Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1972 · Jesus Christ
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Jesus Christ
24 December 1972, Christmas, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
మతములన్నియూ
మానవుని
మతిననుసరించి
మంచి
చెడ్డ
మొదలైనవిగా
మారును.
మతిని
దిద్ది
తీర్చటమే
మతముల
పరమోద్దేశము.
దేశ
కాల
పరిస్థితులననుసరించి
వారి
వారి
గుణకర్మల
నాశ్రయించి
పాత్ర
భేదములను
ఆధారముగా
పెట్టుకొని
మతములు
భిన్న
భిన్నముగా
కనబడిననూ,
అన్ని
మతములు
చిత్తశుద్ధిని
ప్రసాదించి
ఏకత్వమును
బోధించి
హృదయస్థుడైన
పరమాత్ముని
సాక్షాత్కారమును
సాధించేమార్గమును
చూపించును.
ఆ
మార్గముననుసరించి
ఆచరించి
ఆనందించటమే
మానవుల
కర్తవ్యము,
వారి
జన్మసార్థకత,
ఆచరణరూపమైన
ప్రచార
ప్రబోధలవలన
ఇట్టి
మతమును
స్థాపించిన
జీసస్
క్రైస్ట్యొక్క
జన్మదినమును
ఒక
Holidayగా,
ఆహార
విహారముల
పండుగగా
ఆచరించక,
వారి
దివ్యసూక్తులను
మహత్తరమైన
సదుపదేశములను
హృదయమున
హత్తుకొనేటట్టు
చేసుకొనేదే
వుత్తమమైన
పద్ధతి.
ఈ
నాడు
ప్రపంచమంతా
వట్టి
మాటలతోనే
కొన్నిరకములైన
యుక్తులతోనే
పెద్ద
తృప్తిని
పొందుచున్నది.
ఆడంబరము
ఆర్భాటము
వీటిలోనే
ఆనందము
నందుకొనుచున్నది.
మహాత్ములు
అందించిన
ఆశయములపై
అలక్ష్యము!
2
▾
Meaning
Keep
వారి
సూక్తులపై
అనాదరణ!
క్రైస్ట్
ఒక
క్రిశ్చియన్
మతీయులకేకాదు,
పాశ్చాత్యులకే
కాదు,
మానవజాతికే
గౌరవనీయుడు;
మార్గదర్శకుడు.
రాముడు
కృష్ణుడు
హిందువులకే,
భారతీయులకే,
క్రైస్ట్
క్రిశ్చియనులకే
మొదలైన
అల్పభావములన్నీ
తుచ్ఛ
బుద్ధి
కలిగినవారి
అభిమతములే
కానీ,
విశాలమనస్కుల
భావములుకానేరవు.
దేహము,
దేశము
వివిధ
రూపనామములు,
వివిధశక్తి
సామర్థ్యములు
కలిగిన
అంగములతో
కూడినది,
ఒక
దేహము;
అట్లనే,
వివిధ
దేశములన్నీ
చేరి,
ఒక
విశ్వము.
దేహికి
దేహమెంతనో,
దేవునికి
విశ్వమే
తనదేహము!
చేతులు
కాళ్ళు
కన్నులు
చెవులు
తల
కడుపు-అన్నీ
చేరి
పనిచేసినపుడే
ఒక
సజీవదేహము.
అన్ని
అంగములలోనూ
అంతశ్శక్తిగా
ఒక
దైవానుగ్రహము
ప్రవహించుచుండును.
దాని
బలమువలననే
మనస్సు
బుద్ధి
ఇంద్రియములు
ఇవన్నీ
కర్మలనాచరించును.
ఆత్మానుగ్రహమే
జీవనాధారము.
దానిని
పట్టి
చూచినపుడు,
అన్ని
దేహములలోని
ఏకత్వము
గోచరమగును.
నామరూపములు
అంగాంగములు
వీటినిగమనించిన,
భిన్నత
కనబడిననూ,
ఆంతర్యములోని
ఈ
ఆత్మతత్వమునకే
ప్రాధాన్యత
నీయవలెను.
దేశదేశాల
విషయము
కూడ,
అంతే.
కుటుంబ
సభ్యులమధ్య,
భిన్న
భిన్న
భేదములు
లేచి,
ద్వేషాసూయలు
ప్రజ్వలించిన,
ఆ
కుటుంబముయొక్క
ఆస్తి
దుర్వినియోగమై,
పరులపాలై,
తప్పిపోవును.
