Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · The Eye of Wisdom
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Eye of Wisdom
6 March 1988
1
▾
Meaning
Keep
“యద్దృశ్యం
తన్నశ్యతి”
చూస్తున్నదంతా
అదృశ్యమయ్యేటువంటిదే!
మానవత్వం
దివ్యత్వంతో
కూడుకున్న
ఆత్మతత్త్వం.
ఐతే,
బాహ్య
జగత్తును
చూచినకొద్దీ
అశాంతి
అధికమవుతుంది.
వస్తువులపై
ఆసక్తి,
అభిరుచి
పెంచుకున్నకొద్దీ
ఆనందానికిదూరమవుతాం.
అభిరుచులను
ఎంతవరకు
అంతర్ముఖం
గావించుకోలేమో
అంతవరకు
ఆనందానికి
నోచుకోలేము.
దృక్కు
-
దృశ్యం
ప్రపంచంలో
ఉన్నవి
రెండే
రెండు.
ఒకటి
దృక్కు,
రెండోది
దృశ్యం.
దృశ్యాలు
అనేకంగా
గోచరించవచ్చు
కాని
అవి
ఏకమే!
“మృత్పిండమేకం
బహుభాండ
రూపం
సువర్ణమేకం
బహు
భూషణాని”....
కుండలెన్నియైనా
మట్టి
ఒకటే
అయినట్లు,
ఆభరణాలెన్నియైనా
బంగారం
ఒకటే
అయినట్లు,
గోవులెన్ని
విధాలైనా
పాలు
ఒకటే
అయినట్లు
దృశ్యాలెన్నియైనా
దృక్కు
ఒక్కటే!
జగత్తు
జడమైనది.
కేవల
చైతన్యం
ఆత్మతత్త్వం.
జడ,
చైతన్యముల
సమ్మిళిత
స్వరూపం
జగద్వ్యాపారం.
చైతన్యం
లేక
జడం
కదలలేదు.
ఉదాహరణకు
ఫ్యాన్
జడము,
కాని
కరెంటుతో
ఫ్యాన్
తిరుగుతుంది.
జడమైన
ఇనుము
దగ్గర
అయస్కాంతం
పెట్టినప్పుడు
ఇనుప
ముక్క
కదులుతుంది.
జగత్తు
జడమే
అయినప్పటికీ
అది
చలించడానికి
కారణం
ఆత్మ
తత్త్వమే.
కనుక
చైతన్యమే
ఆత్మ
స్వభావం
లేక
ఆత్మ
స్వరూపం.
చర్మ
చక్షువులు
చాలవు
చూసేది
కన్ను.
చూడబడేది
దృశ్యం.
చూడబడే
దృశ్యం
కొంత
కాలానికి
కాలగర్భంలో
కలసిపోతుంది.
కనుక
దృశ్యము,
చర్మనేత్రము
రెండూ
జడమైనవే!
చర్మనేత్రాలు
మానవులకే
కాదు,
దానవులకు,
క్రిమి
కీటకాదులకుకూడా
ఉన్నాయి.
అవి
చూస్తున్నాయి,
మనమూ
చూస్తున్నాము.
దివ్యమైన
మానవదేహం
ధరించిన
మనం
పశుపక్షి
మృగాలవలె
చర్మచక్షువులతో
చూచి
ఆనందించడం
హాస్యాస్పదము.
ఇది
అజ్ఞాన
లక్షణం.
హాస్యాస్పదము.
దుర్లభమైన
నరజన్మ
ఎత్తినందుకు
చర్మ
చక్షువులతో
చూచి
ఆనందించకుండా
జ్ఞాన
నేత్రాన్ని
వికసింపజేసుకోవాలి.
2
▾
Meaning
Keep
దృక్కు
అనేది
ఆత్మ.
దృశ్యం
సృష్టి
కల్పితమైన
జగత్తు.
మేధావియైన
మానవుడు
ఈ
రెండింటి
సమ్మిళిత
స్వరూపాన్ని
విడదీయడానికి
ప్రయత్నించాలి.
అదే
విభాగయోగం.
గుణత్రయ
విభాగయోగమన్నా,
క్షేత్ర
క్షేత్రజ్ఞ
విభాగ
యోగమన్నా
కూడా
అదే.
క్షేత్రమనే
దేహంలో
క్షేత్రజ్ఞుడనే
ఆత్మ
నివసిస్తున్నాడు.
కాని,
మానవుడు
దృక్కును
దృశ్యాన్ని
ఏకంచేయడంవలన
అది
దుఃఖానికి
హేతువవుతున్నది.
కనుకనే
దృక్కును,
దృశ్యాన్ని
వేరుచేయాలి.
