Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Śraddhāvān Labhate Jñānam
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Śraddhāvān Labhate Jñānam
23 November 1973, Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
కలికాల
ప్రభావమువలన,
ధర్మద్వేషము
దైవద్వేషము
ప్రభుద్వేషము
పెరిగి,
భారతీయులు
తప్పులను
ఒప్పులుగానూ,
ఒప్పులను
తప్పులుగానూ
భావించి,
తమ
ప్రయాణమును
తప్పుత్రోవలో
సాగించుచున్నారు,
తమ
ఉద్దేశమునే
పవిత్రమని
విశ్వసించుచున్నారు.
ఇది
కలి
మహత్వమే
కానీ
వేరు
కాదు
సుఖ
దుఃఖములు
త్రిగుణాత్మకములు,
సాత్విక
గుణము
ప్రకాశశీలము
;
రాజసగుణము,
క్రియాశీలము
;
తామసగుణము
ఆ
రెండు
గుణములను
అణగద్రొక్కి,
అంధకారమునూ,
సోమరితనమునూ
అభివృద్ధిచేయును.
ప్రకాశశీలము
అధికముగా
ప్రకటింపబడి,
క్రియాశీలము
తక్కువగా
ఉంటే,
ఆ
అవస్థకు
సుఖమని
పేరు
;
క్రియాశీలమధికమై
ప్రకాశము
తక్కువవుంటే,
దుఃఖప్రకటన
సంభవించును.
సాత్వికము
రాజసము
రెండూ
అణగద్రొక్కబడి,
మోహము
మాత్రము
మానవుని
ఆవరించిన,
అపుడు
దుఃఖపరంపరకే
గురి
అగును.
గుణములకు
రెండు
ముఖములున్నవి
—
భోగముఖము,
అపవర్గముఖమని.
భోగముఖములో
అవి
సుఖ-దుఃఖములనే
ద్వందములలో
మానవుని
ముంచి,
జనన-మరణమనే
చక్రమందు
కట్టివేయును.
అపవర్గముఖములో,
అవి
ముక్తినొసంగును.
అయితే,
మానవుడు
ఇప్పుడు,
భోగాపవర్గముల
మధ్య
చిక్కి,
ఇక్కట్టులనుభవించుచున్నాడు.
మానవత్వానికే
దూరమై
దీనత్వమందు
కృశించిపోవుచున్నాడు.
దైవానుగ్రహమునకు
పాత్రుడు
కాక,
జీవితమును
వ్యర్థము
చేసుకొనుచున్నాడు.
ఈనాడు
దైవమును
నిర్ణయించుకోవటములో
కూడ,
కొన్ని
విచిత్రమైన
నడకలు
అనుసరింప
బడుచున్నవి.
తర్కము,
బుద్ధి
ప్రమాణములవలన
దైవమును
నిర్ణయించుకొనుటకు
సాధ్యమా
?
తనకు
అనుకూల
వాతావరణములేర్పడిన,
ఈశ్వరుడు
సర్వవ్యాపి.
సర్వశక్తుడు,
సర్వజ్ఞుడు
;
ప్రతికూల
వాతావరణమావరించిన,
ఈశ్వరుడు
సర్వవ్యాపకుడు
కాదు,
ఈశ్వరుడే
లేడు
అని
వాదించటము
కద్దు.
భారత
యుద్ధమందు
విజయము
ప్రాప్తించినపుడు,
కృష్ణుడు,
అర్జునుని
దృష్టిలో,
సర్వశక్తుడు.
“స్వామి
!
మీ
వలన
మాకు
విజయము
లభించినది
!”
అయితే
అభిమన్యు
మరణించినపుడు,
అదే
కృష్ణుడు
అదే
అర్జునుని
దృష్టిలో,
సర్వజ్ఞుడు,
సర్వశక్తుడు
కాదు
!
దీనికి
బుద్ధియొక్క
వికారమే
కదా,
కారణము
అయితే
ఈ
మార్పులు,
ఈ
చంచలత్వము
మనసుయొక్క
వికారస్వభావములే
కానీ,
బుద్ధియొక్క
స్వభావము
కాదు.
మనస్సు
బుద్ధిని
కూడ
దోషమయముగా
నిరూపించును.
