Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · Know yourself
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Know yourself
26 July 1991, Guru Pūrṇimā, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
భ్రమేనాహం
భ్రమేనత్వం
భ్రమేనోపాసకం
మనః
।
భ్రమేనేశ్వర
భావత్వం
భ్రమమూల
మిదం
జగత్.
॥
“భ్రమ
చేతనే
‘నేను’
—
‘నీవు’
అనే
భావాలు
ఏర్పడుతున్నాయి.
మనస్సునకు,
ఉపాసనకు,
ఈశ్వరభావత్వానికి,
ఈ
సమస్త
జగత్తునకు
భ్రమయే
మూలకారణం”.
ప్రేమస్వరూపులారా!
కంటికి
కనిపించునది,
చెవులకు
వినిపించునది,
మనస్సునకనిపించునది,
హృదయాన్ని
మైమరపించునది
ఈ
భ్రమయే.
భ్రమయే
జగత్తు.
జగత్తే
దృశ్యం.
బ్రహ్మయే
ద్రష్ట.
ఈ
జగత్తు
దృశ్య
ద్రష్టల
సమ్మిళితమైన
స్వరూపం.
“భారత
దేశంలో
గురుశిష్య
సంబంధం
రానురాను
పూర్తిగా
తగ్గిపోయినది.
సత్యసంపద,
క్రమశిక్షణ
క్రమక్రమముగా
సన్నగిల్లిపోయినవి.
భక్తి
విశ్వాసములు
రెండును
తొలగిపోయినవి.
ప్రపంచమంతటా
బాధ్యతలు
లేనట్టి
స్వాతంత్ర్యపరత
నిండిపోయినది.
ధనప్రాధాన్యత
హెచ్చిపోయినది.
ధర్మానికి
ప్రాధాన్యత
తగ్గిపోయినది.
ఇంతకంటెను
వేరేమి
చెప్పగలను
?”
‘స్వవిమర్శో
మోక్షః’
ఈ
విశాల
సృష్టియందు
మానవుడు
తెలుసుకొనవలసిన
విషయములు
అనంతములై
యుండగా,
సమస్త
మానవులనుండి
వెలువడే
‘నేను-నేను’
అనే
పదాన్ని
గుర్తించమని
భారతీయ
వేదాంతం
ప్రబోధిస్తోంది.
ఈ
అనంతమైన
ఆత్మతత్త్వాన్ని
గుర్తించుకొంటే,
సమస్తమును
గుర్తించినవాడౌతాడు.
“యద్
విజ్ఞానేన
సర్వం
విజ్ఞాతుం
భవతి”
అని
శ్రుతి
ప్రమాణం.
‘నేను’
అనే
పదానికర్థము
చక్కగా
గుర్తించినప్పుడే,
మానవుడు
సమస్తమును
గుర్తించినవాడౌతాడు.
ఎక్కడ
చూచినా
‘నేను,
నేను’
అనే
పదము
సర్వవ్యాపకమై,
సర్వాంతర్గతమై
యున్నదని
భగవద్గీత
ప్రబోధిస్తోంది.
ఏ
వేద
శాస్త్ర,
ఇతిహాస
పురాణములు
పరికించినప్పటికీ
“నిన్ను
నీవు
తెలుసుకో”
అని
ప్రకటిస్తున్నాయి.
2
▾
Meaning
Keep
దీనినే
“స్వ
విమర్శో
మోక్షః.”
అన్నారు.
ఈ
లోకంలో
ప్రతిమానవుడు
తనను
తాను
పరిచయం
చేసికొను
సమయమున
‘నేను
రాముడను’,
‘నేను
సీతను’
అని
ఎవరంతటికి
వారు
‘నేను
నేను’
అనే
పదాన్ని
ఉపయోగపెట్టుకుంటూ,
తమను
గురించి
తాము
చెప్పుకుంటూ
ఉంటారు.
