Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1964 · Be a care taker
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Be a care taker
19 August 1964, Close of a seven-day observance (saptāha), Madras
1
▾
Meaning
Keep
నేడు,
ఈ
సప్తాహ
సమాప్తి.
‘సమ’
అంటే
‘బ్రహ్మ’,
‘ఆప్తి’
అంటే
‘ప్రాప్తి’.
బ్రహ్మప్రాప్తి
దీని
ఫలితముగా
వుండాలి.
లౌకిక
హద్దులను
పెట్టుకొని,
సమాప్తమయినదని
చెప్పుట,
అలౌకికమైన,
కాలాతీతమైన
ఆధ్యాత్మిక
విషయమున
సరిపోదు.
ఇక్కడ
ఈ
ఏడు
రోజులూ
ఒక
ఆధ్యాత్మికము
తప్ప
వేరే
ప్రసంగమే
లేదు.
మానవుడు
సుఖసంతోష
స్వభావుడు,
సుఖానంద
స్వరూపుడు.
కాబట్టి,
దీనినే
సర్వదా
కోరుతాడుకూడా,
ఆ
సుఖసంతోష
ప్రాప్తికి
ఏది
మార్గము?
ఆసక్తియే
మారకము,
అనాసక్తియే
కారకము.
ఒక
హెడ్మాష్టరు
తనకు
ట్రాన్ఫర్
వస్తే
స్కూలుసామానులన్నియును
వప్పజెప్పి
కొంచమూ
బాధలేకుండా
సునాయాసముగా
వెళ్లిపోతాడు.
ఇవి
తనవికాదనియు
గవర్నమెంటువారివనియు
వానికి
తెలుసు.
అట్లనే,
ఇవన్నీ
నావికాదనే
అనాసక్తిని
దృఢము
చేసుకోవాలి.
వస్తువుపైన
స్నేహాన్ని
పెట్టవచ్చునేగాని
మోహాన్ని
పెట్టుకోరాదు.
వస్తువు
నిత్యమైనది,
సత్యమైనది
కాదు.
నిశ్చలమైనది,
నిర్మలమైనది
కాదు.
ఆడ
చేతకాక
మద్దెలవోటి
అన్నట్లు,
కొంతమంది
భారతీయులు
వేదాంత
సిద్ధాంతములనే
దూషిస్తారు.
ఇవి
రక్షణ
కొరకు
ఏర్పడినవేగాని,
భక్షణ
కొరకు
కాదు.
బయట
విమర్శలు
చేయకుండా
మీలోమీరు
విమర్శచేస్తే
నిజం
తేలిపోతుంది.
దేవుడు,
ప్రకృతి
రెండూ
అనాది.
ఏనాడు
వచ్చినవో,
ఏనాడు
సంకల్పించినవో
ఎవరు
తెలుపగలరు?
ప్రకృతికూడా
ఎప్పుడు
పుట్టినదో
ఎవరికీ
తెలియదు.
దానియొక్క
ఆది
తెలియదుగాని,
అంత్యము
మాత్రము
తెలుసు.
పరమార్థముతోజేరిన
యదార్థము
పవిత్రమౌతుంది.
అప్పుడు,
బ్రహ్మము-ప్రకృతి
అని
రెండుండవు.
‘ఏకం
సత్’
అనేది
తెలుస్తుంది.
అజ్ఞానమే
అంధకారానికి
కారణము.
దానిని
పోగొట్టుకోవాలంటే
విజ్ఞానమే
కావాలి.
తనను
తాను
తెలుసికొనే
విద్య
అభ్యసించాలి.
తనపై,
తనకు
వైరాగ్యము
రావాలి.
హృదయములో
ఎక్కువ
సామానులు
సేకరిస్తే
చీకటి
ఎక్కువ
అవుతుంది.
జీవితాధారానికి
ఎంత
కావలయునో
అంత
చాలు.
అదే
వైరాగ్యము.
