Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2006 · Only one who has conquered the five senses can see divinity
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Only one who has conquered the five senses can see divinity
23 February 2006, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులైన
పిల్లలకు
ఆశీస్సులు.
మీరు
ప్రైమరీ
స్కూలునుండి
12వ
తరగతివరకు
చదవడం,
మంచిమార్కులు
పొందడం,
మంచిపేరు
తెచ్చుకోవడం
సంతోషాన్ని
కలిగిస్తున్నది.
మీరు
ప్రైమరీ
స్కూలులో
చదివినంత
కాలము
ఎంతో
గుణవంతులుగాను,
బలవంతులుగాను,
యుక్తివంతులుగాను,
శక్తిమంతులుగాను
మెలగారు.
ప్రేమ,
దయ,
కరుణ,
ఆనందము
ఇటువంటి
సద్గుణములు
ఎన్నియో
మీలో
అభివృద్ధి
అయినవి.
ఎంతో
అన్యోన్యంగా
అన్నదమ్ములవలె
మీరు
కలసి
మెలసి
ఉంటూ
వచ్చారు.
మీ
ఆటలు,
పాటలు,
మాటలు
అన్నీ
మధురమైనవిగా
ఉంటూ
వచ్చాయి.
అయితే,
ప్రైమరీ
స్కూల్‌ను
విడిచిపెట్టిన
తరువాత
మీరు
ఏవిధంగా
మారినారో,
మీ
మనస్సు
ఏవిధంగా
ఉన్నదో
మీరే
యోచించుకోవచ్చు.
పెరిగే
కొలదీ
మీ
ఆటలు,
పాటలు,
మాటలు,
చేష్టలలో
పవిత్రత
సన్నగిల్లింది.
అయితే,
అందరూ
అట్లు
కాదు.
కొందరు
మాత్రం
తమ
మనసును
మలినం
చేసుకుంటున్నారు.
దేహము,
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
ఇంద్రియాలు
వీటన్నింటితో
కూడినది
మానవత్వము.
మానవుడు
ముక్తిని
పొందాలంటే
మొట్టమొదట
తన
మనస్సును
పవిత్రం
గావించుకోవాలి.
ఏది
తనది
కాదో
దానిని
ఆశించకూడదు.
మనసు
దేనినైనా
ఆశిస్తే,
‘ఇది
ఎవరిది?
నాదా,
పరులదా?’
అనే
ప్రశ్న
మొట్టమొదట
వేసుకోవాలి.
అది
ఇతరులదని
తెలిసినప్పుడు
దానిపైన
మనసును
మళ్ళించకుండా
ఎంతో
జాగ్రత్తగా
ఉండాలి.
అంతేగాని,
‘ఇది
నాది,
ఇది
నాకు
చెందాలి’,
అనే
పిచ్చిభ్రాంతిలో
మునిగి
జీవితాన్ని
పాడుచేసుకోకూడదు.
మీరు
పరుల
వస్తువును
ఆశించకూడదు,
అపహరించకూడదు.
మీ
మనసును
పవిత్రంగా
ఉంచుకోవాలి.
2
▾
Meaning
Keep
దానిపైన
మాలిన్యము
రుద్దకూడదు.
లేతవయస్సులోనే
ఇటువంటి
జ్ఞానమును
అభివృద్ధి
చేసుకోవాలి.
ఏది
చేసినప్పటికీ
‘దీనిని
భగవత్ప్రీత్యర్థం
ఆచరిస్తున్నాను;
భగవంతునికే
అర్పితం
చేస్తున్నాను’,
అనే
పవిత్రమైన
భావం
మీలో
ఉద్భవించాలి.
మీరు
‘నాది’
అనుకునేది
ఏదీ
నిజానికి
మీది
కాదు.
మొట్టమొదట
‘నేను
ఎవరు?’
అని
ప్రశ్న
వేసుకోండి.
ఈ
ప్రపంచమంతయు
అణువు
మొదలు
ఘనము
వరకు
దైవత్వమే
నిండియున్నది.
