Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · God's Forms and Names Are Endless
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
God's Forms and Names Are Endless
18 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
From
Bhaja Govindam, verse 27
గేయం
గీతా
నామ
సహస్రం
ధ్యేయం
శ్రీపతిరూపమజస్రం
నేయం
సజ్జనసంగేచిత్తం
ధేయం
దీనజనావన
విత్తమ్
పవిత్రాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
ఈ
శ్లోకమును
శంకరులవారి
కడగొట్టు
శిష్యుడు
గీతనుగురించి,
ధ్యానము
గురించి,
సహస్ర
నామమును
గురించి,
త్యాగమును
గురించి
అనేక
రకములుగా
భజగోవింద
తత్త్వమునందు
దీనిని
ఇమిడ్చి
సంతృప్తినొందాడు.
“గేయం
గీత”
అనగా
గీతను
పాడమన్నాడు.
ఈ
గీతను
పాడటం
చేత
లభించే
ఫలితము
ఏమిటి?
మానవుడు
విషయ
సంబంధమైన
రాగములకు
గురికావటం
చేత
అశాంతి
అనే
రోగములో
తపిస్తుంటున్నాడు.
ఈ
అశాంతి
అనే
రోగమును
దూరము
చేసుకునే
నిమిత్తమై
గీతను
గానము
చేయమన్నాడు.
గీతయే
భగవానుని
దూత.
గీతయే
జగదేకమాత,
గీత
భక్తులకెల్ల
ఊత,
గీత
సంసారికొక
ఈత,
గీతయే
మంత్రాల
మూట,
గీతయే
వేదాంత
పుట,
గీతయే
ఘనరాజబాట,
గీతయే
శ్రీ
సాయిమాట.
ఇట్టి
పవిత్రమైన
గీతను
పాడమనియు
తదుపరి
నామసహస్రం
అన్నాడు.
మన
భారతదేశమందు
హరి
నామమని,
హర
నామమని,
శివ
నామమని
లేక
కృష్ణనామమని
అనేక
రకములైన
భక్తుల
యొక్క
తృప్తి
నిమిత్తమై
రూపనామములు
నిర్మించుకొని
తద్వారా
భగవంతునికి
భిన్న
రూపములు
అమర్చటము
కద్దు.
దీనిని
పురస్కరించుకొనియే
శంకర
శిష్యులు
ఏ
నామము
పెట్టినప్పటికి
మానవులకు
కొంతవరకు
అసంతృప్తి
కలగవచ్చుననే
ఉద్దేశ్యముచేత
వేదమును
పురస్కరించుకొని
సహస్రశీర్షాః
పురుషః
సహస్రాక్ష
సహస్రపాత్
అనగా
సర్వజీవరాశుల
వాసియైన
వాడు
సర్వేశ్వరుడని,
అట్టి
సర్వేశ్వరునికి
అనేక
రూపములు,
అనేక
నామములు
ఉండటంలో
కూడను
ఎట్టి
అభ్యంతరము
ఉండదని,
ఎట్టి
రూపమునైనా,
ఎట్టి
నామమునైనా
స్మరించిన
ఎట్టిలోపము
కలుగదనియును
సహస్రనామం
అనగా
భగవంతునికి
సహస్ర
నామములని
కాదు.
2
▾
Meaning
Keep
అన్ని
నామములు
తనవే.
అంత
ప్రదేశము
తనదే.
తనది
కాని
నామము
తాను
లేని
దేహము
లేదన్నాడు.
ఇంక,
శ్రీపతి
రూపం
ప్రధాన
మైనదని
ఆ
రూపమునకు
ప్రధానమైన
తత్త్వాన్ని
అందించాడు.
శ్రీపతి
రూపమనగా
ఎవరు
శ్రీపతి
రూపము?
అనేకమంది
విష్ణువు
అని,
అనేకమంది
శివుడు
అని
ఈవిధముగా
వాదోపవాదములతో
కాలహరణము
చేయుటకద్దు.
కాని
శ్రీపతి
అనగా
భగవంతునికి
అష్టైశ్వర్య
సంపన్నుడనే
సార్ధక
నామము
కలదు.
కనుక
శబ్దబ్రహ్మమయి,
చరాచరమయి,
జ్యోతిర్మయి,
వాఙ్మయి,
నిత్యానందమయి,
పరాత్పరమయి,
వాజ్మయి,
శ్రీమయి.
ఈ
ఎనిమిదివ
స్వరూపానికి
శ్రీమయి
అని
శ్రీపతి
స్వరూపుడనే
తత్త్వములో
దివ్యత్వమైన
ఆత్మకే
ఇది
సమన్వయము
అవుతుందనే
ఉద్దేశ్యముతో
కూడను
ఎట్టి
అశాంతి
కాని
అసంతృప్తి
గాని
కలగకుండా
వుండే
నిమిత్తము
శ్రీపతి
రూపం
అన్నాడు.
ఈ
శ్రీ
అనే
పదము
కేవలము
అశుభమైన
వాటికి
శుభమును
అందించే
నిమిత్తమై
శ్రీ
పదమును
ఉపయోగపెడుతుంటాము.
నిత్యసత్యమైన
పదార్ధమునకు
ఈ
శ్రీ
అని
ఉపయోగించనక్కరలేదు.
అది
అమృతత్వమై
వున్న
దానికి
ఈ
శ్రీ
తత్త్వమనే
బిరుదు
అందించేది
ఏమాత్రము
ఉండదు.
పాంచభౌతిక
దేహములు,
అనిత్యములైనటు
వంటివి
ఈలోకమునందు
కనిపించే
ప్రతి
పదార్ధము
కూడను
కొంత
మిధ్యమైనదిగా
మనకు
తోచటం
చేత
యట్టివాటికి
శ్రీ
అనే
పదము
ఉపయోగ
పెట్టి
లేక
గౌరవము
అనే
వాటికి
శ్రీ
అనే
పదము
ఉపయోగపెట్టి
మన
భారతదేశము
నందు
అనేక
రకములుగా
దీనిని
గౌరవిస్తూ
వస్తున్నారు.
