Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · The Flag of Victory
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Flag of Victory
16 October 1974, Navarātri, the flag festival, Prasanthi Nilayam
Flag festival
Hospital anniversary
To the volunteers
1
▾
Meaning
Keep
ప్రశాంతినిలయమందు
ఆచరించే
ప్రధాన
పండుగలయందు
పతాకోత్సవమనేది
ఒక
ప్రధానమైన
సంప్రదాయము.
పతాకమనేది
విజయమునకు
చిహ్నముగా
వెలుగును
అయితే
నవరాత్రి
పండుగ
యొక్క
మొదటి
దినమైన
ఈ
నాడు
మనము
ఏ
విజయమును
సాధించినాము
?
మానవత్వము
వచ్చినందుకు
సాధించవలసిన
ముఖ్యమైన
విజయము
—
ఆత్మ
సందర్శనము,
తనను
తాను
తెలిసికోవటము.
జగత్తులోని
అశాశ్వత
వస్తువులను
తెలుసుకొని,
ఆ
విధముగా
తెలుసుకొనే
తనను
మాత్రం
తెలుసుకొనక
జీవితమును
కొనసాగించటము
కేవలము
హాస్యాస్పదముగా
నుండును.
లోకముయొక్క
స్థితిగతులను
పరికించినపుడు
ప్రతి
పదార్థమును
క్షణక్షణము
అనేక
రీతులుగా
మార్పు
చెందుతున్నదని
సులభముగా
తేలును.
విత్తన
మొక్కటి
మట్టిలో
నాటితే,
ఆ
ఒక్క
పదార్థము
అనేక
రూపములను
పొంది,
మొదలు,
కొమ్మలు,
రెమ్మలు,
ఆకులు,
పుష్పములు,
కాయలు
మొదలగు
వస్తువులుగా
రూపొందును
అనునది
సర్వవిదితమే.
రూపనామములు
మాత్రమే
కాదు;
ఒక్కొక్కదాని
గుణము
కూడ
వేరువేరుగా
వుండును.
వాటి
ఉపయోగము
కూడ
గుణము
మార్పువలన
వివిధముగా
వుండును.
ఒకే
మట్టి
కుమ్మరియొక్క
ప్రతిభ
ప్రయత్నము
వలన
అనేక
రూపనామములను
పొంది
అనేక
ప్రయోజనములకు
వీలగు
పాత్రవిశేషములుగా
మారును.
ఒకే
బంగారము
రకరకాల
నగలుగా
మారును.
ఇవి
అందరి
నిత్యానుభవమే
కదా?
అయితే,
దీని
అంతరార్థమేమి
అది
మనము
…గా
విచారించాలి.
ప్రతి
కార్యమునకూ
ఒక
కారణముండి
తీరాలి!
మట్టి
స్వయముగా
కుండగా
మారదు;
ఆ
మార్పుకు
కుమ్మరియే
కారణము.
మట్టి
ఉపాదాన
కారణము
మాత్రమే!
కుమ్మరి
దానికి
నిమిత్తకారణము.
ఆధారభూతమైన
మూలప్రకృతిని
సర్వజ్ఞుడైన
సర్వశక్తుడైన
భగవంతుడు
తన
తేజస్సుతో
ప్రకాశింప
చేయుచున్నాడు
కాబట్టి
ఉపాదాన
కారణము
నిమిత్త
కారణము
రెండూ
ఆ
పరబ్రహ్మమే
అని
తెలుసుకొని,
కర్తయూ
భోక్తయూ
అయిన
ఆ
భగవంతుని
భజించి
పూజించి
అనుగ్రహమును
సంపాదించి
తరించుటయే
మానవుని
ఆద్య
కర్తవ్యము.
అదియే
సరైన
విజయము
!
సాంఖ్యమందు
అణువుల
సంయోగమే
పదార్థముల
ఉత్పత్తి
స్థితి
లయముల
కాధారమని
చెప్పుదురు.
