Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1978 · Prema for Prema, heart for heart
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Prema for Prema, heart for heart
24 March 1978, Address to the Seva Dal
1
▾
Meaning
Keep
పవిత్రాత్మ
స్వరూపులైన
స్వయంసేవకులారా!
‘ఈశావాస్యమిదం
సర్వం’
ఈశ్వరుడు
నివసించుటకు
ఈ
జగత్తు
సరియైనటువంటిది
అని
దీని
అర్థము.
అనంతమైన
ఈశ్వరుడు
నివసించుటకు
ఈ
జగత్తే
సరియైన
ప్రదేశము.
అనంతస్వరూపుడైన
ఈశ్వరుడు
ఈ
అనంతమైన
లోకమందు
నివసించుచున్నాడు.
లోకము
అనంతము.
కాలము
అతీతము.
మానవత్వము
అత్యల్పము.
ఇందులోనున్న
సత్యాన్ని
గుర్తించే
నిమిత్తమై
మానవుడు
విశ్వరూపుడైన
దైవమును
గుర్తించటం
ప్రధానం.
ఇదే
భారతీయులయొక్క
నిజమైన
మతం.
మానవత్వములోనున్న
దైవత్వాన్ని
గుర్తించే
ప్రయత్నానికి
తగిన
కృషి
సల్పాలి.
ఎవరో
పరులకు
మనం
సేవచేస్తున్నామనుకోటం
కేవలం
అజ్ఞానముయొక్క
లక్షణం.
అనంతస్వరూపుడైన
ఈశ్వరుడు
ప్రతి
అణువునందు
కూడా
ఉన్నాడనే
సత్యాన్ని
గుర్తించినప్పుడు
పరుల
సేవ
ఏరీతిగా
అవుతుంది.
అది
పరమాత్మ
సేవగానే
మారుతుంది.
కనుక,
ఏ
సేవచేసినా,
ఏ
మాట
మాట్లాడినా,
ఏ
చూపు
చూచినా,
ఏ
తలంపు
తలచినా,
దైవ
ప్రేరణ
వల్లనే
జరుగుతున్నదనే
సత్యాన్ని
ప్రతి
మానవుడు
గుర్తించాలి.
ఇదే
సేవయందున్న
అంతరార్థం.
సేవ
అనగా
కేవలం
హాస్పిటల్స్
వెళ్ళటం,
పేషెంట్స్కంతా
ఏదో
చేశాననుకోటం,
లేక
దీనులు
దిక్కులేని
వాళ్ళకు
సహాయం
చేయటం-
ఇది
మాత్రమే
సేవకాదు.
సేవ
అనేది
కేవలం
మీనుండి
అందుకోటమేకాదు,
ఇతరులనుండి
మీరుకూడను
అందుకోటానికి
సంసిద్ధులుగా
ఉండాలి.
ప్రేమకు
ప్రేమ,
హృదయానికి
హృదయము
ఇచ్చిపుచ్చుకోనేటువంటి
తత్త్వము
మన
సేవాదళము
సభ్యులు
గుర్తించాలి.
కొన్ని
నిముషాల
క్రితం
కస్తూరి
చెప్పాడు
కథ.
పూనాలో
తన
మనుమడు
ఉండటం,
అంతలో
అతని
మామగారు
మరణించటం,
అయితే
ప్రక్కింటివారికే
ఆ
విషయం
తెలియనట్లుగా
చెప్పాడు.
దీనికి
ఏది
కారణం
అనగా
మన
ఇంటివారం
కనుక
ప్రక్కింటి
వారిని
గురించి
విచారించమా?
కనుక,
ప్రక్కింటివారు
మనలను
విచారించలేదు.
ప్రక్కింటివారితో
మనం
కొంత
సంబంధబాంధవ్యం
పెంచుకొని
వారి
క్షేమసమాచారాలు
విచారించియుంటే
వారుకూడా
మన
క్షేమసమాచారం
విచారించియుండేవారు.
కనుక,
లోపం
మనలోనిదే.
మనం
ప్రక్కింటివారిని
లేక
సహచరులను,
ఇంకా
మనయొక్క
సన్నిహితులను,
వారియొక్క
క్షేమసమాచారములను
విచారిస్తూ,
వారియొక్క
మంచిచెడ్డలను
కొంతవరకు
గమనిస్తున్నప్పుడు
మన
మంచిచెడ్డలు
ఇతరులు
గమనిస్తారు.
ఇతరులు
ఎరుగకున్న
ఈశ్వరుండెరుగడా!
