Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1984 · May all the worlds be happy
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
May all the worlds be happy
23 November 1984, Fifty-ninth Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 121
చెంత
చేర్చెనటంచు
సంతసించెదరన్న
ఇంతలో
ఎడబాటు
చింత
గూర్చు
ఏడిపించుటె
సాయి
వేడుక
యందురా
కడుపుబ్బ
నవ్వించు
నడుమ
నడుమ
పొగడుచున్నాడని
పొంగిపోయెదరేమొ
తప్పకప్పుడె
ఎగతాళి
చేయు
అభయ
మిచ్చెనుగాన
హాయి
నుండెదమన్న
బాధలెన్నియొ
పెట్టి
పలుకకుండు
వెనుక
పోనీడు
ముందుకు
చననీడు
మనసు
మరులు
గొల్పి
మధనపెట్టు
ఇట్టి
శ్రీపర్తివాసుని
గట్టితనము
ఎట్టులెరుంగ
గలరు
ఇలను
మీరు
మానవుని
హృదయంలో
మహదాకాశమున
నీడతోకూడిన
ఎండవలె
జీవితోకూడిన
పరమాత్ముడు
నివసిస్తున్నాడు.
ఎండ,
నీడలు
జంట
పక్షులు.
ఎండవలననే
నీడ
ఏర్పడుతున్నది.
నీడయందుకూడా
కాంతి
ఉన్నది.
ప్రక్కన
ఎండ
ఉండడంచేతనే
ఈ
కాంతి.
ఎండ,
నీడలకు
అవినాభావ
సంబంధము.
అదేవిధముగా,
జీవబ్రహ్మలకూ
అవినాభావ
సంబంధము.
జీవునియందు
పరతత్త్వము
నీడవలె
వెంటాడుతూ
ఉంటుంది.
ఇలాంటి
దివ్యత్వాన్ని
ప్రతి
వ్యక్తి
గుర్తించడం
అత్యవసరం.
అయితే,
నీడలు
అనేకం;
ఎండ
ఒకటే.
అనేకత్వమైన
జీవరాశులయందు
ఏకత్వమనే
దివ్యత్వము
సాక్షీభూతమై
ఆత్మరూపాన్ని
ధరిస్తుంది.
నీ
అంతరాత్మయందే
దివ్యత్వము
ప్రకాశిస్తున్నది
ఆత్మ
నిత్యము.
అదే
సత్యము.
నిత్య
సత్య
సంభూతమైన
ఆత్మతత్త్వాన్ని
చర్మ,
అస్తి
స్వరూపము
కప్పి
వుండడంచేత
ఈ
ఆవరణమునందే
ఆనందము
వున్నదని
భ్రమిస్తున్నాడు,
మానవుడు.
ఈ
ఆవరణమును
అధిగమించి
ఆనందాన్ని
ఆత్మగతం
చేసుకోవడమే
జీవుని
ప్రధాన
కర్తవ్యం.
ఇట్టి
ఏకత్వానికి
ప్రతి
వ్యక్తీ
ప్రయత్నపూర్వకంగా
సాధన
సల్పాలి.
సాధన
అనగా,
ఆశించిన
వస్తువును
అందుకునే
నిమిత్తం
పదే
పదే
ఆచరించే
కర్మలు.
ఆత్మను
సన్నిహితం
గావించుకునేదే
నిజమైన
సాధన.
సత్యకర్మములు
లేని
సాధన
నిరర్థకము.
ఇట్టి
నిత్య
సత్య
సంభూతమైన
ఆత్మతత్త్వమును
బయట
ప్రపంచంలో
వెతుకుతున్నాము.
కాని,
నీ
హృదయమందే,
నీ
అంతరాత్మ
యందే
ఆ
దివ్యత్వము
ప్రకాశిస్తున్నది.
దేహము
రథమువంటిది.
సారథి
బుద్ధి.
ఇంద్రియములు
గుఱ్ఱములు.
ఈ
గుఱ్ఱములను
పట్టియున్న
పగ్గము
మనస్సు.
మనస్సుకు
స్థిరత్వము
లేకున్న
ఇంద్రియములనే
గుఱ్ఱములు
విచ్చలవిడిగా
పరుగెత్తి
సారథియైన
బుద్ధికికూడా
ప్రమాదం
కలిగిస్తాయి.
