Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · Light the Flame of the Ātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Light the Flame of the Ātma
5 November 1991, Dīpāvali, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
“శాంతి
అంతరించినది,
సత్యమే
కరువైనది.
ఆయుధముల
బాధ
అధికమైనది.
ఇట్టి
అనర్థములన్నింటికీ
స్వార్థమే
మూలకారణం.
సత్యమైన
బాట
—
సాయి
మాట”.
“సత్య
ధర్మ
శాంతి
ప్రేమ
అహింసలు—
మానవునికి
పంచప్రాణాల
వంటివి.
ఈ
పంచప్రాణములలో
ప్రేమ
అతిప్రధానమైనది.
కనుక,
మానవ
హృదయంలో
ప్రేమను
పదిలపరచుకోవాలి”.
ప్రేమ
స్వరూపులారా!
భారతీయ
సంస్కృతి
అనంతమైనది
అనుపమానమైనది.
భారతీయ
పర్వదినములన్నీ
అనంతమైన
ఆధ్యాత్మిక
అంతరార్థాలతో
కూడి
ఉంటున్నవేగాని,
విలాసాల,
వినోదాల,
ఆడంబరాల
నిమిత్తమై
ఆవిర్భవించినవి
కావు.
భారతీయులకు
సర్వపదార్థములు
పూజనీయములే.
కంటికి
కనిపించునవి,
చెవులకు
వినిపించునవి,
మనస్సును
మరపించునవి,
హృదయాన్ని
కదిలించునవి—
సమస్త
పదార్థములూ
యదార్థములైనవే.
భారతీయ
సాంఘిక
న్యాయం
భారతీయులకు
రాయి
మొదలుకొని
రత్నం
వరకు,
పక్షి
మొదలుకొని
పారిజాతము
వరకు,
చీమ
మొదలుకొని
ఏనుగు
వరకు,
పామరుడు
మొదలుకొని
పరమహంసవరకు—
సకల
పదార్థాలు
పరతత్త్వాన్ని
ప్రబోధించునవే.
దీనిని
పురస్కరించుకొనియే—
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ”,
“సర్వం
విష్ణుమయం
జగత్”
“ఈశావాస్య
మిదం
సర్వం”
మొదలగు
మహావాక్యములు
పరమ
సత్యాన్ని
ప్రబోధిస్తూ
వచ్చినవి.
భారతీయుల
సాంఘిక
న్యాయం
ఏ
ఇతర
దేశములందును
కనిపించదు.
దైవత్వమును,
ప్రేమతత్త్వమును
కేవలం
మానవుల
వరకు
మాత్రమే
పరిమితం
గావించకుండా,
సమస్త
జీవుల
యందు
వ్యాపింపజేసే
విశాలతత్త్వం
భారతీయులది.
ఇట్టి
పవిత్రమైన
సంస్కృతిని
గుర్తించుకొనలేని
అజ్ఞానులు
భారతీయులను
హేళన
చేస్తుంటారు.
భారతీయులు
రాళ్ళను-రప్పలను,
వృక్షములను,
కొండలను
పూజిస్తుంటారని
వారు
హాస్యాస్పదముగా
మాట్లాడుతుంటారు.
ఏకత్వము
నందు
అనేకత్వమును
చూడటం
మానవ
సహజం.
కాని,
భారతీయుల
సంస్కృతి
యందు
అనేకత్వంలోని
ఏకత్వాన్ని
గుర్తింపజేసే
పరతత్త్వం
ఇమిడి
ఉంటున్నది.
2
▾
Meaning
Keep
చీకటి
వెలుగులు
ప్రతి
పర్వదినం
కూడా
మానవుని
యందే
దివ్యత్వమున్నదని
హెచ్చరించే
దివ్యమైన
సూచనయే.
“ఓ
అజ్ఞాన
మానవుడా!
దివ్యమైన
ఆత్మతత్త్వము
నీ
యందే
ఉండినప్పటికీ
దానిని
నీవు
విస్మరించి,
జగత్తును
విశ్వసించి
మానవత్వమును
వ్యర్థం
గావించుకొంటున్నావు”
అని
భారతీయ
శాస్త్రములు
తెలియజేస్తున్నాయి.
