Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · The certificate to be won in life is the grace of God!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The certificate to be won in life is the grace of God!
21 January 1988, Anantapur
1
▾
Meaning
Keep
స్వస్వరూపము
ఇంద్రియ,
మనోబుద్ధుల
సమ్మిళితము
కాదు.
సాక్షీభూతమైన
సత్,
చిత్
ఆనందమే
స్వస్వరూపము.
ఇట్టి
దివ్యస్వరూపాన్ని
విస్మరించి,
పాంచభౌతిక
దేహమునే
స్వస్వరూపముగా
భావించి
కాలమును
వ్యర్థము
గావించుకుంటున్నారు.
లోకమే
ఒక
విశ్వవిద్యాలయము.
ప్రతి
వ్యక్తి
అందులో
నైతిక,
భౌతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక,
లౌకిక,
రాజకీయ,
ఆర్థిక
విద్యలను
అభ్యసిస్తున్నాడు.
కాని,
చివరకు
శాంతిని
పొందలేక
అశాంతికి
గురై
నిరాశా
నిస్పృహలచేత
జీవితాన్ని
అంతము
గావించుకుంటున్నారు.
లౌకిక
విద్యలతోబాటు
ఆధ్యాత్మిక
విద్య
అవసరమని
గుర్తించలేకపోవటమే
అందుకు
కారణము.
మానవ
జీవితము
సర్వరంగాల
సమ్మిళిత
స్వరూపము
విద్యార్ధులుకూడా
ఒక్క
విద్యాలయంలో
ప్రత్యేక
శిక్షణకై
యే
విషయాన్ని
ఎన్నుకుంటున్నారో
ఆ
విషయాన్ని
మాత్రం
అభ్యసించి
చదువు
ముగిస్తున్నారు.
కానీ,
జీవితము
అన్ని
రంగాలతో
సంబంధము
కలిగినటువంటిది.
సర్వరంగాలసమ్మిళిత
స్వరూపము,
మానవుని
జీవితము.
ఇలాంటి
జీవితమును
సంకుచిత
మార్గములో
ప్రవేశపెట్టి
విశాల
దృక్పథాన్ని
విస్మరించటము
కాలమును
వ్యర్ధము
గావించుకోటమే!
జీవితములో
మనము
పొందవలసిన
యోగ్యతా
పత్రము
దైవానుగ్రహమే.
దైవానుగ్రహానికి
పాత్రులు
కాదలచినవారు
తగిన
మార్గము
అనుసరించి
జీవితమును
ధన్యము
గావించుకోవాలి.
మీరు
బి.ఎ.,
బి.ఎస్.సి.,
బి.కాం.,
యిత్యాది
యోగ్యతా
పత్రాలు
అందుకోటానికి
శ్రమపడుతున్నారు.
అన్ని
విషయాలలో
ఉత్తీర్ణులైనప్పుడే
పట్టము
అందుకోవటానికి
అర్హులవుతారు.
అదే
విధముగా
భగవదనుగ్రహమనే
పట్టాన్ని
అందుకొనటానికి
ఉత్తీర్ణులు
కావలసిన
విషయాలు
కూడా
వున్నాయి.
అవే
భక్తి,
ప్రపత్తి,
నియమ,
విచారణ,
దీక్షలు.
2
▾
Meaning
Keep
వీటిలో
వుత్తీర్ణులైతేనే
భగవదనుగ్రహమనే
యోగ్యతాపత్రము
లభిస్తుంది.
విభక్తము
కానిది,
భక్తి
ఇందులో
మొట్టమొదటిదైన
భక్తి
అనగా
సేవయే!
విశ్వస్వరూపుడైన
భగవంతుని
సేవయే
సర్వమానవసేవగను;
సర్వమానవ
సేవయే
భగవత్సేవగను
మనము
విశ్వసించాలి.
విశ్వాసముతో,
ప్రీతితో
యేకార్యము
చేసినా
భక్తికి
సంబంధించినదే.
భక్తి,
ప్రేమతో
కూడినది.
విభక్తము
కానిది,
భక్తి.
