Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1986 · An independent body for education
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
An independent body for education
20 January 1986, Discourse at the Music Academy Auditorium, Chennai
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
మనము
అనంతమైన
శాస్త్ర
విజ్ఞానము
సంపాదించుకున్నాము.
కాని,
అది
బాహ్య
నాగరికతను
మాత్రమే
నిరూపిస్తున్నది.
ఐతే,
ఈనాడు
మనకు
కావలసినది
హృదయ
పరిపాకము.
ఇది
అంతస్సరస్వతిని
అందిస్తుంది.
విద్యార్థికి
మేధాశక్తి
మాత్రమేగాక
హృదయ
వైశాల్యమును
చేకూరుస్తుంది.
కేవలం
భౌతిక
సంబంధమైనవి
మాత్రమేకాక
అంతస్సంబంధమైన
ఆత్మతత్త్వాన్నికూడా
చేర్చినప్పుడు
విద్య
పూర్ణత్వము
నందుకొంటుంది.
తద్వారా
క్రమశిక్షణను
పోషించుకొనటానికికూడా
అవకాశ
మేర్పడుతుంది.
క్రమ
శిక్షణలేని
విద్య,
విద్యకానేరదు.
మానవుని
దయామయునిగా
తీర్చిదిద్దేది
విద్య.
విద్యావంతులు
కేవలం
స్వార్థం,
సంకుచితత్వం
గలవారుగా
తయారుకాకూడదు.
విద్య
అనగా
హృదయమునుండి
ఆవిర్భవించే
పవిత్రమైన
గుణశీలము.
భయ,
భక్తి,
విశ్వాసాలు
భయము,
భక్తి,
విశ్వాసము
ఈ
మూడింటికి
సమష్టి
స్వరూపముగా
విద్యార్థిని
రూపొందించడమే
సామాజిక
విద్య.
అదే
జాతీయ
విద్యగా
రూపొందుతుంది.
భయమనగా
మానవునిలోని
బలహీనతలను
ఆవిర్భవింపజేయడం
కాదు.
పాపభయం,
పరులను
బాధించడం,
దూషించడం,
హింసించడం
ఇత్యాది
పాపగుణములనుండి
విద్యార్థి
అతి
దూరంగా
ఉండాలి.
ఇక
భక్తి
అనగా
దైవభక్తి,
దేశభక్తి.
దేశమనగా
మట్టి
కాదు.
ప్రజల
సమూహమే
దేశము.
ప్రజలను
గౌరవించి,
వారి
మన్ననలను
అందుకొని
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అనుభవించాలి.
‘జననీ
జన్మభూమిశ్చ’.
జన్మమునందించిన
దేశమే
నిజమైన
మాతృదేవత.
దేశభక్తి
బలపడినప్పుడే
దేశమాతకు
నిజమైన
పుత్రుడనిపించుకోగలుగుతాడు.
2
▾
Meaning
Keep
మానవులు
ఈనాడు
మాతృదేశంమీద,
దైవంమీద
విశ్వాసము
కోల్పోవటంచేతనే
మానవత్వం
మరుగై
పోయింది.
కనుక,
కేవలం
భౌతిక
విజ్ఞానమును
బోధించడం
మాత్రమే
విద్య
లక్ష్యం
కారాదు.
నిజమైన
విద్య
ప్రపంచ
ప్రగతికి
దోహదం
చేస్తుంది.
విజ్ఞానంతోపాటు
విశాలత్వమును,
పవిత్ర
భావమును,
గుణశీలమును
అభివృద్ధి
గావించేదిగా
ఉండాలి
విద్య.
నేటి
మానవుడు
అనేక
సిద్ధాంతములను
స్థాపిస్తున్నాడు.
భౌతిక
విషయాలు
ఎన్నో
తెలుసుకుంటున్నాడు.
కాని,
ఎంతవరకు
మానవత్వాన్ని
పోషించుకోగలుగుతున్నాడు?
ఈ
విషయాన్ని
గుర్తించినప్పుడే
విద్యకు
విలువ.
లేకున్న
విద్యకు
విలువే
లేదు.
మానవుడు
తత్త్వజ్ఞాని
కావచ్చు.
కాని,
కేవలం
తత్త్వంచేత
మాత్రమే
తరించలేడు.
మానవత్వాన్నికూడా
ఇందులో
సమ్మిళితం
చేసుకోవాలి.
మానవత్వమే
సరైన
విలువను
చేకూరుస్తుంది.
మానవత్వం
స్వరూపమేమిటి?
తలంపులు,
మాటలు,
చర్యలు
ఏకమై
జీవించాలి.
అందుకు
భిన్నమైన
రీతిగా
చరించినప్పుడు
అది
విద్య
అని
చెప్పడానికి
వీలుకాదు.
ఎడ్యుకేషనా,
ఎజిటేషనా?
ఆలోచించగల
ప్రతి
మానవుని
అయోమయస్థితిలో
ముంచెత్తే
సమస్యలు
ఈనాడు
విద్యారంగములో
విరివిగా
కన్పిస్తున్నవి.
నిత్య
జీవితానికి
సంబంధించిన
ప్రతిరంగాన్ని
పుష్టికరంగా
ప్రయోజకరంగా
తీర్చిదిద్దినప్పుడే
విద్యకు
విలువ.
