Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · How to Win the Grace of God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
How to Win the Grace of God
23 November 1991, Sixty-sixth Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
“ప…ల
యందు
అనిశంబు
అత్యంత
అనురాగ
భోగ
భాగ్యములు
కలిగినట్టి—
భవ్యజనులు,
స్వపర
భేదములేక
సర్వజీవుల
యందు
సమభావమును
చూపించెడి—
సరసజనులు,
కష్టల
యందు
కరుణ
వహించి
దాతృత్వమును
జూపు—
ధన్యజనులు,
సంసార
ధర్మమునందు
సుజ్ఞానులై
పరుల
కాదర్శమును
నిరూపించు
జనులు
మున్నగు
వారందరు
భువిని
సత్కీర్తిని
గాంచి,
సన్మార్గములో
ప్రవర్తిస్తూ,
తోటి
వారలలోసదామేటి
వారలగుచు,
నిత్యమూ
ధర్మజిజ్ఞాసతో
ఉత్తమోత్తమమైన
వ్యక్తులుగా
రాణించెదరుగాక
!!”
ప్రేమస్వరూపులారా!
సమస్త
చరాచర
ప్రపంచమంతయు
ఒక్క
దివ్యత్వము
నుండియే
ఆవిర్భవించి,
దివ్యత్వమునందే
జీవించి,
ఆ
దివ్యత్వమునందే
లయమగుచున్నది.
సృష్టి
-
స్థితి
-
లయములకు
దివ్యత్వమే
మూలకారణం.
మానవుడు
సంకల్పం
నుండియే
ఆవిర్భవించి,
సంకల్పం
చేతనే
జీవించి,
కడకు
సంకల్పమునందే
లయమగుచున్నాడు.
“యద్భావం
తద్భవతి”.
కనుక
మానవ
జీవితం
సంకల్పముల
పైననే
ఆధారపడి
ఉంటున్నది.
ఎట్టి
సంకల్పమో-
అట్టి
చర్య,
ఎట్టి
చర్యనో-
అట్టి
ఫలం,
ఎట్టి
ఫలమో—
అట్టి
గమ్యం.
ఈ
విధంగా
మానవుని
గమ్యం
సంకల్పముల
చేతనే
కట్టుబడి
ఉన్నది.
ఉత్తమ
సంకల్పములను
అభివృద్ధి
పరచుకొని,
ఉత్తమ
జీవితమును
ఆదర్శవంతంగా
నిరూపించుకొని,
ఉత్తమ
ఫలితాన్ని
పొంది,
ఉత్తమ
గమ్యాన్ని
చేరుటకు
ప్రయత్నించాలి.
మానవ
జీవితం
గుణశీలములపైన
ఆధారపడి
ఉన్నది.
మానవుడనగా
ఆత్మధర్మమును
అనుసరించు
వాడేగాని,
ఇంద్రియధర్మమును
అనుసరించేవాడు
కాదు.
ఆత్మధర్మమే
మానవధర్మం,
ఇంద్రియధర్మమే
పశుధర్మం.
కనుక
మానవుడు
పశువు
వలెగాక,
పశుపతిగా
మారుటకు
తగిన
కృషి
చేయాలి.
మానవుని
యందు
ఆవిర్భవించ
వలసినది
ఈశ్వరభావమేగాని,
ప్రకృతి
భావము
కాదు.
ఈ
ప్రకృతినంతయు
ఈశ్వరస్వరూపంగా
భావించాలి.
ఈశ్వర
చైతన్యమునకు
సృష్టియే
ప్రధాన
చిహ్నం.
2
▾
Meaning
Keep
దీనినే
‘ప్రకృతి’
అంటారు.
కనుక,
ఈ
ప్రకృతి
యందు
ఆవిర్భవించిన
ప్రతి
మానవుడు
ఈశ్వరభావాలనే
కలిగియుండాలి.
ప్రతి
మానవుడు
కూడను
ఈ
ఈశ్వర
సృష్టిని
ప్రకటన
గావించే
నిమిత్తమై
తాను
మూర్తీభవించినవాడననేసత్యాన్ని
గుర్తించాలి.
మానవత్వం
దివ్యమైనది,
పవిత్రమైనది.
ఇది
జీవించతగినది.
ఈ
జగత్తునందు
ఇట్టి
మానవత్వమే
దివ్యత్వమనే
సత్యాన్ని
నిరూపించే
నిమిత్తమై,
అవతారములు
ఆవిర్భవించుచున్నవి.
దివ్యత్వమునందు
దివ్యత్వమే
ఆవిర్భవించాలి,
దివ్యత్వమే
ప్రతిబింబించాలి.
ప్రపంచానికి
దివ్యత్వమే
ఆధారం
దివ్యాత్మస్వరూపులారా!
దైవం
ఎక్కడో
లేడు.
మీరందరూ
దైవస్వరూపులే.
దీనిని
పురస్కరించుకొనియే—
“ఈశ్వరస్సర్వ
భూతానాం’
“ఈశావాస్యమిదం
సర్వం”
అన్నారు.
మానవుడు
అల్పమైన,
అనిత్యమైన,
అశాశ్వతమైన
ఈ
లోక
వాంఛలకు
కట్టుబడి,
విషయవాసనలకు
లోబడి
దివ్యమైన,
భవ్యమైన,
నవ్యమైన
మానవత్వాన్ని
వ్యర్థం
చేసికొంటున్నాడు.
ఈనాడు
లోకంలో
ఆధ్యాత్మికమునకు
భౌతికముతో
ఎట్టి
సంబంధం
లేదనియు,
ఈ
రెండింటికి
మధ్య
ఎంతో
వ్యత్యాసమున్నదని
భావిస్తున్నారు.
ఇది
కేవలం
వెఱ్ఱితనమని
చెప్పవచ్చును.
భౌతిక
ఆధ్యాత్మిక,
నైతిక,
లౌకిక,
ధార్మిక,
ఆర్థిక—
పరిస్థితులన్నింటి
యందు
ఆధ్యాత్మికము
అంతర్వాహినియై
ఉన్నది.
ఇట్టి
దివ్యమైన
అంతరార్థమును
మనమీనాడు
విస్మరిస్తున్నాం.
అసత్యమైన,
అనిత్యమైన
ఈ
విశ్వాన్ని
మనం
విశ్వసిస్తున్నాము.
ఈ
ప్రపంచం
కణకణమునకు
మార్పు
చెందునటువంటిదే.
మార్పు
చెందే
ఈ
ప్రపంచానికి
మార్పుచెందని
దివ్యత్వము
ఆధారమై
ఉన్నది.
ఇట్టి
ఆధార
తత్త్వాన్ని
లక్ష్యము
నందుంచుకొన్నప్పుడే—
ఆధేయములో
ఆనందాన్ని
అనుభవించుటకు
మనకు
అవకాశము
ఉంటుంది.
మనము
ఏ
కార్యమును
చేసినప్పటికిని,
ఏ
మార్గమునందు
ప్రవేశించినప్పటికిని
దివ్యభావము
చేతనే
కొనసాగించుటకు
ప్రయత్నించాలి.
ఈనాటి
మానవుడు
చెలిమిని,
బలిమిని,
కలిమిని
ఆశిస్తున్నాడేగాని,
గుణమును
ఆశించుట
లేదు.
గుణములేని
కలిమి,
బలిమి,
చెలిమి-
ఇవన్నియు
స్థిరమైనవి
కావు.
కనుక
మానవుని
యందు
ప్రధానంగా
ఉండవలసినది—
గుణం.