ఈశ్వరుడైనా
తన
మంచిచెడ్డలు
గమనించటానికి
ప్రయత్నిస్తాడు.
కనుకనే,
కేవలం
ఒకరు
విచారించలేదని
బాధపడుట
సరియైనటువంటిది
కాదు.
మనలోనే
ఉన్నది
సర్వలోపము.
నావారు,
తనవారు
అనే
భిన్నాభిప్రాయాలు
ఉండటంచేతనే
మనలో
ఇన్నివిధములైన
ద్వందావస్థలు
అభివృద్ధి
అవుతున్నవి.
దీనివల్లనే
మనకు
అనేకరకములైన
బాధలుకూడను,
కయ్యానికిగాని,
అశాంతికిగాని
గురికావటానికి
అవకాశం
ఏర్పడుతున్నది.
కనుకనే,
మనయొక్క
తత్త్వము
ఏకత్వముగా
పెట్టుకొని
ఈశ్వరత్వాన్ని
ఐక్యరీతిగా
ఒక
సమిష్టి
స్వరూపంగా
భావించుకున్నప్పుడు,
మనం
నిజమైన
సేవను
అనుభవించేవారమౌతాము.
ఈ
సేవయందు
కొన్ని
కొన్ని
సందేహములు
రావచ్చు.
దైవం
ఉన్నాడా
లేడా?
ఈ
లేడు,
ఉన్నాడు
అనేది
నాస్తి
ఆస్తిక
భావాలు.
అనాది
కాలమునుండి
అవి
వెంటజంటగా
జంటపక్షులవలె
వెంటాడుతూవస్తున్నవి.
కానీ,
ఉన్నాడనేవారుగానీ,
లేడనేవారుగానీ
చక్కని
ఆదర్శవంతమైన
ఋజువు
తెలుపకుండా
ఉంటున్నారు.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఎవరినైనా
నీ
తండ్రి
ఎవరని
అడిగినప్పుడు
ఫలానావాడు
నా
తండ్రి
అని
చెప్పుతుంటాడు.
అతను
ఫలానావాడు
నీ
తండ్రి
అని
చెప్పుటకు
నీకేమి
సాక్ష్యం?
నీకేమి
ప్రమాణం?
నీకేమి
ఆధారం?
పుట్టినప్పుడే
తండ్రిని
చూచే
దివ్యనేత్రములు
నీకు
లేవు.
ఇతడు
నా
తండ్రియని
తెలివితేటలచేత
గుర్తించే
వివేకంకూడా
నీకు
లేదు.
ఇతడు
నా
తండ్రియని
తెలివితేటలచేత
గుర్తించే
వివేకంకూడా
నీకు
లేదు.
ఇతడు
నీ
తండ్రి
అని
విశ్వాసం
ఎప్పటినుంచి
కలిగింది?
నీ
తల్లి
నీకు
‘ఇతనే
నీ
తండ్రి’
అని
ప్రబోధించి
అనేకరకములుగా
ఆదర్శముగా
నిరూపించటంచేత
ఆనాటినుండి
నీవు
ఫలానావారిని
‘నా
తండ్రి’
అని
పిలుస్తూవచ్చావు.
అంతకు
పూర్వము
నీకు
తండ్రి
తెలియదు.
అతడు
నీ
తండ్రి
అనే
సాక్ష్యము
నీకు
లేదు.
అతడు
నీ
తండ్రి
అనే
ప్రత్యక్ష
ప్రమాణము
నీకు
లేదు.
ప్రమాణం
ఏమి?
నీ
తల్లే
నీకు
ప్రమాణం.
అదేవిధంగా
నేడు
భగవంతుడు
కలడా
లేడా
అనేదానికి
ప్రకృతి
అనే
తల్లే
మనకు
ప్రమాణం.
ఈ
ప్రకృతియందు
అనేకరకములైన
మార్పులు
మనకు
కలుగుతూ
వస్తున్నాయి.
అనేకరకములైన
కూర్పులు
మనకు
జరుగుతూ
వస్తున్నాయి.
తెలియనటువంటి
కొన్ని
తెలుసుకుంటున్నాము.
కానీ,
అతీతమైనదాన్ని
మనం
గుర్తించుకోలేకపోతున్నాము.
లోకములో
అనేకమంది
మరణిస్తున్నారు.
అనేకమంది
పుడుతున్నారు.
ఈ
పుట్టుకకు,
చావుకు
ఉన్నటువంటి
కారణమేమిటి?
