Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · The three obstacles
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The three obstacles
1 May 1987, Address to students, Brindavan
1
▾
Meaning
Keep
చంద్రకాంతి
దినదినమునకు
వృద్ధినొందుతూ,
పూర్ణిమ
దినమున
దాని
సౌందర్యము
పరాకాష్ట
నందుకొంటుంది.
అదే
రీతిగా
మానవ
మనస్తత్వము
వికసిస్తూ,
క్రమక్రమేణా
మానవుడే
మాధవుడుగా
మారడానికి
అవకాశమున్నది.
అందువలన
మానసిక
వికాసమును
క్రమేణా
అభివృద్ధి
గావించుకోవాలి.
మనస్సును
విశాలము
గావించుకోవాలి.
అయితే
అది
ఈనాడు
జరగడం
లేదు.
‘తన’,
‘పర’
అను
సంకుచిత
భావములను
మనస్సులో
ప్రవేశించనిచ్చి
మానవుడు
తన
హృదయమును
చిన్నదిగా
చేసికొంటున్నాడు.
హృదయం
చాలా
విశాలమైనది.
‘నేను’,
‘నావారు’
అనే
సంకుచిత
భావములకు
అది
పరిమితము
కాకూడదు.
పరిశుద్ధమైన
ప్రేమ,
విశాల
హృదయం
ప్రతి
ఒక్కరికీ
అవసరం.
దొంగలు
ఇంటిలో
ప్రవేశించి
దొరలవలె
ప్రవర్తిస్తున్నారు.
వారు
దొంగలనీ
దొరలు
కాదని
ఎప్పుడు
గుర్తిస్తారో
ఆ
క్షణమే
వారు
పారిపోతారు.
దొంగలను
మనము
దొరలుగా
పోషిస్తున్నాము.
ఇంటి
యజమానులుగా
భావిస్తున్నాము.
వారు
యజమానులు
కాదు.
కామ
క్రోధ
లోభ
మోహ
మద
మాత్సర్యములనే
దొంగలు.
వీటన్నిటికి
కలిపి
వేదాంతములో
‘ప్రతిబంధక
త్రయము’
అని
పేరు.
భూత
ప్రతిబంధకం
మానవుడు
మూడు
విధములైన
ప్రతిబంధకములతో
కట్టుబడి
ఉన్నాడు.
ఒకటి
భూత
ప్రతిబంధకము,
రెండవది
వర్తమాన
ప్రతిబంధకము,
మూడవది
భావి
ప్రతిబంధకము.
భూత
ప్రతిబంధకమంటే
ఏమిటి?
ఒక
గ్రామంలో
బీద
కుటుంబీకుడు
ఒకడు
ఉండేవాడు.
ఒక
గోవును
తీసికొని,
పాలను
అమ్మి
తన
కుటుంబమును
అతి
కష్టంగా
పోషించుకొనేవాడు.
కొంత
కాలమునకు
కుటుంబమువారు
మరణించారు.
కొంత
కాలము
బాధపడ్డాడు.
తరువాత
తాను
ఎంతో
ప్రేమతో
పెంచి
పోషించిన
గోవుకూడా
మరణించింది.
2
▾
Meaning
Keep
అప్పుడు
“ఏది
మనము
శాశ్వతమనుకుంటున్నామో
అదంతా
అశాశ్వతము”
అనే
జిజ్ఞాస
అతనికి
కలిగింది.
ఇంతకాలం
వీటిని
నమ్ముకొని
జీవితమును
వ్యర్థము
చేసికొన్నాను.
పుట్టుట,
పెరుగుట,
క్షీణించుట,
ముదిమివచ్చుట,
మరణించుటవంటి
షడ్వికారములతో
కూడినది
దేహము.
షడ్వికారములకు
లోనైన
దేహమును
విశ్వసించడం
కేవలం
అజ్ఞానం
అనుకున్నాడు.
ఆధ్యాత్మిక
జ్ఞానార్జన
ఇచ్ఛ
కలిగి
ఒక
గురువు
దగ్గరకు
వెళ్లాడు.
‘నాయనా!
ఏయే
సాధనలు
నీవు
ఇంతవరకు
చేస్తూ
వచ్చావు’,
అని
అడిగాడు
గురువు.
‘నేను
ఏ
సాధనా
చెయ్యలేదు.
కష్టాలు
కలగడంచేత
మనః
పరివర్తనం
కలిగింది.
ధ్యానమునకు
కూర్చొన్న
తక్షణమే
నా
గోవు
నా
ముందు
నిలుస్తున్నది.
దానిని
ఎంతో
ప్రేమతో
పెంచాను.
దానిపై
నున్న
అభిమానముచేత
అది
వచ్చి
నా
కన్నుల
ముందు
నిల్చొంటున్నది’,
అన్నాడు.
అప్పుడు
గురువు
‘నాయనా!
గడచిపోయినదేదో
గడచిపోయినది.
విచారించనక్కరలేదు.
ప్రతి
విషయమునందు
అస్తి,
భాతి,
ప్రియ,
రూప,
నామములున్నవి.
వీనినే
సత్
చిత్,
ఆనంద,
రూప,
నామములనికూడా
అంటారు.
