Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1995 · Divinity, the root of all
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Divinity, the root of all
22 June 1995
1
▾
Meaning
Keep
విద్యార్థులారా!
అహం
ఉన్నంతవరకు
మానవుని
ఈ
ప్రపంచము
గౌరవించదు.
ఏనాడు
మానవునియందు
ఈ
అహంకారము
దూరమగునో
ఆనాడే
ఈ
ప్రపంచము
గౌరవిస్తుంది,
ఆదరిస్తుంది.
క్రోధముండినంతవరకు
మానవుని
శోకము
వెంటాడుతూనే
ఉంటుంది.
ఏనాడు
మానవుడు
ఈ
క్రోధమును
వీడునో
ఆనాడే
సర్వసుఖములు
అందుకోగలడు.
మానవుడు
కోరికలతో
అలమటించునంతవరకు
సంతోషమనేదే
ఉండదు.
లోభముండినంత
వరకు
ఈ
ప్రపంచములోని
మానవుడు
యేమాత్రము
సుఖము
అనుభవించలేడు.
ఏనాడు
మానవుడు
లోభమును
దూరము
గావించుకొనునో
ఆనాడే
మానవునకు
సమస్త
సుఖములు
లభ్యమవుతాయి.
దైవత్వమును
గుర్తించుటకు
పూర్వము
విశ్వాన్ని
చక్కగా
అర్థము
చేసుకోవాలి.
విశ్వమనగా
ఏమిటి?
విశ్వరూపమంటే
ఏమిటి?
సూర్యచంద్రాదులు,
గ్రహములు,
నక్షత్రములు
యిత్యాది
వాటితో
కూడినదే
విశ్వ
స్వరూపము.
ఈ
విశ్వమునకు
మధ్యలోనుండిన
శూన్యత్వమునే
విశ్వస్వరూపమని
అన్నారు.
అక్కడే
మిల్కీవే,
గేలాక్సీలు
అన్నీ
ఉంటున్నాయి.
ఈనాటి
వైజ్ఞానికుడు
అనేక
పరిశీలనలు
చేసి
మేటర్
మరియు
ఎనర్జీ
అని
నిర్ణయించేస్తూ
వచ్చారు.
కాని,
నా
దృష్టిలో
మేటర్
అనేది
ఈ
జగత్తులో
లేదు.
అంతా
శక్తిమయమే.
ఈ
శక్తియే
ఒక్కక్షణములో
మేటర్‌గా
మారుతుంది.
మరొక
క్షణములో
ఇదే
ఎనర్జీగా
రూపొందుతుంది.
దానికి
ఒక
పదార్థ
పరిశోధన
అన్నారు
సైంటిస్టులు.
ఈవిధంగా
పేరులు
మారినప్పటికీ
పదార్థము
ఒక్కటిగానే,
శక్తి
ఒక్కటిగానే
రూపొందుతూ
వచ్చింది.
ఈ
శక్తి
పూర్వము
ఉండిన
పదార్థమునే
పూర్తి
నాశనము
గావిస్తుంది.
కొత్త
పదార్థమును
సృష్టిస్తుంది.
దీనినే
న్యూక్లియర్
ప్రోసెస్
అన్నారు.
సైన్సులో
అనేక
పేర్లతో
రూపొందేది
అంతా
ఒకే
శక్తి.
కొండలు
శిలామయము
కాదు.
అడవులు
కాష్టమయము
కాదు.
భూమి
మృణ్మయము
కాదు.
దేహము
మాంస
మయము
కాదు.
అంతా
అణుమయమైన
శక్తియే.
సమస్తమునందు
ఈ
అణుశక్తియే
యిమిడి
వుంటున్నది.
ఈ
అణుశక్తియే
ఘనముగా
మారుతున్నాది.
దీనినే
వేదాంత
పరిభాషయందు
‘అణోరణీయన్
మహతో
మహీయాన్’
అన్నారు.
దీనిని
చక్కగా
విచారణ
చేస్తే
వేయి
సంవత్సరములకు
పూర్వమే
ఈ
విశ్వము
పుట్టింది.
భూమి
ఏర్పడి
450
కోట్ల
సంవత్సరముల
పైబడింది.
ఈ
జీవరాసులు
పుట్టటము
కొన్ని
లక్షల
సంవత్సరముల
పూర్వము
అయింది.
భూమి
పూర్వము
చీకటిగా
ఉండేది.
మొట్టమొదట
ప్రపంచమంతా
అంధకారమే.
సూర్యునివలె
భూమికూడా
చాలా
వేడిగా
ఉండేది.
ఈ
వేడి
చల్లారటానికి
కొన్ని
వేల
సంవత్సరాలు
పట్టింది.
క్రమక్రమేణా
చల్లబడిన
తరువాత
దీని
ఉపరి
భాగము
కఠినమైన
పదార్థంగా
మారుతూ
వచ్చింది.
అప్పటినుంచి
భూమిపైన
సృష్టి
ప్రారంభమైంది.
ఈ
భూమి
అయస్కాంత
స్వరూపమైనది.
ఈ
అయస్కాంత
స్వరూపముచేత
విద్యుత్‌శక్తిగా
మారుతూ
వచ్చింది.
ఈ
విద్యుత్
శక్తి
ఉష్ణశక్తిగా
మారింది.