చావుపుట్టుకల
మధ్యనున్న
మార్గములేవి,
దీనిని
ఎవరు
నిర్ణయిస్తున్నారు,
దీనిని
ఎవరు
శాసిస్తున్నారు
అనేదానిని
మానవుడు
గుర్తించుకోలేకపోతున్నాడు.
పుట్టుకచూస్తున్నాడు,
చావును
చూస్తున్నాడు.
అంతేగాని
ఈ
చావుపుట్టుకల
మధ్యలోపల
దీని
నిర్ణేత,
నిర్మాత
ఎవరు
అనే
సత్యాన్ని
ఎవరూ
తెలుసుకోలేరు.
భవనం
కట్టాము,
ఈ
హాలు
ఇక్కడ
ఉన్నదంటే
దీనిని
కట్టిన
వ్యక్తి
ఎవరో
ఉండేతీరాలి.
మీకు
తెలిసినా,
తెలియకపోయినా
ఒక
వ్యక్తి
ఉన్నాడు.
ఆ
వ్యక్తి
సంకల్పం,
శక్తిసామర్థ్యాలు
లేకపోతే
ఈ
భవనం
నిర్మాణం
కాదు.
అదేవిధంగా
ప్రకృతి
మనకు
గోచరిస్తున్నాది.
2
▾
Meaning
Keep
ఈ
ప్రకృతి
అనే
భవనాన్ని
నిర్మించిన
ప్రాణదాత
ఉండేతీరాలి.
ఈ
భూమిని
సృష్టించిన
వాడెవడో
ఉన్నాడు.
అగ్నిని
కఱ్ఱలోపల
ప్రవేశపెట్టినవాడొకడున్నాడు.
జలమును
సృష్టించారంటే
ఆక్సిజన్,
హైడ్రోజన్
రెండింటినీ
మిక్స్చేయబట్టేకదా.
లేకపోతే
జలం
ఏర్పడటానికి
వీలుకాదు.
కనుకనే,
ఉన్నటువంటి
తత్త్వాన్ని
కొంతవరకు
అభివృద్ధిచేసుకోటానికి
మనం
ప్రయత్నం
చేస్తున్నాముకానీ
లేని
తత్త్వాన్ని
సృష్టించటం
మానవుల
తరంకాదు.
ఇవన్నీ
దైవంయొక్క
నిర్ణయంచేత,
సంకల్పంచేత,
కృషిచేతనే
జరుగుతున్నవనే
సత్యాన్ని
గుర్తించాలి.
ఈ
సత్యాన్ని
గుర్తించినప్పుడు
అనేకవిధములైన
అభివృద్ధిని
మనం
కాంచవచ్చును.
మనం
సత్యము
అనేదాన్ని
మొట్టమొదట
తీసుకోవాలి.
truth
is
god
ఈ
సత్యాన్ని
ఆచరణలో
పెట్టాలి.
జీవితంగా
భావించాలి.
సత్యమే
దైవస్వరూపం.
ఒకానొక
సమయంలో
ఉపనిషత్తులో,
ఒక
గురువు
దగ్గరకు
ఒక
శిష్యుడు
వచ్చాడు.
ఇది
ఉపనిషత్తు
కథ.
‘నాయనా!
నిన్ను
నా
శిష్యబృందంలో
చేర్చుకుంటాను
నీ
తల్లితండ్రి
పేర్లు’
చెప్పు
అన్నాడు.
ప్రాచీన
గురుకులాలలో
ఇలాంటి
పద్ధతులుండేవి.
తండ్రి
పేరేమో
కుఱ్ఱవానికి
తెలియదు.
అప్పుడు,
‘గురూజీ!
మా
తల్లిగారిని
విచారిస్తాను’
అని
ఇంటికి
వెళ్ళాడు.
ఆ
తల్లిని
విచారించటానికి
వెళ్ళేసరికి
ఆ
తల్లి
చాలా
బాధపడింది.
కుమారునికి
తన
రహస్యాన్ని
చెప్పటానికి
ఇష్టపడలేదు.
కొంతవరకు
తాను
తప్పించటానికి
ప్రయత్నంచేసింది.
కారణమేమనగా
తల్లి
వేశ్య.
తండ్రి
ఎవరు
అని
చెప్పటానికి
వీలుకాదు.
ఇలాంటి
పరిస్థితులలో
తన
కుమారుని
దగ్గర
గుట్టుగా
ఉంచటానికి
ఎంత
ప్రయత్నంచేసినా
కుమారుడు
వదలలేదు.
