Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · Bhakti, discipline, the keeping of duty
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Bhakti, discipline, the keeping of duty
23 September 1997, Pādukā festival, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమాత్మస్వరూపులారా!
అహంకారంతో
జీవించినంత
కాలము
మానవుణ్ణి
ఎప్పుడూ
ప్రేమించరు,
చివరికి
భార్యాబిడ్డలు
కూడా
ప్రేమించరు.
అహంకారాన్ని
విసర్జించినప్పుడే
మానవుడు
విశ్వప్రేమకు
అర్హుడవుతాడు.
క్రోధం
ఉన్నంత
వరకు
మానవుణ్ణి
శోకం
వదలదు.
వాంఛలున్నంతవరకు
శ్రీలక్ష్మి
మానవుని
చెంత
చేరదు.
ఇంత
లోభమున్నంతవరకు
మానవుడు
సుఖాన్ని
అనుభవించలేడు.
లోభముచేతనే
దుర్యోధన
దుశ్శాసనాదులు
సకల
సంపదలకు
దూరమయ్యారు.
టంబ్లరు
నిండుగ
నీరున్నంతవరకు
అందులో
పాలు
పోయడానికి
వీలుకాదు.
నీరును
పారబోసినప్పుడే
దానిలో
పాలు
పోయడానికి
వీలవుతుంది.
అదేవిధంగా
మన
తలలో
నిండిన
దుర్గుణాలను
మొట్టమొదట
దూరం
చేసుకోవాలి.
అప్పుడే
మనలో
సద్గుణాలను
చేర్చుకోవడానికి
వీలవుతుంది.
ఆకాశంలో
ప్రకాశించే
సూర్యుడు
భూమిపై
జలముతో
నింపబడిన
బంగారుపాత్రలోను,
వెండిపాత్రలోను,
ఇత్తడిపాత్రలోను,
మట్టిపాత్రలోను
ఒకే
విధంగా
ప్రతిబింబిస్తాడు.
బంగారమునకు,
వెండికి,
ఇత్తడికి,
మట్టికి
విలువలు
వేరువేరుగా
ఉంటాయి
గాని,
ఆయా
పాత్రలలోని
జలములో
కనిపించే
సూర్యుని
ప్రతిబింబమునకు
విలువ
ఒక్కటే!
ఒక్కొక్క
పాత్రలో
ఒక్కొక్క
సూర్యుడు
కనిపిస్తాడుకాని
ఉన్నది
ఒకే
సూర్యుడు
కదా!
ఒక్క
సూర్యుడు
సమస్త
లోకములకు
ఒక్కొక్కడై
తోచునట్లుగా,
ఒకే
భగవంతుడు
ఒక్కొక్క
హృదయమందు
ఒక్కొక్క
భావమును
పురస్కరించుకొని
రామ,
కృష్ణ,
గోవింద,
నారాయణ,
సాయి
మున్నగు
వివిధ
రూపాలతో
సాక్షాత్కరిస్తున్నాడు.
రూపనామములు
వేరుకాని,
దైవమొక్కడే.
ఈ
సత్యాన్ని
ప్రతి
వ్యక్తి
గుర్తించి
వర్తించాలి.
“ఏకోహం
బహుస్యాం”.
ఒక్కడే
అనేకంగా
గోచరిస్తున్నాడు.
ఈ
అనేకత్వానికి
కారణం
ఉపాధిభ్రాంతియే.
మానవ
దేహ
మొక
కారువంటిది.
కారుకు
నాల్గు
చక్రాలున్నట్లుగా
మానవ
జీవితానికి
ధర్మార్థకామ
మోక్షాలనే
నాల్గు
పురుషార్థములు
నాల్గుటైర్లుగా
ఉన్నాయి.
టైర్లున్నంతమాత్రమున
చాలదు;
అందులో
గాలి
ఉండాలి
కదా!
అదే
విశ్వాసం.
పురుషార్థములనే
టైర్లయందు
విశ్వాసమనే
గాలి
బాగా
ఉన్నప్పుడే
దేహమనే
కారు
ముందుకు
పోగలదు.