3
▾
Meaning
Keep
అట్లనే
వివిధ
దేశములతో
కూడిన
విశ్వకుటుంబములోని
భావములు
భిన్నమయిన,
భగవదనుగ్రహమనే
ఆస్తి
త్వరలో
నష్టమగును.
దేహమునుంచి
ఒక
హస్తమును
విడదీసిన,
రక్తస్రావమై
ఆ
అంగముకూడ
క్షీణించి
ప్రయోజనములేనిదగును.
విభాగమువలన,
అనుగ్రహమును
కోల్పోవటమేకాక,
వేరైన
భాగము
పాడైపోవు
సంభవము
కూడవున్నది.
విశ్వమంతా
సుక్షేమముగానుండవలెనన్న,
అనుగ్రహరక్తము
అన్ని
దేశములలోనూ
అన్ని
ప్రాంతములలోనూ,
సమాజములలోనూ,
అన్నివ్యక్తులలోనూ
ఒకేరీతిగా
ప్రవర్తించవలెను.
వృక్షమొకటి
పెరుగి
పెద్దదికావలెనన్న
భూమి
గాలి
వర్షము
అన్నీ
అత్యవసరము.
అయితే
విత్తనం
మాత్రము
దానికి
ప్రధాన
ఆధారముగా
వుండితీరాలి.
అట్లనే
జీవునికి
కర్మము
సద్భావము
పుణ్యము
ఇవి
ఆధారములు;
అయిననూ
ఆత్మ
అనే
విత్తనము
అన్నిటికన్న
ప్రధానముకదా?
భిన్న
దేశీయులు
భిన్నమతస్థులు
భిన్న
రూపములతో
భిన్న
భావములతో
భిన్న
భిన్నముగా
ప్రవర్తించవచ్చును.
అయితే
విత్తనమొక్కటే!
కొన్నివృక్షములు
జలహీనముగనూ
కొన్నిపుష్టివంతముగనూ
కొన్ని
పొట్టిగనూ
కొన్నిపొడువుగనూ
పెరుగవచ్చును
గాలి
భూమి
వర్షములననుసరించి;
అయితే
బీజరూపమున
అన్నియూ
ఏకమే,
4
▾
Meaning
Keep
మూడు
-
చంద్రులు
చలించే
నదీజలములో
చలించే
చంద్రుడు
కనబడును!
అదే
సమయమున,
చలించని
కొలనులోని
నీటిలో
స్తంభించినట్టుగా
చంద్రుడు
కనబడును;
ఆకాశమునందు
సర్వసాక్షిగా
నిర్గుణుడై
ఒక
చంద్రుడుంటాడు.
జగత్తులో
కర్మల
నాచరించుచూ
చలించు
జీవి,
నిశ్చల
బుద్ధితో
ధ్యానమందు
మనస్సు
ఇంద్రియములను
అరికట్టిన
యోగి,
వీరిరువురూ
ఆ
జగత్సాక్షియొక్క
ప్రతిబింబములే;
ఉపాధియొక్క
గుణమును
పట్టి
చలించినట్టు
స్తంభించినట్టు
తోచుచున్నవి
అంతే.
సర్వసాక్షియైన
ఆత్మ
నిర్గుణ
నిరాకారుడే.
జీసస్
క్రైస్ట్
చలన
బింబమును
I
am
the
messenger
of
God
”
(నేను
భగవత్
కార్యమునకై
వచ్చిన
సందేశవాహకుడను)
అన్నాడు;
స్థిరత్వము
పొందిన
తనలోని
యోగి
బింబమును
గుర్తించి
I
am
the
Son
of
God
(నేను
భగవంతుని
పుత్రుడు)
అన్నాడు;
ఆకాశమందు
సాక్షిగావున్న
నిరాకార
తత్వమును
పేర్కొని
I
and
My
Father
are
one
(నేను
నాతండ్రి
ఇద్దరూ
ఏకమే)
అని
ప్రవచించినాడు.
అందరూ
ఆత్మస్వరూపుని
ప్రతిబింబములే
అనే
సత్యమును
గుర్తించి
మానవ
సోదరత్వమునూ
దైవ
పితృత్వమును
అంగీకరించిన
లోకకల్యాణమునకదే
పునాదియగును.