ఇట్టి
భావంచేతనే
దివ్యత్వాన్ని
స్మరిస్తూ
రావాలి.
సత్యమే
భగవత్
స్వరూపం
ప్రకృతి
వ్యర్థమైనదికాదు.
మానవుడు
అహంకార
మయమైనప్పుడు,
ఈ
ప్రకృతిశక్తి
కేవలం
వికృతిగా
మారుతుంది,
ఆత్మపరమైనప్పుడు
సుకృతంగా
రూపొందుతుంది.
కనుక
వికృతికిగాని,
సుకృతికిగాని
మానవుని
సంకల్పములే
మూలకారణం.
సర్వమూ
సత్యమునుండియే
ఆవిర్భవించినవి.
సత్యమే
భగవత్స్వరూపం.
సత్యమే
దివ్యమైనది.
అందుచేతనే—
“సత్యం
నాస్తి
పరోధర్మః”
అని
అన్నారు.
సమస్తము
సత్యముపైననే
ఆధారపడి
ఉంటున్నవి.
“ఈ
జగత్తంతయు
సత్యము
నుండియే
సృష్టింపబడినది.
సమస్త
సృష్టి
కూడను
సత్యమునందే
అణగియున్నది.
ఈ
జగత్తునందు
సత్యమహిమలేని
స్థలమే
కానరాదు.
ఇట్టి
శుద్ధ
సత్యాన్ని
పరికించండి”.
3
▾
Meaning
Keep
భారతీయ
సంస్కృతిని
గుర్తించు
మానవుడు
ఎన్ని
విద్యలు
నేర్చినప్పటికిని,
ఎంతటి
శ్రీమంతుడైనప్పటికిని,
ఎంతటి
అధికారం
చేపట్టినప్పటికిని
గుణము
లేకున్నచో
ప్రయోజనం
లేదు.
గుణములన్నింటియందు
దివ్యమైన
భగవత్
భావములతో
చేరిన
గుణమే
మానవత్వాన్ని
వికసింపజేస్తుంది.
ఇట్టి
దివ్యభావములను
గుర్తించినవారే
భారతీయులు.
కాని,
నేడు
భారతీయులు
తమ
సంస్కృతిని
విస్మరిస్తున్నారు.
“పరమ
పావనమైన
భారతావని
యందు
సహనము
కలిగియుండుటయే
మనకు
చక్కదనము,
వ్రతములన్నింటికంటె
మిన్నయైనట్టి
ఘనసత్యశీలమే
కఠినతపము.
మన
దేశమునందు
మాతృభావమునకు
మించిన
మధుర
భావమేమి
కలదు?
ఇట్టి
భవ్యభావాలతో
కూడియున్న
భారతీయ
దివ్యసంస్కృతి
యొక్క
తత్త్వాన్ని
గుర్తించుటకు
నేడెవ్వరూ
యత్నించుట
లేదు.
ఇంతకంటే
దౌర్భాగ్యమేమి
కలదు?
ప్రాణము
కంటే
మానమే
ఘనమని
బోధించే
మన
దేశనీతిని
మంటగలిపి,
పరదేశ
నీతులరసి
ఈనాడు
విచిత్రమైన
స్వేచ్ఛ
అనెడి
‘విచ్చుకత్తి’ని
మన
భారతీయులు
సంపాదించుకొన్నారు.
ఏనుగెట్టుల
తన
బలమెరుగలేదో-
అట్టులైనారు
మన
భారతీయులు
నేడు”.
మన
బలాన్ని
మనం
గుర్తించుకొనలేక,
పరుల
బలమునే
ఆధారంగా
జేసికొని,
పరుల
కాళ్ళపైన
ఆధారపడే
జీవితం
అస్థిరమైనది.
భారతీయుల
సంస్కృతి
స్వశక్తిపైన,
ఆత్మవిశ్వాసముపైన
ఆధారపడి
ఉన్నది.
ఆత్మవిశ్వాసమే
సమస్తమునకు
మూలకారణం.
ఈనాడు
భారతీయులు
ఆత్మవిశ్వాసాన్ని
కోల్పోవుటచేత,
ఇట్టి
దురవస్థలకు
గురికావలసి
వస్తున్నది.
ఆత్మ
విశ్వాసం
పెంచుకో
దివ్యాత్మస్వరూపులారా!
మీరే
ఆత్మస్వరూపులైయుండి,
మిమ్మల్ని
మీరు
విశ్వసించకపోవుటకు
మూలకారణం
మీలోని
బలహీనతయే.
నీ
తత్త్వాన్ని
నీవు
గుర్తించు.
అప్పుడే
నీ
యందు
నిజమైన
శక్తిసామర్థ్యాలు
ఆవిర్భవిస్తాయి,
వ్యక్తమౌతాయి,
ఆనందాన్ని
అందిస్తాయి.
కనుక,
ఈనాడు
మానవునకు
ఆత్మవిశ్వాసం
అత్యవసరం.
సమస్త
భోగములకు,
సమస్త
సిరిసంపదలకు
ఆత్మవిశ్వాసమే
మూలకారణం.
కనుక
ఆత్మవిశ్వాసాన్ని
మనం
అభివృద్ధి
పరచుకోవాలి.
ఈనాడు
ప్రపంచం
అనేక
విధములైన
అల్లకల్లోలముల
చేత,
అశాంతి
చేత
కుమిలిపోతున్నది.
ఇటువంటి
పరిస్థితిలో
మనం
చేయవలసిన
పని
ఏమిటి?
ఈ
అశాంతిని
దూరం
గావించే
శక్తి
మన
యందే
ఉన్నదా?
కేవలం
ఒక్క
వ్యక్తి
మాత్రమే
ఈ
అశాంతిని
దూరము
గావించగలడా?
అనే
బలహీనతకు
మనము
ఏమాత్రము
చోటివ్వకూడదు.
ప్రతి
భారతీయుడు
ఆత్మవిశ్వాసంతో
ముందంజ
వేసినప్పుడు,
ఒక్క
క్షణంలో
ఈ
అశాంతినంతటిని
దూరం
గావించవచ్చును.
నేడిట్టి
విశ్వాసాన్ని
కోల్పోవుట
చేతనే,
మనం
ముందంజ
వేయలేకపోతున్నాము.
ముఖ్యంగా
ప్రతి
మానవునకు
పరోపకార
దీక్ష
అత్యవసరం.
ప్రతి
మానవుడు
దైవాంశసంభూతుడే.
తోటి
మానవులపై
ప్రేమ
కలిగియుండనిచో—
అది
మానవత్వమే
కాదు.
కాబట్టి,
అందరూ
దైవసంతతికి
సంబంధించిన
వారనే
సత్యాన్ని
గుర్తించి,
సర్వులయందు
ప్రేమతత్త్వాన్ని
ప్రకటించి,
ప్రతి
మానవుడు
ఆదర్శప్రాయుడుగా
రూపొందాలి.
4
▾
Meaning
Keep
మన
భారతదేశంలో
సిరిసంపదలకు
ఏమాత్రం
కొదువలేదు.
మన
భారతదేశం
శ్రీమంతమైనది.
ఒకవేళ
ఈ
దేశం
దరిద్ర
దేశమై
ఉండినచో,
పూర్వం
తురుష్కులుగాని,
ఫారసీకులుగాని,
బ్రిటీషువారుగాని
ఈ
దేశంపై
దండెత్తి
వచ్చెడివారు
కాదు.
ఈ
దేశం
సిరిసంపదలతో
తులతూగుచున్నది
కనుకనే,
విదేశీయులందరికీ
మన
దేశంపై
కన్నుపడింది.