చలించే
మనస్సు
అటు
ఇటు
బుద్ధిని
కూడ
చలింప
జేయుటకు
పూనుకొంటుంది.
అయితే,
యుక్తులతో
ప్రమాణసహితముగా
వాదించి,
బుద్ధిని
స్థిరనిశ్చయములోను
పెట్టి,
చలించక
ఉంచుకోవచ్చు.
ఈశ్వర
విశ్వాసమును
స్థిరనిర్ణయముగా
బుద్ధి
అంగీకరించిన
తరువాత,
యెవరు
యేమి
చెప్పిన,
హృదయ
స్థానమందు
దృఢముగానిలచును,
నిశ్చయ
బుద్ధి
లేని
వారికే
నిరంతరమూ
సందేహము.
2
▾
Meaning
Keep
అట్టి
స్థిర
నిశ్చయము
కలిగినవారే,
దైవానుగ్రహమునకర్హులు
!
ఈనాడు
కొంత
మంది
ఈశ్వరత్వాన్నే
తిరస్కరించి,
విరుద్ధ
కారణములను
కల్పించుకొని,
ప్రచారము
చేయుదురు.
వీరివలన,
భగవద్విశ్వాసము
సన్నగిల్లిపోవటములో
ఆశ్చర్యము
లేదు.
భార్యను
నమ్మని
భర్త,
భర్తను
నమ్మని
భార్య
తండ్రిని
నమ్మని
కొడుకు,
కొడుకుని
నమ్మని
తండ్రి,
గురువును
నమ్మని
శిష్యుడు,
శిష్యుని
నమ్మని
గురువు,
వీళ్లే
అధికమైన
ఈ
కాలమందు,
ఈశ్వరుని
నమ్మని
మంది
పెరుగుచున్నారంటే,
ఆశ్చర్యమేమీ
లేదు.
దివ్యాత్మ
స్వరూపులారా
!
బుద్ధియొక్క
శక్తి
అన్నిటికన్న
అతీతమైనది.
గీతలో
శ్రీ
కృష్ణుడు
“బుద్ధియే
నేను”
అని
శెలవిచ్చినాడు
;
దదామి
బుద్ధి
యోగం
తం”
అన్నాడు.
బుద్ధివలన
చలించే
మనస్సును
తీర్చి
దిద్ద
వీలగును.
దీనిని
నమ్ముకొని
సాధనామార్గమునవలంబించిన,
తప్పక,
మనసును
జయించవచ్చును.
ఈశ్వర
తత్వమును
శ్రీ
కృష్ణుడు
వెల్లడించుచూ,
“సమోహం
సర్వభూతేషు”
అన్నాడు
!
ఆయనకు
ఆగ్రహమూ
లేదు,
అనుగ్రహమూ
లేదు,
సుఖ
దుఃఖములు,
బంధమోక్షములు,
జనన
మరణములు
వీటిని
జీవులే
తమ
కర్మలవలన
సంపాదించుకొంటున్నారు.
అయితే,
మీకు
ఒక
సందేహము
కలుగవచ్చును
;
భగవంతుడు
“పరిత్రాణాయ
సాధూనాం
వినాశాయ
చ
దుష్కృతాం”
అని
శెలవిచ్చియున్నాడే
?
కొంతమందిని
సాధువులని
ప్రత్యేకించి
వారిని
ఆశీస్సులచే
ఆనందపరచేదేమి,
మరి
కొంతమందిని
దుష్టులని
దూరముచేసి
శిక్షించటమేమి,
ఇవి
ఆగ్రహానుగ్రహములకు
నిదర్శనము
కదా
?
అని
మీరడుగవచ్చు
అయితే,
అన్నీ
తనయందే
ఉద్భవించినవి,
అని
ఒప్పుకొన్న
తరువాత,
ఇంక
భేదభావములెల్ల
కలుగును?
దేహము
తనదే,
హస్తము
తనదే,
వ్రేళ్లు
తనవే,
ఆ
వ్రేళ్లలోని
గోరులూ
తనవే
!
అయినా,
వ్రేళ్లలోని
గోరులను
కత్తిరించుచున్నాము
కదా
?
కడుపు
తనదయిననూ,
కడుపులోని
మల
మూత్రములను
విసర్జించక
తప్పదు.
అట్లు
చేయకపోతే,
రోగములచే
దేహమునకే
అపాయము
కలుగును.
