Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1975 · The cosmic form that is the universe
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The cosmic form that is the universe
23 November 1975, Fiftieth Birthday, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
His poems 54
ఏ
దేశమేగినా
నీ
నామమే
సుమీ
సత్యసాయీశుడనుచు
నిత్య
పఠన
ఏ
ఊర
చూచినా
ఈ
నామమే
సుమీ
సత్యసాయీ
యనుచు
నిత్యజపము
ఏ
నోట
విన్ననూ
ఈ
నామమే
సుమీ
సాయిరామా
అనుచు
సత్యజపము
ఎచ్చోట
చూచినా
ఈ
నామమే
సుమీ
సత్యసాయీ
యనుచు
నిత్యభజన
ఇట్లు
విశ్వమెల్లడ
వ్యాప్తియై
వెలయునట్టి
భక్త
జనులకు
ప్రాపుయై
బరగునట్టి
భక్తి
నొసగి
రక్షించెడి
శక్తిమయుడు
పర్తివాసుడు
మిమ్మేల
ఎత్తుకొనడు?
భక్తులారా!
ధర్మసంస్థాపనకై
పాటుపడుతున్న
కార్యకర్తలారా!
లోకశాంతి,
లోకకల్యాణములకై
క్రియాచరణనిరతులైన
త్యాగశీలులారా!
ధర్మప్రచారకులారా!
ప్రపంచము
అన్ని
దేశములనుండి
ఇంతమంది
ప్రజలు
ఇచ్చట
జేరి
ఆనందము
నందుకొనుట
అనేది
నిజముగా
సంతోషదాయక
సన్నివేశము.
మానవజాతియొక్క
హృదయమందు
ఏదో
ఒక
వెలితి,
ఏదో
ఒక
తీవ్ర
ఆవేదన
ఉన్నది
కాబట్టియే
ఇన్ని
వేలమంది
ఈ
ప్రశాంతి
నిలయమందు
సమావేశమైనారనేది
స్పష్టము.
పూర్ణ
ఆరోగ్యమున్న
సమయమందు
డాక్టర్ల
దగ్గరకు,
పరీక్షకొరకుగాని,
మందుల
నిమిత్తం
ఆస్పత్రులకుగాని
వెళ్ళుటకు
అవసరం
లేదు.
ఏదో
ఒక
దోషము,
ఒక
లోపము
ఉంది
కాబట్టే
అందరూ
ఇక్కడ
చేరినారు.
కాకున్న,
ఈ
సమావేశము
జరుగునది
కాదు.
నిజముగా
మీరు
ఎందుకీ
ప్రశాంతి
నిలయమునందు
చేరినారు?
పరిచితులైన
సభ్యులతోను,
అపరిచితులైన
ఇతరులతోను
రెండు
దినములు
సరససల్లాపములాడుటకు
మాత్రము
కాదు.
నవ్యమైన,
భవ్యమైన
ఏదో
ఒక
శక్తిని
ఇచ్చట
సంపాదించి,
మీతో
కొనిపోయే
నిమిత్తమై
మీరందరూ
వచ్చినారనేది
నాకు
తెలుసు.
నిత్యానుభవము
సత్యమా?
ప్రకృతి
స్థితి
సత్యమా?
తెలిసియో
తెలియకనో
కొన్ని
సమస్యలు
మానవుని
బాధించుచుండును.
మానవుని
జీవితము
సూర్యోదయముతో
ప్రారంభమై,
రాత్రి
నిద్రించేవరకూ
సాగుచున్నది.
ప్రతి
ప్రాణికీ
ఇదే
విధముగ
జరిగిపోవుచున్నది.
అయితే,
సూర్యునికి
ఉదయాస్తమయములు
ఉన్నవా?
మన
దృష్టికి
సూర్యుడు
కనబడునప్పుడు
ఉదయమనియు,
కనుమరు
గైనప్పుడు
అస్తమయమనియు,
కనపడు
దిక్కు
తూర్పు,
మరుగైన
దిక్కు
పడమట
అనియు
పదములను
వాడుదుమేగాని,
గోళాకారమైన
భూమిలో
పూర్వ,
పశ్చిమ
దిక్కులుగాని,
దక్షిణోత్తర
దిక్కులుగాని
నిజముగా
లేవు.