వాక్కును
మనస్సుతో,
మనస్సును
బుద్ధితో
చేర్చినప్పుడే
ప్రశాంతి
ఏర్పడుతుంది
ఇంద్రియములలో
ప్రధానమైనది
వాక్కు.
కనుక,
వాక్కును
అదుపులో
పెట్టుకునే
నిమిత్తం
దీనిని
మనస్సులో
చేర్చాలి.
2
▾
Meaning
Keep
మనస్సును
అదుపులోనికి
తెచ్చుకొని
విషయవాసనలయందు
ప్రవేశపెట్టక,
సంకల్ప
వికల్పములకు
గురి
కానీయక
దీనిని
బుద్ధితో
చేర్చాలి.
వాక్కును
మనస్సుతో,
మనస్సును
బుద్ధితో
చేర్చినప్పుడు
ప్రశాంతి
ఏర్పడుతుంది.
క్రమక్రమేణ
బుద్ధికికూడా
బుద్ధి
చెప్పి
ఆత్మవైపుకు
మరల్చడానికి
ప్రయత్నించాలి.
వాక్కు
మనస్సుతో,
మనస్సు
బుద్ధితో
కూడినప్పుడే
నిజమైన
మానవత్వము
శోభిస్తుంది.
ఆత్మ
అనంతము.
సత్యమును
నిరూపించేది
ఆత్మ.
సత్యము
దేశ,
కాల,
పాత్రలకు
అతీతమైనది.
భూత,
భవిష్యత్,
వర్తమానాలకు
మీరినది.
కనుకనే,
ఆత్మకు,
జ్ఞానమునకు
ఎట్టి
భేదమూ
లేదు.
జ్ఞానమునకు,
సత్యమునకుకూడా
ఎట్టి
తారతమ్యమూ
కనిపించదు.
కనుక,
వాక్కు,
జ్ఞానము,
ఆత్మ
ఈ
మూడింటి
ఏకత్వాన్ని
అనుభవించడానికి
ప్రయత్నించాలి.
మంచి,
చెడు
రెండూ
దైవానికి
అర్పితమయ్యేవే!
దేవుడు
ఎక్కడున్నాడని
దేవులాడనక్కర్లేదు.
దేవుడు
నీవే.
నీ
హృదయమే
దేవుని
నివాసము.
“ఈశావాస్యమిదం
సర్వం”,
“ఈశ్వర
స్సర్వ
భూతానాం”,
భగవంతుడు
సర్వాంతర్యామి.
ఈ
సత్యాన్ని
గట్టిగా
విశ్వసించాలి.
మనలో
దివ్యశక్తి
అగ్గిపుల్లలో
అగ్నివలె
గుప్తంగా
ఉంటుంది.
దీనిని
సాధనచేత
వ్యక్తం
గావించుకోవాలి.
పుల్లను
తీసి
పెట్టెకు
గీసినప్పుడు
అగ్ని
ఆవిర్భవించినట్లే
జీవతత్త్వమును
దైవత్వముతో
ఏకం
గావించినప్పుడు
జ్ఞానమనే
ప్రకాశము
ఆవిర్భవిస్తుంది.
ఈ
జ్ఞానతత్త్వాన్ని
అనుభవించడానికి
ప్రతి
వ్యక్తి
ప్రయత్నించాలి.
ఎవరినీ
ద్వేషించరాదు,
బాధించరాదు.
నీవు
ఎవరిని
ప్రేమిస్తున్నావో,
ఆ
ప్రేమతత్త్వము
సర్వులయందుకూడా
ఉన్నది.
కనుక,
ఎవరిని
ద్వేషించినా
నీవు
ప్రేమించిన
దివ్యశక్తిని
ద్వేషించినట్లౌతుంది.
మంచి,
చెడు
రెండూ
దైవానికి
అర్పితమయ్యేవే.
చెడ్డను
అర్పితం
చేయడంకంటే
ఉత్తమము,
శుద్ధము,
పవిత్రము
అయిన
భావాన్ని
దైవానికి
అర్పితం
గావించడం
మానవుని
కర్తవ్యం.