భగవంతుని
ప్రేమతత్త్వాన్ని
చక్కగా
గుర్తించి
అర్థముచేసుకొని
ఆ
ప్రేమానుభవాన్ని
తాను
పొంది
పదిమందికి
పంచటానికి
ప్రయత్నము
చేయటమే
భక్తికి
లక్ష్యము.
ఇది
సంకుచిత
భావముతో
అందుకునేది
కాదు.
విశాలమైన
భావముతో
తన
దృక్పథాన్ని
సువిశాలము
చేసుకొని
పవిత్రమైన
యీ
ఆనందమును
అనుభవించాలి.
భక్తి
అనగానే
ఎక్కువమందికి
‘శ్రవణము,
కీర్తనం,
విష్ణుస్మరణము,
పాదసేవనం,
వందనం,
అర్చనం,
దాస్యం,
స్నేహం,
ఆత్మనివేదనం’
అనేవి
స్ఫురిస్తాయి.
అయితే,
యివి
కేవలము
భక్తి
సాధన
మార్గాలు
మాత్రమే!
ఈ
మార్గములన్నింటికి
గమ్యము
ఒక్కటే!
ఇలాంటి
భవ్యమైన,
నవ్యమైన,
దివ్యమైన
తత్త్వాన్ని
అనుభవించవలెనన్న
నిజమైన
ప్రేమతత్త్వముకావాలి.
అహంకారం
నిర్మూలనము
చేసి
సర్వము
భగవంతునికి
అర్పించటమే
ప్రపత్తి.
ప్రపత్తి
అనగా
సర్వము
అర్పితము
గావించటము.
మానవునికి,
దైవానికి
మధ్య
ఒక
శక్తి
అడ్డుగోడగా
నిలిచి
వుంది.
దాసునికి,
దైవానికి
మధ్యనున్న
ఆశక్తి
అహంకారము.
ఈ
శక్తిని
నిర్మూలనము
చేసి
సర్వము
భగవదర్పితము
గావించినప్పుడే
దివ్యత్వములో
మనిషి
యేకము
కావటానికి
అవకాశమేర్పడుతుంది.
శరీరము,
మనస్సు,
బుద్ధి
చిత్తము,
ఇంద్రియములు,
అంతఃకరణ
యివి
అన్నీ
అర్పించటము
ప్రపత్తి.
ఇవన్నీ
అహంకారముపైనే
ఆధారపడి
వున్నాయి.
కనుక
ఒక్క
అహంకారాన్ని
అర్పితము
గావిస్తే
సర్వము
అర్పించిన
వారమవుతాము.
మనుష్యులకు
వచ్చే
రోగాలకు
అనేక
మందులున్నాయి.
ఏ
రోగమైనా
వైద్యమునకు
లొంగుతుంది.
కాని,
యీ
అహంకారమనే
రోగము
ఏ
వైద్యానికి
లొంగదు.
అహంకారాన్ని
లొంగదీసే
మందు
ఒక్క
దైవతత్త్వమే!
అది
తప్ప
యితర
మందులు
దేనికి
ఎంత
మాత్రము
పనిచేయవు.
విద్యార్థులము,
అధ్యాపకులము,
విద్యావంతులమైన
మనము
ఏరీతిగా
నడుచుకోవాలి?
3
▾
Meaning
Keep
విద్యావంతులమైకూడా
సామాన్య
ప్రజలవలె
ప్రవర్తించటము
విద్య
లక్ష్యమునకే
విరుద్ధము.
ఏ
విషయమైనా
మనస్సుతో
కాకుండా
బుద్ధితో
విచారణ
చేయాలి.
మనసు
కోరినదల్లా
అనుభవించటానికి
ప్రయత్నిస్తుంది.
ఇది
దీని
స్వభావము.
బుద్ధి
అలా
కాదు.
ఇది
మంచిదా?
చెడ్డదా?
చేయతగినదా?
కాదా?
అని
విచారణ
చేస్తుంది.
కానీ,
నేడు
ఆ
విచారణదాకా
పోవటమే
లేదు.
విచారణ
చేయకుండా
అనుసరించి
అజ్ఞానములో
మునిగిపోతున్నాము.
