Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · Swami's Message [The Onam Festival]
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Swami's Message [The Onam Festival]
30 August 1974, Onam, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
భారతీయుల
పర్వ
దినములు
మాత్రమే
కాదు,
ప్రపంచములోని
అన్ని
జాతీయుల
పర్వదినములు
దైవ
విశ్వాసమును
దృఢపరచుట
కొరకు,
ధర్మాచరణను
అభివృద్ధి
చేయుట
కొరకు,
పాపభీతి
పుణ్యముపై
ప్రీతి
వీటిని
దృఢపరచుట
కొరకు
స్థాపితమైయున్నవి.
ప్రతియొక్కరూ
ఈ
పర్వదినముల
నాచరించుచూ,
తన
స్థితిగతులను
వీక్షించి
పరీక్షించి.
తన
జీవితమును
దివ్యత్వముగా
మార్చుకొనే
ప్రయత్నమందు
తాను
యెంత
దూరము
పయనించినాను
అని
చూచుకొని
ముందంజ
వేయుటకు
పూనుకొనునట్టి
దినములివి.
సంత్
తులసీదాసు
‘
రామచరిత
మానస
’
కావ్యమందు
తాను
ఆ
రఘునాథుని
కథను
“
స్వాంతస్సుఖాయ
”
(స్వంత
సుఖము
కొరకు)
రచించినట్లు
వ్రాసియున్నాడు.
పరుల
మెప్పును
ఆశించి
తాను
ఆ
రామాయణమును
రచించలేదట.
పరమాత్ముని
మెప్పునాశించి
కాదట
;
తన
ఆనందము
నిమిత్తమై,
తన
ఆత్మతృప్తి
కొరకే
ఆ
మహా
కావ్యమును
వ్రాసినాడట
!
నిజమే
!
జనులు
గృహనిర్మాణము,
ఉద్యోగ
నిర్వహణము,
ఆస్తిపాస్తుల
ఆర్జనము
మొదలగు
ప్రయత్నములలో
శక్తి
సామర్థ్యములను
వినియోగింతురు.
అవన్నీ
తమ
తృప్తి,
తమ
సంతుష్టి
కొరకే
కదా!
కోకిల
యొక్క
కూజితము
పరుల
మెప్పుకు
కాదు
;
స్వశక్తిని
ప్రకటించి
స్వాంతస్సుఖమును
పొందుటకే.
గులాబి
పుష్పము
వికసించి,
మధుర
వాసనను
సుందర
స్వరూపమును
ప్రకటించుట
‘స్వసుఖాయ’
కానీ
వేరు
కాదు.
ఒక
తల్లి
తన
చంటి
బిడ్డను
ఒడిలో
కూర్చుండ
బెట్టుకొని
దానితో
ముచ్చటలాడేది
కూడ
ఆ
బిడ్డ
సంతోషమునుద్దేశించి
కాదు
;
స్వసుఖము
నిమిత్తమై,
అనునదే
నిజము.
అట్లనే,
ప్రతియొక్కరూ
చేయు
అర్చన,
ధ్యానము,
ఆరాధన,
మొదలగు
సాధనలన్నీ
కేవలము
వ్యక్తి
నిమిత్తమే
కానీ
మరొకరి
నిమిత్తము
కాదు.
అయితే,
ఇట్టి
సాధనల
రీత్యా
మోహక్షయమనే
మోక్షము
దొరకదు
;
స్వాంతస్సుఖము
అనే
నిత్యానందము
లభించదు.
“న
కర్మణాన
ప్రజయాధనేన,
త్యాగేనైకే
అమృతత్వ
మానశుః
”
కర్మముల
వలన,
సంతాన
లాభము
వలన,
ధనార్జన
వలన
అమృతత్వము
దొరకదు
;
త్యాగమువలననే
అది
లభించును,
అని
శ్రుతిలో
చెప్పబడియున్నది.
ఈ
దినము
మీరు
ఆచరించు
ఓణం
పండుగ,
ఈ
సత్యోపదేశమును
మీకు
అందించుచున్నది.