వివిధమైన
సంయోగముల
వలన
వివిధ
వర్ణ
విన్యాసములుగల,
రూప
నామ
గుణ
ప్రయోజనములుగల
పదార్థములుత్పన్నమగును
అనిన,
అంత
మాత్రములో
జగత్తుయొక్క
సమస్య
తేలదు.
ఈ
చేరిక
దేనివలన
యెవరి
ద్వారా
జరుగుచున్నది
అనే
ప్రశ్న
మిగిలియుండును.
2
▾
Meaning
Keep
అణువులలోని
చైతన్యమున
కాధారమేది?
దానిలో
గుప్తమై
అప్రకటితమైయున్న
శక్తియేది,
అది
యెట్లు
అభివ్యక్తమగును,
అను
విషయములను
ఈ
నాటివరకు
యెవ్వరూ
నిర్ణయము
చేయకున్నారు.
పాశ్చాత్య
దేశములలోని
తత్వవేత్తలు
కూడ,
ప్రకృతిలో
కర్తలేకున్న
కర్మలు
ఎట్లు
జరుగును
అనే
సమస్యకు
సమాధానమును
సాధించలేకున్నారు.
అయితే,
“ఏకోహం
బహుస్యాం”
అనే
సంకల్ప
బలమువలన
అఖిలాండకోటి
బ్రహ్మాండ
మంతయునూ
సృష్టించిన
పరమాత్ముని
గుర్తించి,
ఆ
పరమాత్మనే
సర్వభూతాంతరాత్మ
అని
తెలుసుకొని,
ఆనందానుభూతిని
పొందుటయే,
మానవులకు
సర్వశ్రేష్ఠ
విజయము!
అన్ని
జీవులూ
ఈ
విజయమును
సాధించవలెను.
అదే
దైవ
సంకల్పము!
ప్రశాంతి
పతాకయొక్క
అంతరార్థమిదియే!
అయితే,
మీరు
ఈ
విజయమును
సాధించియున్నారా?
లేదు.
అయిననూ,
ఆ
విజయమునకు
ఈ
పతాకయొక్క
మహత్తరమైన
గుర్తు,
కాబట్టి,
దీనిని
మరి
మరి
దర్శించుచూ,
దానిలో
లీనమైన
తత్వములను
గుర్తించుచూ,
దానిని
ఒక
ఉత్తమ
మార్గదర్శకముగా
అంగీకరించి
ఆదరించి
అనుసరించుట
సాయి
భక్తుల
ఆద్య
కర్తవ్యము.
మీ
తాత
ముత్తాతలను
మీరు
చూడక
పోయిననూ,
తండ్రిదగ్గరనుంచి
వారి
మహత్వపూర్ణ
జీవితాదర్శములను
తెలుసుకొని
మీ
పూర్వీకులను
కృతజ్ఞతతో
స్మరించుచూ
వారి
అడుగుజాడలలో
నడచేందుకు
పూనుకోవలెను,
కదా
?
తాత
ముత్తాతల
ఆస్తిపాస్తులను
మాత్రము
అనుభవించిన
చాలదు;
వారు
ప్రోగు
చేసిన
ఆనంద
ధనమును,
సుజ్ఞాన
విజ్ఞాన
ప్రజ్ఞాన
ధనములను,
వీటిని
కూడ
అందుకొని,
వారి
ఆశయములను
అనుసరించాలి.
అపుడే
వారి
సంతతి
వారము
అని
చెప్పుకొనుటకు
అర్హత
కలుగును.
కృతజ్ఞత
లేని
జీవితము
వ్యర్థజీవితమే
యగును.
ఈ
ప్రశాంతి
పతాకను
మీ
మీ
హృదయ
మందిరములో
ఎగరవేసి,
దాని
అంతరార్థమును
అపుడపుడు
మననము
చేసికొంటూ,
ఆధ్యాత్మిక
సాధనలను
అభివృద్ధిచేసుకొని,
పూర్వీకులవలె
మీరు
కూడా
విజయమును
సాధించి
తరించండి
అని
ఆశించి
ఆశీర్వదించుచున్నాను.
Previous
←
The Vedhic rite
Next
The Keeping of Health
→