కాబట్టి
అనేక
భేదములుండినప్పటికిని,
‘నేను’
అనే
పదము
‘పూసలలోని
దారము’వలె
సమస్త
మానవులయందు
వ్యాపించియే
యున్నది.
అందుచేత,
ప్రతిమానవుడు
ఈ
“నేను”
అనే
తత్త్వాన్ని
చక్కగా
గుర్తించుకొనుట
చాల
అవసరమని
గ్రహింపవలెను.
‘నేను’
అనగా
ఏమిటి?
మానవుడు
అనిత్యమైన
ఈ
దేహాన్ని
‘నేను’
అని
భ్రమించుటచేత,
అనేక
బాధలకు
గురియగుచున్నాడు.
“అహం
ఏతత్
న”
అని
శ్రుతి
స్వరూప
జ్ఞానాన్ని
బోధిస్తున్నది.
అహం=నేను,
ఏతత్=ఇది,
న=కాదు.
అనగా
‘నేను
ఇది
కాదు.’
అని
అర్థం.
ఈ
జ్ఞానమే
సత్,
చిత్
ఆనందస్వరూపములను
స్మృతికి
తెస్తూ,
సమ్యక్
జ్ఞానమును
ప్రబోధిస్తోంది.
‘నేను’
అనగా
ఏమిటి?
శ్రుతి
ప్రమాణమును
పురస్కరించుకొని,
“నేను”
అనే
పదమునకు
ఆత్మ,
పరమాత్మ,
బ్రహ్మ,
ప్రత్యగాత్మ—అని
అనేక
నామములు
కలవని
తెలియుచున్నది.
ప్రతిమానవునియందు-భుజించిన
ఆహారమును
జీర్ణింపజేసి,
ఆహారరసస్వరూపాన్ని
సర్వాంగములకు
వ్యాపింపజేయుటచేతనే
ఈ
‘నేను’
వైశ్వానర
స్వరూపాన్ని
ధరిస్తోంది.
ఈ
హేతువుచేత
‘నేను’
అనేది
ప్రతి
మానవునియందు
వైశ్వానరరూపంలో
ఉంటుంది.
పరమాత్మ
అనగా
కర్మేంద్రియ,
జ్ఞానేంద్రియ,
మనోబుద్ధి,
చిత్త,
అహంకారములకు
అతీతమైన
తత్త్వమని
చెప్పవలె.
ఇటువంటి
పరమాత్మ
తత్త్వం
బ్రహ్మ
తత్త్వంగా
రూపొందింపబడుతూ
వచ్చింది.
‘నేను’
దేహము
కాదు
బ్రహ్మ
అనగా
ఏమిటి?
వ్యాపకత్వమే
బ్రహ్మతత్త్వం.
ప్రతి
మానవునియందు
“నేను”
అనేది
వ్యాపించి
యున్నది.
కనుక
సర్వ
మానవులయందు
వ్యాపించిన
‘నేను’
అనునది
“బ్రహ్మ”
అని
చెప్పబడుతోంది.
‘నేను’
అనేది
బ్రహ్మస్వరూపమే.
ఇక
‘ఇది’
అనే
పదము
సర్వ
దృశ్యములయందు
వ్యాప్తమైయున్నది.
ఉదాహరణకు:—
ఇది
మైకు,
ఇది
సూర్యుడు,
ఇది
చంద్రుడు
అంటాము.
ఇట్లు
‘ఇది’
అనే
పదము
దృశ్యములయందు
అంతర్లీనమై
యుంటున్నది.
మొత్తముపైన
దీని
అంతరార్థము
ఏమనగా,
‘ఇది’
అనే
పదము
దృశ్యములకు
సంబంధించినది
అని
గ్రహింపవలె.
‘ఇది’
అనే
పదము
లేకపోతే,
ఒక
బట్టనుగూర్చి
చెప్పినప్పుడు,
ఏది
బట్ట?
అని
ప్రశ్నవస్తుంది.
అప్పుడు
“ఇది
బట్ట”
అని
దానిని
నిరూపించడం
జరుగుతుంది.