దృక్కునే
లక్ష్యంలో
ఉంచుకోవాలి.
దృశ్యమంతా
మార్పుచెందేదే.
ప్రతి
మానవుడు
రెండింటిని
బాగా
గుర్తుంచుకోవాలి.
ఒకటి
ఇవ్వటం,
రెండోది
చావటం.
కాని
ఇవ్వటానికిగాని,
చావటానికిగాని
ఎవ్వడూ
ఒప్పుకోడు.
అసలు
జీవిత
లక్ష్యమేమిటి?
ఉన్నన్నాళ్ళు
సుఖాలను,
ఆనందాలను
అనుభవించి
కుక్కలు
నక్కలవలె
చావటానికి
కాదు
జీవితం.
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అనుభవించాలి.
మానవత్వమనేది
ఒక
ప్రత్యేక
మార్గం
కాదు,
ఒక
జీవన
విధానం.
గుణం
మారాలి,
గుడ్డలు
మార్చుకొని
ప్రయోజనం
లేదు.
పుస్తకాలవల్ల
మనస్సు
మారదు.
నిత్య
జీవితంలో
నిత్యానుభవంలో
చేస్తున్న
అనేక
పనులలో
దీనిని
తీర్చిదిద్దుకోవాలి.
దేహం
-
దేశం
దేహమే
దేశం
-
స్థూలరూపమైన
దేశానికి
సూక్ష్మరూపం
దేహం
దేశంలో
ఏ
పంచభూతాలు,
పంచకోశాలు,
పంచతన్మాత్రలు,
పంచప్రాణాలున్నాయో
దేహంలో
కూడా
అవన్నీ
ఉన్నాయి.
దేహ
తత్వాన్ని
చక్కగా
గుర్తిస్తే
దేశతత్వం
సులభంగా
అర్థమవుతుంది.
దేహ
తత్వాన్ని
అర్థం
చేసుకోవడానికి
మానసిక
తత్వాన్ని
జాగ్రత్తగా
గమనించాలి.
మనస్సు
మానవత్వానికి
అనుకూలంగా
నడుస్తున్నదా
విరుద్ధంగా
నడుస్తున్నదా
చూడాలి.
ఈనాడు
స్వంత
భావాలను
విసర్జించి
పరుల
తత్వాలను,
ఆలోచనలను
ఆదర్శంగా
తీసుకొంటున్నారు.
భారతదేశ
స్వాతంత్ర్య
సాధనకోసం
విదేశీ
వస్తుబహిష్కరణ,
స్వదేశీ
వస్తు
వినియోగాన్ని
ఒక
సాధనంగా
తీసుకున్నారు.
స్వరాజ్యాన్ని,
ఆత్మ
సామ్రాజ్యాన్ని
సాధించడానికి
కూడా
కొన్ని
నియమాలను
అనుసరించాలి.
3
▾
Meaning
Keep
స్వదేశమనే
ఆత్మ
సామ్రాజ్యాన్ని,
నీ
ఆత్మ
భావాన్ని
నీవు
అనుభవించాలి.
నీ
ఆత్మతత్వాన్ని
నీవు
అనుభవించాలి.
నీ
ఆత్మ
విశ్వాసాన్ని
నీవు
పెంచుకోవాలి.
ఆత్మనే
దేహంగా
భావించుకోవాలి
అదే
ఆత్మ
సామ్రాజ్యం.
అనిత్యమైన
జగత్తులో
మనం
సత్యాన్ని
ఎన్నుకోవాలి.
నిత్యమైన
మార్గాన్ని
అనుసరించాలి.
పవిత్రమైన
భావాన్ని,
మార్గాన్ని
అనుసరించాలి.
పవిత్రమైన
భావాన్ని
పెంచుకోవాలి.
ఎప్పుడూ
లోకానికి
సంబంధించిన
విషయాలలో
మునిగిపోవటంచేత
మనకు
లభిస్తున్నదేమి?
ప్రపంచం
అవసరమే!
కాని,
ప్రపంచంతోపాటు
పరతత్వం
లేకపోతే
ప్రపంచమే
నిరుపయోగమైపోతుంది.
కరెంటు
లేనప్పుడు
ఫ్యానువల్ల
ఏమి
ప్రయోజనం?
ప్రాణం
లేని
దేహంవల్ల
ఏమి
ప్రయోజనం?
కనుక,
దైవత్వాన్ని
మానవుడు
ప్రధానంగా
లక్ష్యంలో
ఉంచుకోవాలి.
లేనప్పుడు
అది
జీవన్మరణమే!
పండితుడైనా,
వేదాంతియైనా
కన్నులు
తెరువకుండా
పదార్థాన్ని
చూడలేడు
కదా!