కొన్ని
పరిస్థితులలో,
రోగనివారణము
కొరకు
ఆపరేషన్
కూడ
చేయించుకోవలసి
వచ్చును.
ఆపరేషన్ల
వలన,
దుఃఖప్రాప్తియగునే
అని
దానిని
మానుట
సరికాదు
;
అది
వివేకియొక్క
లక్షణము
కాదు.
దుఃఖనివృత్తి
కొరకు,
తాత్కాలికమైన
ఆ
దుఃఖమును
అనుభవించియే
తీరాలి.
డాక్టర్లు
ఆ
మూలముగా
మనకు
ఉపకారమునే
చేయుదురు,
అపకారమును
కాదు
!
విశ్వమనే
దేహమందు
కౌరవులనే
క్యాన్సర్
పుండు
బయలుదేరినపుడు,
శ్రీ
కృష్ణుడు
అనే
డాక్టరు,
అర్జునుని
కాంపౌండరుగా
పెట్టుకొని,
కురుక్షేత్ర
యుద్ధము
అనే
ఆపరేషన్
చేసి,
లోకకల్యాణమును
సాధించి,
తన
క్రియాశక్తిని,
కరుణాస్వభావమును
ప్రకటించినాడు.
విషయవాసనలో
మునిగినంత
కాలము
యెది
మంచి
యెది
చెడ్డ,
అని
నిర్ణయించుట
సాధ్యము
కాదు;
మనస్తత్వమునకు
అట్టి
విచక్షణా
సామర్థ్యము
లేదు.
బుద్ధిని
అభివృద్ధి
చేసి,
చిత్తశుద్ధిని
సంపాదించి,
సత్శీలమును
పెంచుకొనిన,
క్రమ
క్రమేణ
అనసూయాభావము
దృఢమగును
;
నిజస్వరూపమైన
దివ్యత్వము
ప్రకాశించును.
అన్ని
జీవులనూ
యేకత్వముగా,
భావించిన,
మానవుడు
భగవంతునికి
కేవలము
సన్నిహితుడు
కాగలడు.
3
▾
Meaning
Keep
ముఖ్యముగా,
చలించే
మనస్సుకు,
భ్రమించే
దృష్టికి,
అంత్య
మొనరించాలి,
పెండ్లి
నిర్ణయించవలెనన్న,
ఈనాడు,
అమ్మాయి
అబ్బాయి,
ఇద్దరి
సౌందర్యములను
చూచి,
ఒక
అభిప్రాయమునకు
వస్తారు.
తరువాత
వారి
ఆస్తిపాస్తుల
విషయాలను
విచారణ
చేస్తారు.
ఆ
తరువాత,
వారిరువురి
విద్యా,
వారి
శీలము,
వారి
కులాలు
వీటిని
పరికిస్తారు
అంటే,
కేవలము
బాహ్య
విషయములనే
విచారించి
జంట
కలపటానికి
ప్రయత్నము
చేయుదురన్న
మాట
!
బాహ్య
ఆకర్షణలచే
భ్రాంతిపడి,
జీవితమును
కుక్కలవలె
జరుపుకొంటున్నారు,
బహుమంది.
ఇవన్నీ
స్థూలమైన
ఆధారములే
!
వాటిపై
దాంపత్య
జీవనమును
స్థాపించిన,
అది
నిత్య
సత్యముగా,
నిశ్చల
నిర్మలముగా,
నిలవదు.
అవన్నీ
తాత్కాలికము,
లోకసంబంధమైనవి.
అంటే,
వాటిని
అలక్ష్యము
చేయమని
చెప్పలేదు.
వాటికన్న
గుణసామ్యత,
సత్శీలము,
సత్ప్రవర్తనలపై
అభిలాష
;
ఆత్మవిశ్వాసము,
హృదయ
పరిశుద్ధత.
ఇవి
ముఖ్యమని
గమనించవలెను.
దైవారాధన
కూడ
ఇట్టిదే.
అభీష్టాలనివృత్తిపై,
ప్రేమ
విశ్వాసములను
యే
మాత్రమూ
పెట్టకూడదు.
అభీష్టాలు
నెరవేరకపోతే,
ఆరాధనను
విసర్జించకూడదు.
ఈనాడు
దైవ
విశ్వాసము
ఒక
ఫ్యాషన్‌గా
మారిపోయినది.
