Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Training of Nurses of Sai Mahaa Vaidhyaalaya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Training of Nurses of Sai Mahaa Vaidhyaalaya
14 July 1992, Address to the medical staff, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
సమీపమందున్న
దాని
విలువ
అంత
తొందరగా
గుర్తించటానికి
వీలుకాదు
ప్రేమస్వరూపులారా!
భారతదేశమందు
అనేక
విధములైన
అనుభవజ్ఞులైన
వైద్యులు
లేకపోలేదు.
విదేశములకు
పోయి
వారు
అనేక
విధములైన
శ్రమలు
చేసి
చాలా
నూతనమైన
పద్ధతులను
గుర్తించి,
అనేక
విధములుగా
పేరు
ప్రఖ్యాతులు
పొందుతున్నారు.
నిజముగా
భారతీయులకున్నంత
ఓపిక
మరొకరికి
లేదు.
విదేశములకు
పోయి
రాత్రింబవలు
కష్టపడి
రోగులను
చూస్తూ
ఎన్నో
విధములైన
శ్రమలు
పడుతున్నారు.
అక్కడకూడను
అధికంగా
రోగులకు
వైద్యము
చేసేది
భారతీయులేగానీ,
విదేశీయులు
ఎక్కువ
మంది
కారు!
పూర్వము
మన
భారతదేశములో
(ఆంధ్రప్రదేశములో
ప్రత్యేకముగా)
‘సొమ్ములు
మావి,
సోకులు
మీవి’
అని
చెప్పేవారు.
పని
చేసేది
అంతా
భారతీయులే,
అక్కడ.
కాని,
కీర్తి
ప్రతిష్టలంతా
వారికి!
భారతదేశములో
ఎంతో
శక్తిసామర్థ్యములు
గలవారు
ఎందరో
ఉంటున్నారు.
ఏదైనా
సమీపములో
ఉన్నదాని
విలువ
అందరికి
అంత
బిఱ్ఱున
గుర్తించటానికి
వీలు
కాదు.
2
▾
Meaning
Keep
దూరంగా
ఉన్న
దానిపైనే
ఆకర్షణ.
24
గంటలు
స్వామిచెంతనే
వుండికూడను
స్వామి
విలువ
చాలామందికి
అంతగా
తెలియదు.
కొంచెము
దూరము
పోయినప్పుడే
విలువ
ఎక్కువగా
తెలుస్తుంది.
లైట్
హౌస్
ఉంటుండాది.
దాని
కాంతి
చాలా
దూరములో
ఉండినవారికేగానీ,
క్రిందనున్నవారికి
క్రీ
నీడనే!
అదే
విధముగనే
మన
భారతీయులలోపల
శ్రద్ధ,
భక్తి
కలిగినవారు
ఎందరో
ఉన్నారు.
విదేశీయులలోకూడ
మంచివారు
లేకపోలేదు.
భారతదేశములో
యింత
శక్తి,
సామర్థ్యములు
గలవారు
ఉండినప్పటికిని
వారికి
తగిన
ఉత్సాహప్రోత్సాహములు
అందించేవారు
చాలా
తక్కువ.
కనుకనే
మన
భారతదేశములో
చాలామంది
డాక్టర్లు,
నర్సులు,
కంపౌండర్లు
యిలాంటివారు
విదేశాలకు
వెళ్ళిపోతున్నారు.
కారణము
ఏమిటి?
వారికి
తగిన
అవకాశములు
యిక్కడ
యివ్వటంలేదు.
అంతేకాక
వారికి
తగిన
ఉద్యోగములు
యివ్వటం
లేదు.
వారి
స్థాయికి
తగిన
అవకాశములు
అందించటం
లేదు.
సీనియర్
జూనియర్‌గా,
జూనియర్
సీనియర్‌గా
మార్చేస్తుంటారు.
యిలాంటి
కొన్ని
యిబ్బందులవలన
భారతదేశమునుండి
అనేకమంది
బయటకు
వెళ్ళిపోతున్నారు.
కానీ,
నా
ఉద్దేశ్యము
ఏమంటే
శక్తి
సామర్థ్యములు
కలిగినవారిని
భారతదేశమునుండి
బయటకు
ఎందుకు
పంపాలి?
మనమే
వీరిని
యిక్కడ
పెట్టుకొని
వారితోనే
యీ
పని
చేయించుకోటం
చాలా
బాగుంటాది.
దేశముయొక్క
క్షేమమే
మన
క్షేమము
చాలా
గొప్ప
గొప్ప
డాక్టర్సు
అంతా
ఉంటున్నారు,
మన
ఆసుపత్రిలో.
చూడటానికి
ఆకారంలో
చాలా
చిన్నగా
ఉన్నప్పటికిని
మా
వేణుగోపాల్
శక్తిసామర్థ్యములు
ఎవరూ
సరిగా
అర్థం
చేసుకోటం
లేదు.
