Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2001 · This body is for the good of others
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
This body is for the good of others
14 April 2001, Viśu, Brindavan
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
మానవునికి
అహంకార,
ఆడంబరములున్నంత
వరకు
అతనిని
ఎవ్వరూ
ప్రేమించరు;
కట్టుకున్న
భార్య,
కన్న
బిడ్డలైనా
ప్రేమించరు.
ప్రేమించినట్లుగా
నటింతురుగాని,
అది
నిజమైన
ప్రేమ
కాదు.
కారణం?
అతనిలోని
అహంకార,
ఆడంబరములు
ప్రేమకు
అడ్డు
తగులుతుంటాయి.
క్రోధమున్నంతవరకు
మానవునికి
శోకం
తప్పదు.
క్రోధం
పెరిగే
కొలదీ
శోకంకూడా
అధికమౌతుంది.
శోకమునకు
దూరమై
శాంతిని
అనుభవించవలెనన్న
క్రోధమును
నిర్మూలం
గావించుకోవాలి.
మానవునికి
కోరికలున్నంతవరకు
సిరిసంపదలు
అతనివైపుకే
చూడవు.
కోరికలనే
‘లగేజి’ని
ఎంత
తగ్గించుకుంటే
జీవిత
ప్రయాణం
అంత
సుఖవంతంగా
సాగుతుంది.
అట్లే,
లోభమున్నంతవరకు
మానవునికి
శాంతి
లేదు.
తాను
ఏనాడు
లోభమును
నిర్మూలం
గావించుకొనునో
ఆనాడే
శాంతి,
సౌభాగ్యములను
అనుభవించ
గలడు.
దేశసౌభాగ్యం
మానవుని
చర్యలపై
ఆధారపడి
యున్నది.
మానవుని
చర్యలు
మనస్సుపై
ఆధారపడి
యున్నవి.
మనస్సుయొక్క
మంచిచెడ్డలు
సంకల్పములపై
ఆధారపడియున్నవి.
మానవుడు
సత్య
సంకల్పములను
పోషించుకున్నప్పుడే
లోకం
సౌభాగ్యవంతంగా
ఉంటుంది.
కనుక,
లోక
క్షేమమును,
లోకసౌభాగ్యమును
ఆశించే
మానవుడు
తన
సంకల్పములను,
చర్యలను
సక్రమమైనవిగా
తీర్చిదిద్దుకోవాలి.
ఈనాడు
నూతన
సంవత్సరం
ప్రారంభమైనది.
దీని
పేరు
“విశు”.
అయితే
ఇలాంటి
నూతన
సంవత్సరములు
ఎన్నో
గడిచిపోయినాయి.
క్రొత్త
సంవత్సరం
తనకు
ఆనందమును,
సౌభాగ్యమును
అందించాలని
మానవుడు
ఆశిస్తుంటాడు.
అయితే
మానవుని
సుఖదుఃఖములు
సంవత్సరములపై
ఆధారపడిలేవు;
అతని
కర్మలపై
ఆధారపడియున్నవి.
కర్మలు
మంచివైనప్పుడే
ఫలితం
మంచిదిగా
ఉంటుంది.
కాని
మానవుడు
మంచిచెడ్డలను
విచారణ
చేయకుండా
కర్మల
నాచరిస్తున్నాడు.
చెడ్డకర్మలను
ఆచరించటం
సులభమేగాని,
వాటి
ఫలితములు
పర్వతములమాదిరి
తనకు
అడ్డు
తగులుతుంటాయి.
2
▾
Meaning
Keep
“తస్మై
నమః
కర్మణే”
“కర్మానుబంధీని
మనుష్య
లోకే”
మానవ
జీవితం
కర్మాధీనమైనటు
వంటిది.
కర్మలను
వదలి
మీరు
క్షణమైనా
ఉండుటకు
వీలుకాదు.
మీరు
చేసే
ప్రతి
కర్మ
భగవంతునికి
చేసే
పూజగా
విశ్వసించాలి.
ఇదే
సత్యమైన,
నిత్యమైన
మార్గం.
దీనిని
పురస్కరించుకొనియే
ఉపనిషత్తు
“తస్మై
నమః
కర్మణే”
అని
చెప్పింది.