ఈ
సత్యమును
గుర్తించిన
తరువాత
కూడా
సూర్యుడు
మన
దృష్టికి
గోచరమైనప్పుడు
ఉదయించినాడని,
అగోచర
మైనప్పుడు
అస్తమించినాడని
చెపుతూ,
దిక్కులను
గుర్తించుచూ
నిత్యానుభవమునే
ఆధారముగా
తీసికొని
సత్యమును
త్యజించుచున్నాము.
అయితే,
జీవితానుభవము
ఒకటి,
ఉన్నది
మరొకటి.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
మనము
కూర్చున్న
బల్ల
చలించినప్పుడు
మనము
కూడా
చలించుచున్నాము.
అది
తిరుగునప్పుడు
మనము
కూడా
తిరుగుచున్నాము.
2
▾
Meaning
Keep
బస్సులో,
బండ్లలో
ప్రయాణం
చేసినప్పుడు
అవి
కదలినప్పుడు
మనమూ
కదలుచున్నాము.
అయితే,
ఈ
భూమి
ఒక
గంటకు
వెయ్యి
మైళ్ళ
పైన
వేగముతో
కదలుచుండినప్పుడు
కూడా
మనము
కదలిక
లేకనే
ఉంటాము.
ఇది
నిత్యానుభవము.
నిత్యానుభవము
సత్యమా?
ప్రకృతి
స్థితి
సత్యమా?
ఇది
అందరూ
యోచించ
వలసిన
విషయము.
అనుభవమొక్కటి,
దానికి
ఆధారమైనది
మరొక్కటి.
గోచరించే
వస్తువుల,
విషయముల
ఆధారమును
గుర్తించేదే
జ్ఞానము.
“ఈ
జగత్తుకు
ఆధారమేది?”,
అని
తెలుసుకొనుటకు
ప్రయత్నము
సలుపుట
అత్యవసరము.
మన
పూర్వీకులు
అనేక
సంవత్సరములు
తపస్సు
ఆచరించి,
ఈ
సత్యమును
గుర్తించి,
అంతరార్థమైన
ఆధారమొక్కటి
ఉన్నదని
బోధించుచు
వచ్చిరి.
వారిపైన
విశ్వాసమును
కోల్పోయి,
అసత్యమునే
సత్యమని
నమ్మి,
చంద్రుడు
ఒక
దేవత,
సూర్యుడు
దేవుడు,
భూమి
ఒక
దేవి
అని
వారు
విశ్వసించినది
అసత్యమని
త్రోసివేసి,
అవన్నియు
నిశ్చేతన
గోళములని
ప్రచారము
చేయుచున్నారు
విజ్ఞానులు.
సమస్తమునకు
ఆధారమైన
దివ్యశక్తి
నిజముగా
వీరికి
చేతనము,
అచేతనము
అన్న
ఏమీ
తెలియదు.
జగత్తంతయు
పరమాణువుల
సమూహమే.
పరమాణువులు
అలల
రూపమును
దాల్చి,
ఎలక్ట్రాన్,
ప్రోటాన్,
న్యూట్రాన్
శక్తుల
ద్వారా
రకరకాల
స్వరూపములను,
స్వభావములను
ధరించుచున్నవి.
అది
ఒక
గోడ.
దానిని
ఎందుకు
‘గోడ’
అని
అంటున్నాము?
దాని
ఎత్తు,
వెడల్పు
ఇటువైపునుంచి
అటువైపు
చూచుటకు
వీలుకాని
స్థితి...
ఇవన్నిటినీ
గమనించి
అది
‘గోడ’
అని
నిర్ణయించుచున్నాము.
కాని,
అదికూడా
అసంఖ్యాకమైన
పరమాణువుల
చేరికయే.
మరొక
విశేషము
-
ఒక్కొక్క
అణువులోనూ
ఖాళీ
ప్రదేశమే
ఎక్కువ.
