Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · Bal Vikas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Bal Vikas
3 January 1974, Conference of Bal Vikas teachers, Rajahmundry
1
▾
Meaning
Keep
ధనసంబంధము
విద్యనుంచి
వినయమును
పొందవలెను
;
వినయము
వలన,
పాత్రత
కలుగును,
పాత్రతనుంచి
ధనమునార్జింప
వీలగును.
ధనమును
వినియోగించిన,
ధర్మము
పెరుగును.
ధర్మము
వలన,
ఐహికాముష్మిక
ఫలములను
సంపాదింప
సాధ్యమగును.
అయితే,
రాను
రాను,
అన్ని
సంస్థలయందు
అన్ని
క్షేత్రములయందూ
సంస్కరణమనే
పేరున
రకరకములైన
కూర్పులు
మార్పులు
ఏర్పడి,
వికార
స్వరూపముగా
బయలుదేరుచున్నవి
విద్యా
రంగమునందు
కూడ
ఇట్టి
సంస్కరణల
ప్రభావము
వలన,
విద్యయొక్క
నిజార్థమునే
మరపించి,
మానవత్వమునే
మరుగుపరచి,
విషయ
సమాచార
శేకరణ
మాత్రమే
ముఖ్యలక్ష్యముగా
భావించి,
ఆధ్యాత్మిక
తత్త్వ
ప్రబోధను
సంపూర్ణముగా
విసర్జించటము
జరిగినది.
ఆ
నాటి
విద్యా
ప్రబోధమునకు
ఈ
నాటి
విద్యాప్రచారము
చాలా
విరుద్ధముగా
కనబడును.
ఈ
నాడు,
ప్రతి
వ్యక్తి
ఆ
యా
నెలకు
తాను
చెల్లించవలసిన
ధనమును
చెల్లించక
పోతే,
విద్యను
అందుకో
అర్హతను
కోల్పోవుచున్నాడు.
అధ్యాపకులు
కూడ,
నెల
నెలకు
తమ
జీతమును
అందుకొని,
విద్యను
అందింతురు,
కాబట్టి,
ఏదైన
ఒక
నెలకు
జీతము
అందకపోతే,
ఆ
నెల
పూర్తి
విద్యను
అందించలేక
పోతున్నారు.
ధనమిచ్చి
విద్యనందుకొనే
విద్యార్థులు,
ధనము
పుచ్చుకొని
విద్యనందించే
అధ్యాపకులు,
ఈ
విధముగా
విద్యాబోధ
జరిగితే,
దానిలో
ప్రేమకు
స్థానమెక్కడ
దొరకును
?
గోకాక్
చెప్పినాడు
:
బిడ్డలను
మనము
ప్రేమించిన,
బిడ్డలు
మమ్ములను
ప్రేమింతురు,
అని,
ప్రేమనే
అధ్యాపకులకు
విద్యార్థులకూ
మధ్య
ఉండవలసిన
బంధము
;
ధనము
కొరకు,
ఒక
పదార్థము
నిమిత్తమై
ప్రేమించిన,
అది
కృత్రిమమైన
భావముగా
మారును.
దానివలన,
పదార్థమే
దొరకును
కానీ
ఆనందము
దొరకదు.
ప్రేమనిమిత్తమై
ప్రేమించిన,
ఆ
ప్రేమ
నిర్మలముగా
నిశ్చలముగా
నిస్వార్థముగా
నిలుచును.
విద్య-వికాసము
బాల
వికాస్
తరగతులలో
మీరు
ధననిమిత్తమై
విద్యను
బోధించువారు
కారు
కాబట్టి,
పిల్లల
హృదయమును
వికసింపజేయుటకు
మీకు
అధికారము
అవకాశము
ఎంతైనా
వున్నవి.
సామాన్యముగా
ఈ
నాటి
అధ్యాపకులందరూ
పాశ్చాత్య
విద్యలనభ్యసించినవారు
కాబట్టి,
వారికి
ఆధ్యాత్మికముయొక్క
అర్థమే
తెలియదు
;
వారిలో
స్వార్థమే
అభివృద్ధియైవుండును
;
నాస్తికత్వమునకే
వారి
భావములు
వాలును.
అయితే,
విద్య
అనే
పదముయొక్క
అంతరార్థమును
మీరు
గుర్తించి
దానికి
తగిన
రీతిగా
వర్తించవలెను.