ఈనాటి
పర్వదినము
యొక్క
పేరునందే
దివ్యమైన
జ్యోతిస్వరూపం
ఇమిడి
ఉంటున్నది.
“దీపావళి”
అనగా
దీపముల
సమూహము
అని
అర్థము.
ఎక్కడ
చీకటిగా
ఉన్నదో,
అక్కడే
వెలుతురు
అవసరము.
కనుకనే—
“తమసోమా
జ్యోతిర్గమయా”
అని
అన్నారు.
ఏమిటీ
చీకటి?
దుఃఖం,
నష్టం,
అశాంతి,
నిరాశ,
నిరుత్సాహం—ఇవన్నీ
చీకటితో
పోలినటువంటివే.
దుఃఖమనే
‘చీకటి’
పోవాలంటే,
సుఖమనే
‘దీపాన్ని’
వెలిగించాలి.
రోగమనే
‘చీకటి’
పోవాలంటే
ఆరోగ్యమనే
‘జ్యోతిని’
వెలిగించాలి.
అయితే,
ఈ
సుఖ-దుఃఖములు
ఒకదానినొకటి
సమన్వయము
గావించే
సమత్వములేగాని,
అన్యములు
కావు.
కౌముది
మాసం
ఈ
పర్వదినముల
అంతరార్థములు
ప్రాపంచిక
రీతిలో
ఒక
విధంగా
ఉంటాయి,
ఆధ్యాత్మిక
పరంగా
మరొక
విధంగా
ఉంటాయి.
అయితే,
ఈ
రెండింటి
యందు
సమత్వమనేది
ఇమిడి
ఉంటున్నది.
దీనిని
తెలుసుకోలేని
మూర్ఖులు
భిన్నత్వాన్ని
భావించి
నానార్థములు
కల్పించి,
అనర్థములు
స్వీకరించి,
యదార్థాన్ని
విస్మరిస్తున్నారు.
ఈ
పర్వదినము
యొక్క
అంతరార్థమును
సైన్సు
పరంగా
పరిశీలించినప్పుడు—
పూర్వం
భారతీయులు
దక్షిణ
ధృవ
ప్రాంతము
నందు
జీవించేవారు.
ఇక్కడ
ఆరు
నెలలు
చీకటిగా,
ఆరు
నెలలు
వెలుతురుగా
ఉంటుంది.
“మేషసంక్రాంతి”
దినమున
సూర్యోదయమౌతుంది,
“తులాసంక్రాంతి”
దినమున
సూర్యాస్తమయమౌతుంది.
ఈ
మేషమునకు,
తులకు
మధ్య
కాలము
ఆరు
నెలలు.
ఈ
ఆరు
నెలలు
వెలుతురుగానే
ఉంటుంది.
ఈ
ఆరు
నెలల
తరువాత
తులారాశియందు
చీకటి
ప్రారంభమౌతుంది.
ఇది
కార్తీకమాస
చతుర్దశి,
అమావాస్యదినం.
ఈ
మాసమునకే
“కౌముది”
అనే
పేరు
వచ్చింది.
ఆనాటి
దక్షిణ
ధృవ
ప్రాంతీయులు
ఈ
దినము
నుండి
జ్యోతులు
వెలిగించుకొనుట
ప్రారంభిస్తూ
వచ్చారు.
నిరంతరం
చీకటి
యందే
వారు
జీవితము
గడుపవలసి
ఉండుట
చేత,
ఈ
వెలిగించే
జ్యోతికి
“నిత్యజ్యోతి”
అని
పేరు
పెట్టారు.
నరకగ్రహ
నిర్మూలన
5
వేల
సంవత్సరములకు
పూర్వము
కొన్ని
గ్రహములు
ఉండేవి.
అప్పుడప్పుడు
ఈ
గ్రహములు
వాటంతటకవే
అంత్యమైపోతుంటాయి.
