Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1972 · The secret of the Avatāra
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The secret of the Avatāra
31 August 1972, Kṛṣṇa Janmāṣṭamī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
అనంతమైన
భగవత్శక్తి
భగవద్
లీలాగుణగణవిశేషములలో
అంతో
ఇంతో
కొంతైననూ
స్మృతికి
తెచ్చుకొని
ఆనందముతో
చింతించిన,
భగవంతునిపై
భక్తిశ్రద్ధలు
కలుగును;
భగవత్
సృష్టిపై
పూజ్యభావము
పెరుగును;
సర్వజీవులూ
భగవదంశములని
తెలియును;
వారిపై
ప్రేమభావము
పుట్టును.
ఆప్రేమద్వారా
భక్తి
సోపానమును
క్రమముగా
అధిరోహించి
భగవదనుగ్రహమును
సంపాదించి
తరించ
వీలగును.
అయితే,
ప్రేమతత్వమును
గుర్తించక,
కామముయొక్క
వలలోపడి,
కోరికలకు
బానిసలై,
కామమునకు
తోడుగావచ్చు
క్రోధమునకు
వశులై,
మానవులు
దానవులగుచున్నారు.
2
▾
Meaning
Keep
ఆకారము
మానవాకారమైనప్పటికీ
దానవత్వము
ఆవరించి,
మానవత్వమునకే
మసిపూసినట్టగుచున్నది.
మానవత్వములో
దైవత్వమున్నది
అని
ప్రకటించుకొరకు,
అవతారములు
మానవాకారమును
ధరించును.
నిర్గుణ
నిరాకార
పరబ్రహ్మతత్వము
అందరికీ
అర్ధముకాదు,
అందుబాటులో
వుండదు.
భగవంతుడు
సర్వవ్యాపి,
సర్వాంతర్యామి,
కాలస్వరూపుడు,
కాలాతీతుడు,
అగ్గిపుల్లలో
మంటవున్నది,
నిర్గుణముగానున్నది.
దానికి
సాకారస్వరూపము
నిచ్చిన,
అది
కార్యకర్మలను
సాధించును.
అట్లనే,
నిరాకారము
సాకారమైన,
అజ్ఞానము
దుర్గుణము
మొదలగువన్నిటినీ
భస్మముచేసి,
మానవులతో
స్వస్వరూపానుసంధానము
చేయించి
వారికిఆత్మానందమునందించు
అవకాశమున్నది.
దీనికే
ధర్మసంస్థాపన
అనిపేరు;
దీనికొరకే
సగుణసాకార
అవతారము:
“అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం
సృజామ్యహం”
అనేది
గీతావాణి.
అవతారములవలన
అధర్మనాశనము
ధర్మస్థాపన
దుష్టశిక్షణ
శిష్టరక్షణ
ఈరెండూ
జరుగును.
అయితే,
ప్రజలను
హింసించే
సంకల్పము
భగవంతునికి
యేనాడూ
రాదు.
లేదు.
ప్రేమసందేశమును
బోధించి
దుర్గుణములను
రూపుమాపుటే,
వారిసంకల్పము.
రాజకురుపువలన
దేహమే
పతనమయ్యే
పరిస్థితి
కలిగినపుడు,
డాక్టర్లు
ఆపరేషన్చేసి
మహదుపకారమునందించురీతి,
రామకృష్ణాద్యవతారకాలమున,
యుద్ధభూమిలో
ఆపరేషన్
జరిగినది,
అంతే.
దేహమనే
దేశమున
కురుపు
అనే
దుర్గుణము
విపరీతమై
పెరిగినపుడు
డాక్టరనే
సాకార
శ్రీకృష్ణభగవానుడు
కాంపౌండరుగా
అర్జునుని
పెట్టుకొని
ఆపరేషన్
స్వరూపమైన
యుద్ధమును
జరిపి
దురహంకారమును
నాశనముచేసి
ఆరోగ్యము
ననుగ్రహించిరి.