ఇసుక
రేణువునుండి
చక్కెర
కణమువరకు,
చీమ
మొదలుకొని
ఏనుగువరకు
సర్వమూ
భగవంతునియొక్క
స్వరూపమే.
ఈ
జగన్నాటక
రంగములో
అన్ని
పాత్రలూ
భగవంతుడే
పోషిస్తున్నాడు.
అన్ని
ఆటలూ
తనవే.
అన్ని
మాటలూ
తనవే.
అన్ని
పాటలూ
తనవే.
భగవంతుడు
కానిది
లోకములో
ఒక్కటీ
లేదు.
సృష్టి
అంతయు
భగవత్స్వరూపమే.
కనుక,
మనం
ఏది
చేసినప్పటికీ,
ఏది
చూసినప్పటికీ,
ఏది
చెప్పినప్పటికీ
అంతయు
భగవత్స్వరూపమే
అనే
సత్యాన్ని
గుర్తించి
వర్తించాలి.
ఎవరిని
చూసినప్పటికీ
‘వీరు
భగవత్
స్వరూపులే’
అనే
భావంతో
చూడాలి.
ఏ
మాటలు
చెప్పినప్పటికీ
అవి
భగవత్సంబంధమైనవిగా
ఉండాలి.
ఆవిధమైన
భావముతో
మెలగినప్పుడు,
దానినే
‘ముక్తి’
అంటారు.
మీరు
మీ
పంచేంద్రియములను
పవిత్రం
గావించుకోవాలి.
పరులను
నొప్పించకుండా,
మీరు
నొప్పిపడకుండా
జాగ్రత్తగా
మసలుకోవాలి.
మాటలను
కూడా
పవిత్రంగా
ఉపయోగించాలి.
‘అంతా
భగవత్
స్వరూపమే’
అనే
ఏకత్వభావన
వహించాలి.
ఏకత్వభావనయే
తపస్సు,
భేదభావమే
తమస్సు
ఈనాటి
పిచ్చి
మానవుడు
ఏకత్వాన్ని
విస్మరించి
‘నావారు,
పరాయివారు’
అనే
భేదభావములను
పెంచుకుంటున్నాడు.
భేదభావములవలన
కలిగే
అనర్థాన్ని
గురించి
మన
ప్రాచీన
చరిత్రలు
హెచ్చరిస్తూనే
ఉన్నాయి.
కౌరవ,
పాండవుల
చరిత్ర
మీకు
తెలుసు.
ధృతరాష్ట్రుని
కుమారులు
కౌరవులు,
పాండురాజు
పుత్రులు
పాండవులు.
వీరిరువురి
మధ్య
యుద్ధం
జరిగింది.
అయితే,
తప్పు
ఎవరిది?
ధృతరాష్ట్రుడు,
పాండురాజు
వీరిరువురిదీ
ఒకే
రాజ్యమే.
ఇద్దరూ
ఒకే
తండ్రి
బిడ్డలే.
కాని,
భావములు
వేరువేరు.
రాజ్యకాంక్ష
కారణంగా
కౌరవులలో
భేదభావములు,
దుష్ట
తలంపులు
అభివృద్ధి
అయినాయి.
3
▾
Meaning
Keep
భేదభావములను
విడిచిపెట్టకుండా
మీరు
ఎంత
కాలము
తపస్సు
చేసినా,
రాత్రింబవళ్లు
కూర్చుని
జపము
చేసినా
ప్రయోజనము
లేదు.
అటువంటి
తపస్సు
కేవలం
తమస్సుగా
మారిపోతుంది.
‘నేను
ఎన్నియో
సంవత్సరములనుండి
జపము
చేస్తున్నాను.
కాని,
నాకు
భగవంతుడు
కనిపించలేదే’,
అని
నిరాశ
చెంది
కొందరు
తాము
చేసే
సాధనను
మధ్యలో
విడిచి
పెడతారు.
భగవంతుణ్ణి
దర్శించాలంటే
ఏకత్వాన్ని
అభివృద్ధి
పరచుకోవాలి.
