Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · The essence of all religions is Satya and Prema!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The essence of all religions is Satya and Prema!
29 May 1988, Brindavan
1
▾
Meaning
Keep
దివ్యాత్మస్వరూపులారా!
తృష్ణ
అంటే
ఆశ,
దాహము
అని
రెండు
అర్థములు.
ఆశ
అంటే
నిత్య
జీవితములో
మనము
మన
అనుభూతికి
అవసరమైన
కొన్ని
వస్తువుల్ని,
కొన్ని
విషయాల్ని,
కొన్ని
కార్యాల్ని
అంటే
తినటానికి
అన్నం,
కట్టుకోటానికి
బట్ట,
వుండటానికి
కొంప
వీటిని
కోరటము
మానవుని
సహజమైన
ఆశ.
ఈ
ఆశలో
మరల
రెండు
రకాలు.
ఒకటి
సహజమైన
ఆశ
రెండవది
దురాశ.
‘నాకు
ఒక
గృహంకావాలి’
అది
ఆశించతగినదే.
అభిలషించవలసినదే.
కానీ
దురాశ
అంటే
యింకా
రెండు
యిళ్లు
కావాలి
అనుకోటం
అవసరాన్ని
మించి
ఆశించటము
దురాశ
ఈనాడు
మానవులలో
ఆశకంటె
దురాశే
అధికముగా
చలామణీ
అవుతోంది.
అందుకనే
మానవుడు
అమిత
దుఃఖానికి
అశాంతికి
గురౌతున్నాడు.
తృప్తికి
దూరమౌతూ
అసంతృప్తితో
జీవితము
గడుపుతున్నాడు.
కారణం
యీ
దురాశయే.
ఇంక
తరువాతది
తృష్ణ.
తృష్ణ
అంటే
దాహం.
ఎప్పుడు
దాహము
వేస్తుందో
అప్పుడు
నీరు
త్రాగాలని
అనిపిస్తుంది.
ఈ
దాహానికి
అంతము
ఎప్పుడు.
జీవితము
వున్నంతకాలము
దాహము
తప్పదు.
అంత్యకాలములో
కూడ
నీరు
యిస్తూ
వుంటారు.
కాబట్టి
యీ
దాహాన్ని
అంతం
చేసుకోటం
ఎలా?
క్రమక్రమేణా
యినుప
సంకెళ్లు
కూడా
తుప్పుపట్టినప్పుడు
తెంచుకోవచ్చుగానీ,
తృష్ణను
తెంచుకోటం
చాలా
కష్టం.
ఈ
తృష్ణ
అనేది
అమితమైన
కోరికలతో
ప్రవేశిస్తుంది.
ఈ
కోరికలు
ఫలించినా
అహంకారము,
విఫలమైతే
క్రోధం.
మానవుని
నరకం
దగ్గరకు
చేర్చే
ద్వారాలు
ప్రధానముగా
మూడు.
అవి
కామ
క్రోధ,
లోభాలు.
క్రమక్రమంగా
అదుపుతప్పి
నడుస్తున్నాయి.
వీటిని
అదుపులో
పెట్టటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
దీనినే
సాధన
అన్నారు.
సాధన
అంటే
ఏమిటి?
మనము
ఆశించినటువంటి
ప్రేమించినటువంటి,
అభిలషించినటువంటి
వస్తువును
సమీపించటానికి
నిరంతరము
చేసే
కృషియే
సాధన.
ఈ
సాధన
మనలను
లక్ష్యము
దగ్గరకు
చేర్చే
ప్రధానమైన
మార్గము.
సాధన
అన్నదానికి
రెండవ
అర్థము.
సా-
ధనః
దైవ
సంబంధమైన
ఐశ్వర్యము.
ధనము
అంటే
ఐశ్వర్యము,
సంపద,
ధనము
అని
మూడు
రకములుగా
చెప్పుతూ
వుంటాం.