మానవత్వము
దైవత్వమునకు
సమర్పితము
కావాలి
పవిత్రమైన
మానవజన్మ
పొందికూడా
పశువురీతిగా
ప్రవర్తించటము
సరైన
మార్గము
కాదు.
నిరంతరము
స్వార్థమే
శ్వాసగా
భావిస్తున్నాము.
ఇది
సరికాదు.
మనశ్వాసకూడా
భగవత్తత్త్వమే!
స్వార్థరహిత
తత్త్వమే
మన
ప్రాణము.
మానవజన్మ
పొందిన
ప్రతి
జీవి
దివ్యత్వాన్ని
చేరటానికి
ప్రయత్నించాలి,
పశుత్వములోనికి
దిగజారరాదు.
పట్టు
వదలకుండా
దీక్షవహించాలి.
కార్యము
సాధించాలని
దీక్ష
వహించినప్పుడు
కష్టాలు,
దుఃఖాలు,
నిందలు,
నిష్ఠురాలు
ఎన్ని
వచ్చినా
పట్టు
వదలరాదు.
ఈ
పవిత్ర
దీక్ష
నెరవేర్చటానికి
జీవితమును
అంకితము
చేయాలి.
జీవితం
చాలా
విలువైనది.
జీవితముకంటె
విలువైనది,
ప్రాణము.
ప్రాణముకంటె
విలువైంది
మానము.
మానముకంటె
విలువైంది
మానవత్వము.
అలాంటి
మానవత్వము
అతిముఖ్యమైన
దైవత్వమునకు
సమర్పితము
కావాలి.
అదే
మానవ
జన్మకు
సార్థకము.
మానవజన్మ
మనకు
లభ్యమైనందుకు
యీ
ఐదు
విషయాలలో
వుత్తీర్ణులై
దైవానుగ్రహమనే
యోగ్యతా
పత్రము
అందుకోవాలి.
ప్రపంచములో
మనము
అభ్యసించే
విద్యలన్నీ
మనలను
భ్రమింపచేసేవే!
బంధనాలు
కల్పించేవే!
బంధనాలకు
మనస్సే
కారణము.
మోక్షాభ్యాసాలకు
మనస్సే
కారణము.
ఈ
మనస్థితిని
ముందు
మనము
అర్థము
చేసుకోవాలి.
‘యత్జ్ఞాత్వా
మత్తో
భవతి
స్తబ్ధో
భవతి
ఆత్మారామోభవతి’
ఇది
భక్తి,
ప్రేమ
తత్త్వసారము.
ఈ
తత్త్వానికి
అతి
సన్నిహితముగా
తీసుకుపోతాడు,
భగవంతుడు.
భక్తుని
ప్రేమమత్తులో
ముంచేది
అతడే,
ప్రమత్తుణ్ణి
గావించేది
అతడే!
అంతా
దైవమే!
ప్రతి
మానవుడు
మనస్సుయొక్క
చంచలత్వానికి
లోబడి
మునిగిపోతున్నాడు.
పరమార్థము,
పరమాత్మ
అంటే
యేమిటో
తెలుసుకోలేకపోతున్నాడు.
ధర్మం,
నీతి,
జాతినికూడా
లక్ష్యపెట్టటము
లేదు.
తనకు
లభించినది
అనుభవించటమే
ధర్మము,
తాను
తలచిందే
నీతి
అని
భావిస్తున్నాడు.
4
▾
Meaning
Keep
జీవితానికి
కొన్ని
నిష్టలూ,
నియమములూ,
క్రమశిక్షణలు
వున్నాయి.
ఇలాంటి
నియమ,
శిక్షణలతో
కూడిన
తత్త్వాన్ని
యథార్థమైన
జీవితముగా
భావించుకోవాలి.
‘లోకాస్సమస్తాస్సుఖినోభవంతు’
అనేది
మన
హైందవ
సాంప్రదాయము.
అన్ని
దేశాలకు
నైతిక,
ధార్మిక
భిక్ష
పెట్టింది,
భారతదేశము.
అందరూ
సుఖముగా,
ఆనందంగా
వుండాలనేది
మన
లక్ష్యము.
ఆ
లక్ష్యముతోటే
భారతదేశము
అభివృద్ధి
గాంచుతూ
వచ్చింది.