మానవత్వములో
అంతర్గతమైన
దైవత్వమును
తెలిపి
వికసింపజేసేదే
సరైన
విద్య.
భారతీయ
సంస్కృతియొక్క
సారమే
ఇది.
2
▾
Meaning
Keep
పిల్లలు
భారతమాతయొక్క
ఉత్తమ
పుత్రులుగా
భారతీయ
సంస్కృతికి
వారసులుగా
మెలుగవలెనన్న,
ఆధ్యాత్మిక
చింతనలు,
పలుకులు,
ప్రవర్తనలు,
వారిలో
అభివృద్ధి
కావలెను.
మ్యాథమాటిక్స్
చక్కగా
పఠించిన
ఫలమేమి,
గణితము
తెలియనియెడల
?
అమెరికా
దేశమునకు
మార్గము
చూపింతురు,
అయితే,
కాశికా
మార్గమును
కానరారు
!
ఆల్జిబ్రా
ఎరుగుదురు
కానీ
ఈ
నాటి
విద్యావంతులు
యువకులు,
ఇంటి
వైశాల్యము
నెరుగరు
!
డ్రిల్
చేస్తారు,
దినమూ
!
అయితే,
పద్మాసనమును
వెయ్యాలంటే
బాధపడుదురు.
వృక్షశాస్త్రమందు
ప్రవీణులు
;
అయితే,
తులసి
ఉపయోగము
తెలియదు.
నక్కల
కుక్కల
డ్రాయింగ్
బాగా
వ్రాయుదురు,
అయిననూ,
అక్షరములను
గుండ్రముగ
వ్రాయబోరు.
ఇట్టివారి
బోధవలన,
భారతీయ
సంస్కృతి
అభివృద్ధి
అగునని
ఎట్లు
నమ్మేది
?
అధ్యాపకులు
విద్యయొక్క
తత్త్వమును
తెలుసుకొని
బాల
బాలికల
లేత
మనస్సులలో
ఉత్తమ
భావము,
అనుసరణీయ
మార్గము,
దృఢ
విశ్వాసములను
హృదయపూర్వకముగా
బోధించవలెను.
బాల
వికాస్
విద్యార్థులయందు,
ఈ
నాడు
ఎంత
ఉత్సాహము
ఉవ్విళ్ళూరుచున్నది,
వారి
అధ్యాపకులందు
కూడ,
ఎంత
పవిత్రమైన
ఉత్సాహమున్నది,
అనేది
నాకు
తెలుసు
అయితే,
అధ్యాపకులు
మాత్రము,
విద్యను
బోధించవలసిన
విధానములను
బాగా
నేర్చుకోవలసియున్నది.
పూర్వమందు,
స్వార్థరహిత
భావముతో,
అధ్యాపకులు
పిల్లలకు
పద్యములను,
పద
స్పష్టతతో,
ఒక్కొక్క
పదమును
చక్కగా
పలుకు
రీతి,
దాని
ధాతురూపము
సహితము,
కంఠస్థము
చేయించువారు.
సః,
త్వం
అనే
పదముల
అర్థము
మాత్రము
కాదు
;
ఆ
పదములు
ఏ
ధాతువునుంచి
వచ్చినవి
అని
కూడ
బోధింతురు.
ఈ
నాడు,
అట్లు
చేసితే
ఆ
రీతి
నేర్చుకోవటము
పిల్లలకు
శ్రమము
అని
తలంచి,
లేక,
అధ్యాపకులకు
ఆ
విషయమే
తెలియదు
అనే
కారణమును
పురస్కరించుకొని,
ధాతురూపములను
చెప్పటము
లేదు.
కాబట్టి
ఏదైన
కఠినమైన
శ్లోకములను
చదువమంటె,
పిల్లలు
తబ్బిబ్బై
పోతున్నారు
అంతే
కాదు,
ఎక్కడనుంచి
ప్రారంభించాలి,
ఎక్కడ
నిలపాలి
అని
తెలియక,
నానార్థములో
పడి
అపార్థము
చేసి,
చదివినదంతా
వ్యర్థమని
నిరూపింతురు.
అక్షరజ్ఞానము
చింతకు
పులుసు
లేదు
ఎర్రచీమకు
తొండము
కద్దు,
అనే
ఒక
శ్లోకమును
ఎక్కడ
విభజించాలి
అని
తెలియక,
చింతకు
పులుసు
లేదు,
ఎర్రచీమకు
తొండము
కద్దు,
అని
అర్థము
చేసుకొనిన,
ఎంత
హాస్యాస్పదముగా
వుండును
!