ఈ
మూడూ
కూడ
ఒక
వస్తువుయొక్క
పేర్లే.
ఈ
ధనము
శరీరముతో
బాటు
వుండేదేగాని
శరీరం
తదనంతరము
మన
వెంట
వచ్చేవి
కావు.
ధనము
పోయినా
సంపాయించుకోవచ్చు
ఆయువుపోతే
సంపాయించుకోలేము.
కాబట్టి
ఆయువు
వున్నప్పుడే
నిత్యమైన,
సత్యమైన,
దివ్యమైన
ధనాన్ని
మనము
సంపాదించాలి.
ఈ
దివ్యమైన
ధనమే
మన
ఆచరణ.
ఈ
ఆచరణ
ద్వారానే
మనము
సదాచారమనే
ధనము
సంపాయించవచ్చు.
సదాచారమే
మన
ధనము.
సద్గుణమే
మన
ఐశ్వర్యము.
సత్ప్రవర్తన
మన
సంపద.
ఈ
ధనము,
సంపద,
ఐశ్వర్యాలు
మన
గుణాలు,
మన
ప్రవర్తనలు,
మన
శీలాలే.
కాని
యీనాటి
మానవుడు
యీ
మూడింటిని
త్యజించి
లౌకిక
విషయాలే
వరించి
తరించాలని
ఆశించి
యిదే
భక్తి
అని
భ్రమిస్తున్నాడు.
2
▾
Meaning
Keep
ఈ
భ్రమచేత
బ్రహ్మను
తెలుసుకోటం
సాధ్యము
కాదు.
ఈనాటి
బోధనలుగాని,
ఈనాటి
పఠనముగాని,
యీనాటి
విద్యలుగాని
మన
భ్రమల్ని
పెంపొందించి
బంధిస్తున్నాయేగాని
బ్రహ్మ
తత్వాన్ని
తెలుపలేక
పోతున్నాయి.
బ్రహ్మతత్వము
ప్రాప్తించాలంటే
యీ
భ్రమలు
మనము
త్యజించాలి.
ఈనాడు
లోకములో
విద్యలు
అధికమవుతున్నాయి.
విద్యార్థులారా!
విద్యలేకపోయినా
మనకు
నష్టము
యేమి
లేదు.
ఈ
విద్యలు
కేవలము
భౌతికమైన
జీవితాలకి
మాత్రమే
మనల్ని
తయారు
చేస్తున్నాయి.
కానీ
యీ
విద్యలు
లేని
మహనీయులు
ప్రాచీన
కాలములోనే
విశిష్టమైన
గుణవంతమైన
జీవితాలను
గడపలేదా!
ఈనాడు
చదువులేని
మూర్ఖులకంటె
చదువుకున్న
మూర్ఖులే
దేశాన్ని
కొల్లగొడుతున్నారు.
చదువులేనివారివల్ల
వుపకారం
లేకపోయినా
అపకారం
వుండదు.
కాని
చదువుకున్న
మూర్ఖులవల్ల
వుపకారం
వుండదు
కేవలము
అపకారమే.
ఇదే
ప్రహ్లాదుడు
కూడా
చెప్పాడు.
‘తండ్రీ!
లోకములన్నియు
ఒక
ఘడియలోన
జయించినవాడవు,
యింద్రియాలోకము
చిత్తమున్
గెలువనేరవు’
లోకములన్నీ
గెలుస్తే
చక్రవర్తివి
గావచ్చు.
ఇంద్రియములను
జయించినవాడు
రాజుకే
రాజు,
చక్రవర్తులకు
చక్రవర్తి.
అతడే
king
maker.
ఇంద్రియములను
జయించకుండా
ఎన్ని
విద్యలు
సాధించి
యేమి
ప్రయోజనము.
హీనుని
అవగుణమును
పోగొట్టేదే
విద్య.
