Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2002 · Yajña is done with complete sacrifice
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Yajña is done with complete sacrifice
11 October 2002, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
దేహభ్రాంతియు
లేక
మోహచింతనలేక
త్యాగశీలురైన
యోగవరులు
గురులు
నాడు
నేడు
గురులట్టి
వారలె
సత్యమైన
మాట
సాయిమాట
ప్రేమస్వరూపులారా!
సృష్టిలో
ప్రతి
అణువునందు
కణమునందు
దివ్యత్వము
గోచరమవుతుంది
భగవంతుడు
అణువణువునందు,
కణకణమునందు
కూడను
వ్యాపించి,
ప్రకాశించి,
ప్రబోధించి,
ప్రవర్తింపజేయుచున్నాడు.
ఉపనిషత్తులు
కూడను
భగవంతుడు
సర్వత్రా
వ్యాపించినవాడని,
సర్వత్రా
చరించువాడని
సర్వత్రా
కనిపించువాడని
చెప్పుతూ
వచ్చాయి.
అట్టి
మహర్షులయొక్క
వాక్యములను
ఈనాడు
మానవులు
గుర్తించుకొనుటకు
ప్రయత్నించుటలేదు.
కణకణమునందు
సంచరించే
పరమాత్మతత్త్వాన్ని
ఉపనిషత్తులు
ఇంత
సులభంగా
బోధిస్తుండగా
ఈనాటి
మానవుడు
ఎందుకు
గుర్తించుటకు
ప్రయత్నించుటలేదో
పెద్ద
ఆశ్చర్యముగా
ఉంది.
ఇట్టి
దివ్యత్వాన్ని
గుర్తించుటకు
అనేకవిధములైన
అవకాశములు
కూడా
కలుగుతూ
ఉన్నవి.
చెరకులోని
తీపి,
మిరపలోని
కారము
-
ఇవి
ఎవరియొక్క
ప్రభావము
వలన
ఏర్పడినాయి?
కేవలము
దైవత్వమును
గుర్తించటానికి
ఒక్కొక్క
పదార్థమునందు
ప్రాణసమానమైన
దైవము
ఒక్కొక్క
గుణముతో
కూర్చున్నాడు.
వేపలోని
చేదు,
పూవులోని
వాసన,
ఇవి
దేనియొక్క
ప్రభావము?
భగవత్
తత్త్వము
అణుమాత్రమై
ఉండికూడను
ప్రతి
అణువునందు,
కణమునందు
గుణస్వరూపమై
ప్రకటితమవుతున్నది.
ఇంతియేకాదు.
దైవత్వమును
గుర్తించటానికి
అనేక
చిహ్నములు
మనకు
కనిపిస్తున్నవి.
పువ్వులోని
పరిమళం
ఏవిధంగా
గుర్తించుటకు
వీలవుతున్నది?
పువ్వుయొక్క
సహజగుణమని
మనము
సమర్థించుకుంటున్నాము.
కానీ,
ఆ
సహజస్వభావము
ఎక్కడనుంచి
వచ్చింది?
మహోన్నతమైన
పర్వతములను
చూస్తే
ఆనందము
వేస్తుంది.
2
▾
Meaning
Keep
ప్రవాహాన్ని
చూస్తే
పొంగిపొరలుతుంది
ఆనందము.
పచ్చని
పొలములను
చూస్తే
వర్ధిల్లిపోతుంది
ఆనందం.
ఇవన్నీ
కూడను
ప్రకృతియొక్క
ప్రభావమా?
లేక
దైవముయొక్క
సృష్టి
విచిత్రమా?
ఇది
ఎంతమాత్రము
ప్రకృతియొక్క
ప్రభావముకాదు.
గుడ్డులోని
పిట్టను
ఊహించుకోండి.
ఈ
గుడ్డులోని
పిట్టను
ఏరీతిగా
దర్శించగలవు?
ఇలాంటి
పవిత్రమైన
చిహ్నములు
అన్నీ
దైవముయొక్క
ఉనికిని
గుర్తించుటకు
ఏర్పడినవే.
దైవత్వమును
గుర్తించుకొనుటకు
మనము
ఎక్కడికో
పోనక్కరలేదు.
ఏ
సాధనలో
చేయనక్కరలేదు.
సృష్టిలోని
ప్రతి
అణువునందు,
ప్రతి
కణమునందు
దైవత్వము
మనకు
గోచరమవుతూనే
ఉంటున్నది.
దైవసంకల్పమును
ఎవరూ
గుర్తించలేరు
తల్లిలోని
బిడ్డయే
గుడ్డులోని
పిట్టగా
రూపొందుతున్నది.
తల్లిని
ఏవిధంగా
మనము
గుర్తిస్తున్నాము?
తల్లిదండ్రులనుంచి
మానవుడు
పుడుతున్నాడు.
నీవు,
నేను,
అందరమూ
తల్లి
గర్భమునుండి
పుట్టినవారమే.
అయితే
తల్లి
గర్భమునుండి
ఉద్భవించిన
మానవుడు
తల్లియొక్క
దివ్యత్వమును
మరచిపోతున్నాడు.
కారణం
ఏమిటి?
మానవత్వములో
ఒకవిధమైన
సహజతత్త్వము
ఏర్పడుచున్నది.
దైవత్వమునకు,
మానవత్వమునకు
భేదములు
కనిపిస్తున్నవి.
మానవుని
అభీష్టమును
భగవంతుడు
గుర్తించగలడు
కానీ,
భగవంతుని
అభీష్టమును
మానవుడు
గుర్తించలేడు.
భగవంతుని
సంకల్పములు
ఎవరూ
గుర్తించలేరు.
నీ
సంకల్పములు
భగవంతుడు
గుర్తించవచ్చు.
నీయొక్క
మంచిచెడ్డలు
భగవంతుడు
గుర్తించవచ్చు.
అలాగే
బిడ్డకు
ఏది
ఇష్టమో
ఏది
అయిష్టమో
తల్లి
అర్థం
చేసుకుంటుంది.
