Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · Satyameva Jayate
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Satyameva Jayate
10 June 1974, Kṛṣṇa Janmāṣṭamī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
దివ్యాత్మ
స్వరూపులారా
!
భగవంతుని
పొందాలని,
సందర్శించాలని,
ఆరాటము,
దాహము
మీలో
అభివృద్ధి
కావాలి
మీ
అహంకారమును,
ఆడంబర
ఆదర్శములను,
ఆయన
పాద
సన్నిధిలో
అర్పించి,
ఆనందములో
మునగాలి
;
ఆయన
సాక్షాత్కారము
నాశించి.
ఆకలిని
పెంచుకోవాలి.
కృష్ణావతారమునందు
చేసిన
మహత్కార్య
మిదియే;
పండిత
పామరుల
కేకరీతిగా
భక్తి
మార్గమును
ప్రబోధించి,
దాని
అనుష్ఠాన
విధానమును
గోపికల
చేత,
పాండవుల
చేత,
లోకమునకు
కృష్ణుడు
అందింపజేసినాడు.
ప్రేమ
అనునది
స్వార్థ
రహితమైనది
;
నిర్మలమైనది
;
పవిత్రమైనది
;
మధురమైనది
ప్రేమోన్మత్తుడైన
ప్రహ్లాదుడు,
తనకు
సంబంధించిన
కష్టములు
నష్టములు,
నిందలు
నిష్ఠూరములు,
హింసలు
బాధలు.
అన్నిటినీ
మరచి,
సర్వత్ర
సర్వ
కాలములందు
భగవన్నామ
సంకీర్తన
మందే
ఆనందపరవశుడుగా
జీవించినాడు.
పవిత్ర
హృదయము,
నిష్కళంక
భావము,
నిర్మల
విశ్వాసము,
వీటిని
అభివృద్ధి
చేసుకొని.
విజయము
పొందినాడు.
మీరా
వలె
మీరు
కూడ
జీవితములను
పరమాత్మ
సేవ
కొరకే
అంకితము
చేసుకొని,
భగవద్వియోగమును
క్షణమాత్రమూ
భరించ
లేక,
వెక్కి
వెక్కి
యేడ్చుటకు
ప్రయత్నము
చేయవలెను.
పవిత్ర
ప్రవర్తన
చేత,
ఆత్మానందము
ననుభవించుచు,
అనేక
సాధువులు
నేటికి
తమ
సర్వస్వమును
అర్పించి,
భగవత్సాన్నిధ్యము
నందు
కొనుచున్నారు.
2
▾
Meaning
Keep
ఆరాటము—ఆర్భాటము
కానీ,
ఆ
నాటి
భక్తికి
ఈ
నాటి
భక్తికి
యే
మాత్రమూ
సంబంధము
లేదు.
ఆ
నాడది
హృదయము
నుండి
ఉప్పొంగే
ఆరాటము
;
ఈ
నాడు
బాహ్యములో
వ్యక్తపరచే
ఆర్భాటము.
అయితే,
భగవంతుడు
ఆర్భాటమునకు
చిక్కడు.
హృదయపూర్వకమైన
ఆరాటమునకే
దక్కుతాడు,
చిక్కుతాడు!
మూర్ఖత్వమునకు
కానీ
లోభమునకు
కానీ
పరమాత్ముడు
చిక్కడు.
సోమరితనమును
కూడ
పరమాత్ముడెన్నటికీ
అంగీకరించడు.
సర్వ
భారము
నీవే
యని
నమ్ముకొని
ఊరకుండుట
వలన
ప్రయోజనము
లేదు.
అంతర్యామియై
తాను
అందరితోనూ
వుండటము
వలన,
మీ
ప్రయత్నము
కూడ
అత్యవసరము.
తనను
తాను
తన
ఉద్ధారమునకై
ఉపయోగించుకొని
కృషి
చేయవలెను
;
అప్పుడు
పరమాత్ముడు
కూడ
తగిన
సహాయము
చేయగలడు.