“ఓ
కర్మదేవతా!
నీకు
నమస్కరిస్తున్నాను”
అని
దీని
అర్థం.
మీ
చేత
మంచికార్యములు
ఆచరింపజేసేటట్లుగా
కర్మ
దేవతను
ప్రార్థించాలి.
“నేను
చేసే
కర్మ
పవిత్రమైనదిగా,
లోకకల్యాణమునకు
సహాయం
చేసేదిగా,
సత్కీర్తిని
ఆర్జించేదిగా
ఉండాలి”
అనే
భావంతో
మీరు
చేసే
కర్మకు
మొట్టమొదట
నమస్కరించాలి.
ఇదియే
భారతీయ
సంస్కృతియొక్క
ప్రధానమైన
సందేశం.
చిన్నదిగాని,
పెద్దదిగాని,
ఏ
కర్మనైనా
ఆచరించుటకు
పూర్వం
మొట్టమొదట
దానికి
నమస్కరించాలి.
ఒక
నర్తకి
నృత్యం
చేయటానికి
పూర్వం
తన
కాలియందెలను
కన్నులకద్దుకొని
నమస్కరిస్తుంది.
భజనలో
తబలా
వాయించేవారు
మొట్టమొదట
తబలాకు
నమస్కరించిన
తరువాతనే
వాయించటం
ప్రారంభిస్తారు.
కేవలం
విద్యావంతులు
మాత్రమే
కాదు,
నిరక్షరాస్యులైన
లారీ
డ్రైవర్లు
కూడా
స్టీరింగుకు
నమస్కరించిన
తరువాతనే
డ్రైవింగు
ప్రారంభిస్తారు.
ఇది
ప్రాచీన
సంస్కృతి
అందించిన
పవిత్రత.
నమస్కారమనగా
ఏమిటి?
అహంకార
రహితమైన
భావమే.
ప్రేమస్వరూపులారా!
అందరినీ
గౌరవించండి.
అప్పుడే
మీకుకూడా
గౌరవం
లభిస్తుంది.
ఇతరులకు
మీరు
ఏది
అందిస్తే
అదే
తిరిగి
మీకు
లభిస్తుంది.
కర్మఫలమునందే
మీ
సర్వస్వము
ఇమిడియున్నది.
దైవ
సాక్షాత్కారముకూడా
కర్మఫలమునందే
ఇమిడియున్నది.
కాని
ఈనాటి
మానవుడు
మంచిచెడ్డలను
విచారణ
చేయకుండా
ఇష్టానుసారం
కర్మల
నాచరిస్తున్నాడు.
కనుకనే
పడరాని
పాట్లు
పడుతున్నాడు.
కష్టాలననుభవించే
సమయంలో
బాధపడుతున్నాడుగాని,
కర్మల
నాచరించే
సమయంలో
“ఇది
మంచిదా,
చెడ్డదా”
అని
విచారణ
చేయటం
లేదు.
ఏ
కర్మనైనా
ఆచరించుటకు
పూర్వం
దాని
మంచిచెడ్డలను
విచారణ
చేయాలి.
తొందరపాటు
పడకుండా
శాంతంగా
కర్మలలో
పాల్గొనాలి.
మీ
సుఖ
దుఃఖములను,
కష్టసుఖములను
క్రొత్త
సంవత్సరం
తీసికొని
రావటం
లేదు;
అవి
మీరు
ఆచరించే
కర్మలద్వారానే
లభ్యమౌతున్నాయి.
3
▾
Meaning
Keep
కనుక,
మీరు
తగినరీతిగా
విచారణ
చేసి
సత్కర్మల
నాచరించాలి.
పరులను
బాధించకూడదు.
పరోపకార
సంబంధమైన
కర్మలను,
పరులకు
ఆనందం
కల్గించే
కర్మలను
ఆచరించాలి.
మగధరాజు
ఆదర్శం
ఒకానొక
సమయంలో
అశోక
చక్రవర్తియొక్క
జన్మదినోత్సవాన్ని
పురస్కరించుకొని
అతని
సామంత
రాజులు
వారివారి
ప్రజలనుండి
వసూలు
చేసిన
సుంకమును
తెచ్చి
సమర్పించారు.
