Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · ‘Daivaṃ mānuṣa rūpeṇa’
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
‘Daivaṃ mānuṣa rūpeṇa’
7 April 1997, Ugādi, Brindavan
1
▾
Meaning
Keep
“నువ్వులయందు
నూనె
ఉన్నట్లుగా,
పాలయందు
వెన్న
ఉన్నట్లుగా,
పుష్పముయందు
సుగంధమున్నట్లుగా,
ఫలముయందు
రసమున్నట్లుగా,
కట్టెలయందు
నిప్పున్నట్లుగా
దృశ్యకల్పితమైన
ఈ
జగత్తంతయు
భగవంతుడు
నిండియున్నాడు.
కన్నులయందు
చూపువలె,
చెవులయందు
వినికిడివలె
భగవంతుడు
దేహమునందు
చైతన్య
స్వరూపుడై
ప్రకటితమవుతున్నాడు.”
సృష్టి
అనగా
ఈశ్వరేచ్ఛకు
ప్రకటనయే.
అనగా
ఈశ్వర
స్వరూపమే.
దీని
పేరే
ప్రకృతి.
ఈ
ప్రకృతియందు
పుట్టిన
ప్రతి
మానవునియందు
ఈశ్వరభావములే
ఆవిర్భవించాలి.
చైతన్య
స్వరూపుడైన
భగవంతుని
వ్యక్తీకరించే
నిమిత్తమై
మానవుడు
ఆవిర్భవించాడు.
దీనికి
సంబంధించి
వేదము
ప్రత్యేకమైన
ప్రమాణములను
బోధించింది.
“సత్యం
బ్రూయాత్,”
సత్యమునే
పలకాలి.
ఇది
నైతికమైన
విలువ.
“ప్రియం
బ్రూయాత్,”
ఈ
సత్యమును
కూడా
ప్రియమైనరీతిలో
ఉచ్చరించాలి.
ఇది
ధార్మికమైన
విలువ.
“న
బ్రూయాత్
సత్య
మప్రియం,”
సత్యమనేది
అప్రియమైనదిగా
ఉండకూడదు.
ఆనందకరంగాను,
ఆకర్షణీయంగాను
ఉండాలి.
అయితే
ఎదుటివానికి
ప్రియము
కదాయని
అసత్యము
చెప్పకూడదు.
“అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రియ
హితం
చయత్.”
ప్రతి
పలుకు
అనుద్వేగకరంగాను,
సత్యంగాను,
ప్రియంగాను,
హితంగాను
ఉండాలి.
ఒక
మహారాజు
ఒక
ఎస్ట్రాలజర్
పేరుప్రతిష్ఠలు
ఆనోట,
ఈనోట
విని
అతనిని
తన
భవనానికి
పిలిపించాడు.
ఈ
ఎస్ట్రాలజర్కు
కాలు
మొదలు
తల
వరకు
అహంకారమే!
అందులోను
రాజుగారే
స్వయంగా
తనను
పిలిపించారనే
గర్వము
ఇతనిలో
బయలుదేరింది.
రాజువద్ద
ఏవిధంగా
మాట్లాడాలి?
ఏమి
చెప్పాలి?
ఏమి
చెప్పకూడదు?
అనే
విచక్షణ
ఇతనిలో
శూన్యమైపోయింది.
రాజువద్దకు
వెళ్ళి
జాతకం
చూసి,
“రాజా!
నీకుమారులంతా
త్వరలోనే
చచ్చిపోతారు”
అన్నాడు.
దానితో
రాజుకు
కోపం
వచ్చి
ఇతనిని
జైలులో
పెట్టించాడు.
అయితే
ఇతడు
చెప్పింది
నిజమే.
కాని
నిజమునైనా
చెప్పవలసిన
రీతిలో
చెప్పాలి.
రాజు
ఇంకొక
ఎస్ట్రాలజర్ను
పిలిపించాడు.
అతడు
రాజువద్దకు
వినయంగా
వచ్చాడు,
జాతకమును
చూశాడు,
“రాజా!
మీరు
దీర్ఘకాలం
జీవిస్తారు.
మీరు
జీవించినంత
కాలము
మీ
పిల్లలు
కూడా
జీవించరు”
అన్నాడు.
ఈ
మాటలు
రాజుకు
కొంతవరకు
తృప్తికరంగా
తోచాయి.
కనుక
మనం
చెప్పే
మాటలలో
మాధుర్యం
ఉండాలి.
మొదట
వచ్చిన
ఎస్ట్రాలజర్
రాజుతో,
“నీ
పిల్లలందరూ
చచ్చిపోతారు.
నీవు
మాత్రం
చాలకాలం
ఉంటావు”
అన్నాడు.
ఈ
మాటలు
ఎంత
కఠినంగా
ఉన్నాయి
చెప్పండి!