3
▾
Meaning
Keep
అవతారమూర్తి
శ్రీకృష్ణునికి
యెంత
చక్కని
పేరు!
దానికి
యెంత
పవిత్రమైన
అంతరార్థమున్నది!
గమనించండి.
కృషి,
ఆకర్షణ.
త్రికాలాబాధితానందము,
ఈ
అర్థములుమూడూ
ఆపదమునకున్నవి.
హృదయభూమినిదున్ని
ప్రేమబీజములనునాటి
ఆనందమును
పండించేది
కృష్ణావతారకార్యము;
ఆబాలగోపాలురందరినీ
ఆకర్షించి
వారిచిత్తముల
నపహరించి
మనోలయమొనర్చి
కాపాడేమూర్తి:
అని
మరొక
అర్థము.
సచ్చిదానందస్వరూపుడు,
మాటలతో
పాటలతో
ఆటలతో
వేణుగాన
మాధుర్యముతో
ఆనందమునందించినాడు
కృష్ణుడు,
భద్రభూమిలోనూ
రుద్రభూమిలోనూ
ఆనందగానమే
ఆయనకలవాటు!
మహాభయంకరమైన
భారత
యుద్ధక్షేత్రమున
చక్కగా
శాంతముగా
నెమ్మదిగా
గీతనుపాడినాడు,
కృష్ణుడు.
యుద్ధభూమియందుకూడ,
ఆయన
ఆనందస్వరూపుడే.
గోపికలనూ
గోపాలురనూ
ఆకర్షించి
వారిహృదయములలో
ప్రేమనుపెంచి
వారికి
సచ్చిదానందస్వరూపుణ్ణి
సాక్షాత్కరింపజేసినాడు.
వారిహృదయమున
చిత్తరువువలె
హత్తుకొని
వారిని
ఉన్మత్తులుగాజేసినాడు.
కృష్ణునిచిరునవ్వులు
ప్రజలనాకర్షించి
పరమానందభరితులు
గావించినవి.
వారిలోని
విషయతృష్ణ
నశించి
వారిలో
కృష్ణ
తృష్ణ
తీవ్రమైనది.
పాలు
పెరుగు
అమ్మేగోపికలు
తాము
వ్యాపారముచేయు
పదార్థముల
పేర్లను
కూతవేయటము
మరచి
గోవిందా
దామోదరా
మాధవా
అని
భగవన్నామములనే
పలికి
ధన్యులైరి.
4
▾
Meaning
Keep
లోకవ్యవహారములకై
వినియోగించవలసినది
విత్తము;
అయితే,
చిత్తమును
పూర్తిగా
భగవన్నిమిత్తమైన
కర్తవ్యములను
నిర్వర్తించేకొరకువినియోగించవలెను.
మానవులు
శ్రమలన్నియును
అర్థకామములకొరకే
వినియోగింతురు;
మిగిలినరెండు
పురుషార్థముల
నార్జించేకొరకు
వినియోగించువారు
అరుదు,
సంసారము
భారమైనపుడు
హృదయమున
భగవంతుని
భద్రముచేసుకొన్న,
ధర్మాసక్తి
బలపడి,
జీవితముచాలా
తేలికయగును.
దీనిని
బోధించుటయే
అవతారముయొక్క
కార్యము.
కృతయుగమున
వేదసంరక్షణకై
అవతారములు
ఆవిర్భవించినవి.
త్రేతాయుగమున
ధర్మసంరక్షణము
ప్రధాన
కారణమైనది,
అపుడు,
ధర్మమూలమిదం
జగత్,
అనే
సత్యాన్ని
స్థాపించటమైనది.
ద్వాపరయుగమున
రాజ్యము
అధికారము
ఆస్తి
పాస్తులు
ధనకనకాదులు
వీటికోసము
కలహములు
బయలుదేరినవి,
అవతారమువచ్చి,
వాటినిన్యాయరీతిగ
ధర్మమార్గమున
పంచినది,
“ధనమూలమిదం
జగత్”
అనేది
అప్పటి
పరిస్థితి.
