Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · When the resolve is good, nothing is impossible
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
When the resolve is good, nothing is impossible
11 October 1997, Vijayadaśamī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ప్రాచీన
కాలము
నుండి
భారతదేశం
అన్ని
దేశములకూ
ఆధ్యాత్మిక
సిరిసంపత్తులచేత
సుస్థిర
శాంతిభద్రతలు
చేకూర్చుచూ
వచ్చుచున్నది.
కాలముచే
మారక,
చరిత్రచే
మాయక,
ప్రళయముచే
తరగక,
సృష్టిచే
పెరగక
ఏ
సత్యమైతే
ఉన్నదో
ఆ
సత్యస్వరూపమే
భారతీయ
సంస్కృతి.
ఈ
సంస్కృతి
ప్రతిబింబమే
సనాతన
ధర్మము.
ఈ
సనాతన
ధర్మం
యొక్క
బాహ్య
స్వరూపమే
నీతి.
ఈ
నీతిని
ఆధారం
చేసుకొనియే
మానవుడు
తన
జాతిని
పోషించుకుంటూ
రావాలి.
మానవజాతి
నైతికంగా
అభివృద్ధి
చెందినప్పుడే
సమానత్వము,
సోదరత్వము,
స్వేచ్ఛ
అనే
ఆదర్శాలు
ఆచరణలోకి
వస్తాయి.
ప్రకృతి
వనరుల
దుర్వినియోగం
తగదు
మానవాళికంటే
అత్యంత
విశాలమైనది
ఈ
సృష్టి.
ఈ
సృష్టి
రహస్యాన్ని
చక్కగా
గుర్తించి
వర్తించడమే
మానవుని
ప్రధాన
కర్తవ్యం.
తల్లిపాలను
బిడ్డలు
గ్రోలినట్లుగా,
పూవులోని
మకరందమును
తుమ్మెదలు
త్రాగినట్లుగా
ప్రకృతిలోని
సర్వసంపదలను
అనుభవించుటకు
మానవునికి
అధికారమున్నది.
కానీ
మానవుడు
ఈ
ప్రకృతి
కేవలం
తన
ఉపభోగనిమిత్తమై
ఏర్పడినదని
భావించి
ప్రకృతి
వనరులను
దుర్వినియోగపర్చుతున్నాడు.
ఈ
సృష్టి
మానవుని
ఉపభోగ
నిమిత్తమై
ఏర్పడినది
కాదు.
దీని
వనరులను
పరిమితమైన
రీతిలో
అనుభవించమని
కోరాడు
భగవంతుడు.
కానీ
మానవుడు
దీనిని
మితిమీరి
అనుభవించడానికి
ప్రయత్నిస్తున్నాడు.
ఇదియే
ఈనాడు
సంభవిస్తున్న
ఉప్పెనలు,
కరువుకాటకములు,
అతివృష్టి,
అనావృష్టి
మున్నగు
ప్రకృతివైపరీత్యములకు
మూలకారణమైనది.
ఈ
ప్రకృతి
ఒక
బ్యాలన్సుతో
కూడినది.
ఇది
ఒక
గ్లోబు.
ఏ
వైపున
భారం
ఎక్కువవుతుందో
ఆ
వైపుకు
ఇది
మరలుతుంది.
మానవుడు
ఈ
ప్రకృతిలోని
శక్తులను
మితిమీరి
అనుభవించడంచేత
ఈ
బ్యాలన్సు
తప్పిపోతున్నది.
హక్కు
-
కర్తవ్యం
ఈనాడు
మానవుడు
ప్రతి
రంగమునందు
హక్కు,
హక్కు
అని
అఱ్ఱులు
జాస్తున్నాడు.
నిజంగా
మానవునికి
హక్కు
అనేది
లేనే
లేదు.
కర్తవ్యాన్ని
చక్కగా
నిర్వర్తించినప్పుడే
హక్కు
అనేది
ఏర్పడుతుంది.
వర్షము
కురిసినప్పుడే
వంకలు
ప్రవహిస్తాయి.
‘వర్షము
నాకు
అక్కర
లేదు,
వంకలు
మాత్రం
కావాలి’
అంటే
ఎలా
వస్తాయి?
