Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1982 · My Wish
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
My Wish
23 November 1982, Birthday - 57, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
ఈ
బర్త్డేనాడు
స్వామికి
ఇవ్వవలసిన
కానుక
గురించి
మీరు
ఆలోచించాలి.
తోటి
మానవులను
ప్రేమించి,
వారి
బాధలలో
భాగం
వహించి
వారికి
తగిన
సేవలను
ఆచరించినప్పుడే
స్వామికి
సరియైన
కానుకను
ఇచ్చినట్లుగా
ఉంటుంది.
స్వామి
కోరే
కానుక
అదొక్కటే.
నిర్మలమైన,
నిశ్చలమైన,
నిస్వార్థమైన
ప్రేమను
పరమాత్మునికి
ప్రెజెంటుగా
అందించాలి.
జగత్తంతా
ఒక
కర్మక్షేత్రము
ఒక
చిన్న
ఉదాహరణ.
ఈ
జగత్తు
అంతా
ఒక
క్యాంపువంటిది.
ఇందులో
లోకకల్యాణం
జరుగుతుంది.
ఇది
ఒక
కర్మక్షేత్రము.
ఇందులో
పవిత్రమైన,
లోకకల్యాణప్రదమైన
కార్యములు
జరుగుతాయి.
ఈ
కల్యాణములో
మన
కార్యములు
నిర్వర్తించే
నిమిత్తమై
మనము
కాయమనే
పాత్రను
యజమానుడైన
భగవంతునినుండి
తెచ్చుకుంటున్నాము.
ఈ
లౌకిక
జగత్తులో
పెళ్ళిళ్ళ
నిమిత్తం
మధ్య
తరగతివారు
పాత్రలను
శ్రీమంతుల
నుండి
తెచ్చుకుంటారు.
తెచ్చుకున్న
పాత్రను
తమ
పని
పూర్తి
అయిన
తరువాత
శుభ్రపరచి,
ఆ
యజమానికి
ఇచ్చినప్పుడు
ఆయన
సంతోషిస్తాడు.
అట్లు
కాకుండా
మనము
తెచ్చుకున్న
పాత్రను
శుద్ధము
చేయక
చిల్లులు
పొడిచి
శిథిలమైన
స్థితిలో
ఆ
యజమానికి
ఇచ్చినప్పుడు
ఆ
యజమాని
కోపపడడమే
కాకుండా
మరియొక
పర్యాయము
ఆ
పాత్రను
మనకు
ఇవ్వడానికి
మనలను
విశ్వసించడు.
దేహమనే
ఈ
పాత్రలన్నీ
మన
కార్య
నిమిత్తమై
దైవమునుండి
అందుకుంటున్నాము.
ఈ
జగత్తులో
మనము
చేయవలసిన
పనులు,
చూడవలసిన
దృశ్యములు,
అనుభవించవలసిన
ఆనందములు
పూర్తయిన
తరువాత
ఈ
పాత్రను
నిర్మలము,
నిశ్చలముగా,
నిస్వార్థముగా
దైవమునకు
అర్పితము
గావించినప్పుడు
మనము
దైవముయొక్క
అనుగ్రహానికి
పాత్రులమవుతాము.
ఎట్టి
వాంఛలకు
తావీయక,
కోరికలను
అభివృద్ధిపరచుకొనక,
సాధ్యమైనంతవరకు
వాటిని
తగ్గించుకుంటూ
జనసేవయే
జనార్దనసేవగా
భావించి
సామాజిక
సేవలో
మన
సంస్థలవారు
విరివిగా
ప్రవేశించాలి.
దైవప్రేమకు
పాత్రులవడంకంటే
మీరు
సాధించవలసినది
ఏదీ
లేదు
ఈ
పుట్టిన
దినమునాడు
నేను
ఆశించేది
ఒక్కటే.
ఇది
కూడా
కేవలము
నాకొరకు
కాదు.
మీ
ఆనందము
నిమిత్తమే
దీనిని
ఆశించుచున్నాను.
