Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · Sukhino Bhavantu
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Sukhino Bhavantu
4 July 1974, Guru Pūrṇimā, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
అనంతమైన
జగత్తులో
అసంఖ్యాత
ప్రాణికోటిలో
మానవులు
అగ్రగణ్యులనునది
అందరికీ
తెలుసును
;
అయితే,
మానవులు
జంతువులుగా
పశు
సమానముగా
వున్నంత
వరకు
పరమాత్ముని
సాక్షాత్కరించుకొని
జన్మ
సార్థకతను
పొందుటకు
వీలులేదు.
మానవుడుగా
జన్మించి
మాధవుడుగా
జీవించి,
దివ్యత్వమును
సాధించి
సంతోషించటమే,
మానవుని
లక్ష్యము.
పవిత్రమైన
మానవత్వమును
సంపాదించి,
ఆ
విశిష్టతను
విక్షేపమార్గమునందు
ప్రవేశ
పెట్టడము
ప్రథమ
అజ్ఞానము.
దానిని
సాధన
మార్గమందు
జరిపించి
సత్యమును
గుర్తించి
భవమును
దాటటము
అత్యవసరము.
కర్మ
తత్వము
బాగా
తెలిసిన
వాడు
తాను
చేసే
అన్ని
పనులకు
ఆ
పదమును
వాడడు.
మొట్ట
మొదట,
మోహ
కర్మములందు
మునిగి,
తరువాత
ధర్మకర్మములనాచరించి,
బ్రహ్మకర్మములో
లీనమై
ఆత్మకర్మను,
కనుగొనునదే
ఉత్తమ
జీవితమునకు
గుర్తు.
మానవులందు
చైతన్యము
కలిగియున్ననూ,
ఆ
చైతన్యము
బహురూపములుగా
వెలువడిననూ,
ప్రేమ
యొక్క
ప్రకాశమే
ఆ
చైతన్యమునకు
మూలాధారము.
ప్రేమ
అట్టిది
ఇట్టిది
అని
నిర్ణయించుటకు
యెవ్వరి
తరము
కాదు.
అయితే,
అంతో
ఇంతో
ప్రేమలేనివాడు
మాత్రము
లోకమందు
లేడు.
మార్గము,
వ్యక్తిత్వము,
విషయము,
వీటిని
అనుసరించి,
ప్రేమ
వివిధ
విధములుగా
వ్యక్తము
కావటము
సహజము.
అయితే
ప్రేమ
ఒక
జన్యగుణము
కాదు
;
అది
స్వతస్సిద్ధము.
దానిని
విసర్జించటము
సాధ్యము
కాని
పని
!
అది
ఆత్మయొక్క
పరిశుద్ధ
ప్రకాశము.
సామాన్యమైన
వ్యావహారిక
భావ
సంబంధములను
‘ప్రేమ’
అనుట
పొరపాటు.
తల్లిదండ్రుల
పిల్లలపై,
పిల్లలు
తల్లిదండ్రులపై
చూపు
ప్రేమకు
వాత్సల్యమనునది
సరైన
పేరు
భార్య
భర్తల
ప్రేమకు
ఆ
పేరు
చెల్లదు
;
మోహమనుట
సరియైన
పదము.
మిత్రులు
బంధువులు
వీరిలోని
ప్రేమ,
నిజముగా
అనురాగమే
కాని,
ప్రేమ
కాదు.
పదార్థములపై
వస్తువాహనాలపై
పెరిగే
ప్రీతి
వ్యామోహములకు
ఇచ్ఛ
అనవలెను.
పరమాత్మునిపై
కలుగు
పవిత్ర
భక్తికి
మాత్రమే
ప్రేమ
అనే
పేరు
సార్థకము.
కానీ,
ధనముపై
పుత్రులపై,
పేరు
ప్రతిష్ఠలపై
పుట్టే
భావాలను
ప్రేమగా
భావించటము
మూర్ఖత్వమే.
భగవంతునిపై
కలుగునట్టి
ప్రేమయే
పరమ
పవిత్రము
;
అది
యెట్టి
సమయమునందు
కూడ
మార్పుచెందనిది.
సుఖము.
దుఃఖము,
ఆనందము
ఆదాయము,
నిందలు
పొగడ్తలు,
బాధలు,
ఏది
వచ్చినా
పోయినా.
