Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1961 · Be Grateful To The Doctors
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Be Grateful To The Doctors
27 July 1961, Guru Pūrṇimā, Mysore
1
▾
Meaning
Keep
ఇరువది
సంవత్సరములనుండి
అప్పుడప్పుడు
మైసూరు
నగరమునకు
నేను
వస్తూపోతూ
వుండినకూడ,
ఆ
నగరవాసుల
సభలో
వారితో
సంభాషించటము
యిదియే
మొదటిసారి.
అన్నిటికి
కాల
కర్మ
కర్తవ్య
కారణాలు
చేరిరావాలి.
ఈ
దినము
గురుపౌర్ణిమ.
ఇక్కడ
భక్తులు
నన్ను
రమ్మని
కోరటము,
ఈ
సభను
ఏర్పాటుచేయటము,
ఇవి
మూడూ
జరిగినవి.
కాబట్టి,
ఈ
అవకాశము
దొరికినది.
మైసూరు
అనే
పేరు
సంగీతమునకు,
శిల్పమునకు
ప్రఖ్యాతియైనది.
సరే.
అయిన,
ఆ
సౌందర్యము,
ఆ
ఇంపు
ప్రతి
ఒక్క
మాటలో,
నడతలో
మీరు
చూపాలి.
మైసూరు
పరిమళమునకు
శ్రీగంధమునకుకూడా
పేరుపొందినదే.
కాబట్టి,
ఆ
సువాసన
ఆధ్యాత్మిక
సువాసనగా
మీలో
కనబడాలి.
అయిన
అహంకార,
అంధకార,
అన్యాయ,
అక్రమములు
పెరిగి,
గంధము,
ఆ
రాగము,
ఆ
పరిమళము
తగ్గిపోయినవి.
దీనికి
మానవ
దౌర్బల్యమే
కారణము.
సత్య,
ప్రేమలు
అభివృద్ధి
రావటానికి
ముఖ్యముగా
మనోబలము,
బుద్ధిబలము,
ఆధ్యాత్మిక
బలము
వీటిని
పెంచవలయును.
పాశవీమానవుడు,
సహజమానవుడు,
దివ్యమానవుడు
అని
మూడు
తెగలున్నవి.
వారివారిలో
ఉన్న
తమోగుణము,
రజోగుణము,
సత్వగుణములను
అనుసరించి
ఈ
తెగలు
నిర్ణయమౌతున్నాయి.
ఖనిజము,
క్రిమికీటకములు,
వృక్షలతాదులు,
పశుపక్షులు
ఇట్లే
క్రమక్రమముగా
పరిణామము
పొంది
మానవులనే
అభివృద్ధి
స్థితికి
వచ్చినది.
అయిన
చాలామంది
మానవాకారమును
సంపాదించికూడా
ఇంకనూ
పశుస్వభావముతోనే
వున్నాడు.
ఈ
లోకము
పెద్ద
ఆసుపత్రి.
కొంతమందికి
అసూయ
అనే
జబ్బు,
కొంతమందికి
అహంకారమనే
జబ్బు.
అజ్ఞానము,
క్రోధము,
ద్వేషము,
కామము
ఇవన్నియూ
జబ్బులే.
ఈ
జబ్బులతో
బాధపడుచున్నారు.
జబ్బుకు
తగిన
మందు
యిచ్చేవారే
గురువులు.
ఎప్పుడు,
ఎక్కడ
జబ్బులు
ప్రబలముగా
వున్నవో,
అప్పుడే
అక్కడనే
డాక్టర్లు
వచ్చి
పనిచేయాలి.
అట్లు
గురువులను
కృతజ్ఞతతో
స్మరించి
ఆదరించే
దినమే
ఈ
గురుపౌర్ణిమ.
వ్యాసుడే
అందరికీ
పెద్దగురువు.
వారే
భారత
భాగవత
పురాణములను
వ్రాసి
భక్తి
విత్తనాలను
వేసినారు.
వేదములను
సేకరించి
నిలబెట్టిన
వారు.
అయిన,
గురువులే
జబ్బుతో
బాధపడే
కాలమిది.
గురువులు,
పెద్దలు
అనే
పేరుప్రతిష్టలతో
తిరిగే
వాళ్ళకే
ద్వేషము,
అసూయ,
అహంకారము,
దురాశ
అనే
జబ్బులు
ఎక్కువ
వచ్చినాయి.