సంకుచితమైన
పరిధినుండి
విశాలమైన
పరిధిలోకి
తీసుకొని
రావాలి
మానవుని.
ఈనాటి
చదువులు
యేమి
చేస్తున్నాయి,
ఈ
చదువులవల్ల
తర్కవాదమేగాని
పూర్ణజ్ఞానము
ఎప్పుడూ
పొందలేడు.
వాదము
వలన
మనకు
లాభము
యేముంది.
ఏమి
తెలియని
మూర్ఖుడే
వాదానికి
దిగేది.
అన్నీ
తెలిసినవాడు
వాదములో
ప్రవేశించడు.
వాదానికి
దిగటం
మేధాశక్తిని
ప్రకటించుకొనే
మూర్ఖత్వమే
తప్ప
విజ్ఞానానికి
సంబంధించిన
వివేకము
కాదు.
విజ్ఞానము
సంపాదించుకోవచ్చుగాని
దానితోపాటు
వివేకముకూడా
సంపాదించుకోవాలి.
వివేకము
లేని
విజ్ఞానము
నిరుపయోగము.
వినయాన్ని
బోధించేటువంటిదే
విద్య.
వినయమే
లేకపోతే
విద్యకు
సరైన
విలువలేదు.
వినయమే
మన
ప్రవర్తనని
నిరూపణ
చేస్తుంది.
మన
మంచితనము
తెలియచేస్తుంది.
వివేకము
మన
కీర్తి
ప్రతిష్టల్ని
అధికము
గావిస్తుంది.
పెద్దల్ని
గౌరవించటము.
తల్లిదండ్రులను
ప్రేమించటము,
మంచి
చెడ్డలు
విచారించటము,
దైవాన్ని
ఆరాధించటము
వినయానికి
ప్రధానమైన
గుర్తులు.
ఇదే
మన
సౌశీల్యము
యిదే
మన
సౌజన్యం.
పవిత్రమైన
మానవజన్మ
యెత్తి
కూడను
‘నారు
పోసినవాడు
నీరు
పోయక
మానడు’
అని
కేవలం
ధనము,
ఐశ్వర్యము
కీర్తి,
అధికారము
నిమిత్తమై
మనము
అర్రు
చాచరాదు.
నీకర్తవ్యాన్ని
నీవు
నిర్వహిస్తే
అధికారం
దానంతట
అదే
వస్తుంది.
నీవు
భగవత్ప్రేమకు
సన్నిహితం
కావాలి.
పరమాత్మ
ప్రేమయే
నీకు
లభ్యమైతే
సర్వ
జగత్తు
నీకు
వశమవుతుంది.
ఆశకు
దాసుడైన
అన్నిటికీ
నీవు
దాసుడవే.
‘ఆశ
జయించువానికి
అనయంబును
దాసులు
లోకులెల్లను’
ఈ
సత్యం
గుర్తించాలి.
ఈ
సత్యములో
విద్యలన్నీ
నేర్చుకోవాలి.
3
▾
Meaning
Keep
ఈ
విద్యలలోని
విశిష్టత
తెలుసుకోవాలి.
ఎన్ని
గ్రంథాలు
చదివినా
ఎం.ఏలు;
బి.ఏలు
ఎన్నియు
పాసైన
ఎంతటి
పేరుగాంచిన
పెద్దలైన
సంపదలుండియు
సత్కార్యపరులైన
పుడమి
కీర్తిని
గన్న
పూజ్యులైన
ఆయురారోగ్యంబులనవరతముండి
పరిపూర్ణ
బలులగు
వారలైన
సతతంబు
జపములు
తపములు
సేయుచు
వేదాలు
వల్లించు
విప్రులైన
సాటి
రారు
భక్తులకు
ఏనాటికైన
దైవ
భక్తులు
కానిదే
రాదు
ముక్తి.
కాబట్టి
మనము
ఆప్రేమకు
పాత్రులము
కావాలి.