“రాత్రి
నా
స్వప్నములో
రావాలి
!
వస్తివా,
నువ్వు
సాయిబాబా
!
రాలేదా
?
నువ్వు
సాయిబాబా
కాదు,
రాయిబాబా
!!.”
ఆరాధించినపుడు
సాయిబాబా,
లేనపుడు
ఇంకొకడు
అనే
పరివర్తన,
నాలో
లేదు
!
నేనెపుడూ
సాయిబాబానే
!
ఆరాధన
అనిన,
ఇది
కాదు.
ఈ
మార్గములో
ప్రయాణము
సలిపిన,
అన్నీ
వ్యర్థమే
;
ఎన్ని
కష్టములు
నష్టములు
దుఃఖములు
బాధలు,
విచారములు
వచ్చినా,
విశ్వాసమును
మాత్రం
కదలక
మెదలక
దృఢముగా
వుంచుకోవలెను.
అదే
భక్తి
అదే
నిజమైన
ప్రపత్తి.
ఆత్మస్వరూపము
చిత్తమందు
హత్తుకొనిన,
దుఃఖముండదు.
భగవంతుని
ఆధారము
చేసుకొని,
అన్ని
క్రియలలోనూ
ప్రవేశించాలి.
పవిత్ర
ప్రేమచే
పరమాత్ముని
చేరాలి.
సుఖదుఃఖములకు
మనస్సే
కారణమని
తెలుసుకొని,
దానిని
పరిశుద్ధముగా
తీర్చి
దిద్దితే,
ఫలముకూడ
పరిశుద్ధమగును.
సుఖదుఃఖములను
మీకు
అందించేది,
భగవంతుడు
కాదు.
పరులు
కూడ
కారు.
సర్వములకూ
కారణము
మీ
మీ
మనస్సే
!
కాబట్టి,
ఆ
మనస్సును
మాధవునిపై
మరల్చితే,
సర్వక్షేమములూ
చేకూరును.
మనస్సును
విశాలభావముతో
నింపవలెను;
సర్వ
భూత
హితే
రతాః,
అన్నాడు
కృష్ణుడు,
గీతలో.
యెవరికి
యేరీతిగాను
కీడుచేయక,
బాధ
నందించక,
జాగ్రత్తగా
జీవించాలి.
ఉపకారము
చేయుట
చేతకాకపోతే,
అపకారము
చేయకుండిన
అంతేచాలు;
అదే
పెద్ద
ఉపకారము
చేసినట్టు
!
కర్మలనుకూడ
వివేక
వైరాగ్యములతో
చేయుటకభ్యసించవలెను.
అభీష్టవస్తువులను
సంపాదించేకొరకు,
అనిష్టవస్తువులను
త్యజించుటకు,
ఈ
రెండుద్దేశములె
మానవుని
కర్మలలో
ప్రవేశపెట్టుచున్నవి.
అంటే
ఆనందప్రాప్తి,
దుఃఖనివృత్తి.
ఆనందప్రాప్తికి
ప్రాకులాడేవారు
భక్తులేకారు,
ప్రతివ్యక్తికీ,
జీవికీ,
ఆనందమును
పొందాలి
అనేఆశ
ఆవేదన
ఉన్నది.
అయితే
సక్రమమార్గము
ననుసరించక
వక్రమమార్గములో
పడి
దుఃఖములకు
గురియగుచున్నారు,
అంతే.
ఫలమునాశించక,
కర్తవ్యదృష్టితో
కాయమును
కాలమును
సదుపయోగపరచిన,
అదే
అతిపవిత్రమైన
సక్రమమార్గము.
4
▾
Meaning
Keep
అన్ని
కర్మలనూ
తృష్ణార్పితముగా
ఆచరించక,
కృష్ణార్పణముగా
నిర్వర్తించిన,
అదే
భక్తిగా
మారును.
రమణీయమైన,
విజాతీయమైన,
ఉత్కృష్టమైన
వస్తువందు
నిలబెట్టిన
పరిశుద్ధ
ప్రేమయే,
భక్తి.
ఉత్కృష్టమైన,
అంటే,
మార్పుచెందనది,
అని
తాత్పర్యము.