ధర్మసంస్థాపన
నిమిత్తమై
వచ్చిన
అవతార
స్వరూపములకు
కూడను
కొంత
కాలము
మాత్రమే
దేహములు
వుండి
తదుపరి
మన
దృష్టికి
కనుమరుగైపోవటం
చేత
అట్టి
రూపమునకు
శ్రీ
అని
మొదటిలో
ఉంచటం
కూడను
భారతీయుల
యొక్క
గౌరవము.
రామునికి
శ్రీ
మొదట
పెట్టి
శ్రీరామ
అని
చెప్పటం,
కృష్ణునకు
శ్రీ
పెట్టి
శ్రీ
కృష్ణ
అనుకోవటం
ఈ
విధమైన
పేర్లకంతా,
ఇంకా
గొప్పగొప్ప
వారికంతా
శ్రీ
అని
ఈ
అనిత్యమైన
నీటి
బుడగవంటి
దేహమును
ధరించిన
వ్యక్తికి
కూడా
శ్రీ
అనేటువంటిది
శుభాన్ని
అందించేకోసం
పెట్టారు.
శివత్వము
అనేది
నిరంతరం
మంగళకరమైనది
కనుక
ఈశ్వర
స్వరూపమునకుగాని,
నామమునకు
గాని
ఈ
శ్రీ
అనే
పదము
ఎక్కడ
కూడను
ఉపయోగపెట్టటం
లేదు.
3
▾
Meaning
Keep
ఇప్పుడు
శ్రీ
శంకర,
శ్రీ
ఈశ్వర,
శ్రీ
శివ
అని
ఎవ్వరూ
చెప్పరు.
ఈశ్వర,
శంకర,
శివ
అని
నిరంతరము
ఆకారము
ధరింపనటువంటిది
కనుక,
నిత్యసత్యబుద్ధముక్తమైన
స్వరూపము
కనుక
అది
నిరంతరము
మంగళమగుట
చేత
ఈ
శ్రీ
అనే
పదము
దానికి
అక్కరలేకపోయింది.
కనుక,
నిరంతరము
మంగళమైన
దానికి
పతిగా
ఉండేవాడు
కనుక
“శ్రీపతి
రూపం”
అన్నాడు.
ఇట్టి
యదార్థమును
మనము
చక్కగా
గుర్తించుకున్నప్పుడే
దైవత్వమనేది
ఏకత్వమని
మనకు
బోధపడుతుంది.
దైవము
ఒక్కడే.
ఏ
విష్ణువుగాని,
ఏ
రాముడు
గాని,
కృష్ణుడు
గాని,
ఈశ్వరుడు
గాని
అనేక
రూప
నామములచేత
మనము
పూజించి,
గౌరవించి
అనేక
రకములుగా
ప్రార్థించినప్పటికిని
దైవత్వమనేది
ఒక్కటే
యనే
సత్యాన్ని
మనకు
స్పష్టపరుస్తున్నాది
శ్రీ
పరమాత్ముడైన
విష్ణువు
గరుడ
వాహనుడని,
శివుడు
నంది
వాహనుడని,
బ్రహ్మ
హంసవాహనుడని,
ఈశ్వరుడు
పార్వతి
భర్తయని,
విష్ణువు
లక్ష్మీపతియని,
బ్రహ్మ
సరస్వతి
పతియని
అనేక
రకములుగా
మనయొక్క
స్థాయికి
వారిని
తెప్పించుకొని
తద్వారా
మన
నిత్య
జీవితమునకు
సంతృప్తిపరచే
సంసార
సంబంధమైన
బాంధవ్యములను
మనము
అనుభవించటంచేత
మనకు
తాత్కాలిక
తృప్తిని
అందించే
ఊహ
లోపల
మనము
ఇట్టివారిని
అటువంటి
స్థితికి
తెప్పించుకుంటూ
వచ్చాము.
భగవంతుడు
మనము
ఒక
విధమైన
దీనిక్రింద
యోచన
చేసినప్పుడు
జీవరాసులకంతా
అధిపతియై,
సర్వజీవులకు
తాను
నాథుడుగా
ఉంటుండి
తనయొక్క
తత్త్వాన్ని
తాను
నడిపించు
కుంటూపోవటము
సహజము.
జంతూనాం
నరజన్మ
దుర్లభం
అన్నప్పుడు
మానవుడు
కూడా
జంతువులలో
ఒక
భాగమనే
ఇందులో
స్పష్టమవుతున్నది.
జన్
అను
ధాతువునుండి
ఉద్భవించినది
కనుక
ఇది
జంతువుగా
వుంటున్నాది.
లోకరీతిగా
మనము
విచారణ
చేసినప్పుడు
జంతువులనగా
కొన్ని
మృగములు,
పశువులుగా
భావిస్తున్నాము.
కాని
గర్భము
నుంచి
జన్మించిన
ప్రతి
స్వరూపము
నకు
జంతు
అనే
సార్ధకనామము.
కనుక
జన్మించటం
పురస్కరించుకొని
జంతువు
అని
పేరు
వచ్చింది.
ఎలుక
కూడను
జంతువే.
ఎలుక
తన
గర్భము
నుండి
కూడను
బిడ్డను
అందిస్తుంది.
కనుక
ప్రజన్మము
పొందిన
వాటికంతా
జంతువనే
పేరు.
జంతువులకు
మరొకపేరు
పశువులు.
పశుపతి
అని
ఈశ్వరునకు
ఒక
పేరు.
4
▾
Meaning
Keep
పశుపతి
అనగా
జీవరాశులకు
నాధుడైనవాడు
పశుపతి
అని.
పశుపతి
అంటే
మనము
ఈశ్వరునిగా
భావిస్తున్నాము.
గోపాలుడంటే
వైష్ణవ
సంబంధమైన
వాడుగా
విశ్వసిస్తున్నాము.