ఈ
ఉష్ణశక్తియే
కాంతిశక్తిగా
రూపొందింది.
ఈ
కాంతిశక్తియే
రేడియోతరంగశక్తిగా
మారింది.
ఎక్స్రేతరంగశక్తిగా
మారింది.
తదుపరి
లేజర్శక్తిగా
రూపొందుతూ
వచ్చింది.
ఈవిధముగా
అయస్కాంత
శక్తి
వల్లనే
అనేక
శక్తులు
ఆరంభమౌతూ
వచ్చాయి.
ఈ
శక్తులుండిన
భూమికి
కొన్ని
గుణములుకూడా
ప్రారంభమౌతూ
వచ్చాయి.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మత్సరములు
ఈ
ప్రకృతినుండే
ఆవిర్భవించాయి.
ఈ
ప్రకృతికి
కొన్నివిధములైన
కవచములుకూడా
ఉంటున్నాయి.
పైభాగమున
ఒక
కవరు,
మధ్యభాగమున
ఒక
కవరు,
అడుగు
భాగమున
ఒక
కవరు.
సూర్యుని
నుండి
వెలువడే
కొన్ని
శక్తులను
ఇవి
అరికడుతూ
వస్తున్నాయి.
సూర్యుని
నుండి
అనేక
కిరణముల
ద్వారా
కొన్ని
శక్తులు
ఆవిర్భవిస్తున్నాయి.
గామా,
లేజర్
కిరణముల
ద్వారా
విషకరమైన
శక్తులు
ఆవిర్భవిస్తున్నాయి.
ఇవన్నీ
ప్రమాదమైన
కిరణములు.
ఈ
ప్రమాదకరమైన
శక్తులు
భూమిని
సోకకుండా
ఈ
భూమిపైనున్న
జీవులు
రక్షింపబడే
నిమిత్తమై
క్లోడాప్లాస్
అనేది
వీటిని
లయము
గావించుకుంటూ
వచ్చింది.
ఈవిధముగా
సంరక్షణ
రావటం
చేత
ఈ
భూమిపైన
అనేక
జీవులు
జీవించటానికి
వీలైంది.
ఈ
ప్రకృతి
ప్రభావము
మిక్కిలి
విచిత్రము.
కాంతి
సెకండుకు
1,86,285
మైళ్లు
పోతుంది.
దీనిని
ప్రమాణముగా
తీసుకొని
సంవత్సరముగా
చేసినప్పుడు,
మన
ఒక
సంవత్సరము,
ఆరువేల
కోట్ల
సంవత్సరములు
పడుతుంది.
విశ్వప్రదక్షిణ
చేయాలనుకున్నప్పుడు
22
లక్షలకోట్ల
సంవత్సరములు
పడుతుంది.
మానవుని
జీవిత
ప్రమాణము
చాలా
తక్కువ.
ఎవరు
22
లక్షలకోట్ల
సంవత్సరములు
జీవించగలరు!
ఎవరు
ఈ
విశ్వాన్నంతా
ప్రదక్షిణ
చేయగలరు?
ఈ
విశ్వాన్ని
చక్కగా
గుర్తించటానికి
ప్రయత్నించిన
వ్యక్తి
మాత్రమే
దైవత్వమును
గుర్తించటానికి
వీలవుతుంది.
కాంతి
కంటె
అతివేగమైనది
దివ్యశక్తి.
క్షణమునకు
ఎన్ని
కోట్ల
మైళ్లు
ప్రయాణము
చేస్తున్నాడు.
ఎక్కడికక్కడనే
ఉంటున్నాడు.
ఐహికమైన
తత్త్వమునే
గుర్తించలేని
మానవుడు
అనంతమైన
తత్త్వాన్ని
యేరీతిగా
అర్థము
చేసుకోగలడు.
ఈనాడు
మనము
చూస్తున్నది
శూన్యమునకు
మధ్యనున్న
ప్రదేశము.
విశ్వరూపమునకు
మధ్యలోనున్న
శూన్యస్వరూపాలు
మిల్కీవేలో
ఎన్నో
ఉంటున్నాయి.
ఈనాడు
మానవుడు
జీవించే
భూగోళములు
లెక్కలేనన్ని
ఉంటున్నాయి.
వీటిలో
మన
భూగోళము
చాలా
చిన్నది.
ఈ
భూగోళములో
మానవుడు
ఎంత?
ఇలాంటి
అణువుకంటె
పరమాణువైన
మానవత్వము
ఘనముకంటె
అత్యంత
ఘనమైన
దివ్యత్వమును
ఏరీతిగా
అర్థం
చేసుకోగలడు.
2
▾
Meaning
Keep
ఇక్కడ
పదార్థమునకు
ఆకారము
లేదని
చెప్పటానికి
వీలుకాదు.
అన్నింటికీ
ఆకారము
ఉంటున్నాది.
ఒక
అణువును
ముక్కలు
చేస్తే
కట్టకడపటికి
కంటికి
కనిపించని
ముక్కకు
కూడా
ఆకారము
ఉంటున్నాది.
పరమాణువును
తిరిగి
పరమాణువు
చేసినా
స్వరూపము
ఉంటున్నాది.
ఈనాటి
సైంటిస్టు
తెలుసుకున్నది
చాలా
తక్కువ.