ప్రేమకూడ
అంతే;
కాలము
స్థానము
పరిస్థితి
వీటిననుసరించి,
మార్పుచెందనదిగా
వుండాలి.
గీతలో
దీనికి
సమచిత్తము
అని
పేరు.
శీతోష్ణములు,
సుఖదుఃఖములు,
నిందాస్తుతులు,
మొదలైన
ద్వందములు
ఆ
ప్రేమను
యేమాత్రమూ
కదలించవు.
యోగః
కర్మసు
కౌశలం,
అన్నాడు.
కర్మయోగము
కానీ
భక్తియోగముకానీ
జ్ఞానయోగముకానీ,
కర్మముల
ద్వారా
ఏకత్వమును
సాధించి
దుఃఖనివృత్తి
ఆనందప్రాప్తి
వీటిని
పొందుటలో
ఫలసిద్ధినొందును.
ఒక
వృక్షము
పెరిగే
రీతిని
పరీక్షించండి.
ప్రథమతః,
మొదలు,
తరువాత
కొమ్మలు
రెమ్మలు,
తరువాత
పుష్పములు,
తరువాత
కాయలు,
పండ్లు
అట్లనే,
ఈ
జీవితవృక్షములకు
కర్మనే
మొదలు;
భక్తియే
కొమ్మలు
రెమ్మలు
సుగంధమును
వెదజల్లు
సుమములు;
జ్ఞానమే,
పండ్లు,
వాటిలోని
మాధుర్యము.
జ్ఞానఫలంలేని
కర్మకానీ
భక్తికానీ
హాస్యాస్పదమైన
చర్యలే.
కర్మ
భక్తిలేని
జ్ఞానము
కూడ
శుష్కవేదాంతమే
!
భక్తిఅనే
మార్గములో
సగుణభక్తి
నిర్గుణభక్తి
అని
రెండు
విధములున్నవి.
తాను
అన్యుడు,
పరమాత్మ
అన్యుడు
అనే
భావమునందు,
అనేకరకములైన
ఆరాధనాకలాపము
నాశ్రయించి
ఆ
పరమాత్ముని
అనుగ్రహమునార్జించుటకు
ప్రయత్నము
చేయుదురు.
ఇదొక
రీతి.
పరమాత్మలో
తన
వ్యక్తిత్వమును
కలిపి
సర్వభూతములందు
ఏకత్వము
దివ్యత్వము
సచ్చిదానందమును
ప్రత్యక్షముగా
అనుభవించి
ఆనందించేది
నిర్గుణభక్తి.
చక్కెరతో
చేయబడిన
రకరకాల
బొమ్మలను
పిల్లలకమ్ముతావుంటారు,
కొంతమంది,
ఊరులో,
స్కూల్
గేటు
దగ్గర
నిలచుకొని
అమ్ముతారు.
ఒక్కొక్క
పిల్లవాడు
ఒకొక
ఆకారమును
ఆశించి
ధనమిచ్చి
తెచ్చి
ఆనందపడుతాడు.
అట్లే
తన
ఇష్టదేవతను
సాకారముగా
సగుణ
స్వరూపుడుగా
ఆరాధిస్తూ
వుంటాడు
సగుణభక్తుడు
అన్ని
బొమ్మలలోనూ
ప్రకాశించే
చక్కెరను
పురస్కరించి,
ఆ
ఏకత్వమునే
చింతించి
ఆనందపడి
దుఃఖనివృత్తి
నొందువాడు,
మరొకడు,
నిర్గుణభక్తుడు.
చక్కెరలో
భేదము
లేదు;
రూపనామములవలన
భేదములు
అనే
భ్రమ
ఉత్పత్తియగును
అంతే.
భారతీయ
సంస్కృతిలో
యజ్ఞయాగాదులకు
ఒక
ముఖ్యస్థానమున్నది.
యజ్ఞముల
నాచరించినపుడు,
సోమపా,
అనే
ఒక
క్రియను
చేయవలసియున్నది;
దానికి
ఎన్నో
విధివిధానములు
నిబంధనలు
కూడ
ఉన్నవి.
దీని
అంతరార్థమును
చక్కగా
గమనించవలెను.
సోమ
అంటే
చంద్రుడు.
పా
అంటే
త్రాగటము
!
చంద్రుణ్ణి
ఎట్ల
త్రాగటము
?
ఇది
సమన్వయము
కాదే
?