అదే
సర్వమతసారము,
సర్వమార్గముల
లక్ష్యము;
సర్వజీవుల
గమ్యము.
దీనిని
గుర్తించక
మానవులు
అన్నిదేశములలోనూ
అశాంతికి
అక్రమ
అన్యాయములకు
గురియై
ఘోరప్రచారమునకు
పూనుకొని
జీవితమును
అనర్థమార్గమున
నడుపించుచున్నారు.
5
▾
Meaning
Keep
కాలమార్పువలన
విజ్ఞానము
విపరీతముగా
ప్రభావించి
విలసిల్లి
వికసించటము
వలన
మానవుల
మతిచెడి
వారు
మతసారమునకు
విరుద్ధమైన
మార్గములలోనే
వర్తించుచున్నారు
ఉదాహరణమునకు,
తల్లి
తండ్రులనాదరించి
వారికి
కృతజ్ఞతనందించవలెను.
పెద్దల
అనుభవ
ధనమునందుకొని
వారిని
గౌరవించి
అనుసరించవలెను,
సత్యమునే
పలుకవలెను.
అన్యాయ
అక్రమములనాశ్రయించకూడదని
అన్ని
మతములూ
బోధించును.
అయితే
తల్లితండ్రుల
మాటలను
తిరస్కరించటమే
బుద్ధిమంతుల
లక్షణమని,
పెద్దలననాదరించటమే
సభ్యత
అని,
అసత్యమాడకున్న
పురోగమించమని,
అన్యాయ
అక్రమములతోనే
విజయము
సాధ్యమని,
యెవరికి
వారు
వాదించి
సాధించుచున్నారు.
నాబోధనే
సరి
అని
ఇతరులందరూ
తప్పుదోవనాశ్రయింతురని
అందరూ
విర్రవీగుచున్నారు.
భగవదాజ్ఞ
మతముయొక్క
ఉద్దేశమేమి,
మానవుని
గమ్యమేమి,
జగత్తు
-
జీవి
-
ఈశ్వరుడు
వీటి
నిజసంబంధమేమి,
అని
తెలుసుకొన్న,
భేదభావములురావు.
తాను
విశ్వసించిన
మతము
యేదైనను
దానిపై
శ్రద్ధాభక్తికలిగి
దాని
క్రమశిక్షణలను
ఆచరించిన
వాదవివాదములుండవు.
6
▾
Meaning
Keep
గమ్యము
చేరవలెననే
ఆశ
నెరవేరవలెనన్న
విశ్వసించిన
మార్గముననుసరించి
ప్రయాణము
….
భగవంతుడు
కావలెనన్న
భగవంతుని
ఆజ్ఞానుసారము
వర్తించి
వారినిచేరే
మార్గమునుగుర్తించి
ప్రయాణమునకు
పూనుకోవలెను.
ఒకగ్రామమును
చేరవలెనన్న
లేచి
అచ్చటకు
నడచిపోవలెను.
గ్రామమే
మీరు
కూర్చున్నచోటుకు
నడచిరాదు.
అవతారము
వచ్చినదే,
ఇంక
అన్ని
చక్కగా
జరుగును
అని
కూర్చున్న,
ఫలము
లేదు.
అతని
సన్నిహితము
కావలెనన్న
ఆజ్ఞలను
పాటించినచాలు.
అప్పుడు
సన్నిహితుడవుతాడు.
జీసస్
క్రైస్తు
అనేక
ఆదర్శములనందించినాడు;
సామాన్యమానవులకు
దివ్యానుభూతిని
కలిగించుకొరకు
కొన్ని
మహిమలను
కూడ
వారికి
ప్రదర్శించినాడు.
ఆనందరసమును
గ్రోలేనిమిత్తము
అనుసరించవలసిన
ఆధ్యాత్మికమార్గమును
బోధించినాడు.
కరుణ
త్యాగము
ప్రేమ
సంయమము
సహనము
మొదలైన
సద్గుణములను
ఆచరించి
అభివృద్ధిచేసుకొని
ఆనందమునందుకొండి
అన్నాడు.
అశరీర
వాణి
శిలువపైన
దేహత్యాగము
చేసినాడు,
అది
ఆయనచేసిన
పరమోత్కృష్టత్యాగము
…
క్రైస్ట్ను
స్తుతించేది
వాడుక.