కాని,
మగధదేశపురాజు
మాత్రం
వట్టి
చేతులతో
వచ్చాడు.
అశోకుడు
కారణమడుగగా
అతడు
“మహారాజా!
ఈ
సంవత్సరం
నా
రాజ్యంలో
అతివృష్టి,
అనావృష్టి
పరిస్థితుల
కారణంగా
ప్రజలు
నిలువటానికి
నీడలేక,
తినటానికి
తిండి
లేక,
త్రాగటానికి
నీరు
లేక
పడరాని
పాట్లుపడ్డారు.
కాబట్టి,
నేను
ప్రజలనుండి
వసూలు
చేసిన
సుంకమును
ప్రజాసంక్షేమం
కోసమే
వినియోగించాను.
ప్రజలకు
త్రాగునీటి
సౌకర్యం
కల్పించాను.
పిల్లలకోసం
పాఠశాలలను
కట్టించాను.
అనారోగ్యంతో
బాధ
పడుతున్నవారి
కోసం
వైద్యాలయాలను
నెలకొల్పాను.
ఈవిధంగా
నేను
వసూలు
చేసిన
ధనమంతా
ఖర్చైపోయింది.
తమకు
సమర్పించటానికి
నావద్ద
ఏమీ
మిగల్లేదు”
అన్నాడు.
ఈ
మాటలకు
అశోక
చక్రవర్తి
ఎంతో
ఆనందించాడు.
మగధరాజును
తన
దగ్గరకు
పిలిచి
“రాజా!
నీరు
ప్రాణాన్నిస్తుంది.
విద్య
బుద్ధిని
అభివృద్ధిపర్చుతుంది.
వైద్యం
ఆరోగ్యాన్ని
కాపాడుతుంది.
ఈ
మూడింటినీ
ప్రజలకు
సమకూర్చి
నీవు
చాలా
గొప్ప
పని
చేశావు.
స్వార్థాన్ని
త్యజించి
పరమేశ్వరప్రీత్యర్థంగా
పరార్థంకోసం
పాటుపడ్డావు”
అని
అభినందించాడు.
అక్కడ
సమావేశమైన
ఇతర
సామంతరాజుల
నుద్దేశించి
అశోకుడిలా
అన్నాడు
-
“ప్రజలనుండి
మనం
అధికంగా
సుంకమును
వసూలు
చేస్తున్నామని
అనేకమంది
విమర్శిస్తుంటారు.
కాని,
ప్రజలనుండి
సుంకమును
వసూలు
చేయకపోతే
ప్రభుత్వానికి
డబ్బు
ఎక్కడినుండి
వస్తుంది?
ప్రభుత్వంవద్ద
డబ్బు
లేకపోతే
ప్రజాసంక్షేమకార్యాల
నేరీతిగా
చేపట్టగలదు?
కాబట్టి
ప్రజలనుండి
సుంకమును
వసూలు
చేయక
తప్పదు.
అయితే
దానిని
భగవంతుని
సొత్తుగా
భావించి
ప్రజలకోసమే
వినియోగించాలి.
ఇదియే
నిజమైన
సేవ.”
4
▾
Meaning
Keep
భక్తి
అంటే
ఏమిటి?
జపధ్యానాదులచేత,
తీర్థయాత్రలచేత,
శాస్త్రశ్రవణంచేత
సంసార
సాగరమును
తరించుటకు
వీలుకాదు.
సమాజసేవలో
మీరు
పాల్గొనాలి.
జపధ్యానాదులకంటే
సేవయే
ప్రధానమైనది.
సేవయే
దైవానికి
ఆనందం
కల్గిస్తుంది.
సేవలో
పాల్గొనకుండా
కేవలం
‘భక్తి,
భక్తి...’
అంటూ
ప్రాకులాడితే
ప్రయోజనం
లేదు.
నాకు
మీ
భక్తి
అక్కర్లేదు,
మీ
హృదయ
పరివర్తన
కావాలి.
అసలు
భక్తి
అంటే
ఏమిటి?