ఇట్టి
పవిత్రమైన
భారతదేశాన్ని
మన
భారతీయులే
బీదదేశముగా
భావించి,
దీనిని
చిన్నబుచ్చుచున్నారు.
దీని
వలన
కలిగే
ప్రమాదం
ఒకటున్నది.
అది
ఏమిటంటే—
మనయందు
ఒక
విధమైన
అవిశ్వాసమనేది
అభివృద్ధి
కాగలదు.
మనయందున్న
తిరోగతిని
పురోగతి
గావించినప్పుడే,
మన
జీవితం
ఉత్తమ
గతిని
పొందుతుంది,
లేనిచో
మానవ
జీవితమే
అధోగతి
పాలౌతుంది.
ధన
కనక
వస్తు
వాహనాదులు
మనకు
ముఖ్యం
కాదు.
ఇవన్నియు
కదిలిపోయే
మేఘముల
వంటివే.
గుణమే
మనకు
నిత్య
సత్యమైన
సంపద.
అట్టి
గుణసంపదను
మనము
అభివృద్ధి
గావించుకోవాలి.
ఆస్పత్రి
నిర్మాణంలో
గల
అంతరార్థం
పరోపకార
సంబంధమైన
గుణమే
మానవుని
దివ్యత్వాన్ని
ప్రకాశింపజేస్తుంది.
కనుక
వ్యక్తులకుగాని,
సమాజమునకుగాని,
దేశమునకుగాని,
ప్రభుత్వమునకుగాని,
ఆదర్శాన్ని
నిరూపించే
నిమిత్తమై
స్వామి
చిన్న
విషయములు
మొదలుకొని,
పెద్ద
పెద్ద
కార్యములను
ప్రారంభిస్తున్నాడు.
పూర్వం
ఈ
పుట్టపర్తి
జనాభా
200
మంది
మాత్రమే.
ఇలాంటి
కుగ్రామంలోనే
ఒక
“యూనివర్సిటీ”
ప్రారంభం
కావటం
కలలోని
వార్త.
ఎన్నో
ముఖ్య
పట్టణములలో
లేని
“ఎయిర్పోర్ట్”
ఈ
కుగ్రామంలో
ఏర్పడుట
మరొక
విచిత్రం.
యావత్ప్రపంచానికే
ఈ
పుట్టపర్తి
ఒక
ప్రధానమైన
కేంద్రంగా
రూపొందుతున్నది.
సర్వ
సౌకర్యములున్న
పట్టణములందు
ప్రారంభించవలసిన
ఈ
పెద్ద
“హాస్పిటల్”ను
ఈ
కుగ్రామమునందే
ప్రారంభించుటకు
గల
కారణమేమిటని
మీరు
విచారించాలి.
శ్రీమంతులైనవారు,
ధనమున్నవారు
ఎక్కడికైనా
వెళ్ళి
ఎన్ని
లక్షలైనా
ఖర్చు
పెట్టుకొని
రోగ
నివారణ
గావించుకోవచ్చు.
కాని
పేదవారు
వైద్యసౌకర్యముల
నిమిత్తమై
గ్రామాన్ని
వదలి
దూర
ప్రాంతాలకు
పోలేరు.
అట్టి
గ్రామ
ప్రజల
క్షేమమును
పురస్కరించుకొనియే
ఈ
పెద్ద
ఆసుపత్రి
పల్లెయందే
ప్రారంభించుట
జరిగినది.
“మొట్టమొదట
పల్లెలలో
ఉన్నవారి
గుండెజబ్బులను
ప్రత్యేకంగా
చూడండి”
అని
మా
డాక్టర్లకు
చెప్పాను.
ఈనాడు
ఒక
శుభవార్తను
ప్రకటించవలసియున్నది.
మన
భారతదేశ
ప్రధాన
మంత్రి
ఆసుపత్రిని
ప్రారంభించిన
తరువాత
15
ని॥లలో
మన
డాక్టర్లు
“ఆపరేషన్”
చేయుటకు
ప్రారంభించినారు.
3గం॥ల
లోపల
నాలుగు
పెద్ద
ఆపరేషన్లు
జరిగాయి.
ఒకటి
చాలా
జటిలమైన
గుండె
ఆపరేషన్.
ఆ
వ్యక్తి
గుండెకు
రంధ్రము
ఉండియున్నది.
అటువంటి
ఆపరేషన్
కూడా
విజయవంతంగా
జరిగింది.
అందరూ
క్షేమంగా
ఉన్నారు.
5
▾
Meaning
Keep
రోగనివారణయే
మా
సంకల్పం
మా
ఉద్దేశ్యంలో
మొట్టమొదటగా
ప్రధానమైనది
గుండె.
దానిపైన
ఊపిరితిత్తులు.
మూడవది
మూత్రపిండములు,
తరువాత
మెదడు—
ఈ
నాల్గింటికి
ప్రత్యేకమైన
ప్రాధాన్యతనిచ్చి,
పల్లెలవారికి
వీటికి
సంబంధించిన
రోగములను
పూర్తిగా
నివారణ
గావించాలనే
ఉద్దేశ్యంతోనే
ఈ
ఆసుపత్రిని
ప్రారంభించాము.
అయితే,
మాకు
పల్లెప్రజలు,
పట్టణప్రజలు
అనే
భేదం
లేదు.
రోగం
పల్లెప్రజలనే
వరించి,
పట్టణ
ప్రజలను
వరించకుండాపోదు.
రోగములకు
ఇట్టి
వ్యత్యాసమేలేదు.
కనుక,
మాకు
కూడను
రోగనివారణ
యందు
ఎట్టి
వ్యత్యాసం
లేదు.
పల్లెలవారు
గాని,
పట్టణములవారు
గాని—
ఎవ్వరికైనా
రోగనివారణ
గావించుటయే
మా
సంకల్పం.
ఈనాడు
ఆసుపత్రులన్నీ
వ్యాపార
సంస్థలుగా
రూపొందుతున్నాయి.
కొంతమంది
పది
కోట్లు
ఖర్చుపెట్టి
ఆసుపత్రి
ప్రారంభించారంటే
నూరు
కోట్ల
ఆదాయం
వారి
హృదయంలో
ఉంటుంది,
ఇలాంటి
స్వార్థ
స్వప్రయోజనాల
కొరకు
ఈ
ఆసుపత్రులను
ప్రారంభిస్తున్నారు.
కాని,
సాయి
యందు
కాలి
మొదలు
తల
వెంట్రుక
వరకు
నిస్వార్థమే
-
నిస్వార్థమే.
సాయి
యందు
ఏమాత్రము
స్వార్థము
లేదు,
ఇలాంటి
సత్యాన్ని
గుర్తించడానికి
ఎవ్వరూ
ప్రయత్నించుట
లేదు.
ఆరోగ్యమే
మహాభాగ్యం
ప్రపంచంలో
మనం
ఎట్టి
కార్యమును
ప్రారంభించవలెనన్నను
శరీరం
అత్యవసరం.
“శరీర
మాద్యం
ఖలు
ధర్మ
సాధనం”.
సర్వ
కర్మలకు
శరీరమే
మూలకారణం.
ఈ
శరీరం
ఆరోగ్యవంతంగా
ఉండినప్పుడే,
ఎట్టి
కార్యములనైనా
మనము
చేయగలము.
మానవుడు
“ధర్మార్థకామమోక్షములు”
అనే
చతుర్విధ
పురుషార్థములతో
కూడియున్నాడు.