సత్యము,
ప్రేమ,
సహనము,
సానుభూతి
మొదలైన
మానవత్వ
గుణములు
విద్యారంగములో
ఏమాత్రము
కన్పించటం
లేదు.
విద్యారంగము
ఈనాడు
కేవలము
యాంత్రికమైపోయినది.
విద్యలో
చైతన్యముకాని
నైపుణ్యముకాని
కన్పించడం
లేదు.
విద్య
కేవలం
కృత్రిమమైపోయినది.
విద్యలో
వినయము
విధిగా
ఉండితీరాలి.
శీలము,
పవిత్రతలకు
ప్రత్యేక
స్థానముండాలి.
పవిత్రత
అన్నా,
శీలమన్నా
అర్థంకాని
స్థితిలో
ఉన్నారు,
నేటి
విద్యావంతులు.
Education
అనగా
విద్య
అంటూ
ఎజిటేషన్
-
ఆందోళనను
ప్రేరేపిస్తున్నారు.
గురువులు
agitation
ను
అనగా
ఆందోళనకాదు,
elevation
వికాసాన్ని
ప్రదర్శించాలి.
పవిత్రమార్గములో
ప్రవేశించిన
వ్యక్తినే
విద్యావంతుడనడానికి
వీలవుతుంది.
బహుళ
గ్రంథపరిచయము
విద్య
కానేరదు.
3
▾
Meaning
Keep
పదవులు
ఆక్రమించినంత
మాత్రమున,
పదములకు
అర్థము
వివరించినంత
మాత్రమున,
విద్యావంతుడు
కానేరడు.
విద్య
హృదయ
కవాటమును
తెరిపింపజెయ్యాలి.
నైతిక
ఆధ్యాత్మిక
శీల
సంపదను
ఇనుమడింపజేయని
విద్య
విద్యయే
కానేరదు.
ఈనాడు
అట్టి
పవిత్రత
దూరం
కావటంచేతనే
ఎక్కడచూసినా
అశాంతి,
అక్రమము,
అనాచారము,
అసత్యము
ప్రబలమైపోతున్నవి.
దీనికి
కారణమేమిటి?
మనము
శాస్త్రవిజ్ఞానమును
బోధిస్తున్నాము
కాని
ఆ
శాస్త్ర
విజ్ఞానముద్వారా
నిరూపిస్తున్న
సత్యమేమిటి?
సుగుణమును
పోషించే
నిమిత్తమై,
సుజ్ఞానమును
బోధించే
నిమిత్తమై
ప్రాజ్ఞత్వాన్ని
వెలువరింపజేసే
నిమిత్తమై
విద్య
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
తన
స్వశక్తిపై
తాను
ఆధారపడగలగాలి.
ప్రపంచ
జ్ఞానం
కలిగి
దాన్ని
ఆదర్శంగా
నిరూపించగలగాలి.
ఈ
విధమైన
విద్య
ఈనాడు
అవసరము.
ఐతే
ఈనాడు
ఇట్టి
విద్యకు
భంగము
కలుగడానికి
ఎవరు
కారకులు?
కొంతమంది
దీనికి
విద్యార్థులే
కారణమని
చెప్పుతున్నారు.
కాని,
ఇది
సరికాదు.
విద్యార్థుల
మనస్తత్వాన్ని
గుర్తించలేని
అధ్యాపకులు,
అధ్యాపకుల
ఆజ్ఞలను
శిరసావహించని
విద్యార్థులు,
ఈ
ఇరువురి
సాధక
బాధకాలను
గుర్తించలేని
పాలకులు,
పాలకుల
బాధలను
సకాలములో
తీర్చలేని
ప్రభుత్వము
అందరూ
కారకులే!
సమస్యలను
సకాలములో
పరిహరింపజేసే
ప్రయత్నాలకు
పూనుకోకపోవడంవల్లనే
అశాంతి
పెరిగిపోతున్నది.
విద్యార్థులు
అధ్యాపకులపైన
పడుతున్నారు.
అధ్యాపకులు
పాలకులపైన
విమర్శలు
చేస్తున్నారు.
విద్యాలయాలు
అశాంతి
మందిరాలుగా
తయారవుతున్నాయి.
ఈ
పరిస్థితిని
ఉపయోగించుకొని
రాజకీయవేత్తలు
ఇందులో
ప్రవేశిస్తున్నారు.
దీనికి
తోడు
దుష్టశక్తులుకూడా
ఇందులో
చేరుతున్నాయి.
ఈ
కారణాలన్నింటిచేత
విద్యారంగం
రణరంగంగా
మారిపోతున్నది.
చివరకు
పోలీసులు
రంగంమీదికి
వచ్చి
విద్యాలయాలను
మూసివేస్తున్నారు.
ఈ
దుస్థితికి
ఎవరు
కారకులు?
కన్న
తల్లిదండ్రులా?
బుద్ధిని
వికసింపజేసే
అధ్యాపకులా?
పాలనా
వ్యవహారాలు
సక్రమంగా
చూడవలసిన
మేనేజిమెంట్లా?
సకాలంలో
సమస్యలను
పరిష్కారం
చేయకుండా
కాలయాపన
చేసే
ప్రభుత్వమా?
లేక
ఇది
పాఠ్యపుస్తకాలు
వ్రాసే
వ్యక్తుల
ప్రభావమా?
అందరిదీ
తప్పే!
ఎవరి
కర్తవ్యాలను
వారు
నిర్వర్తించ
లేకపోవటమే
ఇందులోని
దోషం.