చింతకు
పులుసు,
లేదు
ఎర్రచీమకు
తొండము,
అనేది
ఆ
శ్లోకమును
చదువుటకు
సరైన
రీతి.
రామునితోకపివరుడిట్లనియె,
అనే
వాక్యమును,
రామునితోక,
పివరుడిట్లనియె,
అని
విభజించి,
ఒక
అధ్యాపకుడు
పివరుడు
అంటే,
ఎవరని
తికమకలో
పడినాడట
!
విషయ
వాసనలు,
సంతపకోడీలవంటివి,
పదార్థము
చెడ్డది.
ఆకర్షణ
చాలా
గొప్పది,
అనినేను
వ్రాసితే,
తెలుగు
తెలియని
మా
కస్తూరి,
ఆ
మాటయొక్క
అర్థము
తెలియక,
(కోడీలు
అంటే
ఆయనకు
తెలుసు;
సంతప
అంటే
ఏమి
అని
తెలియక
శ్రమపడి)
సంతప
కోడీలు
అని
సనాతన
సారథిలో
అచ్చు
వేయించినాడు.
అక్షర
స్వరూపమును
కూడ
చక్కగా
నేర్చుకోవటము
చాలా
అవసరము.
శ్రీరామచంద్రుడు
ఋషికోటికి
ఆధ్యాత్మిక
విషయములను
ప్రబోధించినాడు,
అని
నేను
వ్రాసి
ఇచ్చిన,
ఋషి
అనే
దానిలో
త్వరత్వరగా
వ్రాసినపుడు
స్వామి
కొమ్మొకటిని
ఎక్కువ
వ్రాశారే
అని,
కస్తూరి
(ఆయనకు
తెలుగు
అక్షరముల
స్వరూపము
అంత
బాగ
తెలియదు)
దానిని
కొట్టివేసి,
బుషికోటి
అని
అచ్చువేయించాడు.
3
▾
Meaning
Keep
దానిని
చదివి
ఎంతోమంది
పండితులు
కూడ,
నాకు,
“స్వామి
!
శ్రీరామచంద్రుని
అవతార
కాలమందు
బుష్కోట్లు
ధరించిరా
?”
అని
ప్రశ్నించిరి.
బాలవికాస్
పిల్లలచే
మీరు
శబ్దములను
స్పష్టముగా
పలికించాలి,
సమాసములను
విడదీసి
చదువుటకు
నేర్పించాలి,
అక్షర
స్వరూపములను
కూడ
చక్కగా
బోధించాలి.
అప్పుడే
వారు,
ఇట్టి
ప్రమాదములు
లేక,
వాక్యములనూ
శ్లోకములనూ,
చదివి
అర్థము
చేసుకోగలరు.
మరొక
విషయము.
ఈనాడు
మన
పవిత్ర
గ్రంథములకు
విరుద్ధమైన
అర్థములను
కల్పించి,
తప్పు
నిర్ణయములను
ప్రబోధించే
పాఠములు
కూడ,
పిల్లల
పుస్తకములలో
ప్రకటమగుచున్నవి.
రామాయణము
నిజముగా
జరిగినదా,
దశరథుడు
రావణుడు
అనే
వ్యక్తులు
జన్మించి
జీవించిరా,
అనే
సందేహములను
కూడ
ప్రచారముచేయు
పాఠ్య
పుస్తకములు
బయలుదేరినాయి.
రామాయణము
అనేది
నాగరికులైన
ఆర్యులకూ
అనాగరికులైన
అనార్యులకూ
జరిగిన
కలహముల
కథ
అనికూడ
వ్రాస్తున్నారు.
దీనివలన,
విద్యార్థుల
హృదయములు
చాలా
ఛిన్నాభిన్నమై,
వారు
సత్యమునే
ధర్మమునే
గుర్తింపలేని
స్థితిని
చెందుచున్నారు.
పిల్లలకు
బోధించే
విషయములు,
సూక్తులు,
రీతినీతులు
లోక
కల్యాణమునకు,
సమాజ
భద్రతకు,
వ్యక్తియొక్క
ఆధ్యాత్మికాభివృద్ధికి
ప్రోత్సాహకరముగా
వున్నవా,
లేవా,
అని
అధ్యాపకులూ,
తల్లిదండ్రులూ
జాగ్రత్తగా
పరిశీలించాలి.