2
▾
Meaning
Keep
ఎవరైనా
గ్రుడ్డివానిని,
“ఓ
గ్రుడ్డివాడా!
ఇటురా”
అని
పిలిస్తే
అతడు
చాల
బాధపడతాడు.
అట్లుగాకుండా
అతని
దగ్గరకు
వెళ్ళి,
“ఓ
సూరదాసూ!
ఇటు
రండి”
అని
పిలిస్తే
ఎంత
ఆనందిస్తాడు!
కనుక
మనం
పలికే
ప్రతి
పలుకు
చాల
మధురంగా,
ప్రీతికరంగా
ఉండాలి.
ఆవిధంగా
ఉండాలంటే
హృదయం
మొట్టమొదట
ప్రేమమయం
కావాలి.
మానవత్వం
ఎంతో
పవిత్రమైనది
నైతికము,
ధార్మికము,
ఆధ్యాత్మికము
-
ఈ
మూడింటి
యొక్క
సమ్మిశ్రిత
స్వరూపమే
మానవత్వము.
కాని
మానవుడీనాడు
ఈ
మూడింటినీ
విస్మరించాడు.
మానవత్వ
మనగా
ఎంత
పవిత్రమైనదో
విచారిస్తే
ఈనాటి
మానవుడు
సిగ్గుపడవలసి
వస్తుంది.
సత్యము,
ప్రేమ,
సహనము,
దయ,
సానుభూతి
ఇత్యాది
గుణములచేత
వర్ధిల్లిన
ఈ
భారతదేశంలో
ఈనాడు
ఎక్కడ
చూసినా
నిర్దయ,
స్వార్థము,
కఠినత్వము
ఇత్యాది
దుర్గుణములు
తాండవమాడుచున్నవి.
ప్రేమ
అనేది
ఎక్కడా
కనిపించడం
లేదు.
ఈనాడు
మహనీయుల
విగ్రహాలను
ప్రతిష్ఠించి
పూజిస్తున్నారుకాని,
ఆయా
మహనీయులు
ప్రబోధించిన
మంచి
విషయాలను
మాత్రం
భూమిలో
పూడ్చిపెడుతున్నారు.
ఎందుకీ
ఆడంబరాలు?
ఎందుకీ
నాటకాలు?
విగ్రహములను
పూజించడం,
ప్రబోధములను
విస్మరించడం
మానవత్వం
కాదు.
మానవునికి,
మానవునికి
మధ్యగల
సంబంధ
బాంధవ్యాన్ని
గుర్తించి
వర్తించడమే
నిజమైన
మానవత్వం.
త్రిమూర్తులు
మానవునియందే
ఉన్నారు
మీరు
బ్రహ్మవిష్ణుమహేశ్వరులను
పూజిస్తున్నారు.
కాని
వీరిని
చూసినవారు
ఈ
జగత్తులో
ఎవ్వరూ
లేరు.
అయితే
వీరి
ఉపాధులు
ఏమిటి?
ప్రతి
మానవునియందున్న
సత్వరజస్తమో
గుణములే
వీరి
ఉపాధులు.
ఈశ్వరు
డనగా
ఎవరు?
వేదములు
ఈశ్వరత్వమును
‘ఆత్మ’
అని
పిలుస్తూ
వచ్చాయి,
హృదయమును
కూడా
‘ఆత్మ’
అని
ప్రకటిస్తూ
వచ్చాయి.
కనుక
హృదయమే
ఈశ్వర
స్వరూపము.
“ఈశ్వరస్సర్వభూతానాం.”
హృదయమునకే
ఈశ్వరుడని
పేరు.
ఇతని
సంకల్పమే
మనస్సు.
ఈ
మనస్సే
విష్ణుస్వరూపం.
విష్ణువనగా
సర్వవ్యాపకుడని
అర్థం.
కనుక
మనస్సు
కూడా
సర్వత్ర
వ్యాపించియున్నది.
“మనోమూల
మిదం
జగత్.”
జగత్తంతా
మనోమయమే.
ఈ
మనస్సు
నుండి
ఆవిర్భవించినదే
వాక్కు.
విష్ణువు
యొక్క
నాభి
నుండి
ఉద్భవించినవాడే
బ్రహ్మ.
కనుక
వాక్కే
బ్రహ్మత్వము.
కనుకనే,
“శబ్దబ్రహ్మమయి,
చరాచరమయి,
జ్యోతిర్మయి,
వాఙ్మయి
...”
అని
బ్రహ్మత్వము
వర్ణింపబడింది.
ఏతావాతా
హృదయము,
మనస్సు,
వాక్కు
-
ఈ
మూడింటి
యొక్క
తత్వమే
మానవత్వము.