ఒకప్పుడు
“నరక”
అనే
గ్రహం
చంద్రగ్రహంతో
పాటు
అతి
సమీపంలో
సూర్యుని
చుట్టూ
తిరుగుతూ
ఉండేది.
కొంత
కాలానికి
ఈ
‘నరక’
అనే
గ్రహం
భూమిని
ఢీకొనడానికి
సమీపించింది.
అప్పుడు
భూలోకవాసులు
అతి
భయము
చేత,
దిగులు
చేత
చాలా
దుఃఖమును
అనుభవించవలసి
వచ్చింది,
వారందరూ
కలసి
భగవంతుని
ప్రార్థించారు.
ఆ
ప్రమాదము
నుండి
రక్షించి,
తమకు
ప్రాణభిక్ష
పెట్టమని
భగవంతుని
కోరారు.
అప్పుడు
కృష్ణుడు
తన
ప్రజ్ఞాశక్తి
చేత
ఆ
నరక
గ్రహమును
దునుమాడాడు.
శ్రీ
కృష్ణుని
ప్రజ్ఞాశక్తినే—
“సత్యము”
అని
పిలుస్తూ
వచ్చారు.
అనగా
శ్రీ
కృష్ణుడు
సత్యాసమేతుడై
నరకగ్రహాన్ని
నిర్మూలం
గావించాడు.
అప్పుడు
భూలోకవాసులు
ఈ
కష్టము
నుండి
తప్పించుకొన్న
సందర్భములో
ఆనందోత్సాహాలతో
జ్యోతులు
వెలిగించుకొని,
ఆనాడు
ఈ
పర్వదినమును
ఉల్లాసంగా
జరుపుకొన్నారు.
3
▾
Meaning
Keep
రామజ్యోతి
శ్రీరాముడు
రావణుని
హతమార్చి
అయోధ్య
చేరి,
పట్టాభిషిక్తుడైన
దినమే
దీపావళి.
రామజ్యోతి
అయోధ్యను
వదలిన
తరువాత
అయోధ్య
అజ్ఞానమనే
చీకటితో
నిండిపోయింది.
అరణ్యమంతా
ప్రకాశంతో
నిండిపోయింది.
ఈ
దుఃఖంలో
అయోధ్య
మునిగి
ఉండుట
చేత
ఆనాటి
ప్రజలు
రాముడు
అయోధ్యలో
ప్రవేశించినంతనే,
అతనిని
ఒక
దివ్యజ్యోతిగా
భావించి,
ఆనందంలో
ఈ
జ్యోతుల
ఉత్సవాన్ని
జరుపుకొన్నారు.
అహంకార
నిర్మూలన
గావించుకో
వామనుడు
బలిచక్రవర్తిని
మూడడుగుల
నేలను
దానమిమ్మని
కోరి,
అతనిని
పాతాళలోకమునకు
దిగద్రొక్కిన
దినమే
ఈ
దీపావళి
దినం.
దీనికి
మరొక
అంతరార్థము
ఉంటున్నది.
సూర్యుడనగా
విష్ణువు
అని
మరొక
పేరు.
సూర్యుని
రథమునకు
ఏడు
గుఱ్ఱములున్నవి
అంటారు.
అనగా
ఏడు
రంగులే
ఏడు
గుఱ్ఱములు.
ఈ
రథమునకు
ఒకే
చక్రం.
ఈ
చక్రమునకు
360
ఆకులు
ఉంటున్నవి.
అవే
360
దినములు.
ఈ
సూర్యునికి
ఉదయము,
మధ్యము,
అంత్యము
అని
మూడు
స్థితులుంటున్నవి.
అతడు
ఈ
మూడు
స్థితులనే
మూడు
పాదములుగా
తీసికొని,
అహంకారమనే
బలిచక్రవర్తిని
అణగద్రొక్కాడు.
చక్రవర్తి
అనగా
ఏమిటి?
అందరికీ
నాయకుడని,
అందరు
అతని
స్వాధీనములో
నిల్చినవారని
అర్థము.