బలిచక్రవర్తి
తన
యాగ
(త్యాగ
కర్మము)
సమయమునందు
భిక్షార్థిగా
వచ్చిన
బ్రాహ్మణ
వటు
వేషధారియైన
మహావిష్ణువునకు
మూడు
అడుగులు
భూమిని
దానమిచ్చి,
ఆ
వామన
మూర్తి
త్రివిక్రముడుగా
మారినపుడు,
మూడవ
అడుగు
వేయుటకు
స్థలము
లేని
పరిస్థితిని
గమనించి,
తన
శిరముపై
పాదము
పెట్టుమని
వేడుకొని,
జన్మ
సార్థకము
చేసికొనినాడనే
కథను
ఈ
దినము
మీరు
జ్ఞప్తికి
తెచ్చుకొనుట
మీ
సంప్రదాయము,
కదా
!
అమృతత్వమునకు
ఆధారభూతమైన
త్యాగముయొక్క
మహత్వమును
వామన
మూర్తిగా
అవతరించి
భగవంతుడు
లోకమునకు
చాటిన
దినము
ఈ
“
ఓణం
”
పండుగ
దినము.
మలయాళ
రాజ్యము
(కేరళము)ను
గురించి
అనేక
విశిష్ట
గాథలున్నవి
హిమాలయ
పర్వత
ప్రాంతమందున్న
బదరీక్షేత్రమందు
శ్రీమన్నారాయణుని
ఆరాధించుటకు
పూజారి
(రావల్)గా
కేరళమునుంచి
నంబూద్రి
బ్రాహ్మణులనే
నియమించే
సాంప్రదాయము
శంకరాచార్యులవారి
కాలమునుండి
వచ్చుచున్నది.
2
▾
Meaning
Keep
శంకరాచార్యులవారి
జననభూమి
అను
పవిత్ర
కీర్తి
కూడ
కేరళకే
దక్కినది.
అద్వైత
దర్శనమును
బోధించి
ఆనందానుభూతినందించిన
కీర్తి
కూడ
కేరళదే.
కాబట్టి
ఈ
నాడు
ఆ
సత్యమును,
ఆ
దివ్యత్వమును
ప్రకటించుటకు
మీరు
పూనుకొనవలెను,
దేహభ్రాంతిలో
పడినంతవరకూ
నరుడే
కానీ,
అది
నశించి,
ఆత్మజ్ఞానముదయించి,
ఆతడు
నారాయణుడే.
నరుడు
నారాయణుడుగా
మారును
;
నారాయణుడు
నరుడుగా
ధర్మసంస్థాపన
కొరకు
అవతరించవచ్చును.
ఇవి
రెండూ
సహజము
అని
మీకు
తెలిసియేయున్నది.
కానీ,
నరుడు
తనలోని
దివ్యత్వమును
గుర్తించుకొని
ఆనందమును
అందుకొనలేక,
అజ్ఞానాంధకారమునందే
జీవించుచున్నాడు.
కొంత
మంది
యేదో
ఒక
సాధన
ద్వారా
దైవత్వమును
పొందుటకు
ప్రయత్నించిననూ,
భక్తి,
భగవంతుడు,
వీటి
పూర్ణ
జ్ఞానము
అందుబాటులో
లేక,
వారు
నిరాశ
పొందుచున్నారు.
భక్తి
అంటే
భగవంతునిపై
సంపూర్ణమైన
ప్రేమ
దేశకాలములకూ
పాత్రమునకూ
అతీతమై
నిలచునట్టి
ప్రేమ.
అయితే,
కలియుగ
ప్రభావము
వలన,
Part
time
భక్తిమాత్రమే
ఈ
నాడు
అందరిలోను
కనపించుచున్నది.
నష్టము
కష్టము
దుఃఖము
దూషణ
తగిలినపుడు
మాత్రము
భగవంతుడు
జ్ఞాపకమునకు
వచ్చును
;
ప్రార్థనలు
పూజలు
జరుపుదురు.
సుఖము,
ఆనందము
ఆదాయము
ఆహ్లాదము
వచ్చినపుడు
భగవంతుని
యే
మాత్రము
చింతించక
మెలగుదురు.
అట్లే,
భగవంతుని
స్వరూప
స్వభావములను
సంపూర్ణముగా
అర్థము
చేసికొనక,
ఇట్టివాడు
అట్టివాడు
అని
వాదించుతారు.
తాను
అనుభూతి
చెందక
పదములను
మాత్రము
పెద్దలననుసరించి,
ఉపయోగించి
స్తోత్రములను
రచించి
పాడుదురు.
నేడుభక్తులనవారిలో
ఈ
అనుభూతి
కనుపించటము
లేదు.