ప్రేమయే
సర్వం.
సత్యప్రేమలు
రెండే
మన
నేత్రాలుగా
మనం
భావించాలి.
ఈ
రెండింటి
చేత
జగత్తంతా
మనం
వశం
చేసుకోవచ్చు.
కనుక
సత్యము,
ప్రేమలు
యీరెండే
మన
శాస్త్రము,
ధర్మశాస్త్రాల
సారము.
సర్వమతాల
గమ్యం.
సర్వమతాల
సారము
సత్యప్రేమలే.
వీటిసారము
మనము
గ్రోలినామంటే
యేవిద్య
నేర్వనక్కరలేదు.
ఇవి
కేవలం
గురువులచేత
బోధింపబడేవి
కావు.
గ్రంథముల
వల్ల
తెలిసేవి
కావు.
జీవితములో
ఆచరణలోనే
మనము
దీనిని
అభివృద్ధి
గావించుకోవాలి.
అందరిని
ప్రేమించటానికి
ప్రయత్నించాలి.
మనము
భగవత్ప్రేమకి
గురికావాలంటే
మనం
అందరిని
ప్రేమించాలి.
ఇది
చాలా
ప్రధానమైన
విషయము.
అందరిని
ద్వేషిస్తూ,
పరిహసిస్తూ,
దూషిస్తూ,
అందరి
గొప్పదనానికి
అసూయ
పడుతూ
నాకు
మంచి
కలగాలంటే
ఏవిధముగా
కలుగుతుంది.
భగవదనుగ్రహము
లభించాలంటే
ఏవిధముగా
లభిస్తుంది.
Tank
లో
నీరు
పోస్తే
టాప్
తిప్పుతే
నీరు
రావచ్చు.
Tank
లో
నీరు
నింపకుండా
tap
ని
ఎంత
తిప్పినా
నీరు
వస్తుందా!
కాబట్టి
దైవప్రేమ
అనే
tank
మనం
నింపుకుంటే
సర్వజీవులు
అనే
tap
లో
ఆప్రేమ
కనుపిస్తుంది.
భక్తులు
గాని,
శక్తులుగాని,
రక్తులు
గాని,
ముక్తులు
గాని,
యుక్తులు
గాని
ఎవరైనా
వారివారి
కర్మలు
వారివారి
విశ్వాసాలు
వారికి
శిక్షగాని,
రక్షగాని
కల్పిస్తున్నాయి.
‘భగవంతుడు
ఏవిధముగా
నన్ను
రక్షించాడు
అని
మీరు
అనుకుంటారు.
ఈ
రక్షించేది
భగవంతుడు
కాదు.
ఈపని
భగవంతునిదిగాదు.
నీ
ప్రార్థనే
నిన్ను
రక్షించేది.
నీసత్కర్మలే
నిన్ను
రక్షించేది.
నీప్రవర్తనే
నిన్ను
రక్షించేది.
నీకేమైనా
బాధలు
కలిగినా,
నష్టం
కలిగినా,
దుఃఖము
కలిగినా
వీటన్నిటికి
నీ
సంకల్పములే
కారణం.
నీ
ప్రవర్తనలే
దీనికి
మూలకారణము.
మంచి
చెడ్డలకు
మనిషి
యొక్క
గుణదోషాలే
కారణము.
భగవంతుడు
కేవలము
సాక్షీభూతుడు.
ఇక్కడ
కరెంటుంది.
కరెంటులో
ప్రకాశము
వుంది.
దీనికి
స్విచ్
ఆన్
చేస్తే
లైటు
వెలుగుతుంది.
4
▾
Meaning
Keep
ఆఫ్
చేస్తే
లైటు
పోతుంది.
లైటు
రావటం
లేదు.
పోవటం
లేదు.
స్విచ్
వేసింది;
తీసింది
నీవే.
ఈ
కరెంటు
మనల్ని
రక్షిస్తోంది,
శిక్షిస్తోంది;
పోషిస్తోంది.