అయితే,
జీసస్సును
పదిమంది
చే…
బంధించి
హింసించినారు.
కానీ,
తానుగా
ఆచరించిన
త్యాగము
కాదది,
జీసస్సు
చేసిన
త్యాగము
అదికాదు,
అతని
జీవితమే
త్యాగజీవితము.
7
▾
Meaning
Keep
తన
సుఖమును
తన
ఆనందమును
త్యాగము
చేసి,
పరుల
బాధనివారణకొరకై
పంచప్రాణములనర్పితము
గావించినాడు.
అహంకారమును
మమకారమును
త్యాగము
చేసినదే
అన్నిటికన్న
మహాత్యాగము.
దేహవాంఛలను
త్యాగముచేసేది
మహత్తరమైన
త్యాగము.
అపకారమొసగిన
వాళ్ళకు
ఉపకారముచేసేది
కూడ
గొప్ప
త్యాగశీలమే.
కాబట్టి,
ఇట్టి
త్యాగజీవితమునాచరించిన
జీసస్సు
జన్మదినమందు
దీనులనాదరించి
దలితుల
శుశ్రూషకు
పూనుకొనవలెను.
జీసస్సు
ప్రబోధించిన
మతములో
భేదభావములను
పురస్కరించుకొని,
తెగలుద్భవించి,
ద్వేషాసూయలు
పెరిగినవి.
అయితే,
క్రైస్టమతము
ఏకత్వమునే
నొక్కి
వక్కాణించినది.
జీసస్సు
శిలువపై
బాధపడుచున్న
సమయములో,
తన్ను
హింసించినవాళ్ళపై
సహజముగనే
కోపోద్రేకములు
చెలరేగినవి.
ఆ
తక్షణమే
ఒక
అశరీరవాణి
బయలుదేరి,
ALL
LIFE
IS
ONE,
MY
DEAR
SON!
Be
alike
to
every
one”
(జీవరాశులన్నీ
ఏకమే;
ప్రేమపుత్రుడా!
అందరినీ
ఏకదృష్టిచే
చూచి
ఏకత్వముగా
భావించు”
అని
బోధించినది.
DEATH
IS
THE
DRESS
OF
LIFE”
(దుస్తులమార్చేదే
మరణము)
అని
హెచ్చరించినది.
సహజ
గుర్తులు
మహాపురుషుల
జీవితోద్దేశము
ఏకత్వమును
బోధించి
ప్రజాక్షేమమును
లోకకల్యాణమును
సాధించేదే.
జీసస్సు
జన్మించిన
ముహూర్తమందు.
8
▾
Meaning
Keep
ఆ
అర్ధరాత్రి
సమయమున,
గగనమునుంచి
ఒక
నక్షత్రము
పడినట్టుగనో
వాలినట్టుగనో
కథలు
చెప్పుచున్నారు;
దానిని
కనుగొని
ఆ
గ్రామమునకు
టిబెట్
దేశస్థులు
ఇతరులు
కొంతమంది
వచ్చిరనియూ
కథలున్నవి.
ఈ
కథలను
పఠించటము
విశ్వసించటము
కూడ
జరుగుచున్నవి.
అయితే
నిజఘటనలు
అట్టివికాదు.
నక్షత్రములు
రాలవు;
జారిపడవు.
తనరాష్ట్రములోని
ప్రతిగ్రామములోనూ
జనాభా
ఎంతఅని
లెక్కచేసి
కనుగొనవలెననే
వుద్దేశముతో
రాజు
ఆజ్ఞ
యిచ్చాడు.
మేరి,
మేరి
భర్త
ఇద్దరూ
స్వగ్రామమునకు
ఈ
ఆజ్ఞను
పాలించేకొరకు
ప్రయాణమైరి.
వారిద్దరూ
ఆ
గ్రామములోనే
జనాభాగణన
జరుగే
దినము
వుండాలి.
అయితే
దోవమధ్యన
మేరికి
ప్రసవవేదనలారంభమయ్యెను.
క్రొత్తవూరు:
పరిచితులెవ్వరూలేరు.