నా
తండ్రి
ఎవరో
తప్పక
చెప్పాలి.
లేకపోతే
నేను
విద్య
నేర్చుకోటానికి
ప్రయత్నించను.
నాకు
విద్య
అవసరము
అని
మొండిపట్టు
పట్టాడు.
కుమారుని
సంతృప్తిపరచటానికి
తన
గుట్టు
బయటపెట్టింది.
‘నాయనా!
ఎవరు
నీ
తండ్రి
అనేది
చెప్పటానికి
వీలులేని
పరిస్థితుల్లో
ఉంటున్నాను,
నేను
ఏదో
బలహీనతలో
పెడమార్గం
అవలంబించాను’
అని
అంతవరకు
చెప్పింది.
ఉన్న
విషయం
విన్నాడు.
గురువు
దగ్గరకు
వెళ్ళాడు.
‘నా
తల్లి
వేశ్య
కనుక,
ఎవరి
కుమారుడు
అనేది
చెప్పటానికి
వీలుకాదు’
అని
చక్కగా
చెప్పాడు.
అప్పుడు
గురువు
ఆనందించి,
‘నాయనా!
ఇలాంటి
సత్యవాక్పరిపాలకుడు
నా
శిష్యుడుగా
ఉండాలి,
కనుక,
నేటినుండి
నీకు
సత్యకాముడు
అని
పేరు
పెడుతున్నాను’.
ఆ
సత్యకాముని
పేరే
జాబాలి.
అతడు
మహాఋషిగా
మారిపోయాడు.
సత్యాన్ని
ఉచ్చరించే
వ్యక్తికి
ఎన్ని
గొప్పశక్తులైనా,
ఎన్ని
గొప్పవిద్యలైనా
రావటానికి
అవకాశం
ఉంటుంది.
గురువు
అనుగ్రహానికి
కూడను
పాత్రులౌతారు.
సత్యాన్ని
చెప్పి
సత్యమార్గంలో
ప్రవేశించి,
సత్యజీవితాన్ని
గడిపి
మనము
సత్యములో
ఐక్యమౌదాము.
మన
జన్మకు,
మన
జీవితమునకు,
మన
గమ్యమునకు
సత్యమే
ఆధారము.
కనుక,
‘సత్యాన్నాస్తి
పరోధర్మః’.
మన
జీవితము
ఒక
సాధనార్థము.
మానవుడిగా
పుట్టాము.
పశుపక్ష్యాదులవలె
తిని
తిరగటంకోసం
కాదు.
what
is
the
purpose
of
life?
మన
లైఫ్యొక్క
అంతరార్థము
ఏమిటి?
భగవంతునికి
తెలుసు.
మేము
ప్లేనుకు
బయలుదేరి
పోతున్నాము.
ఒక
విద్యార్థి
కాలేజీలో
చదువుతున్నాడు.
అక్కడకొచ్చి
అడుగుతున్నాడు,
‘జీవితముయొక్క
ఉద్దేశ్యము
ఏమిటి?’
అని
సిగ్గూఎగ్గూ
లేకుండా.
మానవునియందే
మహత్తరమైన
శక్తి
వుంటున్నది.
శక్తిని
మనం
ఆవిర్భవింపచేసుకొని
తద్వారా
మానవత్వాన్ని
సార్థకం
గావించుకొని
దివ్యత్వానికి
పోవాలి.
దేహంగా
పుట్టాము,
తరువాత
దేహంగా
చచ్చాము.
వృక్షంగా
పుట్టాము,
వృక్షంగా
చావాలి.
మృగంగా
పుట్టాము,
మృగంగా
చావాలి.
మనిషిగా
పుట్టాము,
మనిషిగా
చావాలి.
తరువాత
మాధవుడిగా
పుట్టాలి.
ప్రమోషన్
ఈరకంగా
పోవాలి.
అంతేగాని
డిమోషన్
రాకూడదు.
కేవలం
మానవుడిగా
పుట్టి
పశువుల్లోకి
వచ్చి
పశుమార్గంలో
ఉన్నామంటే
ఇది
సరియైన
లక్షణం
కాదు.
కనుకనే,
మానవత్వంలోనున్న
దైవత్వానికి
కొంత
విలువనిచ్చే
ప్రయత్నం
మనం
చేయాలి.
మనలోనున్న
సమిష్టి
స్వరూపాన్ని,
దివ్యత్వాన్ని
ఆవిర్భవింపజేసుకొని
‘అతనికీ
నాకు
ఏ
భిన్నత్వమూ,
భేదములేదు.