కానీ
దైవముయొక్క
ఇష్టము,
దైవముయొక్క
అయిష్టము
ఇది
అని
భక్తుడు
గుర్తించలేడు.
తల్లికి
ఏది
ప్రీతి
అనేది
బిడ్డ
గుర్తించవచ్చు.
కానీ,
దైవముయొక్క
సంకల్పము
ఏమిటని
భక్తుడు
గుర్తించలేడు.
ఈ
మానవుడు
సాటి
మానవుడినే
అర్థముచేసుకోలేక
పోతున్నాడు.
అలాంటిది
దైవమును
ఏరీతిగా
అర్థము
చేసుకోగలడు?
దైవభావములు
అతీతమైనవి.
మానవునిభావములు
చాలా
సంకుచితమైనవి.
సంకుచితమైన
మానవుడు
అతీతమైన
దైవమును
ఏరీతిగా
గుర్తించగలడు?
దైవాన్ని
పూజించటము,
దైవాన్ని
ప్రార్థించటము
సులభముకాదు.
ఇది
చాలా
కఠినమైన
సమస్య.
దైవముయొక్క
తత్త్వాన్ని
చక్కగా
గుర్తించినపుడే
దైవాన్ని
పూజించటంలో
ఉన్న
అంతరార్థము
మనకు
అర్థమవుతుంది.
దైవత్వము
‘నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నూతనం’.
3
▾
Meaning
Keep
అట్టి
నిత్యనూతనమైన
దైవత్వమును
మానవుడు
ఏరీతిగా
అర్థము
చేసుకోగలడు?
ఇంతకుముందు
చెప్పాను,
పూవులోని
పరిమళము
మరియు
గుడ్డులోని
పిట్టగురించి.
వీటిని
సరిగా
అర్థము
చేసుకోవటానికే
మానవునకు
సాధ్యంకాక
పోతున్నది.
చెరకులోని
తీపి
ఎక్కడ
నుంచి
వచ్చింది?
ఈ
తీపే
దైవత్వముయొక్క
స్వభావము.
మిరపలోని
కారము,
నిమ్మలోని
పులుపు,
వేపలోని
చేదు
-
ఇవన్నీ
ఎక్కడనుండి
ప్రారంభమైనాయి?
ఇవన్నీ
దివ్యత్వముయొక్క
చిహ్నములే.
ఇట్టి
దైవత్వముయొక్క
చరిత్ర
సహజగుణముల
లోపల
తెలుసుకొనేనిమిత్తమై
ఈ
రకమైన
సృష్టిని
చూపుతూ
వచ్చాడు
భగవంతుడు.
పర్వతాలలో
ఏమి
అందము!
ప్రవాహములో
ఏమి
అందము?
ఉప్పొంగే
సముద్రములో
ఎంత
అందముంది!
ఇవన్నీ
దైవముయొక్క
చిత్రవిచిత్రములైన
అందములే.
దైవముయొక్క
అందాన్ని
ఇంత,
అంత
అని
వర్ణించుటకు
సాధ్యముకాదు.
దైవముయొక్క
శక్తిసామర్థ్యములను
గుర్తించుటకు
వీలుకాదు.
అల్పబుద్ధిచేత
అణురూపములోనున్న
భావాల్ని
కూడా
నీవు
గుర్తించుకోలేకపోతున్నావు.
అటువంటిది
అనంతమైన
స్వరూపాన్ని
నీవు
ఏరీతిగా
అర్థము
చేసుకోగలవు?
నిన్ను
నీవు
తెలుసుకో!
ప్రేమస్వరూపులారా!
భగవంతుడు
అవాఙ్మానసగోచరుడు.
వాక్కునకు
కానీ,
మనస్సునకు
కానీ,
అందనటువంటివాడు
‘యథోవాచో
నివర్తంతే
అప్రాప్యమనసా
సహ’.
కేవలం
నీకు
అర్థమైనంతవరకు
మాత్రమే
భగవంతుని
తత్త్వము
ఇది,
అది
అని
వర్ణించుటకు
నీవు
ప్రయత్నిస్తున్నావు.
అర్థముకాని
పరిస్థితిలోపల
మౌనం
వహిస్తున్నావు.
అక్కడ
భాషకూడను
రావటంలేదు;
గ్రామరు
తెలియటం
లేదు;
ఇంజనీరింగు
ఏమాత్రము
అర్థముకాదు.
దైవముయొక్క
ప్లానులు,
దైవముయొక్క
ఇంజనీరింగులు,
దైవముయొక్క
సహజతత్త్వములు
దైవమునకే
తప్ప
అన్యులకు
అర్థముకావు.
కనుక,
దైవముయొక్క
గుణములు
గుర్తించుటకు
ప్రయత్నంచేయకండి.
నీ
గుణములు
నీవు
ప్రయత్నపూర్వకంగా
సాధించు.
నీ
సత్యమైన
తత్త్వమును
నీవు
గుర్తించుటకు
ప్రయత్నించు.
చిన్నచిన్న
విషయములే
నీకు
అర్థము
కావటంలేదు.
ఇంక
అనంతమైన
తత్త్వము
ఏరీతిగా
నీకు
అర్థమవుతుంది?
దైవమును
తెలుసుకొనుటకు
ప్రయత్నించకండి.
4
▾
Meaning
Keep
అది
మీకు
సాధ్యముకాదు.
మొట్టమొదట
నీ
తత్త్వమును
నీవు
గుర్తించుటకు
ప్రయత్నించు.
ఈవిషయాన్నే
వేదాంతము
“నాయనా!
నిన్ను
నీవు
తెలుసుకో”
అని
చిన్నచిన్న
పదములలో
నీకు
అర్థమయ్యేటట్లు
బోధించింది.
“నేను
ఎవరో
తెలుసుకోవటానికి
ప్రయత్నం
ఎందుకు
చేయాలి”,
అని
ఈనాటి
‘మోడ్రన్
బాయిస్’
పిచ్చిప్రశ్నలు
వేస్తుంటారు.