హృదయమే
ఈశ్వరత్వము,
మనస్సే
విష్ణుత్వము,
వాక్కే
బ్రహ్మత్వము.
కనుక
బ్రహ్మవిష్ణుమహేశ్వర
స్వరూపములు
మూడూ
ప్రతి
మానవునియందు
ఉంటున్నవి.
ఇట్టి
మానవత్వాన్ని
మర్చిపోయి
కేవలం
ప్రాకృతమైన
కర్మలను
ఆచరిస్తున్నాము.
ఇవి
కాదు
మనం
ఆచరించవలసినవి.
అంతర్భావముతో
కూడిన
ఆచరణ
చాల
అవసరం.
మంచిచెడ్డలు
కాలములో
లేవు
ఈనాడు
క్రొత్త
సంవత్సరము
ప్రారంభమైనది.
ఇది
ఈశ్వరనామ
సంవత్సరము.
కనుక
ఈ
సంవత్సరంలోనైనా
మనం
ఈశ్వర
భావములను
పెంపొందించుకోవాలి.
ఐకమత్యంగా,
అన్యోన్యంగా
జీవిస్తూ
మన
కర్తవ్యకర్మలను
నిర్వర్తించాలి.
3
▾
Meaning
Keep
ఈశ్వరు
డనగా
సకలైశ్వర్య
స్వరూపుడు.
కనుక
ఈ
క్రొత్త
సంవత్సరము
మన
కేవో
క్రొత్త
సుఖములు,
సౌభాగ్యములు
చేకూర్చుతుందని
భావిస్తున్నాము.
మన
మంచిచెడ్డలనుగాని,
కీర్తిప్రతిష్ఠలనుగాని
సంవత్సరములు
తీసుకొని
రావటంలేదు.
మన
కర్మల
ఫలితములే
మనకు
అందుతూ
ఉన్నవి.
కనుక
నూతన
సంవత్సరము
మన
కేవో
మంచిచెడ్డలను
తెస్తున్నదని
భావించకూడదు.
మనం
చేసే
మంచిచెడ్డల
ఫలితమునే
మన
కందిస్తుంది.
మనం
మంచిగా
నడుచుకుంటే
మంచి
ఫలితమే
వస్తుంది,
చెడ్డగా
ప్రవర్తిస్తే
ఫలితం
కూడా
చెడ్డగానే
ఉంటుంది.
మంచిచెడ్డలు
కాలములో
లేవు,
మన
సంకల్పములతోనే
కూడియుంటున్నవి.
కనుక
సత్సంకల్పములను
పెంచుకోవాలి,
సత్సంగములో
ప్రవేశించాలి.
ఈనాడు
మన
భారతదేశం
బీదదేశ
మనుకుంటున్నాము.
ఈ
బీదరికానికి
మూలకారణ
మేమిటి?
సోమరితనమే!
దినములో
24
గంటలలో
23గంటల
55
నిమిషములు
దుర్వినియోగం
చేస్తున్నాము,
ఏదో
ఐదు
నిమిషములను
అంతో
ఇంతో
సద్వినియోగం
చేస్తున్నాము.
ఇది
కాదు
మానవత్వం.
కాలమును
మనం
గౌరవించినప్పుడే
కాలము
మనలను
గౌరవిస్తుంది.
కాలమును
దుర్వినియోగపర్చితే
కాలము
కూడా
మనలను
హింసిస్తుంది.
యూనిటీ
-
ప్యూరిటీ
-
డివినిటీ
దేశ
సౌభాగ్యము
ప్రజల
ప్రవర్తనపై
ఆధారపడియున్నది.
దేశ
ప్రజలందరూ
సత్యధర్మములతో
వర్తించినప్పుడే
దేశం
సుభిక్షంగా
ఉంటుంది.
ఇంతకుముందు
ప్రసంగించిన
శివరాజ్‌పాటిల్
ఈనాడు
యూనిటీ,
ప్యూరిటీ
అత్యవసర
మన్నాడు.
ఈరెండింటితోపాటు
ప్రేమ
కూడా
ఉండాలన్నాడు.
యూనిటీ,
ప్యూరిటీ,
ప్రేమ
-
ఈ
మూడింటి
ఏకత్వంచేతనే
డివినిటీ
ఏర్పడుతుంది.
కాని
ఈనాడు
ఇంటికి
ఇంటికి
మధ్య
జగడము,
రాష్ట్రానికి
రాష్ట్రానికి
మధ్య
జగడము,
దేశానికి
దేశానికి
మధ్య
జగడము!
ఇంక
యూనిటీ
ఎలా
సాధ్యమవుతుంది!
విశాలమైన
ఏకాత్మభావాన్ని
అభివృద్ధి
పర్చుకుంటే
ఈ
జగడములకు
అవకాశమే
ఉండదు.