“పరోపకారార్థ
మిదం
శరీరమ్”
అనే
సత్యాన్ని
గుర్తించి,
పదిమందికి
ఉపయోగపడే
పనులు
చేయాలి.
సేవకు
మీ
జీవితాన్ని
అంకితం
గావించాలి.
కాలాన్ని
సార్థకం
గావించే
కర్మల
నాచరించాలి.
ఈనాడు
చాలామంది
భక్తి
అంటే
ఏమిటో
తెలుసుకోలేక
కాలమును
వ్యర్థం
చేస్తున్నారు.
మీరు
ప్రపంచానికంతా
గొప్ప
సేవ
చేయాలని
నేను
చెప్పటం
లేదు.
భగవంతుణ్ణి
మీ
హృదయంలో
నిల్పుకొని
మీ
శక్తికొలదీ
సేవ
చేస్తే
చాలు.
“దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవో
దేవస్సనాతనః”
దేహం
ఒక
దేవాలయంవంటిది.
ఆత్మయే
ఇందులోని
దేవుడు.
కనుక,
మీరు
ఏ
దేహమును
చూసినా
ఒక
దేవాలయమును
చూసినట్లుగా
భావించండి.
ఆ
దేవాలయంలో
ఆత్మ
అనే
దేవుడున్నాడని
విశ్వసించండి.
“సర్వ
జీవ
నమస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి”
ఎవరికి
నమస్కరించినా
అది
దైవానికే
చేరుతుంది.
ప్రతి
మనిషీ
దైవస్వరూపుడే,
కనుక
ఎవ్వరినీ
విమర్శించకూడదు,
ఎవ్వరినీ
పరిహసించకూడదు,
ఎవ్వరినీ
ద్వేషించకూడదు.
ఎవరిని
దూషించినా,
ఎవరిని
బాధించినా
అవి
భగవంతునికే
చెందుతాయనే
సత్యాన్ని
గుర్తించాలి.
దైవం
లేని
స్థానం
లేదు.
దైవం
కాని
రూపం
లేదు.
“సర్వతః
పాణిపాదం,
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి.”
సర్వమూ
భగవత్స్వరూపమే.
కనుక
ఏ
పని
చేసినా
భగవత్ప్రీత్యర్థంగా
చేయండి.
‘కాన్షియన్స్’
-
‘కాన్షియస్నెస్’
ఈ
దేహం
పాంచభౌతికమైనది.
ఇది
ఏదో
ఒకనాడు
కూలక
తప్పదు.
అయితే
ఇట్టి
అశాశ్వతమైన
దేహమునందే
నిత్యసత్యమైన
చైతన్యం
ఇమిడియున్నది.
దీనినే
‘కాన్షియన్స్’
అన్నారు.
సర్వత్ర
వ్యాపించిన
చైతన్యమును
‘కాన్షియస్నెస్’
అన్నారు.
ఈ
రెండింటికీ
‘క్వాన్టిటీ’లో
వ్యత్యాసమున్నదిగాని,
‘క్వాలిటీ’
ఒక్కటే.
5
▾
Meaning
Keep
His poems 523
సముద్రపు
నీటిని
గ్లాసులో
నింపవచ్చు,
బిందెలో
నింపవచ్చు,
ట్యాంకులో
నింపవచ్చు.
గ్లాసులో
ఉన్న
నీటికి,
బిందెలో
ఉన్న
నీటికి,
ట్యాంకులో
ఉన్న
నీటికి
‘క్వాన్టిటీ’లో
తేడా
ఉంటుందిగాని,
ఉప్పదనమనే
‘క్వాలిటీ’
మూడింటిలోనూ
సమానంగానే
ఉంటుంది.
అదేరీతిగా
సర్వత్ర
వ్యాపించిన
దైవత్వమనే
‘కాన్షియస్నెస్’
దేహమనే
పాత్రలో
‘కాన్షియన్స్’గా
ఉంటున్నది.
కనుక
‘కాన్షియస్నెస్’,
‘కాన్షియన్స్’
రెండూ
ఒక్కటే.
ఈ
జగత్తు
చైతన్యమునుండియే
ఏర్పడినది.