వీలుకాదు.
అదేవిధంగా
మానవుడు
తన
కర్తవ్యాన్ని
విస్మరించి
హక్కు
కోసమని
పోరాడితే
లభించేది
ఏమీ
లేదు.
అశాంతియే
లభిస్తుంది.
ముఖ్యమంత్రి
చెప్పినట్లుగా
మనం
ఏ
పని
చేసినా
ప్రజలకు
ఆదర్శవంతమైనదిగా
ఉండాలి.
అట్లు
గాకుండా
ఏదో
పుట్టడం,
తినడం,
మరణించడం....
వీటికి
మాత్రమే
జీవితం
పరిమితమైతే
ఇంక
మానవత్వమునకు
విలువేమున్నది?
ఈనాడు
మనం
పుణ్యఫలం
కావాలని
ఆశిస్తున్నాంకాని,
పుణ్యకార్యములకు
ముందంజ
వేయటం
లేదు;
పాపఫలము
వద్దని
వెనుకకు
నెట్టుతున్నాముకాని,
పాపకార్యములకు
ముందంజ
వేస్తున్నాము.
2
▾
Meaning
Keep
మొట్టమొదట
మనలో
త్రికరణ
శుద్ధి
కలగాలి;
దైవప్రీతి,
పాపభీతి,
సంఘనీతి
మూడింటినీ
చేర్చుకోవాలి.
ఒక్క
త్రాగునీటి
విషయంలో
మాత్రమే
కాదు,
ప్రతి
రంగమునందు
మానవునికి
అనేక
సమస్య
లుంటున్నాయి.
పుట్టుక
ఒక
చింత,
భూమినుండుట
చింత,
సంసారమొక
చింత,
చావు
చింత...
అన్నీ
చింతలే!
ఇంట్లో
బిడ్డకు
కల్యాణం
చేయాలనుకుంటే
అది
కూడా
ఎలా
జరుగుతుందో
ఏమిటో
అని
చింత
ప్రారంభమవుతుంది.
కనుక
జీవితమే
ఒక
చింత.
“సర్వ
చింతలు
బాపెడి
సర్వేశు
కృపను
పొందుడికనైన
నరులార
కోర్కెమీర....”
ఈ
సర్వేశ్వరుని
కృపను
పొందితే
సర్వచింతలు
నివారణైపోతాయి.
పురుషప్రయత్నం
చేయాలి
‘సాధనమున
పనులు
సమకూరు
ధరలోన’.
సాధన
లేక
ఏ
పనీ
మనం
సాధించలేము.
తట్టలోని
పదార్థము
పొట్టలోకి
చేరాలంటే
నోటికి,
చేతికి
పని
పెట్టాలి
కదా!
కనుక
మన
కర్తవ్యకర్మలను
మనం
నిర్వర్తిస్తూపోవాలి.
ప్రతి
పనికి
ప్రభుత్వంపైన,
అధికారులపైన
వత్తిడి
పెట్టకూడదు.
మనం
చేయవలసింది
మనం
చేయాలి.
ఈనాటి
మానవునియందు
ఇట్టి
ఓపికగాని,
దీక్షగాని
కనిపించడం
లేదు.
దేనికి
తగిన
ప్రయత్నం
దానికి
చేయకుండా
త్వరగా
ఫలితం
రావాలంటే
ఎట్లా
వస్తుంది?
మన
ప్రయత్నం
మనం
చేయాలి,
దానికి
కాలకర్మకారణకర్తవ్యాలు
కూడా
కలసి
రావాలి.
అసలు
ప్రయత్నమే
చేయకుండా
అటు
భగవంతునిపైనగాని,
ఇటు
ప్రభుత్వంపైనగాని
నింద
వేయడం
మంచిది
కాదు.
భగవంతుడు
ఏమైనా
చేయగలడు.
కాని
ముందు
మీకిచ్చిన
శక్తిని
మీరు
సద్వినియోగపరచుకోండి.
అప్పుడే
భగవంతుడు
మీకు
తగిన
ఫలితము
నందించగలడు.
మీ
శక్తిని
మీరు
ఏమాత్రము
వినియోగించుకుండా
అంతా
భగవంతుడే
చేయాలంటే
…లుకాదు.