మానవుని
యందు
కూడా
ఒక
‘చక్రవర్తి’
ఉంటున్నాడు.
మిగిలిన
సకల
సద్గుణములు
అతని
స్వాధీనము
నందే
ఉంటున్నాయి.
అతడే—
“అహంకారచక్రవర్తి”.
కనుకనే,
సకల
సద్గుణములను
ఈ
అహంకారమనే
‘చక్రవర్తి’
అణచివేస్తున్నాడు.
అహంకారమునకు
మరొక
అర్థమేమనగా
దేహమునే—“నేను”
అని
భ్రమించుట.
దేహం
నీవు
కాదు.
ఈ
దేహం
కేవలం
ఒక
పనిముట్టువంటిది.
ఇది
కేవలం
పదార్థముల
చేరికనే.
ఈ
జడమైన
దేహమునందు
ఒక
చైతన్య
శక్తి
చేరియుండుటచేత,
ఇది
అన్ని
విధములైన
క్రియలలో
ప్రవేశిస్తున్నది.
కనుక,
ఇట్టి
దేహమునే
‘నేను’
అని
భావించుటయే—అహంకారం.
ఈ
అహంకారంతో
కూడియున్న
మానవుడు
అజ్ఞానమనే
అంధకారములో
మునిగియుంటాడు.
ఈ
అహంకారమనే
అజ్ఞానం
దూరమైనప్పుడు,
దివ్యజ్ఞానమనే
ప్రకాశవంతమైన
జ్యోతి
వెలిగింపబడుతుంది.
ఈ
అహంకారం
అణగద్రొక్కబడిన
దినమే
దీపావళి
దినము.
బాహ్యజ్యోతి
—
అంతర్
జ్యోతి
విక్రమచక్రవర్తి
భారతదేశమును
పరిపాలించిన
మొదటి
దినమే
ఈ
దీపావళి
దినము.
ఈ
విధమైన
అనేక
విషయాలను
పురస్కరించుకొని
భారతీయులు
ఈ
దీపావళి
పర్వదినమును
బాలురు
మొదలుకొని,
వృద్ధుల
వరకు
ఎంతో
ఆనందోత్సాహములతో
అనుభవిస్తూ
వచ్చారు.
అయితే,
ఈ
దీపములు
కేవలము
బాహ్యమైన
చీకటిని
మాత్రమే
దూరము
గావిస్తాయి.
కాని,
ఆంతరంగికమైన
చీకటిని
ఏమాత్రం
నిర్మూలం
గావించలేవు.
ఒక్క
“జ్ఞానజ్యోతి”
మాత్రమే
ఆంతరంగికమైన
చీకటిని
నిర్మూలం
గావించగలదు.
జ్యోతిని
మనం
వెలిగించాలంటే,
ఒక
ప్రమిద
కావాలి.
దానిలోపల
తైలం
పోయాలి.
దానిలో
ఒక
వత్తిని
పెట్టాలి.
దీపం
వెలిగించేందుకు
ఒక
నిప్పుపెట్టె
కూడా
ఉండాలి.
కనుక
ప్రమిద,
నూనె,
వత్తి,
నిప్పుపెట్టె—ఈ
నాలుగు
ఉండినప్పుడే
మనం
జ్యోతిని
వెలిగించగలం.
ఈ
జ్యోతి
బాహ్యమైన
చీకటిని
దూరం
గావిస్తుంది.
వత్తి
వెలిగే
కొలది
తైలం
కూడా
తరిగిపోతుంది.
ఈ
తైలం
అయిపోయేటప్పటికి,
వత్తి
కూడా
నిలిచిపోతుంది.
దీనినే
రామదాసు
చెప్పాడు—
“సారమైనది
చమురురా!
సత్యమైనది
వత్తిరా!
వెలుగు
తీరిపోయేటప్పుడు,
వెంట
ఎవ్వరు
రారురా!”
4
▾
Meaning
Keep
ఈ
వెలుగు
పోయేటప్పుడు
దాని
వెంట
వత్తిగాని,
తైలము
గాని
వెళ్ళవు.
