Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1976 · The four steps
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The four steps
23 November 1976, Fifty-first Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
నిద్రలోనున్న
వారిని
సులభముగా
మేలుకొలుపవచ్చును.
అయితే,
కన్నులు
మూసుకొని
నిద్రించినట్లుగా
నటించేవారిని
మేలుకొలుపుటకు
ఎవరి
తరమూ
కాదు.
అట్లనే,
విషయము
తెలిసినవారికి
చెప్పవచ్చును.
తెలియనివారికి
బోధపడేరీతిగా
చెప్పి
తెలుపవచ్చును.
తెలిసీ
తెలియనివారికి
తెలుపుట
అసాధ్యమైన
పని.
“నా
దివ్య
విభూతులు
సాధించినవి
కావు”
కొన్ని
క్షణముల
ముందుగా
కేంద్ర
మంత్రి
టి.ఎ.
పాయ్
మరియు
గోకాక్
ఇరువురుకూడా
అనేక
విషయములను
చక్కగా
మీకు
అర్థమయ్యే
రీతిగా
బోధించినారు.
భగవత్తత్త్వమునకు
మానవులు
యుగయుగాలనుండి
ఎన్నో
మారుపేర్లు
పెడుతూ
వచ్చినారు.
దివ్యత్వమునకు
అనిత్యమైన
పేర్లు
పెడితే
సరియగునా?
కొన్ని
పరిమితులకు
మీరి
యోచించుటకు,
వచించుటకు
మానవులకు
వీలుకాదు.
స్వామియొక్క
ప్రేమతత్త్వమును
గుర్తించిన
వ్యక్తులకు
మాత్రమే
ఇది
సాధ్యము.
నా
దివ్యవిభూతులు
సాధించినవి
కావు.
మధ్యలో
చేర్చినవి
కావు.
మీరుకూడా
ఈ
దివ్య
విభూతులను
గుర్తించుటకై
ఇచ్చటికి
రాలేదు.
“దైవత్వమును
ఆశ్రయించి,
అనుభవించి,
ఆనందించుటకై
వచ్చితిరి”
అని
నాకు
తెలుసు.
దైవము
దేశ,
కాల
పరిస్థితులను
పురస్కరించుకొని
విభూతులను
చాటవలసి
వున్నది.
వాటికి
అద్భుత
కార్యములు,
చమత్కారములు,
‘మిరకిల్స్’
అని
చెబుతూ
వస్తుంటారు.
అయితే,
అవి
చమత్కారమొక్కటి
మాత్రమే
కావు.
చమత్కారము
తరువాత
రెండవది
సంస్కారము,
మూడవది
పరోపకారము,
నాల్గవది
సాక్షాత్కారము.
ఈ
నాలుగు
సోపానము
లున్నాయి
భక్తరక్షణలో,
ధర్మస్థాపనలో.
ఆకర్షణ
దివ్యత్వముయొక్క
ప్రధాన
లక్షణము
చమత్కారమనగా
దీనికి
ఆకర్షించడము
అని
మరొకరీతిగా
చెప్ప
వచ్చును.
‘రమయతి
ఇతి
రామః’,
రాముడు
కూడా
ఆకర్షించినాడు.
‘కర్షతి
ఇతి
కృష్ణః’,
కృష్ణుడు
కూడా
చమత్కారములవలన
ఆకర్షించినాడు.
ఆకర్షించేది
దివ్యత్వముయొక్క
మొదటి
గుణము.
దైవత్వముయొక్క
ప్రధానమైన
లక్షణము.
ఆకర్షించేది
దేనికోసం?
ప్రజలను
మోసగించుటకా?
వారిని
పెడమార్గం
పట్టించుటకా?
కాదు,
కాదు.
వారిని
సంస్కరింపజేయుటకే.
సంస్కారముయొక్క
లక్ష్యమేమి?
వారిని
పరోపకారులుగా
తయారు
చేయుటయే.
పరోపకార
దీక్షతో
వారు
స్వార్థమును
మరచి,
అందరిలోనున్న
ఏకత్వమును
గుర్తించి
సాక్షాత్కారమును
పొందుటయే
పరమ
లక్ష్యము.