రాబోయే
60వ
జన్మదినోత్సవంగురించి
మీరు
ప్రోగ్రామ్
వేసుకుంటున్నారు.
ఈ
60వ
సంవత్సరము
పుట్టిన
పండుగ
జరుపుకునే
నాటికి
6000
కుగ్రామములనైనా
మీరు
దత్తత
తీసికొని,
వానిని
సరియైన
మార్గములో
ఆదర్శమైన
గ్రామములుగా
మీరు
తయారు
చేయాలి.
శ్రీమంతులకు,
అధికారులకు
సేవకులు
కొల్లలుగా
ఉంటారు.
దీనులకు,
దిక్కు
లేనివారికి
పరితపించేవారికి
సహాయము
చేసేవారు
కానరారు.
అలాంటి
ప్రజల
దగ్గరకు
వెళ్ళి
మీరే
మిత్రులుగాను,
బంధువులుగాను
వారు
భావించేటట్లు
మీరు
వారికి
సేవలందించాలి.
ఆకలితో
అల్లాడేవారికి
ఆధ్యాత్మికాన్ని
చెవిలో
పోస్తే,
అది
వారి
చెవిలోకి
చేరదు.
మొదట
వారి
ఆకలిని
తీర్చు.
అన్నమే
వారికి
పరమాత్ముడు.
అందువలన,
అన్నస్వరూపుడైన
పరమాత్ముని
వారికి
అందించండి.
బాధలలో
ఉన్నవారికి
శాంతిస్వరూపుడైన
పరమాత్ముని
అందించు.
అనారోగ్యముతో
పరితపించేవారికి
ఔషధమనే
పరమాత్మను
అందించు.
ఈవిధముగా,
ఎవరు
ఏ
బాధను
అనుభవిస్తుంటారో
ఆ
బాధ
యొక్క
నివారణ
రూపంలో
పరమాత్ముని
వారికి
అందించినప్పుడే
ఆధ్యాత్మికం
కొంతవరకు
వారి
హృదయములో
చేరవచ్చును.
దానికి
భిన్నముగా
ప్రవర్తించినయెడల
ఆధ్యాత్మికమునకు
బదులు
నాస్తికత్వమే
బయలుదేరుతుంది.
2
▾
Meaning
Keep
కనుక,
ఈ
ఆరువేల
గ్రామములకు
విద్య,
వైద్య,
ప్రయాణ
సౌకర్యములను
అభివృద్ధిపరచడానికి
మనవారు
ప్రయత్నించాలి.
త్రాగడానికి
నీరు
లేకుండా
బాధపడే
గ్రామాలున్నాయి.
వీటినన్నింటినీ
ప్రభుత్వము
మాత్రమే
చేయడానికి
వీలుకాదు.
ప్రజల
సహకారమే
లేకపోతే
ప్రభుత్వముకూడా
ఏమీ
చేయలేదు.
ప్రభుత్వము
ప్రజలపై
ఆధారపడేటటువంటిదేగాని,
అది
స్వతంత్రమైనది
కాదు.
ప్రజా
సహకారము
ఉండినప్పుడే
ప్రభుత్వముకూడా
కొంత
సహకారము
అందిస్తుంది.
మీరు
ప్రభుత్వముపై
ఆధారపడక
మీ
స్వశక్తిచేత
ఈ
సమాజమును
అభివృద్ధి
చేయడమే
నిజమైన
సాధన,
సేవ.
ప్రేమస్వరూపులై,
ప్రేమానుగ్రహమును
పొందే
నిమిత్తమై
మీ
సర్వాంగములను
సర్వేశ్వరునికి
అర్పించాలి.
జప,
తప,
యజ్ఞ,
యాగాదులవలన
వచ్చే
ఫలితమంతా
ఒక్క
దైవప్రేమవల్లనే
లభిస్తుంది.
దైవప్రేమకు
పాత్రులు
అవడంకంటే
మీరు
సాధించవలసింది
ఏమున్నది!