నీవు
చూసే
గోవులో
కూడా
ఇవి
ఉన్నవి.
రూప,
నామములను
వేరు
చేసి,
అస్తి,
భాతి,
ప్రియములను
సాధన
చెయ్యి.
నేను
సత్-చిత్-
ఆనందమును
అని
రూప,
నామములను
త్యజించి
ధ్యానం
చెయ్యి’
అని
బోధించాడు.
గురువు
ఆజ్ఞ
ప్రకారం
ఈ
విధముగా
సాధన
చేసి
అతడు
సచ్చిదానందభావంతో
తాదాత్మ్యం
పొందాడు.
గడచిపోయినదానిని
గురించి
చింతించడం,
బాధపడటం
పెద్ద
ప్రతిబంధకం.
జరిగిపోయినదేదో
జరిగిపోయినది.
అది
తిరిగి
రాదు.
తిరిగి
దానిని
గురించి
చింతించి
ప్రయోజనమేమిటి?
నడచిన
రోడ్డును
చూస్తూనే
వచ్చాము.
ఇంక
ముందు
రోడ్డును
మాత్రమే
చూడాలి.
భూతకాలమును
గురించి
చింతించడంచేత
నీ
మనస్సు
వికలమైపోతుంది.
కనుక,
గడిచిపోయిన
కష్టములనుగాని
దుఃఖములనుగాని
స్మరిస్తూ
చింతించరాదు.
ఆ
విధముగా
చింతించడంచేత
భూతము
ఒక
ప్రతిబంధకంగా
వుంటుంది.
వర్తమాన
ప్రతిబంధకం
ఇక
వర్తమానము.
అందరూ
తనను
గౌరవించాలని,
తనకు
వినయ
విధేయతలు
చూపించాలని,
తన
ఆజ్ఞ
ప్రకారం
అందరూ
నడచుకోవాలని,
ప్రతి
ఒక్కరూ
తనను
విశ్వసించాలని
మానవుడు
భావిస్తాడు.
3
▾
Meaning
Keep
నిన్ను
ఇతరులు
గౌరవించాలనుకున్నప్పుడు
నీవు
ఇతరులను
గౌరవించాలికదా!
ఇతరులు
నీకు
వినమ్రులై
విధేయులై
వుండాలనుకొన్నప్పుడు
నీవుకూడా
ఇతరులతో
వినయంగా
ఉండాలి
కదా!
ఇతరులు
నిన్ను
విశ్వసించాలి
అనుకొన్నప్పుడు
నీవు
ఇతరులను
విశ్వసించాలి
కదా!
అంతా
“వన్
వే
ట్రాఫిక్”గా
ఉండాలంటారుగాని
ఇచ్చి
పుచ్చుకునే
పద్ధతిని
అవలంబించరు.
భావి
ప్రతిబంధకం
ఈ
సంకుచిత
భావములు,
ఈ
స్వార్థ
భావములు
ఉండటంచేత
దైవముపైనకూడా
భిన్నాభిప్రాయములు
బయలుదేరుతాయి.
ఈశ్వరుడు
శ్మశానవాసి.
పుర్రెలో
భుజిస్తాడు.
ఇల్లు
లేదు,
వాకిలిలేదు.
పాములే
అతని
ఆభరణాలు.
తన
కేమీ
లేనివాడు
ఇతరులను
ఏవిధంగా
కాపాడగలడు?
విష్ణువు
ఈ
ప్రపంచములో
ఎక్కడా
చోటులేక
సముద్రములో
పడుకున్నాడు.
ఇల్లు
లేక
వాకిలి
లేక,
ప్రజలతో
ఏమాత్రం
సంబంధము
లేక
జగత్తు
నేవిధముగా
రక్షించగలడు?
అని
ప్రశ్నిస్తారు.
ఇది
భావి
ప్రతిబంధకం.
ఈ
విధమైన
దుర్భావములవలన
అహంకారం
పెరుగుతుంది.
తనకంటే
గొప్పవారు
లేరని
కన్ను
మిన్ను
గానక
ప్రవర్తిస్తారు,
మానసిక
శాంతి
అంతరించి
పోతుంది.
జీవితములో
తానుమాత్రమే
ఆనందంగా
వుండాలి.
ఎవ్వరూ
తనను
బాధించకూడదు.
తాను
ఇతరులను
బాధించినా
ఫరవాలేదు!
ఈ
విధమైన
సంకుచిత
భావములు
ప్రతిబంధకములుగా
తయారవుతాయి.
ప్రపంచంలో
ఈ
విధముగా
మూడు
ప్రతిబంధకములున్నాయి.
పథ్యం
ప్రధానం
లోకములో
ఒక
పద్ధతి
ఉన్నది.
రోగం
వదలాలంటే
ఔషధము
సేవించాలి.
ఔషధము
సేవించడం
ఎంత
అవసరమో
పథ్యమును
పాటించడంకూడా
అంతకంటే
అవసరం.
కేవలము
ఔషధమును
మాత్రము
సేవించి,
పథ్యము
చేయకపోతే
ప్రయోజనం
ఉండదు.