దీనినే
ప్రహ్లాదుడు,
“చక్రహస్తుని
ప్రకటించు
చదువు,
చదువు
!
కుంభినీధవుని
చెప్పెడి
గురువు,
గురువు
!
హరి
చేరుమనె
తండ్రి,
తండ్రి
!”
అని
స్పష్టము
చేసినాడు
గురు—శిల్పి
కొండలలో
గుట్టలలో
ఎన్నోరాళ్లు,
పనికిరానివి,
పడివుంటాయి.
ఒక
శిల్పి
వాటిని
గమనించి,
ఏబండ,
ఏగుండు
ఏవిధముగా
ఏపదార్థముగా
పనికివచ్చును,
దేనికి
వుపయోగించవచ్చునని,
యోచించి,
వాటిని
అందుకొంటాడు.
కొన్నింటిని,
రుబ్బు
గుండ్లుగా
తయారుచేసి
సంసారులకు
విక్రయము
చేస్తాడు;
కొన్ని
రాళ్లను
వాటి
స్వరూపస్వభావములననుసరించి
వికార
రూపముగనే
ఉంచి,
దృష్టిబొమ్మగా
చెక్కి,
పెట్టుతాడు.
శుద్ధమైన
రాతిపై
తన
విద్యనంత
ధారపోసి
సుందరముగా
మార్చి
ఆశ్చర్యమైన
విగ్రహముగా
తీర్చిదిద్ది,
మ్యూజియములో
పెట్టుతాడు;
ఆధ్యాత్మికాదర్శముగల
శిల్పి
పవిత్ర
భావముతో
ఆ
కొండలోని
బండ్లను
రాముడు,
కృష్ణుడు,
శివుడు,
దుర్గా
మొదలైన
దేవ
విగ్రహములుగా
చెక్కి,
దేవాలయములలో
ప్రతిష్ఠింపజేసి,
వాటికి
అఖండముగా
ఆస్తికులచే
ఆరాధన
ఆరతి
నైవేద్యాదులనందిస్తాడు.
అన్ని
రాళ్లు
ఒక
కొండయందు
పుట్టినవే
!
అయిననూ,
వాటికి
రకరకములైన
సేవాభాగ్యము,
ఉపయోగము
దొరికినది
ఎవరి
వలన
?
శిల్పియొక్క
శక్తిసామర్థ్యములే,
శ్రద్ధాభక్తులే,
దానికి
కారణము.
అధ్యాపకులు
ఈ
శిల్పి
వంటి
వారు.
పిల్లలలో
ఎవరెవరికి
ఏ
ఏ
మార్గమును,
ఎవరెవరికి
ఏ
ఏ
రూపము
నందించాలి
అని
మీరే
వివేక
విచక్షణాలచే
నిర్ణయించి
కార్యసిద్ధికి
కావలసిన
ప్రయత్నములు
సలుపవలెను.
అయితే,
విద్యాభ్యాసమనేది,
కేవలము
శిల్పియొక్క
తత్వము
మాత్రము
కాదు.
పిల్లలను
తీర్చి
దిద్దటములో,
తల్లిదండ్రులు
కూడ,
శ్రద్ధవహించాలి.
4
▾
Meaning
Keep
దైవమునకు
కూడ,
తన
సంకల్పముతో
భక్తుని
కర్మ
కూడ
చేరినపుడే,
జయమును
సాధించు
అవకాశము
!
పాసిటివ్
నెగటివ్
రెండూ
చేరినపుడే
కదా,
కరెంట్
ఉత్పత్తి.
పూలు,
సూది,
దారము,
మూడు
వుండిననూ
కుట్టేవాడొకడు
లేక,
మాల
యెట్లు
తయారగును
?
ప్రమిద,
నూనె
వత్తి
మూడు
వుండిననూ,
ముట్టించేవాడు
లేక
దీపము
ఎట్లు
వెలుగును
?
గురువులున్నారు,
శిష్యులూవున్నారు.
సద్భావము,
సత్శిక్షణ
లేక
వ్యక్తి,
సమాజము
ఎట్లు
అభివృద్ధియగును
?
మీరందరూ,
సహనముచే,
సాధనా
భావముతో,
ప్రబోధ
సలుపే
సంకల్పమునకు
పూనుకోవాలి.