‘నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానశుః’;
త్యాగము
వలననే,
పరోపకారమువలననే
అమృతత్వమనే
మోక్షస్థితిని
పొందుటకు
సాధ్యమగును.
సంస్కారమువలన
మానవులు
త్యాగబుద్ధిని
అభివృద్ధి
చేసుకొందురు.
‘యావత్ప్రపంచమునందలి
మానవజాతిపై
విశాలమైన
తన
ప్రేమతత్త్వమును
వెదజల్లే
దీక్షయే
స్వామిది’,
అని
గుర్తించడం
అత్యవసరము.
ఈ
నాలుగు
సోపానములలోనూ
అంతర్వాహినిగా
ప్రవహించేది
అట్టి
ప్రేమతత్త్వమే.
ప్రేమద్వారానే
ఆకర్షణశక్తి
లభించును
ఇంక,
చమత్కారమనే
మొదటి
సోపానమును
కొంతవరకు
విచారిస్తాము.
ఉదాహరణకు,
ఒక
పుష్పము
విషయమునే
తీసుకోండి.
దాని
రూపము,
సుగంధము
ఆకర్షణీయంగా
లేకుండిన
ఎవరూ
దానిని
ఆశించరు.
చేతిలో
పట్టుకొనరు.
మార్కెట్టులో
ఫలములను
జోడించి
పెట్టినను,
అవి
ఆకర్షణీయముగా
లేకుండిన
మనము
వాటిని
కొని
అనుభవించుటకు
వీలుకాదు.
2
▾
Meaning
Keep
నిత్యజీవితమందు
ప్రతి
కృత్యమును
పరీక్షించిన
ఆకర్షణీయమైన
వాటినే
అనుభవించుటకు
మానవులు
పూనుకుంటారు,
అనుట
స్పష్టమగును.
ఆకర్షణ
అనేది
దివ్యత్వముయొక్క
ప్రధాన
గుణము.
ప్రేమద్వారానే
ఆకర్షణశక్తి
లభించును.
అన్యమార్గములో
పరిశీలించిన
ఇది
అర్థమయ్యేది
కాదు.
దీనిద్వారా
మిమ్ములను
దగ్గరకు
చేర్చుకొనేది
పవిత్రమైన
సంస్కారమును
అందించు
నిమిత్తమే.
సంస్కారమువలన
విలువ
పెరుగుతుంది
నిజముగా
మానవునికి
సంస్కారమువలన
ఘనత
అధికమగును.
సంస్కారము
లేని
మానవుడు
పశుసమానుడే.
అతనికి
ఎట్టి
విలువయు
ఉండదు.
మీ
చేతిలో
స్టెయిన్లెస్
స్టీలు
గడియారమున్నదే!
దానిలో
స్టెయిన్
లెస్
స్టీలుకు
రెండణాల
విలువకూడా
ఉండదు.
అయితే,
సంస్కారము
వలన
అది
నట్లు,
బోల్టులు,
స్ప్రింగులుగా
మారి
కాలప్రమాణమును
చూపుటవలన
రెండణాల
స్టీలు
ఇన్నూరు
మున్నూరు
రూపాయల
విలువగల
గడియారంగా
తయారైనది.
అట్లనే,
సామాన్య
మానవుడు
సదాచారము,
సన్మార్గము,
సత్ప్రవర్తనము,
సచ్చింతనలు,
సద్గుణము
అనే
సంస్కరణ
క్రియలవలన
మహనీయుడుగా
గొప్ప
విలువైన
స్థానమును
పొందగలుగుతాడు.
కనుక,
పవిత్ర
ప్రబోధలను
వినడము,
విశాలమైన
ప్రేమతత్త్వమును
సాధించడము,
మరియు
సమాజసేవను
ఆచరించడమువలన
మానవుడు
మహనీయుడుగా
ప్రకాశించును.
దానికొరకు
నేను
చమత్కారములద్వారా
వారిని
ఆకర్షించి,
సంస్కారముతో
రూపొందింపజేసి
పరోపకార
మార్గములో
ప్రవేశింప
జేస్తున్నాను.