అయితే,
ఈకలిలో
వేదము
ధర్మము
ధనము
మూడింటికీ
భయమే,
అపాయమే.
ధరణి
ధర్మపత్ని
ధనము
మూడింటికీ
భయ
భీతులే.
కలియుగమందు
శుద్ధ
చిత్తములేదు,
పవిత్ర
భావములేదు,
అయిననూ,
హృదయ
పరివర్తనకు
సులభమార్గములున్నవి.
అగమ్యగోచరమైన
విషయమును
తెలిసి
కొనుటకు
అల్పాయువులైన
అన్నగతప్రాణములకు
కలిలో
వీలు
లేదు.
5
▾
Meaning
Keep
అయిననూ,
కించిత్
సాధనలోనే
పెద్దలాభమును
పొందవచ్చును.
ఇతరయుగములలో
నూర్లకొలది
సంవత్సరములు
తపస్సాచరించి,కాయములను
పుట్టలుగాచేసినతరువాతనే
దైవానుగ్రహము,
దైవసాక్షాత్కారము
దొరకును.
ధ్రువుడు,
ఆరు
సంవత్సరముల
సర్వసంగ
పరిత్యాగముచేసి,
అరణ్యమునకేగి,
కఠోరతపము
జేసిన
తరువాతనే,
శ్రీమన్నారాయణుని
ఆశిస్సులను
పొందగలిగాడు.
ఈకాలములో
50
సంవత్సరముల
పెద్దవాడు,
5
నిమిషములుకూడ
ధ్యానమగ్నుడై
కూర్చొనలేక
పోతున్నాడు.
ఇంక,
ఆయనకు
భగవద్దర్శనము
కాలేదే
అని
విసుగు,
కోపము,
నిరాశ!
లేతవయస్సుగల
ప్రహ్లాదుడు
తండ్రిపెట్టిన
ఘోరహింసలకు
కన్నులనీరుతేడు,
భయకంప
సమేతుడుకాడు
మాటిమాటికి
ఓ
పన్నగశాయి,
ఓ
దనుజభంజన,
ఓ
జగదీశ
ఓ
మహాపన్నశరణ్య
ఓ
నిఖిలపావన
యంచు
నుతించును,
అంతే!
మనసును
మాధవుని
పై
మరల్చి,
అన్ని
పనులనూ
ఆతని
కైంకర్యముగా
జేసితే,
ఏబాధనూ
వుండదు.
దేహములోని
బాధ,
ఇంద్రియముల
పిపాస
వీటిని
హృదయమునకు
సోకకుండ
భగవంతుని
ప్రసాదమని
స్వీకరించవలెను.
భగవద్ధ్యానమే
అత్యుత్తమమైన
యోగము.
ధ్యానము
ద్వారా
సర్వమునూ
త్యాగము
చేయుటకు
బలముచేకూరును.
‘ధ్యానాత్
కర్మ
ఫలత్యాగం,
త్యాగాత్
శాంతిరనంతరం”
ధ్యానమంటే,
అంతర్ముఖప్రయాణము.
సంకల్పము
వలననే
ఇంద్రియములు
పనులు
జరుపును.
కాబట్టి,
సంకల్పములన్నిటినీ
భగవంతునికే
అర్పితము
చేసిన,
సర్వేంద్రియములూ
స్తంభించిపోవును.
6
▾
Meaning
Keep
ఇంద్రియములకు
వశుడైనవాడు
బలహీనుడే
కాబోలు,
నాయమాత్మా
బలహీనేన
లభ్యః
అని
శ్రుతులు
హెచ్చరించేది
అతనిగురించే.
ధ్యానములో
మీరు
కూర్చొన్నపుడు
ఒక
చిన్న
ఈగ
ఇంత
పెద్ద
దేహముపై
వాలిన,
తక్షణమే
దానిని
కొట్టే
బుద్ధి
పుట్టును.