కాని,
ప్రచారము,
ఆడంబరము
ఎక్కువ.
ఈ
ఆడంబరము
చేతనే
మానవుడు
దివ్యమైన
తత్త్వాన్ని
చక్కగా
అర్థము
చేసుకోలేక
పోతున్నాడు.
పరమాణువును
గుర్తించినవాడు
మానవుడు.
ఇంక
ఎంతో
ఘనమును
గుర్తించవలసిన
అవసరముంటున్నాది.
ఈ
విశ్వముయొక్క
స్వరూపాన్ని
గుర్తించటము
ఎట్టి
వారికి
సాధ్యముకాదు.
అత్యంత
సులభమైన,
అత్యంత
సన్నిహితమైన,
అత్యంత
ఆప్యాయమైన,
అత్యంత
ప్రియమైన
దివ్యత్వమును
గుర్తించుకుంటే
విశ్వమంతా
గుర్తించిన
వారమౌతాము.
ఈ
ప్రకృతి
గుణములు
మనకు
విరుద్ధమైన
గుణములు.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మాత్సర్యములు.
ఈ
ప్రకృతి
గుణములు
మనము
మీరి
ప్రేమ,
సహనము,
సానుభూతి,
సత్యము,
దయ,
కరుణ
యిత్యాది
భగవద్గుణములలో
మనము
ప్రవేశించినప్పుడు
సులభంగా
విశ్వాన్ని
దర్శించిన
వారమౌతాము.
విద్యార్థులారా!
ఈనాడు
మీరు
లెబొలెటరీలో
అనేక
పరిశోధనలు
చేస్తున్నారు.
వీటివల్ల
మనకు
కలిగిన
ఫలితము
ఏమిటి?
ఇవన్నీ
నేర్చుకొని
తిరిగి
ఏ
కంపెనీకో
పోయి
దీనిని
ప్రదర్శనచేసి,
ప్రవేశపెట్టి
పొట్టను
నింపుకుంటున్నారు.
ఇంతకు
తప్ప
మరొక
గొప్ప
పని
చేయటం
లేదు.
అన్నింటికిని
ఆధారమైన,
అన్నింటికిని
కీలకమైన,
అన్నింటికిని
మూలమైన
దైవత్వమును
గుర్తించుకుంటే
సమాజమునకు
యెంతో
మేలు
చేయటానికి
అవకాశమవుతుంది.
భూమి
ఎంత
పవిత్రతను
అందిస్తున్నాది
మానవునకు.
సూర్యుని
నుండి
ఆవిర్భవించిన
విషక్రిములను
తనలో
యిముడ్చుకొని
జగత్తులోని
జీవాలను
ఎంతో
పోషిస్తూ
వస్తున్నాది.
ఇంతేకాదు.
లేజర్
కిరణాలు
సూర్యునినుండి
వస్తున్నాయి.
మెడికల్,
ఇంజనీరింగ్‌లో
ఎన్నో
రకాలుగా
ఉపయోగపడుతుంది.
కాని
విషమయమైనది.
ఇంత
విషమయమైన,
భయంకరమైన
శక్తులుంటున్నాయి.
ఇలాంటి
శక్తులను
భూమి
మూడు
కవచములుగా
పెట్టుకొని
తాను
ఆకర్షిస్తూ
తనలోపల
యిముడ్చుకుంటున్నాది.
భూమికి
అనుకూలమైన
వాతావరణము
ఎంత
వరకు
ఉంటున్నాది?
భూమి
ఉపరి
భాగమునుండి
వేయి
మైళ్ళ
వరకు
భూమికి
సంబంధించినదిగా
ఉంటున్నది.
కనుక,
భూమికి
అనుకూలమైన
వాతావరణము
వేయి
మైళ్ల
వరకు
ఉండటం
చేత
భూమిపై
ప్రాణులు
జీవించటానికి
వీలవుతున్నాది.
కాని,
సైంటిస్టులు
గ్రంథపరిచయముచేత,
అణు
పరీక్షలచేత
కొంతవరకు
గుర్తిస్తున్నారు.
ఇది
యంత్రముయొక్క
పరిశోధనే.
ఎన్నో
రెట్లు
మంత్రశక్తితో
ఉంటున్నాది.
యంత్రము
చెడిపోయెనా
ఈ
శక్తులన్నీ
వ్యర్థమైపోతాయి.
కాని,
మంత్రశక్తి
అట్టిది
కాదు.
అమృతమయమైనది.
అమరత్వమైనది.
పవిత్రమై
చలనము
లేనిది.
నిత్యమైనది.
సత్యమైనది.
ఈనాడు
లేజర్
మిషను
పెట్టారు
లేబలేటరిలో.
కరెంటుపోతే
పనిచేయదు.
ఒక్కొక్క
మిషను
కోటి
రూపాయలు,
రెండుకోట్లు
ఉంటాయి.
ఇంత
విలువచేసే
యంత్రములు
కరెంటుపోతే
దమ్మిడీకి
పనికిరావు.
కాని,
మంత్రశక్తి
అట్టిది
కాదు.
తరంగముల
ద్వారా
సర్వత్రా
వ్యాపించిపోతుంది.
ప్రపంచమంతా
అయస్కాంతమయమే.