భవరోగమునకు
మానవుడు
కర్మ
మార్గము,
భక్తి
మార్గము,
జ్ఞాన
మార్గము,
యోగ
మార్గము
అనే
ఔషధములను
సేవించాలి.
అయితే
దీనికి
పథ్యంకూడా
పాటించాలి.
శాంతము,
సహనము,
సానుభూతి,
ప్రేమ
అనేవి
పథ్యము.
4
▾
Meaning
Keep
ఔషధాన్ని
సేవించి,
పథ్యాన్ని
పాటిస్తే
పాజిటివ్,
నెగెటివ్
చేరినట్లుగా
వుంటుంది.
రోగం
నివారణ
అయిపోతుంది.
ఆధ్యాత్మిక
కవచం
యుద్ధము
చేసేవారికి
కవచము
అత్యవసరమైనట్లు
ప్రకృతి
సంగ్రామములో
మునిగిన
మానవునికి
ఆధ్యాత్మిక
కవచము
అత్యవసరము.
ఆధ్యాత్మిక
కవచమును
ధరించి
ఎక్కడికి
వెళ్ళినా
ఫరవాలేదు.
అజ్ఞానమనే
కోటును
ధరించి
ఎక్కడికి
వెళ్ళినా
భయం
వెంటాడుతూ
ఉంటుంది.
బియ్యముపై
పొట్టు
ఉన్నంతవరకు
దానిని
భుజించలేము.
దానిని
తీసిన
తరువాతనే
భుజించగలము.
అలాగే
మానవునకు
అజ్ఞానమనే
కోటు
ఉన్నంతవరకు
సుఖాన్ని
అనుభవించడానికి
వీలులేదు.
ఏపరిస్థితిలో
ఉన్నాగాని
అన్నీ
తన
మంచి
కోసమే
జరుగుతున్నవనే
భావించాలి,
ప్రతిదానిని
సహనంతో
సాధించడానికి
ప్రయత్నించాలి.
అప్పుడే
అది
భగవంతునకు
నైవేద్యము
అవుతుంది.
ఈ
విధముగా
చేస్తూపోతే
మానసిక
ప్రతిబంధకాలన్నీ
తొలగిపోతాయి.
భగవంతుని
విషయములో
విరుద్ధమైన
భావములు
పెంచుకోవడం
పాపమేకాక,
సాధనకు
ప్రతిబంధకంగా
తయారవుతుంది.
ఆధ్యాత్మిక
భావములను
అభివృద్ధి
చేసుకొనేకొలది
విష్ణుతత్వమును
గాని
ఈశ్వర
తత్వమునుగాని
దైవత్వమును
గాని
సంకుచిత
దృష్టితో
చూడరు.
భిక్షగాని
హెచ్చరిక!
ఏ
దేశమునందుగాని,
ఏ
పరిస్థితియందుగాని
తను,
తనవారు
అన్న
భేద
భావమును
వీడాలి.
అందరూ
తనవలెనే
ఉండాలని
భావించాలి.
తనకు
అన్నము
లేనప్పుడు
ఎవరైనా
అన్నము
పెట్టితే
ఎంత
బాగుంటుందని
అనుకుంటాడు.
అన్నార్తులైన
ఇతరులపట్లకూడా
అట్టిభావము
కలిగి
ఉండాలి,
ఒకరికి
సహాయం
చెయ్యాలి.
‘భిక్షాందేహి’
అని
చెయ్యిచాచి
అడిగినప్పుడు
‘ఏయ్!
వెళ్ళిపో!’
అని
కసరుకోకూడదు.
‘దేహి’
అని
వచ్చేవాడు
భిక్షకుడు
కాదు.
భగవంతుడు
పంపిన
దూత.
‘నాకు
అన్నీ
ఉన్నప్పుడు
నేను
ఎవ్వరికీ
పెట్టలేదు,
అందువలన
నాకీ
స్థితి
వచ్చింది.
నామాదిరే
చేస్తే
నీవుకూడా
భిక్షగాడివై
పుడతావ’నే
సందేశాన్ని
అతడు
ఇస్తున్నాడు.
నోరు
తెరచి
అడిగినవానికి
తన
చేతనైననంత
సహాయం
చెయ్యాలి.
5
▾
Meaning
Keep
అయితే
మనలో
విశాల
భావములు
పెరుగుటలేదు,
అన్నీ
సంకుచిత
భావములే
వస్తున్నాయి.
సంకుచిత
భావములతో
ఎన్ని
గ్రంథాలు
చదివినా,
ఎన్ని
దాన
ధర్మాలు
చేసినా
ప్రయోజనం
లేదు.
సమన్వయ
దృష్టి
వేద
వేదాంగముల
నెన్ని
చదివినా
ఏమి
ప్రయోజనము?
ఈ
చదువులతోపాటు
సమన్వయముచేసే
చదువు
చదవాలి.
వైకుంఠత్వాన్ని
పొందజేసే
చదువు
చదవాలి.
అది
గ్రంథాలు,
గురువులవలన
వచ్చేదికాదు.
విచారణవలన
వస్తుంది.
విచారణ
ప్రతి
ఒక్కరికీ
అవసరం.
ఆ
విచారణ
సమష్టి
రూపంలో
ఉండాలి.