అట్లే,
మన
అంతరంగమందుగల
చీకటిని
దూరం
గావించుకోవాలంటే,
దానికి
ఒక
ప్రమిద,
వత్తి,
నూనె,
అగ్గిపెట్టె
కావాలి.
మన
హృదయమే—
ఒక
ప్రమిద.
మన
మనస్సే—వత్తి,
ప్రేమయే—తైలం,
వైరాగ్యమే—నిప్పుపెట్టె,
ఈ
నాలుగు
చేరినప్పుడే—“ఆత్మజ్యోతి”
ప్రకాశిస్తుంది.
అప్పుడే-
“అజ్ఞానమ”నే
అంధకారం
దూరమౌతుంది.
ఈ
జ్యోతికి
రెండు
గుణములుంటున్నాయి.
ఒకటి:
చీకటిని
దూరం
చేయుట,
రెండవది:
నిరంతరము
ఊర్ధ్వ
గతికే
ప్రయాణం
చేయుట.
జ్యోతిని
గుంతలో
పెట్టినప్పటికీ
దాని
ప్రకాశం
పైకే
వస్తుంది
గాని,
క్రిందకు
పోదు.
కనుకనే
దీనిని
“ఊర్ధ్వమూలమును
చూపే
పవిత్రమైన
జ్యోతి”
అని
ఋషులు
వర్ణిస్తూ
వచ్చారు.
కనుక,
బాహ్యజ్యోతితో
పాటు
అంతర్జ్యోతిని
కూడా
అభివృద్ధి
గావించుకొనుటకు
ప్రయత్నించాలి.
ఆధ్యాత్మిక
జ్యోతి
మానవత్వమునకు
త్రికరణ
శుద్ధి
అత్యంత
ప్రధానమైనది.
దీనివలన
మన
యందు
ఒక
దివ్యమైన
తేజస్సు
ఆవిర్భవిస్తుంది.
త్రికరణశుద్ధి
కలిగిన
మానవుని
యందు
ఏమాత్రం
భయంగాని,
ఆందోళనగాని
ప్రవేశించవు.
కనుక,
అతనికి
ఏ
విధమైన
రక్షణ
కూడా
అవసరము
లేదు.
ఎక్కడ
తప్పో
అక్కడ
భయం,
ఎక్కడ
భయమో
అక్కడ
రక్షణ
కావాలి.
లోకంలో
అనేకమంది
సెక్యూరిటీని
(రక్షణ)
ఏర్పాటు
చేసుకొంటున్నారు.
సెక్యూరిటీ
ఎందుకోసం?
భయం
ఉండుట
చేత
సెక్యూరిటీ
అవసరం
కలుగుతుంది.
ఈ
భయం
ఎందుచేత
ఏర్పడుతుంది?
తప్పు
చేయుట
వలన
భయం
కలుగుతుంది.
తప్పు
చేయని
వానికి
భయమే
లేదు,
భయం
లేనివానికి
రక్షణ
అవసరంలేదు.
మానవుడు
దోషమయుడై
ఉండుటచేత,
నిరంతరము
భయంతో
క్రుంగిపోతున్నాడు.
ఈ
దోషములను
దూరం
గావించుకొన్నప్పుడు,
భయం
కూడా
మన
నుండి
దూరమౌతుంది.
ముందు
ముందైనా
ఈ
దోషాలలో
ప్రవేశించకుండా
ఉండుటకు
ప్రయత్నించాలి.
నిర్విరామ
కృషితో,
నిరంతర
తాపత్రయంతో,
అంతులేని
ఆశలతో,
అర్థం
కాని
ఆవేదనతో
అప్రాప్య
ప్రాప్తికై
ప్రాకులాడే
మానవుని
యందు
నిత్య
సత్యమైన
జ్యోతిని
వెలిగించునదే—“ఆధ్యాత్మికజ్యోతి”.
ఇదే
మానవునికి
ఒక
దివ్యమైన
“లైట్
హౌస్”
వంటిది.