పాపభీతి,
దైవప్రీతి
లేకుండా
మీరు
ఇష్టానుసారం
ప్రవర్తిస్తుంటే
దైవ
మేరీతిగా
అనుగ్రహిస్తాడు?
మానవత్వమునే
మరచిపోయి
అహంకార
మమకార
అసూయలను
అభివృద్ధి
చేసుకుంటూపోతే
మీకు
శాంతి
ఏరీతిగా
లభ్య
మౌతుంది?
హస్తంలో
అణుబాంబు
ఉంచుకొని
శాంతి,
శాంతి
అని
అరిస్తే
శాంతి
లభిస్తుందా?
శాంతి
కావాలంటే
ముందు
మన
చుట్టూ
ఉన్న
వాతావరణమును
పవిత్రమైనదిగా,
ప్రశాంత
మైనదిగా
మార్చుకోవాలి.
ఒక
గ్రామం
అభివృద్ధిలోకి
రావాలంటే
ఆ
గ్రామంలోని
ప్రజలంతా
ఏకమైతే
ఎంతైనా
చేయవచ్చు.
కానీ
ఈనాడు
కలి
ప్రభావముచేత
ఎవరు
మంచి
పనులు
చేస్తున్నారో
వారికి
అనేక
ఆటంకములు
అడ్డు
తగులుతుంటాయి.
చిమ్మెట
మీకు
తెలుసు
-
పదివేల
రూపాయల
పట్టు
చీరను
కూడా
మసిగుడ్డను
కొట్టినట్లు
కొట్టడం
దాని
స్వభావం.
ఈ
సమాజంలోను
చిమ్మెటసంతతివారు,
దోమసంతతివారు,
నల్లిసంతతివారు
కొంతమంది
ఉంటారు.
తాము
చేయరు,
చేసేవారిని
చేయనివ్వరు.
పైగా
నిరుత్సాహం
కల్గిస్తారు.
మంచివారిని
ఏదో
ఒక
విధంగా
నిందించడం
వారి
స్వభావం.
పోనీ
వారేమైనా
మంచి
పని
చేశారా,
అంటే
ఏమీ
ఉండదు.
అలాంటి
వారికి
అసలు
విమర్శించే
అధికారమే
లేదు.
ఎవరేమనుకున్నా
ఫరవాలేదు,
మనం
చేసేది
మంచి
పని
అనే
విశ్వాసం
మనకు
దృఢంగా
ఉన్నప్పుడు
మనం
ఎవ్వరికీ
వెఱువనక్కర
లేదు.
అదే
ముఖ్యమంత్రికి
చెప్పాను.
3
▾
Meaning
Keep
త్యాగమే
యోగం,
భోగమే
రోగం
ఈనాడు
భారతదేశంలో
నీటికొరకు
బాధ
పడేవారిని
కోట్ల
కొలది
చూస్తున్నాము.
మానవుల
ప్రవర్తనలోని
దోషమే
దీనికి
మూలకారణం.
పూర్వం
భారతీయులందరూ
త్యాగానికి
పట్టం
కట్టారు,
న్యాయానికి
కంకణం
తొడిగారు,
ధర్మాన్ని
అందల
మెక్కించారు,
సత్యాన్ని
స్వాగతించారు.
త్యాగం
లేక
జీవితంలో
ఏమున్నది
చెప్పండి.
మనం
పీల్చిన
గాలిని
తిరిగి
విడిచిపెట్టకపోతే
మన
ఊపిరితిత్తులు
పాడైపోతాయి.
తిన్న
ఆహారాన్ని
మరొకవైపున
విసర్జించకపోతే
పొట్ట
చెడిపోతుంది.
కాబట్టి
త్యాగము
మన
కెంతో
క్షేమం
చేకూర్చుతున్నది.
త్యాగమే
యోగంగా
రూపొందుతుంది,
భోగమే
రోగంగా
మారుతుంది.
కనుక
ప్రతి
మానవుడు
తన
శక్తి
కొలది
ఏదో
కొంచెం
త్యాగం
చేసి
తోటి
మానవులకు
తగిన
సహాయం
చేయాలి.
