Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1977 · The Fortunate Ones
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Fortunate Ones
28 April 1977, Opening of the Sri Sathya Sai Hostel
1
▾
Meaning
Keep
విద్యనొసగును
వినయము
వినయము
వలన
పాత్రత
పాత్రత
వలన
ధనము
ధనము
వలన
ధర్మము
దాని
వలన
కలుగు
స్వామి
కరుణ.
విద్యార్థులారా!
మానవ
జీవిత
విలువ
ధనము
వలనను,
విద్య
వలనను,
బలము
వలనను
కలిగేది
కాదు.
ధనము
కొంతకాలము
ఉండవచ్చును.
కొంతకాలము
ఉండకపోవచ్చును.
పదవి
కొంతకాలము
ఏలవచ్చును.
కొంతకాలము
దిగిపోవచ్చును.
నిజమైన
బలము,
ఘనత,
గుణము,
అధికారములు
త్యాగము,
శీలము.
‘నకర్మణా,
నప్రజయా,
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానసుః’
నిజమైన
ఆనందము
త్యాగము
వలన
లభించును.
నిత్యానుభవముతో
కొంతవరకు
అనుభూతి
తెలుస్తుంది.
మనము
గాలి
పీలుస్తున్నాము,
ఆ
పిల్చిన
గాలి
వదలకపోతే
లంగ్స్
చెడిపోవును.
అన్నం
తింటున్నాము.
తీసుకున్న
అన్నము
జీర్ణించుకున్న
తరువాత
మిగిలిన
పిప్పిని
విసర్జించకపోతే
జఠరాగ్ని
చెడిపోవును.
మన
దేహములో
రక్తప్రసరణ
ఒకభాగములో
సరిగా
జరుగక
నిలిచిపోయిన
గాయాలేర్పడును.
కనుక,
త్యాగము
వలన
క్షేమము
కల్గుచున్నది.
కనుక,
విద్యార్థులు
త్యాగబుద్ధిని
కలిగి
ఉండాలి.
జీవితమంతయు,
పుట్టినది
మొదలు
గిట్టు
వరకును
నేర్చుకొనవలసిన
విద్యలు
చాలా
ఉన్నవి.
కనుక,
విద్యకంతులేదు.
బజారులో
నేర్చుకొనవలసిన
విద్యలు,
మర్కెట్టులో
నేర్చుకొనవలసిన
విద్యలు,
సేద్యములో
నేర్చుకొనవలసిన
విద్యలు,
అన్నింటిలోను
నేర్చుకొనవలసిన
విద్య
చాలా
ఉన్నది.
అందువలన
విద్యలంటే
ఫిజిక్సు,
కెమిస్ట్రీ,
మేథమేటిక్స్,
కామర్సులే
కాదు.
మనము
పుట్టిన
ఒక
సంవత్సరము
నుండగనే
అమ్మా,
అప్పా
అని
తల్లి
దగ్గర
నేర్చుకొనుచున్నాము.
మన
మాటలు,
పాటలు,
ఆటలు
అన్నియు
విద్యకు
చెందినవే.
అయితే
మన
దురదృష్టవశాత్తు
కొన్ని
కళాశాలలో
డిగ్రీలు
తీసుకున్నంతమాత్రానికే
విద్య
అంటున్నాము.
కాని
అదికాదు.
విద్యార్థి
తగిన
విద్యను
ఆర్జించాలి.
ఆత్మవిద్యయే
సరైన
విద్య.
మనది
హాస్టలు,
కళాశాల
మాత్రమే
కాదు.
ఒక
ఆలయము.
ఆలయములు
నాలుగు
రకములు.
1.
వైద్యాలయము.
2.
భోజనాలయము.
3.
విద్యాలయము.
4.
దేవాలయము.
మనము
వైద్యాలయమునకు
వెళ్ళామనుకోండి.
అక్కడ
రోగములకు
మందులకు
సంబంధించిన
మాటలే
మాట్లాడుకొందుము.
దేవాలయమునకు
పోయినప్పుడు
దేవిని
దర్శనం,
స్పర్శనం
మొదలగు
విషయములను
మాట్లాడుకొందుము.
ఇక
విద్యాలయమునకు
వచ్చేటప్పటికి
విద్యను
గూర్చి
మాట్లాడుదుము.
విద్యయే
జీవితమనుకొనవలయును.