స్వామి
సంకల్పములన్నీ
జగత్కల్యాణముకొరకే!
అయితే,
ఈ
ప్రేమతత్త్వాన్ని
మీరు
అర్థం
చేసుకోవాలి.
మీ
స్థాయిలో
మీరు
ప్రేమను
అనుభవిస్తూ,
అనుసరిస్తూ
కొన్ని
విధములైన
అపమార్గములకు
అవకాశము
అందిస్తున్నారు.
ఇది
పొరపాటు.
ప్రేమతత్త్వము
నిరహంకారమైనటువంటిది,
నిర్మలమైనటువంటిది,
నిస్వార్థమైనటువంటిది.
సాయి
ఏమి
చేసినా,
ఏమి
తలచినా,
ఏమి
చెప్పినా
మీ
నిమిత్తమే
గాని,
తన
నిమిత్తము
కాదు.
మీ
ఆనందమే
నా
ఆనందముగాని,
నాకు
ప్రత్యేకముగా
ఆనందము
లేదు.
నాకు
ఆశలే
లేవు.
మీరనుకోవచ్చు,
‘స్వామి
ఇది
చేస్తున్నాడు,
అది
చేస్తున్నాడు’,
అని.
ఏదీ
నాకోసము
కాదు,
మీకోసమే!
గడచిన
పుట్టిన
దినముకూడా
ఇదేవిషయము
చెప్పాను.
మీరు
నమ్మినా,
నమ్మకపోయినా
నా
నిమిత్తము
ఒక్క
నయాపైసా
కూడా
ఖర్చు
చేయడం
లేదు.
ఏది
చేసినప్పటికీ
సమాజముకోసమే.
ఇప్పటికి
56
సంవత్సరములు
అయినప్పటికీ
ఒక్క
పైసా
ఖర్చు
పెట్టి
ఒక
చొక్కాకూడా
కుట్టించుకోలేదు.
భక్తులు
ఇచ్చినవే
ధరిస్తున్నాను.
ఈనాడు
ఈ
వస్త్రమును
‘కింగ్డమ్
ఆఫ్
సత్యసాయి’
విద్యార్థి
రాధాకృష్ణ
ఇవ్వగా
వేసుకున్నాను.
ఈనాటివరకు
నాకిది
కావాలనే
సంకల్పము
నాలో
ఈనాడే
కాదు,
ఏనాడుకూడా
రాలేదు.
ఏ
సంకల్పము
వచ్చినా
జగత్కల్యాణముకొరకు,
యువకులను
అభివృద్ధిపరచి
మార్గదర్శకులైన
యువతీయువకులను
తయారు
చేయాలని.
ఇదే
నా
ప్రధాన
లక్ష్యము.
సాయితత్త్వాన్ని
చక్కగా
గుర్తించి,
సాయికి
స్వార్థము
లేదని
గమనించి,
మున్ముందు
మీ
కార్యక్రమములలో
ఉత్సాహము
పెంచుకొని
లోకసేవ
నిమిత్తమై
మీరు
కంకణము
కట్టుకోవాలి.
ప్రాచీన
భారతీయ
సంస్కృతి,
సంప్రదాయములను
పునరుద్ధరించడమే
నా
లక్ష్యము
రాబోయే
నెలనుండి
నేను
యావద్భారత
దేశములో
పర్యటన
సల్పి,
తద్ద్వారా
ఇక్కడకు
రాలేనటువంటివారికి,
ఇంకా
ఇతరత్రా
శక్తి
సామర్థ్యములు
లేనటువంటివారికి
అవకాశమిచ్చి
వారిని
సంతోషపెట్టాలని
కూడా
ఆశిస్తున్నాను.
ముఖ్యముగా,
స్వామి
కార్యక్రమములను
పట్టణములలో
కాకుండా
పల్లెలలో
చేయండి.
మీ
కార్యక్రమాలలో
వినియోగించే
ధనము
తగ్గించుకొని
పల్లెలవారికి
అనుకూలములను
అందించుటకు
ఖర్చు
పెట్టండి.