ఈ
జగత్తంతా
నిండినది
చైతన్యమే.
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ”.
బ్రహ్మ
కానటువంటి
పదార్థం
ఎక్కడా
కనిపించదు.
మీరందరూ
విశ్వ
విరాట్స్వరూపులే.
మీరు
భగవంతుణ్ణి
చూస్తూ
చూడలేదనుకుంటున్నారు.
ఇదే
పెద్ద
బలహీనత.
మీ
దేహమునే
ఒక
దేవాలయంగా
విశ్వసించండి.
దేవాలయము
నెవరైనా
అపవిత్రం
చేస్తారా?
కనుక
దేహమును
దుర్వినియోగపరచకుండా
పవిత్రమైన
మార్గంలో
ప్రవేశపెట్టండి.
ఈ
దేహమునకు
అనేక
ద్వారములున్నాయి.
ఇందులో
నోరు,
చెవులు,
కన్నులు
చాలా
ప్రధానమైనవి.
వీటిద్వారా
పవిత్రమైన
విషయాలను
మాత్రమే
ప్రవేశపెట్టుకోవాలి.
చెడు
పలుకవద్దు,
మంచినే
పలకండి
చెడు
వినవద్దు,
మంచినే
వినండి
చెడు
చూడవద్దు,
మంచినే
చూడండి
చెడు
తలచవద్దు,
మంచినే
తలచండి
చెడు
చేయవద్దు,
మంచినే
చేయండి
దివ్యత్వానికి
ఇదే
రాజమార్గం!
పంచేంద్రియాలను
పవిత్రంగా
ఉపయోగపెట్టుకున్నప్పుడే
దేహమనే
దేవాలయమునకు
తగిన
భద్రత
చేకూరుతుంది.
ఇంద్రియాలను
సద్వినియోగపరచుకొనే
నిమిత్తం
భారతీయ
సంస్కృతి
నవవిధ
భక్తి
మార్గములను
బోధిస్తున్నది
:
“శ్రవణం,
కీర్తనం,
విష్ణుస్మరణం,
పాదసేవనం,
వందనం,
అర్చనం,
దాస్యం,
స్నేహం,
ఆత్మనివేదనం.”
ఈ
నవవిధ
మార్గములలో
దైవారాధన
సల్పాలి.
దానితోపాటు
పరోపకార
సంబంధమైన
కర్మల
నాచరించాలి.
దేహం
పరోపకార
నిమిత్తమే
ఏర్పడినది,
స్వార్థంకోసం
కాదు.
స్వార్థం
మీచేత
అనేక
పాపకార్యములను
చేయిస్తుంది.
6
▾
Meaning
Keep
కనుక
స్వార్థాన్ని
పరార్థంగా
మార్చుకోవాలి.
దేహాభిమానమును
త్యజించి
ఆత్మాభిమానమును
పెంచుకోవాలి.
ఆత్మవిశ్వాసం
లేనివాడు
అంధుడనే
చెప్పవచ్చు
“నీయందు,
నాయందు
ఉన్నది
ఒకే
ఆత్మయే”
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
చూడండి,
అక్కడ
అనేక
బల్బులు
కనిపిస్తున్నాయి.
వీటి
రూపనామములు
వేరువేరైనప్పటికీ
వీటిలో
ప్రసరించే
కరెంటు
ఒక్కటే
కదా!
అదేవిధముగనే,
దేహములనే
బల్బులు
వేరువేరుగా
ఉన్నప్పటికీ
వాటిలో
ప్రసరించే
ఆత్మతత్త్వమనే
‘కరెంటు’
ఒక్కటే.
ఇట్టి
ఏకాత్మభావంతో
తోటివారి
బాధలను
నివారణ
గావించటానికి
పూనుకోండి.
సాధ్యమైనంతవరకు
ఇతరులకు
సహాయం
చేయండి.
“పరోపకారః
పుణ్యాయ
పాపాయ
పరపీడనం.”
ఇదే
వ్యాసుడు
చెప్పిన
అష్టాదశ
పురాణముల
సారం.
ఎల్లప్పుడు
ఉపకారమే
చేయండి.