విద్య
శారీరకంగాను,
మానసికముగాను,
సాంఘికముగాను
ఉంటుండాలి.
మనము
దానిని
దేహరీతిగ
అనుసరించాలి,
మనస్సురీతిగ
స్మరించి
పూజించాలి.
ఈనాడు
మన
ప్రభుత్వము
ఏవిధంగా
చేసినదంటే
100కి
30
మార్కులు
వస్తే
పరీక్షలో
ఉత్తీర్ణుడని
చెబుతున్నది.
నిజంగా
తెలివితేటలు
గల
వ్యక్తి
నూరు
పనులు
చేస్తే
డెబ్భై
పనులు
చెడ్డవి
ముప్ఫై
మంచివి.
వాళ్ళే
మనకు
తప్పులు
చేయమని
ఆజ్ఞ
యిచ్చినారన్నమాట.
అయితే
మన
కాలేజీ
అలాకాదు.
మనకు
మంచి
మార్కులు
రావాలి.
ఒకవేళ
మార్కులు
రాకపోయినను
రిమార్కులు
రాకూడదు.
తెల్లవారి
లేచినది
మొదలు
రాత్రి
పండుకోనేవరకు
జాగ్రత్తగా
మెలగాలి.
ఇక్కడ
మీరు
ఒక
విషయము
ఆలోచించాలి.
‘మనము
యిక్కడకు
ఎందుకు
వచ్చినాము?
ఎక్కడనుంచి
వచ్చినాము?
చదువుకోనేదానికి
వచ్చినామా?’
అనుకోవాలి.
ఎంతో
దూరమునుండి
తల్లిదండ్రులను,
బంధుమిత్రులను
వదలివచ్చి
లేనిపోని
వాటికి
చోటిచ్చి
వచ్చిన
పనిని
వదలిపోవలసి
వస్తున్నది.
కనుక,
మనము
వచ్చిన
పనిని
సక్రమముగా
చేయుచున్నామా
అని
తలంచు
కొనవలయును.
మనము
యేది
చేసినా
అది
స్వామికి
సంతృప్తి
కలిగించే
విధముగా
చేయవలయును.
‘మాతృదేవోభవ’,
‘పితృదేవోభవ’,
‘ఆచార్యదేవోభవ’.
నీ
దేహమునకు
మూలకర్తలు
తల్లిదండ్రులు
కనుక,
మొదట
నీవు
తల్లిదండ్రులకు
సంతృప్తి
కలిగించే
పనులు
చేయాలి.
మనలను
ఏ
నిమిత్తమై
యిక్కడకు
పంపినారో
ఆవిధముగా
మనము
మంచి
నడవడికలను
అనుసరించాలి.
గురువులు
క్లాసులో
చెప్పే
పాఠములను
ఏకాగ్రతతో
విని
మంచి
మార్కులతో
వారిని
సంతృప్తి
పరచాలి.
ఈవిషయాలలో
సంతృప్తిగా
నడచిన
అదియే
స్వామికి
తృప్తి.
ఇంక
అతిభాష
స్వామికి
తృప్తి
కాదు.
అతిభాషతో
ఆత్మశక్తి,
జ్ఞాపకశక్తి
క్షీణిస్తుంది.
2
▾
Meaning
Keep
అతిభాషతో
చదివినదికూడా
మరచిపోతున్నాము.
ఎవరు
ఎక్కువగా
మాట్లాడకుండా
ఉందురో
వారే
మంచి
మార్కులతో
ఉత్తీర్ణులౌతున్నారు.
మీరందరు
అన్నదమ్ములవలె
మెలగాలి.
అయితే
ఎవరితోను
ఎక్కువగా
సంబంధము
పెట్టుకోకూడదు.
గుంపులు
గుంపులుగా
కాలేజీకి
పోవటం
మన
కాలేజీకి
సరిపడదు.
కారణమేమనగా
తల్లిదండ్రులను,
అన్నదమ్ములను
వదలి
వచ్చాము.
మరల
ఇక్కడ
సంబంధములను
ఎందుకు
కట్టుకోవాలి.
ఒకవేళ
మాట్లాడాలనుకొంటే
సబ్జక్టు
గురించి
మాట్లాడుకొన
వచ్చును.
అప్పుడుకూడ
పక్కవారలకు
కష్టము
కలిగించకూడదు.