అందరూ
నావారు’
ఈవిధమైన
సన్నిహిత
ప్రేమసంబంధాన్ని
పెంచుకోటంలో
మన
సేవాదళంవారు
సరియైనదాన్ని
అభివృద్ధిచేసుకోవాలి.
‘నేను
సేవచేస్తున్నాను’
అనే
అహంకారానికి
చోటివ్వకూడదు.
సేవ
అహంకారాన్ని
నిర్మూలనంచేస్తుంది.
ఆత్మతత్త్వాన్ని
అభివృద్ధిచేస్తుంది.
సేవకుడు
ఎలాంటి
అభిమాన
మమకారాలు
లేకుండా
నడుం
వంచి
పనిచేస్తాడు.
నిజముగా
అభిమానమమకారాలు
ఎక్కడుంటాయో
అక్కడ
వాడు
సేవకుడుగా
ఉండడు.
కేవలం
అహంకారస్వరూపకంగా
ఉంటాడు.
ఈనాడు
స్వార్థము,
అసూయ,
అహంకారము
ఈ
మూడూ
ఉండటంచేత
ఈ
భూతప్రేతపిశాచములకు
గురియగుచున్నాము.
శాంతం,
సహనం,
ప్రేమతత్త్వం
వీటిని
అభివృద్ధిగావించుకొనుటలోనే
మానవునియొక్క
క్షేమం.
త్యాగం,
ప్రేమ,
సహనం
ఈ
మూడు
లక్షణములు
మానవతయొక్క
చిహ్నములు.
ఈ
మూడు
లక్షణములు
లేనివాడు
ఆకారమానవుడే
కానీ
సాకారమానవుడు
కాడు.
ఒక
పేషెంటు
వుంటుంది.
ఆ
పేషెంటు
అనేకరకములైన
అవస్థలు
పడుతుంది.
ఒక
వైపున
తాను
సహనం
వహించాలి.
ఆ
జబ్బు
తనకేమైనా
అంటుకుంటుందేమోనన్న
భావం
రాకుండా
త్యాగాన్ని
వహించాలి.
ప్రేమతో
ఆ
పేషెంటును
చూడాలి.
రేపు
నాకెలాంటి
పరిస్థితి
వస్తుందో,
‘యద్భావం
తద్భవతి’.
ఈనాడు
నేను
యిచ్చుకున్నప్పుడు
రేపు
పుచ్చుకోటానికి
అర్హుడనౌతాను.
కనుకనే,
మన
భారతదేశంలో
చెబుతుంటారు,
‘పెట్టి
పుట్టాలి’
అని.
ఈనాడు
మనం
ఒకరికి
సేవచేయకపోతే
రేపు
మనకు
ఎవరూ
చేయరు.
బయటివారేకాదు.
ఇంట్లోవారుకూడ
చేయరు.
పిండి
కొద్దీ
రొట్టె.
విత్తనం
కొద్దీ
మొక్క.
కనుక,
మన
భావాన్ని
సరిచేసుకొని,
హృదయాన్ని
నిర్మలంగావించుకొని
దివ్యమైన
ప్రేమతో
సమాజ
సేవలో
ముందంజ
వేయటానికి
సంసిద్ధులుగా
ఉండాలి.
ఈవిధమైన
కార్యంలో
ప్రవేశిస్తే
దైవమే
మనకు
తోడుగా
వుండి
అండదండలు
తానందిస్తూ
ఉంటాడు.
3
▾
Meaning
Keep
నిజముగా
దైవము
మీ
ముందే
ఉన్నాడు.
మీయందే
ఉన్నాడు.
దైవత్వమే
ఉన్నది
లోకంలో,
మరొకటి
లేదు.
మనకు
అనేక
కష్టాలు,
బాధలు
వస్తుంటాయి.
అన్నీ
కేవలం
మన
మానసిక
కలతలే.
మానవుడు
నిజంగా
చూస్తే
మహాధన్యుడు.
వారికున్న
సుఖములు,
ఆనందములు,
సౌఖ్యములు,
సంతోషములు
మరొక
జీవికి
లేవు.
ఇలాంటి
పవిత్రమైన
మానవజన్మ
ఎత్తికూడను
దుఖము,
దుఃఖము
అనుకుంటున్నాము.
సాధనా
క్యాంపు
అని
పోయి
ఏమిచేస్తున్నాము?
ఆ
మందిరము
క్లీన్
చేయటము.
ఏదో
ఒక
రోడ్డు
వేయటము,
నారాయణసేవ
చేయటము
ఇలాంటివన్నీ.