“నేను
ఫలాని
వారి
బిడ్డను,
నాపేరు
ఫలాని
పేరు,
నేను
ఫలాని
ఉద్యోగం
చేస్తున్నాను,
ఫలాని
దేశము
వాడిని”,
అని
చక్కని
జవాబులు
చెప్పవచ్చు.
అయితే,
ఈ
జవాబులు
భౌతికమైన
దేహాభిమానముతో
కూడిన
జవాబులే
కానీ
వేరుకాదు.
“ఈ
దేహము
ఫలాని
వారి
బిడ్డ;
ఈ
దేహము
ఫలాని
ఆఫీసులో
పనిచేస్తున్నది.
ఈ
దేహము
ఫలాని
డిగ్రీ
తీసుకుంది;
ఈ
దేహము
ఫలాని
దేశమునుండి
వచ్చింది”;
ఇలాంటి
విషయాలన్నీ
విచారణచేస్తే
కేవలము
దేహాభిమానములే
కాని
ఆత్మాభిమానముకాదు
కదా!
నిన్ను
నీవు
తెలుసుకోమని
చెప్పినప్పుడు
నన్ను
నేను
తెలుసుకున్నాను.
నాపేరు
ఫలానా,
నా
ఎత్తు
ఇంత,
నా
కలరు
ఇలాంటిది
అని
చెప్పినంతమాత్రమున
అది
సరైన
జవాబు
కాదు.
‘నీవు’
అనగా
కేవలము
‘వ్యక్తిగతమైన
నీవు’
కాదు.
సమష్టి
స్వరూపాన్ని
ధరించినదే,
ఈ
‘నేను’.
సర్వులయందున్న
‘నేనే’
నీయందు
కూడా
ఉంటున్నాది.
కనుకనే
“సర్వతఃపాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి”
అన్నారు.
సర్వత్రా
వ్యాపించిన
ఆత్మ
ఒక్కటే.
దేహములు
వేరు
కావచ్చు;
ఎత్తు
పల్లములు
వేరుకావచ్చు;
రూపనామములు
వేరుకావచ్చు;
విద్యాబుద్ధులు
వేరు
కావచ్చు;
కానీ,
ఆత్మతత్త్వము
ఒక్కటే.
అట్టి
ఏకత్వముతో
కూడిన
దివ్యత్వమును
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
అనేకత్వములోని
ఏకత్వమును
గుర్తించడమే
వేదాంత
రహస్యము
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
మనం
అనేకత్వములోని
ఏకత్వమును
చూడటంలేదు.
ఏకత్వాన్ని
అనేకత్వంగా
విభజిస్తున్నాము.
అనేకత్వములో
నున్న
ఏకత్వమును
గుర్తించడమే
వేదాంతరహస్యము.
ఈ
వేదాంతము
ఉపనిషత్తుల
ద్వారా
ఏర్పడినటువంటిది.
ఉపనిషత్తు
యొక్క
అంతరార్థము
ఏమిటి?
ఉప
-
సమీపముగా,
ని
-
క్రింద;
షత్
-
కూర్చో
అని
అర్థము.
క్రింద
కూర్చొని
శ్రవణం
చేయమన్నారు.
ఎందుకు
క్రిందకూర్చొని
శ్రవణం
చేయాలి?
గురువు
బోధించువాడు.
5
▾
Meaning
Keep
శిష్యుడు
శ్రవణం
చేయువాడు.
శ్రవణం
చేసేవాడు
క్రిందకూర్చోవాలి.
బోధించేవాడు
గురుస్థానములో
కూర్చోవాలి.
క్లాసులకు
పోతే
టీచర్సుకి
మాత్రమే
కుర్చీ
వేస్తారు.
పిల్లలు
క్రిందనే
కూర్చుంటారు.
ఉన్నతస్థాయి,
క్రింది
స్థాయి
అని
వ్యత్యాసము
అక్కడ
నిరూపిస్తూ
వచ్చింది
ఉపనిషత్తు.
సత్యమైన
తత్త్వమును,
ఉన్నతమైన
భావమును,
పవిత్రమైన
అర్థమును
బోధించేది
ఉపనిషత్తు.
సత్యము
ఒక్క
ఆత్మయందు
మాత్రమే
ఉన్నది.
ఆత్మ
అనగా
ఏమిటి?
రూపము
ఉందా?
లేదు.
ఆకారముందా?
లేదు.
సర్వత్రా
ప్రయాణంచేస్తుంది.
సర్వము
వింటుంది.
సర్వపదార్థములను
ఆకర్షిస్తుంది.
కానీ
తాను
మాత్రం
ఎవరికీ
దొరకదు.
దేనికీ
ఈ
ఆత్మ
చిక్కదు.
ఆత్మకు
సర్వమూ
వశమైపోతుంది.
ఇదియే
ఆత్మయందున్న
మహత్తరమైన
శక్తి.
మనము
ఎవరినైనా
గౌరవించితిమా,
సర్వులను
గౌరవిస్తిమా;
మనల్ని
దేవుడే
గౌరవిస్తాడు.
కనుక,
దేవుని
గౌరవము
పొందాలనుకుంటే
మనము
సర్వులను
ప్రేమించాలి;
సర్వులను
గౌరవించాలి.
నీవు
సర్వులను
ప్రేమించితివా?
భగవంతుడే
నిన్ను
ప్రేమిస్తాడు.
ఇది
రెండవ
తత్త్వము.
భగవంతుని
ప్రేమకు
మనం
పాత్రులు
కావాలి.
మానవతత్త్వములోనున్న
దివ్యమైన
తత్త్వము
ఇంత
విశాలముగా
ఉంటున్నది.
దీనియొక్క
కొలతను
ఎవరూ
వర్ణించుటకు
వీలుకాదు.
మనం
కేవలం
భౌతికమైన
రూపాలను
మాత్రమే
గుర్తులుగా
తీసుకుంటున్నాము.