దేహమంతా
అయస్కాంతమయమే.
ఏ
పదార్థము
చూచినా
అయస్కాంతమయమే.
అయితే
quantity
difference,
quality
కాదు.
మంత్రశక్తికి
క్వాలిటీ,
క్వాంటిటీ
అనేది
లేదు.
ఇది
ఈజీవి,
ఆజీవి
అనే
భేదము
లేదు.
ఇది
మానవుడు,
ఇది
పురుగు
అనే
భేదము
లేదు.
దేహము
పెద్దదిగా
ఉండవచ్చు,
చిన్నదిగా
ఉండవచ్చు.
రూపములను
పట్టి
విచారణ
చేయకూడదు.
మన
చదువులను
బట్టి
ప్రమాణముగా
తీసుకోకూడదు.
నేను
ఎం.ఎస్.సి,
పి.హెచ్డి
చేశాననుకోకూడదు.
ఇవి
ప్రపంచములో
కొన్ని
గుర్తులు.
ఉద్యోగానికి
పోవాలంటే
ఈ
గుర్తులు
చూపిస్తాము.
కాని,
మనయందున్న
గుర్తు
ఎంత
గొప్పదో,
ఎంత
విశాలమైనదో,
ఎంత
శక్తివంతమైనదో
ఎవరూ
చూడటానికి
వీలుకాదు.
అలాంటి
దివ్యశక్తి
మనయందుంచుకొని,
అల్పమైన
కొన్ని
శక్తులను
మాత్రమే
వర్ణిస్తూ
కూర్చున్నాం.
ఈ
విశ్వములో
లేని
శక్తులు
మరెక్కడా
లేవు.
రాత్రి
సమయంలో
ఆకాశమును
చూసినప్పుడు
నక్షత్రములు
ఒకదానికొకటి
దగ్గరదగ్గరగా
ఉన్నట్లు
కనిపిస్తాయి.
కాదు
కాదు.
అత్యంత
దూరముగా
ఉండటం
చేత
అట్లు
కనిపిస్తున్నాయి.
కానీ,
నక్షత్రమునకు
నక్షత్రమునకు
ఎన్నో
లక్షలమైళ్ళుంటున్నాయి.
కనుక,
మనం
ఈ
విశ్వస్వరూపాన్ని
గుర్తించాలంటే
యేనాటికి
వీలుకాదు.
విశ్వాన్ని
గుర్తించలేని
మానవుడు
విశ్వస్వరూపాన్ని
యేరీతిగా
గుర్తించగలడు.
విశ్వమనగా
మనకు
కనిపించే
సూర్యచంద్రాదులు,
నక్షత్రములుమాత్రమే
కాదు.
ఇలాంటివి
ఎన్నో
ఉంటున్నాయి.
అన్నీ
చేరినదే
విశ్వ
స్వరూపము.
దీనినే
విశ్వవిరాట్
స్వరూపము
అన్నారు.
కృష్ణుడు
అర్జునునికి
చూపినది
విశ్వరూపము
కాదు.
విశ్వవిరాటరూపము.
పైభాగములోను,
అడుగు
భాగములోను
ఉన్నది
చూపించాడు.
ఆనాటి
ఆధ్యాత్మిక
మార్గంలో
అతల,
వితల,
సుతల,
తలాతల,
రసాతల,
మహాతల,
పాతాళ
అనే
లోకములు
చూపిస్తూ
వచ్చాడు.
ఇవన్నీ
విష్ణుస్వరూపమే.
ఇవన్నీ
చేరితేనే
విశ్వవిరాటస్వరూపము.
ఎక్కడ
చూసినా
అంతా
ఒక
శక్తియే.
ఈ
శక్తినే
దైవత్వము
అన్నారు.
ఆస్తికులు
దైవత్వమన్నారు.
నాస్తికులు
శక్తి
అన్నారు.
అయితే
పరిమితమైన
శక్తిని
ప్రకృతిగా
మార్చుకుంటూ
వచ్చారు.
అనవసరంగా
వాదోపవాదములలో
మునిగి
అత్యంత
సమీపములో
నున్న
దైవత్వమును
దూరము
చేసుకుంటున్నారు.
చూడటానికి
చిన్న
స్వరూపముగా
ఉండవచ్చు.
చీమ
చూడటానికి
చిన్నది.
చీమ
కుడితే
యెంత
బాధ.
దానిలో
ఎంత
శక్తి
ఉంది.
అదే
రీతిగా
ఈ
చిన్న
స్వరూపాన్ని,
చిన్న
స్వరూపముయొక్క
ప్రవర్తనలు
చూసి
విశ్వతత్త్వాన్ని
మరచిపోతున్నారు.
విశ్వమే
విష్ణుస్వరూపము.
రెండింటికి
భేదము
లేదు.
3
▾
Meaning
Keep
సైంటిస్టులు
మేటర్,
ఎనర్జీ
అంటున్నారు.
ఈ
ప్రపంచంలో
మేటర్
లేదు.
అంతా
ఎనర్జీయే.
ఈ
ఎనర్జీ
మేటర్‌గా
మారుతుంది.
మేటర్
ఎనర్జీగా
మారుతుంది.
మేటర్,
ఎనర్జీ
ఒక్కటే.