వ్యష్టిగా
భావించుకోవడంవలన
మీ
ఒక్కరికే
తృప్తి
కలుగుతుంది.
కాని
సమష్టి
విచారణ
దైవతృప్తికి
దారితీస్తుంది.
ఒక
చెట్టు
వనము
కాదు.
ఒక
ఇల్లు
గ్రామము
కాదు.
ఒక
వ్యక్తి
సమాజము
కాదు.
వేలకొలది
చెట్లు
చేరి
వనమవుతుంది.
వందల
ఇండ్లు
చేరి
గ్రామమవుతుంది.
కొంతమంది
వ్యక్తులు
చేరితే
సమాజమవుతుంది.
వ్యష్టితత్వము
స్వార్థానికి
దారి
తీస్తుంది.
స్వార్థంతో
పోయినవానికి
పరార్థము
అర్థంకాదు.
చదువుకున్నవాడు
తన
వాక్యాలను
సమన్వయం
గావించడానికి
ప్రయత్నిస్తాడు
కాని,
సమాజమునకు
ఉత్తమ
ఆదర్శాన్ని
అందించలేడు.
సమష్టికి
సంబంధించిన
పవిత్రతను
విశాలత్వాన్ని
అభివృద్ధిపరచుకోవాలి.
దానికి
సమన్వయము,
సామరస్యము
చాలా
అవసరం.
సమన్వయము
లేకపోతే
అన్నింటియందుకూడా
మనిషి
బంధననే
ఎదుర్కోవలసి
వస్తుంది.
మనస్సు
కేవలం
దేహముపైననే
భ్రాంతి
కలిగి
వుంటుంది.
ఇది
పాంచ
భౌతికము.
పంచ
ప్రాణములతో,
పంచ
కోశములతో
చేయబడినది.
ఈ
కోశము
లెక్కడుంటాయి?
బియ్యానికి
పొట్టు
కరుచుకొని
ఉన్నట్లు
ఒరలో
కత్తి
ఉన్నట్లుగా
కోశములుంటాయి.
మొదటిది
అన్నమయకోశము.
స్థూల
దేహమే
అన్నమయ
కోశము.
అన్నమయకోశములో
ప్రాణమయకోశము,
ప్రాణమయకోశములో
మనోమయకోశము,
మనోమయకోశములో
విజ్ఞానమయకోశమున్నది.
అన్నమయ
కోశములోనే
చేరియున్నది
ఆనందమయకోశము.
ఇవి
ఒకదానికొకటి
కవరువంటివి.
ఒక
దానితో
ఒకటి
చీలిపోవడంవలన
వాటిని
కోశములని
అన్నారే
గాని
అవి
వేరు
వేరుగా
లేవు.
6
▾
Meaning
Keep
ఒక
దానిలో
ఒకటి
ఇమిడి
ఉన్నవి.
ఆనందంతో
పరిసమాప్తి
ఇవి
అన్నముతో
ప్రారంభమైనవి.
కేవలం
అన్నముతోటే
తృప్తిపడేది
కాదు,
మానవుని
స్వభావము.
ఎన్నింటినో
సాధించాలని
ఆశిస్తాడు.
సాధించినవాటిలోకూడా
ఎన్నెన్నో
కోరికలను
పెట్టుకుంటాడు.
సమాజంలో
ప్రవేశిస్తాడు.
మంచి
చెడ్డలను
గుర్తిస్తాడు.
వాటికి
కారణమేమని
విచారిస్తాడు.
విచారించి
జగత్తంతా
కేవలం
మిథ్య
అని
నిర్ణయానికి
వస్తాడు.
ఇది
కనిపించేది
వినిపించేది.
ప్రతిక్రియ,
ప్రతిధ్వని,
ప్రతిబింబాలతో
కూడుకున్నది.
దీనిని
అన్నముతో
ప్రారంభించి
ఆనందముతో
ముగించాలి.
ఆనందము
లేక
ఎన్ని
ఉండి
ప్రయోజనమేమి?
కనుక,
అన్నమయ
కోశముతో
ప్రారంభమై
ఆనందమయ
కోశము
వరకు
ప్రయాణం
చేయాలి.
‘నేను’
అనే
ప్రదేశమునుండి
‘మనము’
అనే
ప్రదేశమును
చేరుకోవాలి.
అదే
నిజమైన
పూర్ణత్వము.
అందరూ
‘నేను’,
‘నేను’
అనే
పోతున్నారు.
ఏకత్వాన్ని
సాధించాలి.
మనము
అనే
సమష్టి
తత్వములోని
ఏకత్వాన్ని
దర్శించాలి.
అదే
ఆత్మ
తత్త్వము.
కారణాతీతం
దైవత్వం
ఆత్మ
తత్త్వమంటే
ఏమిటి?
ఇది
అస్తి,
భాతి,
ప్రియములతో
కూడుకున్నది.
మనము
సాధారణంగా
ఒక
చిన్న
ఇల్లు
చూసి
ఇంటి
యజమాని
సామాన్యుడని
అనుకుంటాము.
గొప్ప
భవనమును
చూసి
ఇతనెవరో
గొప్ప
శ్రీమంతుడని
అనుకుంటాము.