అందరియందు
ఉన్నవి
పంచభూతములే,
అందరూ
సమానమే.
ఇంక
మనిషికి
మనిషికి
మధ్య
ఎందుకిన్ని
భేదములు!
ఉన్నది
ఒకే
కులం,
అదే
మానవ
కులం.
ఉన్నది
ఒకే
మతం,
అదే
ప్రేమ
మతం.
ఉన్నది
ఒకే
భాష,
అదే
హృదయభాష.
ఈ
సత్యాన్ని
గుర్తించాలి.
ఈనాడు
ఎక్కడ
చూసినా
అందరూ
భక్తులుగానే
కనిపిస్తున్నారు.
నిజంగా
అందరూ
భక్తులే
అయితే
ఈ
కలహాలు
ఎక్కడి
నుండి
వస్తున్నాయి?
ఈ
భేదములు
ఎక్కడి
నుండి
పుడుతున్నాయి?
ఈ
అసూయాద్వేషాలు
ఎక్కడి
నుండి
ఆవిర్భవిస్తున్నాయి?
కనుక
మీరు
భక్తులమని
చెప్పుకున్నంత
మాత్రమున
సరిపోదు.
భక్తులకు
తగిన
గుణములు
మాలో
ఉన్నవా
అని
విచారణ
చేసుకోవాలి.
మితిమీరుతున్న
ధనదాహం,
అధికారదాహం
ఈనాడు
ప్రతి
వ్యక్తి,
“ఈ
సమాజమువల్ల
నాకు
వచ్చిన
లాభమేమిటి?”
అని
ప్రశ్నిస్తున్నాడుకాని
తనవల్ల
ఈ
సమాజమునకు
లభిస్తున్న
సహాయ
మేమిటి?
అని
ప్రశ్నించుకోవడం
లేదు.
ప్రతి
ఒక్కరు
సమాజము
నుండి
తమకేదో
కావాలని
ఆశిస్తున్నారుకాని
తాము
సమాజానికేదీ
ఇవ్వటానికి
సిద్ధంగా
లేరు.
అందులోను
ఈ
కలి
ప్రభావంచేత
ధనదాహము,
అధికారదాహము
మితిమీరిపోతున్నాయి.
సిటీలలో
పోయి
చూస్తే
ఎక్కడ
చూసినా
ఒకటే
రద్దీగా
ఉంటున్నది.
4
▾
Meaning
Keep
ఇక్కడ
పోయే
కారు,
అక్కడ
పోయే
కారు,
ఇక్కడ
పోయే
మనిషి,
అక్కడ
పోయే
మనిషి
-
అంతా
బిజినెస్సే!
ప్రతి
వ్యక్తి
ధనంకోసం
ప్రాకులాడుతున్నాడు,
ధనంకోసమే
జీవిస్తున్నాడు.
ధనంకోసం
మానవుడు
దానవుడుగా
మారిపోతున్నాడు.
పోనీ
సంపాదించిన
ధనము
నేమైనా
సద్వినియోగం
చేస్తున్నాడా?
ఏమీ
లేదు.
“తుదకు
దొంగల
కిత్తురో?
దొరల
కౌనో?!”
ప్రేమస్వరూపులారా!
ధనమును
ఆశించండి,
సంపాదించండి,
తప్పు
లేదు.
అయితే
సమాజము
నుండి
సంపాదించిన
ధనమును
తిరిగి
సమాజమునకే
అర్పితం
గావించండి.
ప్రతి
వ్యక్తికి
ధనము,
అధికారము
రెండూ
ఉండవలసినవే,
తప్పు
లేదు.
కాని
వీటిని
సక్రమమైన
మార్గంలో
అనుభవించాలి.
ఎవరే
స్థానములో
ఉన్నారో
ఆ
స్థానమునకు
తగిన
గౌరవాన్ని
వారు
సాధించాలి.
ప్రైమ్
మినిష్టర్‌కు
తన
పనిలో
ఎంత
అధికార
మున్నదో
చెప్పులు
కుట్టేవానికి
కూడా
తన
పనిలో
అంత
అధికార
మున్నది.
కనుక
ఎవరి
డ్యూటీని
వారు
సక్రమంగా
చేయాలి,
అంతే
చాలు.
‘నేను
చిన్నవాడను,
అతడు
పెద్దవాడు’
అని
పోల్చుకోకూడదు.
నీ
పని
నీకు
గొప్ప,
అతని
పని
అతనికి
గొప్ప.
“నా
పని
నేను
చేసుకోవాలి.
నా
పనిలో
ఎట్టి
దోషమూ
లేకుండా
చూసుకోవాలి”
అనే
భావనతో
ప్రతి
వ్యక్తి
తన
పనిపట్ల
శ్రద్ధ
వహించినప్పుడు,
‘లోకాస్సమస్తా
స్సుఖినోభవంతు’
అనేది
సార్థక
మవుతుంది.
