Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · Villagers – Community Life
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Villagers – Community Life
30 March 1979, The opening of the village temple, Nagarkurnool
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
పవిత్రమైన
మానవజన్మ
మనకు
సంప్రాప్తించినప్పటికిని
తద్వారా
మనము
సార్థకము
గావించుకొనే
విధానాన్ని
గుర్తించుకొనలేక
పోవుచున్నాము.
భారతదేశమునందు
మనము
అవతరించి
ఆధ్యాత్మిక
సంపత్తికి
ఆలవాలమై
అనేకవిధములైన
అపోహలకు
గురియై
జీవిత
సత్యాన్ని
గుర్తించుకొన
లేక
అనేకమార్గములందు
అలసటచెంది
నిర్విరామ
కృషిచే
నిరంతరతాపత్రయములచే,
అంతులేని
ఆశలచే
అర్థముకాని
ఆవేశములచే
అప్రాప్యములగు
ప్రాప్తములకు
ప్రాకులాడి
అశాంతికి
గురియగు
సమయమునందు
దిక్కులు
చూపే
చక్కని
దీపికలు
ఆధ్యాత్మిక
జ్యోతులు
అనే
సత్యాన్ని
గుర్తించుకొనలేకపోతున్నాము.
నిజముగా
మన
భారతదేశమునందు
ఆలయములు
పవిత్రమైన
జీవితమును
అందించే
మహాసోపానములు.
ఇట్టి
ఆలయాలు
జన్మజన్మలనుంచి
మనము
ఆర్జించుకొన్న
పుణ్యమును
ప్రోగుచేసికొని
ఈ
పవిత్రమైన
జన్మమును
సార్థకము
గావించుకోవటానికి
తగిన
ఉపాయమును,
తగిన
మార్గమును,
తగిన
సార్థకతను
అందించేవి.
ఈ
ఆటంబాంబుల
కాలమునందు
ఆలయాలు
నిర్మించుకోవటము
అత్యంత
విచిత్రమైన
సంఘటనలు.
2
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
మానవత్వము
కేవలము
కండరములచేత
రక్తముచేత
లేక
ఎముకలచేత
ఏర్పడినట్టిది
మాత్రమే
కాదని,
దీనికి
మనస్సు,
బుద్ధి,
ఆత్మ
అనే
సూక్ష్మశరీరముకూడ
ఉన్నదని
తెలిసికొని,
దానిని
సంతృప్తిపరచే
నిమిత్తమై
ఈ
పాంచభౌతికమైన
దేహాన్ని
సార్థకమైన
మార్గాల్లో
ప్రవేశపెట్టడానికి
ఎంతైనా
మనము
ముందంజవేయాలి.
దివ్యాత్మస్వరూపులారా!
ముఖ్యంగా
మన
జీవితము
ఎన్నో
విధములైన
ఒడుదుడుకులతో
ప్రయాణము
సలుపుతూ
ఉంటుంది.
అనేకకష్టనష్టములకు,
దుఃఖములకు
గురియై
విచారముల
సహించి,
భరించి
ఈ
ఆనందాన్ని
వరించుకొనే
దివ్యమైన
మార్గాన్ని
మనము
ఈనాడు
చేపట్టాలి;
అవలంబించాలి.
నడవాలి.
ఈ
విధమైన
అవకాశము
మన
జీవితములో
దొరకుట
చాలా
దుర్లభము.
మన
జీవితము
లోపల
ఇలాంటి
ఘడియలు
చాలా
అదృష్టవంతమైన
ఘడియలు.
ఇలాంటి
ఘడియలను
సార్థకం
చేసికొన్నప్పుడే
మన
జీవితమున
ఏ
కష్టసమయమునందో
ఏ
దుఃఖసమయమునందో
ఇలాంటి
సంఘటనను
మనము
చింతించి
తద్వారా
మన
జన్మమును
సార్థకం
చేసికోవటానికి
అవకాశం
ఉంటుంది.
నిజముగా
నీతినిజాయితీలు
ఇలాంటి
పల్లెలయందే
అంతో
ఇంతో
నిలచియున్నాయి.
ప్రేమ
స్వరూపులారా!
జీవితము
అనేది
కేవలము
బయటనుంచి
వచ్చినది
కాదు.
ఇది
బ్రహ్మమునుండి
ఆవిర్భవించినది.