4
▾
Meaning
Keep
ఉద్యోగాలకోసమా
విద్య?
ప్రపంచంలో
విద్యా
విషయం
చాలా
ప్రాధాన్యం
కలిగినటువంటిది.
అన్ని
రంగాలలో
విద్యావంతుల
ప్రభావము
ప్రబలిపోతున్నది.
అయితే,
నేటి
విద్య
ఏ
రీతిగా
ప్రారంభమైనది?
బ్రిటిషువారి
పాలనలో
ఉద్యోగాలు
చేసేవారు
అవసరమైనారు.
ఉద్యోగాల
నిమిత్తం
విద్యను
అభ్యసింపజేసాడు,
మెకాలే.
భారతీయులను
భావాలలో,
గుణాలలో
కేవలము
బ్రిటిషువారుగా
తయారుచేయాలని
మెకాలే
ఉద్దేశ్యము.
ఆనాడు
ఉద్యోగాల
నిమిత్తము
విద్య
ప్రారంభమైనది.
అయితే,
ఈనాడు
విద్య
నిమిత్తమై
ఉద్యోగాలు
అవసరమైన
పరిస్థితి
ఏర్పడినది!
ఉద్యోగం
కోసమే
విద్య
అనే
భావము
పిల్లలలో
పాదుకొనిపోయింది.
ఈ
భావమును
పిల్లల
హృదయమునుండి
తీసివేయాలి.
విద్య,
విజ్ఞాన
సముపార్జన
నిమిత్తమని
వారికి
బోధించాలి.
పిల్లలు
అమాయకులు.
ఏ
విధమైన
అనుభవములేనివారు.
వారిలో
ప్రీతిని
పెంపొందించి,
మంచి
మాటలచేత
వారిని
సరైన
మార్గానికి
మళ్ళించాలి.
మంచి
మాటలచేత
పిల్లల
హృదయాన్ని
కరిగించవచ్చు.
మొక్క
చక్కగా
ఉంటే
చెట్టు
చక్కగా
ఉంటుంది.
మొక్క
సొట్ట
అయితే
చెట్టు
సొట్టగా
మారిపోతుంది.
భవిష్యత్తులో
బాధ్యతలు
వహించగల
చక్కని
మార్గములో
పిల్లలను
ప్రవేశపెట్టాలి.
భావి
భారతోద్ధారకులు
విద్యార్థులే!
రేపటి
దేశానికి
వీరే
లీడర్లు.
దేశ
బాధ్యత
అంతా
వీరిపైనే
ఆధారపడి
ఉన్నది.
విద్యార్థుల
భవిష్యత్తును
మనం
దృష్టిలో
పెట్టుకోవాలి.
కాని,
బాల్యంనుండి
పిల్లలకు
నీతి,
నిజాయితీలు
బోధించటం
లేదు.
తల్లిదండ్రులు
బిడ్డలపై
ప్రేమచేత
వారికి
అమితమైన
స్వాతంత్ర్యాన్నిస్తున్నారు.
స్వాతంత్ర్యం
అవసరమే!
కాని,
మితిమీరిన
స్వాతంత్ర్యం
పనికిరాదు.
మనము
ఫ్రీడం
(స్వేచ్ఛ)
కావాలని
కోరుతున్నాము.
కాని
‘స్వేచ్ఛ’
అంటే
ఏమిటి?
బుద్ధి
వికాసానికి
పరమావధి
స్వేచ్ఛ.
సంస్కారానికి
పరమావధి,
పరిపూర్ణత.
విజ్ఞానానికి
పరమావధి,
ప్రేమ.
విద్యకు
పరమావధి,
శీలం.
ఈ
విధమైన
భావాలను
బిడ్డల
నిర్మల
నిశ్చల
నిస్వార్ధహృదయంలో
నాటే
అధ్యాపకులుగా
తల్లిదండ్రులు
తయారుకావాలి.
విద్యార్థుల
భవిష్యత్తుకు
తల్లిదండ్రులే
మొట్టమొదట
బాధ్యత
వహించాలి.
తల్లిదండ్రుల
స్థాయిలో
ఏ
మాత్రం
అలక్ష్యం
జరిగినా
పిల్లలను
ఎవ్వరూ
అరికట్టలేరు!
5
▾
Meaning
Keep
కోడలు
నలుపైతే...
విద్యా
విధానం
తప్పుమార్గం
పడితే
దేశమంతా
తప్పుమార్గం
పడుతుంది.
తెలుగులో
ఒక
సామెత
ఉంది,
‘కోడలు
నలుపైతే
కులమంతా
నలుపేనట!’
విద్యా
విధానమనే
గృహానికి,
జాతికి
విద్య
కోడలు.
విద్య
సరైన
మార్గంలో
లేకపోతే
దేశమే
క్షీణించిపోతుంది.
విద్యార్థులు
సరైన
స్థితిలో
ఉంటే
దేశ
భవిష్యత్తును
ఎంతైనా
అభివృద్ధిగావించుకోవడానికి
అవకాశముంటుంది.
కనుక
విద్యా
విధానము
విషయములో
ప్రతి
ఒక్కరు
ఏమాత్రము
అలక్ష్యం
చేయకుండా
తగు
జాగ్రత
వహించాలి.
ఇందులో
ప్రభుత్వ
విధానమును
ఎంతైనా
విచారించవలసిన
అవసరమున్నది.