ఈ
గోపాల
అనే
పదమునకు
పశుపతి
అనే
పదము
నకు
ఎట్టి
భేదము
ఉంటుండదు.
కనుక
శివత్వము,
వైష్ణవత్వము
యొక్క
భేదములకు
ఏమాత్రము
అవకాశము
లేదు.
కనుక
మనము
ఈనాడు
నేర్చుకోవలసినదిగాని,
సమన్వయ
పరచేవిధానము
గాని,
మనము
గుర్తించాలి.
విష్ణువు
లక్ష్మి
భర్త
అనిగాని,
శివుడు
పార్వతి
భర్త
అనిగాని,
బ్రహ్మ
సరస్వతి
భర్త
అనిగాని
మనం
భావించక
పసలనాధుడు
అనుకుంటే
చాలా
సమన్వయమై
పోతుంది.
పశులనాధుడనగా
జీవనాధుడని
ఒక
అర్థము.
తదుపరి
మన
భారతీయ
సంస్కృతిని
పురస్కరించుకొని,
పౌరాణిక
సంబంధమైన
మార్గము
అవలంబించటంచేత
దీనికి
కూడను
పశులనాథుడనే
పేరు
కొంత
సమన్వయమై
పోతుంది.
ప-అనగా
పార్వతి,
స-అనగా
సరస్వతి,
ల-అనగా
లక్ష్మి.
పసలనాథుడు.
ముగ్గురుకి
నాథుడైనవాడు
గనక
ఇందులో
ఎట్టి
భేదములకు
అవకాశము
ఉంటుండదు.
అయితే
ఇంక
వాహనములగతి
ఏమిటి?
ఈ
వాహనములంతా
కూడను
హంస,
గరుడ,
నంది
అని
వాహనాలు
వేరే
ఉంటున్నాయే.
ఈ
మూడు
వాహనాలు
ఎవరికి
వినియోగపడతాయి
అనుకున్నప్పుడు
ఈ
వాహనాలను
చక్కగా
సమన్వయపరచుకోటానికి
మనము
పూనుకున్నప్పుడు
విహంగవాహనుడు
పరమాత్ముడు
అంటే
ఇందులో
చక్కని
అర్ధము
ఇమిడి
ఉంటుంది.
వి-అనగా
వృషభము.
హ-అనగా
హంస,
గ-అనగా
గరుడ
మూడింటికి
వాహనుడైనవాడు
కనుక
ఇక్కడ
సమన్వయము
కుదురుతుంది.
ఈనాడు
మనము
ఎట్టి
భేదములకు
తావివ్వక
సర్వమతములను,
సర్వభావములను
సర్వేశ్వరుని
తత్త్వములో
ఏకత్వమును
మనము
అనుభవించుకోవటం
పవిత్రమైన
మార్గము.
దీనిని
పురస్కరించుకొనియే
శ్రీపతి
రూపం
అని
శంకరుల
శిష్యుడు
ప్రకటించాడు.
ఇంక
సజ్జనసంగం
అంటే
ఏమిటి?
మనము
ఎన్ని
పూజలు
చేసినా,
ఎన్ని
వ్రతములు
చేసినా,
ఎన్ని
యాత్రలు
తిరిగినా,
ఎన్ని
రకములైన
ఆరాధనలు
సల్పినప్పటికి
సత్సంగము
లేక
మన
అంతఃకరణములో
కరడు
కట్టుకొన్న
దుర్భావములు
పోవటానికి
గాని,
నశించటానికి
గాని
వీలుండదు.
యిట్టి
దుర్భావములను
నశింపచేసుకునే
నిమిత్తమై
సజ్జన
సంగం
అత్యవసరమని
ఇందులో
ప్రకటించాడు.
5
▾
Meaning
Keep
సజ్జనసంగం
అంటే
ఏది
సజ్జనసంగం,
ఏది
దుర్జన
సంగం
అని
కూడను
మనం
కొంత
విచారించవలసిన
అవసరం.
సత్యము,
త్యాగము,
అహింస,
ప్రేమతత్త్వములకు
ఎక్కడ
బలమైన
అవసరము
ఏర్పడుతుందో
ఎక్కడ
బలము
ఒనర్చే
వాతావరణము
ఉంటుందో
దానిని
అంతా
సజ్జనసంగమని
పిలువవచ్చు.
ఈనాడు
మీకు
ఇది
ప్రత్యక్ష
నిదర్శనము.
మీరు
ఒక్కొక్క
ప్రాంతమునందలి
ఒక్కొక్కరు
విడివిడిగా
ఉంటుండి
వీరియొక్క
జీవితములు,
వారియొక్క
భ్రాంతులు,
వారియొక్క
ఇచ్ఛాశక్తులు
వేరువేరుగా
ఉండినప్పటికిని
ఇక్కడ
ఒక
సమ్మర్
కోర్సులో
చేరటంచేత
ఇక్కడ
అందరికి
పవిత్రమైన
భావములు
ఏర్పడటం,
పవిత్రమైన
భావములు
ఒకరిని
చూచి
మరొకరు
అభివృద్ధి
పరచుకొనేటందుకు
అవకాశమునందించే
సంగముగా
గుర్తించుకోవటానికి
తగిన
నిదర్శనము.
మనలోనున్న
పవిత్రమైన
భావముద్వారా
మనము
ఏకాంతముగా
ఉంటున్నప్పుడు
అపవిత్రమైన
భావము
క్రమక్రమేణా
కొంత
బలహీనము
కావచ్చును.
కానీ,
అట్టి
పవిత్రమైన
భావములు
మన
సమాజములో,
మన
చుట్టుప్రక్కల,
కొంత
అభివృద్ధి
అవటంచేత
మన
భావము
లకు
కొంత
బలము
ఏర్పడుతుంటుంది.
ఇప్పుడు
ఈ
వస్త్రములోపల
అనేక
దారములుంటున్నాయి.
ఒక్కొక్క
దారమును
తీసి
రెండు
వ్రేళ్ళతో
ఇట్లా
త్రుంచటానికి
వీలవుతుంది.