ఇంటిని
చూసి
ఇంటి
యజమాని
ఘనతను
చెప్పుకుంటాము.
మరి,
సృష్టి
స్థితి
లయములకు
మూలకారణమెవరు?
సూర్య
చంద్రాదులను
నియమించినవారెవరు?
ఇంత
పెద్ద
విశ్వాన్ని
నిర్మించినదెవరు?
ఇంతటి
బ్రహ్మాండమైన
భవనాన్ని
కట్టిన
దెవరు?
అతను
ఎంత
గొప్పవాడు?
ఈ
విధమైన
భావములచేత
మన
హృదయాన్ని
విశాలం
గావించుకోవాలి.
దైవముంటే
మన
కన్నులకు
కనిపించడేమి
అంటే
అతను
చర్మ
చక్షువులకు
కనిపించేవాడు
కాదు.
మనము
దేవాలయానికి
వెళ్ళినప్పుడు
కన్నులు
మూసుకుంటాము.
కారణ
మేమిటి?
దైవం
చర్మ
చక్షువులకు
కనిపించేవాడు
కాడు
కనుకనే!
దైవం
జ్ఞాన
చక్షువులకు
మాత్రమే
కనిపిస్తాడు.
అన్నమయ
జగత్తు
కేవలం
కార్యకారణ
సంబంధమైనది.
కాని,
జ్ఞాన
చక్షువులు
కారణమునకు
అతీతమైనవి.
7
▾
Meaning
Keep
అలాంటిదానిని
మనము
సాధించడానికి
ప్రయత్నం
చేయాలి.
సచ్చిదానందమే
అహం
అందరియందు
మొట్ట
మొదట
బయల్దేరేది
“నేను”
అనేది
ఒకటే.
తలుపు
కొడుతున్నప్పుడు
ఎవరు
అని
అడిగితే
“నేనే”
అని
సమాధానము
చెప్పుతాము.
ఎక్కడ
చూసినా
ఉండేది
“నేను”
అనేదే!
కనిపించేది,
వినిపించేది
అదే!
కాని,
దానిని
మనము
అర్థముచేసుకోలేకపోతున్నాము.
నేనంటే
ఏమిటి!
అహం.
అహమెక్కడినుండి
వచ్చింది?
సర్వ
దేవతా
స్వరూపమునుండి
వచ్చిన
సారం,
అహం.
సంస్కృతంలో
మొదటి
అక్షరము
అ,
చివరి
అక్షరము
హ.
ఈ
రెండు
చేరి
అహమైనది.
ఇది
సర్వ
శక్తివంతమైనది.
అహం
ఆత్మ
తత్త్వము.
అహంకారము
కాదు.
అహమునకు
ఆకార
తత్త్వమును
చేరిస్తే
అహంకారమైపోతుంది.
ఆకారాన్ని
విసర్జించి
సత్
చిత్
ఆనందాన్నే
అహంగా
భావించాలి.
ఇదే
నిజమైన
తత్త్వము.
ఈ
తత్త్వాన్ని
చక్కగా
విచారణ
చేస్తే
మానసిక
వికాసము,
భూతదయ
వాటంతటవే
వస్తాయి.
మనోవికాసం
లేకపోవడంవలననే
కోపతాపములు,
ఈర్ష్య,
అసూయ
డంబాదులకు
గురైపోతున్నాము.
బలవంతునితో
స్నేహం
పదవి,
అధికారం,
విద్య,
ధనం,
బల,
సౌందర్య,
తపో,
సత్యాది
అష్ట
మదములనే
ఎనిమిది
శత్రువులను
అరికట్టాలి.
ఆ
తర్వాత
అరిషడ్వర్గములను
అంతమొందించాలి.
వీటినుండి
తప్పించుకోవడానికి
దైవ
సహాయాన్ని
కోరాలి.
ప్రపంచం
మాయతో
నిండి
ఉన్నది.
ఆ
మాయను
ఛేదించడానికి
దైవ
సహాయం
అత్యవసరం.
తనకంటే
శక్తిమంతుడైనవానితో
పోరాడుతున్నప్పుడు
అతనికంటే
శక్తిమంతుడైనవాని
సహాయమును
పొందవలసి
ఉంటుంది.
సుగ్రీవుడు
వాలితో
పోరాడాలనుకున్నాడు.
మహా
బలవంతుడైన
వాలిని
జయించాలంటే
అతనికంటే
బలవంతుడైనవాని
స్నేహమును
సంపాదించాలి.
అట్టి
బలవంతునికోసం
ఎదురు
చూసాడు.
రామలక్ష్మణులు
వచ్చారు.
అన్ని
విధాల
పరీక్షించి
వారితో
స్నేహం
కుదుర్చుకున్నాడు.
మహా
శక్తివంతుడైన
రాముని
ఆశ్రయించడంవలననే
అతను
వాలిని
జయించగలిగాడు.
8
▾
Meaning
Keep
మహా
మాయతో
పోరాడుతున్నప్పుడు
దానికంటే
బలవంతుడైన
వాని
సహాయమును
పొందాలి.