ఎవ్వరికీ
అపకారం
చేయవద్దు.
దీనిని
మించిన
సాధన
మరొకటి
లేదు.
ఇదే
ఆత్మసాక్షాత్కారానికి
మార్గం.
“ఏకమేవాద్వితీయం
బ్రహ్మ”
ఆత్మ
అనేది
ఒక్కటే,
రెండు
లేవు.
ఏకత్వాన్ని
మీరు
అనేకత్వంగా
భావిస్తున్నారు.
కాని
అనేకత్వం
లేనే
లేదు.
అంతా
ఏకత్వమే.
ఆత్మ
తప్ప
అన్యము
లేదు
ఈ
లోకంలో.
ఇట్టి
ఏకత్వాన్ని
మానవుడు
ఎందుకు
విశ్వసించటం
లేదో
అర్థం
కావటం
లేదు.
ఈనాటి
మానవుడు
రేడియోను,
టీవీని,
సినిమాలను
విశ్వసిస్తున్నాడు
గాని,
ఆత్మను
విశ్వసించటం
లేదు.
ఆత్మవిశ్వాసం
లేనివాడు
అంధుడనే
చెప్పవచ్చు.
కొంతమంది
జపము,
ధ్యానము,
యోగమువంటి
సాధనలు
చేస్తున్నారు.
ఇవి
చేసుకోవచ్చు.
ఇవి
పవిత్రమైన
కర్మలే.
అయితే
ముఖ్యంగా
సర్వులయందున్న
ఏకాత్మతత్త్వాన్ని
గుర్తించాలి.
భగవంతుడు
ఒక్కడే.
అతడు
సర్వాంతర్యామి,
ఎక్కడ
చూసినా
ఉన్నాడు.
ఇట్టి
దైవత్వాన్ని
మీరెందుకు
విశ్వసించటం
లేదు?
ఈ
కలిప్రభావంచేతను,
మీరు
చదివే
చదువుయొక్క
ప్రభావంచేతను
మీరు
చెడ్డ
విషయాలను
బోధించే
స్నేహితులను
విశ్వసిస్తున్నారుగాని,
మీకు
మంచిని
బోధించి,
మిమ్మల్ని
మంచిమార్గంలో
ప్రవేశపెట్టే
వారిని
విశ్వసించటం
లేదు.
ఏమిటీ
చదువులు?
వీటివల్ల
మీకు
లభించేది
కేవలం
పుస్తకజ్ఞానం
మాత్రమే.
మీరు
చదువవలసిన
పుస్తకమొకటున్నది.
అదే
ఈ
ప్రపంచం.
7
▾
Meaning
Keep
ఇంత
పెద్ద
గ్రంథాన్ని
చదువవలసిన
మీరు
ఏవో
చిన్నచిన్న
పుస్తకాలను
చదివి
సంతృప్తి
చెందుతున్నారు.
మీరు
సంపాదించవలసింది
పుస్తకజ్ఞానం
కాదు.
అనుభవ
జ్ఞానమును
సంపాదించినప్పుడే
మీ
జీవితం
సార్థకమౌతుంది.
ఆత్మవిశ్వాసమే
సర్వసంపదలను
చేకూర్చుతుంది
ప్రేమస్వరూపులారా!
మీ
దినచర్యను
ప్రేమతో
ప్రారంభించి,
ప్రేమతో
నింపి,
ప్రేమతో
అంత్యం
గావించండి.
ఇదే
భగవంతుణ్ణి
చేరే
మార్గం.
ప్రేమ
మీయందే
ఉండగా
మీరు
ప్రేమరహితంగా
ఎందుకు
ప్రవర్తిస్తున్నారు?
ఎందుకు
ద్వేషాన్ని
పెంచుకుంటున్నారు?
కొందరు
తమ
తల్లిదండ్రులను
కూడా
ద్వేషిస్తున్నారు.
ఇది
చాలా
తప్పు.
“మాతృదేవో
భవ,
పితృదేవో
భవ”
తల్లిదండ్రులనే
గౌరవించలేనివాడు
ఇంక
దైవాన్ని
ఏరీతిగా
గౌరవించగలడు?