ఒక్కొక్క
క్రొత్తమంత్రి
వచ్చినప్పుడు
ఒక్కొక్క
క్రొత్త
పద్ధతి
మారుతూ
వుంటుంది.
ఈ
మార్పులచేతనే
విద్యార్థుల
హృదయాలు
చాలావరకు
ఉద్రేకాలకు
లోనయ్యే
అవకాశాలు
ఏర్పడుతున్నాయి.
సమస్యలను
సకాలంలో
పరిహరింపజేసే
పద్ధతిని
అవలంబించడం
లేదు.
తద్వారా
విద్యార్థుల
అభివృద్ధి
క్షీణించిపోతున్నది.
విద్యార్థులకు
కావలసిన
ఉత్సాహాన్ని
మనము
అందించాలి.
నా
ఉద్దేశములో
విద్యార్థులయందు
ఏ
దోషము
లేదు.
వారు
కొండలలో
ఉండే
గుండుబండలవంటివారు.
శిల్పి
ఏ
రూపాన్నిస్తే
బండ
ఆ
రూపాన్ని
ధరిస్తుంది.
అధ్యాపకులే
శిల్పులు.
ఇంటిలో
తల్లిదండ్రులు,
విద్యాలయంలో
అధ్యాపకులు
సరియైన
ఆదర్శాన్ని
నెలకొల్పినప్పుడు
విద్యార్థులు
చెడటానికి
ఏ
మాత్రము
అవకాశము
లేదు.
మన
జీవితము
ఒక
వృక్షము
వంటిది.
బంధుమిత్రులు
కొమ్మలు,
రెమ్మలవంటివారు.
ఆధారమైన
వేరు,
మన
విశ్వాసము.
ఆలోచనలు
పుష్పములు,
ఫలము
ఆనందము.
ఫలములోని
తీయని
రసము
శీలము,
విశ్వాసమనే
శీలము,
శీలమనే
వేరు
లేకపోతే
జీవితమనే
వృక్షమే
వృధా
అయిపోతుంది.
విద్యార్థులకు
ప్రధానంగా
మనం
చేయవలసిన
బోధన
ఒకటి
ఉంది.
విద్యార్థులుకాని,
అధ్యాపకులుకాని
రాజకీయాలలో
ప్రవేశించకూడదు.
విద్యాభ్యాసం
పూర్తిచేసిన
తరువాత
స్వశక్తితో,
స్వబుద్ధితో
ఏ
మార్గమైనా
అవలంబించవచ్చు.
అందుకెంత
మాత్రము
అభ్యంతరముండదు.
రాజకీయాలు
చెడ్డవని
కాదు,
మంచివే!
దేశాన్ని
ఉద్ధరించేవే!
కాని,
విద్యార్థిస్థాయిలో
ఉన్నప్పుడు
రాజకీయాలలో
ప్రవేశించరాదు.
6
▾
Meaning
Keep
విద్యార్థులు
రాజకీయాలలో
ప్రవేశిస్తే
ఇటు
విద్య
అభ్యసించడానికి
వీలుకాదు.
అటు
రాజకీయాన్నీ
సాధించటానికి
కాదు.
‘ఉభయ
భ్రష్టత్వం,
ఉపరి
సన్యాసం’
అవుతుంది.
రెండింటినీ
అందుకోలేకుండా
పోతాడు.
అధ్యాపకులు
రాజకీయమునందు
ప్రవేశించడానికి
ఏ
మాత్రము
అవకాశముండరాదు.
పిల్లలను
తయారు
చేయడమే
వీరి
బాధ్యత.
కేవలం
స్వార్థము,
స్వప్రయోజనాల
నిమిత్తమై
వీరు
రాజకీయాలలో
ప్రవేశిస్తున్నారు.
పిల్లల
భావాలను
గుర్తించి
చక్కగా
వర్తించే
మార్గాన్ని
వారు
బోధించాలి.
విద్యార్థులు
క్రొత్తగా
ఎన్నికలకుకూడా
తయారవుతున్నారు.
అసెంబ్లీ
ఎలక్షన్
కంటే
విద్యార్థి
సంఘం
ఎలెక్షన్లు
ఘోరంగా
ఉంటున్నాయి.
రెండు,
మూడు
సంవత్సరాలు
కాలేజీలో
ఉండే
విద్యార్థికి
ఈ
ఎలెక్షన్లతో
ఏమి
సంబంధము?
వేలరూపాయలు
ఖర్చుపెట్టడం,
ప్రమాదాలకు
గురికావడం,
విద్యను
చెడగొట్టుకోవడం
జరుగుతున్నది.
విద్యార్థులలో
నాయకత్వం
అవసరమే!
క్రమశిక్షణ,
ప్రవర్తన,
అలవాట్లు,
మార్కులు
అన్నిట్లో
ఉత్తముడైన
విద్యార్థిని
సెలెక్షన్
చేసుకోవాలిగాని,
ఎలెక్షన్
ఉండకూడదు.
దేనికోసం
ఎలెక్షన్లు?
యూనిటీకోసం
యూనియన్లు
ప్రారంభిస్తున్నారు.
యూనియన్
అంటే
అర్థం
అందరూ
కలిసి
ఉండటం.
కాని
యూనియన్
పేరుతో
పోటీలుపడి
చిన్నాభిన్నమై
పోతున్నారు.