మాయకంటే
అధికమైన
శక్తిగలవాడు,
మాధవుడు.
దైవత్వాన్ని
ఆశ్రయిస్తే
మాయను
సులభంగా
జయించవచ్చు.
కలసి
ఉంటే
కలదు
మోక్షం
కొంతమంది
సాధనకోసమని
అరణ్యాలకు
వెళ్ళుతుంటారు.
అందరూ
భగవంతుని
బిడ్డలే,
అందరికీ
సాధనావకాశం
లభించాలి,
అందుకు
అందరూ
దైవత్వాన్ని
పొందాలి,
అనే
విశాల
భావాన్ని
పెంచుకోవాలి.
భారతీయులంతా
ఏకమై
ఉంటే
విదేశీయులు
భారతదేశంపై
విజయం
సాధించి
ఉండేవారుకాదు.
నాలుగు
ఎద్దులు
కలిసి
ఒకేచోట
మేసేవి.
వాటిని
భుజించడానికి
ప్రతి
దినము
ఒక
పులి
వచ్చేది.
నాలుగు
ఎద్దులు
నాలుగు
వైపులనుండి
మీదపడేసరికి
ఆ
పులి
పారిపోయేది.
ఒక
రోజు
నాలుగెద్దులు
పోట్లాడుకొని
నాలుగు
దిక్కులు
పట్టి
పులికి
నాలుగు
రోజులు
ఆహారమైపోయాయి.
కనుక,
కలిసి
ఉంటేనే
కలదు
మోక్షం!
ఒకే
ఒకడు
నడుస్తుంటే
కొద్ది
దూరమైనా
భారంగా
ఉంటుంది.
పదిమంది
కలసి
పోతే
ఉత్సాహంగా
ఎంత
దూరమైనా
పోవచ్చు.
పదిమంది
కలిసి
పోరాడితే
తన
వెనుక
తొమ్మిదిమంది
ఉన్నారనే
ధైర్యముంటుంది.
ఒకరోజు
కృష్ణుడు
ధర్మరాజును
‘మీరు
అన్నదమ్ములెందరు?’
అని
ప్రశ్నించాడు.
ధర్మరాజు
చక్కగా
యోచించి
‘అందరం
కలిసి
ఉంటే
105
మందిమి’
అన్నాడు.
‘కౌరవులు
నూర్గురు,
మేము
అయిదుగురము.
కాని,
మాలో
మాకు
భేదాలు
వస్తే
మేము
అయిదుగురమే’
అన్నాడు.
భావాన్నిబట్టి
దైవం
ఆవిర్భావం
కొందరు
ధ్యానానికి
కూర్చుంటారు.
కాని,
ఎంతకూ
ధ్యానం
కుదరదు.
ధ్యానానికి
కూర్చునేసరికి
ఏ
బ్యాంకు
బ్యాలెన్సో
ఏదేదో
జ్ఞప్తికివస్తూ
ఉంటుంది.
ఇతర
సమయములలో
రావు
కాని,
ధ్యానానికి
కూర్చున్నప్పుడే
అన్నీ
జ్ఞాపకం
వస్తాయి.
ఇలాంటి
సాధనలు
చేస్తే
ప్రయోజనం
లేదు.
నవవిధ
భక్తి
మార్గాలలో
ఏ
ఒక్కదానియందైనా
దృష్టిని
కేంద్రీకరించి
విశాలమైన
భావం
పెంచుకోవటంకంటే
గొప్ప
సాధన
లేదు.
సాధనవలన
దివ్యానుభూతిసంబంధమైన
హృదయస్పందనం
కలగాలి.
‘సమ్యక్
కీర్తనం
సంకీర్తనం’.
9
▾
Meaning
Keep
స్వేచ్ఛగా
పాడాలి.
దివ్యత్వంపై
అవిశ్వాసంతో
పాడకూడదు.
సంపూర్ణ
విశ్వాసంతో,
ప్రేమతో
పాడాలి.
బావిలో
పడ్డానని
ఆవేదనకొద్దీ
గట్టిగా
అరచినప్పుడే
ఎవరైనా
వచ్చి
రక్షిస్తారు.
అదే
ఆర్తనాదం!
గజేంద్రుడు
‘కావవే
ఈశ్వరా’
అని
మొరపెట్టుకున్నాడు.
భగవంతుడింకెక్కడో
లేడు.
తన
హృదయంలో
తనచుట్టూ,
అంతటా,
ఎక్కడ
చూసినా
ఉన్నాడు.
అయితే
భక్తుని
భావం
ఎట్లా
ఉంటుందో
ఆ
భావం
ప్రకారమే
వస్తాడు.
ద్రౌపదికూడా
అంతే!
“హే
కృష్ణా!
ఆపద్భాంధవా!
రక్షించు
రక్షించు”
అని
ప్రార్థించింది.
‘హే
ద్వారకావాసా!’
అన్నది.
‘హే
బృందావన
విహారీ!’
అన్నది.
ఎన్నో
పేర్లుపెట్టి
పిలిచింది.
ఒక
చేత్తో
వస్త్రాన్ని
పట్టుకొని
ఒక
చెయ్యెత్తి
పిలుస్తున్నది.