బోధించిన
విషయమును
పిల్లలు
తక్షణమే
అర్థము
చేసుకొనక
పోతే
విఫలప్రయత్నము
వలన
మీలో
ఉద్రేకముండకూడదు.
శాంత
మనస్సుతో,
పది
పర్యాయము
వారికర్థము
కానట్టి
విషయమును
బోధించవలెను.
శిష్యులకు
గురువుపై
భక్తి
ఉండవలెనన్న,
గురువులకు
శిష్యులపై
వాత్సల్యము
కూడ
ఉండవలెను
కదా
?
గురు
శబ్దము
గురువుయొక్క
దైవిక
స్వరూపమును
తల్లిదండ్రులూ,
విద్యార్థులూ
గుర్తించి
విశ్వసించిన
మాత్రమే,
విద్యాభ్యాసము
అభివృద్ధియగును.
గురువును
ద్వేషించితే
అగౌరవపరచితే
ఆయనను
అపమాన
పరచితే,
ఆయన
ప్రబోధపై
శ్రద్ధపుట్టునా
?
గురువులు
కూడ,
మొట్టమొదట
తమ
కర్తవ్య
నిర్వహణలో
తాము
చూపు
శ్రద్ధాభక్తులచే,
ఆ
స్థానమునకు
తగిన
అర్హతను
పొందవలెను.
“గురు
బ్రహ్మ
గురుర్విష్ణుః
గురుర్దేవో
మహేశ్వరః
గురు
సాక్షాత్
పరబ్రహ్మ
తస్మై
శ్రీ
గురవేనమః”
అనే
శ్లోకమును
గోకాక్
ఉదహరించి
ఉపన్యసించినాడు.
ఇట్టి
గౌరవ
స్థానమును
మీరు
గుర్తించి
దానికి
తగినట్టుగా
వర్తించాలి
అన్నాడు.
కర్షకుడు
భూమిని
సిద్ధము
చేసి,
విత్తనము
నాటునట్లే
అధ్యాపకులు
పిల్లల
హృదయ
క్షేత్రములో
సద్భావము
సత్చింతన
సత్ప్రవర్తనలను
నాటుదురు
;
ఇది
బ్రహ్మకార్యము
దీనివలనే
గురువులను
బ్రహ్మ
అందురు.
అయితే,
బోధించవలసిన
బోధనలు
సలిపినామే,
అని
గురువులు
కూర్చోకూడదు.
కర్షకుడు
అట్లు
చేయడే
!
పంటకు
నిత్యమూ
పోషణలు
రక్షణలు,
సలుపుతూవుంటాడే
!
అట్లనే
గురువులు
కూడ,
హృదయ
భూమియందు
విద్యా
విత్తనములు
నాటి
నిశ్చింతగా
వుండుటకు
వీలులేదు.
‘గురుర్విష్ణుః”.
గురువులు
తమ
విష్ణుస్థానమును
పురస్కరించుకొని,
కర్షకుడు,
నీరు
ఎరువులు
అందించునట్లు
పిల్లలు
నేర్చిన
పాఠములను
ఆచరణలో
అనుభవములోనికి
తెచ్చి,
వాటిని
జీర్ణించి
సంతుష్టిచెందేవరకు
శ్రద్ధవహించాలి.
కర్షకుడు
పంటనే
నిర్మూలము
గావించు
కలుపులను
తీసి
వేస్తాడు
నిరుపయోగమైన
నిష్ప్రయోజనమైన
గడ్డి
మొలకలను
పెరికి
శుభ్రము
చేస్తాడు.
అట్లనే
శివ
స్వరూపము
ధరించి,
అధ్యాపకులు
చెడ్డ
అలవాట్లనూ
అభ్యాసములను
నడవళికలను
పలుకులను
భావములనూ
ఖండించి
విద్యార్థులలో
వాక్శుద్ధి
భావశుద్ధి,
క్రియాశుద్ధిని
అభివృద్ధి
పరచవలెను.
విద్య
అనేది
తిన్నన్నము
కక్కినట్టుగా
తలకందించే
తలభార
విషయములు
కాదు
:
హృదయమునుంచి
హృదయమునకందించే
సద్భావములే
విద్య.
గ్రంథస్థ
విషయములను
బోధించువార్లు
టీచర్లు.