తల్లి
చేసే
సద్బోధలు
ఇంకెవ్వరూ
చేయలేరు.
తల్లియే
ప్రత్యక్ష
దైవం.
అబ్రహాం
లింకన్
గురించి
మీరు
వినే
ఉంటారు.
అతడు
చాలా
బీదకుటుంబానికి
చెందినవాడు
కావటంచేత
అతనికి
ధరించటానికి
సరియైన
దుస్తులుకూడా
ఉండేవి
కావు.
అతడు
స్కూలుకు
వెళుతుంటే
కొంతమంది
శ్రీమంతుల
పిల్లలు
చినిగిపోయిన,
మాసిపోయిన
అతని
దుస్తులను
చూసి
గేలి
చేసేవారు.
లింకన్
ఒకనాడు
ఏడుస్తూ
ఇంటికి
వచ్చి
“అమ్మా!
స్కూల్లో
నా
తోటిపిల్లలు
నా
దుస్తులను
చూసి
అవహేళన
చేస్తున్నారు”
అన్నాడు.
అప్పుడా
తల్లి
“నాయనా!
మన
పరిస్థితి
నీకు
తెలుసు.
ఎవరేమన్ననూ
నీవు
లెక్కచేయవద్దు.
నీ
ఆత్మగౌరవాన్ని
కాపాడుకో.
ఆత్మవిశ్వాసాన్ని
పెంచుకో.
అదియే
నీకు
సర్వసంపదలను
చేకూర్చుతుంది”
అని
బోధించింది.
ఆనాటినుండి
లింకన్
తన
తల్లి
బోధించినట్లుగా
ఆత్మగౌరవాన్ని
పోషించుకున్నాడు,
ఆత్మవిశ్వాసాన్ని
పెంచుకున్నాడు.
తత్ఫలితంగా
అతడు
పెరిగి
పెద్దవాడైన
తరువాత
అమెరికా
అధ్యక్షునిగా
ఎన్నికైనాడు.
ఆత్మగౌరవమే
అనుగ్రహాన్ని
అందిస్తుంది.
పరులు
నిందించారనీ,
పరిహసించారనీ
బాధపడకూడదు.
ఏది
జరిగినా
“ఇది
నా
మంచికే”
అని
భావించాలి.
ఇట్టి
సమత్వాన్ని
మీరు
అభివృద్ధిపరచుకున్నప్పుడు
మీకంటే
గొప్పవారు
మరొకరుండరు.
గతాన్నిగూర్చి
చింతించవద్దు.
8
▾
Meaning
Keep
భవిష్యత్తునుగూర్చి
విచారించవద్దు.
అది
మీ
చేతిలో
లేదు.
రేపటివరకు
బ్రతికియుంటామని
కచ్చితంగా
ఎవరు
చెప్పగలరు?
వర్తమానమే
ప్రధానమైనది.
కనుక
వర్తమానమును
సద్వినియోగం
చేసుకోవాలి.
త్యాగంచేత
కలిగే
ఆనందమే
తరగని,
కరగని
ధనం
ఈనాడు
నూతన
సంవత్సరం
ప్రారంభమైనది.
అయితే
నూతన
సంవత్సరం
క్రొత్తదేమీ
తీసికొనిరాలేదు.
నిన్న
వచ్చిన
దినమే
ఈ
రోజుకూడా
వచ్చింది.
ఈనాడు
మనం
మంచి
పనులు
చేస్తే
భవిష్యత్తులో
మంచి
ఫలితాన్ని
పొందుతాము.
కాబట్టి
మన
కర్మలను
పవిత్రం
గావించుకోవాలి.
“నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానశుః”
కనుక
త్యాగంతో
మనం
ఆనందాన్ని
పొందాలి.
అదే
శాశ్వతమైన
ఆనందం.
అదే
నిజమైన
ధనం.
ఆ
ధనం
ఏనాటికీ
కరగదు,
తరగదు.
అట్టి
ధనమును
సంపాదించాలి.
దైవచింతనలో
కాలం
గడపాలి.
మీరు
అడుగు
పెట్టినచోటంతా
దైవమే
ఉన్నాడు.
మీరు
కనులతో
చూసేదంతా
దైవస్వరూపమే.