చివరకు
అలసిపోయింది.
రెండు
చేతులూ
ఎత్తి
‘హే
హృదయ
వాసీ!’,
అని
పిలిచింది.
తక్షణమే
కృష్ణుడు
వచ్చాడు.
‘కృష్ణా!
ఎందుకింత
ఆలస్యం
చేసావు?’
అని
అడిగింది.
“బృందావన
విహారీ
అంటే
బృందావనంనుంచి
రావాలికదా!
మధురావిహారీ
అంటే
ఇక్కడి
నుంచి
మధుర
ఎంత
దూరముంది?
ఇప్పుడు
హృదయవాసీ
అన్నావు.
వెంటనే
వచ్చాను”,
అన్నాడు
కృష్ణుడు!
“ఇంతేకాదు
నీవు
కొంతసేపు
స్వశక్తిపైన
ఆధారపడి
ఉన్నావు.
ఒక
చేత్తో
నిన్ను
నీవు
కాపాడుకోవాలని
చూసావు.
ఇప్పుడు
సంపూర్ణంగా
పరిత్యాగం
చేసి
రక్షణకోరావు
కాబట్టి
నేను
వచ్చాను”,
అని
సమాధానం
చెప్పాడు
కృష్ణుడు.
ప్రతి
విషయంలో
కూడా
త్యాగం
కావాలి.
స్వార్థం
పోవాలి.
స్వశక్తి
ఒక
చిన్న
కథ.
ఒక
భక్తుడు
నిరంతరం
‘నారాయణ,
నారాయణ’
అని
హరినామ
స్మరణం
చేస్తూండేవాడు.
అతను
ఒక
మహారాజుదగ్గరకు
వెళ్ళి
తన
పాండిత్యాన్ని
ప్రదర్శించాడు.
రాజు
అతనికి
పట్టు
వస్త్రములిచ్చాడు.
అతను
పట్టు
వస్త్రములు
స్వీకరించి
తిరిగి
వచ్చాడు.
కొంత
కాలం
గడిచింది.
ఒకనాడు
నదికి
పోయి
స్నానంచేసి
పట్టు
వస్త్రాన్ని
ఉతికి
ఆరకట్టాడు.
మంత్రాలు
చదువుతూ
అనుష్టానం
చేసుకొంటూ
ఉండగా
ఆ
పట్టు
వస్త్రం
గాలికి
ఎగిరిపోయింది.
ప్రక్కనే
చాకలివాడు
బట్టలు
ఉతుకుతున్నాడు.
చూసాడు,
వానిని.
వాడుకూడా
అట్లాంటి
పంచెనే
కట్టుకున్నాడు.
మహారాజు
ఉతకడానికని
వేసాడది.
కొంత
సేపైనా
కట్టుకుందామని
ఆ
పంచెను
చాకలి
కట్టుకున్నాడు.
10
▾
Meaning
Keep
ఇతను
చూసి
‘ఒరేయ్!
ఇది
నా
పంచె’
అన్నాడు.
‘కాదండీ!
ఇది
మహారాజుగారిది’
అన్నాడు,
వాడు.
రాజుగారే
నాకిచ్చారు
నాదే
అని
ఈయన
గట్టిగా
చెప్పాడు.
వాదం
చివరకు
దెబ్బలాటకు
దిగింది.
చాకలివాడు
భక్తుని
దెబ్బ
కొట్టినప్పుడల్లా
అతను
‘నారాయణ,
నారాయణ’
అని
ఆర్తనాదం
చేయసాగాడు.
ఆ
సమయంలో
నారాయణుడు
తన
సింహాసనంనుండి
లేచి
నాలుగడుగులు
వేసాడు.
మరు
నిముషములో
వెనుకకు
తిరిగివచ్చి
సింహాసనంపైన
కూర్చుండిపోయాడు.
లక్ష్మి
‘ఏమిటండీ
లేచారు,
నాలుగడుగులు
వేసి
మళ్ళీ
వెనక్కు
వచ్చి
కూర్చున్నారు’,
అని
అడిగింది.
ఇంక
పోనవసరం
లేదు.
భక్తుడు
బాధను
ఓర్చుకోలేక
తిరిగి
చాకలివానిని
కొట్టాడు.
‘తిరిగి
కొట్టకుండా
ఉంటే
నేనే
వెళ్ళి
రక్షించేవాణ్ని,
అన్నాడు
విష్ణువు.
దైవ
సహాయం
మానవుడు
స్వశక్తిపైన
ఆధారపడినంతవరకు
దైవం
ఎంతమాత్రం
తోడ్పడడు.
గజేంద్రుడుకూడా
ఒక
కాలు
నీళ్ళలో
పెట్టి
ఇంకొక
కాలు
బయటపెట్టి
తొండముతో
గట్టునున్న
మొగిలిచెట్టును
గట్టిగా
పట్టుకొని
‘రక్షించు,
రక్షించు’
అని
పిలిచాడు.
కాని,
తర్వాత
మొసలిపట్టును
వదిలించుకోలేక
స్వశక్తితో
రక్షణ
ప్రయత్నాన్ని
పూర్తిగా
వదలి
‘కావవే
ఈశ్వరా’
అని
ఎలుగెత్తి
పిలిచాడు.