సమాజసేవలో
ఆసక్తి
కలిగి,
హృదయపూర్వకముగా
దానిని
ఆచరించినప్పుడు
వారికి
మానవసోదరత్వము,
దైవపితృత్వము
బోధపడి,
అహంకార,
మమకారములు
క్షీణించి,
ఆధ్యాత్మిక
మనోభావము
అభివృద్ధి
అగుటకు
ఎంతైనా
అవకాశ
మేర్పడును.
దివ్యత్వమును
గుర్తించుటకు
అధికారము
అత్యవసరము
“దైవము
ఇట్టి
విభూతులనే
చేయవలెను,
ఇట్టివాటిని
చేయకూడదు”
అనే
నిబంధనలు
ఏమాత్రము
లేవు.
అణువు
మొదలు
ఘనమువరకు
ఏమైనా
చేయుటకు
తనకు
అధికారమున్నది.
అది
తన
ఇష్టముగాని,
పరులెవ్వరికీ
దానిలో
ప్రవేశించుటకు
అధికారము
లేదు.
దైవత్వమును
గుర్తించుటకు
ప్రప్రథమముగా
అధికారము
అత్యవసరము.
వైద్యమార్గమునందు
రోగ
విషయాలను
పరిశీలించి,
తగిన
ఔషధోపచారములను
నిర్ణయించుటకు
తర్ఫీదు
పొంది,
డిగ్రీలు
సంపాదించిన
డాక్టర్లే
అధికారులు.
భవనములను
లేక,
వంతెనలను
కట్టుటకు
ఇంజనీర్లే
అధికారులు.
అధికారము
లేనివారలు
దైవతత్త్వమును
విమర్శించిన
అది
హాస్యాస్పదమే
అగును.
దివ్యత్వమును
గుర్తించకపోవడము
ఒక
రోగము.
అది
యోగము
కానేరదు.
“రాముడు,
కృష్ణుడు,
క్రీస్తు
అందరూ
చమత్కారములు,
అద్భుత
కార్యములు
చేసిరి”,
అని
వారి
పవిత్ర
చరిత్రలు
తెలుపుచున్నవి.
రాముడు
తాను
ధర్మమార్గమునందు
ప్రవేశించి,
అద్భుత
కార్యములచే,
చమత్కారములచే
దిగ్విజయము
గావించుచూ
వచ్చాడు.
కోతులచే
లంకకు
వంతెన
నిర్మించినాడని
భారతీయ
చరిత్రనుంచి
అర్థమగుచున్నది.
ఆ
దేశ,
కాల
పరిస్థితిని
పురస్కరించుకొని
అట్టి
చమత్కారము,
అద్భుత
కార్యము,
ఆ
కాలమునకు
సత్యమైనది.
కృష్ణుడు
గాఢమైన
వర్షధారనుండి
ప్రజలను
కాపాడుటకు
కొండనెత్తి
మిరకిల్
జరిపాడు.
అయితే,
కృష్ణుడు
వంతెన
కట్టలేదే,
కాబట్టి
కృష్ణుడు
అవతార
పురుషుడు
కాడు,
అని
ఎవ్వరూ
విమర్శించలేదు.
శంకరాచార్యులవారు
ఒక
అబల
ఇంటికి
భిక్షకొరకు
వెళ్ళినప్పుడు
ఆమె
తనదగ్గర
ఏమియు
లేకపోవడంవలన
ఒక
ఉసిరిక
కాయ
ఇచ్చినదట.
దానిని
చూసి
జాలిపడి,
ఆచార్యులవారు
ఆశ్చర్యకరముగా
బంగారు
ఉసిరి
కాయల
వర్షమును
కురిపించి,
ఆమె
బీదరికమును
అంతము
గావించిరి
అని
ప్రాచీన
గ్రంథములు
ప్రబోధిస్తూ
వచ్చినవి.
శంకర
పీఠములవారుకూడా
ఈ
అద్భుతమునుగూర్చి
ప్రత్యేకముగా
వ్యాఖ్యానము
చేయుచు
శంకరులవారి
దివ్యత్వమును
చాటుచున్నారు.
3
▾
Meaning
Keep
అయితే,
అట్టి
వ్యక్తులే
ఈనాడు,
“రాముల
వారు
గడియారాలు
ఇవ్వలేదు.