“ధర్మార్థకామమోక్షాణాం
ఆరోగ్యం
మూలముత్తమం”.
మనం
ఏ
కార్యములో
ప్రవేశించవలెనన్ననూ
ఆరోగ్యం
అత్యవసరం.
కనుక,
“ఆరోగ్యమే
మహాభాగ్యమ”ని
భావించి,
ఇట్టి
ఆరోగ్యాన్ని
అందించే
నిమిత్తమై
మేము
ఇలాంటి
సంస్థలను
ప్రారంభిస్తూ
వస్తున్నాము.
అయితే,
ఆరోగ్యముగా
ఉండుటచేత
ప్రయోజనమేమి?
ఈ
ఆరోగ్యవంతమైన
దేహం
చేయవలసిన
కార్యములలో
ప్రవేశించాలి.
దుర్మార్గములో
ప్రవేశించే
శరీరము
ఉండినను
ప్రయోజనం
లేదు.
ఈ
ప్రపంచములో
శరీరాన్ని
ధరించినందుకు
దానికి
సరియైన
సార్థకతను
పొందాలి.
ఐదు
నెలలలో
ఐదేళ్ళ
ప్రాజెక్టు
పూర్తి
ఈ
ఆసుపత్రి
కట్టిన
విధానాన్ని
కూడా
మనం
కొంత
విచారించాలి.
L.
&
T.
Brothers
ఎన్నో
కట్టడాలను
నిర్మింపజేసారు.
మన
దేశమునందేగాక
విదేశములందు
కూడా
వారి
ప్రభావం
ఎంతో
ఉంటున్నది.
కాని,
వారు
ఎన్నో
చోట్ల
కట్టడాలను
నిర్మింపజేసినప్పటికీ,
ఇక్కడ
పని
చేసిన
పనివాళ్ళ
ఆనందాన్ని
వారు
ఎక్కడా
చూసి
ఉండలేదు.
ఆనందంతో,
ఉత్సాహంతో
ప్రతి
చిన్న
పనివాడు
కూడా
పదిమంది
చేయవలసిన
పనిని
ఒక్కడే
చేస్తూ
వచ్చాడు.
పనివారందరూ
శ్రద్ధాభక్తులతో
ఈ
కార్యంలో
ప్రవేశించారు.
నేను
‘మే’
నెలలో
కొడైకెనాల్
నుండి
వచ్చినతరువాతనే
ఈ
కార్యమును
ప్రారంభించాం.
6
▾
Meaning
Keep
Also in his talks
(7)
19 June 1989
The one who sways is the jīva; the one who does not sway is God
27 January 1990
Live in Love
17 February 1990
Prema itself is God
2 June 1990
Ascent Of Man
20 February 1992
Man, thinking he is the body, is drifting away from Ānanda
14 January 1996
There is no wealth greater than Prema
22 February 2001
God's grace comes only through the right use of the senses
ఈ
ఐదు
నెలలలోనే
5
సం॥ల
ప్రాజెక్టును
పూర్తి
చేసారు.
ఇది
చాలా
పెద్ద
ప్రాజెక్టు.
ఈ
ప్రాజెక్టు
వేయి
సంవత్సరములకు
సరిపోవునటువంటిది.
ఇంక
భవిష్యత్తులో
ఉత్తరోత్తరా
దీనిని
ఎవ్వరూ
అభివృద్ధి
చేయనక్కరలేదు.
భగవత్
సృష్టిలో
అష్టశక్తులు
ప్రేమస్వరూపులారా!
ఈ
ప్రపంచమంతా
పరమాత్ముని
ప్రతిస్వరూపమే.
అష్టైశ్వర్యస్వరూపుడైన
భగవంతుడు
అష్టశక్తులచేత
సృష్టినంతయు
వ్యాపించి
ఉన్నాడు.
మానవునకు
ప్రధానమైనది,
ప్రాణముతో
సమానమైనటువంటిది—
జలం.
ఈ
భూమండలము
రెండింట
మూడు
భాగములు
జలముతో
నిండి
యుంటున్నది.
ఉపనిషత్తులు
ఈ
జలమును
“జీవం”
అని
అంటున్నాయి.
కనుక
జలస్వరూపుడైనవాడు
పరమాత్ముడే.
రెండవది
అగ్ని.
ఈ
అగ్ని
ప్రతిమానవుని
ఉదరమునందు
‘జఠరాగ్ని’గా
ఉంటున్నది.
ఈ
జఠరాగ్నియే
లేకుండిన
మానవుడు
భుజించిన
ఆహారం
జీర్ణింపబడి,
ఆ
రసస్వరూపం
సర్వాంగములకు
పంపబడే
అవకాశమే
ఉండదు.
మానవుని
యందున్న
రక్తము,
కండరములు
మొదలగునవన్నియు
రసస్వరూపమైనవే.
కనుకనే
భగవంతుని—
“అంగీరసాయనమః”
అన్నారు.
ప్రతి
అంగమునందు
రసస్వరూపుడుగా
ఉండుటచేత,
అతనికి
“రసస్వరూపుడు”
అని
పేరు.
ఈ
అంగీరసుడు
అగ్నిస్వరూపుడు.
మూడవది—
భూమి.
ఈ
భూమి
యందే
సమస్త
సృష్టి
-
స్థితి
-
లయములు
జరుగుతున్నవి.
మానవునికి
కావలసిన
ఆహార
సదుపాయములన్నీ
భూమి
నుండియే
ఆవిర్భవించుచున్నవి.
ఈ
భూమి
మానవునికి
సరియైన
ఆనందాన్ని
అందించే
స్వరూపం.
కనుక,
భూమి
కూడను
భగవత్స్వరూపమే.
వాయువు
ప్రాణమునకు
ఆప్తమిత్రుని
వంటిది.
ప్రతిమానవుడు
ఉచ్ఛ్వాస—
నిశ్వాసముల
చేత
గాలిని
అనుభవిస్తున్నాడు.
ఈ
గాలిని
పీల్చుకొనే
సమయములో
‘సో…’
అనియు;
విడిచిపెట్టే
సమయములో
‘హం…’
అనియు
అంటున్నాము.
“సో…హం”
ఈ
రెండింటి
యందే
మానవత్వము
ఇమిడి
ఉంటున్నది.
దీనినే
పోతన
ఈ
విధంగా
చెప్పాడు—
“పలికెడిది
భాగవతమట
పలికించెడి
‘వాడు’
రామ
భద్రుండట
‘నే’
పలికిన
భవహర
మగునట”
‘నే-వాడు’
ఈ
రెండు
పదములనే
పోతన
ఇందులో
అమర్చాడు.
పలికించెడిది-వాడు,
పలికెడిది-నేను.
సంస్కృతమునందు
‘వాడు’
అనే
పదమును
‘సః’
అనియు,
‘నేను’
అనే
పదమును
‘అహం’
అనియు
అన్నారు.
ఈ
రెండూ
చేరినప్పుడు,
‘సః
+
అహం=సోహం’
అని
మారిపోయింది.
కనుక,
వాయుతత్త్వము
మనకు
ఏమి
బోధిస్తున్నదంటే—
‘నేను
వాడే’
అనే
సత్యాన్ని
నిరూపిస్తున్నది.
అనగా,
‘నేనే
దైవం’
అనే
పరమ
పవిత్రమైన
ఏకత్వాన్ని
ప్రబోధిస్తున్నది.
ఈ
వాయువు
మన
యందు
దినమునకు
21,600
పర్యాయములు
సంచరిస్తున్నది.