దీనివలన
ఆత్మతృప్తి
కలుగుతుంది.
ఆత్మతృప్తి
కలిగినప్పుడే
ఆత్మత్యాగంకూడా
కలుగుతుంది.
ఎప్పుడు
త్యాగానికి
పూనుకుంటామో
అప్పుడు
సాక్షాత్కారం
లభిస్తుంది.
తృప్తికి,
త్యాగానికి,
సాక్షాత్కారానికి
మూలాధారం
నమ్మకం.
ఎట్టి
తిండో
అట్టి
త్రేపు.
ఎట్టి
భావమో
అట్టి
ఫలితము.
ఎట్టి
చర్యలో
అట్టి
స్థానము.
కర్మాచరణ
ద్వారా
ఉపాసన,
ఉపాసనద్వారా
జ్ఞానము.
జ్ఞానమే
దైవత్వముతో
ఏకీభావంగా
ఉంటుంది.
కనుకనే,
ఆచరణను
అదుపులో
పెట్టుకోవాలి.
ఆశలు
కలిగినవానికి
ఏనాటికీ
తృప్తి
కలుగదు.
త్యాగికి
ఏ
ఆశలూ
ఉండవు.
సమత్వము,
త్యాగభావము
కూడుకున్న
చర్యలలోనే
మనము
పాల్గొనాలి.
ప్రేమ
లేని
జీవితము
వ్యర్థమే!
ఒక
భక్తుడు
బ్రహ్మను
దర్శించి,
“మహానుభావా!
మేరుపర్వతాన్ని,
అనగా
బంగారు
కొండను
ఎవరికోసం
సృష్టించావు?
త్యాగికి
దానితో
పని
లేదు.
ఆశ
కలిగినవానికి
ఇలాంటి
పర్వతాలు
వెయ్యి
సృష్టించి
ఇచ్చినా
వాని
ఆశ
తీరదు”,
అన్నాడు.
ఈనాడు
ఆశలు
అంతగా
మితిమీరిపోతున్నాయి.
ఆశలను
అదుపులో
పెట్టుకున్నప్పుడే
శాంత
జీవితము
గడపడానికి
వీలౌతుంది.
ప్రేమ,
జీవితానికి
వేరువంటిది.
జీవితమే
ప్రేమ.
ప్రేమ
లేకున్న
జీవితము
వ్యర్థమే.
కష్టాలు
భరించగలగడానికి
దైవాన్ని
ప్రేమించాలి.
బాధలు,
విచారములు
ఈ
ప్రేమద్వారానే
తీర్చుకోవడానికి
ప్రయత్నించాలి.
దైవప్రేమను
అందుకున్న
ఎట్టి
బాధలూ
మనలను
బాధించవు.
ప్రేమవల్లనే
సన్నిహిత
బాంధవ్యము
ఏర్పడుతున్నది.
ప్రేమ
లేకపోతే
అమ్మానాన్నల
సంబంధముకూడా
మనకు
లేదు.
ప్రేమ
లేకున్న
దేహాన్నికూడా
మనము
ఆశించము.
కనుక,
ప్రేమతో
మనము
జీవించాలి.
ప్రేమతో
దైవాన్ని
పొందాలి.
3
▾
Meaning
Keep
ఇంద్రియములను
అదుపులో
ఉంచుకోవడమే
శాంతి
శాంతి
అనగా
ఏమిటి?
ఇంద్రియములను
అదుపులో
ఉంచుకోవడమే
శాంతి.
సమత్వమును
పొందడమే
శాంతి.
“సమత్వం
యోగముచ్యతే”,
ఈ
సమత్వముచేతనే
యోగమును,
త్యాగమును
సాధించవచ్చును.
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలు
జీవిత
సౌధమునకు
నాల్గు
స్థంభములు.
ఈ
నాల్గు
స్థంభములపైన
జీవిత
సౌధము
ఆధారపడి
వున్నది.
జగత్తు
సుఖదుఃఖ
సంఘర్షణాత్మక
మహోత్తుంగ
తరంగ
సాగరము.
ఈ
సుఖదుఃఖములుకూడా
ప్రత్యేకముగా
వుండేవి
కావు.