పిల్లలకు
అనేక
పర్యాయములు
చెప్పాను.
పుట్టిన
తక్షణమే
ఛైల్డ్,
ఐదు
సంవత్సరముల
తర్వాత
బాయ్,
35
సంవత్సరముల
తర్వాత
మేన్.
75
సంవత్సరముల
తర్వాత
గ్రాండ్‌ఫాదర్.
ఛైల్డ్,
బాయ్,
మేన్,
గ్రాండ్‌ఫాదర్
ఒక్కడే
కదా!
అదేరీతిగా
ఈ
శక్తి
అనేక
రూపములుగా
ఉండటం
వలన
అనేక
పదార్థములుగా
మారుతుంది.
పదార్థమే
లేదు.
అంతా
శక్తిమయమే.
మీకందరికీ
తెలుసు.
అయిన్స్టీన్
అనేక
విధములుగా
పరిశోధనలు
చేశాడు.
ఆయన
ఈ
ప్రపంచమంతా
శక్తిమయమే
అన్నాడు.
దీనినే
ఆధ్యాత్మికమందు
‘అంతా
రామమయం
ఈ
జగమంతా
రామమయం’
అని
వారు
పాడుకుంటూ
వచ్చారు.
ఎక్కడ
చూచినా
రమించేటటువంటిదే
ఉంటున్నాది.
ఏదాన్ని
మనం
రమించటంలేదు.
పుష్పాలు
చూస్తే
మనం
రమిస్తున్నాం.
ప్రక్కనున్న
ఆకులను
చూస్తే
రమిస్తున్నాం.
కాబట్టి
జగత్తంతా
రామతత్త్వమే.
రమయతి
యితి
రామః.
ప్రపంచమంతా
ఆకర్షణ.
అదే
అయస్కాంతము.
అయస్కాంతము
దగ్గర
మేకులు
పెట్టండి.
ఆకర్షిస్తుంది.
మేకులకు
శక్తి
లేదు.
కాని,
అయస్కాంతమునకు
ఉన్నది.
ఒకటిరెండు
దినములైన
తర్వాత
ఈ
మేకులు
కూడా
అయస్కాంతమైపోతాయి.
అదే
వేదాంతములో
బ్రహ్మవిద్
బ్రహ్మైవ
భవతి
అన్నారు.
ఈ
దివ్యశక్తి
సమీపములో
ఏ
శక్తి
లేని
ఇనుపముక్కలు
మీ
దేహాలు
సమీపముగా
వస్తే
అవికూడను
దివ్యశక్తులుగా
మారిపోతాయి.
ఈ
దేహము
ఇనుపముక్క
అంటున్నారు.
కానీ,
ఇనుపముక్క
అయిన
దేహాలను
దైవత్వమునకు
సమీపముగా
చేర్చండి.
క్రమక్రమేణా
కొన్ని
దినములకు
అవి
దివ్యస్వరూపాలుగా
మారిపోతాయి.
ఆవిధముగా
మారినవారే
భారతదేశములో
దైవాంశసంభూతులున్నారు.
వారినే
యోగులన్నారు.
వారినే
మహర్షులన్నారు.
ఎన్ని
పేర్లతోనో
వారు
జగత్తులో
వ్యాప్తమౌతూ
వస్తున్నారు.
దైవత్వమునకు
సమీపము
కావాలి.
కేవలము
మనస్సు
మాత్రమే
ఉండి
ప్రయోజనం
కాదు.
శరీరముకూడా
అత్యంత
సమీపము
కావాలి.
ఈ
శక్తి
సర్వత్ర
నిండి
ఉంటున్నాది.
ఒక
చిన్న
ఉదాహరణ.
పల్లెలలో,
పట్టణాల్లో
మందిరాలు
కడతారు.
మందిరము
కట్టింది
కొంతమంది
మేసన్సు.
వారిలో
యే
శక్తీ
లేదు.
రాళ్ళతో,
సిమ్మెంటుతో,
ఇసుకతో
కట్టారు.
అందులో
శిల్పి
కొండలోనుండి
ఒక
విగ్రహాన్ని
చేసి
ప్రతిష్ఠ
చేశాడు.
ప్రతిష్ఠ
చేసిన
తర్వాత
వేలాదిమంది
భక్తులు
మందిరంలో
ప్రవేశిస్తారు.
ప్రవేశించి,
విగ్రహానికి
నమస్కారము
చేయటము,
అభిషేకము
చేయటము.
భక్తిప్రపత్తులు
ప్రదర్శిస్తారు.
అయితే
కొంత
కాలమైన
తర్వాత
ఆ
ప్రదేశము
దివ్యమైన
ప్రదేశంగా
మారుతుంది.
కారణం
ఏమిటి?
వారి
దివ్యభావాలంతా
యేకత్వమైన
ప్రదేశమది.
ఇనుపముక్కలంతా
అయస్కాంతముతో
చేరి
యేవిధముగా
అయస్కాంతముగా
అయిపోయినాయో
ఆవిధంగా
వారిలోనున్న
భక్తిప్రపత్తులంతా
అక్కడ
చేరేటప్పటికి
అది
ఒక
దివ్యశక్తిగా
మారిపోయింది.