ఎంతమందినో
బాధ
పడేవారిని
చూస్తున్నాము,
చూసి
జాలిపడుతున్నాము.
కానీ
ప్రయోజనమేమిటి?
జాలిని
ఆచరణ
రూపంలో
నిరూపించినప్పుడే
అది
సార్థకమవుతుంది.
మనస్సులు
మారాలి
ప్రేమస్వరూపులారా!
ఈనాడిక్కడకు
వచ్చిన
మినిష్టర్లు
హృదయానికి
హత్తుకునేటట్లు
మాట్లాడారు.
ఇలాంటి
మాటలను
క్రియలో
ప్రవేశపెట్టినప్పుడే
మన
మెంతైనా
అభివృద్ధి
పొందుతాము.
మన
ముఖ్యమంత్రి,
కేంద్రమంత్రి,
స్పీకరు
వీరందరూ
మీకు
ఎంతో
ఉత్సాహప్రోత్సాహముల
నందించారు.
వీటిని
మీరు
ఒక
చెవితో
విని
మరొక
చెవితో
వదలిపెడితే
ప్రయోజనం
లేదు.
ఇవి
మీ
హృదయంలో
నాటుకొని
పోవాలి,
కార్యరూపం
ధరించాలి.
ఈనాడు
భారతదేశమే
కాదు,
ప్రపంచమంతా
సమస్యల
తోరణంగా
కనిపిస్తున్నది.
కొన్ని
కనిపించవచ్చు,
కొన్ని
కనిపించక
పోవచ్చు.
ఈ
సమస్యలు
పరిష్కారం
కావాలంటే
ముందు
మానవుడు
బాగుపడాలి.
కేవలం
శరీరం
బాగుపడితే
ప్రయోజనం
లేదు,
మనస్సులు
మారాలి.
హృదయాన్ని
దయతో
నింపుకోవాలి.
ముఖ్యంగా
ప్రేమను
పెంచుకోవాలి.
కాని
ఈనాటి
మానవుని
ప్రేమ
క్షణక్షణమునకూ
మార్పు
చెందుతున్నది.
“కూరిమి
గల
దినములలో
నేరములెన్నైన
కలుగ
నేరవు,
మరి
ఆ
కూరిమి
విరసంబైన
నేరములే
దోచుచుండు....”
ఎదుటి
వానితో
నీవు
స్నేహంగా
ఉన్నప్పుడు
అతడు
ఏమి
చేసినా
నీకు
మంచిగానే
కనిపిస్తుంది.
ఒకవేళ
అతడు
నిన్ను
కొట్టినప్పటికీ,
“ఓహో!
అతడు
కొట్టడంవల్ల
చాల
మంచిదైంది.
ఇంతకు
ముందు
ఇక్కడ
నొప్పిగా
ఉండినది.
ఇప్పుడా
నొప్పి
పోయింది”
అని
ఆనందిస్తావు.
ఒకవేళ
మీ
ఇరువురి
మధ్య
ఏమైనా
ద్వేషం
ఏర్పడెనా,
అతడు
నీపై
ఒక
గులాబీ
పుష్పం
వేసినా,
దాని
ముల్లు
నీకు
గ్రుచ్చుకుపోవాలనే
దురుద్దేశంతోనే
అతడా
పని
చేశాడని
భావిస్తావు.
ఇది
మానవుని
బలహీనత.
నిజమైన
ప్రేమ
ఎలాంటి
పరిస్థితిలోను
మారకూడదు.
ఏదో
ఒక్క
విషయంలో
భేదం
వచ్చిందంటే
అన్నింటినీ
భేదదృష్టితో
చూడడం
మూర్ఖత్వం.
ఇలాంటి
మూర్ఖులే
అభివృద్ధి
కార్యక్రమాలకు
అడ్డు
పడుతుంటారు.
ఇలాంటి
వారికి
భయపడి
మన
అభివృద్ధి
కార్యక్రమాలను
విరమించుకోవడం
మంచిది
కాదు.
మనం
చేయవలసింది
చేసే
తీరాలి;
ఎన్ని
కష్ట
నష్టములనైనా
ధైర్యంగా
ఎదుర్కోవాలి.