చిత్తశుద్ధిలేనివాడు
గుణవంతుడైనా,
బలవంతుడైనా,
విద్యావంతుడైనా
గ్రుడ్డివానితో
సమానం.
సర్వ
విద్యలు
చిత్తశుద్ధికోసం
ఉద్దేశించినవే!
పరులను
చంపాలంటే
కత్తులు,
కటారులు,
తుపాకులు,
ఫిరంగులు
కావాలి.
కాని,
తాను
చావడానికి
ఒక్క
సూదిమొన
చాలు.
మాటలు
అనేకం
చెప్పటంకంటే
చిత్తశుద్ధితో
ఒక్కటి
ఆచరణలో
పెడితేచాలు.
విద్యార్థి
ఆదర్శం
పుట్టపర్తిలో
అమర్
వివేక్
అనే
విద్యార్థి
ఎం.బి.ఏ.
చదువుతున్నాడు.
పది
సంవత్సరాలు
ఒక
సేవారంగంలో
చేరి
ఏ
సేవాదళం
చేయలేని
పనులు
చేశాడు.
అతడు
చేసిన
సేవను
ప్రభుత్వం
గుర్తించింది.
అవార్డును
బహూకరించింది.
రాష్ట్రపతి
ప్రధాని
అతనిని
అవార్డు
స్వీకరించడానికి
రావలసిందిగా
ఆహ్వానించారు.
ఆ
పిల్లవాడు
నా
దగ్గరికి
వచ్చాడు.
నాకీ
అవార్డు
వద్దు.
నా
స్వామి
సంతోషిస్తే
నాకదే
పెద్ద
అవార్డు
అన్నాడు.
నేనే
గట్టిగా
చెప్పి
పంపించాను.
చాలామంది
నా
ఎదురుగా
బొట్టు
పెడతారు,
బయటకు
వెళ్ళగానే
తుడిచేసుకుంటారు.
అతనట్టా
కాదు,
చక్కగా
విభూతి
పెట్టుకొని
వెళ్ళాడు.
రాష్ట్రపతి
అభినందించగానే
సాయిరామ్
అంటూ
మర్యాదగా
ప్రత్యభివాదం
చేశాడు.
వాళ్ళ
మర్యాదలనుబట్టి
‘హలో
సర్!
4
▾
Meaning
Keep
గుడ్
మార్నింగ్’
అనకూడదా
అని
నేను
అంటే
నా
స్వామి
గౌరవం
నాకు
కావాలన్నాడు.
మన
భక్తులు
ఒక
దగ్గర
ఒక
వేషం,
మరొక
దగ్గర
మరొక
వేషం,
ఒక
దగ్గర
ఒక
మాట
మరో
దగ్గర
మరొక
మాట,
ఇది
చాలా
ప్రమాదకరం.
నగదు
బహుమతి
ఇస్తే
నాకు
అక్కరలేదు.
నేను
డబ్బుకోసం
సేవ
చేయలేదు,
ఏ
రెడ్క్రాస్కైనా
ఇచ్చేయండి
అని
కోరుతూ
తిరిగి
అందజేశాడు,
ఇది
నిజమైన
భక్తి.
సఫారీ
దుస్తులు
కుట్టించుకోవచ్చనిగాని,
టి.వి.
కొనుక్కోవచ్చు
అని
గాని
అతను
ఆలోచించలేదు.
అట్టి
ఆత్మ
విశ్వాసాన్ని
అభివృద్ధిపరచుకోవాలి.
విశ్వాసంనుండి
త్యాగం
కలుగుతుంది.
త్యాగంతో
తనకు
గుర్తింపు
కలుగుతుంది.
ఈ
విధంగా
సమర్పణ
భావంతో
సమాజ
సేవ
చేయాలి.
అట్టి
సేవవల్లనే
స్వామి
తృప్తిపడతాడు.
అదే
స్వామి
సేవ.
దుఃఖం
లేని
జీవితం!
ప్రపంచంలో
మూడు
విధాలైన
దుఃఖాలతో
జీవిస్తున్నాడు,
మానవుడు.
ఒకటి
ఆధ్యాత్మికం,
రెండోది
ఆదిభౌతికం.
మూడోది
ఆదిదైవికం.
శరీరానికి
సంబంధించిన
రోగాలు,
బాధలు,
కష్టాలు,
ఆధ్యాత్మిక
దుఃఖం.
విరోధులతో
మృగాలతో
క్రిమికీటకాలతో
బాధపడటం
ఆదిభౌతిక
దుఃఖం
పిడుగులు,
భూకంపాలతో,
కరువు
కాటకాలతో
బాధపడటం
ఆధిదైవిక
దుఃఖం.