ఇది
ఏకాగ్రతయొక్క
లక్షణమా?
ఇట్టి
ధ్యానమువలన
యేఫలితము
దొరుకును?
భగవంతుని
లీలాగుణగణములను
శ్రవణ
మననాదులచే
మనసులో
నింపుకుని
ఆతని
అనుగ్రహమును
పొందుటకు
కలిలో
వీలు
లేదనుకో
వద్దు.
భగవద్దర్శనము
పొంది
తరించిన
వాళ్లు
కలిలో
కూడ
బహుమంది.
చేసిన
పాపములకు
హృదయ
పూర్వకముగ
పశ్చాత్తాపబడి,
కరుణాస్వరూపుడైన
పరమాత్ముని,
మంగళ
స్వరూపుని,
జ్ఞాననేత్రముచే
సదా
దర్శించి
ఆ
దివ్యానుభూతిలోని
నిత్యానందము
నందుకొన్న
సూర్దాసు
మొదలగు
వారు
వేలకొలది.
గడచిన
పాప
కర్మలను
మరచి
రాబోయే
ఆనందమును
మాత్రము
దృష్టియందుంచుకొని
ప్రముదిత
మనస్కులై
చిత్త
శుద్ధిని
సంపాదించి
జ్ఞానసిద్ధిని
పొందవలెను.
అపుడే
జన్మసార్థకత.
భగవద్గీతలోని
అంత్య
శ్లోకమును
భగవంతం
ఇప్పుడు
తన
వుపన్యాసములో
వుదహరించినాడు
కదా?
దాని
నిజార్థమేమిటి?
“యత్ర
యోగేశ్వరః
కృష్ణో,
యత్ర
పార్థో
ధనుర్ధరః
తత్ర
శ్రీర్విజయో
భూతిర్
ధ్రువా
నీతిర్మతిర్మమ”
కృష్ణుడు
అర్జునుడు
ఇద్దరూచేరితే
జయము
సిద్ధము
అనేది
బాహ్యార్థము.
7
▾
Meaning
Keep
అంతరార్థమేమి?
కృష్ణుడు
యత్ర
“ఎక్కడ’
వున్నాడనే
ప్రశ్ననేలేదు,
సర్వతః
పాణిపాదం
సర్వతోక్షి
శిరోముఖం,
ఆయన
సర్వత్రవున్నాడు.
అయినను
వెతుక
నక్కరలేదు.
అర్జునుడు,
(నిర్మల
చిత్తుడు,)
ధనుర్ధారియై’
(ధైర్య
సాహసముతో
శక్తిసామర్థ్యములన్నిటినీ
యేక
ముఖముగా
వినియోగించిన)
’
విజయము
(మోక్ష
ప్రాప్తి)
సిద్ధించును.
ఇదే
ఆశ్లోకమున
కంతరార్థము.
చిత్తశుద్ధి
దృఢవిశ్వాసము
ఇవిరెండు
కలిగిన
వారికీ
యోగేశ్వరుడైన
కృష్ణుడు
నిస్సందేహముగా
దర్శనమిచ్చి
వెంటజంట
అన్నివిధాల
ప్రోత్సహించి
పరమానందము
ననుగ్రహిస్తాడు.
కృష్ణుడు
నమ్మినవాళ్లను
తనలో
చేర్చుకొనుటకు
యెల్లవేళలసంసిద్ధుడై
వుంటాడు.
అయితే
మానవులు
అర్జునులుగా
తయారుకావటము
లేదు,
అంతే.
జన్మాష్టమి
దినమందు
శ్రీకృష్ణుణ్ణి
మీమీ
హృదయ
స్థానమందు
జన్మింపజేసికొనవలెను.
విషయ
తృష్ణనుంచి
విడుదల
పొంది
కృష్ణతృష్ణను
అభివృద్ధిజేసికోవలెను.
Previous
←
The teachers' gaining of learning
Next
The sea-saw
→