కాని,
అన్ని
దారములు
చేరి
ఒక
వస్త్రముగా
తయారు
కావటంవలన,
ఇట్టి
వస్త్రమును
తుంచటానికి
వీలుకాని
స్థితిలో
తయారౌతున్నది.
ఒక్క
గడ్డిపోచ
చిన్న
చీమనైనా
బంధించటానికి
వీలుకాని
బలహీనతలో
ఉంటుంది.
కానీ,
అలాంటి
అనేక
వేల
గడ్డిపోచలను
చేర్చటం
చేత
మదించిన
గజమును
కూడను
బంధించటానికి
వీలవుతుంది.
మనలోనున్న
చెడ్డ
గుణములు
గాని,
మంచి
గుణములుగాని
మనము
చేరే
గుంపులను
పట్టి
ఉంటుంది.
కనుకనే
చెడ్డగుణములు
దూరము
చేసుకోవాలనుకున్నప్పుడు
మంచి
గుణములు
కలిగిన
వారి
సంగములో
మనము
ప్రవేశించటానికి
పూనుకోవాలి.
ఈ
సత్సంగమువల్ల
సద్భావములు,
సద్బుద్ధులు,
సత్ప్రవర్తనలు,
సదాలోచనలు
ఎంతైనా
అభివృద్ధి
కావటానికి
అవకాశము
ఉంటుంది.
కనుక,
సత్సంగము
అత్యవసరమని
శంకరుల
శిష్యులు
మూడవదిగా
ఇందులో
ప్రకటించారు.
ఇంక
దీన
జనులకు
ధనమును
దానము
చేయమని
నాల్గవ
పంక్తిలో
ఉంది.
6
▾
Meaning
Keep
అనగా,
ఎవరు
ఇట్టి
దానమునకు
పూనుకోవటానికి
అర్హులనగా
గృహస్థులే
ఇట్టి
దానమునకు
అర్హులని
ఇందులో
మనము
గుర్తించాలి.
సన్యాసులకు
ధనము
ఉండదు.
సన్యాసులు
ఎట్టి
దానము
చేసే
దానిలో
సంసిద్ధులై
ఉండరు.
కనుక
సర్వ
విధముల
ధనమును
ఆర్జించి,
ఏదో
తమయొక్క
నిత్యజీవితమునకు
కొంత
ఉపయోగపరచి
తమ
భవిష్యత్తుకు
కూడా
కొంత
భద్రపరచి
మిగిలిన
దానిలో
దానధర్మములకు
పూనుకోవటం
చేత
సంపాయించిన
ధనమును
కొంత
సద్వినియోగపరచటము
ఒక
పవిత్రమైనది,
పిల్లల
యొక్క
జీవితానికి
ఉత్తమమైన
జీవితాన్ని
అందిస్తుంది
అనే
ఉద్దేశ్యముతో
‘దానము’
అనేది
అత్యవసరము
అన్నాడు.
దైవము
యొక్క
ఏకత్వమును,
మానవత్వము
యొక్క
సమత్వమును
ఇందులో
అభివృద్ధిపరచే
నిమిత్తమై
ఈ
శ్లోకములో
ఇట్టి
భావములు
కూడను
ఇమడ్చటం
జరిగింది.
ఈ
రెండు
మనకు
లభించాలనుకున్నప్పుడు
హృదయము
నిర్మలమైనదిగను,
ప్రేమమయమైనదిగను
మనము
కొంతవరకు
తీర్చిదిద్దుకోవాలి.
ప్రతి
మానవుని
యొక్క
జీవిత
వృక్షమందు
కూడను
ప్రేమ
అనే
ఫలములు
కొల్లలుగా
ఉండటం
కద్దు.
అయితే,
అట్టి
ఫలములు
మనము
కొంతవరకు
భుజించటానికి
పూనుకోవటంలోపల
ఫలమునకు
పైభాగములో
కొంత
అరుచియైన
చర్మము
కప్పబడి
ఉంటుంది.
ఇట్టి
మధురమైన,
సున్నితమైన,
సుగంధమైన
ఈ
తేనెవంటి
రసమును
కొంత
చేదు
చర్మము
కప్పి
ఉండటముచేత
అందులోని
మాధుర్యము
ఒక్కతూరి
లభించదు.
కనుక,
మొట్టమొదట
ఈ
కప్పబడిన
అభిమాన
మమకారములనుగాని
లేక
కోప
తాప
ఈర్ష్య
అసూయ
ఢంబమనే
దుర్గుణముల
మిశ్రమమైన
చర్మముగాని
దీనిపైన
కప్పబడి
ఉంటుంటాది.
దానిని
మనము
తీసినప్పుడే
అందులోని
మధురరసము
మనకు
లభిస్తుంది.
కనుక,
ఇట్టి
పవిత్రమైన
ప్రేమ
ప్రతి
మానవునియందు
ఉండి
నప్పటికిని
ఈ
ప్రేమ
వివిధ
మార్గములలోపల
మనము
ప్రవేశపెట్టటం
చేత
అది
కొంత
బలము
తగ్గి
భగవద్విశ్వాసమునకు
కొంత
అంతరాయము
కలిగిస్తుంది.
ఈనాడు
మన
సంకల్పము
సఫలమాయెనా
మన
భక్తి
అభివృద్ధి
అవుతుంది.
మనం
సంకల్పములు
విఫలమాయెనా
ఉన్న
భక్తి
తరగటానికి
ప్రయత్నమౌతుంది.
కనుక,
ఇట్టి
తరిగి,
పెరిగే
భక్తి,
భక్తి
అని
చెప్పటానికి
అవమానము.
తరిగి
పెరగని
భక్తిని,
గాఢమైన
ప్రేమను,
విశ్వాసమును
మనము
బలపరచుకున్నప్పుడే
ఇందులో
దైవత్వమనే
ఏకత్వము
మనకు
అర్థమవుతుంది.