కేవలము
జీవితమనేది
ఆత్మనుంచి
చేకూరినట్టిదేకాని,
అన్నమునుంచి
వచ్చేది
కాదు.
ఇలాంటి
దివ్యమైన
జీవితము
ఎన్ని
విధములైన
పరిశోధనలకు
లేక
ప్రయత్నములకు,
మనము
గురియైనప్పటికిని
అనేకములైన
దుఃఖములకు
కారకులమై
పోతున్నాము.
దీనికి
కారణమేమిటి?
కొమ్మ
చెట్టునకు
అంశమువలె
జీవితముకూడ
బ్రహ్మకు
అంశముగా
ఉంటుంది.
కనుక
ఇలాంటి
అంశమైన
బ్రహ్మతత్త్వాన్ని
పొందినప్పుడే
నిత్య,
శాంతినిలయమైన
ప్రశాంతిని
మనము
అనుభవించటానికి
అవకాశము
ఉంటుంది.
దివ్యమైన
భవ్యమైన
భారతదేశమునందు
జన్మించి,
ఈ
విధమైన
అవకాశానికి
దూరము
కావటము
నిజముగా
మన
దురదృష్టమే!
ఈ
పల్లెలే
అన్యోన్యతకును,
ఐకమత్యమునకును,
సమరసమునకును,
సంతోషమునకును
కొంత
ఆలవాలమైనవని
మనము
గుర్తించటం
అత్యవసరము.
ఏదో
ఒకటి
తిని,
త్రాగి,
నిద్రించి
జీవితమును
అంతము
చేసికోవటము
మానవుని
కర్తవ్యము
కానేరదు.
“జంతూనాం
నరజన్మ
దుర్లభం”.
మానవజన్మ
అతి
ఉత్కృష్టమైనది:
పవిత్రమైనది;
సార్థకమైనది.
ఇలాంటి
జన్మ
మనకు
ప్రాప్తించినప్పుడు
సాధ్యమైనంతవరకు
భగవచ్చింతనచేత,
భగవత్
స్మరణముచేత,
సత్సంగములచేత,
పవిత్రమైన
మార్గములచేత
పరోపకారకమైన
సేవలచేత
జన్మమును
సార్థకము
గావించుకోవటానికి
తగిన
ఉపాయాన్ని
ఎన్నుకోవాలి.
నిజముగా
మానవత్వములో
ఇలాంటి
దివ్యత్వము
ఉన్నది,
అనే
సత్యాన్ని
కూడ
ఈ
నాడు
మనము
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
దైవము
సర్వభూతాంతరాత్మ.
సర్వాంతర్యామి.
సర్వభూతములయందున్నట్టి
ఆత్మస్వరూపుడే
దైవము.
మీ
దేహమే
దేవాలయము.
“దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవో
దేవస్సనాతనః”.
ఈ
సనాతనమైన
ఆత్మ
ఈ
నూతనమైన
దేహమును
దేవాలయముగా
చేసికొని
ఈ
జగత్తులో
కొంతవరకు
ఆదర్శమైన
జీవితం
అందించే
నిమిత్తమై
మానవత్వము
మనకు
ప్రాప్తించింది.
ఈ
మానవత్వాన్ని
మనము
సార్థకం
చేసికోవటానికి
ఏ
కొంతకాలమునైనా
సత్సంగములో
గడపి
పవిత్రమైన
దైవానుగ్రహానికి
పాత్రులు
కావాలని
ఈ
నాడు
ఒక
నూతనమైన
మార్గాన్ని
అవలంబించాలి.
నిజముగా
పల్లెలయందు
అనేక
కష్టనష్టములు,
దుఃఖములు,
అననుకూలములు
మొదలైనవి
ఉండటము
సహజము.
3
▾
Meaning
Keep
అలాంటి
అననుకూలములను
మనము
ఒకరికొకరు
సమరసభావముచేత,
అన్యోన్యముచేత,
సోదరత్వముచేత,
సంబంధబాంధవ్యములచేత
పరిష్కరించుకొని
కలపి
మెలపి
గ్రామాభివృద్ధికి,
దేశాభివృద్ధికి
అన్ని
విధాల
తోడు
నీడగా
ఉంటుంది.
మన
జీవితాన్ని
సక్రమమైన
మార్గములో
ప్రవేశ
పెట్టాలి.