ఒక
ఆవుల
కొట్టములో
రెండావులమధ్య
కొంతస్థలమును
శుభ్రపరచి,
మేరిని
అక్కడ
పరుండమనిచెప్పి
భర్త
ఆ
మధ్యరాత్రి
సమయమున
యెవరైనా
ఆడవాళ్ళు
సాయమునకు
దొరకుదురా
అని
చూచుచూ
నిలచినపుడు
ఆయనకు
శిశువుయొక్క
ఏడ్పువినపడింది;
అదేసమయమున,
చిమ్మ
చీకటిలో
పడి
అజ్ఞానాంధకారమువలన
అన్యాయ
అక్రమ
అసత్యములపాలైన
లోకమునకు
జ్ఞానజ్యోతిని
ప్రసాదించే
మహాపురుషుని
అవతారమయినది
అనే
గుర్తుగా,
ఆకాశమున
విశేషమైన
వెలుగు
బయలుదేరినది!
యెప్పుడూ
ఇంతే.
అంధకారము
నాశనమగు
దినము:
జ్ఞానజ్యోతి
జన్మించిన
దినమనే
దానికి
ఒక
మహత్వపూర్ణగుర్తు!
అవతారజనన
సమయమున
ఇట్టివి
జరుగేది
సహజము.
9
▾
Meaning
Keep
అర్పణ
దృష్టి
కర్తవ్యకర్మలను
అర్పణబుద్ధితో
నెరవేర్చిన,
చిత్తశుద్ధి
కలిగి
భగవత్సాక్షాత్కారము
సులభమగును.
ఇదితప్ప
రెండవమార్గములేదు.
ధనబలము
బుద్ధిబలము
అధికారబలము
యేవీ
పనికిరావు
ఒకప్పుడు
ధనము
జ్ఞానము
రెండింటి
మధ్య
పెద్దజగడము
బయలుదేరినదట,
నావలనపొట్ట
నింపుకొని
ఆరోగ్యవంతుడై
నువ్వు
తెలివిని
సంపాదించినావు
అని
ధనము,
నేను
లేక
ధనమున్న
ఏమి
దాన్ని
నార్జించేదేరీతిగా
అనేదే
తెలియదే?
అని
జ్ఞానము
వాదించిందట.
అపుడు
వారిమధ్యన
ఆత్మవచ్చి,
దుర్వినియోగము
జేసిన
మీరిద్దరూ
చెడ్డ,
సద్వినియోగము
చేసిన
ఇద్దరూ
మంచి
అని
సమాధానము
తెచ్చినదట.
వినియోగవిధానమే
ముఖ్యము.
జ్ఞానములేక
ధనము
ప్రమాదకరము;
ధనములేక
జ్ఞానమురాణించదు.
ఇతరుల
బాధనివారణార్ధము
ధనమును
వినియోగించాలి,
ఇతరుల
సుఖదుఃఖములను
లెక్కచేయక
జ్ఞానమును
దుర్మార్గములో
వినియోగించిన,
భయభీతులు
పెరుగును.
క్రిస్టమస్
పండుగనాడు
క్రైస్ట్యొక్క
పవిత్రభావములను
దయా
ప్రేమ
సహనము
పరోపకారబుద్ధి
వీటిని
-
ఆచరణలో
పెట్టుకొనే
నిర్ణయము
చేసుకోవలెను.
అట్లుచేయక,
మధ్యరాత్రి
దీపాలువెలిగించి,
క్రిస్టమస్
ట్రీ
అని
ఒకదానిని
యేర్పాటు
చేసుకొని
తరువాత
త్రాగటము
నృత్యముచేయటము
ఈ
కార్యక్రమములతో
శ్రద్ధ
చూపించుచున్నారు.
ఆనందమైన
ఈ
సుదినమందు
బాగాత్రాగి
తుచ్ఛమైన
ఆనందము
నందుకోవటమా?
10
▾
Meaning
Keep
మానవత్వమునే
మరపించు
ఆ
వైను
దేవత్వమునకు
కొనిపోవునెట్లు?
మొట్టమొదట
మానవుడు
వైనుత్రాగువాడు!
త్రాగినవైను
మరిమరి
వైనునే
ఆపేక్షించి
మరిమరి
త్రాగును!
చివరకు,
వైను
ఆ
మానవుణ్ణి
త్రాగివేస్తున్నది.
ఇది
త్రాగటముయొక్క
దుఃఖమయ
కథ
-
బాట్లు
లోనికిపోతున్నది!