అంతరిక్షములోని
నక్షత్రములవలె
పరమాణువుయొక్క
అంతర్భాగమున
శక్తిపుంజములైన
ఎలక్ట్రాన్
మొదలైనవి
ఉండునుగాని,
బహుభాగము
ఖాళీ
ప్రదేశమే
కాబట్టి,
అది
గోడ
కాదు.
బహుభాగము
ఖాళీయై
ఉన్న
పరమాణువుల
సమూహమే.
అయితే,
ఈ
సత్యమును
తెలిసికొన్న
విజ్ఞాన
శాస్త్రజ్ఞులుకూడా
అది
గోడ
కాదని
ఒప్పుకుంటున్నారా?
లేదు.
కనపడేది
నిజమా?
కనపడని
ఆధారము
నిజమా?
పరమాణువులోని
శక్తికి
ఆధారమేది?
అదే
పరాశక్తి,
ఆదిశక్తి.
‘అణోరణీయాన్
మహతో
మహీయాన్’
అని
వేదాంతము
గుర్తించిన
పరమాత్ముని
దివ్యశక్తి.
సముద్రమునుంచి
ఒక
టంబ్లరులో
నీరు
తెచ్చి,
దానిలో
ఒక
చిన్న
రాయి
వేసిన
అనేక
అలలు
తయారై
నీరు
భిన్నభిన్నమగును.
సముద్రము
నందు
ఒక
తుపాను
వచ్చిన
పెద్దపెద్ద
అలలు
బయలుదేరి
స్టీమర్లు
కూడా
మునిగిపోవును.
అయితే,
రెండింటిలోని
శక్తి
ఒక్క
ఆధారమునుండి
వచ్చినదే.
ఈ
బల్బులో
కరెంటు
తక్కువ
ప్రవహించును,
దానిలో
ఎక్కువ
ప్రవహించును.
కాని,
రెండింటిలోని
కరెంటు
ఒక్కటే.
అన్ని
తరంగములనూ
చలింపజేసే
ఆదిశక్తి
ఆ
పరాశక్తి
కాక
వేరుకాదు.
చంద్రమండలములో
కూడా
వస్తువులుగా,
పదార్థములుగా
కనిపించు
సమస్తము
పరమాణువులే.
కాబట్టి,
దానిని
‘దివ్యస్వరూపము’,
‘దేవత’
అని
నిర్ణయించిన
తప్పేమీ
లేదు.
జగత్తంతా
పరాశక్తియొక్క
ప్రకాశమే,
ప్రకట
స్వరూపమే.
ఇచ్చట
ఉన్నది,
అచ్చట
లేదు
అని
తలచుట
అజ్ఞానము.
పరమాణు
శక్తికి
ఆధారమైన
పరాశక్తిని
పురస్కరించుకొని
ఋషులు
‘ఈశ్వరస్సర్వ
భూతానాం’
అని
ఉచ్చరించుచూ
వచ్చిరి.
జగత్తు
కాని,
జీవి
కాని,
లోకమంతయు
ఈశ్వరమయమే.
ఈశ్వరశక్తిని
ప్రకటించక
దేనికీ
అస్థిత్వము
లేదు.
వ్యక్తి
వేరు,
ఈశ్వరుడు
వేరు;
ఇది
వేరు,
అది
వేరు...
అనే
భేదభావములు
తొలగించి
అన్నీ
ఆ
దివ్యశక్తియొక్క
అంశమే
అని
విశ్వసించి
మెలగడమే
జ్ఞానియొక్క
లక్షణము.
సర్వశక్తిమయుడైన
ఈశ్వరుని
అంశములే
జగత్తులోని
సమస్త
జీవులు,
వస్తువులు,
విషయములు.
రకరకములైన
బల్బులన్నీ
మెయిన్
స్విచ్చిపైన
ఆధారపడియున్న
విధానము
గుర్తించినవారెవ్వరూ
భేదభావములకు
స్థానమివ్వరు.
3
▾
Meaning
Keep
ఆదిశక్తినుంచి
ఆవిర్భవించినవే
ఈ
సర్వశక్తులు.