కృష్ణుడు
గడియారాలీయలేదు.
శంకరులు
గడియారాలీయలేదు.
సత్యసాయి
గడియారాలిస్తున్నారు.
సత్యసాయి
బంగారు
ఉసిరి
కాయలీయలేదు.
కాబట్టి,
ఇది
దైవత్వము
కాదు”,
అంటారు.
కృష్ణుడు
బంగారు
ఉసిరి
కాయలీయలేదే!
కాబట్టి,
కృష్ణునిలో
దైవత్వము
లేదా?
ఇవన్నీ
దేశ,
కాల
పరిస్థితిని
అనుసరించి
ఉన్నవని
మీరు
మరచి
పోతారు.
ఆనాడు
గడియారాలు
అనవసరము.
ఈనాడు
కలియుగములోపల
గుమ్మడికాయలు,
తోటకూరలనుకూడా
అడిగేవారున్నారు.
నిజముగా
దైవత్వమును
గుర్తించుటకు
పూనుకున్న
మానవుల
బుద్ధి
అనేక
విధములుగా
వికసించును.
“ఆత్మయే
మానవుని
నిజ
సత్యము”
అనే
మార్గమును
ఆశ్రయించక
అన్యమార్గమును
అనుసరించితే
లాభము
లేదు.
మీమీ
విశ్వాసముపైనే
మీరు
ఆధారపడాలి.
పరుల
విశ్వాసమును
ఆధారముగా
స్వీకరించకూడదు.
సత్యసాయియొక్క
విభూతులన్నీ
దివ్యత్వమునకు
నిదర్శనములే!
సత్యసాయియొక్క
విభూతులన్నీ
ప్రదర్శనములు
కావు;
దైవత్వమునకు
నిదర్శనములే.
ఆధ్యాత్మికరీతిగా
విచారించినప్పుడు
జరుగుతున్నది
సత్యసాయి
పరిశోధన
కాదు,
భక్తుల
పరీక్షయే.
గాలిలో
ధాన్యమును
తూర్పారబట్టి,
తరువాత
గట్టి
గింజలను
మాత్రమే
రైతులు
ఇంటికి
తెస్తారు
కదా!
అట్లనే,
నిరీశ్వరవాదము
అనే
గాలిలో
ఇప్పుడు
ఇదొక
పరీక్ష.
ఇంకొక
విషయము.
నిజముగా
ఇలాంటి
మాటలు
యుగ
యుగముల
నుంచి
దైవత్వమువెంట
ఎప్పుడూ
వచ్చునవే.
ఈ
వాతావరణముకూడా
‘సత్యసాయి
తత్త్వము
దైవత్వమే’
అని
దృఢపరచుచున్నది.
రామావతార
కాలమందు
మహా
శక్తిమంతులైన
అగస్త్య
మహర్షి,
విశ్వామిత్ర
మహర్షి,
వసిష్ఠ,
వామదేవ,
భరద్వాజ
మహర్షులు
ఉండినను
ఒక్క
రాములవారి
విషయమునందే
తర్క
వితర్కములు
ఏర్పడినవి.
ఒక్క
రామతత్త్వమును
మాత్రమే
పరిశోధించుటకు
పూనుకున్నది.
కృష్ణావతారకాలమందుకూడా
మహాశక్తిమంతులు
లేకపోలేదు.
అయిననూ,
ఒక్క
కృష్ణతత్త్వమును
మాత్రమే
అవకాశవాదులు,
అవిశ్వాస
పీడితులు
పరిశోధించుటకు
ప్రయత్నించిరి.
ఇప్పుడుకూడా
అంతే!
ఎవరి
దగ్గరకు
పోయిననూ
ముందు
‘సాయిబాబాను
చూసుకొని
తరువాత
రండి’
అని
చెబుతున్నారు.
దీనిని
గమనించిన
సాయితత్త్వము
దైవత్వమనే
సత్యము
సులభముగా
తేలును.
ఇతరులు
నమ్మినా
నమ్మకపోయినా
మీ
విశ్వాసముపై
మీరు
ఆధారపడి
మీ
విశాల
ప్రేమ,
మీ
సర్వ
సమాన
సేవాబుద్ధి,
వీటిని
అభివృద్ధి
చేసుకోండి.