కో
ఆపరేషను
సాధించవలసిన
విద్యార్థులు
ఆపరేషన్లు
చేస్తున్నారు!
చెప్పడం
యూనియన్,
చేయడం
దీనికి
భిన్నంగా!
ఇది
యూనియన్
కానేరదు.
అధ్యాపకులుకూడా
విద్యార్థులకు
బోధించే
అధికార
స్థాయిలో
లేకుండాపోతున్నారు.
కారణమేమిటి?
అధ్యాపకులకుకూడా
యూనియన్లున్నాయి!
తాము
అదే
పనిచేస్తూ
విద్యార్థులను
వద్దని
చెప్పడానికి
వారికి
అధికారమెక్కడున్నది?
ఏది
తప్పని
మనము
భావిస్తామో
ఆ
తప్పును
మనము
చేయకుండా
ఉన్నప్పుడు
పరులకు
చెప్పడానికి
మనకు
అధికారముంటుంది.
ఈ
విషయం
గురించి
ప్రిన్సిపాళ్ళు,
వైస్
చాన్సెలర్లు
బాగా
ఆలోచించాలి.
ఎలర్జీ
కాదు,
ఎనర్జీ
కావాలి
మరో
విషయాన్నికూడా
విచారించవలసి
వుంది.
విద్యార్థులు
సద్గుణాలను
పోషించుకొనే
నిమిత్తమై
విద్యనభ్యసించాలి.
ఈనాడు
విద్య
పెరిగేకొద్ది
సద్గుణాలు
తరిగిపోతున్నాయి.
7
▾
Meaning
Keep
తెలివితేటలను
పెంచుకొంటున్నాము.
తెలివితేటలతోపాటు
గుణమునుకూడా
చక్కబరచుకోవాలి.
ఒక్క
చదువు
మాత్రమే
కాదు,
గుణమునుకూడా
అభివృద్ధిపరచుకోవాలి.
కేవలం
బుక్
నాలెడ్జి
అనగా
పుస్తక
పరిజ్ఞానంతో
లాభం
లేదు.
నేటి
బుక్
నాలెడ్జి
రేపు
నాలెడ్జి,
ఆ
తర్వాత
ఎలర్జీ!
కనుక
బుక్
నాలెడ్జికాదు,
దివ్యమైన
ఎనర్జీ
అనగా
శక్తిని
అభివృద్ధిచేసుకోవాలి.
పదార్థము
Matter,
శక్తి
Energy
రెండింటిని,
నెగెటివ్
పాజిటివ్‌లుగా
ఏకత్వంగా
చేర్చాలి.
విద్యార్థుల
స్థాయి
క్రమేణా
తగ్గిపోతున్నది.
25
శాతం,
30
శాతం
మార్కులు
వచ్చినవాడు
పాస్
అని
ప్రభుత్వం
వారు
ఫ్రీ
లైసెన్స్
ఇచ్చేస్తున్నారు.
దీని
అంతరార్థమేమిటి?
నూటికి
30
మార్కులు
చాలనుకుంటే
ఇంక
70
మార్కులు
అవసరం
లేదనే
కదా
దీని
అర్థము!
ఇది
నూరు
పనులలో
70
తప్పుచేసి
30
సరిగా
చేస్తే
చాలు
నన్నట్లున్నది.
విద్యార్థిదశలో
నూటికి
70
తప్పులుచేస్తే
ఉద్యోగదశలో
నూటికి
నూరు
తప్పులు
చేస్తాడు.
పైకి
చూడాలి.
క్రింద
చూపు
చూస్తూ
అల్పమైన
లక్ష్యం
పెట్టుకోవడం
ఒక
విధంగా
నేరమే
అవుతుంది.
ఇది
సరైన
పద్ధతికాదు.
నూటికి
80,
90
మార్కులు
సంపాదించాలని
లక్ష్యం
పెట్టుకుంటే
60,
70
రావచ్చు.
ముప్పైవస్తే
చాలనుకుంటే
పదిహేనో
పదహారో
వస్తాయి?
ఇందులో
ఇంకా
కొన్ని
వినూత్నమైన
పద్ధతులు
అవలంబిస్తున్నారు.
విద్యామంత్రి
గ్రేస్
మార్కులుకొన్ని,
ముఖ్యమంత్రి
గ్రేస్
మార్కులు
కొన్ని,
విద్యాశాఖ
సెక్రెటరీ
గ్రేస్
మార్కులు
కొన్ని,
ఇట్లా
అన్నీ
గ్రేస్
మార్కులే
వస్తే
వీడు
చదివేదేమిటి?
ఈ
విధమైన
చదువులవల్ల
దేశోద్ధరణ
జరగదు.
కష్టపడి
చదువుకొని
దేశాన్ని
ఉద్ధరించాలి.
భారతదేశం
పవిత్రమైన
కర్మభూమి,
త్యాగభూమి,
యోగభూమి.
నేటి
విద్యావిధానము
దీనిని
భోగభూమిగా
మారుస్తున్నది.
తద్వారా
రోగభూమిగా
రూపొందుతున్నది.
పదిమంది
విద్యార్థులు
సరైన
స్థితిలో
అభివృద్ధి
సాధించగలిగితే
చాలు.
కావలసింది
ప్రమాణం.
పరిమాణం
అక్కరలేదు.
ఈ
వాస్తవాన్ని
దృష్టిలో
ఉంచుకొని
విద్యార్థులను
అభివృద్ధి
పరచాలి.