ఆ
పేరు
మీకు
సరైనది
కాదు
బాల
వికాస్
అధ్యాపకులకు
ఇంకపై
“గురు”
అనే
పేరును
అందరూ
వుపయోగించవలెను.
ప్రకృతి
సహజమైన
అంధకారమును
నివారించి
దైవీక
ప్రకాశమునందించు
ప్రజ్ఞానమును
వెలిగించేదే
గురువుయొక్క
కర్తవ్యము.
5
▾
Meaning
Keep
దానివలననే,
భారతీయ
సంస్కృతియందు
గురువులను
పవిత్ర
వ్యక్తులుగా,
త్రిమూర్తి
స్వరూపులుగా
ఆదరించి
ఆరాధించటము
సాంప్రదాయమై
నిలచినది.
గురువులు
కూడ
శాంతము,
సహనము,
దయా,
ప్రేమలను
అభివృద్ధి
చేసుకొని,
సత్యము
ధర్మము
శాంతిప్రేమలను
వ్యక్తులలో
సమాజములో
అభివృద్ధి
చేయుటకు
పూనుకొని
సార్థకతనందుకోవాలి.
అట్లు
చేసితే,
అన్యాయము
అక్రమము
అసత్యము
అశాంతి
ఇవన్నీ
ప్రజలనుంచి
దూరమై
సుక్షేమము
దేశమందు
స్థిరమగును.
లేత
హృదయములు
భవిష్యత్తులో
భారత
సంస్కృతి
భారతదేశము,
యేమైపోవునో
అని
బహుమంది
కంగారు
పడుతుంటారు,
ఇది
చాలా
పొరపాటు
;
దూరదృష్టిలేనివారి
మనోభావము.
అట్టి
భయాందోలనములకే
మాత్రమూ
అవకాశమీయకూడదు.
ఎందుకనిన,
లేత
వయస్సునందే,
బాలవికాస్
తరగతుల
పిల్లల
హృదయములందు
ఉత్తమ
భావములను
నాటి
పోషించిన,
రేపటి
దినము
దేశమును
తీర్చి
దిద్దే
నాయకత్వము
వారికి
లభించును.
ఈ
చిన్న
వయస్సులోనే
పవిత్ర
భావములను
వారి
మనస్సులందు
చేర్చితే,
అవి
జీవిత
పర్యంతము
నిలుచును.
ఇచ్చట
సమావేశమైన
వేలాది
మంది
స్త్రీ
పురుషులలో
నూటికి
95
మందికి,
వారు
ఉదయము
చదివిన
పుస్తకమందున్న
విషయములు
ఇప్పటికి
జ్ఞాపకమునకు
రావు
కానీ,
తమ
చిన్నతనములో,
తమకు
అవ్వ
తాత
నేర్పించిన
స్తోత్రములు
నీతి
శ్లోకములు
బాగా
జ్ఞప్తికి
వచ్చును,
కదా
?
లేత
వయస్సులో
చదువే
చదువు
ముఖ్యము
;
వినే
కథలు
మహాత్ముల
చరిత్రలు,
అతి
ముఖ్యమైనవి.
అవన్నీ
పవిత్రమైన
విత్తనములు.
జీవితము
పెరుగే
కొలది
అవి
కూడా
వృక్షములుగా
శాఖోపశాఖలతో
పెరిగి
ఫలవంతమైన
స్వరూపములుగా
వుపకరించును.
ఈ
నాడు
కొంత
మంది,
చిన్న
వయస్సులో
పిల్లలకు
ఆధ్యాత్మిక
తత్వములనందించేది
పొరపాటని
ప్రచారము
చేయుదురు.
అట్ల
అనుకొనేది
పెద్ద
పొరపాటు
అని
మీరు
తెలుసుకోవాలి.
తరువాత
జీవితములో,
ఆత్మశాంతి,
ధైర్యము
సహనము
శ్రద్ధాభక్తులు
అవసరమైనపుడు,
మీకు
అందించే
ఈ
విద్యాధనము
సార్థకమగును.
దప్పికలిగిన
సమయములో
నూతి
త్రొవ్వటము
మొదలుపెట్టితే
మూర్ఖతనమనుపించును,
కానీ,
ఫలితమేమియుండదు.
Start
early;
Drive
slowly;
Reach
safely
అనే
ఉపదేశము
అన్ని
విధముల
ప్రయాణములకు
అన్వయించును.