మనము
ఎవరినైనా
“నీవు
ప్రశాంతినిలయంలో
అనిల్
కుమార్ను
చూచావా?”
అని
ప్రశ్నవేసినప్పుడు
“ఆఁ!
చూచానండి!”
అని
చెపుతావు.
మళ్ళీ
“ఎట్లా
ఉన్నాడు?”
అని
మరొక
ప్రశ్న
వేస్తే
“మంచి
బుష్షర్టు
వేసుకున్నాడు;
మంచి
ఇంగ్లీషు
మాట్లాడుతాడు;
చామనఛాయగా
ఉంటాడు;
నలుపు
కాదు;
జోక్సువేస్తుంటాడు”
అని
సమాధానం
చెపుతావు.
ఇక్కడ
కొంచెము
ఆలోచనచేస్తే
ఈ
గుర్తులన్నీ
దేహమునకు
సంబంధించినవి.
దానికంటె
మించినవి
ఎన్నో
ఉన్నాయి
అనిల్
కుమార్లో,
అవి
ఎవరూ
గుర్తించలేరు.
అనిల్
కుమార్
రూపమునకు
సంబంధించిన
విషయాలు
చెప్పగలుగుతున్నారు.
అనిల్
కుమార్
మనస్సులోని
భావాలు
ఎట్టివో
చెప్పగలవా?
అతని
మనస్సునందు
ఎట్టి
పవిత్రభావాలున్నవో
నీవు
గుర్తించగలవా?
ఇది
ఎవ్వరూ
చెప్పలేరు.
ఎవరికీ
సాధ్యముకాదు.
6
▾
Meaning
Keep
వాల్మీకి
రామాయణములోని
అర్థములు
ఇట్టివి
అట్టివి
అని
గుర్తించుట
అసాధ్యం
వేదాంతము
అనేది
అందరికీ
అర్థమయ్యేది
కాదు.
ఉపనిషత్తులు
వేదములయొక్క
సారాంశమే.
అదియే
వేదాంతము.
ఈ
ఉపనిషత్తులు
బోధించేది
ఏమిటి?
ఆత్మ
జ్ఞానము.
“అద్వైత
దర్శనం
జ్ఞానం”.
అద్వైతమనేది
అందరికి
సాధ్యముకాదు.
ఈనాడు
ప్రతి
ఒక్కరికి
‘డ్యుయల్మైండ్’
ఉంటున్నది.
Dual
mind
ఉండటంచేత
చంచలత్వము
ప్రారంభమవుతుంది.
A
man
with
dual
mind
is
half-blind
అన్నారు.
అతను
సగం
గుడ్డివాడే
ఇలాంటి
సగం
గుడ్డివాడైన
వానికి
పవిత్రమైన
వేదాంత
విషయం
ఏవిధంగా
గుర్తించుటకు
వీలవుతుంది.
అందులోని
ఒక్కొక్క
శ్లోకమును
విచారించి
చూస్తే
దానిలో
అనంతమైన
ఆనందముంటున్నది.
దాన్ని
గురించి
వర్ణించాలంటే
సముద్రపునీటిని
అంతా
సిరాగా
మార్చినా
చాలదు.
అంత
గొప్పతనముంటున్నది
ఒక్కొక్క
శ్లోకములో.
అలాంటి
శ్లోకములను
సరైన
రీతిలో
అర్థము
చేసుకొనలేక
దురదృష్టముతో
శోకములో
మునుగుతున్నారు.
వాల్మీకి
రామాయణములోని
అర్థము
ఇట్టిది
అట్టిది
అని
గుర్తించుటకు
వీలుకాదు.
కృష్ణమూర్తి
ఒక
గొప్ప
జ్యోతిష్కుడు,
గొప్ప
Saint
అతను
వాల్మీకి
రామాయణము
చదువుతూ
వచ్చాడు.
రామాయణము
చదివేకొద్దీ
అతనికి
కొత్త
కొత్త
అర్థాలంతా
వచ్చాయి.
రామాయణములో
సీతమ్మవారి
జననమునకు
సంబంధించిన
ఘట్టము
వచ్చింది.
సీతమ్మవారి
జననము
ఏరీతిగా
వర్ణించగలడు
వాల్మీకి?
యజ్ఞము
కొరకు
భూమిని
దున్నుతుండగా
జనకమహారాజుకు
చిక్కినది
ఈబిడ్డ.
“ఆవిషయాన్ని
వాల్మీకి
ఏవిధంగా
వర్ణించాడు?”
కనిపెట్టాలని
కృష్ణమూర్తి
చూచాడు.
సీత
కేవలము
నాగలి
చాటిలో
చిక్కినదని
మాత్రము
చెప్పగలిగాడు.
కానీ
ఎక్కడనుంచి
వచ్చిందో
ఎవరు
చెప్పలేక
పోయారు.
ఆమె
భూజాత.
కనుక
జనకుడు
‘భూజాత’
అని
పిలిచాడు.
‘భూజాత’
అనగా
భూమిలో
పుట్టిన
బిడ్డ
‘భూమాత’
కాదు,
‘భూజాత’.
సీత
ఇంటిలో
తిరుగుతుండగా
అడుగడుగునా
గమనిస్తూ
వచ్చాడు
జనకుడు.
అతని
ఇంటిలో
శివధనుస్సు
ఉన్నది.
శివధనుస్సు
దగ్గరికిపోయింది.
పిల్లలతో
బంతిఆట
ఆడుకుంటూ
వచ్చింది.
ఈ
ఆడటంకూడా
తండ్రికి
తన
సహజతత్త్వము
బోధించేనిమిత్తమే.
ఆ
బంతి
దానికిందకి
పోయింది.
ఆ
పిల్లలు
బంతి
తీయడానికి
ఎంతెంతో
ప్రయత్నంచేశారు.
సాధ్యంకాలేదు.
ఇంకా
ఎంతమందో
బలాఢ్యులు
వచ్చారు.
ఎవరు
వచ్చినా
ఆ
ధనుస్సును
కదిలించలేక
పోయారు.