7
▾
Meaning
Keep
కేవలము
వాంఛలపైననే
మన
మనస్సు
లగ్నపరచటంచేత
మంచి
చెడ్డలనే
విచారణ
శూన్యమైపోవటంచేత
ఇందులో
కొన్ని
రకములైన
పరాభవానికి
కొంత
కారణము
ఏర్పడుతుంది.
తన
అభీష్టములు
నెరవేరినప్పుడు
దైవము
అని
చెప్పినప్పుడు
గాని
తన
అభీష్టములు
నెరవేరనప్పుడు
ఇతడు
దైవము
కాదని
ఉల్లంఘించినప్పటికి
దైవమునకు
ఎట్టి
కష్టములు,
నష్టములు
ఉండవు.
కాని,
ఈ
రెండు
ఆ
వ్యక్తి
యొక్క
బలహీనతయే
అని
భావించాలి.
వ్యక్తిగతమైన
సంబంధములు
పురస్కరించుకొని,
క్షుద్రమైన
వాంఛలను
ఆధారము
చేసుకొని,
నిత్యసత్యమైన
దైవత్వము
లోపల
మనము
మార్పు
చెందించుకోవటము
మానవత్వములోపల
మలినమైన
భావమే
దీనికి
కారణము.
ఈ
అంతః
కరణమునందు
ఇన్ని
దుర్వాంఛలు
ఉంచుకొని
ఎన్ని
సాధనలు
చేసినప్పటికిని,
ఎన్ని
పర్యాయములు
దర్శన,
స్పర్శన,
సంభాషణలు
పొందినప్పటికి
మనయొక్క
భావములోపల
సంతృప్తి
కలగటం
చాలా
అరుదు.
దీనికి
ఒక
చిన్న
కథ.
ఒక
వ్యక్తికి
అనేక
రకములుగా
అనారోగ్యం
సంభవించింది.
దీనికంతా
మూలకారణము
అజీర్ణమని
డాక్టరు
నిర్ణయించాడు.
అయితే
ఇట్టి
అజీర్ణవ్యాధి
నిమిత్తమై
మందులు
మార్చి
మార్చి
తీసుకున్నాడు.
మితిమీరిన
రోగానికి
ఎన్ని
రకములైన
మందులైనా
పని
చేయటం
కష్టమే.
కానీ,
ఏదో
అదృష్టవశాత్తు
ఒక
మహనీయుడు
కనిపించి,
“నాయనా!
నీ
అజీర్ణవ్యాధికి
తాత్కాలిక
ఉపశాంతినందించే
నిమిత్తమై
నేను
ఒక
మందు
చెబుతాను.
నీవు
నిత్యము
అనుభవిస్తుండాలి
అన్నాడు.
అతను
చెప్పిన
మందు
ఏమంటే
ఉప్పురాళ్లను
నిరంతరము
నీవు
జేబులో
వేసుకొని
ఉండు.
ఒకటి
కరగిన
తక్షణమే
మరొకటి
ఉప్పురాళ్ళ
రసము
మ్రింగుతుంటే
ఈ
అజీర్ణవ్యాధి
తగ్గిపోవచ్చును”
అని
సలహా
ఇచ్చాడు.
ఈ
రకమైన
మందు
కొంత
అలవాటులో
పెట్టుకోవటంచేత
ఈ
అజీర్ణ
బాధ
తగ్గినట్లుగా
తోచింది.
అయితే
ఆ
వ్యక్తికి
దీపావళి
వచ్చిందంటే
తీపులు
అందరికి
పంచటం
ఆచారంగా
పెట్టుకున్నాడు.
తెల్లవారి
స్నానం
చేశాడు.
ఉప్పురాళ్లు
నోటిలో
పెట్టుకున్నాడు.
దాని
రసాన్ని
మింగుతూ
లడ్డూ
తీసుకునేదానికి
అంగళ్ళకి
వెళ్లాడు.
ప్రతి
అంగడియందు
ఇది
fresh
గా
వుందా
లేదా
అని
రుచి
చూచే
నిమిత్తమై
కొంచెం
తీపి
వేసుకోవటము,
లడ్డు
సరిగా
లేదు
అని
అనేక
అంగళ్లు
తిరిగినాడు.
ఎవరో
తెలివితేటలు
కలిగిన
లడ్డు
మిఠాయి
అమ్మేవాడు
ఇతని
చేష్టలంతా
కనిపెట్టి
తన
అంగడి
దగ్గరకు
వచ్చే
సమయానికి
‘అయ్యా
మొట్టమొదట
కుళాయి
దగ్గరకు
పోయి
నోరు
కడుక్కొనిరా’
అన్నాడు.
8
▾
Meaning
Keep
ఇతడు
నిజమే
అని
తాను
గుర్తు
తెచ్చుకుని
కుళాయి
దగ్గరకు
పోయి
నోరు
కడుక్కొని
వచ్చి
లడ్డు
తింటే
తీయగా
చక్కని
రుచిగా
ఉంటున్నది.
అదేవిధముగా
మనకు
కొన్ని
రకములైన
మతి
భ్రాంతి
జరగటంచేత
దీనికి
అనేక
రకములుగా
లోక
సంబంధమైన
విషయవాసన
మన
అంతఃకరణములో
పెట్టుకొని
ఏ
సమాజమునకు
వెళ్లినా,
ఏ
సత్సంగమునకు
పోయినా
ఏ
పెద్దల
దర్శన
స్పర్శన
సంభాషణలకు
పోయినా
మన
అంతరాత్మలోనున్న
రుచే
మనకు
తెలుస్తూ
ఉంటుంది
గాని
ఇందులో
వచ్చే
పవిత్రమైన
భావములుగాని,
ఈ
నిర్మల
నిశ్చల
నిస్వార్థమైన
విషయములుగాని
మనకు
అర్థం
కావటం
కొంచెం
కష్టమే.
కనుక,
మొట్టమొదట
మన
అంతఃకరణ
శుద్ధి
చేసుకొని
మనము
ఆత్మానుభవమునకు
పూనుకున్నప్పుడే
ఇందులోనున్న
మధురమైన
ఆనందము
కొంత
అనుభవానికి
వస్తుంది.