చిన్న
వయస్సులో
హృదయమందు
చేర్చుకొన్న
ఆధ్యాత్మిక
సూక్తులవలన,
ఉన్నతమైన
మార్పులు
క్రమముగా
కలిగి,
జీవితము
సుఖమయముగానూ
సార్థకతతోనూ
సాగును.
ఏనాడో
రిటైరయిన
తరువాత,
విశ్రాంతి
దొరకిన
తరువాత,
ఆధ్యాత్మిక
చింతన
మొదలు
పెట్టుతాము
అంటే,
అది
సాధ్యమయ్యే
పనికాదు
;
అది
ఏ
మాత్రము
జరుగదు.
అంత్యసమయములో,
హరి
నామమును
పలుకేది
తరము
కాదని,
భాగవతమందు
చక్కని
యుక్తులచే
బోధించియున్నది.
ఆసమయములో
తన
చుట్టూ
అందరూ
ఏడ్చుదురు
;
తానూ
ఏడ్చుచుంటాడు.
అపుడు
దేవుని
స్మరణ
ఎట్లు
కలుగును
?
భౌతిక
వస్తువుల
కోసం
జీవితమంతా
ఏడ్చిన,
దైవం
కోసం
ఏడ్చేది
ఎపుడు
మానవుడు?
జీవితమంతా
ఒక
దైవమునకు
మాత్రమే
ఏడ్వాలి
;
కానీ
దైన్యస్వరూపమైన
దేహము
కొరకు
ఏడ్వకూడదు
;
అపార
పుణ్యధనమును
ప్రోగుజేసి
ఆర్జించి
అందుకొన్న
ఈ
మానవ
జన్మమును,
అసాధ్య
శ్రమతో
దక్కించుకొన్న
ఈ
నర
జన్మమును,
వదలిపెట్టితే,
తిరిగి
చిక్కేది
అసంభవము.
6
▾
Meaning
Keep
ఏదో
అనేక
జన్మల
పుణ్యఫలముగా,
సాయిని
చూచే
భాగ్యము
ఈ
జన్మలో
లభించినది
సంసార
సముద్రమందు
మునిగి
చేతికి
చిక్కిన
ఈ
ముత్యమును
తిరిగి
చేనుంచి
జారిపోకుండ,
నన్ను
కాపాడు,
అని
ప్రార్థించేదే
జీవితమునకు
సార్థకత.
జీవితసార్థకత
బాలవికాస్
పిల్లలకు,
ఇంటియందు
వారు
తల్లి
దండ్రులను
గౌరవించాలి,
అని
మొదట
బోధించాలి.
పాంచభౌతికమైన
దేహమునందించినవారు,
తల్లి
దండ్రులు.
దానికి
కృతజ్ఞతనందించాలి,
సరే.
అయితే,
పంచభూతములను
ప్రపంచమందు
ఏ
రీతి
ఉపయోగించవలెను
అని
బోధించు
గురువులను
గౌరవించి
ఆదరించవలెనని
కూడ
బోధించవలసియున్నది.
మానవత్వములోని
దైవత్వమును
ప్రకటించుటకు
గురూపదేశమే
కారణమని
వారు
తెలుసుకోవాలి.
ఎందు
నిమిత్తమై
మాతాపితృలకు
గురువులకు
కృతజ్ఞతనందించాలి
అని
వారికి
ప్రబోధించాలి.
లౌకిక
విద్యలతోపాటు,
ఆత్మవిద్యను
కూడ
అభ్యసించవలెను.
M.A.,
B.A,,
B.Sc.,
మొదలైన
బిరుదులతో
‘అమృతస్యపుత్రాః’
అనే
బిరుదును
కూడ
ఆర్జించాలి
అనే
ఆదర్శము,
ఆవేదన,
ఉత్సాహము
పిల్లలలో
పెరిగాలి.
కూటికోసం
ఆర్జించు
విద్యలన్నీ,
50,
60
సంవత్సరములవరకూ
ఉద్యోగములో
పాల్గొనేవరకూ
పనికి
వచ్చును
కానీ,
తిరిగి
ఆధ్యాత్మిక
విద్యను
అభ్యసింపక
మనశ్శాంతి
ఆనందము
చేకూరవు.
జీతము
నిమిత్తము
కాదు,
జీవితము
నిమిత్తమై
విద్యనార్జించాలి.
దిక్కులేనివానికి
దేవుడే
దిక్కు
;
ఎక్కడ
ఉన్న,
ఏ
పరిస్థితిలోవున్న,
దైవము
రక్షించును
;
ఆనందమిచ్చును.