అది
క్రుంగదు,
తగ్గదు.
కష్టనష్టములను
మానవులు
పవిత్ర
మిత్రులుగా
భావించాలి
“న
సుఖాల్లభతే
సుఖం”
వెలుతురులో
వెలుతురుకు
ఏ
మాత్రమూ
విలువ
వుండదు
చీకటిలోనే
వెలుతురును
ఆశించి
పొందుటకు
ప్రయత్నించెదము.
2
▾
Meaning
Keep
దుఃఖము
తీరిన,
అప్పుడు
సుఖప్రాప్తి
;
సుఖము
తీరిన,
దుఃఖప్రాప్తి
ఒకే
అవస్థ
ప్రారంభములో
దుఃఖముగానూ
అంతములో
సుఖముగానూ
తోచును,
అంతే
;
ఒకే
సూర్యుడు
ఉదయించినపుడు,
పగలు
!
అస్తమించినపుడు,
రాత్రి
!
మానవుడు
ఏకత్వమును
దూరము
చేసి,
భిన్నత్వమును
స్వాగతించి,
విక్షేపమునకు
విలువనిచ్చి
విచారములో
మునిగి
తేలుచున్నాడు.
అనేకత్వము
ఉపాధుల
వలన
కనబడునే
కానీ
ఉండేదొక్కటే
!
అన్నిటిలోనూ
ప్రవహించి
పని
చేయునట్టిది
ఒక
కరెంటే
!
అయితే
కరెంటును
ప్రత్యేకముగా
చూచుటకు
సాధ్యము
కాదు,
కరెంటు
ఉన్నదా
లేదా,
అని
ఉపాధుల
ద్వారానే
కనుగొనవలసియున్నది.
ఈ
ఫాన్
నిలిచిన,
కరెంట్
లేదు!
తిరిగితే,
కరెంటున్నది,
బల్బు
వెలిగితే,
కరెంట్
ఉన్నది
;
వెలుగక
పోతే,
కరెంట్
లేదు.
కరెంట్‌ను
గుర్తించటానికి
ఉపాధి
అవసరము.
ఆ
విధముగానే,
అవ్యక్తమైన
పరమాత్మ
శక్తికి
ఆధేయ
భూతమైన
ఉపాధి
కావలెను
;
లేకపోతే
గుర్తించుటకు
సాధ్యము
కాదు.
ఫాన్
“నాకు
నేనే
తిరుగుచున్నాను”
అని
చెప్పితే,
ఆ
మాటను
మూర్ఖత్వమని
ఖండించుచున్నాము.
లోన
ప్రవహించే
అదృశ్యమైన
కరెంటువలననే
అన్ని
కర్మలూ
జరుగును
అని
మనకు
తెలుసు.
అదే
రీతిగా,
చూచేది
కన్నులా?
ఆలోచన
చేసేది
మెదడా
?
అవ్యక్తమైన
దైవశక్తి
వాటిలో
చేరటమువలన
వాటి
వాటి
కర్తవ్య
కర్మలు
జయప్రదముగా
జరుగుచున్నవి
కానీ.
వాటికే
మాత్రమూ
వ్యక్తిత్వము
లేదు
‘ప్రేమ’
అనునది
ఆ
దివ్య
శక్తికి
మరొక
పేరు
మాత్రమే.
భిన్నత్వము
కాని
భేదభావము
కాని
మనస్సునందు
దాగియుండునంత
వరకు,
ఆ
దివ్య
ప్రేమ
భావము
చేకూరదు.
ఏకత్వమైన
ప్రేమ
భావమును,
దివ్యత్వమైన
ఆత్మ
తత్త్వములో
లీనము
చేయవలెను.
అదే
పరాభక్తియొక్క
చివరి
అనుభవము.
ఏకత్వము
దృఢమైన
తరువాత,
వేరొకటి
లేదు
కనుక,
తన్ను
తానే
చూచుకొనుచున్నాడు,
తనకు
తానే
మాటలాడును,
తనకు
తానే
అన్ని
కర్మలనాచరించును
తనతో
తాను
కూడి
ఆడి
ఆనందించుచూ,
అనుభవించుచూ
వుంటాడు.