7
▾
Meaning
Keep
చూస్తున్నాడు
పైనుంచి
జనకుడు,
ధనుస్సుకింద
పడిపోయిన
బంతిని
ఎట్లా
తీస్తుంది?
ఈసీత
అని.
అతను
చూడడం
సీత
గమనించలేదు.
కొంతసేపు
అయిన
తరువాత
నవ్వుకుంటూ
వెళ్ళి
ఎడమచేతితో
ధనుస్సును
ప్రక్కకు
లాగింది.
శివధనుస్సు
సులభంగా
కదిలింది.
ఇది
చూచాడు
జనకుడు.
“సీత
సామాన్యమైనది
కాదు”,
“ఇలాంటి
బలవంతురాలైన
సీత
జన్మజన్మాల
పుణ్యఫలముచేత
నాకు
చిక్కింది”,
అని
తనలోతాను
భావించుకున్నాడు.
జనకుడు
ఆనాడే
“ఈ
శివధనుస్సును
కదిల్చిన
సీతను
శివధనుస్సు
ఎత్తినవానికే
ఇచ్చి
వివాహము
చేయాలి”
అని
సంకల్పించుకున్నాడు.
దానినిమిత్తమై
పెద్ద
యజ్ఞము
జరిపాడు.
శివధనుస్సు
ఎత్తేటందుకు
రాజులంతా
వచ్చారు.
సీతను
పెండ్లాడాలని
యువకులైన
రాజులందరు
వచ్చారు.
వారిలో
రావణాసురుడు
కూడా
ఉన్నాడు.
అతను
మహా
గొప్పవాడు
అతని
వయస్సు
ఇట్టిదని
ఎవరూ
నిర్ణయించలేరు.
అతని
బలము
ఇట్టిదని
ఎవరూ
కనుక్కోలేరు.
అప్పుడు
ఆ
శివధనుస్సును
కొన్నివందల
ఏనుగులచేత
లాగించి
తీసుకొనివచ్చారు.
సీతను
పెండ్లాడాలని
ఒకరితరువాత
ఒకరు
వచ్చారు.
రావణుడు
కూడా
ముందుకు
వచ్చాడు.
రావణుడు
వచ్చినపుడు
అతని
రూపముచూచి
అందరూ
భయపడినారు.
“సుకుమారి,
సుందరియైన
సీతను
దుర్మార్గుడు,
వికారస్వరూపుడు
అయిన
ఇతనా
పెండ్లిచేసుకోవటం”
అనుకున్నారు.
సీత
తల్లి
సునయన
“అయ్యో!
నా
సుకుమారి
బిడ్డను
ఇలాంటి
దుర్మార్గుడికి,
మూర్ఖుడికా
ఇవ్వాలి.
ఈ
ప్రయత్నములో
ఇతను
నెగ్గకుండా
ఉండాలి”
అని
ఆమె
శివుని
ప్రార్థించింది;
కన్నులు
మూసుకుంది.
ఇంతలో
రావణుడు
శివధనుస్సును
పైకి
లేపటానికి
ప్రయత్నంచేశాడు.
కాని,
సాధ్యపడలేదు
క్రిందపడిపోయాడు.
అతనిపైననే
ఈ
శివధనుస్సు
కూడ
పడింది.
దాన్ని
ఎవరూ
ఎత్తేవారు
లేరు.
తప్పించేవారు
కూడాలేరు.
ఇలాంటి
కష్టమునకు
గురయ్యాడు
రావణుడు.
ఈ
పరిస్థితిని
గమనించిన
విశ్వామిత్రుడు
రాముని
ధనుస్సును
ఎత్తడానికి
వెళ్ళమని
సంజ్ఞచేశాడు.
“నీవు
పోయి
దాన్ని
ఎత్తు”
అన్నాడు.
అన్నీ
చూస్తున్నాడు
లక్ష్మణుడు.
రావణునకు
జరిగిన
మర్యాదకూడా
తెలుస్తున్నది.
“నా
అన్నకు
అలాంటి
మర్యాద,
అలాంటి
అగౌరవము
రాదు”
అనుకొని
లక్ష్మణుడు
ధైర్యంగా
ఉన్నాడు.
సుకుమారుడు,
సుందరుడు
అయిన
రాముడు
నెమ్మదిగా
అడుగులో
అడుగు
వేసుకుంటూ
వచ్చాడు.
ఆ
నడక
చూచే
చాలామంది
ఆనందించారు.
ఆ
ముఖమును
చూచి
మరింత
సంతోషించారు.
ఆ
సుందరాంగుడు
వచ్చాడు.
ఎడమచేతితో
శివధనుస్సును
ఎత్తాడు.
8
▾
Meaning
Keep
మొట్టమొదట
సీత
ధనుస్సును
ఎడమ
చేతితోనే
పట్టింది.
అల్లెత్రాడు
కట్టే
నిమిత్తమై
దానిని
వంచాడు.
వంచేటప్పటికి
విరిగిపోయింది.
అక్కడ
సప్తస్వరాలు
వినిపించాయి.
అప్పుడే
మేళాలు
వాయించారు.
“ఇతను
సీతకు
తగినవాడు”
అని
అందరూ
అనుకున్నారు.
తక్షణమే
జనకుడు
తన
బిడ్డను
వెంటపెట్టుకొని
వచ్చాడు.
ఆమె
చేతిలో
పూలమాల
ఉన్నది.
జనకుడు
రామునితో
“నాయనా!
ఈ
శివధనుస్సును
ఎవరు
వంచుతారో
వారికి
నా
కుమార్తెను
ఇచ్చి
వివాహము
చేయాలని
నా
వాగ్దానము
మరియు
సంకల్పము”
అన్నాడు.
రాముడు
సమాధానము
చెపుతూ
“జనకమహారాజా!
ఈ
వివాహమునకు
నా
తల్లిదండ్రుల
ఆజ్ఞ
కావాలి.