ఈనాటి
మానవుడు
‘లోకాస్సమస్తా
స్సుఖినోభవంతు’
అని
ప్రార్థిస్తున్నాడుకాని
లోకం
సంగతే
పట్టించుకోవడం
లేదు.
తన
లోకమే
తనకు!
భగవంతుడు
హృదయవాసి
మన
వాక్కే
బ్రహ్మ
మనస్సే
విష్ణువు,
హృదయమే
ఈశ్వరుడు.
ఈ
త్రిమూర్తులు
మనలోనే
ఉంటున్నారు.
ఈ
నమ్మకాన్ని
పెంచుకున్నప్పుడే
మన
దృష్టి
అంతర్ముఖంగా
అభివృద్ధి
అవుతుంది.
మనం
భగవంతుని
చూడాలని
దేవాలయాల
చుట్టూ
తిరుగుతున్నాము,
అనేక
తీర్థయాత్రలు
చేస్తున్నాము.
కాని
ప్రయోజన
మేమిటి?
ఈనాటి
సైంటిస్టు
స్థితి
కూడా
ఇదేరీతిగా
ఉంటున్నది.
లక్షల
మైళ్ళు
అంతరిక్షయానం
చేస్తున్నాడుకాని
అర్ధఇంచైనా
హృదయాంతరాళమునకు
పోతున్నాడా?
ఈనాటి
భక్తుడు
కూడా
యాత్రలు
చేస్తున్నాడు,
మఠముల
చుట్టూ
తిరుగుతున్నాడు.
దేవుడు
నీ
హృదయమందే
ఉండగా
మఠముల
చుట్టూ
తిరగడ
మెందుకు?
నీ
హృదయాన్ని
నీవు
చూసుకో,
నీ
హృదయంలో
ఆవిర్భవించే
భావములను
చక్కగా
విచారణ
చేసుకో.
అప్పుడే
నీవు
సరియైన
మార్గంలో
ప్రవేశిస్తావు.
హృదయంలో
చూస్తే
మాలిన్యము,
బయట
చూస్తే
మాధవ
నామము
-
ఇది
సరియైన
భక్తి
కాదు.
మొట్టమొదట
భగవచ్చింతన
ద్వారా
హృదయాన్ని
పవిత్రం
గావించుకోవాలి.
ఏ
పని
చేసినా
దానిని
భగవత్కర్మగానే
భావించుకోవాలి.
నీ
ఇంటిని
నీవు
శుభ్రం
చేసుకో,
అదీ
భగవత్కర్మనే.
“దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవో
దేవస్సనాతనః”
దేహమే
దేవాలయం,
జీవుడే
దేవుడు.
దేవుడు
తిరుపతిలో
ఉన్నాడని,
బదరీనాథ్‌లో
ఉన్నాడని,
అమర్నాథ్లో
ఉన్నాడని
అటూ
ఇటూ
తిరగడ
మెందుకు!
హృదయంలో
ఉన్న
దైవాన్ని
దర్శించలేనివాడు
ఎన్ని
దేవాలయముల
చుట్టూ
తిరిగినా
అది
కాలాన్ని
వ్యర్థం
చేసినట్లే!
5
▾
Meaning
Keep
దైవం
ఎక్కడో
లేడు,
నీవే
దైవము.
ఇంతటి
పవిత్రమైన
మానవత్వం
ప్రసాదింపబడినప్పటికీ
దీనిని
సక్రమమైన
మార్గంలో
ప్రవేశపెట్టడం
లేదు.
పశువులకైనా
నియమనిష్ఠలు
ఉన్నాయికాని,
ఈనాటి
మానవునికి
నియమం
లేదు,
నిష్ఠ
లేదు.
నిష్ఠను
ప్రక్కకు
పెట్టి
ఇష్టాన్ని
అనుసరిస్తున్నాడు.
నిర్జీవమైన
శిలలను
పూజిస్తున్నాడుకాని
సజీవులైన
మానవులను
గౌరవించడం
లేదు.
తోటి
మానవులకు
సహాయపడని
పూజలు
పూజలా?
కాదు,
కాదు.
మానవుడు
దైవస్వరూపంగా
ఉంటున్నాడు.
దైవం
మానవస్వరూపంలో
ఉంటున్నాడు.
కనుకనే
వేదము,
“దైవం
మానుష
రూపేణ”
అన్నది.
“మనుష్యులకు
నమస్కారం
చేయవచ్చునా?”
అనుకుంటారు
చాలమంది.
ఇంకెవరికి
చేయాలి
నమస్కారము?
దయ్యాలకు
చేయాలా?!
