Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1961 · Birthday Sparks
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Birthday Sparks
23 November 1961, Birthday, Puttaparthi
1
▾
Meaning
Keep
ఈనాడు
పుట్టుపండుగ
అనే
ఒక
విశిష్టతనేకాదు!
షిర్డిసాయిగా
అవతరించిన
దినముకూడ.
ఒక
గురువారమే.
అంతేకాకుండా
ఈనాడు
ఎట్లనో,
ఆనాడుకూడ
కార్తీక
పౌర్ణిమ
అయిన
మరుదినమే.
కార్తీకదీపం
వెలిగించిన
రాత్రి
ముగించినప్పుడు
సూర్యోదయములోనే
షిర్డిసాయి
అవతారం.
జన్మదినోత్సవమునాడు
పుట్టపర్తికి
వచ్చి,
ప్రశాంతినిలయములో
ప్రత్యక్షముగా
నా
దర్శన,
స్పర్శన,
సంభాషణనుంచి
మీకు
ఈనాడు
అమితానందమే
అయిననూ,
ఆనందస్వరూపులు
మానవులు.
నిత్యమైన,
సత్యమైన,
అమితమైన
ఆనందానికి
మీరందరూ
పాటుపడవలయును.
నేటి
ఆనందము
ఆ
పరమానందమున
ఒక
బిందువు
మాత్రమే.
అది
నిత్యం,
ఇది
క్షణికం.
దానికి
సాధన
అవసరం,
ఆధ్యాత్మికచింతన
అవసరం,
సత్సంగం
అగత్యం.
ప్రశాంతి
పతాకంలో
వేసివున్న,
ఈ
నిలయం
ముందర
నిర్మించియున్న
ఈ
గుర్తుయొక్క
సారాన్ని
గ్రహించి
ఆచరించవలయును.
కామక్రోధద్వేషములను
నాశనముజేసి,
ప్రేమను
పెంచి,
యోగారూఢులుగా
సాధనచేస్తే,
హృదయకమలము
విడిగి,
జ్ఞానజ్యోతి
వెలుగుతుంది.
పరంజ్యోతియే
ప్రకాంతి.
ఆ
ప్రకాంతియే
ప్రశాంతి.
దగ్గరకు
వచ్చినప్పుడే
పెద్దగా
కనబడేది.
పెద్ద
వస్తువు
చిన్నగా
కనబడితే
మీరు
దూరములో
ఉన్నారని
తెలిసిపోతుంది.
ఆకాశములో
సూర్యచంద్రులకన్న
నక్షత్రాలు
చిన్నవిగా
కనిపిస్తున్నవికదా!
భగవంతుని
దగ్గరకుపోతే
వారి
నిజమైన
మహిమ
మీకు
తెలుస్తుంది.
ఆ
పెద్ద
పదార్థమును
అర్థముచేసుకొనే
దృష్టి
లేదు,
దాని
అనుభవముకూడా
లేదు.
ఇంక
ఎట్లు
అది
దొరికేది.
అవతారము
వచ్చినది
ధర్మరక్షణచేసి,
యదార్థం
చూపించి,
నిజతత్త్వాన్ని
తెలియబరచి
మిమ్ములను
వాంఛారహితులుగా
చక్కచేయటంకోసరమే.
దానినే
నేను
చేసేది.
మీకు
తెలియకుండా
మిమ్ములను
చక్కచేసేదానికన్న
తెలిపిచేసేదే
మంచిది.
మహత్వములను
చూపించి
మీ
నమ్మకాన్ని
దృఢపరచేదే
నా
ఉద్దేశ్యముగాని,
నాకు
కీర్తిప్రతిష్టలు
అక్కరలేదు.
నాకవి
అనవసరము.
నా
క్రియలన్నియు
మహాత్మ్యములే.
అవి
మానవాతీతము.
అందరి
శక్తిసామర్థ్యములకన్నా
మించినవి.
మీరు
నన్ను
వదలిన,
నేను
వదలేవాడుకాదు.
అట్ల
వదిలే
స్వభావముంటే
నేను
రావలసిన
అవసరమే
లేదు.
నన్ను
వదలిపెట్టి
పోయినవారు
మరల
రాక
తప్పదు.
వారిని
నేనే
నా
దగ్గరకు
లాక్కుంటాను.
అదియే
నా
స్వభావము.
Previous
←
Thirty-six Gems For You
Next
Destiny Is No Iron Cage
→