భగవంతుడు
సృష్టి
స్థితి
లయ
కారకుడు.
అదేవిధముగా
కరెంటు
కూడా
సృష్టి
స్థితి
లయములను
అనుసరిస్తోంది.
లైట్లు
వెలగటానికి,
ఫాన్లు
తిరగటానికి,
మైకు
పని
చేయటానికి
జనరేటరు
సృష్టించిన
కరెంటే
కారణం.
వీటన్నిటిలో
వుండే
కరెంటు
ఒక్కటే.
ఎయిర్
కండిషనర్
వేసుకుంటే
చల్లనిగాలి
వచ్చి
మైమరపింప
చేస్తుంది.
నిద్ర
వస్తుంది.
చలికాలములో
హీటరు
పెట్టుకుంటే
వెచ్చటిగాలి
వచ్చి
నిన్ను
సుఖపెడుతుంది.
ఎయిర్
కండిషనరు,
హీటర్లలో
వుండేది
ఒక
కరెంటు
కనుక
ఎండనుంచి,
గాలినుంచి
నిన్ను
కాపాడేది
యీ
కరెంటే.
కాబట్టి
సృష్టి
చేయుటయే
కాదు.
కరెంటు
రక్షణ
చేస్తోంది.
నీవు
దానిని
‘ఓ
కరెంటా!
నీవు
నాకు
ఎంత
వుపకారం
చేశావు’
అని
దానిని
పట్టుకుంటే
షాక్
కొడుతుంది.
ఆ
కృతజ్ఞతను
నీవు
క్రియా
రూపములో
చూపాలి.
కాని
దానిని
పట్టుకొని
కాదు.
భగవంతుడు
నిన్ను
కాపాడినందుకు,
నిన్ను
రక్షించినందుకు
నీ
కృతజ్ఞతను
నీ
నడతలో
చూపించు.
నీ
కృతజ్ఞతను
సరైన
పద్ధతిలో
నీవు
చూపటము
లేదు.
కేవలము
మాటల్లో
చూపిస్తే
ప్రయోజనము
లేదు.
నీ
ప్రవర్తనలో
చూపాలి.
భగవంతుడు
సర్వత్రా
వున్నాడు.
నీ
యందు
కూడా
వున్నాడు.
కనుక
నీ
సత్సంకల్పమే
భగవత్స్వరూపముగా
రక్షిస్తుంది.
ఆయన
ప్రజ్ఞా
స్వరూపుడు.
అందుకే
ప్రజ్ఞానం
బ్రహ్మ
అన్నారు.
ఆయన
ప్రతి
మానవునిలోను
వున్నాడు.
విద్యార్థి
అడుగుతుంటాడు
‘భగవంతుడు
ఎక్కడ
వున్నాడు?’
అని.
నీవు
నిత్యము
భోజనానికి
ముందు
చేసే
ప్రార్థనలోనే
నీకు
జవాబు
లభిస్తోంది.
‘బ్రహ్మార్పణం
చెప్తున్నావు.
‘అహం
వైశ్వానరో
భూత్వా
ప్రాణినాం
దేహ
మాశ్రితః’
నీ
ప్రాణములో
నేనే
వుంటున్నా’నన్నాడు
భగవంతుడు.
కాబట్టి
నీ
లోపల
వున్న
భగవంతుడే
నిన్ను
రక్షిస్తున్నాడు.
నీ
హృదయానికి
విరుద్ధముగా
నీవు
ప్రవర్తించావా
ఆ
భగవంతుడే
నిన్ను
శిక్షిస్తున్నాడు.
కనుక
బయటకు
కనుపించేవి
అన్నీ
లోపలి
వాటికి
ప్రతిబింబాలే.
చెడ్డగాని
మంచిగాని
నీ
భావముల
ప్రతిబింబములే.