అనేకమంది
దివ్యభావములతో
తీర్థములో
స్నానం
చేయటం
చేత
అదికూడా
దివ్యమైన
పవిత్రతీర్థంగా
మారిపోతున్నది.
ఇవన్నీ
ఎవరూ
పరిశోధనలు
చేయటం
లేదు.
కేవలం
లేబోరెటరీలో
పరిశోధనలు
చేస్తారు.
దీనికి
మించిన
శక్తి
బయట
ఉంటున్నాది.
చూడండి
మీరే.
లేబరెటరీలో
వెళ్లి
రెండు
భాగములు
ఆక్సిజను,
ఒక
భాగము
హైడ్రోజను
కలుపుతారు.
నీరు
అయింది.
ఇది
సైంటిస్టు
చెప్పే
నిర్ణయము.
కాని,
అక్కడ
మాత్రమే.
నీవు
భోజనానికి
కూర్చున్నావు
టేబులు
పైన.
అక్కడ
ఆక్సిజను,
హైడ్రోజను
కలిపి
త్రాగుతున్నావా?
సమాజములో
ఉపయోగము
లేనిది
ఏమి
ప్రయోజనము?
అక్కడ
తెలుసుకున్నావు.
ఇక్కడ
ఆచరించలేక
పోతున్నావు.
ఇక్కడకూడా
ఎందుకు
నీవు
తెలుసుకోటానికి
ప్రయత్నించ
కూడదు.
ప్రజలకు
అనుకూలమైనది
ఏదో
అది
మనం
చూడాలి.
లోకమునకు
కల్యాణము
గావించే
చదువులు
మనం
చదవాలి.
ఏ
చదువులు
మనం
చదివినామో
ఆ
చదువులు
మనం
జగత్తులో
వినియోగ
పెట్టాలి.
అక్కడ
వినియోగపెట్టని
విద్యలు
యేమి
ప్రయోజనం?
తల
భారము.
ఇంతేకాకుండా
పెద్దపెద్ద
బ్యాగ్సులో
పుస్తకాలు
మోసుకొనిపోవటం
పెద్దభారం.
పట్టణములో
పోతుంటే
చిన్నచిన్న
పిల్లలు
పెద్ద
బరువులు
వీపుకి
కట్టుకొని
పోతుంటారు
సంచులతో.
దీని
అంతరార్థము
యేమిటి?
నా
అంతరార్థము
చెబుతున్నాను.
‘ఒరే
నాయనా!
నీవు
కష్టపడి
చదువుకొని
యేమీ
ప్రయోజనం
లేకుండా
ఉంటుంది.
ఉద్యోగాలు
చిక్కటం
లేదు.
కనుక,
నీవు
బస్సుస్టాండులోనో,
రైల్వేస్టేషనులోనో
బరువులు
మోసేదానికి
ఈనాటినుండి
ఈ
బరువులు
మోయటం
ప్రాక్టీసు
చేయి.
చిన్నప్పటినుండి
మోసిమోసి
ప్రాక్టీసు
అయిపోతుంది.
అక్కడ
లేబరుగా
పనిచేయవచ్చు.’
ఈవిధంగా
యిన్ని
పుస్తకాలుమోసి
మనం
చేస్తున్న
పని
యేమిటి?
శారీరకంగా
కొన్ని
ఆచరించాలి.
మానసికంగా
నేర్చుకోవలసింది
ఓర్పు,
పట్టుదల.
ఈ
రెండింటి
వలనే
అభివృద్ధి
అవుతాము.
మొట్టమొదట
ప్యూరిటీ.
ఈ
ప్యూరిటీ
కోసమే
ఈ
విద్యలు
మనం
గ్రహించాలి.
నేను
భూమిపై
జన్మించాను.
కామ,
క్రోధ,
మద,
మాత్సర్యములు
భూమియొక్క
స్వరూపాలు.
అనేకరకములైన
దివ్యశక్తులు
కూడా
ఆవిర్భవిస్తున్నాయి.
ఈ
దివ్యశక్తుల
ప్రభావము
సత్ప్రభావమే.
తద్వారా
మన
తెలివితేటలు
మారుతుంటాయి.
ఈ
మార్పుకే
మనము
హెడ్
ప్రధానంగా
తీసుకోవాలి.
ఈ
తెలివితేటలు
మనలో
చాలా
అభివృద్ధి
కావాలి.
అందువల్లే
గాయత్రీమంత్రములో
‘ధీయోయోనః
ప్రచోదయాత్’
నా
తెలివితేటలు
ప్రకాశవంతముగా
అనుగ్రహించమని
అన్నారు.
ఈ
గాయత్రీమంత్రమందు
వర్ణన,
ధ్యానము,
ప్రార్థన.
వర్ణన
తొమ్మిది
విధములు.
ఓంభూర్భువస్వః
ఈ
ప్రపంచమునందు
ఈ
మనస్సునందు
ఈ
జ్ఞానమునందు
ఉండినవాడు
తత్సవితుర్వరేణ్యం
అట్టి
దానిని
నేను
తెలుసుకొన్నాను.
భర్గోదేవస్యధీమహి
ఈ
చీకటి
అంతా
తొలగించి
నా
బుద్ధిశక్తి
యిచ్చివేయి.
ఈ
చీకటి
ఉండినంతవరకు
ప్రకాశము
లేదు.
