Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1978 · The New Year
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The New Year
1 January 1978, New Year, Bombay
1
▾
Meaning
Keep
ఈనాడు
నూతన
సంవత్సరమునకు
స్వాగతము,
పాత
సంవత్సరమునకు
వీడ్కోలు
చెప్పటము.
పాతరోత
భావములను
పారవేసి
నూతన
పవిత్ర
భావములను
ఆశ్రయించుటకు
ఇది
ఉత్తమమైన
ప్రయత్నము.
ఈ
సంవత్సర
క్రమము
జీసస్‌ను
మూలాధారముగా
తీసికొని
ఏర్పడినది.
జీసస్సు
కరుణామయుడు.
ప్రేమస్వరూపుడు.
అనాధలనూ,
దీనులనూ
కరుణార్ద్రదృష్టితో
చూచి
వారిని
శుశ్రూషించినాడు.
వారిని
చూచిన
తక్షణమే
ఆయన
హృదయము
ద్రవించి
పొరలిపోయేది.
జీవితమంతా
సేవలోనే
వినియోగము
చేశాడు.
సత్యానికే
జీవితము
నంకితముచేసి,
అన్ని
కర్మలనూ
దానికే
ఆచరించాడు.
సత్యానికి
తన
కంఠమునే
అర్పితము
గావించాడు.
అందువలన
లోకమంతా
ఆయనను
ఆదరించుచున్నది.
జగములు
మారినా,
యుగములు
కదలినా,
శాశ్వతమైన
ఆయన
రూపనామములు
జనులకు
పూజనీయమైనవి.
ఆయన
తన
జీవితముయొక్క
క్షణక్షణమందుకూడ
నిరంతరము
సత్యనారాయణ
వ్రతము
ననుష్టించినాడు.
అనగా
సత్యారాధనలో
నిరతుడయ్యాడు.
కానీ,
మనము
మాత్రము
జీవితమంతా
అసత్యనారాయణ
వ్రతమునే
ఆచరించుచున్నాము!
సంవత్సరానికొక
పర్యాయము
సత్యనారాయణ
వ్రతము
ఆచరించిన,
దానిలో
కూడ
అసత్యమునే
కలిపి
కలుషితపరచుతాము.
చిన్నచిన్న
విషయములలో
కూడ
అసత్యము,
అసత్యము!
ఇదెంత
అసహ్యము!
మానవత్వముయొక్క
రూపనామములను
నిలబెట్టే
నిమిత్తము
దేహము
ధరించి,
మాటలయందు
అసత్యమాడుటకు
అధికారమున్నదా?
అట్టివానిని
మానవుడు
అనుకొనే
అధికారమున్నదా?
మానవుడు
ఆ
పేరును
సార్థకముచేయాలి.
మానవుని
గుణశీలములను
వివేకవైరాగ్యములను
ఆ
దేహముతో
ప్రకటించాలి,
వికసింపజేయాలి.
మంచి
మంచి
కార్యములలో
పాల్గొని
అభివృద్ధిపరచాలి.
గ్రీసుదేశపు
మహారాజు
అలెగ్జాండరు
చక్రవర్తి
ఎన్నో
రాజ్యాలను
యుద్ధములో
జయించిన
సాహసి.
ఆయన
భారతదేశమునందు
ఎందరో
మహనీయులను
దర్శించినాడు.
తన
దేశమునకు
వెళ్ళే
సమయమందు
త్రోవలోని
ఒక
చెట్టు
క్రింద
చల్లని
గాలిననుభవించుచూ,
ఆనందముగా
పండుకొనియున్న
ఒక
యోగిని
చూచాడు.
వారు
అలెగ్జాండరును
చూచినకూడ,
లక్ష్యముచేయక
తన
ధ్యానములో,
తన
తలంపులలో
నిమగ్నుడైయున్నాడు.
అలెగ్జాండరుకు
కోపము
వచ్చినది.
‘ఈయన
సన్యాసి,
అల్పుడు.
నేను
చక్రవర్తిని.
నన్ను
గౌరవించక,
నేలపై
హాయిగా
పండుకొన్నాడు.
వీడెవడు?’
అని
దగ్గరకు
పోయినాడు.
సన్యాసి
లేవలేదు.
కోపమును
భరించుకొనలేక,
అహంకారమును
నిగ్రహించుకొనలేక,
తన
యెడమ
కాలితో
యోగిని
తన్నాడు.
ఆ
యేటు
తగిలిన
తక్షణమే
యోగి
కన్నులు
తెరచి
చూచినాడు.