దైవం
సర్వత్ర
ఉన్నాడని
విశ్వసించినప్పుడు
మీకు
ఎట్టి
బాధలూ
ఉండవు.
దేనికీ
మీరు
బాధపడనక్కర్లేదు,
భయపడనక్కర్లేదు.
నేనుండగా
మీకు
భయమెందులకు?
దైవం
మీ
ఇంటనే,
వెంటనే,
జంటనే,
కంటనే
ఉంటున్నాడు.
అట్టి
దైవాన్ని
మీరేనాడూ
విస్మరించకూడదు.
గిట్టనివాళ్ళు
ఎన్ని
మాటలైనా
చెప్పవచ్చును.
కాని,
వాళ్ళేమైనా
మీ
పొట్ట
నింపుతున్నారా?
లేదే!
“అడవిలోన
నున్న,
ఆకాశమున
నున్న,
పట్టణమున
నున్న,
పల్లెనున్న,
గుట్టమీదనున్న,
నట్టేటపడియున్న...”
ఎక్కడ
ఉన్నప్పటికీ
మిమ్మల్ని
అన్ని
విధాలుగా
కాపాడేవాడు
భగవంతుడొక్కడే.
ఈనాడు
పట్టణాల్లో
ఉన్న
అశాంతి,
మాలిన్యం
ఏ
పల్లెలోనూ
లేవు.
మానవుని
మనస్సే
మలినమైపోయింది.
మనస్సును
పరిశుద్ధం
చేసుకున్నప్పుడే
సర్వమూ
పరిశుద్ధమైపోతుంది.
ప్రేమయే
దైవం,
ప్రేమయే
మన
సర్వస్వం
విద్యార్థులారా!
భక్తులారా!
భక్తి
అంటే
కేవలం
సద్గ్రంథ
పఠనం,
పూజలు
చేయటం
కాదు.
ఇవికూడా
చేసుకోవచ్చు.
కాని
ముఖ్యంగా
మీ
హృదయాన్ని
పవిత్రంగా
ఉంచుకోవాలి.
ఏది
మారినా
మీ
హృదయవిశ్వాసం
మారకుండా
చేసుకోవాలి.
లౌకికమైనవన్నీ
కదిలిపోయే
మేఘాలవలె
వస్తాయి,
పోతాయి.
9
▾
Meaning
Keep
కాని,
హృదయ
సంబంధమైన
ప్రేమతత్త్వం
అలాంటిది
కాదు.
అది
వస్తే
పెరుగుతుంది.
అట్టి
ప్రేమతత్త్వాన్ని
పెంచుకోవాలి.
ప్రేమను
మించిన
దైవం
లేదు.
ప్రేమయే
మన
ప్రాణం,
ప్రేమయే
మన
బంధువు,
ప్రేమయే
మన
స్నేహితుడు,
ప్రేమయే
మన
ఆహారం,
ప్రేమయే
మన
సర్వస్వం.
ప్రేమ
నిండిన
హృదయం
ఎన్నటికీ
మాలిన్యం
కాజాలదు.
ప్రేమామృతం
నిండిన
హృదయంలో
‘విషం’
ప్రవేశించటానికి
వీలుకాదు.
కాని,
ప్రేమయొక్క
విశిష్టత
మీకు
తెలియకపోవటంచేత
మీరు
దానిని
లౌకిక
విషయాలపై
ప్రసరింపజేసి
వ్యర్థం
చేసుకుంటున్నారు.
దేశాన్ని
సంరక్షించాలంటే,
సౌభాగ్యవంతంగా
తీర్చిదిద్దాలంటే
మీరు
ప్రేమను
పెంచుకోవాలి.
మీరు
చేసే
ప్రతి
పని
ప్రేమతో
చేయాలి.
ప్రేమ
ఎప్పుడూ
పవిత్రమైన
ఫలితాన్నే
అందిస్తుంది.
కనుక
“ప్రేమ
ముదిత
మనసె
కహో
రామ
రామ
రామ్...”
Previous
←
The Rāmāyaṇa is the essence of the Veda
Next
The sweetness of a mother's Prema is beyond words
→