ప్రతివ్యక్తీ
శ్రమదానం
చేయాలి
దివ్యాత్మ
స్వరూపులారా!
ఈనాడు
ప్రశాంతి
నిలయంలో
యజ్ఞం
సమాప్తి
అయిన
ఈ
పవిత్ర
విజయదశమి
దినమున
మన
మంచి
నీటి
పథకనిర్వహణ
బాధ్యతను
ముఖ్యమంత్రి
స్వీకరించి
ఏవిధమైన
ఇబ్బందులూ
లేకుండా
నిర్వహిస్తానని
మాట
ఇవ్వడం
జరిగింది.
4
▾
Meaning
Keep
ఇంకా
మున్ముందు
జరుగవలసిన
కార్యక్రమము
లెన్నో
ఉంటున్నాయి.
ఇవి
నేను
చెప్పను.
నా
కాలిగోరు
మొదలుకొని
తలవెంట్రుక
వరకు
ఉపకారమే,
ఉపకారమే!
ఇంకా
ఎన్నో
చేయాలని
ఆశపడుతున్నాను.
కానీ
ఎవ్వరికీ
చెప్పను,
చెప్పకుండా
చేయాలి.
మన
కర్ణాటక
అసెంబ్లీ
స్పీకరు
చెప్పాడు
-
వారి
ప్రాంతంలో
కూడా
మంచినీటి
సమస్య
అధికంగా
ఉంటున్నది.
మనకు
కొన్ని
నదులైనా
ఉంటున్నాయి,
కోలారువైపు
ఏమీ
లేవు.
అక్కడ
కూడా
మంచినీటి
కోసం
ప్రజలు
చాల
ఇబ్బంది
పడుతున్నారు.
సమాజంలోని
సమస్యలను
తీర్చినప్పుడే
మనం
సమాజంలో
పుట్టినందుకు
జన్మ
సార్థకమవుతుంది.
మనలో
మనం
కమిటీలను
ఏర్పర్చుకొని
ప్రభుత్వంపైగాని,
సంఘముపైగాని
వత్తిడి
లేకుండా
సాధ్యమైనంత
వరకు
మన
పనులను
మనమే
చేసుకోవాలి.
ఏ
పనీ
లేక
తిని,
తిరిగి
కాలం
వ్యర్థం
చేసే
యువకులు
అనేకమంది
ఉంటున్నారు.
ఇలాంటివారు
సమాజ
సంక్షేమ
కార్యక్రమాలలో
ప్రవేశించి
శ్రమదానం
చేయాలి.
ముఖ్యమంత్రి
చేస్తున్నాడు
శ్రమదానం,
ఆవిధంగా
ప్రతి
వ్యక్తి
శ్రమదానం
చేయాలి.
మన
గ్రామానికి
రోడ్డు
లేకపోతే
మనకు
మనమే
వేసుకోవాలి.
ఎవరో
వచ్చి
వేయాలని
భావించకూడదు.
మన
గ్రామానికి
మనం
రోడ్డు
వేసుకోవడంలో
అగౌరవ
మేమున్నది?
మన
గ్రామంలోని
సమస్యలను
మనంతట
మనమే
పరిష్కారం
గావించుకోవడానికి
ప్రయత్నించాలి.
అలాంటి
ప్రయత్నానికి
వ్యయం
అధికమైనప్పుడు
ఇంకొకరు
బాధ్యత
తీసికోవచ్చు.
నేనెప్పటికీ
సిద్ధంగానే
ఉంటున్నాను
-
ఏ
గ్రామంవారైనా,
ఏ
స్టేట్వారైనా,
ఏ
జిల్లావారైనా
సరే!
నాకు
జాతిమత
భేదములుగాని,
స్థాన
భేదములుగాని
లేనే
లేవు.
నాకు
అందరూ
ఒక్కటే
మీరు
నమ్మినా
నమ్మకపోయినా
నాకు
అందరూ
ఒక్కటే.
మానవకులం,
ప్రేమమతం,
హృదయభాష
-
ఉన్నవి
ఇవే!