ఆ
దైవత్వముపై
దృఢ
విశ్వాసమునందించే
ఆత్మవిద్యను
మీరు
ప్రచార
ప్రబోధనల
ద్వారా
అందించి,
భారతి,
భారతీయ
సంస్కృతియొక్క
సత్సంతానములైన
బాలబాలికలకు
అనుభవరూపమైన
ఆనందమును
కలుగజేయాలని
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తున్నాను.
ప్రేమమతము
మరొక
విషయము.
మీ
విద్యావిధానములో,
తరగతులలో,
పాఠక్రమములలో,
జాతిమత
భేదములు
ఏ
మాత్రమూ
రాకుండ
లేకుండ
జాగ్రత్తగా
చూచుకోవాలి.
There
is
only
one
religion,
the
religion
of
love.
మానవకులమునకొకే
మతమున్నది
;
అది
ప్రేమమతమే
!
There
is
only
one
caste,
the
caste
of
humanity.
మానవులందరూ
ఒకే
కులమునకు
చెందినవారు
;
అదే
మానవకులము
!
మీరు
ఎక్కడ
చేరిన
ఎక్కడికి
పోయినా,
అన్ని
దేశములలోనూ,
అన్ని
తెగలలోనూ,
మతములలోనూ,
సత్యధర్మ
శాంతిప్రేమ
అనే
మూల
సూత్రములు
వకే
రీతిన
ప్రకాశించవలెను.
ఇతర
మతములవారిని,
అన్ని
తెగలవారిని
ఆనందముగా
మీ
తరగతులలో
చేర్చుకొని
విద్యనందించండి.
ఎవరినీ
ఏ
కారణమువలననూ
తిరస్కరించకూడదు.
పిల్లల
లేత
హృదయములను
ద్వేషాసూయలు
భేదభావములు
ఏ
మాత్రమూ
కలుషితము
గావించకుండ
చూచుకోవలెను.
పవిత్ర
పురుషుల
చరిత్రలను
బోధించునపుడు,
మహాత్ముల
పుణ్య
కథలను
బోధించునపుడు,
ఇతర
దేశములకు
చెందిన,
ఇతర
మతములకు
సంబంధించిన
మహనీయుల
చరిత్రలను
అందించండి.
7
▾
Meaning
Keep
రామ
కృష్ణ
సాయి
గణపతి
దుర్గా
వీరితో
క్రైస్ట్,
మహమ్మద్
జొరాస్టర్
వీరి
గాథలను
కూడా
అందించండి.
విశాల
భావముతో
విశ్వప్రేమను
సాధించండి.
దైవత్వమునకు
దేశ
కాల
పరిమితులు
లేవు
;
సర్వత్ర
సర్వకాలమందునూ
ఒకే
తేజస్సుగా
ప్రకాశించే
తత్వమది.
ఆ
తత్వమందు
అధికము
అల్పము,
గొప్పది
చిన్నది
అనే
భేదభావములను
చూపి
వాదించేది
మూర్ఖతయొక్క
లక్షణము.
తాను
ఎవరని
తనకు
తెలియని
వ్యక్తులు,
దైవముయొక్క
నామరూపములను
గురించి
తర్కించి
ఇది
గొప్పది
అది
చిన్నది
అని
వాదించేది
హాస్యాస్పదమే
కానీ
వేరు
కాదు.
రాముణ్ణి
శివుణ్ణి
కృష్ణుణ్ణి
క్రైస్తుని
ఎవరినీ
చూడని
వ్యక్తి,
ఇతను
అతను
కాదు,
అతను
ఇతను
కాదు,
అని
ఎట్లు
చెప్తాడు?
చదువులేని
గుడ్డివాడే
అట్లు
చెబుతాడే
కాని,
మరొకడు
అట్ల
వాదించడు.
అన్ని
మతములవారికీ
సన్నిహిత
సంబంధము
కలుగునట్లు
మీ
ప్రబోధ
ప్రచారమునందించండి.
ధైర్య
స్థైర్యములతో
చక్కని
విశ్వాసముతో
ఈ
పవిత్ర
కైంకర్యములో
పాల్గొని,
మీ
మీ
జీవితమును
సార్థకము
చేసుకొండి.
Previous
←
Words of Blessing
Next
In the Keeping of God
→