అంతేగాక
విద్యార్థులమని
వికారములతోను,
గర్వముతోను
బయటి
ప్రపంచములో
జరుగుచున్నవి.
ఇంతేకాక
దేహాన్ని
అటు
యిటు
కదలక,
వంగనీయక,
నిటారుగా
కూర్చొన
వలయును.
ఆవిధముగా
చేసినచో
మనస్సుపై
పరివర్తనము
ఉంటుంది.
మీకు
యోగశాస్త్రము
తెలిసి
యుండవచ్చు.
మనము
వంగి
కూర్చొనినచో
వెన్నుపాములోనున్న
33
రింగులు
వంగిపోయి
మనిషికూడా
వంగిపోతాడు.
అంతేగాక
వంగికూర్చొనినచో
ఏకాగ్రతకు
భంగము
కలుగుతుంది.
ఒక
పాత్ర
ఉందనుకోండి.
దానిలో
నీరు
పోసి
పాత్రను
కదిలిస్తే
నీరుకూడ
కదులుతుంది.
దేహము
పాత్ర
వంటిది.
మనస్సు
నీరు
వంటిది.
దేహము
కదిలితే
మనస్సుకూడ
కదలుతుంది.
కనుక,
ధ్యానములో
నిటారుగా
కూర్చొన
వలయును.
దేహాన్ని,
మనస్సును
సక్రమమైన
స్థానములో
ఉంచుకొనవలయును.
విద్యార్థులారా!
మీరు
లేతవయస్సుగలవారు.
మీరు
తెలిసితెలియక
అనేక
తప్పులు
చేస్తూ
ఉంటారు.
వాటి
ఫలితములు
భవిష్యత్తులో
అనుభవిస్తారు.
విద్య
యొక్క
లక్షణము
వినయము.
పెద్దలను
చూచినప్పుడు,
వారితో
మాట్లాడినప్పుడు
గౌరవముగా
ప్రవర్తించాలి.
ఈవిధమైన
ప్రవర్తన
లేకపోతే
విద్యకు
విలువ
లేదు.
దీనికొక
చిన్న
కథ.
మీకందరికి
తెలిసియే
యుండవచ్చును.
అలహాబాద్‌లో
ప్రేమచంద్
అనే
ఒక
హిందీ
ఉపాధ్యాయులు
ఉండేవారు.
అతనికి
యిద్దరు
కుమారులు.
పెద్ద
కుమారుడు
వినయవంతుడు.
తల్లిదండ్రులంటే
అమిత
గౌరవము
కలవాడు.
చిన్నవాడు
ఈకాలపు
పద్ధతులలో
ఆరితేరినవాడు.
ఇద్దరు
అలహాబాద్‌లో
చదువుతున్నారు.
ఒకరోజు
తల్లిదండ్రులు
అలహాబాద్
పైనున్న
స్టేషను
వైపుకు
వెడుతూ
పిల్లలకు
ఉత్తరము
వ్రాసినారు.
ఆ
ఉత్తరములో
మేము
ఫలానా
రైలులో
వెడుతున్నాం,
కలుసుకొనుటకు
మీరు
స్టేషనుకు
రండి
అని
ఉన్నది.
వారు
ఆ
తారీఖున
రైలు
దగ్గరికి
వచ్చారు.
వారిని
చూసినవెంటనే
పెద్దవాడు
నమస్కరించాడు.
చిన్నవాడు
ఫ్యాషనుగా
జేబులో
చేతులు
పెట్టుకొని,
‘మీరు
క్షేమమేనా?’
అని
అడిగాడు.
తండ్రికి
ఆమాట
వినుటతోడనే
ఒక
రకమైనది.
తర్వాత,
అతను
ఎలా
చదువుతున్నాడు,
కాలేజీ
ఎలావుంది,
హాస్టలు
బాగుగా
ఉందా
అని
క్షేమ
సమాచారములు
అడిగాడు.
గంట
కొట్టుటచేత
రైలు
కదిలింది.
తండ్రి
ద్వారం
దగ్గరనుండి
బాగుగా
చదవండి,
మంచిగా
ఉండండి
అని
వారిద్దరిని
ఆశీర్వదించినాడు.
రైలు
వెళ్ళింది.
తల్లిదండ్రులు
కనపడే
వరకు
పెద్దవాడు
నమస్కారం
పెట్టి
ఉన్నాడు.