ఏ
రాష్ట్రానికైనా,
ఏ
గ్రామానికైనా
చేయడానికి
నేనెప్పుడూ
సిద్ధంగానే
…
నుండి
రాదు,
ఏది
ఏమైనా
సరే!
ఈనాడు
మీరందరూ
ఇక్కడకు
చేరారు
-
ఇంకేమైనా
పెద్ద
కార్యం
చేయాలనుకుంటే,
ఎవరైనా
కా…వారుంటే,
ప్రశాంతినిలయాన్నైనా
అమ్మి
చేస్తాను
పనులు.
దానికి
కూడా
నేను
సిద్ధమే!
నాకు
కావలసింది
ప్రజాక్షేమమే,
ప్రజల
ఆనందమే,
ప్రజలు
దైవానుగ్రహానికి
పాత్రులు
కావడమే.
దీనికే
నేను
పాటుపడుతున్నాను.
ఈ
సత్యాన్ని
ఎవ్వరూ
గుర్తించడం
లేదు.
ఎన్నో
సంవత్సరముల
నుండి
చెంతనున్న
వారు
కూడా
నా
సత్యాన్ని
గుర్తించడం
లేదు.
ఎట్లా
అవుతుంది
గుర్తించుకోవడానికి?
సాధ్యం
కాదు.
దైవం
యొక్క
తత్త్వాన్ని,
పవిత్రతను
తెలుసుకోవడం
చాల
కష్టం.
మీరందరూ
ఎవరికి
తగిన
శ్రమ
వారు
చేసుకుంటూ
భగవద్విశ్వాసాన్ని
పెంచుకొని
మీ
కార్యములను
సాధించుకోవడానికి
ప్రయత్నిస్తే
ఏ
అభ్యంతరములూ
లేక
అన్నీ
సులభంగా
జరిగిపోతాయి.
పూర్వీకులంతా
ఇదే
మార్గాన్ని
అనుసరిస్తూ
వచ్చారు.
ఆనాడు
ఈ
పార్టీ
విభేదాలు
కాని,
ద్వేషాలుకాని
ఈవిధమైన
సమస్యలు
లేనే
లేవు.
అందరూ
ఏకమనస్సుతో
ఉండేవారు.
మానవుడై
పుట్టిన
తరువాత
ఒక
ఆదర్శాన్ని
నిరూపించాలి,
తనకు
ఇష్టం
లేదని
మంచిని
కూడా
చెడ్డగా
మార్చుకోకూడదు.
అది
చాల
పొరపాటు.
5
▾
Meaning
Keep
అలాంటివాడు
మానవుడే
కాదు.
మన
ముఖ్యమంత్రిగారు
ఎన్నో
కార్యాలు
చేపడుతున్నారు.
మనం
మంచి
చేస్తున్నప్పుడు
ఎవ్వరికీ
భయపడనక్కర
లేదు,
ధైర్య
సాహసములతో
ముందంజ
వేయాలి.
అయితే
ముందు
మనలో
మంచితనమును
పెంచుకోవాలి.
ట్యాంకులో
ఎలాంటి
నీరుంటే
ట్యాపులో
అలాంటి
నీరే
వస్తుంది.
కనుక
మన
హృదయమనే
ట్యాంకు
మంచిగా
ఉన్నప్పుడు
ఎవరేమి
తలచినా
మనకు
భయం
లేదు.
కేవలం
అనంతపురం
జిల్లా
మాత్రమే
కాదు,
మున్ముందు
ఇంకా
వేరే
జిల్లాలకుకూడా
ఈసౌకర్యం
కల్పించాలని
ఆశిస్తున్నాను.
ఒక్క
విషయాన్ని
మీరు
గుర్తించాలి.
భారతదేశంలోగాని,
ఇంకే
దేశమందుగాని
మంచి
కార్యం
చేయాలనుకుంటే
మనకేమీ
తక్కువ
లేదు,
కావలసినంత
ఉంటున్నది.
కానీ
ఆ
మంచి
సంకల్పమే
రావటం
లేదు.
ఆ
మంచి
సంకల్పమే
వస్తే
మానవులు
సాధించలేనిది
లోకంలో
ఏమీ
లేదు.