ఫక్కున
నవ్వినాడు.
అలెగ్జాండరు
మరింత
కోపావేశుడైనాడు.
‘నేనెవడు
తెలుసునా?
గ్రీసుదేశపు
మహారాజు!
చక్రవర్తి
అలెగ్జాండర్
అని
వినలేదా?
అనేక
రాజ్యములను
యుద్ధములో
నా
భుజపరాక్రమముచేత
జయించి
సాధించిన
వీరుడను’
అన్నాడు.
దానికి
ఆ
సంతు,
భారతదేశమందుద్భవించిన
సాత్విక
మహాయోగి,
పవిత్రహృదయము
కలవాడు,
‘అయ్యా!
నువ్వు
మహారాజుకావచ్చు.
చక్రవర్తి
కావచ్చు,
మహాశూరుడు
కావచ్చు,
అయితే
నన్ను
కాలుతో
తన్నటము
వలన
నువ్వు
గాడిద
స్థానమునకర్హుడనేది
నా
అనుభవము’
అన్నాడు.
‘కాలితో
తన్నటము
గాడిద
స్వభావముగాని
చక్రవర్తి
స్వభావము
కాదే!’
అన్నాడు.
ఇదే
రీతిగనే,
పవిత్ర
భారతదేశము
నందుద్భవించి
అమృతపుత్రులు
అనే
పేరు
ప్రతిష్ఠలకర్హులైనవారు
దానవత్వమునకు
దిగజారుచున్నారు.
మానవత్వమునకు
విరుద్ధమైన
రీతిలో
ప్రవర్తిస్తున్నారు.
ఏకత్వమును
దృఢపరచుట
కొరకు
భారతీయులు
ఆధ్యాత్మిక
దృష్టిని
అభివృద్ధిగావించాలి.
జీసస్సు
తన
జీవిత
ప్రారంభదశనుంచికూడ
తోటి
మానవుల
సేవకే
జీవితమును
అంకితము
చేశాడు.
దీనికి
సిద్ధతగాంచుటకు
పన్నెండు
సంవత్సరములు
ఎవరికీ
తెలియక
ఏకాంత
జీవిగా
అంతర్ద్రష్టి
లోపల
భగవచ్చింతనలో
లీనమైనాడు.
తరువాత
I
am
the
messenger
of
God
అన్నాడు.
దీన
చరిత్రులకు
సేవచేసే
సమయమందుకూడా
I
am
the
messenger
of
God
అన్నాడు.
మీరందరూ
అట్టి
మెసెంజర్లే.
ఆ
భావముతోనే
సేవలందించాలి.
తరువాత
కొంతకాలము
తనలోని
దివ్యత్వాన్ని
గురించి
చక్కగా
విచారణ
సలిపినాడు.
‘లేదు,
లేదు.
I
am
the
son
of
God
అని
భగవంతుని
సమీపమునకు
వెళ్ళాడు.
మీరుకూడా
దీనిని
నేర్చుకోవాలి.
బిడ్డలవలె
పరిశుద్ధ
హృదయులై
అభిమానము,
అహంకారము
లేక
భగవంతుని
సమీపించాలి.
తదుపరి
ఐదు
సంవత్సరములు
జీసస్సు
హిమాలయ
ప్రాంతమందు
నివసించి,
కాశ్మీరంలో
సంచరించినాడు.
అద్వైతానందమునందుకొన్న
యోగుల
సంపర్కము
వలన
జీసస్సుకు
అద్వైతభావము
రుచించినది.
I
and
my
father
are
one
అన్నాడు.
పాశ్చాత్యదేశములో
పుట్టి,
భారతదేశములో
అడుగుపెట్టి,
అద్వైతసిద్ధాంతమును
తాననుభవించి
ఏకత్వమైన
ఆత్మతత్త్వమును
నిరూపించినాడు.
ఇట్టి
ఆదర్శమును
భారతీయులుకూడా
అనుసరించే
అవసరమున్నది.
కానీ,
భారతీయులు
అద్వైత
సిద్ధాంతముయొక్క
జన్మభూమిలో
పుట్టి,
పాశ్చాత్యదేశములకు
వెళ్ళి
అనేకత్వమును
అభివృద్ధిచేస్తూ
విఱ్ఱవీగుచున్నారు.
ఇది
పూర్తి
‘ఉల్టా-సీదా’.