ఇట్టి
స్థితిని
పొందటము
అందరికీ
సాధ్యము
కాదు.
సామాన్య
మానవులకు,
జ్ఞాననేత్రము
లేని
వాండ్లకు
శ్రీ
కృష్ణుడు
చెప్పినట్లుగా,
(అవజానంతి
మాం
మూఢాః
మానుషీ
తను
మాశ్రితం)
మనుష్య
దేహము
నాశ్రయించి
వచ్చిన
నన్ను
మూఢులు
తెలుసుకొన
లేరు.
ఆకారమును
చూచి,
మానవుడనే
నిర్ణయించెదరు.
అయితే
నిజ
స్వరూపము
దివ్యత్వమే
దేహతత్వమును
గమనింతురు
కానీ
ఆత్మ
తత్వమును
గమనించరు.
ఆత్మ
తత్వమును
అవగాహన
చేసికొనిన
తప్ప,
సర్వభూతాంతరాత్మయగు
దైవత్వమును
గుర్తించుట
దుస్సాధ్యము.
దైవత్వము
సులభ
గోచరమగుటకు
శ్రద్ధ,
నిష్కామ
కర్మ,
మరియు
జ్ఞానము,
ఈ
మూడూ
అవసరము.
వ్యక్తి
భావముతో
కర్మలలో
దిగక,
బుద్ధి
చిత్తము
అన్నీ
ఆత్మాభిముఖము
చేసి,
కర్మలకు
పూనుకోవలెను.
కర్మవలన
పుట్టు
జీవుడు
కర్మలద్వారా
విడుదలను
సంపాదించి
కర్మలోనే
చనిపోవాలి.
కర్మతోనే
బంధము
;
కర్మవలనే
మోక్షము.
కాబట్టి,
కర్మ
జిజ్ఞాసయొక్క
ప్రథమ
సోపానము.
కర్మను
పవిత్ర
భావముతో
పరోపకార
బుద్ధితో
దోషరహితముగా
ఆచరించిన,
భవిష్యత్తులో
సుఖ
శాంతులు
చేకూరును
శ్రద్ధ
వహించి,
ఫలాపేక్ష
లేక,
కర్మను
దివ్య
ప్రేరణ
వలన
ఆచరించవలెను.
3
▾
Meaning
Keep
ఒక
వ్యక్తి
తాను
సలుపరాని
కార్యమునకు
పూనుకొని
దానిలో
ప్రవేశించినపుడు,
కొన్ని
క్షణముల
తరువాత,
అది
సరికాదని,
దానివలన
పరాభవము
అవమానము
సంభవించునని
శిక్షను
పొందవలెనని,
హృదయమునుంచి
ఆదేశము
వచ్చును.
దీనిని
గమనించిన,
లోపల
ఇద్దరున్నట్లు
అర్థమగును.
చేయుమని
చెప్పువారెవ్వరు
?
కూడదనే
వారెవ్వరు
?
దీనిని
పురస్కరించుకొని,
అంగములో
జంగమున్నదని
నమ్మవలసి
యున్నది.
ఆ
జంగము
సంగముతో
సమూహములోనే
వ్యవహరించును.
నిత్యానిత్య
పరిశీలనకు
ప్రోత్సాహించునది
జంగమే
;
ఆ
పరిశీలనకు
సంగము
తోడుగా
వుండును
పుట్టపర్తికి
పోవలెను
అని
ఒక
కోరిక
కలిగితే
సంగములోని
ఒక
ధ్వని
తక్షణమే
పుట్టపర్తిలో
స్వామి
ఉన్నాడా,
లేక
బెంగళూరులో
వున్నాడా,
కనుగొని
బయలుదేరితే
మంచిది
కదా
అని
పలుకును.
అపుడే
మూడవవాడు
ఫలానివారికి
ఫోన్
చేసిన
తెలుసును
అని
సలహానందించును.
నాల్గవాడు,
ఏ
మార్గముగా
ప్రయాణము
చేయాలి,
బస్సులోనా,
కారులోనా,
రెయిలా,
అని
ప్రశ్నలు
వేయును.
అంగములో
సంకల్పము
పుట్టటముచేత,
సంగమందు
సలహాలు,
సందేహాలు,
సమస్యలు
బయలుదేరుతాయి.