తరువాత
దాన్ని
త్రాగినవాడే
ఆ
బాట్లలోపల
చిక్కుకొని
బయటకువచ్చేది
సాధ్యముకాక
అవస్థ
పడుతాడు.
ఇది
కథ.
భవిష్యద్వాణి
ఇంకొక్క
ప్రధానమైన
విషయమును
మీకుగుర్తుకు
తెప్పించవలెననుకున్నాను.
జీసస్సు
కాయమును
వదలిపెట్టి
ఆత్మతత్వములో
లీనమయ్యే
సమయమందు
తన
అనుచరుడొక్కనికి
జాన్
అనే
ఆయనకు
ఒకమాటను
చెప్పిపోయినాడు.
ఆ
మాటకు
భిన్న
భిన్న
మార్గములో
నానార్ధములను
కల్పించి
వ్రాతను
అభివృద్ధిపరచే
వ్యాఖ్యాతులు,
దాని
సత్యమే
అడుగంటిపోవునట్లు
పెద్ద
సమస్యగా
పెంచినారు.
కానీ,
దాని
నిజార్థము
చాలా
స్పష్టముగనే
వున్నది.
“నేను
పోయినను
మీరు
చింతించనక్కరలేదు;
కాల
కారణములు
ఒదగి
వచ్చినపుడు,
నన్ను
సృష్టించినవాడే
మరి
వస్తాడు;
లోకమున
అవతరిస్తాడు”
అన్నాడు,
క్రైస్ట్.
అక్కడున్న
ఒక
గొర్రి
పిల్లను
చూపించి,
“ఈ
పేరుతో
(LAMB)
వస్తాడు”
అన్నాడు.
అంటే,
LAMB
అనే
ప్రాణిగా
గాదు
గొర్రిపిల్లయొక్క
ధ్వనియేమిటి?
బా
బా
BA
BA
అవికదా?
బాబాపేరుతో,
ఈ
రూపముతో
వస్తారని
అర్థము.
మరియు
ఆ
అవతారముయొక్క
పేరు
సత్యము
(TRUTH)
అని,
ఆయన
వామనుడని,
కేశరాశి
కిరీటముతోవుందురని,
యెర్రటి
రక్తపు
కలర్
రోబు
(blood
red
robe),
(ఇట్లాది)
ధరింతురు,
అని
వివరములను
కూడ
ఆయనకు
బోధించి
జీసస్సు
మాయమైనాడు.
11
▾
Meaning
Keep
ఈ
సత్యమును
మీకు
ఇంతవరకు
తెలుపలేదు.
అయితే
మీఅందరిలోనూ
సాయివున్నాడు
అని
నేను
హెచ్చరించుచున్నాను
కదా?
ఆ
మాటకు
ఇదే
అర్థము.
రక్తపు
కలర్
గౌను
వేసికొని,
పొట్టిగా,
కుటిలకుంతల
కేశరాశి
కిరీటముతో
మీ
మీ
హృదయపీఠమందు
బాబా
అనే
పరిశుద్ధమైన
నిర్మలమైన
పవిత్రమైన
LAMB
దివ్యస్వరూపమున్నది
అనేది
మీ
నిజతత్వము.
ఇదే
అవతార
తత్వము;
అవతారము
బోధించే
తత్వము.
ఈశ్వర
స్సర్వ
భూతానాం,
ఈశావాస్యమిదం
సర్వం
-
వాసుదేవ
స్సర్వమిదం!
భారతీయ
సంస్కృతియొక్క
దివ్య
సందేశమిది.
భగవత్తత్వము
ప్రత్యేకముగా
వుద్భవించి
అంతరించునదికాదు.
హృదయములో
సదా
సర్వత్ర
నిండిన
చైతన్యమే
అది.
అందరిలోనూ
అన్నిదేశములలోనూ,
యెప్పుడూ
వున్నది
అది
ఒకటే.
ఉండేది
ఒకే
దేవుడు;
సర్వాంతర్యామి;
ఉండేది
ఒకే
మతము,
ప్రేమమతము;
ఉండేది
ఒకేజాతి.
మానవజాతి;
ఉండేది
ఒకే
భాష;
హృదయభాష!
ఆ
ఏకత్వమును
సాధిం…;
ఐక్యతలో
ఆనందించండి.
Previous
←
To three Pandiths
Next
Dedicated for defence
→