పాశ్చాత్యులు
అనేకత్వములోని
ఏకత్వమునందుకొనుటకు
భారతదేశమునకు
వస్తే,
వీరు
ఏకత్వమును
బోధించిన
భారతదేశమును
వదలి
యితర
దేశీయులలో
అనేకత్వమును
పెంచుచున్నారు.
2
▾
Meaning
Keep
జీసస్సు
పుట్టినదినమని
ఆచరించినా,
మహనీయుల
జన్మదినోత్సవము
అనుకున్నా,
వారందించిన
పవిత్ర
సూత్రాలను
ఆచరించి
ఆనందమునందుకోవాలి.
అదే
వారికి
కృతజ్ఞత,
మనము
చూపించుగౌరవము,
పూజ్యత.
వారు
అందించిన
మహావాక్యములను
మంటగలిపి,
కేవలము
వారి
పుట్టిన
దినము
చేస్తూ
కూర్చుంటే
అట్టి
వారిలో
మానవత్వము
సరైన
రీతిలో
కించిత్తూ
లేదనే
అర్ధము.
ఇప్పుడు
వేదవిహిత
ధర్మమును
శాస్త్ర
సమ్మతమైన
మార్గమును
పాశ్చాత్య
నాగరికతలోని
మంచి
మంచి
భావాలను
మిశ్రమముచేసి,
చిన్న
పిల్లలకు
అందించి
వారిని
తయారుచేసే
ప్రయత్నములకు
పెద్దలందరూ
సిద్ధముగా
వుండాలని
ఆశిస్తున్నాను.
నైతిక,
ధార్మిక,
భౌతిక,
ఆధ్యాత్మిక,
లౌకిక
అన్ని
క్షేత్రములలోనూ
పిల్లలను
ప్రవేశపెట్టాలి.
దీనికి
అడ్డు
కలిగించే
అవాంతరాలను
అణగద్రొక్కుటకు
సంసిద్ధులుగా
వుండాలి.
జీవితము
సమస్యల
మూట.
వాటిని
విడదీసి
మున్ముందు
సాగాలి.
అదొక్క
కల....
దానిని
తెలుసుకోవాలి.
అదొక్క
ఆట...
ఆడి
సంతోషించాలి.
అదొక
ప్రేమప్రవాహము....
దానిలో
మునిగి
ఆనందించాలి.
జీవితమును
పవిత్రముగావించుకోవాలి.
కొన్ని
నైతిక
పాఠములను
బోధించటము,
చరిత్రలోని
కథలు
చెప్పటము,
గీతా
శ్లోకములను
కంఠస్థము
చేయించటము,
ఇంతమాత్రము
తరిఫీదు
చేస్తే
ప్రయోజనము
లేదు.
1.
క్రమశిక్షణ
చాలా
ప్రధానము.
దానిని
అభివృద్ధి
పరచాలి.
2.
ప్రేమభావమును
విశాలముగా
పెంచుకోవాలి.
3.
పిల్లలు
పరిశుద్ధ
వాతావరణములో
పెరగాలి.
వారి
ఆరోగ్యమును
పోషించాలి.
4.
వారు
ధనమును
దుర్వినియోగ
పరచకుండా
వారికి
మిత
వ్యయము,
నిరాడంబరతను
బోధించాలి.
మన
భారతదేశము
ఆర్థికస్థితియందు
వెనుకబడిన
దేశము.
పిల్లలకు
ధనమును
దుర్వినియోగము
చేయకూడదని
ప్రయత్నపూర్వకముగా
నేర్పించాలి.
5.
పెద్దలను
గౌరవించు
విధానములను,
సాంప్రదాయములను
ఎవరి
దగ్గర
ఏ
రీతిగా
నడచుకోవాలనేది
వారికి
తెలిపి
నేర్పించాలి.
ఎన్ని
జన్మల
పుణ్యమో,
ఎన్ని
జన్మల
సంస్కారమో
ఈ
మానవ
జన్మము
లభించినది.
దీనిని
అపవిత్రముగావించితిమా
మనకిట్టి
జన్మము
సిద్ధించదు.
పోయినదానికి
వగచి
ప్రయోజనముండదు.
కోట్లకొలది
ధనమును
వ్యయము
చేసిననూ
తిరిగిరాదు.
కాబట్టి,
మానవత్వమును
అపవిత్రము
చేయకూడదు.
వివేక,
వైరాగ్య,
విచక్షణలతో
దైవత్వమును
సాధించాలి.
కొత్త
సంవత్సరము
అంటున్నాము.
అయితే,
అరవై
సెకండ్లు
అయిన
తరువాత
ఒక
మినిట్
అవుతుంది.