సంసారమనెడు
నావ
నెక్కి
సంచారము
చేసే
ప్రతి
మానవునికి
ఈ
దివ్యజ్యోతి
అనేది
అత్యవసరము.
చక్కని
దిక్కును
చూపే
ఈ
దివ్యమైన
…
ఈ
లోకంలో
ప్రతి
మానవుడు
ఎన్ని
పదవులనేలినప్పటికిని,
ఎన్ని
సిరిసంపదలను
సంపాదించినప్పటికిని
నిజమైన
శాంతి
భద్రతలను
పొందుట
లేదు.
ఈనాటి
మానవుడు
అన్నింటిని
విశ్వసిస్తున్నాడు
గాని,
ఆత్మను
విశ్వసించుట
లేదు.
ఆత్మవిశ్వాసము
కోల్పోవుట
చేతనే
భారతదేశం
ఇన్ని
అవస్థలకు
గురియౌతున్నది.
ఒక
చిన్న
ఉదాహరణ:
ఈనాడు
మంగళవారం
అనుకుంటున్నాం.
అయితే,
ఈరోజు
మంగళవారమని
ఎవరు
నిర్ణయించారు?
తెల్లవారిలేచిన
తక్షణమే
ఈరోజు
“మంగళవారం
అని
బోర్డు
కట్టుకొని
వచ్చిందా?
కాదు,
కాదు.
క్యాలెండరు
బట్టి
ఈనాడు
మంగళవారం
అనుకొంటున్నాము.
ఈ
క్యాలెండర్‌ను
ఎవరు
నిర్ణయించారు?
ఒక
జోతిష్యశాస్త్ర
సిద్ధాంతి
నిర్ణయించాడు.
ఆ
సిద్ధాంతి
నిర్ణయించిన
విషయాలనే
మనం
విశ్వసిస్తున్నాము.
ఈ
జోతిష్యశాస్త్రము
ఎక్కడి
నుండి
వచ్చింది?
ఇది
“మనుశాస్త్రము”
నుండియే
ప్రారంభమైనది.
అయితే,
ఇట్టి
మనుశాస్త్రమును
ఎవ్వరూ
విశ్వసించుట
లేదు
గాని,
జోతిష్యశాస్త్రమును
మాత్రము
విశ్వసిస్తున్నారు.
ఆదిని
వదలి
మధ్యను
ఆధారంగా
పట్టుకొనుట
చేత
అనేక
విధాలైన
పాటు
పడుతున్నారు.
5
▾
Meaning
Keep
మానవజీవితం
అర్థ,
కామాల
కోసం
కాదు
పురుషార్థములు
నాలుగు:
ధర్మార్థ
కామ
మోక్షములు.
వీటిలో
మొదటిది
ధర్మం,
కడపటిది
మోక్షం.
నేటి
మానవులు
ఈ
రెండింటిని
విస్మరించి,
మధ్యనున్న
అర్థ,
కామాల
కొరకు
మాత్రమే
అఱ్ఱులు
చాస్తున్నారు.
అందుచేత,
ఈనాటి
మానవుని
జీవితం
“తల—తోక”
లేని
బ్రతుకుగా
ఉంటున్నది.
జీవితమంటే
ఏమిటి?
ఏదో
అన్న
పానాదుల
నిమిత్తమై
జీవితము
వచ్చినదని
భావిస్తున్నాము.
కాదు,
కాదు.
జీవితం
చాలా
విలువైనది,
పవిత్రమైనది.
మన
నిత్య
సత్యమైన
ఆత్మతత్త్వాన్ని
ప్రకటింప
జేసే
నిమిత్తమై
జీవితం
వచ్చింది.
మానవుడు
తాను
తరించే
నిమిత్తమై
తనువును
ధరించాడు
గాని,
ప్రపంచాన్ని
వరించే
నిమిత్తమై
కాదు.
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అనుభవించాలి.
ఆనంద,
సంతోషాల
వ్యత్యాసం
ఈనాడు
మనం
ఆనందం
కావాలని
ఆశిస్తున్నాము.