డాక్టర్లే
కొట్లాడితే
రోగుల
గతి
ఏమి?
ఫీజు
పెరికేదే
డాక్టర్ల
ఉద్దేశ్యము.
జబ్బు
బాగుచేసేది
లేదు
అనే
స్థితి
వస్తే
ఆసుపత్రి
గతి
యేమి?
ఇట్టి
గురువులను
ఇప్పుడే
ఖండించి
దిద్దవలయును.
వారు
చెప్పే
మాటలను
ఒక
తట్టు
పెట్టి,
వారి
నడతను
పరిశీలించి,
శిష్యులే
వారిని
సరిచేయవలయును.
చెప్పేది
ఒకటి,
చేసేది
ఒకటి,
ఇదే
ఈ
గురువులకు
వచ్చిన
పెద్ద
రోగము.
తలబోడి
ప్రయోజనమేమి!
తలంపు
బోడిచెయ్యాలి.
దానికే
నేను
చెప్పేది,
మీకు
మీరే
గురువులుగా
భావించండి.
ఎవరేమి
చెప్పిననూ,
దానిలో
మీకు
కావలసిన
మంచిదాన్ని
తీసుకోండి.
దానిలో
తప్పేమియూ
లేదు.
భగవన్నామము
ఎవరు
చెప్పిననూ
ఎప్పుడూ
పవిత్రమే.
ఆధ్యాత్మిక
సాధనలో
అడుగు
పెడితే
మన
శక్తి
పెరిగి,
ఆ
మంత్రములోనున్న
ప్రాణశక్తి
నిన్ను
రక్షిస్తుంది.
భక్తినుంచి
జ్ఞానము,
జ్ఞానమునుంచి
వైరాగ్యము
క్రమక్రమముగా
దొరుకుతుంది.
మీలో
అంతర్యామియైన
భగవంతుడే
లోపలనుండి
మీ
గురువుగా
వచ్చి
మిమ్ములను
దిద్ది
నడపి
గమ్యాన్ని
చేరుస్తాడు.
నేను
కన్యాకుమారినుండి
హిమాలయము
వరకు
చూచినాను.
కర్ణాటకములో
వున్నట్లు
విశ్వాసము,
ప్రేమ
వేరెక్కడను
కనబడలేదు.
ఇరువది
సంవత్సరములనుండి
నాకు
ఇదే
అభిప్రాయము.
వినయము,
భయము,
విశ్వాసము
మీలో
ఎక్కువ
వున్నది.
దానిని
అభివృద్ధి
చేసుకోవలయును.
అర్థాన్ని
ధర్మమార్గములో
సంపాదించవలయును.
మోక్షమునకొక
దానికే
ప్రాకులాడాలి.
ఇదే
మానవుని
కర్తవ్యము.
భగవంతుడు
వ్రాసిన
నాటకము
ఇది.
యాక్టరు
నీవు.
సూత్రధారులు
వారు.
ఎప్పుడు
రంగస్థలాన్ని
ప్రవేశించాలి,
ఎప్పుడు
సైడుకు
పోవాలి,
ఏమేమి
ఎట్లు
పలకాలి,
ఎప్పుడు
ఏడ్వాలి,
ఎప్పుడు
నవ్వాలి
అన్నీ
అప్పుడే
వ్రాసినదైనది.
మీరంతా
ఆ
నాటకములో
పాత్రధారులు.
ఒక్కొక్కరికి
ఒక్కొక్క
వేషము.
దానిని
చక్కగా
శ్రద్ధగా
సూత్రధారికి
తృప్తికరముగా
నెరవేరించేదే
మీ
పని.
దీనికే
శరణాగతి
అందురు.
ఇదొక్క
నాటకము,
నాదొక్క
వేషము
అనే
భావముతో
నిత్యజీవనమును
గడిపితే
శాంతిసమాధానాలు
దొరుకుతాయి.
భగవన్నామస్మరణ,
భగవద్రూపధ్యానము
దీనిలోనే
ప్రతి
నిముషమును
గడిపితే
అహంకారము
నాశనమౌతుంది.
శాశ్వతసుఖము
లభిస్తుంది.
Previous
←
The Jīva Is God
Next
Limits And Progress
→