దీనిని
పురస్కరించుకొనియే
“యద్భావం
తద్భవతి”
అన్నారు.
ఎట్టి
కలరు
అద్దాలు
మన
కండ్లకు
తగిలించుకుంటామో
అట్టి
కలరే
మన
కళ్లకు
కనిపిస్తుంటుంది.
కనుక
నీవు
తగిలించుకున్న
గ్లాసులలో
మార్పేగాని
ప్రకృతిలో
ఎట్టి
మార్పు
లేదు.
అదేవిధముగా
పెద్దల
ఎడల
నీకు
వచ్చే
భావములు
నీలో
పుట్టినవేగాని
పెద్దలలో
వచ్చినవి
కాదు.
ఎవరు
తిన్న
పదార్థము
యొక్క
వాసన
వారికే
ఆ
త్రేపులో
వస్తుంది
గాని
ఒకరు
ఒక
పదార్థము
తింటే
ఆ
పదార్థము
వాసన
ఇంకొకరి
త్రేపునకు
ఆ
వాసన
రావటానికి
వీలుండదు.
అయితే,
ఈ
మనస్సుకు
రెండు
రకములైన
పిచ్చి
సిద్ధాంతాలుంటున్నాయి.
ఒకటి
శూన్యత్వము,
అనేకత్వము
ఒకటి.
ఎన్ని
ప్రయత్నములు
చేసినప్పటికిని
ఏకత్వము
అనేది
దీనికి
ప్రయత్నపూర్వకంగా
సిద్ధించటం
లేదు.
అందున
ఇట్టి
సత్సంగములో
చేరినప్పుడు
మరింత
వికార
భావములు
చెలరేగుతుంటాయి.
అనేకమంది
ఇట్టి
సత్సంగములోచేరి,
కొంతమందికి
ఈ
సత్సంగము
యొక్క
సద్భావములు
వినటానికి
కూడను
ప్రాప్తి
ఉండదు.
కొంతమంది
సత్సంగములో
కూర్చున్న
తక్షణమే
కుంభకర్ణుని
నుండి
messages
వస్తుంటాయి.
తూగుతూ
ఉంటారు.
మరికొంతమంది
సత్సంగములో
కూర్చొని
వినినట్లుగానే
తలలూపుతుంటారు
గాని
బుద్ధి
ఏ
బిజినెస్
పైనో,
ఏ
ఫ్యాక్టరీపైనో
సంచారము
సల్పుతుంటుంది.
మరి
కొంతమందికి
ఈ
వచ్చినవారి
ముఖాలు
చూడటము
లోపలనే
ఈ
బుద్ధి
సంచారము
సల్పుతుంటుంది.
9
▾
Meaning
Keep
చెప్పినట్టు
విషయము
ఏమిటో
అది
సూటిగా
నాటుకొనే
చిత్తములు
చాలా
తక్కువే.
ఇంత
దూరము
ప్రయాణము
చేసి,
ఇంతకాలము
వ్యర్థము
చేసి
సమావేశములో
కూర్చుని
ఇందులో
వచ్చిన
విషయములు
ఏమిటో,
చెప్పిన
విషయములు
ఏమిటో
మనం
గుర్తించలేకపోయిన
మన
కాలము,
కాయము,
ధనమును
వ్యర్థము
చేసుకున్నవారమైపోతాము.
ఒక
పౌరాణికుడు
సప్తాహమనే
పేరుతో
ఏడు
దినములు
పురాణము
చెబుతూ
వచ్చాడు.
కాని
ఆ
సప్తాహ
సమావేశములోపల
కొత్తగా
భర్త
చనిపోవటంచేత
ఆ
స్త్రీ
ఈ
పురాణ
కాలక్షేపం
చేయటం
వల్ల
నా
దుఃఖము
కొంత
శాంతించవచ్చు
అనే
ఉద్దేశ్యముతో
అందరికంటే
ముందుగా
వచ్చి
ముందు
లైనులో
వచ్చి
కూర్చోటం
జరుగుతుంది.
కానీ
ఈ
పండితుడు
ఒక
సీటుపై
కూర్చుని
ఒక
రామాయణమును
చదువుతుంటుంటే
చదివినంతసేపు
ఆ
స్త్రీ
కంటి
నీరు
కార్చుకుంటూ
ఉండేది.
ఏడు
దినములు
టైము
తప్పక
ప్రారంభము
మొదలుకొని
అంత్యమయ్యేవరకు
లేవక
ఆ
స్త్రీ
అక్కడ
ఉండేది.
ఈ
పండితుడు
ఈమెకు
మహా
భక్తియని,
ఈ
భక్తిలోపల
తన్మయత్వమై
పోతున్నాదని
అనేక
రకములుగా
తాను
భావించుకొని
ఆ
సప్తాహ
దినము
పూర్ణాహుతి
అయిన
తరువాత
అతను
ప్రసంగాన్ని
ప్రారంభించి,
ఈ
ఏడు
దినములు
కూడను
నా
సప్తాహమునకు
టైము
తప్పక
వచ్చిన
వ్యక్తి
మహాభక్తురాలు,
తన్మయత్వములోపల
ఈ
పురాణమును
శ్రవణము
చేసింది
కనుక
మొట్టమొదట
ఈమెకు
తీర్థమునందిస్తున్నాను
అని
అతను
ఉపన్యాసము
ముగించాడు.
ఆమెను
అంతమందిలోను
లేపి
తీర్థము
ఇచ్చి
ఈ
పండితుడు
‘అమ్మా!
నా
పురాణము
చక్కగా
ఉంటున్నదా!
ఎంత
తీవ్రమైన
హృదయముతో
నీవు
వింటున్నావు.
హృదయ
పూర్వకంగా
విన్నవారు
మీరొక్కరే.
నా
పురాణము
చక్కగా
ఉంటున్నాదా?’