ఎట్టి
ఆనందము?
ఇది
తాత్కాలికమైనదా?
ఇది
తాత్కాలికమైనదైతే
“ఆనందము”
అని
పిలువబడదు.
శాశ్వతమైన
సుఖాన్ని
పొందినప్పుడు
కలిగేది
ఆనందము.
తాత్కాలిక
సుఖాన్ని
పొందినప్పుడు
కలిగేది
సంతోషం.
అందుచేతనే
దీనిని
“సమ్(some)-తోషం”
అంటున్నాము.
సమ్—అనగా
‘కొంచెం’
అని
అర్థము.
ఇట్టి
తాత్కాలికమైన
దానిని
శాశ్వతమైనదిగా
భ్రమించి
మనం
అందులో
మునిగిపోతున్నాం.
ఇదే
మనలో
ఉన్నటువంటి
దోషం.
ఆనందమనగా-
Bliss,
సంతోషమనగా-
Happiness.
ఈ
రెండింటి
మధ్య
చాలా
వ్యత్యాసమున్నది.
Happiness
అనేది
అప్పటికప్పుడు
మాత్రమే
తృప్తి
నిస్తుంది.
దీనికొక
ఉదాహరణ:
నీకు
ఆకలౌతున్నది.
నీవు
క్యాంటీన్‌కు
వెళ్ళి
రెండు
చపాతీలు
తింటే
తృప్తిని,
సంతోషాన్ని
పొందుతావు.
అయితే,
ఈ
సంతోషం
ఎంతసేపు
నిలుస్తుంది?
రెండు
గంటలు
మాత్రమే
నిలుస్తుంది.
తరువాత
మరల
ఆకలి
ప్రారంభమౌతుంది.
కనుక,
తాత్కాలికమైన
ఇట్టి
సంతోషాన్ని
కోరుకొనుట
మానవ
జీవిత
లక్ష్యము
కాదు.
శాశ్వతమైనటువంటి
సచ్చిదానందమును
కోరుకోవాలి.
త్రిగుణాత్మకమైన
తత్త్వం
సత్
-
చిత్
-
ఆనందము
ఈ
మూడు
వేరు
వేరు
కాదు.
దీనికొక
ఉదాహరణ:
అగ్నికి
మూడు
గుణములుంటున్నాయి,
ఒకటి:
ఎఱ్ఱని
రంగు,
రెండవది:
ప్రకాశము,
మూడవది:
కాల్చేశక్తి.
అయితే,
ఈ
మూడు
వేరు
వేరు
కాదు.
ఒకదాని
యందే
ఈ
మూడు
చేరి
ఉంటున్నాయి.
అట్లే,
మానవుని
యందు
సత్వరజస్తమో
గుణాలు
మూడు
ఇమిడి
ఉంటున్నవి.
ఇవి
మూడు
రకములైన
సన్నివేశములలో
వ్యక్తమౌతుంటాయి.
కాని,
ఈ
మూడు
ఒకరి
యందే
ఉంటున్నాయి.
అనగా
ఏమిటి?
నిత్యత్వమును
ప్రకటించే
సమయములో
“సత్”
నిరూపిస్తుంది,
పరిపూర్ణత్వాన్ని
ప్రకటించే
సమయములో
“చిత్”
నిరూపిస్తుంది.
ఈ
రెండింటి
కలయికయే—“ఆనందము”.
ఏ
రుచి
లేని
నీటిలోపల
తీయని
చక్కెర
కలిపినప్పుడు
లభించేది
చక్కెర
కాదు,
నీరు
కాదు,
పానకము
లభిస్తుంది.
అట్లే,
సత్-చిత్
రెండు
కలిసినప్పుడు
ఆనందము
ఆవిర్భవిస్తుంది.
కనుకనే,
మానవుడు
ఆనందమయుడు,
ఆనందపిపాసి.
ఏ
పని
చేసినా
ఆనందము
కావాలని
ఆశిస్తున్నాడు.