సర్వజ్ఞుడు,
సర్వశక్తిమయుడు,
సర్వవ్యాపి
అని
భగవంతుని
విషయమై
చెప్పుచున్నారే
కానీ
అనుభవము
మాత్రము
శూన్యముగానున్నది.
హృదయములోని
యోచన,
వాక్కులోని
సూచన,
చేతిలోని
ఆచరణ
మూడూ
ఏకముగా
ఉండాలి.
అదే
భక్తుని
లక్షణము.
భక్తుడు
అనే
పేరుకు
నిశ్చల
మనస్సే
సార్థకత
నందించును
సినిమా
మందిరములోని
తెరపై
కుంభ
వర్షము
యొక్క
చిత్రములు
పడి.
ప్రేక్షకులకు
యెంత
భ్రమను
కల్పించినా
ఆ
తెరపై
యే
మాత్రము
తడిగా
ఉండదు
!
యుద్ధ
చిత్రములు
ఎన్ని
పడినా,
ఒక
బొట్టు
రక్తము
కూడా
తెరపై
వుండదు.
అట్లనే,
దైవమనే
తెరపై,
జగత్తు
చలించుచూ
ఉండును.
దానికే
జగత్తు
అని
పేరు
వచ్చినది.
మీరు
కూడ.
ఆ
జగత్తులో
జరిగే
ఏరుపేరులకూ,
కష్టనష్టములకు
లొంగక,
చలించక,
మీ
నిజస్వరూపమైన
దివ్యత్వమును
ప్రకటించవలెను.
అపుడే.
మీరు
విజ్ఞానము,
సుజ్ఞానము,
ప్రజ్ఞానములకు
అధికారులగుదురు.
మీ
జేబులో
అగ్గిపెట్టె
ఉండవచ్చు;
అయితే,
అది
మీషర్టును
ఏ
మాత్రమూ
కాల్చదు
దానినుంచి
ఒక
పుల్ల
తీసి
పెట్టె
పక్కలో
వున్న
మందుకు
గీచితే,
నిప్పు
ఉద్భవించును.
అంతవరకూ
అగ్ని
పుట్టదు.
వ్యక్తిత్వమనే
పుల్లను
దివ్యత్వమనే
మందుపై
గీచిన
అపుడు
పవిత్రత
ఏర్పడును,
జన్మ
సార్థకమగును.
అట్టి
అనుభూతిని
అందుకొనిన
తరవాతనే,
భగవంతుని
సర్వజ్ఞుడు.
సర్వవ్యాపకుడు,
సర్వశక్తుడు,
సర్వాంతర్యామి
అని
వివరించుటకు
అర్హత
కలుగును.
3
▾
Meaning
Keep
బలి
చక్రవర్తి
ప్రహ్లాదుని
మనుమడు;
కాబట్టి,
ఆయనకు
విష్ణుభక్తి
పరంపరగా
వచ్చినదే.
వామనుడు
త్రివిక్రమ
రూపము
ధరించి,
భూమ్యాకాశములను
ఆవరించినపుడు
“నిను
కనుగొనవశమా?”
అని
స్తుతి
చేసినాడు.
“నీవు
అణువుకంటే
అతి
అణువుగా
ఉన్నావు.
ఘనముకంటె,
అతి
ఘనుడుగా
వున్నావు,
దొంగలలో
నీవు
గజదొంగ
”
అని
ఆడి
పాడి
ఆనందము
నందుకొన్నాడు.
లోకవిఖ్యాత
దొంగలు
వస్తువాహనాదులను
మాత్రమే
దొంగిలింతురు
పవిత్రమైన,
పరిశుద్ధమైన
అన్నిటికన్న
విలువైన
చిత్తమును
అపహరించేవాడు
నిజముగా
‘గజదొంగ
”
కదా?
మీరందరూ
అంత
దూరమునుంచి
ఎన్నో
కష్టముల
కోర్చుకొని.
ఈ
పండుగ
నాడు
స్వామి
సన్నిధిలోనే
వుండాలి
అనే
పవిత్ర
వాంఛతో
ఇక్కడ
సమావేశము
కావటము,
మీచిత్తాపహరణము
గావించిన
పరమాత్ముని
లీలకు
ఒక
చిన్న
నిదర్శనము.