అని
ప్రశ్నించి
తీర్థము
ఇవ్వటానికి
వచ్చినప్పుడు
ఆమె
చెప్పింది,
‘అయ్యా!
మీరు
పురాణమే
చెప్పారో,
రామాయణమే
చెప్పారో
నాకు
ఒకటీ
తెలీదు’
అంది.
“మరి
ప్రతి
దినము
కంటి
ధారలు
కార్చుకుంటూ
ఏకాగ్రచిత్తముతో
వింటున్నావుకదా”
అంటే
‘అది
కాదండి.
మీ
పుస్తకము
నల్లటి
దారముతో
కట్టినారు.
ఆ
నల్లదారము
నాభర్త
మొలత్రాడు
జ్ఞాపకము
వచ్చి
ఏడ్చినాను’
అనింది.
కనుక,
సమావేశములో
చేరి
ఇట్టి
పరచింతన
చేస్తూ
కేవలం
ఒక
విధమైన
భావముతో
జరిగేటువంటి
విషయమును
ఏమాత్రము
గుర్తించని
వ్యక్తులు
లోకములో
అత్యధికంగా
ఉంటున్నారు.
10
▾
Meaning
Keep
మన
సర్వశాస్త్రముల
సారము,
సమస్త
మార్గముల
యొక్క
మూలము
మనయొక్క
దివ్యమైన
చిత్తశుద్ధి
అనే
తత్వాన్ని
గుర్తుంచుకోవాలి.
అట్టి
చిత్తశుద్ధి
కలిగిన
వ్యక్తికి,
భగవంతుడు
శుద్ధమైన
రూపములో
ప్రతిబింబిస్తూ
ఉంటాడు.
ద్వారక
యందు
మహా
పేరుపొందిన
పెయింటరు
ఉండేవాడు.
అతని
పేరు
ప్రతిష్టలు
దేశమునకంతా
వ్యాపించటం
చేత
అతనికి
ఒక
రకమైన
అహంకారము
బయలు
దేరింది.
ఇట్టి
అహంకారము
వచ్చినప్పుడు
క్రింద
మీద
చూడటానికి
పూనుకోడు.
ఒకనాడు
నేను
ఇంక
సంపాదించవలసినదంతా
సంపాయించాను.
తిరగవలసిన
దేశములంతా
తిరిగాను.
కాని
ఒక్క
కృష్ణుని
దగ్గర
నాయొక్క
ప్రవేశము
జరగ
లేదు.
కృష్ణుని
దగ్గరకు
వెళ్లి
కృష్ణుని
రూపము
చిత్రించి
అతని
యొక్క
మెప్పు
నేను
అందుకోవాలి
అని
కొంత
వాంఛ
కలిగింది.
సరే
ఒకనాడు
టైము
ఫిక్స్
చేసుకున్నాడు.
కృష్ణుడు
ఫలాన
టైముకు
రావచ్చును
అన్నాడు.
ఆ
సమయమును
పురస్కరించుకొని
ఈ
పెయింటరు
తనయొక్క
మెడల్సు,
బిరుదులు
గాడిదపై
మూటగా
కట్టుకొని
బయలుదేరి
వెళ్లాడు
కృష్ణుని
యొక్క
భవనానికి.
ఇతని
యొక్క
ఆర్భాటమును
కృష్ణుడు
గమనించాడు.
అంతర్వాసి,
సర్వహృదయవాసి
అయిన
కృష్ణుడు
ఇతని
భావములు
మొదటే
గుర్తించుకొని
‘ఏమండి!
మీరు
ఎందుకోసం
వచ్చారు,
కారణము
ఏమిటి?’
అని
అడిగాడు.
‘స్వామీ!
నా
జీవితములో
ఎట్టి
ఆశలు
లేవు.
ఒక్క
ఆశ
మాత్రమే
ఉంటున్నాది.
ఆ
ఆశను
తీర్చి
నా
జన్మను
సార్థకం
చేయండి’
అని
ప్రార్థించాడు
ఈ
పెయింటరు.
“తమను
నేను
చిత్రించాలి.
పది
నిముషాలు
మీరు
కదలక
మెదలక
కూర్చున్నారంటే
దానిని
మొట్టమొదట
outline
వేసుకుంటాను.
ఒక
వారము
లోపల
ఉన్నది
ఉన్నట్లుగానే
మీ
చిత్రము
వేసుకు
వస్తాను”
అని
ప్రామిస్
చేశాడు.
సరి
రాత్రింబవలు
కృష్ణుని
యొక్క
బిరుదు
అందుకోవాలని
తాను
చాలా
శ్రమపడి
చక్కగా
వేశాడు.
ఒక
తెల్లటి
వస్త్రము
వేసి
ఆ
చెప్పిన
కాలమునకు
తిరిగి
ఆ
కృష్ణ
భవనములో
ప్రవేశించి
కృష్ణుని
కూర్చోమని,
‘స్వామీ!
తమ
చిత్రము
సిద్ధముగా
ఉంటున్నాది.
తమరు
చూడాలి”
అన్నాడు.
సరే!
వస్త్రము
తీసేటప్పటికి
కూర్చున్న
కృష్ణునికి,
పెయింటులో
ఉన్న
కృష్ణునికి
పూర్తి
విరుద్ధముగా
ఉంటున్నాది.
చూచి
ఆ
పెయింటరుకే
చాలా
ఆశ్చర్యమైపోయింది.
ఈ
విధముగా
అనేక
పర్యాయములు
మరల
తెస్తానని
ఒక
ఐదారు
పర్యాయములు
పెయింటు
వేసి
తన
అపజయానికి
గురియై
ఇంక
ఆ
గ్రామమునే
వదలి
పోవటానికి
సిద్ధమయ్యాడు.
11
▾
Meaning
Keep
రెండవ
దినము
ముఖము
చూపించటానికి
వీలుకాక
తాను
అర్ధరాత్రి
యందు
ఇంకొక
దేశానికి
వెడదామని
ప్రయాణమై
వెళ్లిపోతున్నాడు.
మార్గమధ్యములో
నారదుడు
కనిపించాడు.