ఈ
వాయుస్వరూపమే
మన
యందు
లేకపోతే
మన
జీవితమే
వ్యర్థమైపోతుంది.
7
▾
Meaning
Keep
కనుక
వాయుస్వరూపము
కూడా
భగవంతుడే.
ఐదవది
ఆకాశం.
ఈ
పంచభూతములకు
అవకాశం
కల్పించేదే
ఆకాశం.
పంచభూతములన్నియు
ఆకాశము
నుండియే
ఆవిర్భవించినవి.
ఆకాశం
శబ్ద
స్వరూపం,
శబ్దం
బ్రహ్మస్వరూపం.
“శబ్ద
బ్రహ్మమయి,
చరాచరమయి,
జ్యోతిర్మయి,
వాజ్మయి,
నిత్యానందమయి,
పరాత్పరమయి,
మాయామయి,
శ్రీమయి”—
ఈ
అష్టశక్తులందు
మొట్టమొదటిది
శబ్ద
బ్రహ్మమయి.
సర్వత్రా
వ్యాపించియున్నది
శబ్దమే.
ఆకాశం
ఎక్కడున్నదంటే,
పైన
ఉన్నదని
చూపిస్తున్నాం.
కాదు,
కాదు.
శబ్దం
ఎక్కడ
ఉన్నదో,
అక్కడ
ఆకాశం
ఉన్నది.
సర్వ
అవకాశములను
చేర్చుకొనేది
ఆకాశం.
కనుక,
ఇది
భగవత్
స్వరూపమే.
ఇంక
ఆరవది
సూర్యుడు.
ఇతడు
ఉష్ణస్వరూపుడు.
ఈ
ఉష్ణము
ఏరీతిగా
ఆవిర్భవిస్తున్నది?
సూర్యుని
యందున్న
హైడ్రోజను
హీలియంగా
మారేటప్పుడు
ఉష్ణం
ప్రారంభమౌతున్నది.
ఇది
వైజ్ఞానిక
ధర్మం.
దీని
తత్త్వం
ఏవిధంగా
ఉన్నదని
విచారణ
చేస్తే—
ఒక
సెకెనుకు
సూర్యునిలో
ఉండిన
ఉష్ణం
4
వేల
లక్షల
టన్నుల
శక్తిని
కోల్పోతున్నది.
అయినప్పటికిని
ఇంకా
కొన్ని
వేల
మిలియన్ల
సంవత్సరముల
వరకు
ఈ
సూర్యుడు
ఉష్ణాన్ని
అందిస్తుంటాడు.
ఇతని
శక్తి
అట్టిది,
ఇట్టిది
అని
ఎవ్వరూ
చెప్పలేరు.
కనుక
భగవంతుడు
అవాజ్మానస
గోచరుడు.
అతని
నుండియే
సర్వమూ
ఆవిర్భవిస్తున్నది.
ఈ
సూర్యుడు
బుద్ధికి
అధిపతి.
మానవునికి
బుద్ధి
అత్యవసరం.
మానవుని
బుద్ధిని
ప్రకాశింపజేసేవాడే
సూర్యుడు.
ఇంక
ఏడవది
చంద్రుడు.
ఈ
చంద్రుడు
మనస్సునకు
అధిపతి.
ఇతడు
మనస్సు
ద్వారానే
ప్రశాంతమైన
భావాలను
అభివృద్ధి
గావిస్తూ
వస్తున్నాడు.
మనస్సు
యొక్క
స్వరూపమే
ఈ
ప్రపంచము.
“మనోమూలమిదం
జగత్”.
మనస్సే
లేకపోతే—
జగత్తే
లేదు.
నీవు
ఇక్కడ
ఉండినంతవరకు
నీ
దేహము
ఇక్కడ
ఉన్నదిగాని,
నీమనస్సు
ఒక్క
క్షణంలో
హైదరాబాద్,
ఢిల్లీ
నగరాలకు
ప్రయాణం
చేయగలదు.
కనుక,
మనో
వేగమునకు
మించిన
వేగము
మరొకటి
లేదు.
కాంతి
వేగముకంటే,
మనో
వేగం
అత్యంత
అధికమైనది.
ఎనిమిదవది
కర్మశక్తి.
ఈ
కర్మ
కూడను
భగవత్స్వరూపమే.
“మానవుడు
కర్మ
చేతనే
జన్మించును,
వృద్ధిపొందును.
తిరిగి
కర్మచేతనే
మరణించును.
ఈ
కర్మ
మానవునకు
ప్రాణం
వంటిది.
ఈ
ప్రపంచములో
మన
సుఖ-దుఃఖములకు
మూలకారణం
ఈ
కర్మయే”.
దీనికే
ప్రాచీన
ఋషులు
“యజ్ఞం”
అని
పేరు
పెట్టారు-
“యజ్ఞోవైవిష్ణుః”.
ఈ
యజ్ఞమే
విష్ణుస్వరూపం,
ఆ
విష్ణుస్వరూపమే
విశ్వం.
కనుక
ప్రపంచమంతయు
అష్టైశ్వర్యస్వరూపుడైన
భగవంతుని
యొక్క
సృష్టియే
అని
గుర్తించాలి.
పంచభూతముల
దుర్వినియోగమే
దుఃఖానికి
మూలకారణం
ఈనాటి
మానవుడు
ఈ
పంచభూతములను
సక్రమమైన
మార్గములో
వినియోగించుకొనుటలేదు.
అందుచేతనే
మానవుడు
అనేక
దుఃఖములకు
గురియౌతున్నాడు.
8
▾
Meaning
Keep
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధాదులను
దుర్వినియోగ
పరచుకొంటున్నాడు.
భగవంతుడు
ప్రసాదించిన,
భగవత్స్వరూపమైన
ఈ
పంచభూతములను
దుర్వినియోగ
పరచుటచేత,
భగవదనుగ్రహానికి
దూరమై
భగవదాగ్రహానికి
సమీపమౌతున్నాడు.
కనుకనే,
పంచభూతములు
మానవుని
అసహ్యించుకొంటున్నాయి.
నేటి
మానవుని
నుండి
వెలువడే
శబ్దములన్నీ
దుశ్శబ్దములే.
నిరంతరం
పరదూషణ,
పరనిందలో
కాలం
గడుపుతున్నాడు.
ఇవేనా
మానవుడు
పలుకవలసినది?
కాదు,
కాదు.
మానవుని
స్వరూపం
చాలా
దివ్యమైన,
నవ్యమైన,
ఆనందమైన
స్వరూపమని
నిరూపించాలి.
ఈనాడు
మానవుని
దృష్టి
యంతయు
మలినమైనదిగా
ఉంటున్నది.
దుర్భావాలతో
కూడి
ఉంటున్నది.
నేటి
మానవుని
శ్రవణం
సరియైనదిగా
లేదు.
మానవుని
వినికిడి
శక్తి
ఏమంటున్నది?—
“ఓ
చెవులారా!
పొద్దుపోక
ఊరివారి
సుద్దులు
వినాలంటే,
కడు
శ్రద్ధతోడ
మీరు
సిద్ధమౌతారెందుకు?
ముద్దుముద్దుగా
భగవత్
ముచ్చటలను
ఎవరైనా
చెప్పేటప్పుడు
మీరు
ఒద్దికగా
ఉండరెందుకు?”
చెడ్డమాటలు
వినాలనుకుంటే,
రెండు
చెవులు
శ్రద్ధగా
చేరి,
ఐకమత్యంగా
వింటాయి.