మనిషిశిరస్సు
విలువ
ఒకానొక
సమయంలో
అశోక
చక్రవర్తి
తన
మంత్రితో
కూడి
విహారార్థం
బయలుదేరాడు.
మార్గ
మధ్యంలో
ఒక
బౌద్ధగురువు
వారికి
ఎదురయ్యాడు.
తక్షణమే
అశోకుడు
తన
శిరస్సును
ఆ
బౌద్ధగురువు
యొక్క
పాదములపై
పెట్టి
నమస్కరించాడు.
ఈ
దృశ్యాన్ని
చూసి
మంత్రి
చాల
నొచ్చుకున్నాడు.
అశోకచక్రవర్తి
అత్యంత
విలువైన
తన
శిరస్సును
ఒక
సాధారణ
సన్యాసి
పాదములపై
పెట్టినాడే
అని
బాధపడ్డాడు.
అతడు
పేరుకు
మంత్రియేకాని
చాల
సంకుచిత
బుద్ధి
గలవాడు.
అశోకుని
కున్న
విశాల
హృదయం
అతనికి
లేదు.
ఇంటికివెళ్ళిన
తరువాత
సమయం
చూసుకొని
అశోకునితో
ఈవిషయాన్ని
ప్రస్తావించాడు.
కాని
అశోకుడేమీ
మాట్లాడ
లేదు,
నవ్వి
ఊరుకున్నాడు.
సరియైన
సమయం
చూసుకొని
మంత్రికి
సత్యాన్ని
బోధించాలని
సంకల్పించుకున్నాడు.
కొన్ని
దినముల
తరువాత
అశోకుడు
ఆ
మంత్రిని
పిలిపించి,
“మంత్రీ!
నాకు
మూడు
శిరస్సులు
కావాలి.
ఒకటి
మేకశిరస్సు,
రెండవది
పులిశిరస్సు,
మూడవది
మనిషిశిరస్సు.
ఈ
మూడింటినీ
తీసుకొని
రా”
అన్నాడు.
మంత్రి
మేకమాంసం
అమ్మేవాని
వద్దకు
వెళ్ళి
మేకశిరస్సును
తీసుకు
వచ్చాడు.
అడవికి
వెళ్ళి
వేటాడి
పులిశిరస్సును
తీసుకు
వచ్చాడు.
ఇంక
స్మశానమునకు
వెళ్ళి
అప్పుడే
పూడ్చబోతున్న
శవము
యొక్క
శిరస్సును
ఖండించి
తీసుకు
వచ్చాడు.
“రాజా!
మీ
ఆజ్ఞ
ప్రకారం
వీటిని
తీసుకు
వచ్చాను”
అన్నాడు.
“మంచిది,
ఈ
మూడింటినీ
రేపు
మార్కెట్‌కు
తీసుకువెళ్ళి
అమ్ముకొని
రా”
అన్నాడు.
మరునాడు
మార్కెట్‌కు
పోతూనే
ఎవరో
ఒక
తిండిపోతు
వచ్చి
మేకశిరస్సును
కొనుక్కున్నాడు.
ఇంటిద్వారంపై
అలంకారంగా
పెట్టుకోవచ్చునని
పులిశిరస్సును
మరొకడు
కొనుక్కున్నాడు.
కాని
మనిషిశిరస్సును
మాత్రం
ఎవ్వరూ
కొనలేదు.
మంత్రి
తిరిగి
వచ్చి
అశోకునితో,
“చక్రవర్తీ!
ఈ
మనిషిశిరస్సును
ఎవ్వరూ
కొనటం
లేదు”
అన్నాడు.
“సరే,
కొనకపోతే
పోనీ,
ఎవరికైనా
ఊరికే
ఇచ్చివేసి
రా”
అన్నాడు.
మార్కెట్లో
మనిషిశిరస్సును
ఫ్రీగా
తీసుకోవడానికి
కూడా
ఎవ్వరూ
అంగీకరించ
లేదు.
మంత్రి
తిరిగి
వచ్చి,
“మహారాజా!
ఊరికే
ఇస్తామన్నా
దీనిని
ఎవ్వరూ
తీసుకోవడం
లేదు”
అన్నాడు.
అప్పుడు
అశోకుడు,
“మంత్రీ!
జీవ
మున్నంత
వరకే
ఈ
శిరస్సుకు
విలువ
ఉంటుంది.
జీవం
పోతూనే
శిరస్సుకు
కూడా
విలువ
పోతుంది.
కనుక
జీవ
మున్నప్పుడే
మహనీయుల
పాదములపై
శిరస్సు
పెట్టి
ఆ
పవిత్రతను
అందుకోవాలి.
జీవమున్నంతలోనే
శిరస్సును
సద్వినియోగం
చేసుకోవాలి”
అన్నాడు.
