Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1977 · Journeying towards Īśvara
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Journeying towards Īśvara
14 January 1977, Makara Saṅkrānti, Bṛndāvan, Whitefield
1
▾
Meaning
Keep
ప్రతి
గృహమునందూ,
ముఖ్యముగా
సేద్యగాని
గృహమునందు
సంపద
నిండి
ప్రశాంతముగా,
విశ్రాంతిగా
ప్రజలు
గడిపే
దినము
సంక్రాంతి.
సకలైశ్వర్య
సంపన్నుడైన
ఈశ్వరుని
కృతజ్ఞతతో
అందరూ
స్మరించే
దినము.
ధర్మము,
జ్ఞానము,
ప్రేమ,
మోక్షప్రాప్తి
ఇవన్నీ
మానవులకు
ఐశ్వర్యములే.
లౌకికముగా,
భౌతికముగా,
ధార్మికముగా,
నైతికముగా,
ఆర్థికముగా,
ఆధ్యాత్మికముగా
అభివృద్ధి
చెందిన
అదికూడా
సంపదయే.
అట్టి
ఐశ్వర్యమునూ,
సంపదనూ
మనకు
ప్రసాదించవలెనని
పరమేశ్వరుని
ప్రార్థించే
దినము
సంక్రాంతి.
ఉత్తరాయణము
అనే
సంవత్సరార్ధము
దైవప్రార్థనకు
ప్రత్యేకముగా
ఏర్పడినది.
దక్షిణాయనము
పితృ
సంబంధమైనది.
ఉత్తరాయణము
ఆధ్యాత్మిక
సాధనలకు,
స్వాధ్యాయమునకు,
తీర్థయాత్రలకు,
వేదవిహితమైన
సంస్కారములకు
అనుకూలమైన
కాలము.
అట్టి
ఉత్తరాయణముయొక్క
ప్రారంభ
దినము
సంక్రాంతి.
సూర్యుడు
ఈ
దినము
ఉత్తరాభిముఖముగా
తన
ప్రయాణమును
ప్రారంభించును.
లోకుల
జననమరణములకు
సూర్యుడే
కారణ
పురుషుడు.
వారి
శక్తిసామర్థ్యములకు
కూడ
సూర్యుడే
ప్రేరకుడు,
ప్రచోదకుడు.
లోకోద్ధరణ
నిమిత్తమై
సూర్యుడు
కూడ
విశ్రాంతిలేక
పనిచేయుచున్నాడు.
జగత్తులోని
జీవుల
ఆనందమునకు
సూర్యుడే
కారణకర్తుడు.
ఈశ్వరుని
నివాస
స్థానమైన
హిమాచలమువైపు
సూర్యుడు
పయనించుచున్నప్పుడు,
జీవరాసులంతా
ఈశ్వర
సాక్షాత్కారము
కొరకు
ఆవేదనతో
ప్రార్థించటం
సహజమే.
దానివలనకూడా
ఈ
దినము
పవిత్రమైనదిగా
మారినది.
ఇంద్రియములకధిపతి
ఇంద్రుడు.
వాటిని
స్వేచ్ఛగా
వర్తించుటకు
సమ్మతించి
ప్రోత్సహించటము
రాక్షసుల
కలవాటు,
అసురుల
స్వభావం.
మనస్సును
ఇంద్రియముల
వెంట
పరుగెత్తనీయక
బుద్ధిచే
సంయమించుట
అత్యవసరం.
బుద్ధియొక్క
అధిదేవత
సూర్యుడు.
అట్టి
సూర్యుడు
పరమేశ్వరుని
సన్నిధి
వెళ్ళినప్పుడు
మానవులు
ఏ
కొంత
సాధన
చేసినా
అది
చాలా
ఫలితము
అందించును.
బెంగుళూరు
సిటీనుండి
మీరు
బృందావనమునకు
రావాలంటే
నడచి
రావచ్చు,
సరే,
అయితే
కాలము
ఎక్కువ
కావలెను.
కొంతమంది
సకాలానికి
చేరలేకపోతారు.
ఇంకా
కొంతమంది
సాధ్యమేకాకపోవచ్చు.
అయితే
సిటీలో
ఒక
కారు
దొరికి
దానిలో
కూర్చొనిన
అనుకూలముగా,
అనాయాసముగా
సకాలమునకు
చేరవచ్చును.
అట్లనే
బుద్ధిని,
దాని
అధిదేవత
అయిన
సూర్యునితో
చేర్చితే
పరమేశ్వరుని
సన్నిధి
సులభముగా
దొరకును.
సంక్రాంతి
పండుగకు
భారతీయులు
మరొక
విశిష్టతను,
మరొక
అంతరార్థమును
కూడా
చాటుతూ
వచ్చారు.
గోపికలు
పరమాత్ముని
నాథునిగా
వరించుటకు
కాత్యాయనీ
వ్రతము
ఆచరించిన
దినము
మకరసంక్రాంతి!
శరీరధారణ
వలన
కలిగిన
దౌర్బల్యమును
దూరముచేసుకొని,
పరమాత్మునితో
ఐక్యముగావించుటకు
పూనుకొన్న
పర్వదినము.