అయితే
లోపల
స్టీరింగ్ఎలా
తిరుగుతే
టైర్లు
అలా
తిరుగుతాయి
కదా!
ఆ
స్టీరింగే
మనస్సు.
కారు
స్టార్ట్
కావాలంటే
స్విచ్
చాల
ప్రధానమైనది.
అదే
బుద్ధి.
మన
కడుపే
పెట్రోల్
ట్యాంకు.
మనం
భుజించే
ఆహారమే
పెట్రోలు.
ఈ
దేహమనే
కారులో
కూర్చుని
ఆత్మ
అనే
దేవుడు
డ్రైవ్చేస్తున్నాడు.
ఇట్టి
ఆత్మను
ఆధారంగా
చేసుకున్నప్పుడే
మనం
చేరవలసిన
స్థానమునకు
సుఖంగా
చేరుతాము.
ఒకానొక
పల్లెలో
వాటర్సప్లై
నిమిత్తమై
ఒక
బోర్
వెల్
వేసి
పెద్దట్యాంక్
కట్టారు.
ఆ
ట్యాంకుకు
పైపులు
పెట్టారు.
వాటర్సప్లైని
ప్రారంభించడానికి
ఒక
మినిష్టర్ని
ఆహ్వానించారు.
ప్రారంభోత్సవానికి
ఒక
మంచి
బంగారు
ట్యాప్
ఏర్పాటు
చేశారు,
దాని
క్రింద
మంచి
వెండిపాత్ర
పెట్టారు.
మినిష్టర్‌కు
దండవేశారు.
ఆయన
ప్రారంభోత్సవం
చేయడానికి
ట్యాప్
దగ్గరికి
వెళ్ళి
దానిని
త్రిప్పాడు.
కాని
నీరు
రాలేదు!
కారణమేమిటి?
ఆ
ట్యాప్‌కు,
ట్యాంక్‌కు
కనెక్షన్
చేయబడలేదు!
అదేరీతిగా
మనం
నోటితో
నామస్మరణ
చేస్తున్నాము,
చేతులతో
తాళం
వేస్తున్నాము.
కాని
హృదయానికి,
ఆత్మకు
సంబంధం
చేయడం
లేదు.
2
▾
Meaning
Keep
హృదయార్పిత
భావం
లేకుండా
కేవలం
బాహ్యంగా
నామస్మరణచేస్తే
ప్రయోజనం
లేదు.
హృదయానికి,
దైవానికి
సరియైన
సంబంధాన్ని
పెట్టుకోవాలి.
రావణుడు
ప్రతిరోజు
అనేక
వేల
శివాలయాలకు
ప్రదక్షిణ
చేసి
శివార్చన
చేసేవాడు.
కాని
ఏమి
ప్రయోజనం?
తన
హృదయానికి,
దైవానికి
ఏమాత్రం
సంబంధం
చేయలేదు.
కనుకనే
అతడు
రాక్షసునిగానే
నిల్చిపోయాడు.
కనుక
హృదయార్పిత
భావం
లేకుండా
నామస్మరణ
చేసేవారంతా
రావణుని
సంతతివారనే
చెప్పవచ్చు.
మన
మనస్సును
భగవంతుని
వైపు
మరల్చాలి.
పాదుకలపూజ
చేసేటప్పుడు
మీ
దృష్టి
భగవంతుని
పాదములపైననే
నిలవాలి.
చేతితో
పూలు
వేస్తూ
మనస్సును
మార్కెట్‌కు
పంపితే
పూజ
చేసి
ఏమి
ప్రయోజనం?
భరతుడు
శ్రీరామచంద్రుని
పాదుకలను
తీసుకువచ్చి
14
సంవత్సరములపాటు
మానసికంగా
తాను
శ్రీరాముని
పాదములలో
లీనమై
పోయాడు.
ఈనాడు
మీ
మనస్సు
కేవలం
సృష్టిని
గూర్చి
విచారిస్తున్నదికాని
సృష్టికర్తను
గూర్చి
విచారించటంలేదు.