ఇలాంటి
భారతదేశము
ఈనాడు
ఐహిక,
ఆముష్మిక
రంగములు
రెండింటిలోను
సరైన
మార్గము
అనుసరించకపోవటంచేత
అశాంతికి
గురైపోతున్నది.
భగవంతునితో
ఏకత్వమే
ఆనందము
ఆనందమే
జీవితము,
Happiness
is
union
with
God.
భగవంతునితో
ఏకత్వమే
ఆనందము.
దీనిని
మొదట
మనయింటిలో
ప్రారంభించాలి.
ఇల్లే
మొట్టమొదటి
బడి.
తల్లితండ్రులు
మొదటి
వుపాధ్యాయులు.
ఇల్లు
ఆనందనిలయముగా
వుండాలి.
ఎల్లప్పుడు
నవ్వులతో
చిందులు
త్రొక్కుతూ
వుండాలి.
దిగులుపడి
వుండరాదు.
ఈనాడు
చిన్న
చిన్న
పిల్లలుకూడా
ఆముదము
త్రాగిన
మొగం
పెట్టుకొని
మూతులు
ముడుచుకొని
వుంటారు.
ఇది
మంచిది
కాదు.
ఎందుకు
విచారపడాలి?
ఒకవేళ
దుఃఖము,
కష్టము,
అశాంతి,
బాధ
వచ్చిందనుకోండి.
అది
ఎంతసేపు
వుంటుంది?
జగత్తులో
ఎన్నో
వస్తూ
వుంటాయి.
ఏ
ఒక్కటీ
స్థిరముగా,
శాశ్వతముగా
వుండదు.
ఆనందాన్ని
తలంచి
వుత్సాహపడనప్పుడు
విచారాన్ని
తలంచి
దుఃఖపడకూడదు.
ఈ
చింతలవలన
మనం
అనుభవించవలసిన
ఆనందమును
కోల్పోతున్నాము.
నిరంతరము
ఆనందంగా
వుండాలి.
ఎప్పటికప్పుడు
సంతోషము
పొందాలి.
సంతోషము
తాత్కాలికమని
భావించరాదు.
దీనిని
present
వర్తమానములో
కాకుండా,
omni
present
సర్వవ్యాప్తమైంది
అనే
అర్థములో
తీసుకోవాలి.
కారణము
యేమంటే,
గడచిన
దానియొక్క
ఫలితము
వర్తమానములో
మనం
అనుభవిస్తున్నాము.
నిన్న
రాత్రి
మామిడిపండు
తిన్నామంటే
యీనాడు
ఆ
పండు
త్రేపు
వస్తుంది.
నిన్న
తిన్నదే
నేడు
వస్తుంది
గాని,
రేపు
తినబోయేది
రాదు.
ఇప్పుడు
తినేదే
భవిషత్తులో
వస్తుంది.
భవిషత్తు,
భూతము
రెండూ
వర్తమానములో
పనిచేస్తున్నాయి.
5
▾
Meaning
Keep
కనుక,
వర్తమానము
చక్కగా
వుండాలి.
గడచినదేదో
గడచింది.
దానిని
మరచిపోయి
వర్తమానములో
జీవిస్తూ
ఆనందముతో,
ఉత్సాహముతో
ముందుకు
పోవాలి.
ఇదే
మన
విద్యాసంస్థ
బోధించవలసినది.
లౌకిక,
ఆధ్యాత్మిక
విద్యలు
రెండింటిలోను
ఉత్తీర్ణులు
కావాలి
విద్యార్థులు
‘కష్టపడి
చదవాలి,
మంచి
మార్కులు
తెచ్చుకోవాలి’,
అనే
పట్టుదలతో
వుండాలి.
ఒకసారి
మార్కులు
తగ్గినంత
మాత్రమున
నిరుత్సాహపడకూడదు.
వుత్సాహము
తెచ్చుకొని
శ్రమించాలి.
‘ఇప్పుడు
తగ్గినా
ముందుకు
మంచి
మార్కులు
తెచ్చుకోవాలి’,
అనే
పట్టుదల
కలిగివుండాలి.