తెల్లవారి
కోడికూతతో
లేచి,
రాత్రి
పరుండునంతవరకును
నిర్విరామ
కృషిచేత
మనము
అనేకశ్రమలు
పడుతున్నాము.
కాని
తగిన
శాంతిని
మనము
అందుకోలేక
పోతున్నాము.
తగిన
సుఖాన్ని
అందుకోలేక
పోతున్నాము.
తగిన
ఆనందాన్ని
అందుకోలేక
పోతున్నాము.
కారణమేమిటి?
కేవలము
భౌతికమునందే
మన
జీవితమును
అంకితం
గావించుకొంటున్నాము.
దీనికి
ఆధ్యాత్మికము,
పారమార్థికము,
అనేవి
ఆధారంగా
ఉన్నవనే
సత్యాన్ని
మనము
నిరూపించాలి.
తల్లి
లేని
బిడ్డ
ఉండుటకు
వీలుకాదు.
చెట్టు
లేని
కొమ్మ
నిలవటానికి
వీలుకాదు.
ఆ
విధముగానే
బ్రహ్మలేని
మన
బ్రతుకు
నిలవటానికి
వీలుకాదు.
మనము
చిన్మయమునుంచి
పుట్టిన
వారము,
కాని
మృణ్మయము
నుంచి
పుట్టిన
వారము
కాము.
కనుకనే
చిన్మయము
చేరినప్పుడే
మనము
చిదానందమును
చేరుకోవటానికి
అవకాశం
ఉంటుంది.
కనుక
ఆ
చిన్మయమనేది
ఏ
బయట
ప్రదేశమందునో,
ఏ
మార్కెట్టునందునో
మనకు
లభించేదికాదు.
ఆ
చిన్మయమనేది
మన
హృదయస్థాయియందే
ఉంటున్నది.
ఆ
చిన్మయతత్త్వమును
మనము
ఆరాధన
చేసి
తరువాత
సేవలు
చేసి
సరియైన
సత్ప్రవర్తనలచేత,
సద్భావములచేత,
సచ్చింతనలచేత,
ఆవిర్భవింపచేసికొని
తద్వారా
మనము
ఆ
చిన్మయత్వాన్ని
అనుభవించటానికి
కొంత
అవకాశము
చూచుకోవాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
మంచి
విలువైన
బంగారు
కప్పు
కలదు.
అది
నవరత్నములతో
పొదిగి
వజ్రవైడూర్యమరకతమాణిక్యములతో
చేరిన
గిన్నె
అయినప్పటికిని,
అందులో
ఒక్క
చేపను
విడిచినప్పుడు,
ఆ
చేపకు
ఏ
మాత్రము
ఆనందము
ఉండదు
–
కారణమేమిటి?
తన
నివాసమైన
తన
స్వస్థానమైన
జలమునే
తాను
ఆశిస్తుంది.
ఆ
జలము
చిక్కినప్పుడే
తనకు
నిజమైన
ఆనందము.
అదేవిధముగనే
మన
జన్మ
సార్థకము
గావించుకోవటానికి
మన
స్వస్థానమైన
బ్రహ్మస్థానము,
పవిత్రస్థానము,
దివ్యస్థానమును
చేరినప్పుడే
మనకు
నిజమైన
శాంతి
లభిస్తుంది.
కాని,
ఏదో
ధనకనకవస్తువాహనాదులచేత
భోగభాగ్యములచేత,
అధికారములచేత
మనము
ఆనందాన్ని
అందుకోవాలనుకొంటే
ఆ
చిక్కే
ఆనందము
నిత్యానందము
కాదు;
పరమానందము
కాదు.
ఇది
కేవలము
భౌతికమైన
తాత్కాలికమైన
క్షణభంగురమైన
ఆనందము.
ఈ
క్షణభంగురమైన
ఆనందము
నిమిత్తమై
శాశ్వతమైన
స్థానాన్ని,
శాశ్వతమైన
ఆనందాన్ని
కోల్పోవటము
మానవునియొక్క
కర్తవ్యము
కానేరదు.
ప్రేమస్వరూపులారా!