4
▾
Meaning
Keep
ప్రపంచము
మొట్టమొదట
అంతా
చీకటి.
ఎక్కడ
చూచినా
యేమీ
లేదు.
భూమి
లేదు.
అంతా
మేఘాలతో
నిండి
ఉండేది.
తదుపరి
మీకు
తెలియదు.
కొన్ని
కోట్ల
సంవత్సరములు
నిరంతరము
వర్షము
కురిసింది.
వర్షం
కురిసిన
తర్వాత
భూమి
యేర్పడింది.
సృష్టి
రహస్యము
ఎవరికీ
తెలియదు.
మూలాధార
తత్త్వాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
కాయలు
చూస్తున్నారు.
పుష్పాలు
చూస్తున్నారు.
ఆనందిస్తున్నారు.
కాని,
ఎక్కడ
ఉన్నాది
ఆధారము?
పువ్వులు,
ఆకులు,
కొమ్మలు
చూసేవాడు
సైంటిస్టు.
కాని,
వేరును
చూసేవాడు
వేదాంతి.
ఈ
సైంటిస్టు
వేరును
చూడడు.
వేదాంతి
పువ్వులు
చూడడు.
వీరిద్దరికి
యేమాత్రము
సంబంధము
లేదు.
వేరు
ఉండటం
చేతనే
కొమ్మలు
ఉన్నాయి.
వేళ్లు
లేక
కొమ్మలు
లేవు.
కొమ్మలులేని
వేళ్ళు
ఉండవచ్చుగాని,
వేళ్ళ
లేని
కొమ్మలుండవు.
మనము
బాహ్యప్రపంచమును
మాత్రమే
చూస్తూ
యేదో
తెలుసుకున్నామని
విఱ్ఱవీగటం
వెఱ్ఱితనము.
ఆధారమైన
దానిని
చూడాలి.
అదే
దైవత్వం.
భూమి
తిరుగుతున్నాది.
భూమి
తిరగటానికి
యేదైనా
ఆధారం
ఉండాలి
కదా!
అదే
వృత్తము
అన్నారు.
ఆధారములేక
భూమి
తిరగటానికి
వీలులేదు.
చిన్న
పిల్లలకు
ప్రైమరీస్కూల్‌లో
గ్లోబు
చూపిస్తారు.
తిప్పుతూ
ఇది
ఇండియా,
ఇది
అమెరికా,
ఇది
జపాన్
అని
చూపుతారు
టీచర్సు.
గ్లోబు
తిప్పటానికి
ఒక
స్టాండు
ఉండాలి.
ఆ
స్టాండు
దైవత్వము.
ఇదంతా
తిరిగేది.
ప్రపంచమునే
చూసి
ఆనందిస్తున్నాము.
ఆ
ప్రపంచములోకూడా
తానున్నాడు.
ఆవిధమైన
దివ్యభావమును
మనం
చూడాలి.
సూర్యుని
కాంతిని
కొలుస్తున్నారు.
సూర్యుని
దగ్గరకు
పోతున్నారా
వీరు?
పోతే
మరి
వెనుకకు
రారు,
భస్మమైపోతారు.
అక్కడనుండి
వచ్చిన
కిరణములను
కొలత
వేసుకొని
చెబుతున్నారు.
సాక్షాత్
ఇదే
కరెక్ట్
అని
ఎవ్వరూ
చెప్పటానికి
వీలుకాదు.
అది
ఒక్క
దైవత్వమునకు
మాత్రమే
అర్థమవుతుంది.
దైవము
చేతనే
సర్వమూ
సృష్టించబడింది.
దైవము
లేక
ఏ
వస్తువు
లేదు.
ప్రతి
వస్తువందు
దైవత్వము
ఉంటున్నాది
అని
తలంచి,
whatever
you
do,
whatever
you
tell,
whatever
you
speak,
whatever
you
think
it
is
GOD
అనే
భావము
రావాలి.
భూమిలో
మామిడి
చెట్టు
వేస్తే
తీయని
మామిడి
పండ్లు
వస్తున్నాయి.
అదే
భూమిలో
వేప
చెట్టుకు
చేదు
వేపకాయలు
కాస్తున్నాయి.
భూమిలో
భేదము
లేదు.
విత్తనములో
ఉంటున్నాది
భేదము.
నీ
మైండ్‌లో
ఉంటున్నాది
భేదభావము.
దైవములో
ఎట్టి
భేదభావము
లేదు.
నీ
భావములను
భగవంతునిపై
నిరూపిస్తూ
ఉంటావు.
భగవంతునిలో
ఏ
దోషమూ
లేదు.
దోషము
రావటానికి
అవకాశమే
లేదు.
సకల
దోషములు
నీలోనే
ఉంటున్నాయి.
సర్వపాపములు
నీలోనే
ఉంటున్నాయి.
సర్వవిషయములైన
మంచి
నీలోనే
ఉంటున్నాది.
కనుకనే,
యద్భావం
తద్భవతి.
నీవు
నీ
ప్రక్కనున్న
వానిపై
కొంచెం
మనోభిప్రాయం
భేదం
రావటంచేత
చెడ్డవాడు
అనుకుంటావు.
అతడు
చెడ్డవాడు
కాదు.
అతనిపై
నీకున్న
భావము
చెడ్డది.