“దేవుడు
వేరే
ఉన్నాడు,
రాముడు
వేరే
ఉన్నాడు,
కృష్ణుడు
వేరే
ఉన్నాడు”,
అని
అనుకోవడం
foolishness
(మూర్ఖత్వం).
దైవం
ఎవరు?
ఎక్కడున్నాడు?
పంచభూతాలే
దైవస్వరూపాలు.
పంచేంద్రియాలే
దైవస్వరూపాలు.
ఇష్టము
గాని,
కష్టముగాని
అన్నీ
అవే
మనకు
తెచ్చిపెడుతున్నాయి.
కనుక,
మొట్టమొదట
ఇంద్రియాలను
కంట్రోలు
చేసుకోవాలి.
Where
is
God?
Who
is
God?
Your
mind
is
God.
(దైవం
ఎవరు?
ఎక్కడున్నాడు?
మీ
మనసే
దైవం).
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’,
బంధమోక్షములు
రెండూ
మనసు
ద్వారానే
సంప్రాప్త
మౌతున్నాయి.
కాబట్టి,
మనస్సు
దైవమే;
బుద్ధి
దైవమే;
చిత్తము
దైవమే;
ఇంద్రియములుకూడా
దైవస్వరూపములే.
కాబట్టి,
చిత్తశుద్ధితో
మీరు
భగవంతుని
పూజించాలి.
మీ
చిత్తమును
భగవదర్పితం
గావించాలి.
కామ
క్రోధాది
అరిషడ్వర్గాలతో
మీ
ఇంద్రియాలను
అపవిత్రం
గావించకూడదు.
కామము
అనగా
కోరిక.
దానిని
భగవంతునివైపు
మరల్చాలి.
భగవంతుడే
కావాలని
కోరుకోవాలి.
భగవంతుడినే
ప్రేమించాలి.
అదే
సార్థకమైన
ప్రేమ.
అంతేగాని,
వ్యక్తులయొక్క
రూపనామములను
చూసి
ఆకర్షితులై
వారిని
ప్రేమించడం
ప్రేమకాదు.
భగవంతుణ్ణి
ప్రేమిస్తే
సర్వమూ
మీకు
లభ్యమవుతుంది.
మీ
ఆశలన్నీ
భగవంతుని
పరంగానే
ఉండాలి.
ప్రతి
ఒక్కటీ
భగవత్ప్రీత్యర్థంగా
ఉండాలి.
మీరు
ఏది
చేసినప్పటికీ
భగవద్భావంతో
చేయాలి.
మీరొక
వ్యక్తిని
ప్రేమించవచ్చును.
అయితే,
ఆ
వ్యక్తిని
కేవలం
వ్యక్తిగా
చూడవద్దు;
అతనిలో
ఉన్న
భగవత్తత్త్వాన్ని
చూడాలి.
4
▾
Meaning
Keep
ఇంద్రియాలను
జయించడమే
నిజమైన
ముక్తి
ఈ
ప్రపంచంలో
ఎక్కడ
చూసిననూ,
ఎక్కడ
శోధించిననూ
పంచభూతములు
తప్ప
మరొక
పదార్థం
లేనే
లేదు.
మన
హస్తానికి
ఐదు
వ్రేళ్లున్నాయి.
ఒకవేళ
ఆరవ
వ్రేలేమైనా
పుట్టెనా,
డాక్టరు
దగ్గరకు
వెళితే
ఆపరేషన్
చేసి
దానిని
తీసేస్తాడు.
అది
ఉండకూడదు.
అదేవిధంగా,
ప్రతి
వ్యక్తికీ
ఐదు
ఇంద్రియాలున్నాయి.
ఈ
ఇంద్రియాలను
జయించడమే
నిజమైన
ముక్తి.
ఇంద్రియాలను
జయించకుండా
ముక్తి
లభించడం
అసాధ్యం.
‘అయ్యో,
ఇది
మాకు
సాధ్యం
కాదు,
స్వామీ!’
అని
మీరు
అనుకుంటారు.