పరమాత్ముడు
సర్వత్రా
ఉండిననూ,
శక్తి
స్వరూపుడై,
హృదయస్థానమందు
భాస్కర
స్వరూపుడై,
బుద్ధికి
తేజస్సు
నందించుతూ
ఉంటాడు.
దృష్టి—సృష్టి
ప్రేమ
స్వరూపులారా
!
అన్ని
రాష్ట్రములలోనూ
ప్రజలు
శాంతి
లేదని,
భద్రత
లేదని,
అల్ల
కల్లోలముతో
అవస్థపడుచున్నారు.
లోకమెప్పుడూ
ఇంతే,
ఇది
లోక
స్వభావము,
అని
యెంతో
మంది
చెప్పుదురు.
కానీ,
ఇది
చాలా
పొరపాటు.
ఈ
అశాంతి
వ్యక్తికి
సంబంధించినదే
కావున
లోకమునకు
దానిని
అంటగట్టరాదు.
లోకము
నిరంతరమూ
శాంతి
స్వరూపమే,
అశాంతి
వ్యక్తి
గతమైన
మనోభావమే
కానీ,
లోకస్వభావము
కాదు.
శాంతి
లేని
వ్యక్తికి
లోకమంతా
అశాంతిగానే
వుండును.
శాంతి
లోనుంచి
ఉద్భవించేది
కాని,
బయట
నుంచి
వచ్చేది
కాదు,
ఏ
కలర్
అద్దాలను
పెట్టుకొంటారో,
లోకమంతా
ఆ
కలరే
కనుపించును
;
ఇది
సహజం.
సృష్టి
అంతా
దృష్టి
నాశ్రయించే
వుండును.
దృష్టినుంచే
సృష్టి.
ప్రేమదృష్టికి
లోకమంతా
ప్రేమమయమే.
విశ్వ
ప్రేమను
అనుభూతికి
తెచ్చుకొనిన
వ్యక్తి
విశ్వేశ్వర
స్వరూపుడౌతాడు
ఇది
సత్యము
కాదని
నిరాశ
పడుట
అనవసరము.
దైవము
ప్రబోధించేది,
శాసించేది,
అనుగ్రహించేది,
ప్రేమనే
!
అవతరములు
వచ్చునది
కూడ
ప్రేమయొక్క
ప్రబోధ
ప్రచారముల
కొరకే
;
ఆచరణ
రూపమైన
ప్రబోధము
కొరకే
!
జపము
తపము
యజ్ఞము
యాగము
పాండిత్యము
ఇవన్నీ
అహంకారమును
పెంచి
ఆడంబరమునకు
దారి
తీయును.
అయితే,
ప్రేమను
సాధించుటకు
ప్రయత్నించునపుడు,
చాలా
ఆటంకములు
అడ్డు
రావచ్చును.
ద్వేషము
అసూయ
ఇవి
ప్రకోపించి
బాధనీయవచ్చు.
గృహములో
బంధువులే
ద్వేషమును
ప్రకటించి
అడ్డు
తెచ్చిపెట్ట
వీలున్నది.
మిత్రులు
కూడ
సహకరించక
పోవచ్చును.
వారు
భగవంతుని
పైన
కూడ
మీకు
ద్వేషము
జుగుప్స
కలుగజేయవచ్చును
!
ఇవన్నీ
మీ
సత్వ
పరీక్షకు
పరికరములుగా
భావించి
ధైర్యముగా
వాటిని
జయించవలెను.
నిందలు
—
నిష్ఠూరములు
మంచి
కార్యమునకే
అనేక
రకములైన
నిందలు
నిష్ఠూరములు
వస్తూవుంటాయి.
చిన్న
చిన్న
అపోహలను
అసూయారోగ
పీడితులైన
అల్ప
బుద్ధి
గలవారు
వ్యక్తిగతముగా
ప్రచారము
చేయవచ్చును.