కనుక
సమస్త
దృశ్యములందు
వ్యాపకమై
యుండిన
తత్త్వమునకే
“ఇది”
అని
పేరు.
‘ఇది’
దృశ్యము;
‘నేను’
ద్రష్ట.
కాబట్టి
‘నేను’
దృశ్యము
కాదు,
‘నేను’
ధరించినది
“ఇది”-
అదే
దేహం.
సర్వమూ
చూచినట్లుగా
నా
దేహాన్ని
చూస్తున్నాను.
దేహము
దృశ్యమే.
3
▾
Meaning
Keep
ఈ
దృశ్యమైన
దేహమును
‘నేను’అనే
ద్రష్టగా
భావించడం
అజ్ఞానం.
మన
దేహము
దృశ్యములలో
ఒకటి.
దేహమునే
‘నేను’
అని
భావించడం
కేవలము
అనర్థము.
ఈ
శరీరము
సమాధిస్థితియందు,
గాఢనిద్రయందు
మనకు
కనిపించుట
లేదు.
కాబట్టి
నీవు
దేహం
కాదు.
నీవు
ద్రష్టవే.
అయితే
నానారూపములతో
సృష్టింపబడిన
ఈ
జగత్తులో
అంతటికిని
అధిష్ఠాన
తత్త్వము
అనేది
ఒకటి
ఉంటున్నది.
ఈ
అధిష్ఠాన
వస్తువునుండి
సర్వమూ
నిర్మింపబడగలుగుచున్నది.
అధిష్ఠానమే
లేకపోతే—
ఏ
వస్తువునూ,
ఎవ్వరూ
నిర్మాణం
చేయలేరు.
ఒక
చిన్న
ఉదాహరణ:—
అనేక
రకములైన
బంగారు
ఆభరణాలుంటాయి.
ప్రతీ
ఆభరణములో
ఉండేది
బంగారం
ఒక్కటే.
ఆ
ఆభరణములన్నింటినీ
కరిగించి
ఒక
చోట
పోసినప్పుడు
ఆ
బంగారమంతా
ఒక
ముద్దగా
తయారౌతుంది.
అందుచేత
ఆభరణ
రూపములో
ఉన్న
బంగారం
వేరువేరుగా
కనిపించినప్పటికినీ,
కరిగించి
పోసినప్పుడు
తాను
తానుగానే
నిలిచిపోతున్నది.
అందుచేత
బంగారమునకు
ఎట్టి
మార్పుగాని,
ఎట్టి
వికారంగాని
కలుగనేరదు.
అదేవిధముగనే
దృశ్యమంతా
అనేక
రూపనామములతో
ఉండినప్పటికిని,
దీనికి
ద్రష్టగా
‘నేను’
అనేది
మార్పుచెందక
అధిష్ఠానత్వమును
పొందివుంటుంది.
కాబట్టి
‘నేను’
అనే
అధిష్ఠానము
నుండియే
సర్వము
ఆవిర్భవిస్తున్నది.
‘నేను’
అనినంతనే
దేహము
అనే
అర్థాన్ని
మనము
తీసికొనరాదు.
నీవు
ద్రష్టవనే
సత్యాన్ని
గుర్తించు
మానవుడు
ఇట్టి
సత్యమును
గుర్తించినప్పుడు
ఈ
దృశ్యకల్పితమైన
జగత్తునందు
ఎట్టి
విచారమును
పొందడు.
అట్టివాడు
ఎప్పటికీ
ఆనందములో
మునిగి
ఉంటాడు.
అధిష్ఠానము
లేక
ఆకారములు
కనిపించవు.
“నేను,
నేను”
అనే
తత్త్వం
సమస్త
ఆకారములందు
నిత్యంగా
ఉంటోంది.
ప్రతిమానవునియందు,
సమస్త
జీవులయందు
ఆవిర్భవించే
మొదటి
శబ్దము
‘నేను’.
ప్రణవముతోబాటు
ముందుగా
ఉన్నది
“నేను”.
