Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1972 · All are My own
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
All are My own
8 April 1972, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
మేము
25వ
తేదీని
ఢిల్లీ
చేరినపుడు
ప్రజల
ఉత్సాహము
యెంత
తీవ్రముగానుండినదంటే,
ప్లేను
నుంచి
క్రిందికి
దిగి
వచ్చుటకే
అర్ధగంట
పట్టినది.
ఢిల్లీలో
ఒక
నిమిషముకూడ
వ్యవధి
లేకుండ
లక్షలాది
ప్రజలకు
ఆనందమునందించే
పనిలో
నేను
నిరతుడనయితిని.
రాత్రింబగళ్ళు
భజనలు
జరిగినవి.
ఆ
సమయమున
భక్తులకు
దర్శనమిచ్చి,
వారితో
వచ్చిన
రోగులకు
ఆశీస్సులందించి
తృప్తిపరచితిని.
ఉదయమునుంచి
రాత్రి
పన్నెండు
గంటల
వరకు
రోడ్లు
పూర్తి
ఇసుక
వేసిన
రాలని
రీతిగా
జనులు
క్రిక్కిరిసి
యుండిరి.
అయితే
12
గం॥ల
తరువాతకూడ,
క్రొత్త
గుంపులు....
జలంధర్
మీరట్,
పాటియాలా,
ఆగ్రా
మొదలైన
ఊళ్ళనుంచి
లెక్కలేనన్ని
బస్సులలో
వచ్చి
“సాయిబాబా!
దర్శన్
దేవ్
....”
అని
ఆవేదనతో
ఒకే
అరపు!
రోడ్లంతా
కారులతోను,
బస్సులతోను
నిండిపోయెను.
కాబట్టి,
వాళ్ళను
నేను
చూచి
వాళ్ళకు
దర్శనమిచ్చి
రాకపోతే,
వాళ్ళ
వెనుక
నిలిచియున్న
గుంపులకు,
ముందుకు
వచ్చేందుకు
చోటు
లేదు!
దానివలన,
నేను
లోనుంచి
మరిమరి
వచ్చి
వాళ్ళను
ఆనందింపజేయవలసి
వచ్చినది.
2
▾
Meaning
Keep
ఈ
రీతిగా
తెల్లవార్లు
3-30
వరకూ
జరిగినది.
ఇంకేమి!
బ్రహ్మముహూర్తమునకు
నగర
సంకీర్తనము
ప్రారంభము
కదా!
పెద్ద
పెద్ద
గుంపులుగా
మైళ్ళకొలది
పొడవున,
రోడ్డుమీద
భజన.
ఢిల్లీ
పూర్తి
ఉఱ్ఱూత
లూగినది.
ప్రభుత్వములోని
మినిష్టర్లకు,
అధికారులకు,
సామాన్యప్రజలకు,
రిక్షాకూలీలకు,
బీదలకు,
పాకీ…
పనులవారికి,
అందరికీ
ఆనందము
నందించి
అనుగ్రహించటమైనది.
ఇట్లు,
వారి
ఆనందమును
నేనందుకొంటూ,
నా
ఆనందమును
వారందుకొంటూ
ఉన్నప్పుడు,
గుల్జారీలాల్నందా
వచ్చి
కురుక్షేత్రమున
అఖిల
భారత
సాధుసమాజమువారు
జరిపే
ఒక
మహాయజ్ఞమును
స్వామి
చేతులతోనే
ప్రారంభించాలి
అని
గట్టిగా
పట్టు
పట్టాడు.
ఇంత
పెద్ద
ప్రవాహముగా
ఢిల్లీకి
కొండంత
ఆశతో
వచ్చే
భక్తజనులను
వదలి
వారిని
నిరాశ
పెట్టేది
నా
వలన
కాదు
అని
నేను
చెప్పినపుడు,
వారితో
వీరితో
స్వామికి
చెప్పించే
ప్రయత్నమునకు
పూనుకొన్నాడు.
మీ
రాజకీయములో
రికమెండేషనులకు
చోటుండవచ్చునేకాని,
నా
భావమును,
నా
విషయమును,
సరిగా
అర్థము
చేసికొన్న,
మీకే
తెలియును.
అట్లు
రెకమెండేషనులను
వినేవాడనుకాదు
నేను;
అన్నాను.
అయితే
ఆయన,
నాచేతనే
ఆ
యజ్ఞమునకు
ప్రారంభోత్సవము
జరిపించవలెనను
పెద్ద
ఆశ
పెట్టుకొన్నాడని
తెలిసినది.
నా
అనుగ్రహమునకు
పాత్రుడు
కావటము
తనకొక
అమితానందమును
అందించే
భాగ్యమని
భావించినాడు.