అయితే,
ఈ
ఆనందము
తేలికగా
లభించేది
కాదు.
మానవుడు
తన
తత్త్వాన్ని
తాను
గుర్తించినప్పుడే
ఆనందం
లభిస్తుంది.
నీలోనున్న
జ్యోతిని
వెలిగించు
ఈ
దీపావళి
అంతరార్థమేమిటంటే,
మానవుడు
క్షణక్షణం
విచారమనే
‘చీకటి’లో
మునుగుతున్నాడు.
చీకటిలో
ప్రవేశించినప్పుడు
జ్యోతిని
వెలిగించుకోవాలి.
నీవు
నిరంతరము
నీలో
ఉన్న
జ్యోతిని
వెలిగించుకోవాలి.
నీవు
ఎక్కడికి
వెళ్ళినా
నీలోని
ఆ
జ్యోతియే
నీకు
దారి
చూపిస్తుంది.
6
▾
Meaning
Keep
ఒక
చిన్న
ఉదాహరణ:
ఒక
“హరికెన్లాంతరు”
వెలుతురు
పదిగజాల
వరకు
ప్రసరిస్తుంది.
ఆ
లాంతరును
ఒక
చోటపెట్టి,
చీకటిలో
నీవు
10
మైళ్ళు
ప్రయాణం
చేయుట
సాధ్యం
కాదు.
కాబట్టి
నీతోపాటుగా
ఆ
లాంతరును
కూడా
ప్రయాణము
చేయించాలి.
అప్పుడెంత
దూరమైనా
ప్రయాణము
చేయగలవు.
అదేవిధముగా
నీ
యందుండిన
భగవద్విశ్వాసాన్ని
నీతో
పాటుగా
ప్రయాణము
చేయించాలి.
మానవత్వము
ఎందుకోసం
ప్రాప్తించింది?
కేవలం
పశు
పక్షి
మృగాదుల
వలె
జీవితాన్ని
అనుభవించుటకు
కాదు.
మనము
ఎందుకోసం
చదువుతున్నాము?
ఎందుకోసం
ఉన్నతస్థితికి
పోవాలని
ఆశిస్తున్నాము?
ఒక
ఆదర్శము
నందించేందుకే.
మనము
ఆనందమును
అనుభవించి,
పదిమందికి
పంచి
జగత్తుకు
అందించాలి.
ఇదే
ఆదర్శము.
విద్యార్థులు
ముఖ్యంగా
ఈ
విషయాన్ని
గుర్తించాలి.
కేవలము
స్వార్థ
స్వప్రయోజనములకై
ప్రాకులాడ
కూడదు,
హృదయాన్ని
విశాలము
గావించుకోవాలి.
అదే
నిజమైన
ప్రేమ.
మన
ప్రేమ
సంకుచితమైనదిగా
ఉండకూడదు,
విశాలమైనదిగా
ఉండాలి.
ఆ
ప్రేమతత్త్వమే
దివ్యత్వము.
ఆ
ప్రేమజ్యోతిని
వెలిగించుకుంటే
మనం
ఆనందాన్ని
పొందవచ్చును.
నీవు
ప్రేమికుడవు
కాకూడదు.
నీవే
ప్రేమగా
మారాలి.
నీవు
ప్రేమికుడవైతే
ఒకరినో,
ఇద్దరినో
ప్రేమించవచ్చును.
కాని,
నీవే
ప్రేమవైతే
ఈ
జగత్తునంతా
ప్రేమించవచ్చును.
కనుక,
నీవు
ప్రేమమయుడివి
కావాలి.
అహంకారమనే
అజ్ఞానాన్ని
దూరం
చేసుకోవాలి.
ఈ
అహంకారమే
అన్ని
విధములైన
అశాంతికి
మూలకారణం.
ఆనందాన్ని
పొందాలనుకుంటే
ప్రేమలో
మునిగిపోవాలి,
ప్రేమజ్యోతిని
వెలిగించుకోవాలి.
Previous
←
The Embodiment of Prema and the Principle of the Devī
Next
Human Values Come First in Education
→