మీకు
సాధ్యము
కానిది
లోకంలో
ఏమున్నది!
పట్టుపడితే
దేనినైనా
సాధించవచ్చును.
దైవాన్నే
సాధించే
శక్తి
గలిగిన
మీకు
ఇంద్రియాలను
జయించడం
ఏమంత
కష్టం
కాదు.
ఇంద్రియాలు
చాలా
అల్పమైనవి.
వీటిని
కంట్రోలు
చేసుకొనలేకపోతే
మీరు
మనుష్యులే
కారు.
దుర్లభమైన
మానవజన్మను
సార్థకం
చేసుకోవాలంటే
మీరు
దీనిని
తప్పక
సాధించాలి.
ఏ
ఒక్క
ఇంద్రియానికి
లొంగిపోయినప్పటికీ
మీరు
అల్పులే
అవుతారుగాని,
అధికులు
కాజాలరు.
‘దైవం
మానుషరూపేణ’
అన్నారు.
అటువంటి
పవిత్రమైన
మనుష్యత్వమును
పొందియు
మీరు
ఇంద్రియాలను
జయించలేమనడం
ఎంత
వెఱ్ఱితనము!
ఇంద్రియాలకు
లొంగిపోయినవాడు
రాక్షసునికంటే
హీనుడని
చెప్పవచ్చు.
ఆత్మప్రేమ
కలిగినవాడే
నిజమైన
మానవుడు
మనిషిగా
జన్మించినందుకు
మీరు
ఉత్తములుగా
రూపొందాలి.
మీకు
మీ
భార్య,
పిల్లలంటే
ఇష్టముండవచ్చును.
కాని,
‘నావారు,
పరాయివారు’
అనే
భేదం
పెట్టుకోకూడదు.
అందరూ
దైవస్వరూపులే!
దైవమునుండి
దైవమే
పుట్టాడు.
అందరిమధ్య
ఈవిధమైన
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమున్నది.
లోకంలో
మనకు
కనిపించే
ప్రతి
ఒక్కటీ
దైవానికి
చెందినదే.
ప్రతి
వస్తువునందు,
ప్రతి
ప్రాణియందు
దైవత్వము
ఉంటుండాది.
ఇసుక
రేణువులోను,
చక్కెర
కణములో
కూడా
దైవత్వము
ఉంటుండాది.
విశ్వమంతయు
విష్ణుస్వరూపమే.
విశ్వమంతయు
ఒకే
కుటుంబమే.
కాబట్టి,
మీయందు
విశ్వప్రేమ
ఆవిర్భవించాలి.
అదే
ఆత్మప్రేమ.
అట్టి
ప్రేమను
పోషించుకున్నప్పుడే
మీరు
మనుష్యులవుతారు.
5
▾
Meaning
Keep
అప్పుడే
మీరు
ఆత్మను
దర్శించగలరు.
అప్పుడే
మీరు
దైవ
స్వరూపులు
కాగలరు.
అట్లుకాకుండా
భేదభావము,
క్రోధము,
ద్వేషములను
పెంచుకుంటూపోతే
మీరు
పశువులకంటే
హీనులవుతారు.
పశువుల
మాదిరి
మీరుకూడా
పోట్లాడుతూ
ఉంటే,
ఇంక
పశువులకూ,
మీకూ
తేడా
ఏమిటి?!
ద్వేషము,
రోషము
మీయందు
ఉండనే
ఉండకూడదు.
మనిషి
దైవముకంటే
వేరని
భావించడంచేతనే
భేదభావము
ప్రారంభమవుతున్నది.
భేదభావం
ఎక్కడ
ఉంటుందో
అక్కడ
ద్వేషం
తలెత్తుతుంది.
నాకున్న
ప్రోపర్టీ
ప్రేమ
ఒక్కటే
ఈశ్వరుణ్ణి
‘హిరణ్యగర్భాయ
నమః’
అని
మీరు
స్తుతిస్తున్నారు.