అంతవరకు
నేను
ఆమె
ముఖము
కూడా
చూడడానికి
వీలుకాదు”
అని
చెప్పాడు.
చాలా
క్రుంగిపోయాడు
జనకుడు.
“ఏమిటి
ఈ
పిల్లవాడు
ఇట్లా
మాట్లాడుతున్నాడు”
అనుకున్నాడు.
అప్పుడు
విశ్వామిత్రుడు
కలుగజేసుకొని
“నాయనా!
ఈ
శివధనుస్సును
ఎత్తినవారికి
తన
కుమార్తెను
ఇచ్చి
వివాహము
చేస్తానని
ఈ
మహారాజు
వాగ్దానము
చేశాడు,
అంగీకరించు”
అన్నాడు.
ఆ
మాటలకు
రాముడు
మళ్ళీ
“నా
తండ్రి
వచ్చేంతవరకు
నేను
ఏ
మాత్రము
అంగీకరించను”
అని
కచ్చితంగా
చెప్పాడు.
అప్పుడు
జనకుడు
తన
మంత్రిని
పంపించి
దశరథుని
పిలిపించాడు.
రామునికి
చెప్పాడు,
“తల్లిదండ్రులు
వచ్చేంతవరకు
కాచుకోవద్దు.
ఒక్కతూరైనా
ఆమెను
చూడు”
అన్నాడు.
రాముడు
అప్పుడు
కూడా
ధర్మాన్ని
గురించి
బోధిస్తూ
వచ్చాడు.
“పర
స్త్రీని
వివాహమయ్యేంతవరకు
కన్నెత్తి
చూడను;
ఆమె
నాకు
మాతృసమానమైనది.
వివాహమయ్యేంతవరకు
సర్వులు
మాతృస్వరూపులే”
అని
చెప్పి
తన
నివాస
స్థలమునకు
వెళ్ళిపోయాడు.
సీతను
ఒక్కసారి
చూడమని
అందరూ
వచ్చి
చెప్పారు.
వారందరికీ
వినయముతో
“ధర్మాన్ని
పాలిస్తానుగాని,
వ్యక్తులయొక్క
కోరికలు
మన్నించడం
సాధ్యంకాదు”
అని
వారికి
నచ్చచెప్పాడు.
ఇక,
ఈ
సమయములో
రాముని
తొందరపెట్టకూడదని
నిశ్చయించుకొని
అందరు
ఊరుకున్నారు.
మూడు
దినములైన
తర్వాత
అయోధ్యనుండి
దశరథుడు
తన
పరివారసమేతంగా
వచ్చాడు.
వశిష్ఠులవారు
కూడా
వచ్చారు.
రాముని
దగ్గరకు
వెళ్ళారు.
“రామా!
రేపటిదినము
తెల్లవారి
ఎనిమిది
గంటలకు
వివాహము
జరుపుతున్నాము.
దీనికి
నీవు
అంగీకరించాలి”
అన్నారు.
రాముడు
మళ్ళీ
తన
తండ్రిని
పిలవమన్నాడు.
దశరథుడు
వచ్చి
“నాయనా!
నీ
వివాహనిమిత్తమై
మేమందరమూ
వచ్చాము”
అని
చెప్పాడు.
అప్పుడు
రాముడు
“అయితే
నీ
ఆజ్ఞ
అయింది
కాబట్టి,
నేను
తప్పక
అంగీకరిస్తాను”
అని
చెప్పాడు.
9
▾
Meaning
Keep
ఆ
రాముడే
ఇంతకు
పూర్వము
ఒక
విషయములో
దశరథుని
మాటను
అంగీకరించలేదు.
తండ్రి
చెప్పినా
“పట్టాభిషేకము
చేసుకోను”
అన్నాడు.
గురువు
వశిష్ఠులవారు
చెప్పినా
అంగీకరించలేదు.
“పితృవాక్య
పరిపాలనా
దీక్షలో
ఉన్నాను.
నా
తండ్రి
ఆజ్ఞను
అనుసరించి
నేను
అడవికి
పోవాలి.
కేవలం
మీ
ఆజ్ఞలంతా
నెరవేర్చుతూ
పోతే
నా
తండ్రిని
అగౌరవము
చేసినవాడినౌతాను.
నా
తండ్రికి
అగౌరవము
కలుగ
కూడదు.
రాజ్యము
నాకు
అక్కరలేదు.
పట్టాభిషేకము
అవసరము
లేదు.
నేను
అరణ్యమునకే
వెడతాను”
అని
స్పష్టముగా
చెప్పాడు.
అయితే
పెండ్లి
విషయములో
తండ్రి
ఆజ్ఞ
శిరసావహించాడు.
మహనీయుల
దీక్షలు
పరమపవిత్రంగా
ఉంటాయి
వివాహము
జరుగుతున్నది.
తెరకట్టారు.
ఆ
సమయంలో
వధూవరులు
ఒకరినొకరు
చూచుకోకూడదు.
తెరను
తీసిన
తర్వాతనే
అమ్మాయి
అబ్బాయిని,
అబ్బాయి
అమ్మాయిని
చూడాలి.
ఈ
విషయంలో
సీతా
రాములిద్దరూ
ధర్మాన్ని
పాటించేవారే!
గుణవంతులే!
ఆ
తెరను
తీసేసేదాకా
ఆమెకూడా
రాముని
చూడలేదు.
ఏమి
చూస్తున్నారు
వారిద్దరు?
కేవలం
తలవంచుకొని
భూమిని
చూస్తున్నారు.
అప్పుడు
విశ్వామిత్రుడు
“నాయనా!
ఈమె
‘భూజాత’.
నీవు
భూమినే
చూస్తున్నావు
కానీ,
భూమిలో
పుట్టిన
సీతను
చూడటంలేదు,
కారణమేమిటి?”
అని
రాముని
ప్రశ్నించాడు.
అప్పటికింకా
వారిద్దరికీ
వివాహము
కాలేదు.