3
▾
Meaning
Keep
కృష్ణునికి
కూడ
అసూయాపరులు
వ్యక్తిగతముగా
దోషముల
నారోపించినట్లు
మీరు
భారత
భాగవత
గ్రంథములలో
చదివి
యుండవచ్చును.
కృష్ణుని
ఎంతో
మంది
దుష్టులు,
విరోధులైన
రాక్షసులు
దైహికముగా
హింసించుటకు
కూడ
పూనకొనినారు.
అయితే,
సత్యమునకు
ఎన్నడూ
పరాజయము
లేదు,
రాదు.
సత్యానికి
ఎప్పుడైనా
కొంత
పరాభవము
కలుగునేమో
కానీ,
పరాజయము
మాత్రము
ఎప్పుడూ
యెచ్చటనూ
రాదు.
ఆ
విధముగా
అసత్యమును
ప్రచారము
చేసిన
వారు,
దానితో
తమ
పతనమునకే
రాజబాటను
నిర్మించుకొన్నారే
కానీ,
సత్యమును
కదలించలేక,
హింసించ
లేకపోయినారు.
ధృతరాష్ట్రుని
సభలో
శ్రీ
కృష్ణుని
బంధించి
హింసించ
వలెనని
కౌరవులు
చేసిన
ప్రయత్నము
విఫలమై,
వారి
నాశనమునకే
మార్గమును
సిద్ధము
చేసినది.
కృష్ణుని
హింసించవలెనని
ఆ
దుష్టులు
చేసిన
పన్నాగమును
విని,
ఆ
నాడు
భక్తులు
చాలా
పరితపించినారు.
ఉదాహరణముగా,
సహదేవుడు,
“బావా
!
మీరు
సుఖముగా
తిరిగి
వచ్చినారు
!
ఇదే
మాకు
పదివేలు
!
ఆ
దుర్మార్గులు
మనకు
రాజ్యభాగమును
ఇవ్వకపోయిన
దాని
వలన
కలుగు
నష్టమేమి
?”
అని,
ఆతడు
సంతసించినాడు.
కౌరవులకు
ఏ
గతి
పట్టినదో
చూడండి
!
వారు
చేసిన
అన్యాయము
వారినే
బాధించినది
అయితే,
కృష్ణుడు
నిరంతరమూ
మంగళ
స్వరూపుడే
!
దుర్మార్గుల
కృత్యములు
భగవంతుని
సత్కీర్తిని
ఏ
మాత్రము
తగ్గించలేదు
;
తగ్గించవు.
వాటివలన
భగవంతుని
కీర్తి
జగద్వ్యాపక
మగును
!
ప్రహ్లాదునికి
వచ్చిన
కష్టనష్టములు
బాధలు
హింసలు
అన్నీ
ఆ
బాలకుని
భక్తి
ప్రపత్తులను
మరింత
తేజోమయముగా
వెల్లడించినవి,
అంతే.
ఇట్టి
నిందలు
నిష్ఠూరములు,
విరోధ
కృత్యములు,
యుగ
యుగముల
నుండి
అవతార
పురుషుల
వెంట
వస్తూనే
ఉన్నవి.
అట్టివారి
దుశ్చేష్టల
వలన,
భగవంతుని
శక్తి
ప్రకటించబడి
కీర్తి
ఇంక
అధికముగా
అభివృద్ధి
పొందుతూ
వచ్చినది
తప్ప
వేరు
కాదు.
ఈ
నాడు
కూడ
ఇట్టి
వారి
కృత్యములు
ఆ
కీర్తిని
విశ్వవ్యాప్తి
గావించుటకు
అనుకూలించు
కృత్యములే
!
సత్యమేవ
జయతే
భగవంతుని
యెవ్వరు
కూడనూ
యే
మాత్రమూ
కదలించలేరనే
సత్యమును
మీరు
గుర్తించి
ఆనందముగా
మీ
మీ
సాధనలను
మీరు
జరుపుకోవాలి,
అని
నేను
ఆశిస్తున్నాను.