ఇవన్నీ
సత్కర్మలేగాని
సాధనలుకావు.
సాధన
అనగా
దీనికొక
అంతరార్థం
వున్నది.
మనము
ఆశించినటువంటి
దానిని
పొందే
నిమిత్తమై
ఏరకమైన
నిర్విరామ
కృషి
సల్పుదుమో
ఆ
కర్మకే
సాధన
అని
పేరు.
మనము
పొంద
దలచుకున్న
పదార్థాన్ని
పొందే
నిమిత్తమై
ఏవిధమైన
మార్గాన్ని
అవలంబింతుమో
దానినే
సాధన
అనాలి.
అయితే,
ఈ
సాధనయొక్క
తత్త్వము
సాధ్యముకావటానికి
మూడు
పథకములు
కావాలి.
ఈ
పదార్థమును
అందుకోటానికి
‘ప్రేమ’
వుండాలి.
ఆ
పదార్థములోనున్న
‘విశిష్టతను’
గుర్తించాలి.
దీనినే
వివేకము
అన్నారు.
తరువాత
ఆ
పదార్థమును
పొందటానికి
తగిన
కృషిచేయాలి.
దానినే
కర్మ
అన్నారు.
ఇవే
భక్తిజ్ఞానకర్మలు.
కనుక,
మనం
సాధన
చేస్తున్నామంటే
సాధనలో
ఈ
మూడింటియొక్క
ఏకత్వము
మిళితమైనప్పుడే
ఇది
పవిత్రమౌతుంది.
సాధన
ఏరీతిగా
చేయాలి?
తన
తత్త్వాన్ని
గుర్తించాలి.
ఇదే
సాక్షాత్కారం.
అయితే
మన
ముఖము
మనం
ఎట్లా
చూడగలుగుతున్నాము?
చూడాలంటే
ఏమిచేయాలి?
మట్టితో
చేసిన
అద్దమును
ముందు
పెట్టుకొన్నప్పుడే
ముఖాన్ని
మనం
చూడగలుగుతున్నాము.
అదేవిధంగా,
మన
స్వరూపాన్ని
చూడాలనుకుంటే
మనస్సులో
చేరిన
బుద్ధి
అనే
అద్దములో
చూచినప్పుడే
మన
ప్రతిబింబము
అందులో
కనిపిస్తుంది.
ఈ
అద్దమునకు
వెనుక
నల్లటి
రసాయనం
పూయటంచేతనే
ముందువైపు
మన
ముఖాన్ని
చూడగలుగుతున్నాము.
లేకపోతే
వెనుకనున్న
పదార్థము
కనిపిస్తుందిగానీ
ముందున్న
పదార్థము
కనిపించదు.
ఆ
వెనుక
పూసిన
నల్లటి
రసాయనమే
మనస్సు.
కనుక,
మనం
బుద్ధి
అనే
అద్దమునకు,
మనస్సును
వెనుక
వేసినప్పుడు
బుద్ధియొక్క
నీడ
మనస్సును
తీసుకున్నప్పుడు,
బుద్ధిని
నాయకుడిగా
మనం
తీసుకున్నప్పుడు
మనయొక్క
ప్రతిబింబం
అందులో
సుస్పష్టంగా
కనిపిస్తుంది.
మనం
బుద్ధిని
అనుసరించాలికానీ
మనస్సును
అనుసరించకూడదు.
మనస్సు
కోతివంటిది.
ఈ
మనస్సు
అనే
అంధకారమును
ఈ
బుద్ధిఅనే
అద్దమునకు
వెనుకవైపు
వేసి
ముందువైపు
దానిని
పరిశుద్ధముగా
పవిత్రముగావించుకున్నప్పుడు
స్వస్వరూపము
అద్దములో
గోచరిస్తుంది.
తనకు
తాను
బాగుపడాలన్నా,
పరులను
బాగుపరచాలన్నా
చిత్తశుద్ధి
అత్యవసరము.
తిరుత్తుండ్
ఆళ్వారు
తమిళనాడులో
ఉండేవాడు.
‘నా
దేహమే
నీకంకితము.
నా
రక్తమే
నీకు
అలంకారము.
నా
ప్రేమనే
నీకు
వస్త్రము’
ఈ
రకంగా
భావించుకొని,
తన
చేతిని
ఒక
రాతిపైవేసి
చేతిని
నూరి
ఇదే
నీకు
గంధమని
వచ్చిన
రక్తాన్ని
పట్టించేవాడు.