ఏదో
ఒక
దేవాలయమునకు
వెళ్లి
పూజ
చేసినంత
మాత్రమున
అక్కడ
భగవదనుగ్రహము
లభిస్తుందని
భ్రమించవద్దు.
దేవుని
పూజించి
జీవులను
బాధిస్తే
నీకు
సుఖము
లభిస్తుందా.
దేవుని
ప్రార్థించటము
వల్ల
ప్లస్
అయింది.
జీవుల్ని
బాధించటము
వల్ల
మైనస్
అయింది.
+-+-...=0.
కనుక
సర్వజీవులలోను
దైవత్వము
చూడటం
అభివృద్ధి
చేసుకోవాలి.
ఈనాడు
భగవద్గీత
యావత్ప్రపంచమంతా
ఎక్కువ
ప్రచారం
జరుగుతోంది.
గీతా
ప్రచారకులు
వీధివీధికి
వాడవాడకు
ఎక్కువై
పోతున్నారు.
ఇది
చాలా
పవిత్రమైన
కార్యమేగాని
వీరు
భగవద్గీతను
గౌరవిస్తున్నారా?
ఆ
గీతలో
వుండే
విషయాన్ని
గౌరవిస్తున్నారా?
భగవద్గీతను
చూచిన
తక్షణమే
కళ్లకు
అద్దుకోటం,
పూజలు
చేయటం.
మరి
వీరు
కాగితాన్ని
గౌరవిస్తున్నారా
లేక
లోపల
వున్న
విషయాన్ని
గౌరవిస్తున్నారా.
భగవద్గీతగాని,
ఖురానుగాని,
బైబిలుగాని
ఏదైనా
కానివ్వండి
గ్రంథములను
గౌరవించటం
కాదు.
గ్రంథాలలోని
విషయములను
గౌరవించి
ఆచరణలో
పెట్టాలి.
5
▾
Meaning
Keep
“భగవంతుడు
అందరిలో
వున్నాడు.
మానవులంతా
సోదరులే.
భగవంతుడు
అందరికి
తండ్రి.”
అని
కొందరు
చెప్పుతున్నారు.
మానవులంతా
సోదరులని
గొప్పగా
వారు
ప్రచారము
చేస్తున్నారు
కానీ
భగవద్గీత
దీనిని
అంగీకరించటం
లేదు.
సోదరులు,
సోదరులు
అంటున్నావు.
ఈ
సోదరత్వము
గొప్పదిగా
భావిస్తున్నావు.
సోదరులు,
సోదరులు
అని
సుప్రీం
కోర్టు
దాకా
వెళ్లి
కుటుంబములను
ఛిన్నాభిన్నము
చేసిన
సోదరులు
ఎంతమంది
లేరు.
సోదర
భావమువల్ల
ద్వేషాలు,
క్రూరత్వము
అభివృద్ధి
అవుతున్నాయి.
‘సోదర
సోదరీమణులారా’
అని
మీటింగులో
పిలవటానికి
సరిపోతుంది.
స్టేజి
దిగిన
తరువాత
యేమీ
వుండదు.
ఈ
భావాన్ని
ఖండించింది
భగవద్గీత.
ఏకాత్మ
భావము
చెప్పింది
భగవద్గీత.
అందరియందు
వున్నది
ఒక్కటే
అన్నది.
‘ఏకో
వసి
సర్వభూతాంతరాత్మ”
మమైవాంశో
జీవలోకే
జీవభూత
స్సనాతనః’.
నీవు
ప్రకృతి
అంశము
కాదు.
జీవ
అంశము
కాదు.
మమైవాంశో
నా
అంశమే
నీవు.
అన్నది.
దీనిని
ఎంతమంది
విశ్వసిస్తున్నారు?
ఎంతమంది
ఆచరిస్తున్నారు?
ఎంతమంది
ఆదర్శప్రాయముగా
వుంటున్నారు?