కాని,
నేటి
విద్యార్థినీ
విద్యార్థులు
ఆ
విధముగా
చేయటం
లేదు.
ఇది
ఒక
బలహీనత.
మనము
బలహీనులమైపోతే
బలమైన
శక్తి
మనలను
అన్ని
విధాలా
అణగద్రొక్కుతుంది.
మనము
బలంగా
వుంటే
ఎలాంటి
శక్తియైనా
మనలను
ఏమీ
చేయలేదు.
కనుక,
ధైర్యముగా
లౌకిక,
ఆధ్యాత్మిక
విద్యలను
రెండింటిని
కుడి,
ఎడమలుగా
నిలుపుకొని
జీవితాన్ని
నడుపుకోవాలి.
రెండు
చక్రాలు
లేని
రథము,
రెండు
కన్నులు
లేని
వ్యక్తి,
రెండు
రెక్కలు
లేని
పక్షి
ఎక్కడాలేదు.
ఇహములో
సుఖించటానికి
హేమతారక
విద్య,
పరంలో
సుఖించటానికి
బ్రహ్మ
విద్య,
రెండింటిలోను
మనము
వుత్తీర్ణులము
కావాలి.
విద్యలలో
ఆధ్యాత్మిక
విద్యయే
నిజమైన
విద్య.
నదులు
వేరు
వేరు
కాని,
అన్ని
నదులు
చేరినదే
సముద్రము.
అదే
విధముగా
అన్ని
విద్యలు
చేరినదే
ఆధ్యాత్మిక
విద్య.
‘ధనుష్కోటిలో
అన్ని
నదులు
కలసి
వుండగా
ఒక్కొక్క
నదిలో
వేరువేరుగా
వెళ్లి
తీర్థమాడాలి,
అనే
సామెత
మనకెందుకు?
యీ
ధనుష్కోటిలోనే
మునుగుదాము.
అన్ని
నదుల
స్నానఫలము
దక్కుతుంది’,
అంటాడు
త్యాగరాజు.
మీరంతా
ఆదర్శప్రాయులైన
తల్లులు
కావాలి.
బిడ్డకు
తల్లియే
ప్రధానమైనది.
తండ్రి
కంటె
ప్రియమైంది.
తల్లికంటె
మిగుల
దైవంబె
దగ్గర
అన్నారు.
అన్నింటికంటెను
దైవమే
ఎక్కువ!
విశ్వమాత
విశ్వపిత
అనే
దైవత్వాన్ని
చింతించుకుంటూ
మీ
తల్లి
తండ్రులను
సేవించి
వారి
హృదయాలను
ఆనందపరచండి.
రేపు
మీ
పిల్లలు
మిమ్మల్ని
ఆనందపరుస్తారు.
ఈనాడు
మీరు
మీ
తల్లితండ్రుల
కంట
నీరునింపుతే
రేపు
మీ
పిల్లలు
మీ
కంట
నీరు
నింపటము
తప్పదు.
భావి
జీవితములో
మీరు
సుఖించాలంటే
వర్తమానములో
మీ
తల్లితండ్రులను
ఆనందపరుస్తూ
ఆనంద
మయమైన
జీవితాన్ని
అనుభవించండి.
6
▾
Meaning
Keep
ఎల్లప్పుడు
ఉన్నత
లక్ష్యం
పెట్టుకోవాలి
మీ
head,
మీ
food,
మీ
blood
అంతా
వారి
gift.
అంటే
మీ
ఆలోచన,
మీ
ఆహారము,
మీ
నరనరాలలోని
రక్తబిందువులు,
మీ
తల్లితండ్రుల
అనుగ్రహ
ప్రసాదమనే
సంగతి
మరువవద్దు.
పట్టుదలతో,
కార్యదీక్షతో,
జీవితాన్ని
దివ్య
జీవితంగా
మలచుకోవాలి.
‘ఏదో
వస్తే
వస్తుంది,
పోతే
పోతుంది’,
అని
కార్యాచరణలో
పాల్గొనరాదు.
దీక్షవహించాలి.
ఉత్తమశ్రేణిలో
ఉత్తీర్ణులు
కావాలి.