6
▾
Meaning
Keep
పెద్దల
పాదస్పర్శనమే
శరీరమునకు
సరియైన
విలువను
చేకూర్చుతుంది.
కాని
అనేకమంది
నాస్తికులు
దీనిని
విమర్శిస్తుంటారు.
ఇది
తెలివితక్కువతనం!
కౌరవపాండవ
యుద్ధం
జరిగినప్పుడు
భీముడు
దుర్యోధనుని
క్రింద
పడగొట్టాడు.
దుర్యోధనునిలో
ప్రాణం
ఇంకా
కొంతవరకు
మిగిలి
ఉండగా
భీముడు
తన
కాలుతో
అతని
శిరస్సును
తన్నాడు.
అప్పుడు
దుర్యోధనుడు,
“భీమా!
నేను
క్రిందకూలక
ముందు
నా
శిరస్సును
తన్నియుంటే
నా
ప్రతాపం
చూపించేవాడిని.
ఇప్పుడు
నా
ప్రాణం
పోతున్న
సమయంలో
నా
శిరస్సును
నీవు
కాలుతో
తన్నడం
గొప్పతనం
కాదు.
నీవే
కాదు,
ఇంక
కొన్ని
నిమిషముల
తరువాత
కాకులు,
గ్రద్దలు
కూడా
నన్ను
కాళ్ళతో
తంతాయి”
అన్నాడు.
కనుక
ప్రాణం
ఉన్నప్పుడే
శిరస్సుకు
విలువ
నందించుకోవాలి.
మహనీయుల
పాదములపై
శిరస్సును
పెట్టి
తద్వారా
దానిని
పవిత్రం
గావించుకోవాలి.
జీవితం
శాశ్వతం
కాదు.
మనం
చేసే
కర్మలే
శాశ్వతమైనవి,
సత్యమైనవి.
దైవానికి
మీరు
అత్యంత
సమీపంగా
ఉండాలి.
బొగ్గు
అగ్నితో
చేరినప్పుడు
అగ్నిగా
మారిపోతుంది
కదా!
అదేవిధంగా
మీరు
దైవసన్నిధిలో
చేరి
దైవస్వరూపులుగా
రూపొందాలి.
“మేము
మానవులము”
అని
మీరు
భావిస్తున్నారు.
ఇది
మీ
భ్రమ.
నిజమైన
భక్తిప్రపత్తులను
మీరు
పెంచుకుంటే,
‘నేను
దైవము’
అనే
సత్యాన్ని
గుర్తిస్తారు.
అహం
బ్రహ్మాస్మి,
ప్రజ్ఞానం
బ్రహ్మ,
అయమాత్మా
బ్రహ్మ
తత్
త్వం
అసి
(అది
నేనే)
అనే
ధైర్యము,
విశ్వాసము
మీలో
రావాలి.
ఇది
ఈశ్వరనామ
సంవత్సరము,
సకలైశ్వర్య
స్వరూపమైన
సంవత్సరము,
దివ్యమైన
హృదయ
సంబంధమైన
సంవత్సరము.
కనుక
హృదయాన్ని
పరిశుద్ధం
గావించుకోవాలి.
ఏవిధంగా?
దైవచింతన
ఒకటి,
సమాజసేవ
మరొకటి.
ఈ
రెండింటి
ద్వారానే
చిత్తశుద్ధి
కల్గుతుంది.
చాలమంది
పురాణాలు
చదవాలన్నా,
పూజలు
చేయాలన్నా
ఆఫీసు
పనులవల్ల,
బిజినెస్
వ్యవహారములవల్ల
తమకు
సమయమే
చిక్కటం
లేదంటారు.
సాయంత్రం
ఆఫీసు
నుండి
వస్తూనే
చాల
అలసిపోయినట్లుగా
కుర్చీలో
కూర్చుంటారు.
దేవాలయానికి
పోయి
పూజచేసి
వద్దామని
ఇంట్లోవారు
అంటే,
“అబ్బే!
నాకు
టైమ్
లేదు,
నేను
చాల
అలసిపోయాను”
అంటారు.
ఇలాంటివారు
పక్కా
సోమరిపోతులే!
పోనీ
కుర్చీలో
కూర్చుని
ఏమైనా
రెస్ట్
తీసుకుంటారా?
లేదే!
టీవీ
వేసుకొని
సినిమా
చూస్తారు.
టీవీ
చూడటానికి
సమయం
చిక్కటం
లేదా?
క్లబ్బుకు
పోయి
కార్డ్స్
ఆడటానికి
అలసట
అడ్డు
రావటం
లేదా?
దైవచింతన
చేయడానికి
మాత్రం
టైమ్
లేదంటారు.