అరవై
మినిట్లు
అయినప్పుడే
ఒక
గంట
అవుతుంది.
ఇరవైనాలుగు
గంటలు
గడచినప్పుడే
ఒక
దినము.
ముప్ఫైదినములు
అయినప్పుడు
ఒక
నెల.
పన్నెండు
నెలలు
తరువాత
ఒక
సంవత్సరమగును.
సెకండు
లేక
సంవత్సరము
లేదు.
ఒక్కొక్క
సెకండుకూడా
కొత్తదే!
సంవత్సరము
పూర్తి
అయ్యేవరకు
కొత్తదానికై
కాచుకొనుట
అనవసరము.
కొత్త
సెకండుతోనే
కొత్తభావాలు,
విశాలప్రేమ,
విశాల
హృదయము,
కొత్త
తలంపులు
పెంచుకొని
రావాలి.
ఒక్కొక్క
సెకండు
ఒక్కొక్క
మైలురాయి.
మైలురాళ్ళు
దాటుకొని
పోవుచున్నారేగాని,
మనస్సులోని
భావాలు
అభివృద్ధి
కావటం
లేదు.
సాధన,
భజన,
సేవాకార్యములు
జరుగుచున్నవిగాని,
ధర్మక్షేత్రము
స్థాపితమై
పది
సంవత్సరములు
గడచినదిగాని,
ఎంత
వరకు
ఉన్నత
స్థాయిని
చేరాము
అని
విచారించటం
లేదు.
మొట్టమొదట
చిత్తశుద్ధి
సంపాదించుకోవాలి.
కించిత్
చేసినా,
పత్రం,
పుష్పం,
తోయం,
అయినా
అర్పిత
బుద్ధితో
చేయాలి.
త్యాగబుద్ధిని
అభివృద్ధి
చేసుకోవాలి.
విషయ
వాసనను
నెట్టివేయాలి.
నారాయణుడు
నారదునికి
చెప్పాడు,
‘మద్భక్తాః
యత్రగాయంతే
తత్రతిష్ఠామి
నారద’
అని.
కాని,
ప్రపంచములో
ఎన్ని
వేల
స్థలములలో
ఆయన
తిష్ఠవేసి
వుండాలి!
భజన
కీర్తనలు
జరిగే
చోటంతా
ఆయన
ప్రతిష్ఠుడై
వున్నాడా?
లేదు.
ఎందుకంటే
‘మద్భక్తాః’
అన్నాడు.
భక్తులు
భజన
చేస్తే,
భక్తికోసం
కీర్తన
చేస్తే
అక్కడ
‘తిష్ఠామి’.
అక్బరు
చక్రవర్తి
ఆస్థానమందు
తాన్సేన్
అనే
గాయకుడుండేవాడు.
ఆయన
మేఘమాలా
అనే
రాగము
పాడితే
మేఘాలంతా
దట్టముగా
ఆకాశమును
చేరుతవి!
వరుణ
రాగము
పాడుతే
వర్షాలు
వస్తాయిట!
అయిననూ,
ఒక
దినము
అక్బరు
చక్రవర్తి
ప్రార్థనా
మందిరమునందుండగా
బైట
బజారులో
హరిదాసు
ఒకడు
పాడిన
పాటలో
ఆయన
మనస్సు
లీనమైనదట.
తరువాత,
చక్రవర్తి
తాన్సేన్ను
పిలచి,
‘ఆశ్చర్యముగా
వున్నది.
మీరు
ఇంత
శ్రావ్యముగా,
అద్భుతముగా
పాడిననూ
నా
మనసును
అంతగా
ఆకర్షించ
లేక
పోయింది.
వీధిలో
భిక్షమెత్తే
ఆ
దాసుడు
తన
పాటతో
నన్ను
ఆకర్షించి
ఆనందింపజేసినాడే!’
అని
అడుగగా,
తాన్సేన్
చెప్పినాడు,
‘మహరాజ్!
నేను
మీ
ముఖము
చూచుకొని
మీ
సంతోషము
కోసము
పాడుతున్నాను.
వాడు
భగవంతుని
వదనారవిందమునే
తన
యెదుట
కల్పించుకొని,
ఆయన
సంతృప్తి
కొరకు
పాడుతున్నాడు.
ఇంతే
తేడా’.
ధనము
కోసము,
గౌరవ
మర్యాదల
కోసము,
పేరుప్రతిష్ఠల
నిమిత్తమై
భజన
చేసిన
అది
భగవంతుని
యేమాత్రమూ
ఆకర్షించదు.