మనం
అందరము
ఇలాంటి
సమావేశములల్లో
చేరినందుకు
సాధ్యమైనంత
మేర
తెల్లవారి
లేచి
రాత్రి
నిద్రించునంతవరకు
మన
భౌతికమైన
కర్మలు
ఎన్ని
ఆచరించినప్పటికిని
ఒక్క
పది
నిముషములైన
భగవత్
చింతన
చేసి
సత్సంగములలో
చేరి
పవిత్రమైన
సేవలు
చేసికొని
గ్రామాభివృద్ధికి
తగిన
అనుకూలస్థితిని
మనకు
మనమే
తోడు
నీడగా
ఉండి
కల్పించుకొని
తద్వారా
భౌతికంగాను,
ఆధ్యాత్మికంగాను,
కైవల్యంగాను
శాంతిసంతోషములను
అనుభవించడానికి
ప్రయత్నం
చెయ్యాలి.
ఈ
నాడు
ఒక
మందిరాన్ని
నిర్మించుకొన్నాం.
4
▾
Meaning
Keep
ఒక
గ్రామానికి
మందిరం
ఎందుకుండాలి?
అంటే
మన
దేహానికి
గుండె
ఎంత
ఆధారమో
గ్రామానికి
గుడి
అంత
ప్రధానము.
గుండె
లేని
దేహము,
గుడి
లేని
గ్రామము
నిరుపయోగమైనవి.
కనుకనే
మన
గ్రామమునకు
ఒక
నూతనమైన
భవనాన్ని
ఈ
నాడు
మనము
నిర్మించుకొన్నాం.
దానిలో
నిత్యం
సాయంకాలమైనప్పుడు
అందరూ
చేరి
భగవన్నామస్మరణ
చేయండి.
మనము
ఏ
సేవలు
చేయక
పోయినా,
ఏ
దానధర్మాలు
చేయకపోయినా,
ఏ
యజ్ఞయాగాది
క్రతువులు
ఆచరించకపోయినా,
నామస్మరణచేసి
తరించడానికి
తగిన
ప్రయత్నమును
మీరు
చేపట్టాలని
నేను
ఆశిస్తున్నాను.
ప్రతిదానికి
ప్రభుత్వంపైన
ఆధారపడటంకాని,
లేక
అధికారులపైన
ఆధారపడటంకాని,
మానవుని
కర్తవ్యం
కానేరదు.
మనకు
రెండు
కాళ్ళు
కలవు.
రెండు
చేతులు
కలవు.
ఒక
పొట్ట
కలదు.
ఒక
పొట్టను
నింపుకోవటానికి
రెండు
చేతుల
ద్వారా
మనము
చక్కగా
పనిచేస్తే
మన
పొట్ట
నింపుకోవడంలో
ఎట్టి
అభ్యంతరమూ
ఉండదు.
కనుక
మనము
ఈ
నాడు
పనికి
దూరమైపోతున్నాము,
మాటలకు
దగ్గరైపోతున్నాము.
మాటలచేత
కార్యములను
సాధించుకోలేము.
మనము
క్రియలను
ఆచరించి
కర్మమార్గములో
ప్రవేశించి
కర్మదీక్షను
బూని
త్యాగజీవులుగా
నిల్చి
దేశమునకు
గ్రామమునకు
జీవితానికి
గూడా
ఒక
సార్థకమైన
దివ్యత్వాన్ని
పొందవలెనని
ఆశిస్తున్నాను.
ముఖ్యంగా
పల్లెలవారందరు
ఐకమత్యంగా
ఉండవలెను.
ఏ
విధమైన
భేదభావములున్నప్పటికిని
అందరియందున్నది
ఒకే
ఆత్మ.
దివ్యమైన
దైవత్వం
ఒక్కటే
అనే
సత్యాన్ని
మీరు
గుర్తించుకొని
ఎట్టి
కోపములకు,
ఎట్టి
ఈర్ష్యలకు,
ఎట్టి
అసూయలకు
అవకాశమీయకుండా
కక్షలను
పెంచుకోకుండా
ద్వేషములను
పెంచుకోకుండా
ప్రేమద్వారా,
ప్రేమతో
జీవించి,
ప్రేమతో
కార్యములను
సాధించి
ప్రేమతోనే
ప్రేమస్వరూపుణ్ణి
పొందడానికి
తగిన
ప్రయత్నం
చెయ్యాలి.
ఎందుకనగా
భగవంతుడు
ప్రేమస్వరూపుడు.
ప్రేమస్వరూపుడైన
భగవంతుణ్ణి
మనము
ప్రేమద్వారానే
పొందవలెనే
తప్ప
మరొక్క
మార్గమున
మనం
పొందడానికి
వీలు
లేదు.
