణ
రసము
నిండి
మృదువైపోతాయి.
గుణమే
గొప్పతనము
కాదు.
ధనము
కాదు.
కీర్తిప్రతిష్టలు
కావు.
దానిని
అభివృద్ధిచేయండి.
మధురముగా,
హితముగా,
మితముగా
సంభాషించండి.
నిత్యకృత్య
కర్మలందు,
కర్తవ్యములందుకూడా
నొప్పింపక,
తానొవ్వక
నడచుకొనేదే
మంచిది.
చెప్పుట
ఒకటి,
చేయునది
మరొకటి
వుండకూడదు.
అది
పిరికితనము.
హృదయభూమినుంచి
ద్వేషాసూయలను,
క్రోధమును
తీసి,
చక్కచేసి
అక్కడ
భక్తిమొక్కలనాటి,
సాధన
అనే
నీరు
పోసి,
ప్రవర్తన
అనే
ఎరువు
వేస్తే
ఆనందమనే
పంటను
పొందవచ్చును.
పాపభయముతో
ఈ
దేశమున
జనమంతా
కర్మలను
చేస్తారు.
కాబట్టి,
దీనికి
భారత
అనే
పేరు
వచ్చింది.
సనాతనధర్మానికి
ఇదియే
పుట్టినిల్లు.
సర్వదేశాలకు
ఇదియే
గుండెవంటిది.
ఇదియే
ఆత్మ.
ఆ
సనాతనధర్మాన్ని
ఇప్పుడు
మీరందరూ
మరీ
తెలుసుకొని
ఆచరించాలి.
ఆత్మశాంతికి
అదియే
ఉత్తమమైన
మార్గము.
యోగానందమును
ఇచ్చేది
అది.
దానిని
మరచి,
ఆ
ఆనందాన్ని
పొందక,
లోకశాంతికి
పాటుపడేది
వ్యర్థప్రయత్నము.
ఇంట్లో
తినటానికి
ఏమీ
లేనివారు
ఊరువాళ్ళకంతా
మృష్టాన్నభోజనం
పెడతారా!
అది
సాధ్యముకాని
కార్యమే.
Previous
←
Sai As Inner Resident
Next
The Real Almanac
→