అని
భ్రమింపనక్కరలేదు.
ఎందుకనిన,
చంద్రుడు
అంటే,
చంద్రుడే
అధిష్ఠానముగా
వున్న
“మనస్సు”.
“చంద్రమా
మనసో
జాతః”
చంద్రునికీ
మనస్సుకూ
నికట
సంబంధమున్నది.
చంద్రుణ్ణి
త్రాగటము
అంటే,
విచ్చలవిడిగా
సంచరించే
మనస్సును
అరికట్టి
తాను
జయించేది,
అనేదే
అంతరార్థము
మనస్సును
నిగ్రహించిన,
యజ్ఞయాగాదులకర్హుడు
కాగలడు.
మనో
నిగ్రహములేక,
కర్మలాచరించిన,
అవి
నిరర్థక
కర్మలే
!
5
▾
Meaning
Keep
మనస్సును
అరికట్టుటకు,
నామస్మరణ
చాలా
సులభమైన
మార్గము,
సర్వభూతములందు
సర్వాత్మకుడైన
భగవంతుని
లీలా
గుణగణములను
కీర్తించి
ఆనందించితే
మనస్సు
పరిశుద్ధమగును,
సాత్వికమగును.
దానితోపాటు,
సాత్వికమైన
ఆహారమును
కూడ
భుజించవలెను.
మానవులకు
జిహ్వ
ఒకటే
కాదు
ఇంద్రియము
;
పంచేంద్రియములతోనూ
మానవుడు
ఆహారము
నందుకొంటున్నాడు.
చెవులతో
వినేది
ఆహారమే,
ముక్కుతో
వాసన
నందుకొనేది
ఆహారమే,
కన్నులతో
చూచేది
ఆహారమే,
చర్మముతో
స్పృశించేది
కూడ
ఆహారమే
ఇవన్నీ
సాత్వికాహారముగా
వుండాలి.
మంచి
శ్రవణము,
మంచి
దృష్టి,
మంచి
పలుకు,
మంచి
రుచి,
మంచి
స్పర్శల
నాశించి
పొందవలెను.
మనో
నిగ్రహమునకు
జన
సామాన్యముయొక్క
సంచారములేని
ఏకాంతమందు,
ప్రకృతి
సౌందర్యముతో
ఆకర్షించు
అందమైన
వాతావరణము
ఉత్సాహము
నందించును.
అయితే,
ఎంత
కాలము
ఈ
ఏకాంతవాస
మవసరము
?
ఇంటిలో
ప్రమిదను
వెలిగించితే,
గాలి
వచ్చినపుడు,
కిటికీలను
వాకిలిని
మూసివేస్తాము;
గాలి
అణగిన
తరువాత,
దీపమునకు
అవాంతరము
కలుగదు
కాబట్టి,
వాటిని
తెరచినా
భయము
లేదు.
దేహమనే
దేవాలయమందు,
జీవుడనే
జ్యోతి
వెలుగుతున్నది.
దైవత్వము
దాని
ప్రకాశము.
ప్రకృతి
భావమనే
గాలి
ఆ
దీపమును
ఆర్పక,
ఇంద్రియములనే
కిటికీలను
భద్రముగా
మూసివేయాలి.
అంటే,
విషయసంబంధమైన
రాగములు
వాంఛలు
ఉన్నంతవరకూ
ఏకాంతవాసం
అవసరమే.
అవి
చల్లబడిన
తరువాత,
ఈ
అనేకత్వములోనూ,
ఏకత్వమును
సాక్షాత్కరించి
ఆనందాన్ని
అనుభవించుకొనుట
కవకాశమున్నది
కలి
ప్రభావమో,
ఏమో
?
ఈనాడు
బజారులో
గుంపులమధ్య
ఆసనము
వేసుకొని,
ధ్యానం
చేయు
మంది
బయలుదేరారు
!
తన్ను
పదిమంది
పరమభక్తుడుగా
పరిగణించాలి
అనే
వాంఛయే
దీనికి
కారణము.
ఇట్టి
ప్రదర్శనముల
వలన,
కలుగు
ఆదాయమేమియూ
లేదు.
ధ్యానమును
పరులకు
తెలియక
ఏకాంత
స్థానమందు
సలుపవలెను.