రెండవవాడు
టాటా
చెబుతున్నాడు.
సరే!
పిల్లలు
మరుగైనారు.
తండ్రికి
చాలా
బాధగా
ఉంది.
చాలా
విచారంగా
కూర్చున్నాడు.
భార్య,
‘ఏమిటండి
అలా
ఉన్నారు?’
అని
అడిగింది.
చిన్నవాడు
నాకు
నమస్కారం
చేయలేదు’
అని
చెప్పాడు.
‘సరే!
ఏదోలెండి
తెలియక
నమస్కరించలేదు.
వాడ్ని
క్షమించండి’
అంది.
సీట్లో
కూర్చొని
ఫ్యాన్
వేసుకుంటూ
తన
భార్యతో,
‘చూచితివా!
చిన్నవాడు
నాకు
నమస్కారం
చేయలేదు’
అని
అన్నాడు.
ఆమె
మనస్సులో,
‘ఇతని
మనస్సు
ఎందులకో
కలచివేసి
చాల
విచారంగా
ఉంటున్నాడు.
ఈ
కవులకు
యిదొక
జబ్బు’
అని
అనుకొంది.
వెంటనే
భర్త
దగ్గరకు
వెళ్ళి,
‘స్వామీ!
నమస్కారం
చేయకపోతే
నష్టమేమిటి?’
అని
అడిగింది.
దానికి
అతడు,
‘వాడు
నమస్కారం
చేయకపోతే
నాకు
నష్టమేమీ
లేదు.
కాని,
వాని
భవిష్యత్తు
చెడిపోతున్నది.
అదియే
నాకు
బాధగా
ఉన్నది.
మరియు
వాని
జీవితము
వ్యర్థమైపోతున్నది.
వాని
జీవితము
అధోగతి
పాలౌతుంది’
అని
అన్నాడు.
అతని
భావము
ప్రత్యక్షంగా
గోచరమైనది.
పెద్దవాడు
బారిష్టరు
చదివి
హైకోర్టు
జడ్జి
అయినాడు.
రెండవవాడు
అదే
కోర్టులో
ప్యూన్
అయినాడు.
దానికితోడు
యింకొకటి,
పెద్దలకు
నమస్కారం
చేసిన
అతనికి
వచ్చిన
వారందరు
నమస్కారం
చేసేవారు.
ఈ
ప్యూన్
వచ్చిన
వాళ్లందరికి
నమస్కారం
చేయవలసి
వచ్చినది.
కనుక,
మనము
భవిష్యత్
విషయము
ఆలోచించి
వర్తమానములో
దానికి
తగినట్లుగా
నడచుకొనవలయును.
మానవునికి
అహంకారము
మరియు
అసూయ
మరింత
చెడ్డది.
క్రోధముకూడ
మంచిది
కాదు.
వాటిని
మన
చిత్తములో
చేరనీయకుండా
జాగ్రత్తగా
ఉండవలయును.
మనం
నిజంగా
నిర్మల,
నిస్వార్థ
హృదయులుగా
ఉంటున్నాం.
విద్యార్థులారా!
ఇది
మంచి
గోల్డెన్
వయస్సు.
పవిత్రమైనది.
ఈ
వయస్సును
వృధా
చేయకుండా
ఉండవలయును.
ఈ
వయస్సులో
ముఖ్యమైనది
నడవడిక.
నిజంగా
నియమ
నిగ్రహాలు
లేకపోతే
మనం
పశువులమే.
మన
నియమనిగ్రహములను
ఉల్లంఘించినప్పుడు
వెంటనే
మనస్సు
మార్చుకొని
మంచి
జీవితమును
గడపాలి.
లేకపోతే
పట్టాలు
తప్పిన
రైలువలె
అగును.
చుక్కాని
లేని
పడవ
వలె
అగును.
కనుక,
మనము
కాలేజీ
యందు,
హాస్టలునందు
క్రమశిక్షణగా
నుండవలయును.
క్రమశిక్షణయే
జీవితానికి
ఆధారము.
మనిషిని
గౌరవింపచేసేది
అదే.
మనకు
అది
లేకపోతే
పశువులకన్న
హీనంగా
ప్రవర్తిస్తాము.
మన
హాస్టలు
పిల్లలు
క్రమశిక్షణ
అలవర్చుకొనవలెను.
Previous
←
The Raama Era
Next
The brother among brothers
→