భగవత్ప్రేమ
ఒక
పెద్ద
ప్రవాహము
దానిలో
మీ
మీ
ప్రేమ
భావములు
చిన్న
చిన్న
కాలువలవలె
చేరుచున్నవి
ప్రేమయే
దైవము;
ప్రేమించుటయే
దైవారాధన.
మానవుల
ప్రేమనదులు
సమ్మిళితమై
దైవప్రేమ
అనే
అనుగ్రహ
సాగరమును
చేరి,
సంగమించును.
ఈ
పండుగయందు
మీరు
కేరళమందు
“నేంద్ర”
పండు
ఆరగింతురు
కదా
?
అయితే,
తినుటకు
ముందు
దాని
తొక్కను
తీసి
వేయవలెను,
కదా
?
కమలా
పండును
తినుటకు
ముందు
కూడ
అట్లే
చేయవలెను.
కదా?
బలి
చక్రవర్తియొక్క
భక్తిని
స్వీకరించే
ముందు
భగవంతుడు
వాని
పశుబలము
ధనబలము
అధికార
బలము
అహంకారము
అనే
తొక్కను
తీసివేసినాడని
భాగవతము
చాటుచున్నది.
“
బలి
”
యొక్క
‘బలములన్నిటినీ
విసర్జించి
పరిశుద్ధ
చిత్తమును
మాత్రమే
భగవంతుడు
స్వీకరించినాడు
ఓణం
పండుగను
కేరళవాసులు
ఆచరించే
ఉద్దేశమిది
;
మానవులు
బలిచక్రవర్తిని
ఆదర్శముగా,
ఆధారముగా
అంగీకరించి,
తమ
ఆత్మానందమును
భగవదర్పితము
చేసి,
జీవితమును
సార్థకము
చేసుకొనవలెను.
ప్రతి
సంవత్సరము
మీరు
“
ఓణం
”
ను
ఆచరించి
వీడుకోలును
మాత్రము
జరుపుతున్నారే
కానీ,
సుగుణములకు
సత్చింతనలకు,
సత్కార్యములకు
స్వాగత
మందించుటలేదు;
అట్లు
చేసిననే.
“
ఓణం
”
పండుగ
నాచరించినందుకు
సాఫల్యము
సిద్ధించును.
మీ
అదృష్టమే
అదృష్టము
ఇతర
ప్రాంతముల
వారికీ
అవకాశము
ఇంతవరకూ
దొరకలేదు.
వారికి
కూడ
జాతీయ
పర్వదినములున్నాయి.
అయిననూ,
ఒక
కేరళ
రాష్ట్రము
వారికే
తమ
‘ఓణం
’ను
సంవత్సరము
సంవత్సరమూ
స్వామి
సన్నిధిలో
జరుపుకొనుటకు
అవకాశము
దొరకుచున్నది
అంటే
ఇది
మీ
భక్తి
ప్రపత్తులవలన
మీకు
లభించిన
భాగ్యమనే
చెప్పవచ్చును.
ఇంకొక
విషయం
-
భగవద్భక్తి
ఎక్కడ
ఎక్కువ
కనపించునో,
అక్కడనే
దానికి
విరుద్ధమైన
భావములు
చర్యలు
చెలరేగును.
కేరళలో
అట్టి
భావములు
బలముగా
నున్నవి.
అయితే,
మీరు
నిరాశ
పడక.
అధైర్యము
చెందక,
ఎదిరించి
మీ
శ్రద్ధాభక్తులను
ప్రకాశింప
జేసుకోవలెను.
వజ్రమును
కోసితే
కాని
చక్కగా
శోభాయమానముగా
ప్రకాశించదు.
మీ
మీ
ఆచరణను
చూచి
నాస్తికులు
కూడా
ఆస్తికులుగా
మారుతారు
నిజముగా.
నాస్తికులే
లేరు;
అందరి
హృదయ
పీఠములలోనూ
ఆత్మారాముడున్నాడు
వారిలోని
సత్య
స్వభావము,
ప్రేమభావము
ఇవన్నీ
ఆ
ఆత్మారాముని
లక్షణములే.
ప్రేమ
లేనివా
డెవ్వడూ
లేడు
ఆ
ప్రేమయే
భగవంతుడు.
ప్రేమతో
మెలిగితే
అందరినీ
సన్మార్గమందు
నడిపించవచ్చును”
Previous
←
A Warning to Students
Next
The Vedhic rite
→