ఐతే,
మంచిమాటలు
వినాలనుకుంటే,
ఒక
చెవి
ఒకవైపు,
రెండవ
చెవి
రెండవవైపు
వెడతాయి.
ఈ
చెవులు
తమ
కర్తవ్యాన్ని
విస్మరించి,
దుర్మార్గములో
ప్రవేశించుట
చేత
మానవుని
మనస్సంతా
మాలిన్యమైపోతున్నది.
మనము
పీల్చే
గాలి
కూడా
కల్మషంగా
ఉంటున్నది.
వాతావరణం
మలినంగా
మారిపోతున్నది.
మలినమైన
గాలిని
పీల్చుట
చేత,
మనలో
మలినమైన
భావాలే
ఆవిర్భవిస్తున్నవి.
కనుక
ఈ
పంచభూతములను
దుర్వినియోగ
పరచుటయే
మన
కష్టములకు,
దుఃఖములకు
మూలకారణం.
ఎట్టి
విద్యలు
నేర్చుకోవాలి?
ఈనాడు
హృదయాన్ని
మాలిన్యపరచే
విద్యలనే
మానవుడు
నేర్చుకొంటున్నాడు.
“నేటి
మానవులు
మంచి
పదవులను,
మంచి
బ్రతుకును
కోరుకొనుచున్నారేగాని—
మంచి
బుద్ధులను,
మంచి
నడతను
కోరుకొనుటలేదు.
ధన
ప్రాముఖ్యము
అధికమైపోయినది,
ధర్మచింతన
క్షీణించిపోయినది.
నేటి
విద్యల
మూలంగా
జరుగుచున్న
ప్రోగ్రెస్సు(అభివృద్ధి)
ఇదే”.
“నీతి-నియమాలు
గ్రంథాల
వరకే
పరిమితమైపోయినవి.
మానవ
హృదయాలు
మాలిన్య
సదనములుగా
మారిపోయినవి.
మానవుల
చేతలన్నియు
స్వార్థపూరితమైపోయినవి.
నేటి
విద్యల
మూలంగా
జరుగుతున్న
ప్రోగ్రెస్సు
ఇదే”.
మనం
నేర్వవలసిన
విద్యలు
ఇట్టివి
కావు.
ఈనాడు
మానవుడు
స్వార్థ
స్వప్రయోజనాలను
అభివృద్ధి
పరచే
విద్యలను
అభ్యసిస్తున్నాడు.
మనము
పవిత్రమైన,
పరోపకార
సంబంధమైన
విద్యను
నేర్చుకోవాలి.
మానవులందు
ఏకత్వాన్ని
సాధించే
విద్యలను,
దివ్యమైన
ఆత్మస్వభావాన్ని
నిరూపించే
విద్యలను
నేర్చుకోవాలి.
9
▾
Meaning
Keep
ఈనాడు
సరియైన
విద్యావంతుడెవ్వరూ
నా
దృష్టిలో
కనిపించుట
లేదు.
అందరూ
అవిద్యా
శిఖామణులే.
కేవలం
పుస్తకాలను
చదువుతున్నారు,
వ్రాస్తున్నారు.
ఈ
విధంగా
చదివి,
వ్రాయ
నేర్చిన
వారంతా
విద్యావంతులు
కారు.
కాలేజీ
డిగ్రీలను
పొందిన
వారంతా
విద్యావంతులు
కారు.
సుజ్ఞానం,
సుకృతం
అందించని
విద్యలు
సద్విద్యలు
కావు.
“బ్రతుకుటకే
విద్యయన్నచో,
బ్రతుకుట
లేదె
పశుపక్ష్యాదులు”.
ఈనాడు
కేవలం
జీవనోపాధి
నిమిత్తమై
విద్యలు
నేర్చుకొంటున్నారు.
కాని,
జీవితపరమావధిని
గుర్తింపజేసే
విద్యలను
నేర్వాలి.
జీవనోపాధి—
జీవితపరమావధి
ఈ
జీవిత
పరమావధి,
జీవనోపాధి
అనగా
ఏమిటి?
దీనికొక
చిన్న
ఉదాహరణః
ఒక
సైంటిస్టు
ప్రయోగ
శాల
(Laboratory)
కు
వెళ్ళి
“రెండు
భాగాలు
హైడ్రోజను,
ఒక
భాగం
ఆక్సిజన్లను
కలిపితే
నీరు
తయారౌతుంది”
అని
నీరు
తయారయ్యే
విధానాన్ని
గురించి
బోధిస్తాడు.
ఇది
జీవనోపాధి.
అయితే,
ఈ
ఏర్పడిన
కొద్ది
జలాన్ని
అందరూ
సమంగా
ఏరీతిగా
పంచుకోవాలి
అనే
సమత్వాన్ని
బోధించుటయే
—
జీవిత
పరమావధి.
కనుక,
నీరును
సృష్టించుట
జీవనోపాధిగా
ఉంటున్నది,
ఆ
సృష్టించిన
జలాన్ని
సమానంగా
అందరికి
పంచే
సమభావమే
జీవితపరమావధిగా
ఉంటున్నది.
ఈ
రెండింటి
ఏకత్వము
చేతనే
మానవత్వము
దివ్యత్వముగా
మారిపోతుంది.
నీరు
సృష్టించినప్పటికిని,
త్రాగేవారు
లేకపోతే
ఏమి
ప్రయోజనం?
గుణమే
నిజమైన
శృంగారం
ప్రేమస్వరూపులారా!
“ఆకాశానికి
చంద్రుడే
శృంగారం.
సముద్రానికి
అలలే
శృంగారం.
ఊరికి
ఇళ్ళు
శృంగారం.
కొలనుకు
తామర
పుష్పమే
శృంగారం.
అదే
విధంగా
మానవునకు
గుణమే
శృంగారం”.
ఈ
గుణము
లేకుండా
ఎంత
అలంకారము
చేసుకొన్నప్పటికీ,
ప్రయోజనం
లేదు.
భగవంతుడిచ్చిన
శృంగారమే
నిజమైన
శృంగారముగా
విశ్వసించాలి.
God
is
beauty
(భగవంతుడు
సుందర
స్వరూపుడు).
అట్టి
భగవంతుడిచ్చిన
శృంగారము
పైన
వేరొక
అలంకరణలెందుకు
వేసుకోవాలి?
తెల్లగా
ఉన్నవారు
“ఫేస్పౌడరు”
ఎందుకు
ఉపయోగించాలి?
గుణమే
నిజమైన
శృంగారం.
కనుక,
నిజమైన
శృంగారము
మన
దగ్గర
ఉన్నప్పుడు
కృత్రిమమైన
శృంగారాలు
మనకు
అవసరం
లేదు.
ఈనాడు
మనకు
శరీరం
అత్యవసరం.
ఈ
శరీరాన్ని
సద్వినియోగ
పరచుకొనుటకు
సద్గుణములు
అత్యవసరం.
ఈ
రెండింటిని
చక్కగా
కలిగియుంటే,
మనం
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అనుభవించవచ్చును.
ఈ
జగత్తునకే
ఆదర్శప్రాయులుగా
రూపొందవచ్చును.
దేహమే
ప్రధానంగా
భావించుకొని,
గుణమును
విస్మరించినప్పుడు
మన
జీవితమే
వ్యర్థమైపోతుంది.
మానవ
జన్మ
అతి
దుర్లభమైనది.
కనుకనే—
“జంతూనాం
నరజన్మ
దుర్లభం”
అన్నారు.