ఇది
పచ్చి
అబద్ధం.
కావలసినంత
టైమ్
ఉన్నదికాని
దానిని
వ్యర్థం
చేస్తున్నారు.
కాలము
భగవత్స్వరూపము.
కనుక
ప్రతి
క్షణమును
దైవప్రార్థనచేత
సార్థకం
గావించుకోవాలి.
సరియైన
ప్రార్థన
లోకంలో
అనేకమంది
దైవాన్ని
ప్రార్థిస్తున్నారు.
కాని
దేనికోసం?
లౌకికమైన,
ప్రాకృతమైన
కోరికలు
నెరవేరాలని
ప్రార్థిస్తున్నారు.
ఇది
సరియైన
ప్రార్థన
కానేరదు.
దైవప్రేమకోసం
ప్రార్థించాలి.
దైవప్రేమయే
సత్యమైనది,
శాశ్వతమైనది,
అమరమైనది,
అఖండమైనది.
భగవంతుడు
ఆనందమయుడు,
సచ్చిదానంద
స్వరూపుడు.
అది
ఎటువంటి
ఆనందము?
7
▾
Meaning
Keep
కదలిపోయే
మేఘమువంటి
భౌతికమైన
ఆనందము
కాదు.
అది
నిత్య
సత్యమైన
ఆనందము.
కనుక
మీరు
దైవాన్ని,
“నీ
ప్రేమ
నాకు
కావాలి,
నీ
ఆనందము
నాకు
కావాలి”
అని
ప్రార్థించాలి.
ఈవిధమైన
ప్రార్థన
సల్పేవాడే
నిజమైన
భక్తుడు.
“నాకిది
కావాలి,
అది
కావాలి”
అని
లౌకికమైన
కోరికలు
కోరేవాడు
భక్తుడే
కాదు.
నిత్యమైన
సత్యమైన
దైవప్రేమను
మీరు
ఆశించాలి.
మీలో
ఆ
దైవప్రేమయే
గనుక
ఆవిర్భవిస్తే
జగత్తంతా
ప్రేమమయమే!
జగత్తంతా
ఆనందమయమే!
ఆనందంతో
నిండిన
నేత్రములతో
చూస్తే
జగత్తంతా
ఆనందమయంగానే
కనిపిస్తుంది.
ద్వేషపూరితమైన
భావంతో
చూస్తే
జగత్తంతా
ద్వేషమయంగానే
కనిపిస్తుంది.
కనుక
ముందు
మీ
దృష్టిని
మార్చుకోండి,
సృష్టిని
మార్చడానికి
ప్రయత్నించవద్దు.
ఇది
భగవంతుని
యొక్క
సృష్టి.
దీనిని
ఎవ్వరూ
మార్చలేరు.
మీ
పాడుదృష్టిని,
పీడదృష్టిని
నిర్మూలంగావించుకొని
ప్రేమదృష్టిని,
శాంతదృష్టిని,
సహనదృష్టిని,
ఆనందదృష్టిని
అలవర్చుకోండి.
మీ
కంటికి
ఎరుపు
రంగు
అద్దాలను
వేసుకుంటే
జగత్తంతా
ఎఱ్ఱగానే
కనిపిస్తుంది.
నీలిరంగు
అద్దాలను
ధరిస్తే
జగత్తంతా
నీలంగానే
కనిపిస్తుంది.
అదేవిధంగా
మీ
హృదయం
ప్రేమమయమైతే
మీ
దృష్టి
బ్రహ్మమయమైపోతుంది.
సర్వమూ
బ్రహ్మమయమే.
ఎవ్వరూ
మీకు
విరోధులు
లేరు.
ఎవ్వరూ
మీకు
ద్వేషులు
కారు.
“అందరూ
నాస్వరూపులే”
అనే
విశాలమైన
భావాన్ని
దినదినాభివృద్ధి
గావించుకోవాలి.
ఎవరేమి
అనుకున్నప్పటికీ
మీరు
లెక్క
చేయనక్కర
లేదు.
మీరు
మంచిమార్గాన్ని
అనుసరిస్తున్నప్పుడు
మీకు
భయమెందుకు?
దేనికీ
భయపడనక్కర
లేదు,
ధైర్యంగా
ఉండాలి.
ధైర్యం
ఎప్పుడు
వస్తుంది?
మంచి
పని
చేసినప్పుడే
ధైర్యం
వస్తుంది.
కనుక
ప్రేమను
పెంచుకోండి.
ఎటువంటి
ప్రేమ?
క్షణభంగురమైన
ప్రేమ
కాదు,
సత్యమైన
ప్రేమ
కావాలి.
అదే
అమృతత్వము,
అదే
అమరత్వము.
Previous
←
Bhajans and bliss
Next
The Saints of Thamilnadu
→