అప్పుడే
విష్ణువు
సుదర్శనమనే
చక్రాన్ని
పంపించాడు.
సుదర్శనం
అంటే
మంచి
దృష్టి.
ప్రాపంచిక
విషయాలలో
స్వశక్తిపై
ఆధారపడవలసిందే!
కాని,
దైవ
విషయంలో
మాత్రం
దైవంపైనే
ఆధారపడాలి.
సర్వ
కర్మలు
భగవత్ప్రీత్యర్థం
చేయడంలోనే
సంపూర్ణ
సమర్పణ
భావమున్నది.
నేనే
అనుభవించాలి
అనుకోకూడదు.
ఆచరణలో
అహంకారమును,
అనుభూతిలో
స్వార్థమును
త్యజిస్తే
అదేయోగము.
యోగమే
త్యాగము.
మీరు
విద్యార్థులు.
చదువుకోసం
వచ్చారు.
దానిపైననే
దృష్టిపెట్టి
విజయాన్ని
సాధించాలి.
రెండింటిపైన
మనస్సు
పెట్టుకుంటే
అది
వీలుకాదు.
విద్యార్థి
విద్యార్థిగానే
ఉండాలి.
ఈనాటి
విద్యార్థులు
99
శాతం
విషయార్థులే!
ఆ
విషయాలను
ప్రక్కకు
నెట్టండి.
విద్యపైననే
మనసు
నిలుపండి.
విద్యాభ్యాసం
తర్వాత
కావలిస్తే
విషయాలలో
ప్రవేశించవచ్చు.
11
▾
Meaning
Keep
తర్వాతకూడా
ప్రతివిషయాన్నీ
చక్కగా
ఆలోచించాలి.
ఒక
ఉపాధ్యాయుడున్నాడు.
లేదా
ఒక
బ్యాంకు
మేనేజరున్నాడు.
వారు
పొందుతున్న
వేతనాలకు
తగినంత
పనిచేస్తున్నామా
లేదా
ఆలోచించుకోవాలి.
తమకు
తామే
జవాబు
చెప్పుకోవాలి.
వేతనానికి
తగినంత
పని
చెయ్యాలి.
కండలు
కరిగేటట్లు
పనిచేస్తే
పండ్లు
అరిగేటట్లు
తినవచ్చు.
కాని
ఇప్పుడది
లేదు.
వేసుకున్న
ఇస్త్రీబట్టలు
నలిగిపోకూడదు.
ఫ్యానుక్రింద
కూర్చోవాలి.
అన్నీ
టేబుల్మీదికి
రావాలి,
గడప
దాటకూడదు.
కాసు
ఖర్చుకాకూడదు.
కైవల్యం
ఉట్టిపడాలి!
నేటి
ఆధునిక
యుగంలో
అన్ని
రకముల
సదుపాయములు
పెరిగిపోయినవి.
ప్రాచీన
కాలములో
ఏ
సదుపాయములు
లేవు.
ఆనాటి
మనుష్యులు
చిరంజీవులుగా
ఉండి
జీవితాన్ని
నిండుగా
అనుభవించారు.
ఇప్పుడు
అయిదు
సంవత్సరాల
పిల్లవాడు
కంటికి
అద్దాలు
వేసుకుంటాడు!
పూర్వకాలములో
కొడుకులకోసం
విచారించిన
వారెవ్వరూ
లేరు.
ద్వాపర
యుగంలో
కొడుకులకోసం
విచారించవలసి
వచ్చింది.
కలియుగం
వస్తుందన్న
సూచన
అది.
ఈనాడు
సహజ
వాతావరణమే
లేదు.
స్వచ్ఛమైన
గాలి
లేదు.
స్వచ్ఛమైన
నీరు
లేదు.
అంతా
కాలుష్యమే!
నూటికి
60
మంది
విద్యార్థులు
మానసికంగా
దెబ్బతిన్నవారున్నారు.
అమెరికా
నుండి
ఒక
యువకుడు
వచ్చాడు.
పద్దెనిమిదేళ్ళుంటాయి.
అతని
విషయం
అంతా
తెలుసు.
అయినా
అడిగాను.
ఎక్కడనుండి
వచ్చానంటే
అమెరికానుంచి
అని
చెప్పాడు.
ఏమి
చదువుతున్నావంటే
నేను
విద్యార్థిని
కాదన్నాడు.
ఎందుకు
విచారంగా
కూర్చున్నావంటే
చాలా
బాధగా
ఉందని
ఏడ్చాడు.
బాధ
ఎందుకంటే
అతని
రెండో
భార్య
విడాకులిచ్చిందట!
కొడుకు
తల్లి
దగ్గర
ఉన్నాడట!
వాడంటే
అతనికి
చాలా
ప్రేమట.
వానిని
విడిచి
ఉండలేకపోతున్నాడట.
ఇట్లా
ఉంది,
ఈనాటి
యువకుల
పరిస్థితి!
ఈ
విధమైన
విషయాసక్తినుండి
విముక్తులు
కావాలి
యువకులు!
Previous
←
Developing the inner vision
Next
Salutation to karma!
→