అసూయాద్వేషాలు
మనసులో
నిండియుండగా
భజన
చేస్తే
భగవంతుని
హృదయమును
ఏమాత్రమూ
కరగింపచేయదు.
భజన
హృదయమునుండి
రావాలి.
పెదవులనుండి
కాదు.
జీసస్సుకు
12మంది
శిష్యులు.
వారిలో
ఒకడు
జూడాస్
అనేవాడు.
ధనమునకు
దాసుడై
30
వెండి
నాణెములకై
తన
జీవితాన్ని
అమ్మి
గురుద్రోహం
చేసినాడు.
భక్తి
అనేది
ఈనాడు
ఒక
ఫ్యాషన్‌గా
మారిపోతున్నాది.
మీరుకూడా
పార్ట్‌టైమ్
డివోటీస్గా
తయారౌతున్నారు.
3
▾
Meaning
Keep
భక్తిని,
మీ
విశ్వాసమును,
మీ
శ్రద్ధను
క్రియారూపములో
నిరూపించాలి.
మాటలతో
కాలమును
వ్యర్థముగావించ
కూడదు.
మంచి-చెడ్డ
రెండును
కర్మల
వలన
కలిగే
అనుభవముతోనే
గుర్తించుటకు
వీలగును.
చూచుటకు
నీరు,
పానకము
రెండూ
ఒకటే.
త్రాగినప్పుడు
వ్యత్యాసము
తెలియును.
అనుభవించినప్పుడే
ఆనందము
అర్థమగును.
లౌకిక
కష్టనష్టాల
గొడవలో
ప్రవేశించి,
విషయ
వాసనలలో
చిక్కి,
అనవసరమైనదాన్నంతటినీ
తలలో
చేర్చుకొని
సాధకులనుకొనే
వారు
ముందుకు
పోకుండా
వుంటారు.
హృదయ
పవిత్రత
యేమాత్రమూ
కనిపించటము
లేదు.
నీటిలో
పడి
తడిసిన
అగ్గిపుల్లలను
ఎన్ని
పర్యాయములు
గీసినగాని
ప్రయోజనమేమి?
పెట్టంతా
పాడగును.
అంతే.
విషయ
వాసనల్లో
నింపిన
మనస్సు
ఎట్లా
పరంజ్యోతిని
ప్రకటించును.
విశాల
ప్రేమను
పెంచుకోవాలి.
స్వార్థమును
విసర్జించాలి.
అహంకారమును
అణగద్రొక్కాలి.
పెద్దలైన
మహనీయులకు
కూడ
అనేక
రకములైన
కష్టనష్టాలు,
నిందలు,
నిష్ఠూరములు,
బాధలు,
దూషణలు
వస్తూ
వుంటాయి.
ఇది
లోక
సహజము.
అవి
లేకపోతే
ఆ
పవిత్ర
వ్యక్తుల
కీర్తి
పెరుగుటకు
వీలులేదు.
జగత్తు
వారిని
గుర్తించకపోవచ్చు.
చెరుకు
గడను
పిలచి,
బెల్లమీయమని
అడిగితే
ఇచ్చునా?
జాతి
వజ్రమైననూ
సానబెట్టక
ప్రకాశించదు.
జీసస్సు,
శంకరుడు,
మధ్వాచార్య,
రామానుజాచార్య,
జయదేవ,
గౌరాంగ,
మీరా,
సక్కుబాయి,
పాశ్చాత్య
దేశాలలో
అవతరించినవారు,
భారతీయులు,
అందరికీ
కష్టాలు,
హింసలు
తప్పినవి
కావు.
వారందరూ
పరిమళ
పూరిత
పుష్పాలనిచ్చే
లతలు.
వారిని
అప్పుడప్పుడు
‘కట్’
చేయకపోతే
పుష్పాలు
ఎక్కువరావు.
ఎవరేమైనా
చెప్పనీ,
చేయనీ
మీ
విశ్వాసమును,
మీ
పవిత్ర
భక్తిని
కోల్పోకూడదు.
పాతభావాలను
యిప్పటినుండి
దూరముచేసి
కొత్త
పవిత్ర
భావాలను
హృదయ
క్షేత్రమందు
పెంచి,
పోషించి,
ఆనందమునారగించండి.
మీ
అందరికీ
happy
life,
long
life,
useful
life,
divine
life
ఆశించి
ఆశీర్వదిస్తున్నాను.
Previous
←
Controlled pride
Next
God, the source of good
→