అప్పుడే
మనదేశం
అన్ని
దేశాలకు
అధ్యాపక
స్థానాన్ని
అలంకరిస్తుంది.
8
▾
Meaning
Keep
అధ్యాపకుని
ఆదర్శస్థానం
అధ్యాపకుడనగా
ఏదో
సామాన్యస్థాయికి
చెందినవాడని
భావించకూడదు.
అధ్యాపకుని
స్థానము,
పవిత్రమైన
స్థానము,
ఉత్తమ
స్థానము,
విజ్ఞానశాస్త్రజ్ఞులను,
రాజకీయవేత్తలను,
పరిపాలకులను
తయారుచేసే
ఉన్నత
స్థానము.
విద్యార్థి,
పాలకుడు
కావచ్చును.
ఆ
పాలకుని
తయారుచేసేవాడు,
అధ్యాపకుడు.
అలాంటి
అధ్యాపకులు
ఎంతటి
పవిత్రస్థానంలో
ఉండాలి!
బాలగంగాధర
తిలక్
పూనాలో
లెక్కల
టీచరుగా
ఉండేవాడు.
రాజకీయంగా
గొప్ప
సేవలు
సలిపిన
మహావ్యక్తి.
సేవలో
ఆదర్శమూర్తి.
స్వరాజ్యం
వచ్చిన
తర్వాత
ఏ
మంత్రివి
అవుతావని
మిత్రులు
అడిగితే
‘నాకు
ఏ
మంత్రి
పదవీ
అక్కరలేద’న్నాడు.
‘ఉత్తమ
మంత్రులుగా
విద్యార్థులను
తయారుచేసే
నాకు
మంత్రిపదవి
ఎందుకు?
అధ్యాపకునిగా
ఉంటూ
బాధ్యతగలవారిగా
విద్యార్థులను
తయారు
చేయడమే
నా
అభీష్ట’మన్నాడు.
ఈనాడు
విజ్ఞానంకూడా
మితిమీరి
పోతున్నది.
‘నశ్రేయో
నియమం
వినా’
అన్నారు.
ప్రతిదానికి
నియమం
ఉండితీరాలి.
ఈనాడు
సైన్సు
ఆకాశాన్ని
అతిక్రమించిపోతున్నది.
ఇది
చాలా
ప్రమాదకరము.
దీనిని
చూసి
అందరూ
ఆనందిస్తున్నారు.
కాని,
ఇది
ఆనందించవలసిన
విషయం
కాదు,
దుఃఖించవలసిన
విషయం.
భూమి,
నీరు,
నిప్పు,
గాలి,
ఆకాశము
సర్వస్వాన్ని
తమ
హస్తగతం
చేసుకొని
ఆడుకొంటున్నాడు,
సైంటిస్టు.
ఈ
శక్తులు
ఆనాడు
హిరణ్య
కశిపుడు
సాధించిన
శక్తులకంటే
గొప్పవేమీ
కాదు.
ప్రకృతికి
ఏయే
భారమందు,
ఏయే
స్థితులందు
ఏయే
రకముల
శక్తి
ఉండాలో
అది
తప్పనిసరిగా
ఉండే
తీరాలి.
Balance
అనగా
సంతులనం
ఏ
మాత్రం
తప్పినా,
జగత్తుకు
అపాయమే!
పై
స్థాయిలో
విజ్ఞానం,
రెండవస్థాయిలో
ప్రతిభ,
అడుగు
భాగంలో
సంతులనం.
విజ్ఞానాన్ని
ప్రతిభగా
మార్చడం
లేదు.
విజ్ఞానాన్ని
మారణహోమానికి
వినియోగించడంవల్ల
సంతులనం
తప్పుతున్నది.
అందుకే
అనేకరకాల
ప్రమాదాలు
సంభవిస్తున్నాయి.
కనుక,
ఈ
మూడింటిని
ఏకంచేసే
సమత్వాన్ని
మనము
విద్యార్థులకు
బోధించాలి.
ఈనాడు
సమత్వాన్ని
బోధించడం
లేదు.
ఎవరెవరి
పేరు,
ప్రతిష్ఠల
నిమిత్తమై
వారు
అనేక
రకముల
పరిశోధనలు
సాగిస్తున్నారు.
వారి
తెలివితేటలు
మితిమీరిపోతున్నాయి.
ఎవ్వరికీ
చేతులనిండా
పనిలేకుండా
పోతున్నది.
పని
లేకపోవటం
వల్ల
క్షుద్రభావాలు
పెరిగిపోతున్నాయి.
9
▾
Meaning
Keep
విద్యార్థులకూ
చేతినిండా
పనిలేదు,
అధ్యాపకులకూ
చేతి
నిండా
పనిలేదు!
సైంటిస్టు
అన్నీ
సాధిస్తున్నాడు
కాని
తన్ను
తాను
మాత్రం
సాధించలేక
పోతున్నాడు?
మొట్టమొదట
తమను
తాము
సాధించాలి.
విద్యారంగానికి
విముక్తి
ఈనాడు
విద్యావిధానము
సరియైన
మార్గానికి
రావాలంటే
ఒక్కటే
దీనికి
పరిహారము.
మీరు
మరొక
విధంగా
భావించకూడదు.
దేశక్షేమమును
సర్వులు
దృష్టియందుంచుకోవాలి.