చంద్రుణ్ణి
చూడాలనుకొంటే
మనము
ఒక
టార్చిలైటో,
లేక
హరికేన్
లాంటర్నో
పెట్రోమాక్స్లైటో,
ఎలెక్ట్రిక్బల్బో
పెట్టి
చూట్టానికి
వీలు
లేదు.
చంద్రునియొక్క
వెలుతురును
ఆధారము
చేసికొనే
చంద్రుణ్ణి
చూడవలసి
ఉంటుంది.
అదే
విధంగా
ప్రేమ
ఆధారం
చేతనే
ప్రేమస్వరూపుణ్ణి
పొందడానికి
మనకు
చక్కని
అవకాశము.
సులభమైన
మార్గము.
ఇటువంటి
ప్రేమద్వారా
మనలో
ఉన్న
కోపతాపములను,
ఈర్ష్యాసూయలను,
డంబము,
అహంకారము
ఇలాంటి
దుర్గుణములను
నామస్మరణముచేత
దూరము
చేసి,
సాధ్యమైనంతవరకు
పవిత్రమైన
జీవితంగా
మార్చి
అంతము
చేరుకోవాలని
నేను
ఆశిస్తున్నాను.
ఒక
చెట్టు
పైన
ఉండిన
పక్షులను
ఎగిరిపోయేటట్లు
చేయాలంటే
మనము
ఏ
విధమైన
మార్గాన్ని
అవలంబిస్తున్నాము?
చెట్టు
క్రిందికి
పోయి
చప్పట్లు
కొట్టినప్పుడే
ఆ
చెట్టుమీద
ఉన్న
పక్షులన్నీ
ఎగిరిపోతున్నాయి.
ఆరీతిగానే
మన
జీవితమనే
వృక్షముపైన
కామక్రోధమోహలోభమదమాత్సర్యములనే
పక్షులు
చేరి
ఈ
జీవితాన్ని
అనేక
రీతులుగా
మలిన
పరుస్తుండే
సమయములో
ఈ
చెట్టు
క్రింద
నిల్చుకొని
రామా,
కృష్ణా,
గోవిందా
అనే
శబ్దం
కనుక
చేసినట్లయితే
ఈ
దుర్గుణములనే
పక్షులన్నీ
ఎగిరిపోయి,
పవిత్రమైన
హృదయాన్ని
కల్పింప
చేసి,
జీవితమార్గానికి
ఆదర్శవంతమైన
దివ్య…ంగా
వెలుగుతూ
మన
మార్గాన్ని
నిరూపిస్తుంది.
కనుక,
మీరు
నేటి
నుంచి
భగవత్సమాజముల
స్థాపించుకొని
రోజంతా
మనం
కష్టపడి
శ్రమించి
పని
చేసినప్పటికిని,
సాయంకాలంలో
ఒక
చోట
చేరి,
రామా,
కృష్ణా,
గోవిందా,
నారాయణా
అనే
నామస్మరణచేత
మన
ప్రాచీన
సంప్రదాయాన్నీ,
పవిత్రమైన
భారతీయసంస్కృతినీ
తిరిగీ
మీరు
పునరుద్ధరింపచేసిన
వారవుతారు.
5
▾
Meaning
Keep
పల్లెలే
దీనికి
ప్రధానమైన
పట్టుకొమ్మలనే
సత్యాన్ని
మీరు
గుర్తించి
వర్తించిన
వారవుతారని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
ముగిస్తున్నాను.
ముఖ్యంగా
మీరందరుకూడా
నూతనమైన
పద్ధతిని
ఈ
నాటినుంచి
ఆరంభించి
మన
గ్రామానికి
కావలసిన
సదుపాయములను
అందరూ
కలిసి
చేసికొనవలెను.
ఒకరికొకరు
కలిసి
మెలిసి
పని
చేసినప్పుడు
ఎంతటి
ఘనకార్యాన్నయినా
సాధించటానికి
అవకాశంగా
ఉంటుంది.
కనుక,
దైవము
తన
ఆశీర్వాదములను
దండిగా
నిండుగా
లభింపచేసి
వెంట,
జంట,
ఇంట,
కంట,
తోడుగా
ఉండి
మీకు
తగురీతిగా
సహాయ
పడుచూ
ప్రోత్సాహ
ఉత్సాహాల్ని
అందిస్తాడని
నేను
ఆశిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Guardians – The Triad of D
Next
What is Vidhya?
→