మనోతృప్తి
నిమిత్తమై
మీరు
అనేక
కర్మల
నాచరిస్తున్నారు.
మనస్సును
తృప్తి
పర్చడం
ఎవ్వరికీ
సాధ్యం
కాదు.
మనస్సునే
మరచిపోవాలి,
మీరు
అమనస్కులు
కావాలి.
అప్పుడే
మీకు
ఆనందం
ప్రాప్తిస్తుంది.
అయితే
మీరు
అమనస్కులు
కావాలంటే
ఏమి
చేయాలి?
దైవాన్ని
తప్ప
మరొక
విషయాన్ని
చింతించకూడదు.
ఒకానొక
సమయంలో
ద్రోణాచార్యుడు
కౌరవపాండవులకు
విలువిద్యలో
ఒక
పరీక్షపెట్టాడు.
ఒకచెట్టుకొమ్మకు
పక్షిని
కట్టి
ముందుగా
దుర్యోధనుణ్ణి
పిల్చి
దానిని
కొట్టమన్నాడు.
దుర్యోధనుడు
విల్లును
ఎక్కు
పెట్టి
గురి
చూస్తున్న
సమయంలో,
“దుర్యోధనా!
అక్కడ
నీకేమి
కనిపిస్తున్నది?”
అని
ప్రశ్నించాడు.
“గురువర్యా!
ఆ
వృక్షము,
దానికొమ్మలు,
పక్షి,
దాని
వెనుకనున్న
ఆకాశము...
అంతా
కనిపిస్తున్నది”
అన్నాడు.
“నీవే
కొద్దిసేపు
ఆగు,”
అని
కౌరవులందరినీ
ఒకరితరువాత
ఒకరిని
పిల్చి
ఇదే
ప్రశ్న
వేశాడు.
అందరూ
అదే
సమాధానం
చెప్పారు.
తరువాత
పాండవులను
పిలిచాడు.
పాండవులలో
ఒక్క
అర్జునుడు
మాత్రం,
“గురువర్యా!
నాకు
ఆ
పక్షి
తప్ప
వేరేమీ
కనిపించడం
లేదు”
అన్నాడు.
అదే
నిజమైన
ఏకాగ్రత.
దేనిని
సాధించాలనుకున్నామో
దాని
పైననే
మన
లక్ష్యం
పెట్టాలి,
మిగిలిన
విషయాలను
లెక్క
చేయకూడదు.
మీకు
దైవం
కావాలనుకున్నప్పుడు
మీలో
పరిపూర్ణమైన
ప్రేమను
పెంచుకోవాలి.
ఎందుకంటే
పరిపూర్ణ
ప్రేమస్వరూపుడే
దైవం.
దైవం
ఎక్కడో
ప్రత్యేకంగా
లేడు;
మీలోపల,
వెలుపల,
పైన,
క్రింద
సర్వత్ర
వ్యాపించియున్నాడు.
దైవాన్వేషణ
సల్పుతున్నామని
అంటారు
కొంతమంది.
దైవాన్వేషణ
అనే
పదము
చాల
హాస్యాస్పదమైనది.
సర్వత్ర
ఉన్న
దైవాన్ని
అన్వేషించడమేమిటి?!
అయితే
దైవం
ప్రేమనేత్రానికి
మాత్రమే
కనిపిస్తాడు.
మీలో
ప్రేమనేత్రం
లేకపోవడంచేత
మీకు
దైవం
కనిపించడంలేదు.
ఈ
లౌకికమైన
తెలివితేటలచేత
మీరు
ప్రేమను
పూర్తిగా
కోల్పోతున్నారు.
“వానలు
వచ్చెనంచు
భువి
పండునె
విత్తులు
నాటకున్న?
ఆ
వానలు
లేనిచో
ఫలము
నిచ్చునె
విత్తులు
నాటియున్న?”
విత్తనమూ
నాటాలి,
వర్షమూ
రావాలి.
అదేవిధంగా
మన
హృదయక్షేత్రంలో
నామమనే
విత్తనమునూ
నాటాలి,
దానిపై
ప్రేమ
అనే
వర్షమూ
కురవాలి.