ఈనాడు
అధిష్ఠానమైన
దివ్యత్వాన్ని
విస్మరించి,
వికారఆకారములతో
కూడిన
పైపైనవేషాలనే
విశ్వసించి
అనేక
బాధలకు
గురికావలసి
వస్తోంది.
కాబట్టి
ప్రతిమానవునియందు
దివ్యత్వమనేది
సర్వవ్యాపకమై
ఉంటున్నది.
ఎవడు
బ్రహ్మజ్ఞానమును
గుర్తింపగలడో,
వాడే
బ్రహ్మగా
రూపొందగలడు.
“బ్రహ్మవిదాప్నోతి
పరం”.
అనగా
ఈ
“నేను”
అనే
తత్త్వాన్ని
గుర్తించినవాడు
“పరబ్రహ్మగా”
మారిపోతాడు.
శోకనివారణ
చేసికొనుటకు,
తానెవరో
గుర్తించుకొన్నప్పుడే
శోకనివారితుడు
కాగలడు.
ఉన్నది
ఒక్కటే.
రెండవది
ఏదీ
లేదు.
ఇది
శ్రుతుల
ప్రమాణము.
కానీ
మానవుడు
పెద్దల
బోధలనుకానీ,
శ్రుతులనుకానీ
లెక్కపెట్టక
పెడచెవిని
పెట్టుట
చేతనే
తన
స్వరూపాన్ని
తాను
మరచిపోతున్నాడు.
తాను
దేనిని
తెలుసుకుంటే
సమస్తమును
తెలుసుకోగలడో,
అట్టి
దానిని
తెలుసుకొనుటకు
ప్రయత్నించాలి.
ఒక్క
మట్టిని
మనము
గుర్తించుకుంటే
ఆ
మట్టితో
చేయబడిన
పాత్రలన్నింటిలో
మట్టి
కూడి
ఉంటుందనే
సత్యం
మనకు
గోచరమౌతుంది.
4
▾
Meaning
Keep
కుండలో
మట్టి
ఉన్నది.
కాని
మట్టిలో
కుండలు
లేవు.
కుండలు
కల్పితం.
కనుకనే
దృశ్యములందు
ద్రష్ట
ఉన్నాడు,
కాని
ద్రష్టలో
దృశ్యం
లేదు.
అందుచేత
“నీవు
ద్రష్టవు,
నీవు
ద్రష్టవు”
అనే
సత్యాన్ని
చక్కగా
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
ద్రష్టకు
అనేక
పేర్లు
ఉన్నవి.
జాగ్రదావస్థయందు
‘నేను’
అనేటటువంటిదే
సర్వవ్యాపకత్వమై
ఉంటుంది.
అనేక
రూపనామంలతో
కూడియుండుటచేత
‘విరాటస్వరూపుడు’
అని,
సర్వవిషయములతో
వ్యవహరించుటచేత
“వ్యావహారికుడ”ని,
ప్రతీపదార్థమునందు
అభిమానము
కలిగి
వుండుటచేత
‘విశ్వుడు’
అని
-
చెప్పబడుతోంది.
‘నేను’
పరముగా
ఆత్మకు
ఇన్నిపేర్లు
కలుగుతూ
వస్తున్నాయి.
స్వప్నావస్థయందు
‘నేను’
అనే
పదానికి
అనేక
పేర్లు
ఉంటున్నవి.
“స్వప్న
కలితుడు”
అని,
మనస్సునే
ఆధారముగా
ధరించినవాడు
కాబట్టి
‘ప్రత్యగాత్మ’
అని,
ప్రజ్ఞచేత
తాను
ప్రతి
తత్త్వమును
గుర్తించుకొనడానికి
ప్రయత్నిస్తున్నాడు
కాబట్టి
“చిత్తైకాగ్రుడ”ని,
-
ఈ
రీతిగా
‘నేను’
అనే
పదానికి
పర్యాయపదములు
చెప్పబడుచున్నవి.