ఇవన్నీ
దేహాన్ని
బాధ
పెట్టేవే
కాని,
జీవితాన్ని
కాదు.
దేహానికి
ఈ
రకమైన
బాధలు
ఏనాటికీ
తప్పినవి
కావు.
జీవితానికి
దుఃఖం
లేకుండా
చూచుకోవాలి.
ఆ
దుఃఖం
పోవడానికే
ఆత్మ
విశ్వాసాన్ని
పెంచుకోవాలి.
విద్యార్థులారా!
పరీక్షలు
దగ్గరకు
వస్తున్నాయి.
పరీక్షలలో
మీరు
చక్కగా
ఉత్తీర్ణులు
కావాలి.
మీరు
బి.ఎ,
బి.ఎస్.సి.,
బి.కాం.,
తోనే
ముగించండి
లేదా
ఎం.ఎ,
ఎం.ఎస్.సి,
ఎం.కాం.,కు
పొండి,
కానీ
పరీక్షలలో
మాత్రం
మంచి
గ్రేడు
తెచ్చుకోవాలి.
ఏ
కోర్సులైనా
చేయండి,
రేస్
కోర్సులలోకి
మాత్రం
ప్రవేశించకండి.
పంచమహాపాతకాలలో
జూదం
ఒకటి,
సర్వ
ధర్మాలు
తెలిసిన
ధర్మరాజంతటివాడు
జూద
వ్యసనానికి
లోబడటంతో
పాండవులు
అడవులపాలై
పోయారు,
సేవ
సేవ
సేవ....
ఎక్కడకి
వెళ్ళినా
సేవకు
పూనుకొండి.
5
▾
Meaning
Keep
సర్వ
రంగాలలో
సాయి
విద్యార్థులు
నా
ఉద్దేశంలో
మన
విద్యార్థులలో
కొందరు
ఐ.ఎ.ఎస్,
ఐ.పి.ఎస్.,
ఐ.ఎఫ్.ఎస్.
పరీక్షలకు
వెళ్ళటం
మంచిది.
అన్ని
రంగాలలో
మన
పిల్లలు
ప్రవేశించాలి.
స్వామి
కాలేజీలో
ఉన్న
సబ్జెక్టులు
మాత్రమే
తీసుకొని
చదివితే
చాలనుకొంటే
అది
సంకుచితత్వం.
కొంత
మంది
మెడిసిన్
(వైద్య
శాస్త్రం)కు
పొండి.
కొంత
మంది
ఇంజనీరింగ్‌కు
పొండి.
అయితే
ఇంజనీరింగ్,
మెడిసిన్‌కు
పోయే
పిల్లలు
కేవలం
12వ
క్లాసు
పాసైన
వెంటనే
పోవటం
మంచిది
కాదు.
డిగ్రీ
తీసుకొని
పోవాలి.
లేకపోతే
మేధస్సు
సరిగా
వికసించదు.
ఇంటర్
కాగానే
ఇంజనీరింగుకు
పోతే
ప్రపంచం
వారికి
అర్థం
కాదు.
భావ
వ్యక్తీకరణకు
సరైన
భాషాజ్ఞానం
కూడా
ఉండదు.
లోక
జ్ఞానం
బొత్తిగా
ఉండదు.
ఈ
విధంగా
ఇంజనీరింగుకు
వెళ్ళిన
వారిని
చాలా
మందిని
చూశాను.
వారిలో
వికాసం
లేదు.
స్వార్థం,
సంకుచిత
భావాలు.
మీరు
స్వార్థ
భావాలను
దూరం
నెట్టండి.
ఇప్పుడు
మాట్లాడిన
వారిని
చూశాను.
మంచి
తెలివి
కల
పిల్లలు.
వీరు
ఐ.ఎ.ఎస్.కు
పోవటం
మంచిది.
ఐ.ఎ.ఎస్
తిరగవేస్తే
ఎస్.ఎ.ఐ.
అవుతుంది.
అదీ
సాయికి
సంబంధించినదే!
ఫారిన్
సర్వీసుకు
పొండి
ఊరక
సి.ఎ.
అంటూ
చార్టర్డు
అకౌంటెంట్లు
కావడానికి
ప్రయత్నించకండి.
అది
బిజినెస్
వాళ్ళు
చేసే
మోసాలను
సరిదిద్దేపని.
మీరంతా
చక్కని
గుణాలు
కలిగి
చక్కని
ప్రవర్తనతో
ఆదర్శమూర్తులవుతారని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తున్నాను.
Previous
←
The mansion of life rests on four walls: birth, karma, Dharma and Brahman
Next
One who would live in happiness and Śānti must practise control of the senses
→