తన
ఉదరమునందు
బంగారము
కలిగినవాడు
హిరణ్యగర్భుడు.
మీరందరూ
బంగారు
పిల్లలే.
కాని,
మీరు
మట్టిలో
చేరిపోతున్నారు.
మిమ్మల్ని
పరిశుద్ధం
చేయడానికి
అప్పుడప్పుడు
మహనీయులు
వచ్చి
ఇలాంటి
మర్మాన్ని
తెలుపుతూ
రావాలి.
కాని,
ఎవరైనా
పెద్దలు
వచ్చి
ఈవిధమైన
మర్మాన్ని
తెలిపితే,
‘అదంతా
వారి
పిచ్చి.
మట్టి
బంగారమవుతుందా?
ఇసుక
చక్కెరగా
మారుతుందా?’
అని
కొంతమంది
సందేహిస్తుంటారు.
ఈనాటి
మానవునియందు
అన్నీ
డౌట్స్,
డౌట్స్,
డౌట్స్!
ఈ
‘డౌట్స్’
రావడానికి
కారణమేమిటి?
‘నేను
వేరు,
దైవము
వేరు’
అనే
భావము
ఉండినప్పుడే
అటువంటి
‘డౌట్స్’
వస్తుంటాయి.
నిండు
కుండ
తొణకదు.
అదేరీతిగా,
భగవంతుడు
అన్నీ
తెలిసినవాడు
కనుకనే
నిశ్చలంగా
ఉంటాడు.
నాకు
అందరూ
తెలుసు.
ఎవరైనా
సరే,
ఏ
కులమైనా,
ఏ
మతమైనా,
ఏ
గ్రామమైనా,
ఎక్కడున్నా
సర్వమూ
నాకు
తెలుసు.
‘మేమెవరో
స్వామికి
తెలియదే’,
అని
మీరనుకోవచ్చు.
కాని,
నాకు
తెలియనిది
లేదు.
అన్నీ
తెలిసినప్పటికీ
తెలియనట్లుగా
మాట్లాడుతుంటాను.
(స్వామి
ఒక
విద్యార్థిని
వేదికపైకి
పిలిచి)
ఈ
అబ్బాయి
మొట్టమొదట
స్వామివద్దకు
వచ్చినప్పుడు
చాలా
చిన్నపిల్లవాడు.
అప్పుడు
ఇతని
తల్లీ
తండ్రీ
వాళ్ల
నలుగురు
బిడ్డలూ
వచ్చారు;
తల్లి
తీవ్ర
అనారోగ్యంతో
బాధపడుతోంది.
వాళ్లను
నేను
లోపలికి
పిలిచాను.
‘నాయనా!
ఈ
పిల్లల
తల్లి
ఉండదు.
నీవేమీ
యోచన
పెట్టుకోకు.
నీ
పిల్లల
బాధ్యతంతా
నేను
వహిస్తాను”,
అని
వాళ్ల
నాన్నకు
ప్రామిస్
చేశాను.
పిల్లలంతా
ఏడుస్తుంటే,
“Why
fear
when
I
am
here?
6
▾
Meaning
Keep
(నేనుండగా
భయమెందుకు?)
నేనే
మీ
తల్లిని.
నేనే
మీ
తండ్రిని.
అన్నీ
నేను
చూసుకుంటాను”,
అని
వాళ్లకు
ధైర్యం
చెప్పాను.
చెప్పినట్లుగానే
వాళ్ల
యోగక్షేమాలను
నేను
చూసుకుంటూ
వచ్చాను.
వాళ్ళు
వచ్చినప్పుడల్లా
పిలిపించి
మాట్లాడి
వాళ్ళకు
ధైర్యమిస్తూ
వచ్చాను.
ఆడబిడ్డల
పెండ్లిండ్లుకూడా
అయిపోయినాయి.
వాళ్లకి
కావలసినవన్నీ
చేశాను.
ఎవరికీ
ఏవిధమైన
ఇబ్బందీ
లేదు.
ఈవిధంగా
ప్రతి
ఒక్కరినీ
నేను
ప్రేమిస్తున్నాను.