అప్పుడే
ఫలసిద్ధి
కల్గుతుంది.
మీకున్న
సర్వాంగములనూ
పవిత్రం
గావించుకోవాలి.
ఒకానొక
సమయంలో
తులసీదాసు,
“రామా!
నన్నెందుకు
అంగహీనుని
గావించావు?”
అని
చాల
బాధపడ్డాడు.
అప్పుడతని
చుట్టూ
ఉన్న
శిష్యులు,
“స్వామీ!
మీకేమి
తక్కువ?
అన్ని
అంగములూ
మీకు
చక్కగానే
ఉన్నాయి
కదా!”
అన్నారు.
“ఉండి
ఏమి
ప్రయోజనం
నాయనా?
చేతులున్నాయి
కాని
రామసేవ
చేయలేక
పోతున్నాను;
కన్నులున్నాయి
కాని
రాముణ్ణి
దర్శించలేక
పోతున్నాను;
చేటలవలె
చెవులున్నాయికాని
రాముని
మాటలను
వినలేక
పోతున్నాను.
3
▾
Meaning
Keep
కనుకనేను
అంగహీనుణ్ణే
కదా!”
అన్నాడు.
ఇదెంతటి
గొప్ప
భావము!
కాని
ఈ
కలి
ప్రభావంచేత
భక్తులు
భగవత్
శక్తినే
శంకిస్తున్నారు.
“నిజంగా
భగవంతునిలో
శక్తి
ఉంటే
ఎందుకు
నా
కష్టాలను
నివారించటం
లేదు?
ఎందుకు
నాభక్తిని
మెచ్చుకోవడం
లేదు?
ఎందుకు
నా
దగ్గరకు
రావటం
లేదు?”
అని
తామేదో
గొప్ప
భక్తులమనీ,
భగవంతుడే
శక్తిహీనుడనీ
భావించుకుంటున్నారు.
తమకు
ఏమైనా
కష్టనష్టములు
సంభవించాయంటే
ఈవిధమైన
బలహీనతకు
గురి
అవుతుంటారు.
దేనిలో
బలహీనులయినా
ఫరవాలేదుకాని
దైవవిశ్వాసంలో
మాత్రం
బలహీనులు
కాకండి.
భగవద్విశ్వాసమే
మనలను
ఈ
భవసాగరాన్ని
దాటించగలదు.
కనుక
భగవంతునిపై
అమితంగా
విశ్వాసాన్ని
పెంచుకోండి.
దివ్యాత్మస్వరూపులారా!
ఈ
మూడు
దినముల
నుండి
మధురై
పాదుకా
ట్రస్టువారు
చక్కని
ఆదర్శాన్ని
నిరూపిస్తూ
వచ్చారు.
మంగళ
వాయిద్యాలు
వాయించేవారు
మొదలుకొని
మంత్రాలు
చెప్పే
పండితుల
వరకు
పూజలు
చేసే
వృత్తులతో
సహా
అందరూ
ఐకమత్యంగా
ఒకరి
నొకరు
అనుసరిస్తూ
చక్కని
ఆదర్శాన్ని
నిరూపించారు.
ఏ
సమయానికి
ఎవరిచేత
ఎక్కడ
ఏది
జరగాలో
అది
చక్కగా
స్విచ్
ఆన్
చేసినట్లుగా
జరిగిపోయింది.
సన్నాయి
మేళంవారు
సమయసందర్భానుసారంగా
చక్కని
పాటలను
వినిపించారు.
పండితులు
కూడా
మంచి
స్వరంతో
సుస్పష్టంగా
మంత్రాల
నుచ్చరించి
దివ్యమైన
వైబ్రేషన్‌తో
వాతావరణాన్ని
ప్రభావితం
చేశారు.
ప్రతి
రాష్ట్రమువారు
ఈవిధమైన
ఆదర్శాన్ని
అనుసరించాలనినేను
ఆశిస్తున్నాను.
కాని
కొన్నికొన్ని
రాష్ట్రాలలో
ఐకమత్యం
చాల
తక్కువగా
ఉన్నది.