ఇంద్రియములకు
మనస్సు
అధిపతి.
మనస్సుకు
బుద్ధి
అధిపతి.
బుద్ధికికూడ
స్వతంత్రత
లేదు.
దానికి
అధిపతి
ఆత్మ.
ఆత్మకు
అధిపతి
ఏదీలేదు.
సర్వాధిపతియైన
ఆత్మయొక్క
స్థాయి
లోపల
తమల్నితాము
లీనముచేయటయే
కాత్యాయనీ
వ్రతముయొక్క
ఉద్దేశ్యము,
ఫలితము.
అతడు
జగన్నాథుడు,
అనాథుడుకూడ.
ఎందుకంటే
అందరికీ
నాథుడైన
ఆయనకు
నాథుడెవరు!
రామదాసుకు
పాపం
తినటానికి
తిండి
లేదు,
కట్టటానికి
బట్టలేదని
పరితపించి
శివాజీ
మహారాజు
ఆయన
ఆశ్రమమునకు
ధాన్యాలు,
గుడ్డలు
అన్నీ
పంపించాడు.
దాన్ని
చూచి,
‘ఎవరికోసం
తెచ్చావు’
అని
రాజదూతను
అడిగాడు.
‘మీరు
చాలా
బీదవారు.
మీది
కష్టజీవితము,
మీరు
అనాథుడు
కాబట్టి
చక్రవర్తిగారే
స్వయంగా
వీటిని
సేకరించి
మీకు
పంపించారు’
అన్నాడు.
‘మీరు
యదృచ్ఛాలాభ
సంతుష్టులు.
ఎవరినీ
ఆశ్రయించరు.
కాబట్టి,
మీకు
ఇవన్నీ
పంపించారు’
అన్నాడు.
అపుడు
రామదాసు,
‘నేను
అనాథను
కాను.
నాకు
రామచంద్రప్రభువు
ఉన్నాడు
నాథుడుగా.
ఆయనకు
నాథుడు
లేడు.
కాబట్టి,
అనాథుడైన
రామచంద్రునికే
ఇవ్వండి’
అన్నాడుట.
అట్లే,
‘అనాథులైన
మాకు
మీరే
నాథుడుగా
రావాలి’
అని
గోపికలు
ప్రార్థించి
వ్రతమొనరించిన
దినము.
ఉత్తరాయణమునకై
అంబులశయ్యపై
56
దినములు
పాండవుల,
కౌరవుల
పితామహుడైన
భీష్ముడు
పండుకొని
ఈ
పర్వదినము
వచ్చినప్పుడు
పరమాత్మునితో
లీనమైనాడు.
దేహభ్రాంతి
లోపడినవారికి
ఇది
సాధ్యముకాదు.
వాళ్ళు
నొప్పితో
బాధపడతారు.
అయితే
భీష్ముడు
స్థితప్రజ్ఞుడు.
తన
సంకల్పమును
ఏనాడూ
మార్చడు.
ఆయనకు
ఒకే
మాట,
ఒకే
బాట.
ఉత్తరాయణ
కాలమందు
మరణించిన
శరీరమునకు
పునర్జన్మముండదని
తెలుసుకొని
శాంతముగా
భగవచ్చింతనతో
అందరికీ
సదుపదేశములనందించుచూ,
సంక్రాంతికోసం
ధైర్యస్థైర్యములతో
వేచినాడు.
జీవనజ్యోతిని
పరంజ్యోతి
స్వరూపమైన
సూర్యునితో
లయముచేసుకొన్నాడు.
అన్ని
జ్యోతులను
ఆ
పరంజ్యోతిలో
చేర్చాలి.
భీష్మునివలె
ఆస్తికులంతా
అన్ని
శుభకార్యములకు
ఉత్తరాయణము
కొరకై
వేచియుందురు.
వివాహములు,
ఉపనయనములు,
గృహప్రవేశములు
మొదలగు
మంగళకరమైనవన్నిటినీ
ఉత్తరాయణములోనే
చేస్తారు.
పవిత్రమైన,
పరిశుద్ధమైన
హిమాచలమునకు
సూర్యుడు
సమస్త
జీవరాసులలో
పయనించు
శుభమాసములే
అన్నిటికన్న
శ్రేష్ఠమైనవి.
హిమాచలము
అంటే
చల్లగా
ప్రశాంతముగా
అచలముగా
తీర్చిదిద్దిన
హృదయమే.
అట్టి
హృదయస్థానమందే
ఈశ్వరుడు
తన
నివాసము
ఏర్పరచుకొంటాడు.
అంతర్దృష్టిని
అభివృద్ధిచేసుకొనుటకు
కూడా
ఈ
పర్వదినములెంతో
సహాయకారి.
నిర్మల
నిశ్చల
నిస్వార్థమగు
హృదయస్థానమును
ఏరీతిగా
తయారుచేసుకొనేది?
దీనికి
ఇంద్రియనిగ్రహము
ప్రధానమైన
సాధన.
2
▾
Meaning
Keep
ఇంద్రియాలతో
కట్టబడినంతకాలము
స్వస్థానమునకు
చేరుటకు
వీలులేదు.