బాలదాస్
అని
ఇంకొక
డాక్టరు
ఉంటున్నాడు.
చిన్నగా
ఉంటాడు.
రాత్రింబవలు
పని
చేస్తుంటాడు,
పాపం!
యిది
రాత్రీ,
పగలు
అని
వ్యత్యాసమే
లేదు.
వారు
భోజనం
సాయంత్రం
5
గం॥లకు
తీసుకుంటారు.
అదికూడా
నా
మనసుకు
కష్టమే!
డాక్టర్సు
బాగుంటేకదా,
మనం
వారిచేత
పనులు
బాగా
జరుపుకోవచ్చు!
Health
&
wealth
అన్నారు.
వారు
బాగుండినప్పుడే
ఎన్ని
పనులైనా
చేయించుకోవచ్చును.
3
▾
Meaning
Keep
అందువలనే
నేను
చెబుతున్నాను,
‘దినము
10,
12
చేస్తున్నారు,
ఆపరేషన్లు.
వద్దు,
వద్దు;
3,
4
చేయండి
చాలు.
మీరుకూడా
ఆరోగ్యంగా
ఉండాలి.
మీకు
అధికంగా
శ్రమ
అయితే,
మాకు
చాలా
యిబ్బంది
అయిపోతుంది.’
అలాంటి
గొప్ప
డాక్టర్సు
ఉండినప్పుడు
వారికి
తోడుగా
మంచి
నర్సులు
కూడా
లభ్యమయ్యేటట్టు
ట్రైనింగ్
చేయాలనేటువంటి
సంకల్పము
చేసి,
రేపటినుండి
ఒక
నర్సు
ట్రైనింగ్
కాలేజి
పెట్టేస్తున్నాను.
డాక్టర్సు
ఆపరేషను
చేయటం
సులభం.
కాని,
ఆపరేషను
అయిన
తరువాత
వారిని
చూచుకునేదే
యిబ్బంది.
కూరగాయలు
కోయడం
చాలా
సులభం.
కానీ
మంచి
కూరగా
వండటమే
కష్టము.
ఈ
వంట
నర్సుపైన
ఆధారపడి
ఉంటుంటాది.
ఈ
నర్సు
సరైన
రీతిగా
లేకపోతే
ఆపరేషన్
బాగా
చేసినా
అది
అపజయమే
అవుతుంది.
మంచి
నర్సులను
ట్రైనింగ్
చెయ్యాలని
నర్సు
కాలేజీ
రేపటినుండి
ఆరంభం
చేస్తున్నాం.
ఎవరైనా
మంచి
త్యాగజీవులు,
పవిత్రమైన
హృదయంతో
సేవ
చేయాలనే
ఉద్దేశ్యము
వున్నటువంటివారు
మా
సఫాయా
దగ్గరకు
వచ్చి
దరఖాస్తు
యిచ్చుకొని
అందులో
చేరితే
ఏ
విధమైన
ఖర్చులేదు,
ఉచితంగా
చదువుకోవచ్చు!
యింకొక
చోట
నర్సు
కాలేజీలో
అయితే
వారికి
ట్యూషన్
ఫీజు
కట్టాలి,
యింకేవేవో
ఫీజులు
కట్టాలి.
యిక్కడ
ఎటువంటి
ఫీజు
లేదు.
భోజనంకూడా
ఉచితంగా
పెట్టాము.
ఎవరైనా
మంచి
హృదయము
కలిగినవారు
కావాలి.
యిప్పుడు
మా
ఆసుపత్రిలో
కావలసినంతమంది
ఉంటున్నారు.
ఎంతమంది
ఉండినప్పటికిని
సరిపోవటం
లేదు.
ఎందుకంటే,
రోగులు
ఎక్కువగా
ఉన్నారు.
కనుక
యింకా
ఎక్కువమంది
కావాలి,
నర్సులు.
కేవలము
మా
నిమిత్తము
మేము
కోరటం
లేదు,
దేశము
నిమిత్తము.
దేశముయొక్క
క్షేమమే
మన
క్షేమము.
‘జననీ
జన్మ
భూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి’
అని
మన
జన్మనిచ్చిన
తల్లి,
జన్మించిన
దేశము,
రెండు
స్వర్గము
కంటె
మించినవి.
కనుక
మన
దేశములోపల
యిలాంటి
పవిత్రమైనవి
వ్యాప్తిగావించాలి.
ఏ
మూలనో
పల్లెల్లో,
కుగ్రామములలో
ఉండినవారికి
యిలాంటి
అవకాశము
అందించటము
చాలా
కష్టము.
మాకు
ఆచరణ
ప్రధానముకాని,
ప్రచారము
కాదు!