ప్రహ్లాదుని
పాలించిన
పరమ
పురుషుడు,
కుచేలుని
బ్రోచిన
వేదచరితుడు,
ధ్రువకుమారుని
సాకిన
వైకుంఠవాసి,
ఆ
అమర
వంద్యుడు,
అనాథనాథుడు,
శ్రీనాథుడు,
లోకనాథుడే
ఈ
సత్యసాయి
నాథుడు;
సచ్చిదానందమూర్తి,
పుట్టపర్తి
సచ్చక్రవర్తి.
ఆ
విశాల
ప్రేమను
విశ్వమంతా
ప్రసరింపజేసే
సత్యస్వరూపము
ఈ
సత్యసాయి.
మీలోని
భావములను
పురస్కరించుకొని
ఈనాడు
ప్రత్యేకముగా
మీకు
ఈరీతిగా
బోధించవలసి
వచ్చింది.
జీవతత్త్వమే
దైవతత్త్వము
‘జీవుడే
దేవుడు’
అనే
సత్యమును
పెక్కుమంది
అంగీకరించక
విశ్వసించక,
జీవితమంతా
దుఃఖముతో,
అశాంతితో
గడుపుతున్నారు.
కొందరు,
“జీవించు
మానవులు
ఎట్లు
దేవుడగుదురు?”
అని
ప్రశ్నింతురు.
ఇక,
శవము
దేవుడగునా?
జీవతత్త్వమే
దైవతత్త్వము.
ఇంక
కొంతమంది,
“అతివృష్టి,
అనావృష్టి,
భూకంపములు
మొదలగు
ప్రమాదములు
జరుగు
చున్నవే?
ఈశ్వరుడుంటే
ఇవన్నీ
ఎట్లు
జరుగును?”
అని
ప్రశ్నింతురు.
ఇవన్నీ
ప్రకృతియొక్క
సహజ
లక్షణములే.
భక్తి
ప్రపత్తులద్వారా
వాటినుంచి
కూడా
నివారణ
పొందుటకు
వీలున్నది.
“ఇట్టి
అవాంతరాలు
ఎందుకు
సంభవించును?”
అని
అడిగే
వ్యక్తులు,
“మానవునిలో
ఇట్టి
దుర్బుద్ధులు
ఎందుకు
రావాలి?”
అని
ఎందుకు
ప్రశ్నించకూడదు?
4
▾
Meaning
Keep
వారివారి
ప్రారబ్ధమును
పురస్కరించుకొని
వచ్చే
కష్టనష్టాలను
భగవదనుగ్రహముతో
నివారణ
చేసుకొనవచ్చును.
దీనికేమాత్రమూ
సందేహముండదు.
“సాయిబాబా
ఎందుకు
ఇట్టి
ప్రమాదాలు
రాకుండా
చేయకూడదు?”
అని
అడిగేవాళ్ళను
వారు
ఆరాధించే,
అనుసరించే
నిరాకార,
సాకార
దైవములు
ఎందుకు
నిరోధించలేదని
ప్రశ్నించండి.
అవన్నీ
ప్రకృతి
సహజమైనవి.
ఇట్టి
సందేహములు
అర్థము
లేనివి.
దానికి
జవాబిచ్చుట
వ్యర్థము.
మీరు
మాత్రం
ఎవరు
ఏమనినా,
దూషించినా,
ద్వేషించినా
ప్రేమదృష్టితో
చూసి,
మృదుమధురముగా
పలుకరించి,
ప్రశాంతముగా
మెలగవలెను.
“లోకాస్సమస్తా
స్సుఖినో
భవంతు”
అని
నిత్యము
ప్రార్థన
చేయండి.
కోపతాపములను
ఏమాత్రము
ప్రకటించకూడదు.
అజ్ఞానము
వలన,
అసూయవలన,
ఏదైనా
ఎవరైనా
విమర్శించిన,
వారికి
వారే
నిజము
తెలుసుకొని
ఎప్పటికైనను
బాగుపడుదురని
విశ్వసించండి.
అందరూ
మనవారే
అని
దృఢము
చేసుకోండి.
Previous
←
Global bhajan
Next
Unbroken bliss
→