నేను
ప్రతి
పల్లెకూడా
తిరగాలని
ఆశిస్తున్నాను.
అయితే,
దానికి
తగిన
ఏర్పాట్లు
మీరు
చేయాలి.
నేను
కాలినడకనైనా
వస్తాను.
కాని,
చేరే
ప్రజలు
లక్షలకొలదీ
ఉంటారు
కనుక,
వారికి
తగిన
అనుకూలాలు
మీరు
కలుగజేయాలి.
ప్రతి
పల్లెకుకూడా
ఈవిధమైన
అనుకూలములు
చేసినప్పుడు
అందరికీ
భారతీయ
తత్త్వమును,
సంస్కృతిని
అందించడానికి
అవకాశముంటుంది.
అతి
త్వరలోనే
ప్రాచీన
సంస్కృతీ
సంప్రదాయములను
తిరిగి
మన
భారతదేశములో
పునరావిర్భవింపజేసి
భారతీయులను
ఆనందింపజేయడానికి
నిశ్చయించుకున్నాను.
ఇది
తప్పక
జరుగుతుంది.
మన
ప్రాచీన
సంప్రదాయము
నిలుస్తుంది.
మన
ధర్మాన్ని
అనేక
దేశాలకు
అందించడానికి
అవకాశము
కలుగుతుంది.
3
▾
Meaning
Keep
నిరాశతో,
నిస్పృహతో
మీరు
క్రుంగిపోనక్కర
లేదు.
విజయఘడియలు
సమీపిస్తున్నవి.
తప్పక
మనము
విజయభేరిని
మ్రోగిస్తాము.
స్వామి
తత్త్వమును
ఈనాడు
గుర్తించుకోలేనివారు
మున్ముందు
కన్నీళ్ళతో
దానిని
అనుభవించవలసి
వస్తుంది
దివ్యాత్మస్వరూపులారా!
మీ
కంటికి
కనిపించకపోవచ్చునుగాని,
నాకన్నీ
దృశ్యములుగా
కనిపిస్తున్నాయి.
స్వామి
తత్త్వమును
ఈనాడు
గుర్తించుకోలేని
వ్యక్తులు
మున్ముందు
కన్నీళ్ళతో
స్వామి
తత్త్వమును
అనుభవించవలసి
వస్తుంది.
స్వామి
తత్త్వము
అతి
శీఘ్రకాలములోనే
జగద్వ్యాప్తి
అవుతుంది.
ఇంతవరకు
స్వామియే
గట్టిగా
దానిని
అరికట్టుకొని
ఉన్నాడు
గాని,
ఒక్కతూరి
ఇది
విజృంభించినప్పుడు
జగత్తంతా
ప్రశాంతి
నిలయంగా
రూపొందుతుంది.
కనుక,
మీరు
మున్ముందు
స్వామియొక్క
తత్త్వాన్ని
చక్కగా
గుర్తించి,
స్వామి
ఆశయాలు
ఆచరణలో
పెట్టడానికి
ముందుకు
రండి.
ఇటువంటి
అవకాశములు
మీకింక
లభించవు.
స్వామికి
ఇంత
సమీపముగా
మీరు
ఇకముందు
ఉండడానికి
వీలుకాదు.
కోట్లాది
ప్రజలు
ఇక్కడకు
వచ్చి
వ్రాలుతారు.
ఆరోజులు
త్వరలోనే
వస్తున్నాయి
గనుక,
ఈనాటినుండి
స్వామి
కరుణకు,
ప్రేమకు
పాత్రులై
సరియైన
సేవా
కార్యములందు
జీవితమును
సార్థకము
గావించుకోండి.
విలువైన
వజ్రమును
అనేక
విధములుగా
బాధించడానికి
పూనుకుంటారు.
ఈ
విలువైన
వజ్రమునకు
ఎన్ని
కటింగ్స్
జరిగితే
దాని
విలువ
అంత
పెరుగుతుంది.