యీనాడు
యీ
పల్లెలో
ఇంత
విశాలమైన
ఆసుపత్రి
ప్రారంభము
కావటంచేత
ఎంతమందికో
ఎన్నో
ఉపకారములు
జరుగుతున్నాయి.
4
▾
Meaning
Keep
చాలామందికి
తెలియదు,
దీని
రహస్యము.
కేవలము
ప్రచారము
చేసుకోటానికి
మేము
దీనిని
ప్రారంభించ
లేదు.
మాకు
ఆచరణ
ప్రధానము
కానీ,
ప్రచారము
కాదు.
గుండె
ఆపరేషను
జరిగితే
కనీసం
ఒక్కనెలైనా
ఆసుపత్రిలో
ఉండాలి.
కాని
మా
ఆసుపత్రిలోపల,
అతిశయోక్తిగా
చెప్పుకోటం
కాదు,
ఈనాడు
ఆపరేషన్
అయితే
రేపటి
దినము
లేచి
కూర్చుని
యిడ్లీలు
తింటూ
ఉంటారు.
మూడవదినము
నడుస్తున్నారు.
5వదినము
కుట్లు
విప్పేస్తున్నారు.
7వదినము
విడుదలై
ఇంటికి
వెళుతున్నారు.
ఎట్లాగో
తెలుసునా?
కొత్త
పెండ్లి
కొడుకులు,
పెండ్లి
కూతురు
మాదిరి
ఉంటున్నారు.
మా
పిల్లలకు
బాగా
తెలుసు.
రాధాస్వామి
అని
ప్రొఫెసరు
ఒకరున్నారు.
ఆయనకూడా
ఉన్నాడు
యిక్కడే!
ఆయనకు
గుండె
ట్రబుల్
ఉందనే
తెలియదు,
పాపం!
ఎట్లా
పనిచేశాడో
ఏమిటో?
మా
వేణుగోపాల్
తక్షణమే
పట్టేశాడు.
‘తక్షణమే
ఆపరేషన్
చేయాలి,
ప్రమాదస్థితిలో
ఉంది,’
అన్నాడు.
ఆపరేషన్‌లో
నాలుగు
బైపాస్‌లు
చేశారు.
‘యిప్పుడు
పెండ్లి
చేస్తే
ఆయన
రెడీ!’
అట్లా
ఉంటున్నాడు,
యింత
గట్టిగా!
అదే
ఆనందము.
యీ
ఆరోగ్యమే
మహాభాగ్యము.
ఆరోగ్యము
బాగుంటే
ఎన్ని
కార్యములైనా
చేయవచ్చును.
అలాంటివారే
ఎంతోమంది
ఇక్కడ
చికిత్స
పొంది
పుష్టిగా
ఆరోగ్యమును
అనుభవిస్తున్నారు.
యిది
క్రమక్రమేణా,
నేడు
కాదు
రేపు
కాదు,
యావత్
ప్రపంచానికి
ఆదర్శముగా
అవుతుంది.
ఎవరైనా,
ఏవిధమైన
శక్తిసామర్థ్యములు
లేనివారైనా
సరే,
ఇక్కడికి
రావడానికి
ఏ
విధమైన
జంకుబొంకు
ఉండకూడదు.
యిది
మీ
ఆసుపత్రి,
నాది
కాదు!
మీ
నిమిత్తమై
పెట్టినదే
యిది.
ఎవరైనా
ఇక్కడకు
వచ్చి
ఆనందంగా
ఆరోగ్యం
బాగు
చేసుకొని,
సుఖశాంతులను
అనుభవించుకొని
ఇతరులకు
ఆదర్శవంతమైన
జీవితమును
అందిస్తారని
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ,
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
కొంతమంది
అనుకుంటున్నారు,
దీనిని
కేవలం
బీదవారికోసమే
పెట్టారేమో
మా
బోటివారు
పోకూడదేమోనని
సందేహిస్తున్నారు.
కాదు,
కాదు.
అందరికి
ఇది
సేవలందించే
ఆసుపత్రి.
వీడు
శ్రీమంతుడు,
వీడు
దరిద్రుడు
అని
రోగము
కనుక్కొని
రాదు.
ఎవరికైనా
రావచ్చును.
కాబట్టి
ఎవరైనా
రావచ్చును,
యిక్కడకు.
ఆ
భేదము
మా
దగ్గర
లేదు.
కోటీశ్వరుని
మొదలుకొని
కూటిపేదవరకు
ఇక్కడ
సమానమే!
కనుక,
మీరే
మాత్రము
సందేహము
పెట్టుకోకుండా
అవసరములో
ఉన్న
అందరు
ఆసుపత్రికి
రండి.
5
▾
Meaning
Keep
చికిత్సలు
ఉచితంగా
పొందండి.
మీకు
యీ
విధమైన
స్వాతంత్రము
ఉంటున్నది.
Previous
←
God alone is the true Guru
Next
To love God for God's own sake: that alone is true Bhakti
→