ప్రతి
ఒక్కరూ
ప్రధమశ్రేణిలో
నిలవాలి
అనే
ధృడ
నిశ్చయము
కలిగివుంటే
ఎంతైన
సాధించవచ్చు.
ఎల్లప్పుడు
ఉన్నత
లక్ష్యము
పెట్టుకోవాలి.
గురి
తప్పకుండా
కొడితే
పులినే
కొట్టాలి.
కానీ
వెంటబడి
కుంటికుక్కను
కొట్టి
ప్రయోజనము
యేముంది?
మనము
మంచి
మార్కులపై
దృష్టి
పెట్టుకొంటే
ఒకవేళ
దానిలో
కొంచెం
తగ్గినా
తగ్గవచ్చు,
ఫరవాలేదు.
అంతేగాని
35
పాస్
మార్కులపైన
దృష్టివుంచి
యింతే
చాల్లే
అనుకొంటే
అవి
యింకా
క్రిందికి
దిగిపోతాయి.
మనదృష్టి
ఎప్పుడూ
90
లేక
80
శాతము
పైనేవుండాలిగాని
దిగరాదు.
అలా
లక్ష్యాన్ని
వున్నతంగా
నిర్ణయించుకోవాలి.
అందుకు
కృషిచేయాలి.
విద్యార్థినీ
విద్యార్థులు
గొప్ప
గొప్పవారిని,
మహానీయులను,
విద్యావంతులను
ఆదర్శముగా
తీసుకోవాలి.
విద్యార్థులు
గొప్పగొప్పవారిని
గొప్ప
విద్యావంతులను
ఆదర్శముగా
తీసుకోవాలి.
వివేకానందుడు,
చైతన్యుడు,
జనక
మహారాజువంటి
ఆదర్శమూర్తుల
చిత్రాలు
గృహాలలో
అలంకరించుకొని
వారిని
ఆదర్శముగా
తీసుకోవాలి.
అంతేకాని
పిచ్చి
ఆలోచనలు
పెట్టుకొని
ఆదర్శహీనముగా
నడచుకుంటామంటే
యింతకంటె
అవివేకము
మరొకటి
వుండదు.
పట్టణానికి
పోతూ
వస్తూ
వుంటారు.
అడుగడుగునా
చాలా
క్రమశిక్షణతో
మెలగాలి.
‘సత్యసాయి
విద్యాసంస్థ
విద్యార్థులు
యెంత
గొప్పగా
వున్నారు,
ఎంత
పవిత్రమైన
నడతగలవారు’,
అని
అనుకునేటట్లు
వుండాలి.
‘ఓహో!
వీరు
సత్యసాయి
సంస్థ
విద్యార్థులు’
అనే
కీర్తి
ప్రతిష్టలు
చేకూర్చి
పెట్టాలి
మీరు.
ఆ
ఘనతనే
మీనుండి
మేము
కోరుకునేది.
మరేమి
మేము
కోరము.
మీరు
బాగుపడి
అత్తవారిండ్లకు
పోయి
భర్తగారివద్ద,
అత్తమామలవద్ద
అణకువగా
వుంటూ
వారికి
అనుగుణముగా
నడచుకుంటూ
సత్కీర్తి
పొందాలి.
7
▾
Meaning
Keep
అంతేకాని
ఇక్కడ
పవిత్ర
విద్యాసంస్థ
విద్యార్థులుగా
వుండి
తరువాత
ఆదర్శములకు
విరుద్ధముగా
ప్రవర్తిస్తే
మీకు
ముందు
జీవితమే
వుండదు.
భర్తను,
అత్తవారింటిని
సరైన
రీతిగా
గౌరవించి
వారిని
ప్రసన్నులను
గావించుకొని
జీవితాన్ని
ధన్యము
చేసుకోండి.
మన
విద్యాసంస్థ
పేరు
నిలబెట్టండి.
మీరు
పుట్టిన
యింటికి,
కాలు
పెట్టిన
యింటికి
సత్కీర్తి
తెస్తారని
ఆశిస్తున్నాను.
Previous
←
Students must become not beasts but Paśupati
Next
Make Your Life Blessed
→