మన
వ్యక్తిగత
భావములేకాకుండా
సమష్టి
స్వరూపాన్ని
కనుగొనడానికి
విచారణ
సలుపాలి.
వ్యక్తి
సంఘమును
వదలి
ఒంటరియై
జీవించలేడు.
కనుక,
సమష్టి
స్వరూపమైన
వ్యక్తిత్వాన్ని
మనము
అభివృద్ధి
గావించాలి.
సరైన
విద్యావిధానమే
సమాజానికి
రక్ష.
విద్యను
చక్కగా
పోషించినప్పుడు
దేశానికి
రక్షణ
చేకూరుతుంది.
విద్యను
రక్షించి
చక్కగా
పోషించాలంటే
ఏమి
చేయాలి?
సహృదయ
భావంతో
నేను
యోచిస్తున్నాను.
దేశం
ప్రశాంతిని
నేను
ఆశిస్తున్నాను.
పవిత్రమైన
భారతీయుల
అభివృద్ధిని
కోరి
వీరిని
ఉన్నత
స్థితికి
కొనిపోయే
మార్గాన్ని
వెదకుతున్నాను.
స్వార్థపూరితమైన
సమాజ
ప్రేమ
కాకుండా
త్యాగపూర్వకమైన
దివ్య
ప్రేమ
ఆధారంగాగల
విద్య
స్వేచ్ఛగా
జగత్తంతటా
వ్యాపించాలంటే
విద్యారంగము
ప్రభుత్వంనుండి
వేరు
కావాలి.
ఏ
విధంగా
న్యాయస్థానములు
స్వతంత్రమైన
రీతిగా
అభివృద్ధి
అవుతున్నాయో
అదేవిధముగా
విద్యకూడా
స్వతంత్రముగా
ఉండాలి.
దీనికి
కొంతమంది
విద్యావేత్తలు,
అనుభవజ్ఞులైన
వారితో
ఒక
సంస్థను
దీని
మంచిచెడ్డలు
విచారించగల
అధికార
స్థాయిలో
స్థాపించాలి.
ప్రభుత్వము
చేతిలో
దీనిని
పెట్టినట్లయితే
స్వప్రయోజనాలకు,
స్వార్థాలకు
ఉపయోగించడం
వల్ల,
విద్యాసంస్థ
లక్ష్యాలకు
భిన్నమైన
పరిస్థితి
ఏర్పడుతుంది.
ఒక
చిన్న
ఉదాహరణ
చూడండి!
ఒక
మెడికల్
సీటు
చిక్కాలంటే
రెండు
మూడు
లక్షలు
కట్టాలి.
పిల్లలను
చదివించాలని
కష్టనష్టాలను
భరిస్తూ
తల్లిదండ్రులు
మూడేసి
లక్షలు
సుంకం
చెల్లిస్తున్నారు!
కేవలం
సీటు
చిక్కినంత
మాత్రాన
ప్రయోజనం
లేదు.
సీటు
చిక్కిందికదా
అని
ఆనందించకూడదు.
తల్లిదండ్రులుకాని,
అధ్యాపకులు
కాని
పిల్లలను
చెడుపుతున్నారు.
10
▾
Meaning
Keep
మా
నాన్న
మూడు
లక్షలు
చెల్లించాడు.
ఈ
మూడు
లక్షలు
ఎట్లా
రాబట్టుకోవాలనే
ఆలోచనే
అతనికి
ఉంటుంది.
పాస్
అయి
పనిలో
చేరగానే
కట్టిన
డబ్బుకు
తోడు
నిత్య
జీవితానికి
డబ్బు
సంపాదించడంలో
పడతాడు.
లంచాలు
ప్రారంభిస్తాడు.
దీనికి
కారణం
మనమే!
చిన్నతనంనుండే
ఏహ్యమైన
భావాలు
అతని
హృదయంలో
చేరకుండా
కాపాడుకోవాలి.
దేశమంతటా
ఒకే
విద్యావిధానం
ఇంతేకాకుండా
విద్యాపద్ధతియందు
మనం
అవలంబించవలసిన
ముఖ్యాంశములు
రెండు
ఉన్నవి.
ఒక్కొక్క
రాష్ట్రములో
ఒక్కొక్క
పద్ధతిని
అవలంబిస్తున్నారు.
భారతదేశమంతటా
విద్యావిధానం
ఒకేవిధంగా
ఉండాలి.
మద్రాసు
రాష్ట్రంలో
ఉన్నవారు
ఉద్యోగ
కారణాలవల్ల
కర్ణాటక
రాష్ట్రానికి
మారవచ్చు.
బదిలీయైన
తండ్రి
పిల్లలను
తీసుకొనిపోయేట్టు
లేదు,
అక్కడే
ఉంచేట్టు
లేదు.
విద్య
అంతటా
ఒకేవిధంగా
ఉంటే
ఎక్కడికి
వెళ్ళినా
విద్యార్థికి
ఏ
విధమైన
ఇబ్బంది
ఉండదు.
ఇందుకు
మనము
అవలంబించవలసిన
పద్ధతు
లేమిటి?
ప్రిన్సిపాళ్లు,
వైస్
చాన్సెలర్లు
ఇది
చక్కగా
విచారణ
చేయాలి.
ఏప్రిల్
మొదటివారంలో
పరీక్షలు
ప్రారంభమై
20లోగా
పూర్తి
కావాలి.