ఎండ,
నీడలవలె
ఒకదానికొకటి
వెంటాడుతూ
వుంటాయి.
రెండింటికీ
అవినాభావ
సంబంధము
వున్నది.
బాహ్యజగత్తుకు,
అంతర్
ప్రపంచమునకు
ఏకత్వమనేది
ఉంటుంది.
ఒక
విషయం
మనము
ఆలోచించుకోవచ్చు.
ఆహారాన్ని
ఆస్వాదించేది,
ఇంద్రియాలతో
ఆనందించేది,
వాసనలతో
విజృంభించేది
దేహమా?
లేక
ఆత్మయా?
దేహము
కాదు.
సర్వాత్మ
అయిన
ఆత్మయే.
పరిమళాన్ని
చూసి
ఆఘ్రాణించి
ఆనందించేది
ఆత్మయా?
దేహమా?
ముక్కు
కేవలము
ఒక
ఇంద్రియము
మాత్రమే.
కాని,
అనుభవించేది
అంతఃకరణే.
ఇంద్రియములు
పనిముట్ల
వంటివి.
కరణములు.
కరణములకు
వినియోగం
లేదు.
మనస్సు
లేకున్న
ఇంద్రియములు
పనిచేయవు.
ఇంద్రియములకు
అధిపతి
కనుక,
మనస్సును
ఇంద్రుడు
అన్నారు.
అధిపతియైన
మనస్సుయొక్క
సంకల్పము
లేనిది
ఇంద్రియములు
కదలనుకూడా
కదలవు.
కనుక,
దేహమునుగాని,
మనస్సునుగాని
అనుసరించరాదు.
హృదయమును
అనుసరించాలి.
హృదయమును
గుర్తించడానికి,
అనుభవించడానికి
బుద్ధి
ప్రధానము.
కనుక,
బుద్ధిని
సరియైన
మార్గములో
ప్రవేశపెట్టాలి.
సరియైన
బుద్ధి
ఉంటే
సరియైన
జీవితాన్ని
అనుభవిస్తారు.
ఇతరుల
తప్పులెన్నక
అందరియందు
దైవత్వాన్ని
అనుభవించినప్పుడే
దైవప్రేమకు
నీవు
పాత్రుడవవుతావు.
అందరినీ
ప్రేమించేవాడే
దైవానికి
సన్నిహితుడు.
దైవాన్ని
ప్రసన్నుని
చేసుకున్నవారు
సర్వస్వాన్ని
ప్రసన్నం
గావించుకొన్నవారవుతారు.
నిస్వార్థ
సేవాతత్పరత
కలిగియుండడమే
జన్మకు
సార్థకత
ప్రేమస్వరూపులారా!
దేహానికి
పుట్టిన
దినమని,
భౌతిక
కార్యములందు
జీవితమును
వ్యర్థము
గావించుకోరాదు.
హృదయములో
నిర్మలమైన
భావములు,
నిశ్చలమైన
తత్త్వము,
నిస్వార్థసేవా
తత్పరత
ఏరోజు
అనుభవమౌతాయో
ఆరోజే
జన్మకు
సార్థకత్వము.
సేవ
విష్ణుత్వానికి
సామీప్యాన్ని
చేకూర్చుతుంది.
అనేక
ప్రాంతాలలో
ప్రకృతి
వైపరీత్యమువలన,
కొన్ని
వికల్పముల
వలన
అతివృష్టి,
అనావృష్టివలన
అనేకమంది
బాధపడుతున్నారు.
నెల్లూరు
జిల్లాలో
చాలామంది
కష్టనష్టములకు
గురి
అయ్యారు.
వారిని
ఆదరించుటకు
తగిన
సేవలో
మీరు
పాల్గొనాలి.
నెల్లూరు
జిల్లావారేగాక
పరిసర
జిల్లాలవారుకూడా
ఈ
సేవలో
పాల్గొనాలి.
బాధలు
ఏనాడైనా
ఎవరికైనా
కలుగవచ్చు.
ఈనాటి
బాధితులను
మనము
ఆదుకుంటే
రేపు
బాధలలో
మనలను
ఆదుకునేవారుంటారు.
Previous
←
Uphold Sai ideals
Next
Secure God's Love
→