సుషుప్తియందు
అంతఃకరణ
ప్రభావముచేత
సమస్తమును
తెలుసుకోగలుగుచున్నాడు
కాబట్టి
ఈ
‘నేను’
అనే
పదానికి
“ప్రాజ్ఞుడ”ని
మరొక
పేరు
పెట్టబడినది.
నా
దేహము
అనుకొన్నప్పుడు
దేహము
వేరుకావాలి,
‘నేను’
వేరు
కావాలి.
అట్లే
నా
బట్ట
అంటే
బట్టవేరు,
‘నేను’
వేరు
అవుతుంది.
అందుచేత
నాదేహము
అనుకొన్నప్పుడు
దేహము
నీవు
కాదు.
దేహము
ఒక
దృశ్యం,
ఇంద్రియములు
ఒక
దృశ్యం,
మనస్సు
ఒక
దృశ్యం,
చిత్తము
ఒక
దృశ్యం,
అంతఃకరణ
మరొక
దృశ్యం.
కాబట్టి
సర్వమూ
దృశ్యములే
అవుతాయి.
తెలియబడుచున్న
విశ్వము
దృశ్యమగును.
సమస్తమును
చూచు
వ్యక్తియే—
ద్రష్ట.
ఆ
ద్రష్టయే
“నేను”
అగును.
ఇంతకన్నా
మించిన
అన్యమేదియూ
లేదు.
ఇదే
సత్యం.
ఇదే
సమస్త
వేదముల
సారాంశం.
నిజమైన
వేదాంతం
వేదాంతమనగా
ఏమిటి?
వేదాంతమనగా
ఏదో
అర్థముకాని
పదముల
నుచ్చరించుట
గాదు.
తనను
తాను
గుర్తించుకొనుటయే
నిజమైన
వేదాంతం.
తనను
తాను
గుర్తించుకోలేక
పోవుటయే
మరుపు.
మరుపే
దృశ్యం.
ఎఱుకే
బ్రహ్మ.
ఎఱుక
అనగా
జ్ఞానము
అని
అర్థము.
జాగ్రదావస్థలోని
జాగ్రత్తయే
ఎఱుక.
అనగా
జాగ్రదావస్థలోని
జ్ఞానమునకే
ఎఱుక
అని
పేరు.
కనుక
నిరంతరం
మనము
జాగ్రత్తయందే
ఉండాలి.
ఆత్మయే
కారకం.
కారకమనేది-‘నేను’,
‘నేను’
అనే
పదమునకంతరార్థప్రబోధం.
భగవద్గీతయందు
“సర్వధర్మాన్
పరిత్యజ్య
మామేకం
శరణం
వ్రజ”
అని
తెలుపబడినది.
అన్ని
ధర్మాలు
‘నీవు’
అనే
తత్త్వాన్ని
విసర్జించమన్నాయి.
అన్ని
ధర్మాలంటే
ఏమిటి?
అసలు
ధర్మమంటే
తెలిస్తే
గదా!
అన్ని
ధర్మాలు
వదిలిపెట్టేది.
ఇక్కడ
ధర్మమనగా-
ఒక్కొక్క
వస్తువునకు
ఒక్కొక్క
ప్రాణ
సమానమైన
ధర్మగుణం
ఉంటున్నది.
అదే
ఆ
వస్తువు
యొక్క
సహజధర్మం.
అగ్నికి
వేడి
ధర్మం.
5
▾
Meaning
Keep
వేడి
లేకపోతే
అది
బొగ్గుగా
మారిపోతుంది.
అది
అగ్ని
అనిపించుకోదు.
చక్కెరకు
తీపి
ధర్మం.
తీపి
లేకపోతే
అది
కేవలం
ఇసుక
అవుతుంది
కాని
చక్కెర
మాత్రం
కాదు.
అదే
విధంగా
మానవుని
ధర్మం
ఏమిటనగా
వాంఛలు
కలిగియుండుటయే.
నిరంతరం
వాంఛలు
పెంచుకోవటమే
మానవుని
ధర్మం.