సుందరమైన
లతకుకూడా
అనేక
కటింగ్స్
జరగాలి.
ఇవి
జరుగుకొలదీ
లత
మరింత
శోభాయమానంగా
పెరుగుతుంది.
అదేవిధముగా,
సాయిసంస్థలకుగాని,
సాయితత్త్వమునకు
గాని
ఓర్వలేనివారు
అనేక
విధములుగా
ఆటంకములు
కల్పిస్తూ,
నిందలతో
నిష్ఠూరాలతో
కూడిన
ప్రచారము
చేస్తారు.
అయితే,
ఇవన్నీ
సాయితత్త్వము
ముందు
నిలిచేవి
కావు.
వారు
ఎంతగా
పరిహసిస్తూ
తూలనాడుతుంటారో
అన్ని
రెట్లుగా
సాయితత్త్వము
అభివృద్ధి
చెందుతుందేగాని,
క్షీణించబోదు.
ఈనాటి
నిందలన్నీ
భవిష్యత్తులో
కీర్తిప్రతిష్ఠలకు
ఉపకరిస్తాయి.
ఇది
అసూయాపరుల
ప్రభావము.
ఇట్టి
అసూయా
తత్త్వము
లేకపోతే
అనసూయా
తత్త్వము
అభివృద్ధి
కాదు.
కనుక,
ఇట్టివాటిని
మనము
లెక్కచేయక
మన
ఆశయాలను,
కర్తవ్యాలను
నెరవేర్చడానికి
దీక్ష
బూనాలి.
దీనిని
సాధించుటకు
సాయిసంస్థలవారు
ముందంజ
వేయాలి.
సంకల్పము,
కార్యము
రెండూ
ఒకేసారి
జరగాలి
ఈనాడు
మీరిక్కడకు
వచ్చి
ఇట్టి
అవకాశమును
అందుకున్నందుకు
ఈ
విషయాలను
మీరు
మీ
హృదయాలలో
భద్రపరచుకొని
మున్ముందు
చేయవలసిన
కార్యక్రమాలలో
ఆలస్యము
చేయకుండా
అతి
శీఘ్ర
కాలములోనే
కార్యాచరణలో
పెట్టుటకు
మీరు
పూనుకోండి.
సంకల్పము,
కార్యము
రెండూ
ఒకేసారి
జరగాలి.
కనుక,
నేటినుండి
మీరు
చేయవలసిన
వాటిని
మాస్టర్
ప్లానుగా
వేసుకొని,
ఈనాటి
మధ్యాహ్నము
కొంతమంది
కమిటీగా
ఏర్పడి,
దానికి
తగిన
కార్యక్రమాన్ని
నిర్ణయించండి.
అన్ని
రాష్ట్రములందుకూడా
దీనిని
అభివృద్ధిపరచాలి.
సాయిది
కేవలము
ఆంధ్ర
రాష్ట్రమని
మీరు
భావించరాదు.
ప్రపంచమే
సాయిగృహము.
అందరూ
సాయివారే.
అందరూ
ఒక్కటే.
ఈ
తత్త్వాన్ని
నిరూపించడానికి
మనము
తగిన
ప్రయత్నము
చేయాలి.
ఇదే
ఈనాడు
నేను
ఆశించే
ఆశ.
మీ
ఆశలన్నీకూడా
నేను
నెరవేరుస్తున్నాను.
నా
ఈ
ఒక్క
ఆశ
మీరందరూ
నెరవేర్చండి.
అందరూ
ఆయురారోగ్యములతో,
ఆనందముగా
శాంతి,
సంతోష,
సౌభాగ్యములతో
వర్ధిల్లి
దేశసేవలో
మీ
దేహశక్తిని,
మనోశక్తిని,
ఆధ్యాత్మిక
శక్తిని
అర్పితము
గావించి,
సార్థకజన్ములు
కావాలని
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
The jewel in the iron safe
Next
The purpose of education
→