ఎవ్వరూ
లేరు.
మనము
చేయవలసినది
ఒక్కటే.
భగవంతుని
చింతించాలనుకుంటే,
భగవంతుని
ప్రేమకు
గురికావాలనుకుంటే
ఏ
గ్రంథమూ
చదవనక్కర
లేదు.
చదివినా
తప్పులేదు.
కానీ
విశ్వసించినదానిని
ఆచరణలో
పెట్టాలి.
చదివి
చదివి
చదివి
మన
తలలు
చెడగొట్టుకుంటున్నాం.
ఒక్కొక్కరి
భావము
ఒక్కొక్క
రకముగా
వుంటుంది.
‘రుచేరుచే
ర్భిన్నమతిః’
ఒక్కొక్క
తలలో
ఒక్కొక్క
తలంపు
వుంటుంది.
ఒక్కొక్క
తలంపు
ఒక్కొక్క
మార్గములో
నడుస్తుంది.
అన్ని
తలంపులు
మనము
అనుసరిస్తుంటే
మన
తలపోతుంది.
మొట్టమొదట
నీ
విశ్వాసము
నీవు
పదిలపరచుకో.
ఒక్క
విశ్వాసాన్ని
నీవు
అనుసరించు.
ఒక్క
మార్గములోనే
నీవు
నడు.
ఈ
విధమైన
సాధన
చేస్తూ
వస్తే
దివ్యమైన
ఆత్మతత్వము
తనయందే
ఆవిర్భవిస్తుంది.
ఈనాడు
విద్యతోబాటు
వినయం,
సంస్కారము
అలవరచుకోవాలి.
చదువుకి
సంస్కారానికి
సంబంధము
లేదు.
చదువు
వేరు,
సంస్కారము
వేరు.
చదువుతో
బాటు
దైవభావాల్ని
మనసులో
నింపుకోవాలి.
దివ్యభావాలు
చేరుతే
చదువుసారం
కూడా
చేరుతుంది.
కాబట్టి
సంస్కారమనేది
ఒక్క
ఆధ్యాత్మికతలో
అలవడుతుంది
తప్ప
అన్యమార్గములో
యిది
అలవడదు.
ఎటువంటి
సందిగ్ధత
లేకుండా
తెలుసుకొనవలసినవి
రెండే.
ఒకటి
సత్యాన్ని
అనుసరించాలి.
రెండు
ప్రేమతో
జీవించాలి.
‘నా
ప్రేమయే
నా
పరమాత్మ’
నా
సత్యమే
నా
పరమాత్మ.
ఇంక
నాకు
ఏ
గ్రంథముతోటి
అవసరము
లేదు.
సత్యము
ప్రేమ
అందరిలోనూ
వున్నాయి.
అందరిలో
వున్న
సత్యప్రేమల్ని
సమత్వముతో
చూడటమే
పాండిత్యము’
అన్నారు.
అందుకే
పండితాః
సమ
దర్శనః’
అన్నారు.
సమదర్శనము
వున్నదే
పాండిత్యము
కాని
పుస్తకాలు
అన్నీ
చదివి,
తర్కించి
యితరులకు
బోధించి
కాలమును
వ్యర్థము
చేయకూడదు.
సత్యము,
ప్రేమ
అందరియందు
వుంటున్నాయి.
వాటిని
నీవు
గ్రహించుకో.
నీవు
సమన్వయము
చేసుకో;
సంరక్షించుకో,
యిది
కర్తవ్యము.
ఇదే
నిత్య
సాధన.
కాబట్టి
మనము
భగవంతుని
ప్రేమించి,
ఆ
ప్రేమను
మనం
అనుభవించి,
ఆ
అనుభవించిన
ప్రేమనే
యితరులకు
అందించటానికి
ప్రయత్నం
చేయాలి.
Previous
←
The Consciousness Called Divinity Fills Everything
Next
You yourselves are embodiments of God!
→