హారతి
ఇవ్వటానికి
తట్టలేకపోతే
అరచేతిలో
కర్పూరం
వేసుకొని
అరచేతిలోనే
హారతి
యిచ్చేవాడు.
ఈవిధమైన
త్యాగానికి
పూనుకొన్నవాడు
తిరుత్తుండ్
ఆళ్వారు.
కానీ,
దీనికి
భగవంతుడు
ప్రత్యక్షమైనాడు.
అతని
అభిరుచి,
అతని
ప్రేమతత్త్వము
నిజముగా
అతనికి
బాధగావుంటే
ఈవిధమైనదానికి
పూనుకోడుకదా!
అతనికి
ఆనందమే
మరి.
ఆనందమే
బ్రహ్మ.
ఆనందంకోసం
తాను
ఎంతవరకైనా
పాటుపడతాడు.
పాంచభౌతికమైన
దేహము
ఏనాడైనా
పోతుంది.
నీకర్పితంగావించుకుంటాను.
మన
కృష్ణమూర్తి
చెప్పాడు.
స్వామికి
శరణాగతిచేసి
మనం
అన్ని
పనులు
చేస్తున్నాం.
చాలా
దిగ్విజయాన్ని
సాధించాము.
మనం
అనుకున్న
దానికంటే
సులభంగా
స్వల్పకాలంలో
సాధించాము.
400
మందికి
చేసిన
వంట
1000
మందికి
సరిపోయి
యింకా
మిగిలింది.
అర్పితమనగా
ఏమిటి?
ఏకత్వము,
సర్వత్రా
ఒక
భావము.
రెండు
పదార్థములు
వుంటేకదా
ఒకటి
అర్పితము
చేసేది,
ఒకటి
చేయించుకొనేది.
రెండు
పదార్థములు
లేనప్పుడు
అర్పితము
చేసేది
ఎవరు?
చేయించుకొనేది
ఎవరు?
కనుక,
ఏకత్వాన్ని
భావించుకోటమే
అర్పితము.
ఈ
జగత్తంతా
దైవం
నివసించటానికి
అర్హత
అయినటువంటిది.
దైవముయొక్క
సంకల్పములో
చెడ్డ
పదార్థము
అనేది
ఒక్కటీ
లేదు.
కారణమేమనగా
అంతా
తన
సంకల్పముతో
చేసినదే.
కనుక,
అంతా
పవిత్రమైనదే.
కానీ,
వినియోగించుకునే
విధానంలో
ఉంది
దోషం.
కత్తి
చెడ్డదా?
దానితో
పండ్లు
కోసుకోవచ్చు,
కూరగాయలు
కోసుకోవచ్చు,
కోపం
వస్తే
పరులను
చంపటానికి
ఉపయోగపెట్టడం
దానిలోని
దోషమా?
కాదు.
మన
దోషమే.
మన
దోషములను
నిర్మూలం
గావించుకొని,
గుణాలను
అభివృద్ధి
గావించుకొని
పవిత్రమైన
విశాలభావముచేత
సమాజసేవను
సర్వేశ్వరసేవగా
భావించుకున్నప్పుడు
ఇదే
సరియైన
సేవాతత్త్వం
అవుతుంది.
సేవ
అనగా
ఎవరికో
ఒకరికి
చేయటం
సేవ
కాదు.
ఏది
చూచినాగానీ
భగవత్
ప్రీత్యర్థం.
ఏ
పేషెంట్
ప్రీతికోసం
కాదు.
ఈ
జీవి
ప్రీతికోసం
కాదు.
ఈ
దిక్కులేని
వారి
ప్రీతికోసం
కాదు.
భగవంతుని
ప్రీతికోసం
చేస్తున్నాము.
ఎందుకనగా
వానిలో
భగవంతుడున్నాడు.
ఏకనాథుడు
కాశీకి
పోయాడు.
గంగాజలము
తీసుకున్నాడు.
అక్కడనుండి
రామేశ్వరంలో
కలపటానికి
తన
శిష్యబృందంతో
వెడుతున్నాడు.
దారిలో
ఒక
గాడిద
పడిపోయింది.
చాలా
తీవ్రమైన
ఎండ.
నీరు
ఎక్కడా
చిక్కక
ఆ
గాడిద
చాలా
బాధపడుతున్నాది.
4
▾
Meaning
Keep
చూచాడు
ఏకనాథుడు.
ఆ
కావడిలోనున్న
నీరు
తీసుకొని
గాడిదకు
పోశాడు.