ఈ
సత్యమును
గుర్తించిన
చంద్రుడు
వేరు
కాదు,
సూర్యుడు
వేరు
కాదు.
అసలు
జడమనేదే
లేదు,
అంతయు
చిత్
స్వరూపమే;
చేతనాపూర్వమే.
భేదభావములు
అజ్ఞానులయొక్క
లక్షణములు
‘చంద్రమా
మనసో
జాతః’,
మనస్సుయొక్క
అధిదేవత
చంద్రుడు.
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’.
మనస్సులోని
దివ్యశక్తియే
సర్వసృష్టికి
మూలకారణము.
రాత్రి
నిద్రించు
సమయమునందు
కలలో
ఏదో
ఒక
చెఱసాలలో
బంధింపబడి,
కఠిన
పరిస్థితిలో
నిద్రించినట్టి
అనుభవములుండును.
మేలుకొన్న
తరువాత
తన
భవనములో
హంస
తూలికా
తల్పముపై
పవళించి
ఉన్నాననే
అనుభవము
వచ్చును.
అది
నిజమా?
ఇది
నిజమా?
స్వప్నములో
ఉన్నంతవరకు
అదే
నిజము.
అది
తీరిన
తరువాత
ఇది
నిజమైనది.
మన
మనస్సే
ఆ
చెఱసాలను,
ఈ
మిద్దెలను,
మేడలను,
మనకు
సుఖదుఃఖ
సన్నివేశములను,
సంఘటనలను
నిర్మించినది.
వేరే
ఏమీ
లేదు.
వాటి
అన్నింటిలోనూ
మనస్సు
లీనమై
ఉండును.
మనలోపల,
బయట
సర్వత్రా
మనస్సు
లీనమై
ఈ
దృశ్యప్రపంచమును
సృష్టించుచున్నది.
మనస్సుయొక్క
ఈ
శక్తిని
కూడా
ఆ
దివ్యశక్తిగా
భావించి,
ఆదరించిన
అది
బంధించదు.
విముక్తిని
అందించును.
‘అంతర్బహిశ్చ
తత్సర్వం
వ్యాప్య
నారాయణస్థితః’.
దీనికి
అంతర్దృష్టి
అత్యవసరము.
కోట్ల
మైళ్ళు
అంతరిక్షయానము
చేయుదురేగాని,
అర్ధ
ఇంచి
తనలోనికి
ప్రయాణము
చేయుటకు
మానవుడు
పూనుకొనడు.
విజ్ఞానమార్గము,
యంత్రోపాసనచే
అంతరిక్ష
యానమునకు
పూనుకొన్న,
ఆధ్యాత్మిక
మార్గము
మంత్రోపాసనచే
హృదయాంతరాళమునకు
ప్రయాణము
చేయును.
బహిర్దృష్టి
ఏనాటికీ
సత్యమును
చేరదు.
పరమాణువు
సత్యం
కాదు.
పరాశక్తియే
సత్యము.
అది
ఆధేయము,
ఇది
ఆధారము.
ఈ
ఆధారమును
తెలిసికొనుటయే
సత్యసాయి
సంస్థలయొక్క
లక్ష్యముగా
ఉండాలి.
‘బ్రహ్మ
సత్యం
జగన్మిథ్య’
అనే
మహావాక్యముకూడా
దీనినే
బోధించును.
‘సర్వం
విష్ణుమయం
జగత్’
అనే
వాక్యముకూడా
ఈ
సత్యమునే
గుర్తించును.
ఏ
శక్తీ,
ఏ
వ్యక్తీ
స్వతంత్రముగా
ఉద్భవించడం
జరగదు.
అన్నీ
పరమాత్ముని
నుండియే
ఆవిర్భవించును.
“భేదభావములు
అజ్ఞానులయొక్క
లక్షణములు”
అనే
అద్వైత
సిద్ధాంతమును
ఆచరణలో
తెచ్చుటకు
సర్వజన
సమాన
ప్రేమయే
ముఖ్య
సాధన.
ఆధ్యాత్మిక
సంస్థలయందు
ఇట్టి
సాధన
అత్యవసర
మని
నిరూపించుటకే
సత్యసాయి
సంస్థలను
స్థాపించినాము.