ఇంత
విలువైన,
పవిత్రమైన
మానవ
జన్మను
మనం
కేవలం
“మసిబొగ్గుల”
కొరకు
అమ్ముకొంటున్నాం-
“మాణిక్యము”నకై
అమ్ముకోవాలి.
10
▾
Meaning
Keep
ఇట్టి
మానవ
జీవితంలో
దుర్గుణాలు,
దురాలోచనలు
దూరం
గావించుకొని,
సద్భావములను,
సదాచారములను
మనము
అభివృద్ధి
గావించుకొన్నప్పుడు,
దేశం
నిత్యకళ్యాణం
పచ్చతోరణంగా
వుంటుంది.
అందరూ
నాకు
సమానమే
ప్రేమస్వరూపులారా!
ప్రతి
ఒక్కరు
తెల్లవారి
లేచినదిమొదలు
రాత్రి
పరుండు
వరకూ—
“లోకాస్సమస్తా
స్సుఖినో
భవంతు”
అని
ప్రార్థించండి.
‘నేను-నా
వారు’
అనే
సంకుచితభావాలను
త్రుంచివేసి,
అందరూ
సుఖముగా
ఉండాలని
కోరుకోండి.
అందరూ
బాగున్నప్పుడే,
నీవు
కూడా
బాగుంటావు.
నీ
క్షేమమంతయు,
నీ
ఆనందమంతయు
సమాజంపైననే
ఆధారపడి
ఉంటున్నది.
సమాజ
క్షేమానికి,
ఆనందానికి
మనం
కృషి
చేయాలి.
సమాజ
క్షేమాన్ని
మనము
ఆశించాలి.
నిన్ను
ద్వేషించేవారిని
కూడా
నీవు
ప్రేమించు.
అదే
సాయి
నిరూపిస్తున్న
ఆదర్శం.
నిజం
చెప్పాలంటే,
ఈ
ప్రపంచంలో
నాకు
అయిష్టమైనవారు
ఎవ్వరూ
లేరు.
నేనంటే
వారికి
అయిష్టము,
ద్వేషము
ఉండవచ్చును.
“అందరూ
నాకు
సమానమే.”
ఈ
సమత్వాన్ని
కొంతైనా
మీరు
సాధించండి.
“భగవంతుడు
దయాస్వరూపుడు,
కరుణా
సముద్రుడు,
ప్రేమ
స్వరూపుడు
అంటారు,
అయితే
నా
కష్టాలను,
నష్టాలను
ఏమాత్రము
భగవంతుడు
నివారణ
గావించుటలేదు”
అని
కొంతమంది
భక్తులు
తమలోతాము
వాపోతుంటారు.
భగవంతుడు
సత్య
స్వరూపుడే,
ప్రేమ
స్వరూపుడే,
దయాసాగరుడే.
కాని,
అట్టి
ప్రేమ
స్వరూపుని
ఆజ్ఞను
మీరు
ఎంత
వరకు
అనుసరిస్తున్నారు?
ఆ
ప్రశ్నను
మీకు
మీరు
వేసుకోండి.
మీరు
ఆచరించేది
లేదుగాని,
ఆశించేది
అధికంగా
ఉంటున్నది.
భగవంతుడు
చెప్పిన
వాక్యాలలో
ఏ
ఒకటి,
రెండు
ఆచరణలో
పెట్టినప్పటికీ,
భగవదనుగ్రహం
మీ
మీద
వర్షిస్తుంది.
పారాయణ
కాదు
-
ఆచరణ
ముఖ్యం
ఈనాడు
ప్రపంచంలో
భగవద్గీత
ప్రచారముగాని,
పారాయణగాని
అధికంగా
జరుగుతున్నది.
కాని,
ఈ
భగవద్గీతలో
తెలుపబడిన
విషయాలలో
ఏ
ఒకటి
రెండైనా
ఆచరించేవారు,
అనుసరించేవారు
ఉంటున్నారా?
ఈనాడు
అందరూ
ఆశించడంలో
హీరోలు—
ఆచరించడంలో
జీరోలు.
రామాయణ
గ్రంథాన్ని
శిరస్సుపై
పెట్టుకొని
ఆనందంగా
పారాయణ
చేస్తున్నారు.
కాని,
పితృవాక్యపరిపాలన
సాగించేవాడొక్కడైనా
ఉన్నాడా?
ఇంక
రామాయణం
చదివి
ప్రయోజనమేమిటి?
రామాయణం
గాని,
భాగవతం
గాని,
భగవద్గీత
గాని
పారాయణ
గ్రంథాలేకాదు,
ఆచరించవలసిన
గ్రంథాలు.
బైబిల్,
ఖురాను
మొదలగు
గ్రంథరాజములు
కూడా
ఆచరించడానికి
యోగ్యమైనవేగాని,
కేవలం
పఠించుటకు
కాదు.
కొంతమంది
తమ
జీవితమంతా
తెలుసుకోవడానికే
ప్రయత్నిస్తున్నారు.
జీవితమంతా
తెలుసుకోవడంలోనే
వ్యర్థమైతే,
ఇక
ఆచరించేదెప్పుడు?
ఆచరించుటలో
ఫలితం
ఉన్నది
గాని
తెలుసుకొనుటలో
లేదు.
11
▾
Meaning
Keep
ఒక
‘లైబ్రరీరూమ్’లో
లక్షలాది
పుస్తకములు
ఉండవచ్చును.
అయినప్పటికీ,
ఆ
లక్షలాది
పుస్తకములలోని
ఏ
ఒక్క
పదమైనా
ఆ
లైబ్రరీ
రూమునకేమాత్రమైనా
తెలుసునా?
నేటి
మానవుడి
పరిస్థితి
కూడా
ఈ
లైబ్రరీరూం
మాదిరిగా
ఉంటున్నది.
ప్రపంచంలో
అన్ని
విషయాలను
అతడు
తెలుసుకొంటున్నాడు.
అన్ని
బోధలు
వింటున్నాడు.
కాని,
ఏ
ఒక్కటైనా
ఆచరణలో
పెట్టుట
లేదు.
ఆచరణలో
పెట్టని
విషయాలను
ఎన్ని
పర్యాయములు
వినినప్పటికీ
ప్రయోజనం
లేదు.
కనుక,
ఆధ్యాత్మిక
మార్గమును
అనుసరించెడివారు
ఒకటి
రెండు
విషయాలనైనా
ఆచరణలో
పెట్టాలి,
అప్పుడే
ఆనందాన్ని
అనుభవించగలరు.
అప్పుడే
అనుభవించిన
ఆనందాన్ని
పదిమందికి
పంచగలరు.
ఇదే
ఈనాడు
మనము
తెలుసుకొనవలసిన
ప్రధానమైన
తత్త్వం.
నోటితో
నామస్మరణ
-
చేతితో
సేవ
భగవంతునిపై
గల
భక్తివిశ్వాసములను
పరోపకార
సంబంధమైన
కార్యాలలో
ప్రవేశపెట్టుట
చాలా
ఉత్తమమైన
మార్గము.
ఇదే
హనుమంతుడు
విభీషణునికి
ఒకసారి
చెప్పినాడు.
ఒకసారి
విభీషణుడు
హనుమంతునితో—
“హనుమంతా!
నేను
చిరకాలము
నుండి
రామనామ
స్మరణ
చేస్తున్నాను.
రామచింతన
తప్ప
అన్య
చింతన
లేదు.
అయినప్పటికీ
నాకింకా
రామానుగ్రహం
కలుగుట
లేదు.
రామదర్శనం
నాకు
ప్రాప్తించుట
లేదు”
అన్నాడు.