కనుక
వాంఛలు
త్యజించటమే
“సర్వ
ధర్మాన్
పరిత్యజ్య”
అని
చెప్పబడుతుంది.
ఈ
విధానమే
వైరాగ్యమని
పిలువబడుతుంది.
ఆత్మజ్ఞానం
ప్రకటించు
ఈనాడు
అనేక
రకములైన
వాంఛలు
మితిమీరిపోవుట
చేతనే
మానవుల
మతులు
భ్రమిస్తున్నాయి.
వాంఛలను
కొంత
అదుపులో
పెట్టుకోవాలి.
పశువులు
తమ
కడుపు
నిండగానే
తమ
వాంఛలను
తగ్గించుకొంటాయి.
కాని
ఈనాటి
మానవుడు
తాను
తిని,
తాను
తిన్నదానికి
ఆనందించుటకు
బదులుగా
ఇంకా
అధికమైన
దానిని
ఆశిస్తున్నాడు.
ఒక
మాటలో
చెప్పాలంటే,
మానవుని
కంటె
పశు
పక్ష్య
మృగాదులే
మేలనిపిస్తున్నాయి.
ఎందుచేతననగా
వాటికి
దాచుకునే
గుణం,
దోచుకొనే
దుర్మార్గం
ఏమాత్రము
లేవు.
కాని,
ఈనాటి
మానవుడు
తన
మానవత్వాన్ని
తాను
పూర్తిగా
కోల్పోయి
బాధలు
పడుటకు
కారణము
“తానెవరు”
అనే
సత్యాన్ని
గుర్తించుకొనలేకపోవుటయే.
ప్రతిమానవునియందు
“నేను
ఆత్మ”
అనే
విజ్ఞానం
వికసించాలి.
ఆ
విజ్ఞానం
వికసించినపుడే
ప్రజ్ఞానం
ప్రకటితమౌతుంది.
అప్పుడే
ఒక
ప్రత్యక్షమైన
సందర్శనం
కలుగుతుంది.
కనుక
మనలో
ఉన్న
దివ్యత్వాన్ని
వికసింపచేయాలి,
ప్రకటింపచేయాలి.
భారతీయులు
ఆత్మస్వరూపులు
భారతదేశమునకు
మించిన
దేశం
మరొకటి
లేదు
అన్ని
అవతారాలు
భారతదేశంలోనే
అవతరిస్తున్నాయి.
ఈనాడు
మనము
మహత్తరమైన
భారతదేశమును
సరియైన
పద్ధతిలో
పెట్టుకోలేక
పోతున్నాము.
ఇటువంటి
భారతదేశంలో
మనము
పుట్టినందులకు
గర్వించాలి.
ఆదర్శవంతమైన
జీవితాన్ని
మనము
అనుభవించాలి.
అట్లుకాక,
భారత
దేశము
నుండి
విదేశీయులు
భారతీయుల
భాగ్యాన్ని
దోచుకొనిపోతున్నారు.
భారతీయులు
విదేశాలకు
వెళ్ళి,
అక్కడి
మాలిన్యాన్ని
తెచ్చుకుంటున్నారు.
ఇదేనా—
నిజమైన
భారతీయుని
లక్షణం!
కాదు,
కాదు.
భారతీయులు
ఆత్మ
స్వరూపులు.
ఇట్టి
సత్యాన్ని
గుర్తించినవాడు
విదేశీయుడైనా
ఆత్మ
స్వరూపుడే.
నేడు
గుర్తించుకొనే
శక్తి
సామర్థ్యాలు
వారి
వద్ద
లేక
పోతున్నాయి.
భారతీయులు
ఆత్మస్వరూపులని
గుర్తించుకోవడానికి
తగిన
శక్తిసామర్థ్యములు
కలవారని
తెలియజేసే
ఎన్నో
ఉదాహరణలు
వేద
శాస్త్ర
ఇతిహాస
పురాణములందు
ఎక్కడ
చూచినా
కనిపిస్తూనే
ఉంటాయి.