ఈ
నారదుని
స్వభావము
ఎట్టిదంటే
నయాపైస
ఇచ్చి
కరపించుకుంటే
నాలుగు
వందలిచ్చినా
కూడా
వదిలించుకోవటానికి
వీలుకాదు.
నారదుడు
కనిపించిన
తక్షణమే,
నారదుడు
త్రికాల
జ్ఞాని
కనుక
పెయింటరుకు
కలిగిన
పరాభవము
చక్కగా
గుర్తించుకొని
‘ఎక్కడికి
వెడుతున్నావు
నాయనా?
ఏమి
జరిగిందని’
అడిగాడు.
అప్పుడు
ఈ
పెయింటరు
జరిగినదంతా
చెప్పినప్పుడు
నారదుడు
చెప్పాడు
‘ఒరే!
పిచ్చివాడా!
కృష్ణుని
పెయింటు
చేయటానికి
నీవు
పూనుకున్నావు.
అతను
క్షణ
క్షణమునకు
మారుతుంటాడు
కదా!
అలాంటి
నిత్యనూతనుడైన,
క్షణక్షణమునకు
నూతనుడైనటువంటి
కృష్ణుని
ఏ
రీతిగా
పెయింటు
వేయటానికి
పూనుకున్నావు.
అయితే,
అట్టి
కృష్ణుని
పెయింట్
వేసి
అతని
నుండి
బహుమానం
పొందాలనుకునే
ఉద్దేశ్యము
నీకుంటే
నేను
ఉపాయము
చెబుతాను.
ఆ
ఉపాయము
వలన
తప్పక
నీకు
ఆ
బహుమానము
అందుకోవటానికి
వీలవుతుంది’
అన్నాడు.
ఏదో
చెవులో
ఊదాడు.
దీనిని
ఆధారము
చేసుకొని
ఈ
నారదునితోబాటే
ఈ
పెయింటరు
ద్వారకకు
వెళ్లి
రెండవదినము,
‘స్వామీ
నేను
తమ
చిత్రమును
చక్కగా
తీసుకొని
వచ్చాను’
అని
చెప్పి
ఒక
తెల్లటి
వస్త్రము
కప్పుకొని
లోపలకు
వెళ్లాడు.
కృష్ణుడు
కూర్చున్న
దానికి
ఎదురుగా
నిలబెట్టాడు.
తెర
తీసాడు.
‘స్వామీ!
మీరు
ఎన్ని
రూపాలు
మారితిరో
అన్ని
రూపాలు
మారండి.
ఏ
రూపము
మారినా
ఆ
రూపము
దానిలో
వస్తుందని’
శుద్ధమైన
అద్దమును
తెచ్చిపెట్టాడు.
కనుక,
ఇదేవిధముగా,
భగవంతుడు
ఇటువంటివాడు,
అటువంటివాడు
అని
మనము
ఆకారాలు
తీర్చి
దిద్ది
మనము
ఎన్ని
పెట్టుకున్నప్పటికిని
నిజమైన
ఆకారము
అందులో
రావటానికి
వీలుండదు.
అట్టి
ఆకారములను
తీర్చిదిద్దుకునే
ప్రయత్నములో
మనము
విఫలులమయ్యే
దానికంటే
చిత్తమనే
దానిని
శుద్ధమైన
అద్దముగా
తీసుకున్నప్పుడు
తన
ఆకారము
ఏ
ఆకారము
మారినాగాని
సుస్పష్టంగా
కనిపించటానికి
వీలవుతుంది.
కనుక,
చిత్తమును
శుద్ధి
చేసుకోవటమే
మనయొక్క
ప్రధానమైన
లక్ష్యముగా
మీరు
విశ్వసించాలి.
12
▾
Meaning
Keep
ఇట్టి
పవిత్రమైన
అద్దముగా
మన
చిత్తము
కావాలనుకున్నప్పుడు
ప్రేమ,
శ్రద్ధతో
కూడిన
భక్తి
ఈ
రెండింటి
ద్వారా
మనకు
లభ్యమవుతుంది.
కనుక,
ఇట్టి
పవిత్రమైన
ప్రేమను
పెంచుకొని
గోపికలు
గాని,
జయదేవుడుగాని,
గౌరాంగుడు
గాని
కృష్ణా
అని
ఉచ్చరించిన
తక్షణమే
తమ
యొక్క
దేహములు
తాము
మరచి
క్రిందపడిపోయేవారు.
కనుక
గౌరాంగుడనగా
తెల్లటి
వర్ణము
కలిగిన
వాడు
కనుక
అతనిని
గౌరాంగుడు
అని
పెట్టిన
పేరు.
కాని
కృష్ణనామమును
ఉచ్ఛరించిన
తక్షణమే
తన్మయత్వములో
క్రింద
కూలి
పోతుండే
వాడు.
కృష్ణా
అంటే
చైతన్యము
లేకుండా
పడిపోవటం
చేత
గౌరాంగుడు
కృష్ణ
చైతన్య
అనే
పేరులో
పిలువబడుతూ
వచ్చాడు.
ప్రేమతో
మన
యొక్క
దేహమును
కూడను
మరచే
దివ్యత్వాన్ని
అభివృద్ధి
పరచుకోవటానికి
పూనుకోవాలి.
ఇదియే
సమత్వానికి
తగిన
గుర్తుగా
ఉంటుంది.
కనుక
మీరందరు
కూడను
ఎవరిని
చూచినప్పటికిని
మీ
ఆరాధ్య
దైవమే
సర్వజీవులయందు
ఉంటున్నాడనే
విశ్వాసము
క్రమక్రమేణా
అభివృద్ధి
పరుచుకోండి.
ఒక్కతూరి
అది
బలపర్చటానికి
వీలుకాదు
కనుక
అట్టి
సమత్వాన్ని
అభ్యాసములో
అభివృద్ధి
పరచుకుంటారని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
Self-Confidence and the Vision of One's Own Svarūpa
Next
Friendship: Its Real Principle
→