సేవాసమితి,
మహిళా
విభాగ్,
సేవాదళ్,
భజన
మండలి,
బాలవికాస్,
ఇవన్నీ
ఒక
చేతిలోని
వ్రేళ్ళవలె
ప్రేమతో
పరస్పరం
సహకరించి
ఏకలక్ష్య
సంపాదన
కొరకు
శ్రమించాలి.
వాటిలోని
సంయుక్త
అనుబంధ,
సంబంధములను
అందరూ
గుర్తించడం
అవసరం.
ఇచ్చట
మీరందరూ
ఒక
చిన్న
ఆనందమును
అనుభవింప
వీలున్నది.
ప్రపంచమంతటినుండి
అన్ని
దేశములవారు
ఈ
ఆడిటోరియంలో
చేరినా
రంటే
మీ
ప్రేమను
మీరు
సర్వవ్యాప్తి
గావించినప్పుడు
భగవంతుడు
కూడా
మీ
ఎదుట
అణుస్వరూపుడుగా
గోచరించును
అనేది
స్పష్టమగును.
భగవంతుడు
విశ్వవిరాట్స్వరూపమును
దాల్చినాడంటే,
అర్థమేమిటి?
విశ్వమంతా
తన
రూపమే.
విశ్వములోని
సర్వ
పదార్థములూ
తనలోనివే.
వేరైనది
ఏదీ
లేదనేది
అర్థము.
దీనిని
హృదయమునందు
దృఢము
చేసికొని
ప్రేమను
అందరిపై
ప్రసరింపజేసే
నిమిత్తమై
సత్యసాయి
సంస్థలు
స్థాపింప
బడినవి.
సర్వ
వ్యాపకమైన
ఆ
ఈశ్వరశక్తిని
గుర్తించి,
వర్తించుటకై
ఈ
సత్సంగము
మీకు
ధైర్యసాహసములను
అందించును.
4
▾
Meaning
Keep
త్యాగమే
భక్తియొక్క
లక్షణము
నిజముగా
ఎన్నో
కష్టములకోర్చి
స్వామియొక్క
ఆనందమును
అందుకోవాలనే
ఆశతో
బయట
చిన్నచిన్న
డేరాలు
కట్టుకొని,
బట్టలు
కప్పుకొని,
ఎండ-చలి
సహించుకొని
నివసించే
వేలాదిమంది
...
వారే
భక్తులు.
ఆ
త్యాగమే
భక్తియొక్క
లక్షణము.
దేహసంబంధమైన
సుఖ
సంతోషాలను,
ఆహార
విహార
అనుకూలాలను
మీరు
త్యాగం
చేసినారు.
ఈరీతిగా
కేవలము
ఆత్మానందమును
అందుకొనుటకు
కొద్దిమందియైనా
దృఢముగా
నిలిచిన
భారతదేశముయొక్క
భవిష్యత్తు
అనతికాలములోనే
తిరిగి
జగద్వ్యాపకమైన
కీర్తితో
వెలుగును.
దానిని
గురించి
మీరు
విచారించ
నక్కర్లేదు.
భారతీయ
సంస్కృతి,
దానిలో
ప్రకాశించుచున్న
ప్రేమతత్త్వము
త్వరలోనే
లోకకల్యాణమును
చేకూర్చును.
అనాది
వేదవిహితమైన
ఆ
సంస్కృతిని
ఆచరించి,
ఆనందించుటకు
మీరు
సంసిద్ధులై,
ఒక
సైన్యముగా
తయారు
కావలెనని
మీకు
నేను
ఆదేశమీయుచున్నాను.
ధైర్య
సాహసములతో,
ఆధ్యాత్మిక
మార్గమునందు
ప్రవేశించి,
నిరుత్సాహమునకు,
అధైర్యమునకు
చోటివ్వక
ఆత్మశక్తిని
అనుభవించి
మీరందరూ
ఆనందించాలని
ఆశిస్తున్నాను,
ఆశీర్వదిస్తున్నాను.
Previous
←
Serving the Poor is Serving God
Next
The message of love
→