శిష్యులు
నోటిమీద
వ్రేళ్లు
వేసుకున్నారు.
‘అరె!
ఏమిటిరా
ఇది?
పవిత్రమైన
గంగాజలము
రామేశ్వరంలో
కలపకుండా
గాడిద
నోట్లో
పోస్తున్నాడే?
ఇది
ఎంత
అపవిత్రము?’
అని
అనుకుంటున్నారు.
ఏకనాథుడు,
‘నాయనా!
సాక్షాత్తు
శ్రీమన్
రామేశ్వరుని
కంఠమునందే
నేను
పోస్తున్నాను.
ఈ
రామేశ్వరుడు
నాకీ
రకమైన
అనుగ్రహాన్ని
అందించాడు.
ఏదో
ఒక
శిలపైన
పోయటం
లేదు.
జడంపైన
పోయటం
లేదు.
సజీవమైన
రామేశ్వరుడు
నాకు
పోయి,
నాకుపోయి
అని
ఆహ్వానం
చేస్తున్నాడు.
ఆహ్వానం
అంగీకరించి
నా
కర్మను
సార్థకం
చేసుకున్నాను’
అన్నాడు.
అదేవిధంగా
ఎవరికి
పోస్తూ
ఎవరికి
చేసినా
మనం
భగవంతుని
ప్రీత్యర్థం
చేస్తున్నామన్న
సత్యాన్ని
గుర్తించి
చేయటం
సరియైన
సేవ.
ఇక్కడ
అనేకమంది
వస్తుంటారు,
పోతుంటారు.
ప్రతి
ఒక్కరికి
నమస్కారం
చేసి,
‘సార్!
దయచేసి
క్షమించండి.
ఇదిగో
స్వామియొక్క
నిబంధనలు.
పర్మిషన్
లేకుండా
లేచి
రాకూడదు.
దయచేసి
కూర్చోండి’
అని
మీరు
మంచి
మాటలతో,
తీయని
మాటలతో,
మృదుమధురమైన
మాటలతో
చెప్పాలి.
ఈవిధంగా
చెప్పిన
వారికి
హృదయం
కరుగుతుంది.
‘ఆహా!
ఎంత
మంచి
సేవాదళంవారు,
ఎంత
మంచివారు’
అని
వారికికూడను
మంచి
పేరు
వస్తుంది.
లేకపోతే
లాగటం,
తిట్టటం
ఈవిధంగా
చేస్తే
ఇది
సేవాదళ
సభ్యులకు
సరియైనది
కాదు.
ఈనాటి
యువకులంతా
ఎంత
అసభ్యంగా
ప్రవర్తిస్తున్నారో
మీకు
తెలుసు.
అలాంటి
సమయములోపల
యువకులందరినీ
సేవాదళములో
చేర్చి,
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక
భావాలను
వారిలో
నాటి,
వారిని
పవిత్రమైన
మార్గములో
ప్రవేశింపచేయటానికి
మీరు
ఒక్కొక్కరి
తరఫున
పది
పది
మందిని
తీసుకురావాలి.
ఆ
విధంగా
చేయక,
ఏదో
నా
పని
నేను
చేసుకుంటాను
అంటే
అది
కేవలం
స్వార్థమే
అవుతుంది.
నా
పని
నేను
చేసుకుంటాను
అని
కాదు.
నా
పనిలో
యింకొకరికి
కూడా
భాగమిస్తాను.
నా
సేవలో
ఇంకో
పదిమందికి
భాగమిస్తాను.
నా
వంతుకు
వచ్చిన
అన్నం
యింకో
పదిమందికి
పది
పిడచలు
యిద్దాం.
ఇంకో
పిడచ
నేను
తింటాను
అని
అనుకోవాలిగాని,
ఈ
పది
పిడచలు
నేనే
తిని
కూర్చుంటాను
అని
అనుకోకూడదు.
ఎన్.సి.సి.
పనిలోపల
పదిమందికి
పది
భాగాలుగా
పని
అందిద్దాం.
వారినికూడా
యిందులో
ప్రవేశపెడదాం,
ధన్యులనుచేద్దాం.
భారతదేశానికే
పవిత్రమైన
సేవను
అర్పించటానికి,
ఈ
భారతమాతకు
కృతజ్ఞతను
చెల్లించుకుందాం
అనే
విశాలమైన
భావాన్ని
సేవాదళ
సభ్యులు
అభివృద్ధిగావించుకోవాలని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Tender saplings
Next
The Great Task of the Guru
→