మానవుడు
దివ్యత్వంలోనే
లీనం
కావాలి.
ఇట్టి
సత్యాన్ని
గుర్తించడానికి
ప్రయత్నించండి.
దానికి
తగిన
పరిశోధనలు
చేయండి.
“నిన్ను
నీవు
తెలుసుకో”
అని
వేదాలు
ప్రబోధిస్తున్నాయి.
నీవు
వేదాలను
తెలుసుకొనుటకు
ప్రయత్నించాలి.
తెలుసుకొన్నవి
ఆచరణలో
పెట్టాలి.
6
▾
Meaning
Keep
అప్పుడే
నీ
తత్త్వం
నీవు
గుర్తించుకొనుటకు
వీలవుతుంది.
నీవే
భగవంతుడవు
“నేను
దేహము
కాదు.
నేను
అన్నిటికీ
సాక్షీభూతుడనై
ఉంటున్నాను”
అనే
సత్యాన్ని
మీరు
గుర్తించాలి.
ఇంద్రియములు
అనిత్యములైనవి.
అట్లే
వానినుండి
వచ్చిన
ఫలితాలు
కూడా
అనిత్యములే.
నిజమైన
సత్యం
హృదయము
నుండి
ఆవిర్భవిస్తుంది.
నీవే
భగవంతుడవు.
అటువంటి
దివ్యమైన
విశ్వాసాన్ని
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
మానవుడు
అనగా
విశ్వాసముకల
జీవి
అని
అర్థం.
మనం
విశ్వసించిన
విషయాన్ని
ఆచరణలో
పెట్టినప్పుడే
విశ్వాసం
మరింత
అభివృద్ధి
అవుతుంది.
నమ్మినది
ఆచరించాలి.
కాని
ఈనాటి
మానవుడు
ఈ
సత్యాన్ని
గుర్తించుట
లేదు,
విచారించుట
లేదు.
బాహ్యమైన,
లౌకికమైన,
జగత్సంబంధమైన
విషయములందే
తన
కాలాన్ని
వ్యర్థం
చేసికొంటున్నాడు.
సముద్రం
నుండి
పుట్టిన
ఆ
అలలు
అనేక
రూపములు
ధరించి,
ఆ
సముద్రమునందే
ఆడి,
పాడి,
తిరిగి
ఆ
సముద్రమునందే
లయమైపోతున్నాయి.
ఆవిధముగనే
మానవుడు
దివ్యత్వమునుండి
పుట్టినందులకు,
ఆ
దివ్యత్వమునందే
జీవించి,
దానియందే
అంత్యం
కావాలి.
అదే
నిజమైన
మానవత్వము
యొక్క
లక్ష్యం.
మన
జీవితమంతా
ఎంతో
పవిత్రమైనది,
దివ్యమైనది,
ధన్యమైనది.
ఇట్టి
పవిత్రమైన
జీవితమును
పాడు
కోరికలకై
వ్యర్థము
చేయరాదు.
ఈ
దేహతత్త్వాన్ని
ఒక
దృశ్యంగా
భావించుకోవాలి.
దానిని
ఒక
పనిముట్టుగా
స్వీకరించి,
దానితో
సమస్త
కార్యములు
పవిత్రమైనవిగా
చేసికోవాలి.
అప్పుడే
ఈ
మానవత్వం
ఒక
దివ్యత్వంగా
మారిపోతుంది.
దీనికి
ఒక్కటే
మార్గం.
అదే
దైవ
చింతన.
“బ్రహ్మవిద్
బ్రహ్మైవ
భవతి”.
ఇంతకు
మించిన
మార్గం
వేరొకటి
లేదు.
దైవచింతన
చేస్తూ,
చేస్తూ
నీవు
కూడా
ఆ
దైవమై,
ఆ
దైవత్వాన్ని
పొందగలవు,
చేరుకోగలవు.
Previous
←
Develop social consciousness
Next
Honour the plighted word
→