తన
సర్వస్వమును,
సాధు
సమాజమునకే
త్యాగము
చేయవలెననే
మహోద్దేశముతోనున్నాడు
కాబట్టి,
ఆయనను
సంతృప్తి
పరచవలెనని
సంకల్పించి,
మధ్యాహ్నము
రెండు
గంటలకు
(ఆ
మండుటెండలో,
పైన,
క్రింద
మాడిపోవును
కాబట్టి
యెవరూ
యెక్కువగా
వేచియుండరని,
యెక్కువ
మందికి
నిరాశ
కలుగదని
నిర్ణయించి)
అచ్చటకు
వెళ్ళాను.
3
▾
Meaning
Keep
కురుక్షేత్రమును
చేరితే,
యెక్కడ
చూచిన,
ఈ
(సన్యాసి)
కలరే!
కాషాయవస్త్రధారులే,
3
లక్షలకు
పైగా
ప్రజలు
చేరియుండిరి.
నా
కేదో
కొంత
ఆనందము
కలిగినది.
ఆనందముతోపాటు
వాళ్ళకు
కావలసిన
ఆదేశముల
నందించవలెననే
ఉత్సాహముకూడా
కలిగినది.
భారతదేశమును
తలంచినపుడు
హిమాచలము,
దానినుంచి
యుద్భవించు
గంగయు
జ్ఞప్తికి
వచ్చును.
సత్య
ధర్మ
శాంతి
అహింసలే
హిమవత్
తత్త్వము.
గంగయొక్క
నిర్మల
వాహినియే
ప్రేమ
తత్త్వము.
ఇట్టి
నిశ్చలమైన
హిమవత్
పర్వతమును
ఇట్టి
నిర్మలమైన
గంగా
తత్త్వమును
రాజకీయాల
ద్వారా
నాశనము
చేయుటకు
ప్రయత్నములు
యెంత
కాలము
జరిగినను
యెన్ని
రకములుగా
జరిగినను
ఫలించవు
అని
వారికి
ధైర్యము
నందించితిని.
లోన
కషాయము
పెట్టుకొని
పైన
కాషాయము
ధరించిన
యేమీ
ప్రయోజనముండదని
హెచ్చరించితిని.
తరువాత,
ఒక
దినము
ఉత్తరప్రదేశ్
రాష్ట్రమందున్న
మీరత్
నగరమునకు
వెళ్ళియుంటిని.
అక్కడకూడ
యెవరికీ
తెలుపక
పత్రికలలో
వేయక
వెళ్ళినను,
చుట్టూ
వృక్షములపై
కొమ్మకొమ్మలకు
కోటి
చీమలు
అన్నట్లు
ఇరుప్రక్కల
లక్షలాది
ప్రజలు
కూర్చొనిరి.
4
▾
Meaning
Keep
వేదిక
దగ్గరకు
మేము
నడచిపోవుటకే
వీలులేని
పరిస్థితి.
మనవాళ్ళందరు
తిరిగిపోవుటే
మంచిదన్నారు.
అయితే
నేను
కారెక్కినపుడు
ఆ
భక్తుల
రోదనము
విని
నేను
దిగి
జనసందడిలో
దూరి
ఒక్కడనే
యెవరికి
తెలియకుండ
వేదికయెక్కి
దర్శనము
నందించితిని.
కొన్ని
భజన
పాటలతో
వారిని
శాంత
పరచితిని.
“ఈ
ఇరువదవ
శతాబ్దమున
భారతదేశపు
రాజధానియూ
నవనాగరికతయొక్క
కేంద్రస్థానమూ
అయిన
ఢిల్లీలో
ఈ
ఐదడుగుల
స్వామిని
దర్శించే
కొరకు
వారి
ఆశీస్సులను
పొందే
కొరకు
ఐదు
లక్షలమంది
చేరారంటే
నిజముగా
భారతదేశములో
ఆధ్యాత్మికపిపాస
ఆధ్యాత్మికావేదన,
ఆధ్యాత్మికతృష్ణ
మిక్కిలి
తీవ్రముగా
సజీవముగానున్నదని
నేను
తెలిసికొన్నాను”
అని
అమెరికన్
అంబాసిడర్
కెనెత్
కీటింగ్
గారు
సంతోషించి
పలికిరి.
దైవభక్తి,
ఆధ్యాత్మిక
శ్రద్ధ,
భారతీయుల
రక్తమున
చేరి
శతాబ్దములనుంచి
సతతము
ప్రవహించుచునేయున్నదని
నాకు
తెలియును.
ప్రేమపలుకులు,
ప్రేమదృష్టి,
ప్రేమవృష్టి,
వీటికి
అపజయమనేదే
లేదు.
రాదు.
నాకెక్కడనూ
దిగ్విజయమే,
ఎందుకనగా
అందరూ
నావారే,
నాకు
పరాయివారే
లేరు.
Previous
←
Thou and That
Next
Tonic for youth
→