దురాశ,
దురహంకారము,
దుర్వినియోగము
ఇవన్నియూ
అశాంతికి
కారణాలు.
అశాంతిని
తరమనక్కరలేదు.
ఎందుకంటే,
ప్రశాంతియే
మానవుని
స్వతఃసిద్ధమైన
స్వరూపము.
సదా,
తన
స్వార్థమును,
తన
ఆనందమును
ప్రధానముగా
ఎంచక,
ఇతరులకు
ఆనందమునిచ్చే
ప్రయత్నములో
వుండవలెను.
పరోపకార
ధర్మముతో
పరమలక్ష్యము
కావాలి.
ఇల్లు
కట్టిన
యజమానుడు
‘గృహప్రవేశము’
చేసే
ముందు
‘గోపూజ’
చేసి,
తనకు
ముందు
ఆ
ఇంటిలోనికి
గోవును
ప్రవేశపెడతాడు
కదా.
పరోపకార
ధర్మస్వరూపమే
ఆ
గోవు.
మనోనిర్మలానికి
పరోపకారమే
పెద్ద
సాధన.
దానినుండియే
విషయవాసనా
రాహిత్యాన్ని
పొందవచ్చును.
ఇదియే
మనోనాశనానికి
పునాది.
‘మీరు
సాయిబాబా
అవతారము,
సాయిబాబా
అనియే
మీ
పేరుకూడా
కదా!
మరి
మీరెందుకు
సాయిబాబా
విషయము
చెప్పకూడదు’
అని
ఒకరు
నాకు
జాబు
వ్రాసారు.
ఆవేదనతో
నన్నడిగారు.
ఇది
పూర్తి
అమాయకత్వము,
అజ్ఞానము.
భగవంతుడు
సర్వవ్యాపి,
సర్వస్వరూపి,
సర్వస్వభావుడు.
వారిది
అనంత
రూపము,
అనంత
నామము.
రామప్రచారము,
కృష్ణప్రచారము,
సాయిబాబాప్రచారమని
కొంతమంది
చేస్తారు.
సర్వత్రా
అంతా
ఒక్కటే.
సాయి
ఎవరు,
రాముడెవరు,
కృష్ణుడెవరు,
శివుడెవరు?
తెలిసినవానికి
అంతా
ఒక్కటే.
ఉపాధి
భేదమువల్ల
విడివిడిగా
వేరువేరుగా
కనిపిస్తున్నవిగాని,
సర్వమూ
బ్రహ్మమయమే.
సాయిబాబా
గొప్ప
ఇతరులు
కొద్ది
అనేవాళ్ళు
గొప్ప
అజ్ఞానులు.
ఆ
భేదమేమీ
లేదు.
ఇదే
ప్రధానమని
లేదు.
కొంతమంది
నా
పేరుతో
కొత్త
మందిరములను
కట్టుచున్నారు.
నాకెంతమాత్రమూ
నచ్చటం
లేదు.
మందిరములను
ప్రారంభముచేయండని
నేనెప్పుడూ
చెప్పను.
ఉన్న
మందిరాలన్నీ
పాడైపోతుంటే
కొత్త
మందిరాలను
కట్టే
ప్రయత్నాలెందుకు?
దీనికి
వేరే
డొనేషన్
బుక్కులు
తెస్తారు.
వీరు,
ఆస్తికులు,
భక్తులు
అనే
పేర్లు
పెట్టుకొని
ఈ
తిరిగే
వాళ్ళు
నాస్తికానికి
బీజములే!
మందిరానికని
మీరు
నయాపైసా
యివ్వకండి.
భజనలు,
పూజలు
చేయండి.
అంతే
నాకు
చాలు.
ఆనందంగా
ఇళ్ళలో
చేసుకోండి.
మీమీ
హృదయ
మందిరాల్లో
నన్ను
భద్రముచేసుకోండి
చాలు.
ఇదియే
నాకు
హాయి,
మీకూ
హాయి.
Previous
←
The I behind the Eye
Next
Japa and bhaja
→