వివాహము
కాకపూర్వము
పరస్త్రీని
చూడటం
మహాపాపమని
రాముని
దీక్ష.
ఈవిధంగా
మహనీయులయొక్క
దీక్షలు
అంత
పవిత్రముగా
ఉంటాయి.
దేనికి
తగిన
అర్హత
దానికి
ఉండాలి.
భర్త
చాలా
గుణవంతుడై
భార్య
కాకుండాపోతే
ప్రయోజనము
లేదు.
భార్య
గుణవంతురాలుగా
ఉండి
భర్త
గుణవంతుడు
కాకపోతే
ప్రయోజనము
లేదు.
ఇద్దరూ
గుణవంతులే
కావాలి.
రాముడు
సీతమెడలో
ఇంకా
మంగళసూత్రము
కట్టలేదు.
“మంగళసూత్రము
కట్టకమునుపు
ఆమె
తన
భార్య
కాదు”
అని
భావించాడు.
ఇంతలో
వధూవరులిద్దరికీ
పూలమాలలు
తీసుకొని
వచ్చి
ఇచ్చారు.
సీత
రాముని
మెడలో
మాల
వేయలేదు.
రాముడు
కూడ
సీత
మెడలో
మాల
వెయ్యలేదు.
ఆమె
మాల
పట్టుకుంది
చాలాసేపు.
రాముడు
సీతచే
మాల
వేయించుకోవడానికి
తల
వంచలేదు.
10
▾
Meaning
Keep
Also in his talks
(1)
14 January 1992
All learning that lacks humility and obedience is the learning of a rākṣasa!
అప్పుడు
విశ్వామిత్రుడు
“రామా!
నీవు
తలవంచు
సీత
నీ
మెడలో
మాల
వెయ్యాలి”
అన్నాడు.
దానికి
రాముడు
“గురుదేవా!
ఇంతసభలో
ఒక
స్త్రీకి
నేను
తలవంచినానంటే
నా
గౌరవమేమిటి?
కుటుంబగౌరవం
ఏమిటి?
అందువలన
నేను
తలవంచను”
అని
బదులు
చెప్పాడు.
ఈవిధమైన
వాదోపవాదములు
జరుగుతున్నాయి.
అప్పుడు
రాముడు
లక్ష్మణునకు
ఒక
సంజ్ఞచేశాడు.
లక్ష్మణుడే
అన్నింటికీ
సరైన
సూత్రధారుడని
భావించి
సీత
నిల్చున్న
భూమిని
కొంచెము
పైకి
ఎత్తమని
రాముడతనికి
సంజ్ఞచేశాడు.
చాలా
సూక్ష్మబుద్ధి
గలవాడు
లక్ష్మణుడు.
కపి
వారిధి
దాటునా
లక్ష్మీదేవి
వలచునా
లక్ష్మణుండు
గొలుచునా
సూక్ష్మబుద్ధిగల
లక్ష్మణుడు
చూచి,
చూచి
మొక్కునా
అప్పా
రామభక్తి
ఎంత
గొప్పరా!
రామునిపై
లక్ష్మణునికి
ఉన్న
భక్తి
ఎవరికీ
లేదు.
రామునికి
తన
హృదయాన్ని
పూర్తిగా
అర్పితము
గావించుకున్నవాడు
లక్ష్మణుడు.
సూక్ష్మబుద్ధి
గల
లక్ష్మణుడు
వచ్చి
రాముని
పాదాలపై
పడ్డాడు.
అతనిని
లేపటానికని
కొంచెం
వంగాడు
రాముడు.
తక్షణమే
సీత
రాముని
మెడలో
మాల
వేసేసింది.
రాముడు
లక్ష్మణుని
పైకి
ఎత్తేకోసం
తల
వంచేటప్పటికి
ఇంతకంటే
గొప్ప
సూక్ష్మబుద్ధిగల
సీత
వెంటనే
రాముని
మెడలో
మాల
వేసేసింది.
ఆదర్శసతీపతులకు
ఉండే
ఒద్దిక
అట్లా
ఉంటుంది.
ఉపనిషత్తుల
సారమును
అర్థము
చేసుకున్నవారికి
దైవము
చిక్కుతాడు
దైవత్వమును
పొందాలనుకుంటే
ఆ
దివ్యత్వమునకు
తగిన
శక్తిని
మనము
సంపాదించుకోవాలి.
అదియే
నిజమైన
ఆధ్యాత్మికము.
ఉపనిషత్తుల
సారము
ఇదే.
దైవానుగ్రహమును
నీవు
సాధిస్తివా;
ఉపనిషత్తుల
సారము
గైకొన్నావా;
సర్వమూ
నీకు
వశమైపోతుంది.
కనుక,
ఆ
ఉపనిషత్తులయొక్క
తత్వాన్ని
చక్కగా
అర్థము
చేసుకున్న
వ్యక్తులకే
దైవము
చిక్కుతుంటాడు.
“ఉపనిషత్
స్వరూపుడు
ఎలాంటివాడు?”
అని
విచారిస్తే
రాముడా?
కృష్ణుడా?
గోవిందుడా?
నారాయణుడా?
ఇదికాదు.
ఆ
శక్తికి
ఒక
రూపమే
లేదు.
ఆ
అనంతశక్తి
స్వరూపమే
ఈ
నవరాత్రి.
సాక్షాత్తూ
జ్ఞానస్వరూపమైన
శివశక్తి.
పరిపూర్ణ
జ్ఞానము
తప్ప
అన్యములేదు,
ఇందులో.
11
▾
Meaning
Keep
అలాంటి
పవిత్రమైన
శక్తిని
మనము
దర్శించాలంటే
పవిత్రమైన
శక్తిని
సంపాదించుకోవాలి.
తాత్కాలికమైన
ఏవో
సాధనలద్వారా
ఆశక్తి
స్వరూపిణియొక్క
అనుగ్రహమును
సంపాదించాలంటే
అది
చిక్కేది
కాదు.
దక్కేదికాదు.