లక్షల
మైళ్ళు
అంతరిక్షానికి
పోయేబదులు
అర
ఇంచి
హృదయాంతరాళంలోనికి
పోకూడదా?
కానీ
ఇది
మానవునికి
సాధ్యం
కావటం
లేదు.
మంచి
మనస్సుతో
ఏ
కార్యం
చేసినా,
సందేహం
లేదు,
తప్పక
విజయాన్ని
సాధిస్తాము.
ఈ
వాటర్
ప్రాజెక్టును
చేపట్టినప్పుడు
మా
ట్రస్టువారు,
“స్వామీ!
ఇది
బృహత్కార్యము,
బ్యాంకులో
ఏమీ
లేదు,
ఎట్లా
జరుగుతుంది?”
అన్నారు.
“మీరేమీ
అధైర్యపడవద్దు,
నేను
చూసుకుంటాను.
మంచి
కార్యం
చేయడానికి
సందేహించనవసరం
లేదు,
తప్పక
జరిగిపోతుంది”
అన్నాను.
అట్లాగే
జరిగిపోయింది.
ఏవిధమైన
ఇబ్బందులూ
లేవు.
స్పీకర్
చెప్పినట్లుగా,
పుట్టినది
మొదలుకొని
గిట్టునంతవరకు
మానవునికి
నీటితో
ఎన్నో
పనులుంటున్నాయి.
నీటితోనే
పుడుతున్నాము,
నీటితోనే
మరణిస్తున్నాము.
నీరే
ప్రాణము.
ఇట్టి
ప్రాణ
సమానమైన
నీరును
అందరికీ
అందించాలి.
అదే
నా
సంకల్పం.
మొట్టమొదటి
నుండి
నేను
అనుకున్నాను.
ప్రాచీనకాలము
నుండి
మన
భారతదేశంలో
విద్యను
ఉచితంగా
బోధిస్తూ
వచ్చారు.
ఆ
కాలంలో
గ్రామస్థులే
ఉపాధ్యాయునికి
తగిన
అనుకూలాలు
ఏర్పర్చి
అతనివద్ద
విద్యను
అభ్యసిస్తూ
వచ్చారు.
మన
ఇన్స్టిట్యూట్లో
ఒక్క
నయాపైసా
ఖర్చు
లేదు.
మేము
ఎవ్వరినీ
ఏమీ
అడగలేదు.
అయితే
టీచర్స్కి
స్కేలు
ప్రకారం
జీతాలిస్తున్నాము.
గవర్నమెంటు
కూడా
ఏమీ
ఇవ్వటం
లేదు,
యథార్థం
నేను
చెబుతున్నాను.
మేము
అడుగలేదు.
విద్య
మేధస్సుకు,
వైద్యం
ఆరోగ్యానికి,
జలము
దేహానికి
సంబంధించినవి.
ఈ
మూడింటినీ
ఉచితంగా
అందిస్తే
జీవితమే
సమాజానికి
అంకితం
చేసినట్లవుతుంది.
ఇంతకంటే
గొప్ప
మహాభాగ్యం
ఏముంది!
కనుక
విద్యను
ఉచితంగా
అందించుటకు
ప్రయత్నం
చేయండి.
ఆరోగ్యానికి
కావలసిన
మందుల
నిమిత్తమై
బీదవారికి
సహాయం
చేయండి.
ఇంక
జలము
విషయంలోను
తగినరీతిలో
పాటుపడండి.
ఈనాడు
కొన్నికొన్ని
స్థానములలో
సరియైన
జలం
చిక్కటం
లేదు,
రాయలసీమలో
ఎక్కడ
చూసినా
ఫ్లోరైడు
ఉంటున్నది.
దీనివల్లనే
తరతరములనుండి
అనేకమంది
కాళ్ళుచేతులు
వంపులు
తిరిగిపోయి
దుర్భరమైన
జీవితాన్ని
గడుపుతున్నారు.
జరిగినదేదో
జరిగిపోయింది.
కనీసం
రాబోయే
పిల్లలైనా
ఆరోగ్యంగా,
ఆనందంగా
ఉండటానికి
తగిన
ప్రయత్నం
చేస్తారని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
దీర్ఘప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Discovering the Aathma
Next
Women's role as Mothers
→