పరుల
మెప్పుకై
పాటుపడక,
పరమాత్ముని
మెప్పుకై
పాటుపడవలెను.
ముఖ్యముగా,
హృదయ
మాలిన్యమును
పోగొట్టుకోవలెను.
అన్ని
సాధనల
ఉద్దేశము
ఇదియే.
ఇతరుల
మాలిన్యమును
దోషములను
నిరంతరమూ
పరికించితే,
మీలోని
మాలిన్యము
ఎక్కువగును.
వారి
చెడ్డను,
వారి
తప్పులను
చూడక,
తలంచక,
వారిని
గురించి
చెప్పక,
మీ
మీ
దోషములనే
పరికించి
సరిదిద్దుకోవలెను
తెలిసి
తెలియక
యెవరినైనా
నిందించిన,
తక్షణమే
పశ్చాత్తాపముతో
ప్రాయశ్చిత్త
మొనరించి
మంచి
మాటలచే
వాని
దిద్దుటకు
పూనుకోవలెను.
అప్పుడు,
ఆ
చెడ్డవాడు
మంచిగా
మారుతాడు.
వాని
ఆక్షేపణలతో
క్రుంగింప
జేయకూడదు.
ఇతరులను
ఆక్షేపణచేసితే,
మనము
అల్పులమైపోతాము;
అధికులము
కాము
!
పరులను
దూషించేది
ఏమి
అంత
ఘనకార్యమా
?
పరులను
నొప్పించిన,
మీ
దూషణ
పలుకులన్నీ
మీ
అంత్యకాలములో
మీచుట్టూ
నాట్యమాడును.
జీవిత
కాలములోని
ప్రతికర్మ
అంత్యకాలమునందు
ఆధారముగా
ఆదర్శముగా
నిలచును.
ఆక్షేపణాజీవితం
వ్యర్థజీవితం.
మీరు
ధ్యాన
జపాదులను
చేయకపోయిననూ
పరవాలేదు
;
భజన
చేయకుండిననూ
పరవాలేదు.
పరులను
నిందించక,
హేళనచేయక,
బాధించక
జీవితమును
సాగించిన,
అంతేచాలు,
అదే
పెద్ద
సాధన.
మీ
మనస్సులో
ఏదోషమూ
లేనపుడే,
ఇతరుల
దోషములను
చూపెట్టుటకు
మీకు
అర్హత.
6
▾
Meaning
Keep
అది
లేక,
పరులను
దూషించేది,
హీనమే
కానీ,
మంచిది
కాదు.
తెల్లవారిన
మొదలు
పరుండేవరకు,
జీవితమును
ప్రేమ
మయముగా
మార్చండి.
ప్రేమ
మయమన్న,
పరమాత్మ
మయమే
కానీ
వేరుకాదు.
ధ్యానములో
కూర్చున్నంత
కాలము
పవిత్రత
శాంతి
ననుభవించి,
తరువాత
మరొక
స్థానమందు
దుర్వాసులుగా
మారితే
ప్రయోజనము
లేదు.
అది
భక్తికి
లక్షణము
కాదు.
ధ్యానమునకు
ఫలితమేమి
?
‘సతతం
యోగినః’
అని
గీత
ప్రబోధించుచున్నది.
“సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరి
చింతనం”
అనేది
ఆర్షబోధ.
నామజపము
రూపధ్యానము
వీటిని
సతతమూ
సలుపుటకు
ఈనాటినుంచి
ప్రయత్నము
చేయండి.
“శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం”
అణుమాత్రం
అగ్గినిప్పు
దొరకితే,
శ్రద్ధవలన
దానిని
అధికముగా
అభివృద్ధి
చేసుకొనవచ్చు.
అయితే
శ్రద్ధలేనివానికి,
ప్రజ్వలించే
అగ్గిదొరకినకూడ,
దానిని
ఆర్పివేసుకొంటాడు
!
గురిపై
విశ్వాసము
దృఢమైనపుడు,
శ్రద్ధ
సునాయాసముగా
బలపడును.
దైవవిశ్వాసము,
ఆత్మవిశ్వాసము
వీటిని
సత్సంగములద్వారా,
పెద్దల
సద్బోధవలన,
శాస్త్రాభ్యాసమువలన,
పెంచికొని,
తరించండి.
Previous
←
Body without heart
Next
Words of Blessing
→