జూన్
మొదటి
వారంలో
కరెక్షన్లు
జరిగిపోవాలి.
రెండోవారంలో
ఫలితాలు
ప్రకటించాలి.
ఈ
పద్ధతి
చక్కగా
పాటిస్తే
విద్యార్థి
ఏ
పోస్టుకో,
ఏ
కోర్సుకో
పోవడానికి
ప్రయత్నం
చేస్తాడు.
అట్లు
కాకుండా
ఒక్కొక్క
రాష్ట్రంలో
ఒక్కొక్కసారి
ఫలితాలు
వస్తుంటాయి.
ఒక
రాష్ట్రం
విద్యార్థికి
మరో
రాష్ట్రంలో
సీటు
చిక్కడానికి
అసలే
అవకాశం
ఉండదు.
కొన్ని
సందర్భాలలో
విద్యార్థికి
ఎక్కడా
సీటు
దొరకక
సంవత్సర
కాలం
వ్యర్థం
చేసుకోవలసి
వస్తుంది.
వైస్
చాన్సెలర్లు
అందరూ
ఈ
విషయం
ఆలోచించి
సరైన
పద్ధతిని
రూపొందిస్తే
విద్యార్థులకు
ఎంతైనా
ఉపకారం
చేసినవారవుతారు.
మరొక
విషయము.
విద్యకు,
ధనమునకు
ఏ
మాత్రము
సంబంధముండకూడదు.
మీరు
వేరుగా
భావించకండి.
ఉన్న
యథార్థమును
చెప్పక
తప్పదు.
ఈ
జూన్నుండి
మా
యూనివర్సిటీలో
విద్య
ఉచితం.
ఉచితంగా
విద్య
బోధించడంద్వారా
సరైన
పద్ధతిలో
పిల్లలను
చక్కదిద్దవచ్చు.
11
▾
Meaning
Keep
వాళ్ళు
జీతాలు
కట్టడం,
ఆ
డబ్బుతో
సంస్థను
అభివృద్ధి
గావించుకుంటే
మనం
వారిచేతిలో
కీలుబొమ్మలమై
పోతాము.
ధన
సంబంధము
లేనప్పుడు
వారు
మన
చేతిలో
కీలుబొమ్మలుగా
నిలుస్తారు.
అప్పుడు
వారిని
మనం
సరైన
రీతిలో
తరిబీదు
చేయవచ్చు.
నైతిక,
ఆధ్యాత్మిక,
శీల
సంపత్తిని
ఇనుమడింపజేసే
గుణములను
వారికి
అలవరచవచ్చు.
ఈ
మధ్య
స్కూళ్ళలో
నీతిబోధ
తరగతులంటూ
పెట్టారు.
పేరుకు
నీతిబోధ.
ఆ
తరగతులలో
ఏమి
చెప్పుతున్నారో
తెలియదు.
కేవలం
విద్యాబోధన
మాత్రమేగాక
నీతి,
నిజాయితీలనుకూడా
బోధించడానికి
ప్రయత్నించాలి.
విద్యార్థులలో
బాల్యంనుండే
ప్రేమను
పెంచాలి.
ప్రేమవల్లనే
ఐక్యత
పెరుగుతుంది.
ప్రేమ
లేకపోతే
ద్వేషం
ప్రబలుతుంది.
ఈనాడు
అక్షరశూన్యుడు
అంత
అపకారం
చేయడం
లేదు.
చదువుకున్న
వ్యక్తులే
దేశానికి
అపకారం
చేస్తున్నారు.
తోటి
మానవులను
అపహరిస్తున్నారు.
లూటీలు
చేస్తున్నారు.
విమానాలను
తదితర
వాహనాలను
దారి
మళ్ళిస్తున్నారు.
వీరంతా
విద్యావంతులే
కదా?
ఇదా
చదువు
నేర్పే
సంస్కారము?
కాదు,
కాదు.
మనం
మానవజాతిని
ఉద్ధరించాలి.
‘పరోపకారార్థమిదం
శరీరం’
పరోపకార
నిమిత్తమై
ఈ
శరీర
మేర్పడినది.
ప్రేమచేత,
ప్రేమద్వారా,
ప్రేమను
సాధించాలి.
ప్రేమతో
సాధించలేనిది
ఒక్కటికూడా
లేదు.
నా
స్వభావమే
ప్రేమ!
నా
ప్రేమచేత
నేను
నిరంతరం
ఆనందంగా
ఉంటున్నాను.
నేనంటే
ద్వేషమున్నవారు
ఉండవచ్చును.
నాకు
ఎవ్వరిమీద
ద్వేషం
లేదు.
వారికి
ద్వేషముంటే
ఉండుకోనీ,
ఒకచేయి
చరిస్తే
శబ్దముండదు.
రెండు
చేతులు
చేరితే
శబ్దమవుతుంది.
నాకు
ఏ
కోశాన
ద్వేషం
లేదు.
కనుక,
ఏ
విధమైన
అశాంతి,
అలజడి
నాకు
లేదు.
ప్రేమయే
మానవత్వం.
మానవత్వమే
ప్రేమ.
ప్రేమచేతనే
విద్యను
అభివృద్ధిపరచాలి.
పిల్లలను
చక్కగా
అభివృద్ధిపరచి
భావిభారతోద్ధారకులుగా
తయారుచేయాలి.
Previous
←
One who has drunk the nectar of Bhakti has no other desire
Next
Education for transformation
→