మరొకడు,
తాను
అతి
జాగ్రత్తగావున్నట్టు
“అక్కడకు
పోయిన
తరువాత,
స్వామి
ఇంటర్వ్యూ
ఇస్తారో
ఇవ్వరో”
అని
యోచన
చేసుకో,
అని
ఒక
పెద్ద
రాయినే
నెత్తిన
వేస్తాడు!
అప్పుడు
మరొకడు
తనయందు
భావస్వరూపుడుగావుండి,
నీవు
చేసిన
తప్పులను
పురస్కరించుకొని,
స్వామి
పిలువరో,
పిలువకుండానే
పంపించెదరో
అని
భయము
కలిగించుతాడు.
తక్షణమే
మరొకడు
“స్వామి
దయామయుడు
కనుక
యేమీ
భయము
లేదు;
తప్పక
పిలిచి
ఓదార్చి
ధైర్యమిచ్చి
పంపుతారు
పో”
అని
సమాధానపరచుతాడు.
ఈ
విధముగా
ప్రోత్సాహమును
ధైర్యమును
ఆనందమును
హృదయ
స్థానమునుండి
అందించువాడే
లింగస్వరూపుడు.
ఆయన
కైలాసమందు
లేడు,
హృదయమందే
నివసించి
ప్రకాశమును
జ్ఞానమును
ఆనందమును
అందిస్తాడు.
అంతర్దృష్టిని
అభివృద్ధిపరచినట్లయిన,
అంధకారము
నశించి
అజ్ఞానము
తొలగి
ఆ
లింగస్వరూపుని
పొందవచ్చు.
ఈ
దినము
గురుపూర్ణిమ
పండుగ;
దీనికి
సఫలత
మనస్సు
పరిపూర్ణస్థితిని
పొందుటయే.
ఆ
పూర్ణత్వము
లేక,
ఎన్ని
పూర్ణిమలు
వచ్చినప్పటికీ,
అజ్ఞానమనే
అంధకారము
పోదు
గురుపౌర్ణమినాడు
కొంత
మంది,
భౌతిక
వ్యాపారములలోనే
కాలము
గడుపుదురు.
కొంతమంది
గురువుల
పూజ
చేయుట
గురూపదేశము
పొందుట
ఇట్టి
కార్యక్రమములను
పెట్టుకొందురు.
అయితే,
పూజకు
గురూపదేశమునకు
ఒక
సంవత్సరము
కాలము
వేచియుండవలెనా?
ఇది
భక్తి
ప్రపత్తుల
లక్షణములా?
కాదు
హృదయము
ఏనాడు
నిర్మలముగా
పరిపూర్ణముగా
విశాలముగా
అపవిత్ర
భావాలకు
దూరముగా
వుండునో,
ఆనాడే
సార్థకత.
మనస్సులో
పవిత్రతను
ప్రేమను
నింపుకోవాలి.
హృదయాకాశములో
నామనక్షత్రములు
ఎన్నివుండినా
ప్రేమ
అనే
చంద్రుడు
ప్రకాశించనప్పుడు
వెలుతురుండదు!
ప్రేమ
వలనే
ప్రకాశము.
సర్వజ్ఞుడు
సర్వవ్యాపి
సర్వశక్తిమయుడు
మీ
హృదయములో
నివసించునపుడు
మీకేమి
తక్కువ?
4
▾
Meaning
Keep
తల్లిదండ్రుల
ప్రేమలో
కొంత
మమత
కనిపించు
స్వార్థము
చేరి
దానిని
కలుషితము
గావించును
తల్లిదండ్రులు
కూడ
పిల్లలను
ద్వేషించి
దూరము
చేసికొనవచ్చును
;
మిత్రులు
బంధువులు
దూరము
కావచ్చును.
చెరువులో
నీరు
నిండియుండిన,
కప్పలు
కోట్లకొలది
చుట్టూ
వచ్చి
చేరును.
చెరువు
ఎండిన
తరువాత,
ఒక్కటి
కూడా
కనపడదు.
అట్లనే
ధనకనకవస్తువాహనాలున్నంత
కాలము
మిత్రులు
బంధువులు
చుట్టూ
చేరుతారు;
కానీ,
అవన్నీ
దూరమైతే,
వారంతా
పరిగెత్తి
పోవుదురు.