హనుమంతుడు
చంచలత్వానికి
పుట్టినిల్లు,
పెట్టినది
పేరు.
అట్టి
హనుమంతుడు
కూడా
తన
చక్కని
సూటైన
మాటలను
విభీషణుని
హృదయానికి
నాటాడు.
“విభీషణా!
నీవు
రామ
చింతన
చేస్తున్నావేగాని,
రామకార్యంలో
ఎంత
వరకు
పాల్గొంటున్నావు?
దైవ
చింతన
చేసినంత
మాత్రమున
చాలదు,
దైవకార్యాలలో
ప్రవేశించాలి.
దీనికి
ప్రత్యక్షనిదర్శనం
నేనే.
రామనామము
నా
హృదయంలో
ఉన్నది.
కాని,
‘రామాజ్ఞ’
నాకు
ప్రధానము.
రామకార్యాన్ని
నా
చేతులతో
చేయాలి.
అప్పుడే
నాకు
తృప్తి
కలుగుతుంది.
తట్టలోని
పదార్థం
పొట్టలోనికి
పోవాలంటే—
చేతికి,
నోటికి
పని
పెట్టాలి
కదా!
కనుక,
నోటితో
నామస్మరణచేయాలి-
చేతితో
సేవలను
ఆచరించాలి.
ఈ
రెండింటిని
చేసినప్పుడే—
నీకు
రామదర్శనము
ప్రాప్తిస్తుంది”
అని
అన్నాడు.
సంపాదించిన
ధనం
సద్వినియోగం
కావాలి
ధనమును
ఎంతైనా
సంపాదించవచ్చు.
అయితే,
సంపాదించిన
ధనాన్ని
సద్వినియోగ
పరచినప్పుడే,
ఆ
ధనమునకు
కూడా
తగిన
గౌరవము
లభిస్తుంది.
అంతేగాని,
సంపాదించిన
ధనాన్ని
ఏ
విదేశ
బ్యాంకుల్లోనో
పెట్టి,
కట్టకడపటికి
కన్నుమూసుకొని
వెడుతున్నారు.
మనము
పీల్చుకొన్న
గాలిని
వదలినప్పుడే,
ఆరోగ్యం
చక్కగా
ఉంటుంది,
భుజించిన
ఆహారాన్ని
మరొకవైపు
విసర్జించకుండా
ఉన్నప్పుడు
ఆరోగ్యం
చెడిపోతుంది.
అదే
విధంగా
సంపాదించిన
ధనమును
సద్వినియోగ
పరచినప్పుడే
తగిన
సార్థకత
చేకూరుతుంది.
12
▾
Meaning
Keep
ధనాన్ని
ఒక
చేతితో
సంపాదించాలి,
మరొక
చేతితో
త్యాగం
చేయాలి.
పూర్వం
పారిస్లో
ఒక
వృద్ధ
స్త్రీ
ఉండేది.
ఆమె
చాలా
బీద
స్త్రీ
అయినప్పటికీ,
తాను
సంపాదించిన
ధనంతో
రెండు,
మూడు
దుప్పట్లుకొని,
రాత్రి
పూట
చలిలో
నిద్రించుచున్న
వారిమీద
కప్పేసి
వచ్చేది.
క్రమక్రమేణా
ఆమె
త్యాగగుణము
చేత,
ఆమెపై
భగవదనుగ్రహం
కూడా
అభివృద్ధి
అయినది.
భగవదనుగ్రహము
పెరిగే
కొలది
ఆమె
త్యాగం
కూడా
పెరుగుతూ
వచ్చినది,
ఆమె
బండిలో
కొన్ని
దుప్పట్లువేసుకొని,
అందరూ
నిద్రపోయిన
తరువాత,
చలిలో
నిద్రిస్తున్న
వారిపైన
కప్పి
వచ్చేది.
ఈ
విషయాన్ని
ఎవ్వరికీ
చెప్పేది
కాదు.
కాని,
జనులంతా
ఆమె
త్యాగాన్ని
గుర్తించారు.
అయితే,
ఆమె
ఎప్పుడూ
తల
క్రిందకు
వంచుకొని
నడిచేది.
అందుచేత
అందరూ
ఆమెను
ప్రశ్నించేవారు—
“అవ్వా!
మీరింత
త్యాగం
చేస్తున్నారు
కదా!
మీకెందుకింత
సిగ్గు?
తల
ఎత్తుకొని
తిరుగకూడదా?”
అన్నారు.
అప్పుడీ
వృద్ధురాలు
ఈ
రీతిగా
సమాధానమిచ్చింది—
“నాయనలారా!
నాకు
తల
ఎత్తుకొని
తిరగటం
చాలా
అవమానకరంగావుంది,
ఎందుచేతనంటే,
భగవంతుడు
నాకు
సహస్ర
చేతులతో
అందిస్తుంటే-
నేను
మాత్రము
ఒక్క
చేతితో
దానము
చేస్తున్నాను.
భగవంతుడు
నాకు
అనంత
హస్తాలతో
అందిస్తున్నప్పుడు-
నేను
ఒక
హస్తంతోనే
ఇతరులకు
దానంచేయుట
చాలా
అవమానకరంగావుంది”.
ఈనాటివారు
ఎవరైనా
పదిమందికి
దానంచేస్తే,
ఆ
విషయం
నా
తలంత
అక్షరాలతో
పేపర్లో
మొట్టమొదట
ప్రకటింపబడాలని
ఆశిస్తారు.
ఇటువంటి
ప్రచారాన్ని
ఆమె
ఏమాత్రం
ఆశించలేదు.
దీనినే
“గుప్తదానం”
అంటారు.
ఇట్టి
దానం
చేసేవారు
భారతదేశములో
కోట్లకొలది
ఉంటున్నారు.
“జగతియందు
పుణ్యపురుషులు
లేకున్న—
జగములెట్లు
వెలుగు?”.
కనుక,
సంపాదించిన
ధనాన్ని
పదిమందికి
దానం
చేసి,
మంచి
కార్యాలలో
ప్రవేశించాలి.
కార్యదీక్షలో
మీరు
ప్రవేశించండి.
సంఘసేవను
దినదినాభివృద్ధి
గావించండి.
“జనసేవయే—
జనార్దనసేవగా
భావించండి.
పరులసేవయే—
పరమాత్మసేవగా
విశ్వసించండి”.
ఇదే
మీరు
చేయవలసిన
సాధన.
ఈ
సాధన
చేత
మీరు
ఎంతటి
ఆనందాన్నైనా
అనుభవించవచ్చు.
మన
పంచభూతములను
పవిత్రంగా
అనుభవించండి.
అప్పుడే
మానవజన్మ
సార్థకమౌతుంది.
ఇదే
మానవత్వము
నందున్న
గొప్ప
విశిష్టత.
దీనితోబాటు
భగవన్నామాన్ని
స్మరించండి.
ఈనాటి
“స్వామి
జన్మదినోత్సవం”
హాయిగా,
చల్లగా
జరిగిపోతూ
వచ్చింది.
ఈ
చల్లని
వాతావరణం
భక్తులందరకూ
ఒక
“ఎయిర్కండిషన్”గా
తయారైంది.
మీ
హృదయాలు,
భావాలు
కూడా
చల్లగా
ఉండి-
ఈ
భావాలతో
చేరిన
చర్యలు
కూడా
చల్లగా
ఉంటుండి,
మీరంతా
దేశాన్ని
చల్లబరచడానికి
ప్రయత్నించాలని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Human Values Come First in Education
Next
Develop spiritual oneness
→