ఎట్లనగా
నీవు
మామిడిపండు
తిన్నావు.
ఇంకొకడు
దోసపండు
తిన్నాడు.
దోసపండు
తిన్న
వానికి
దోసత్రేపు
వస్తుంది.
మామిడిపండు
తిన్నవానికి
మామిడిపండు
త్రేపు
వస్తుంది.
నీవు
మామిడిపండు
తిని
నాకు
దోసపండు
త్రేపు
రాలేదని,
వాడు
దోసపండు
తిని
మామిడిపండు
త్రేపు
రాలేదని
అంటే
ఎట్లా?
ఎవరు
తిన్నది
వారికే
వస్తుంది.
కనుక,
ఎవరు
చేసిన
కర్మ
వారనుభవించక
ఏరికైనను
తప్పదన్నా!
ఎవరు
చెప్పినది
వారికే
వస్తుంది.
ఇతరులపైన
మనం
ద్వేషాలు
చెప్పటంగాని,
ఇతరులపైన
నేరాలు
చెప్పటంగాని
చాలా
తప్పు.
ఆ
దోషము
నీలో
ఉండి
నీకు
కనిపిస్తున్నాయి.
అప్పుడప్పుడు
చెబుతుంటాను
‘refletion
of
the
innerbeing’
నీ
దోషాలు
నీవు
మూసిపెట్టుకొనే
నిమిత్తమై
యిన్ని
రకములైన
ప్రవర్తనలు
నీలో
ఆవిర్భవిస్తున్నాయి.
ఈ
భావమును
మొట్టమొదట
అరికట్టుకోవాలి.
మంచి,
చెడ్డలు
రెండింటిని
తనవిగా
భావించుకున్నప్పుడే
మనం
బాగుపడతాం.
కలి
ప్రభావము
వలన
చెడ్డ
యింకొకరిది,
మంచి
అంతా
నాది.
దుర్యోధనుడు,
ధర్మరాజు
మంచిని
చెడ్డను
వెతకటానికి
వెళ్ళారు.
ఎట్లున్నా
చెడ్డవారిగానే
కనిపించారు
దుర్యోధనునకు.
కృష్ణుని
దగ్గరికి
వచ్చి,
‘కృష్ణా!
నా
రాజ్యములో
ఎక్కడ
చూసినా
చెడ్డవారే
కనిపిస్తున్నారు’
అన్నాడు.
తక్షణమే
ధర్మరాజుని
పిలిపించాడు.
‘ఏమి
ధర్మజా!
నీ
ఉద్దేశ్యము
ఏమిటి?’
‘స్వామీ!
ఎక్కడ
చూసినా
మంచివారే
కనిపిస్తున్నారు.
చెడ్డవారు
లేరు’
అన్నాడు.
అప్పుడు
చెప్పాడు,
‘ఇది
నీ
భావము,
అది
అతని
భావము’.
ఇదంతా
వారివారి
భావముల
ప్రభావమే.
ఇతరుల
గురించి
చెడ్డ
మాట్లాడకూడదు.
ఇతరుల
దోషములను
మనం
వెతకకూడదు.
ఇతరుల
మంచిని
వెతుకు.
నీలోనున్న
దోషములను
వెతుకు.
నీలో
దోషములు
వెతికినప్పుడే
నీవు
బాగుపడతావు.
ఇతరుల
మంచి
చూసినప్పుడే
నీవు
బాగుపడతావు.
నీలో
దోషాన్ని
మూసిపెట్టుకొని
పరుల
దోషాన్ని
వెతుకుతే
మరింత
దోషుడైపోతావు.
ఈనాటి
మానవుని
దోషాలు
అధికం
కావటానికి
ఇదే
కారణము.
అందరూ
మంచివారే.
ఈరకమైన
భావములో
మనం
పోవాలి.
ఇది
విద్యార్థు
లీనాడు
చక్కగా
గుర్తించి
వర్తించాలి.
జగత్తులో
ఎన్నో
శక్తులుంటున్నాయి.
సర్వశక్తులు
దైవశక్తియొక్క
కిరణములే.
అందువల్లే
భగవద్గీతలో,
‘మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః’.
నీవు
ప్రకృతి
అంశము
కాదు.
సమాజము
అంశము
కాదు.
నీ
తల్లిదండ్రుల
అంశము
కాదు.
తాతముత్తాతల
అంశము
కాదు.
నీవు
నా
అంశమే!
పేరుకు
తగిన
ప్రవర్తన
మనం
చూపించాలి.
మనము
భగవంతుని
అంశతో
ఉన్నవారము.
ఏమి
చూసినా
భగవద్భావమే
రావాలి.
ఏది
చేసినా
భగవద్భావమే
రావాలి.
ఏది
తిన్నా
భగవత్ప్రసాదమే
కావాలి.
ఈవిధమైన
భావాన్ని
నిరూపించే
నిమిత్తమే
ఈ
ఫిజిక్సు,
కెమిస్ట్రీ
యివన్నీ
నేర్పుతున్నారు.
అన్నింటికీ
ప్రేమతత్త్వాన్ని
ఒక్కటి
పెంచుకోండి.
love
is
GOD,
live
in
love.
Previous
←
Health, diet and Divinity
Next
Significance of worship at the Lord's Feet
→