గంగానది
ఒడ్డునందున్న
ఒక
పల్లెవాళ్ళు
ఏదోరీతిగా
కూలీలు
సంపాదించుకొని
చీకటిబడిన
తరువాత
తమ
పడవలో
నదిని
దాటుకొని
ఇల్లుచేరే
పద్ధతి.
ఉదయం
నది
దాటిన
తరువాత
పడవను
ఒక
చెట్టుకు
తాడువేసి
కట్టి,
భద్రముచేసి
తమకు
పని
దొరికే
పట్టణమును
చేరేవారు.
ఒకనాడు
మధ్యరాత్రి
సమయానికి
సరిగ్గా
వారందరూ
పడవ
దగ్గరకు
వచ్చారు.
ఆనాడు
అధిక
ధనము
దొరికినది
కాబట్టి
అధికముగా
ఆశకూడా
పెరిగినది.
దురాశ
దుర్మార్గానికి
దోవ.
వారందరూ
ఈనాడు
బాగా
త్రాగుదామని
కల్లంగడికి
వెళ్ళారు.
నిలువలేక,
నడవలేక
ఎట్లో
వచ్చి
పడవలో
పడ్డారు.
పడవ
నడపటానికి
అందరూ
ప్రయత్నము
చేశారు.
రాత్రంతా
పడవను
నడిపిరి.
పడవ
కదలింది,
సాగింది
కానీ,
సూర్యోదయము
కాగానే
చూస్తే
అది
ఉన్నచోటే
ఉందిగాని,
అవతల
ఒడ్డు
దగ్గర
పోలేదు.
ఎందుకన్న,
పడవను
చెట్టుకు
కట్టివేసి
త్రాడును
ఎవరూ
విప్పలేదు.
మానవుల
జీవితకథకూడా
ఇదే!
స్వస్థానమును
చేరి
సుఖశాంతులను
పొందాలంటే
ఇంద్రియములనే
చెట్టుకు
వేసిన
అహంకార
మమకారములనే
త్రాడు
విప్పాలి.
ఈనాటినుండి
హృదయమును
విశాలముగావించు
ప్రయత్నములను
తీవ్రముగావించాలి.
లోకములో
మూడు
రకములైన
ప్రేమలున్నవి.
మొదటిది
స్వార్థప్రేమ,
తనను
మాత్రము
తాను
చూచుకొని,
పరుల
సుఖములో
పాల్గొనక,
వారి
దుఃఖమును
గమనించక
స్వార్థమునే
అనుసరించుట.
రెండవది,
అన్యోన్యప్రేమ,
సహజప్రేమ,
తన
అనుకూలములను
సాధించుటకొరకు,
తన్ను
ప్రేమించువారిని
మాత్రం
ప్రేమించుట,
తనవారిని
మాత్రం
ప్రేమతో
పలుకరించుట,
శుశ్రూషించుట.
మూడవది,
సమర్థప్రేమ,
సర్వులనూ
ఈశ్వరస్వరూపముగా
భావించి
ఆదరించి
ఏకత్వమును
అనుభవించి
ఆనందించుట.
స్వార్థప్రేమ,
రూములో
వేసుకొన్న
బల్బువంటిది.
దాని
వెలుతురు
ఆ
రూములోని
వారికే,
మరొకరికి
దానివలన
ప్రయోజనముండదు.
అన్యోన్యప్రేమ
వెన్నెలవంటిది.
సర్వత్ర
ఉండునుగాని
అంత
స్పష్టముగా
ప్రకాశముగా
ఉండదు.
ఏదీ
శుభ్రముగా
కనిపించదు.
సమర్థప్రేమ
అటువంటిది
కాదు.
లోపల
వెలుపలా
స్పష్టముగా
అంతరింద్రియములు,
బహిరింద్రియములు
ఐహికము
ఆముష్మికము
అన్నింటయందు
ప్రకాశించును.
స్వార్థరహితమైన
ప్రేమను
అభివృద్ధి
చేసుకోటమువలన
సర్వభూతాంతరాత్ముడైన
సర్వేశ్వరుని
చేరుటకు
మార్గమేర్పడును.
అదే
ఉత్తమమార్గము.
ఉత్తరమార్గము.
జీవితనాయకుని
సమక్షమును
చేరుటకు
అదే
ఉన్నతమార్గము.
ఇట్టి
ఉన్నత
తలంపులను
పెంపొందించుటకు
సంక్రాంతినాడు
మార్గదర్శకమైన
పవిత్ర
దినములు.
ప్రకృతి
ఈశ్వరునివైపు
ప్రయాణించు
నిదర్శనమును
ఆదర్శముగా
తీసుకొని
పాతజబ్బులకు,
రోతబుద్ధులకు
దూరము
వెళ్ళి,
కొత్తభావాలు,
కొత్తగుణాలను
స్వాగతించి
మనశ్శాంతిని
అందుకోండి.
ఇదే
ఈ
పర్వదినమందు
మీరు
పూనుకోవలసిన
ప్రయత్నము.
Previous
←
Jesus
Next
Hanumaan
→