యూనిటీ
(ఐకమత్యం)
ఉన్నచోటే
ప్యూరిటీ
(పవిత్రత)
ప్రవేశిస్తుంది;
ప్యూరిటీ
ఉన్నచోటే
డివినిటీ
(దివ్యత్వం)
వెల్గుతుంది.
మధురై
పాదుకాట్రస్ట్వారు
ఈ
సత్యాన్ని
చక్కగా
నిరూపించారు.
ఇంత
వృద్ధుడై
యుండి
ఏమీ
తెలియనట్లుగా
కనిపించే
సుబ్రహ్మణ్య
చెట్టియార్
తన
మాటలతో
అందరినీ
ఆకర్షించుకొని,
అందరినీ
ఏకంగా
కలుపుకొని
పనిచేస్తూ
వస్తున్నాడు.
అతని
కుమారుడు,
అల్లుడు
కూడా
అతనికి
చేదోడువాదోడుగా
ఉంటూ
దీనిని
చక్కగా
అభివృద్ధి
గావిస్తున్నారు.
ఈవిధమైన
ఐకమత్యముంటే
ఎంతైనా
సాధించవచ్చు.
ఐదు
వ్రేళ్ళు
కలసినప్పుడు
ఎంతటిపనైనా
చేయవచ్చు,
ఒక్కొక్క
వ్రేలు
ఏమిపని
చేయగలదు?!
వచ్చిన
భక్తులు,
సాధకులు,
ఆ
కమిటీ
మెంబర్లు
అందరూ
ఐకమత్యంగా
పని
చేయడం
వల్లనే
ఈ
కార్యక్రమాన్ని
విజయవంతంగా
నిర్వహించగల్గారు.
ఈ
రోజు
తెల్లవారుఝామున
జరిగిన
పాదుకల
పూజలో
ఇన్నివేలమంది
పాల్గొన్నప్పటికీ
పిన్డ్రాప్సైలెన్స్గా
ఉన్నారు;
ఎక్కడా
చిన్నపిల్ల
ఏడ్చినట్లు
కూడా
లేదు.
ఈ
నిశ్శబ్దంలోని
శబ్దమే
భగవత్స్వరూపం.
బ్రహ్మ
ఎక్కడున్నాడంటే
నిశ్శబ్దంలోని
శబ్దంగా
ఉంటున్నాడు.
మన
చెవులు
తెరుచుకొని
ఉన్నంతవరకు
అన్ని
రకములైన
శబ్దాలు
మనకు
వినిపిస్తాయి.
ఒక్కసారి
చెవులు
పూర్తిగా
మూసుకోండి,
లోపల
‘ఓం’
అనే
దివ్యమైన
శబ్దం
మీకు
వినిపిస్తుంది.
కనుక
నిశ్శబ్దంలోని
శబ్దమే
బ్రహ్మము.
భగవంతుడు
మీ
వెంటనే
నడుచుకుంటూ
వస్తుంటాడు.
మీరు
నిశ్శబ్దంగా
ఉన్నప్పుడే
అతని
అడుగుల
సవ్వడి
వినడానికి
వీలవుతుంది.
కనుకనే
“ది
సౌండ్
ఆఫ్
సైలెన్స్
ఈజ్
గాడ్”
అన్నారు.
మీరు
నిశ్శబ్దంగా
ఉండాలి.
మధురై
పాదుకా
ట్రస్ట్‌వారు
ఈ
డిసిప్లిన్
(క్రమశిక్షణ)ను
చక్కగా
పాటిస్తూ
వచ్చారు.
వారిలో
డిసిప్లిన్,
డివోషన్,
డ్యూటీ
మూడూ
ఉంటున్నాయి.
మున్ముందు
కూడా
వారు
ఇదేవిధంగా
నడుచుకొని
లోకానికి
చక్కని
ఆదర్శాన్ని
అందిస్తారని
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
God delights in the feeling, not in outward show
Next
“Śarīramādyaṃ khalu dharmasādhanaṃ”
→