యెవరెట్లు
భావించినప్పటికి,
సాయిని
యే
మాత్రమూ
కదలింపలేరని
తెలుసుకొని
మీ
స్మరణ
మీ
ధ్యానములను
మీరు
సలుపుతూ
వుండండి
కొన్ని
కుక్కలు
తమ
నీడను
నీటిలో
చూచుకొని,
మొరుగును;
అది
సహజము.
అది
ఆ
కుక్కల
భ్రమ
వలన
జరిగినది.
అయితే,
ఆ
కుక్కలు
మొరుగునది
విని,
ఊర
కుక్కలు
మొరుగుట
కూడ
సహజమే
కదా
?
ఆధారము
లేని
భ్రాంతులవలన
కుక్కలు
మొరిగితే,
వాటిని
విని
మొరిగేవాళ్లంతా
వాటితో
సమానమే
అనవచ్చు.
కాబట్టి,
మీరు
మాత్రము
మీ
భక్తిని
చలింపనీయక
మీ
ప్రేమను
అభివృద్ధి
చేసుకొని,
అపవిత్ర
భావములలో
మనస్సును
ఏ
మాత్రము
పడనీయక
ధైర్యమును
పెంపొందించుకొని,
పటుత్వమును
బలపరచుకొనండి.
ఈ
నాడు
కృష్ణజన్మాష్టమి
కాబట్టి,
ఇట్టి
పవిత్ర
సంకల్పమునకు
ఈ
నాడే
కంకణము
కట్టుకొమ్మని
మీకు
నేను
ఉపదేశించుచున్నాను.
కృష్ణుని
జీవితమంతా
ఇట్టి
ఆదర్శములనే
నిరూపించును.
4
▾
Meaning
Keep
పుట్టిన
క్షణమునుండి
ఆయన
తల్లిదండ్రులు,
భక్తులు,
ఇట్టి
అపోహలను
అపప్రచారములను
విని,
పరితపించినారు.
ఇది
చరిత్రలోని
విషయమే.
అయితే,
ఏది
జరిగినా,
ఏ
బాధ
కలిగినా,
సత్యమును
గుర్తించే
ప్రయత్నమును
ధైర్యముతో
సాహసముతో
మీరు
సాధించాలి.
భగవంతుని
పై
అన్ని
భారములను
వేసిన,
మీకు
క్షేమమును,
ఆనందమును,
స్థానమానములను
అందింతును.
భక్తిని
పెంచుకొనవలెనన్న
హింసతో
బాధతో
వీలు
కాదు.
సత్యమును
గుర్తించుటకు
భావపరిశుద్ధి
ప్రేమాభివృద్ధి
అత్యవసరము.
రామో
విగ్రహవాన్
ధర్మః,
అంటారు.
అట్లనే,
కృష్ణో
విగ్రహవాన్
ప్రేమః,
అని
చెప్పవచ్చు.
తాను
ప్రేమస్వరూపుడు
కాబట్టి,
ఎప్పుడూ
చిరునవ్వులతో
చిందులు
కులికేవాడు!
ఆనందముతో
ఉల్లాసముతో
రాగములు
తీయుచూ
పాటలు
పాడేవాడు.
రుద్రభూమిగాని
భద్రభూమిగాని
ఏచోటనైనా
సరే
గానమే,
గీతమే.
యుద్ధ
భూమిలో
కూడ
భయభీతులు
తాండవమాడు
సమయములో
కూడ
గీతను
పాడినాడు.
ప్రేమ
ఉండిన
ఆనందము
సహజము;
ఆనందముండిన
గానము
నృత్యము
వెంటనే
ఉండును.
శాంతి
భద్రతలు
ప్రేమనుంచి
లభించును.
ప్రేమ
లేనివారికి
నిరంతరం
అశాంతియే
కాబట్టి,
ఈ
నదిలో
తరించుటకు
ఏకైక
మార్గము
ప్రేమ
ఒక్కటియే.
Love
is
God;
Live
in
Love.
Previous
←
Vaster than the vastest !
Next
Students!
→