తాత్కాలికమనేది
ఆధ్యాత్మిక
మార్గములో
ఉండకూడదు.
నిరంతరమైన
శాశ్వతమైన
భక్తి
కావాలి.
స్థిరమైన
శక్తి
కావాలి.
నిర్మలత్వము
మనలో
ప్రవేశించాలి.
నిర్గుణత్వము
సాధించాలి.
నిస్వార్థము
ఉండాలి.
అప్పుడే
ఈ
దివ్యశక్తి
గోచరమవుతుంది.
రేపటిదినము
ఈ
దివ్యశక్తియొక్క
తత్త్వము
చక్కగా
అర్థము
చేసుకుందాము.
చిత్తశుద్ధితో
ఉచ్చరించే
మంత్రములకు
ఎంతో
పవిత్రత
చేకూరుతుంది
ప్రేమస్వరూపులారా!
ఈ
వేదపురుషసప్తాహజ్ఞానయజ్ఞములోపల
ఉచ్చరించే
మంత్రముల
ప్రభావము
ఇట్టిది
అట్టిది
అని
ఎవరూ
గుర్తించుకోలేరు.
మన
ప్రశాంతి
నిలయములో
ఈ
జ్ఞాన
యజ్ఞములో
ఈ
పవిత్ర
మంత్రములను
పఠించే
బ్రాహ్మణులు
పవిత్ర
హృదయులు.
ఇందుకు
ఉదాహరణముగా
మీకు
చెప్పుతున్నాను,
ఒక
చిన్న
విషయము.
వేదపండితులందరూ
12
గంటలకు
లేస్తున్నారు.
కాని,
సహస్రలింగార్చన
ఇంకా
జరుగుచున్నది.
అది
అయ్యేంతవరకు
ఒక
పండితుడు
లేవలేదు.
మరొక
పండితుడు
మహాభారతము
చదువుచున్నాడు.
ఆయనకూడ
లేవలేదు.
ఇంకా
వేదపారాయణచేసే
నలుగురు
అక్కడే
ఉన్నారు.
వారు
కూడా
“మీరు
పొండి;
మేము
పూర్తి
అయిన
తర్వాత
వస్తాము”
అన్నారు.
ఈవిధముగా
ప్రతి
ఒక్కరు
తాము
సంకల్పించుకున్న
కార్యము
పూర్తి
అయ్యేవరకు
కదిలేవారు
కారు.
ఈ
సహస్రలింగార్చనచేసే
ఆయన
మధ్యాహ్నము
రెండు
గంటలవరకు
అక్కడే
ఉంటాడు.
అలాంటి
చిత్తశుద్ధి
కలిగిన
బ్రాహ్మణులు
ఇక్కడ
చేరడంచేత
వారు
ఉచ్చరించే
ఒక్కొక్క
మంత్రమునకు
ఎంతో
పవిత్రత
చేకూరింది.
ఈ
మంత్రములలోని
అర్థమును
గుర్తించుకోగలిగితే
చాలా
అదృష్టమే.
గుర్తించుకోలేకపోయినా
కేవలం
శ్రవణం
చేయటంకూడా
గొప్ప
అదృష్టమే.
కనుకనే
ముందు
శ్రవణం;
ఆ
తర్వాత
శ్రవణం
నుంచి
లీనంవరకు
కొనసాగే
సాధన
ఇది.
శ్రవణం,
కీర్తనం,
విష్ణుస్మరణం,
పాదసేవనం,
వందనం,
అర్చనం,
దాస్యం,
స్నేహం,
ఆత్మనివేదనం
వస్తుంది.
స్నేహితుడు
కానంతవరకు
ఆత్మనివేదనము
చేయటానికి
వీలుకాదు.
కనుక,
స్నేహము
వరకు
మనము
సాధనచేయాలి.
12
▾
Meaning
Keep
శ్రవణముతో
ప్రారంభించాలి.
ఆ
దివ్యమైన
శ్రవణంచేత
భావము
వస్తుంది.
కనుక
మనము
ఇక్కడ
ఈ
జ్ఞాన
యజ్ఞములో
చేసే
ప్రతి
కార్యమునందు
పవిత్రమైన
భావములు
నిండి
ఉంటున్నాయి.
లోకంలో
ఏదో
పదిమంది
యజ్ఞాలు
చేస్తున్నారు,
మనము
కూడా
చేస్తున్నామనే
ఉద్దేశ్యంతో
చేసేది
కాదు
ఇది.
“యజ్ఞము”
అనగా
పరిపూర్ణత్యాగముతో
చేసేది.
మాకు
ఎట్టి
వాంఛలు
లేవు.
ఎట్టి
అభీష్టములు
లేవు.
కేవలం
లోకకళ్యాణము
కొరకు,
సర్వులయొక్క
ఆనందక్షేమముల
కొరకు
సర్వులు
పరిపూర్ణహృదయులు
కావాలనే
ఆకాంక్షతో
ఈ
జ్ఞానయజ్ఞము
నిర్వహింపబడుతున్నది.
దేశములో
కరవు
వచ్చింది,
ఈ
కరవు
నివారణకు
యజ్ఞములు
నిర్వహించాలని
కొందరు
భావిస్తారు.
కాని
ఏమిటి
ఈ
కరవులు?
ఇవి
వస్తుంటాయి,
పోతుంటాయి.
ఇలాంటి
అల్పమైన
భావాలకు
నేను
ఏ
మాత్రము
ప్రయత్నించను.
ఏది
చేసినా
శాశ్వతమైనదిగా
చేయాలి.
ఏదైనా
నిత్యసత్యమైనదిగా
చేయాలి.
పవిత్రమైనదిగా
ఉండాలి.
ప్రాప్తిని
కలిగించేదిగా
ఉండాలి.
కనుక,
రేపటి
దినము
ఈ
ఉపనిషత్తుల
తత్త్వము,
దీని
అంతరార్థము
మీరు
విందురు
గాక!
Previous
←
Earn divine Prema
Next
The So'ham principle itself is the principle of the Trimūrti
→