అయితే,
నిరంతరము
చెంత
చేరి
కంటిరెప్పవలె
కాపాడునది
ఒక
పరమాత్ముడే
!
ప్రేమస్వరూపుడైన
జగదీశ్వరుడే
!
స్వామిని
దర్శించి
జీవిత
లక్ష్యమును
పొందవలెననే
ఆశతో
అనేక
ప్రాంతములనుండి
మీరందరూ
ఎన్నో
బాధలకోర్చుకొని
ఇక్కడ
చేరియున్నారు.
అయితే,
బాహ్యసాధనల
కన్న,
మీరందరూ
రాను
రాను
అంతర్దృష్టిని
అభివృద్ధి
చేసుకోవలెననునదే
స్వామి
ఆశయము.
నా
దృష్టియందు
నేను
గురువు,
మీరు-
శిష్యులు,
అనే
భావమే
లేదు,
సర్వత్ర
సర్వ
కాలములందు
ఏకత్వమే
యున్నది
అన్న
తరువాత,
ఇంక
గురువెవరు
?
శిష్యులెవరు
?
గురువు
తానే
!
శిష్యుడు
తానే
!
వేరు
వేరుగా
భావించటము,
అజ్ఞానము
వలననే
!
కొన్ని
మంత్రములను
బోధించిన
నంతనే
ఆయన
గురువు
అవుతాడా
?
ఏదో
ఉపదేశము
పొందిన
తక్షణమే
ఈయన
శిష్యుడవుతాడా
?
ఇరువురూ
దైవాంశమే
!
ఇరువురిలోనూ
ఆత్మ
తత్వమొక్కటే
!
గురు
భావమున్నతమని
గర్వించటము
శిష్యభావము
హీనమని
క్రుంగటము
రెండునూ
చెల్లవు.
అహంకారము
దీనత్వము
రెండూ
వుంచకూడదు.
చెడ్డయందూ
మంచియందూ
దైవమున్నాడు.
ఒకే
దేహము
ఆరోగ్యముగా
చక్కగా
పుష్టిగా
వుండే
నీకెంత
ఆనందముండునో,
యోచించు
!
కాబట్టి,
ఇన్ని
దేహములూ
నావే,
అనే
విశాల
భావమును
పెంచుకొని,
అన్ని
దేహముల
ఆరోగ్యము
పుష్టి
తుష్టి
కొరకు
ప్రాకులాడి,
వాటి
ఆనందమును
నువ్వే
అందుకొన్న
ఎంత
హాయి
!
యెంత
తృప్తి
!
ఎంత
సంతోషము
!
యోచించు
అపుడే
విశ్వ
విరాట్స్వరూపమును
ఆరాధించి
ఆనందించే
అవకాశము
కూడ
దొరకుతుంది
ఒకే
స్థానము,
ఒకే
రూపము.
అని
భావించటము
చాలా
సంకుచితము,
చిన్నతనము.
పరమాత్ముని
ఆ
విధముగా
పరిమితిలో
పెట్టితే,
ఆయన
ప్రతిష్ఠను
అవమాన
పరచినట్లే!
ఆయనను
అల్ప
స్వరూపుడుగా
భావించకూడదు
;
విశ్వ
విరాట్
స్వరూపము
గానే
భావించవలయును.
నా
స్వామి,
నా
పూజ,
నా
పూజా
గృహములో
నా
స్వామి,
నీ
పూజా
గృహములో
నీ
స్వామి
అని
వాదించుట
తప్పు.
భగవంతుడు
సర్వభూతాంతరాత్మ
కాబట్టి,
మీరు
కూడ
సర్వ
భూతముల
ఆనందాన్ని
అందుకొనుటకు
పూనుకోవాలి.
ఎవరినీ
బాధించక,
హింసించక,
దూషించక,
జీవించుటకు
ప్రయత్నించాలి.
ప్రేమభావమును
పెంచుకొని,
“లోకాస్సమస్తా
సుఖినో
భవంతు”
అని
హృదయ
పూర్వకముగా
నిత్యమూ,
భగవంతుని
ప్రార్థించండి.
ఇదే
నా
గురుపూర్ణిమ
సందేశము.
Previous
←
Instruments of the Divine Will
Next
To the mothers
→