నా
ప్రోపర్టీ
ఒక్కటే
-
అదే
ప్రేమ,
ప్రేమ,
ప్రేమ!
ఎప్పుడుకూడను
ఎవరిపైనను
నాకు
కోపం
లేదు.
వ్యక్తులను
సరిదిద్దే
నిమిత్తం
కోపం
నటిస్తానే
గాని,
నా
లోపల
కోపం
లేదు.
నా
నిండుకు
ఉన్నది
ప్రేమయే!
నేను
అందరినీ
ప్రేమతో
చూస్తున్నాను.
ప్రతి
మానవుడూ
ఈశ్వర
స్వరూపుడే!
‘ఈశ్వరస్సర్వ
భూతానాం’.
ఈశ్వరుడనగా
చేతులకు
రుద్రాక్షలు
చుట్టుకొని,
మెడలో
పాములు
ధరించిన
వాడు
కాదు.
ప్రపంచానికి
చూపించేందుకై
ఆవిధమైన
రూపం
కల్పించారు.
మానవుడు
ఏదో
ఒకవిధంగా
భగవంతుని
ప్రార్థించాలనే
ఉద్దేశ్యంతో
ఈశ్వరుడు,
పార్వతి,
లక్ష్మి,
విష్ణువు
మొదలైన
రూపనామములను
కల్పించడం
జరిగింది.
నిజానికి
ప్రతి
మానవుడు
కూడను
ఈశ్వరస్వరూపుడే.
ఈశ్వరుడు
కానిది
ఈ
లోకములో
ఒక్కటీ
లేదు.
మట్టికూడా
ఈశ్వరుడే.
ఈ
కర్చీఫ్కూడా
ఈశ్వరుడే.
అన్ని
రూపనామములూ
ఈశ్వరత్వము
నుండియే
ఆవిర్భవించినాయి.
ఈ
ప్రపంచములో
ఎవరుకూడను
దైవత్వాన్ని
గాంచలేదు.
పంచేంద్రియములను
జయించినవాడే
దైవత్వాన్ని
గాంచగలడు.
దైవత్వము
ఒక
ప్రత్యేకమైన
రూపముతో
కనిపించదు.
‘రాముడు
కనిపించాడు,
కృష్ణుడు
కనిపించాడు’
అని
అంటారేగాని,
అదంతా
ఇమేజినేషన్
మాత్రమే!
దివ్యత్వము
ఒక్కటే.
దానికే
‘ఈశ్వరత్వము’
అని
పేరు
పెట్టారు.
ఆ
దివ్యత్వమును
గుర్తించుకోలేక
దానికి
రూపనామములు
కల్పించి
మీరు
మాయలో
పడుతున్నారు.
భక్తులే
భగవంతుణ్ణి
మారుస్తున్నారు
గాని,
భగవంతుడు
మారడం
లేదు.
God
is
one.
He
is
permanent.
(భగవంతుడు
ఒక్కడే.
ఆయన
శాశ్వతుడు).
మీరు
ముఖ్యంగా
పంచేంద్రియములను
జయించడానికి
తగినటువంటి
సాధన
చేయాలి.
7
▾
Meaning
Keep
అది
చేయకుండా
ఏదో
జపము,
ధ్యానము
చేసుకుంటూ
కూర్చుంటే
మీకు
భగవంతుడు
కనిపించడు.
మీరు
కళ్ళు
మూసుకొని
జపమో,
ధ్యానమో
చేస్తున్నప్పటికీ
మీ
‘మంకీ
మైండు’
అటూ
ఇటూ
తిరుగుతూంటుంది.
అన్ని
గుణములూ
కలిగించేది
మనస్సే!
ఇట్టి
సత్యాన్ని
గుర్తించకుండా
మీరు
సాధనలు
చేస్తున్నారు.
పంచభూతముల
తత్త్వమే
దైవత్వం.
ఒక్క
ప్రేమ
తప్ప
దైవత్వములో
మరొకటి
లేదు.
ఇక్కడ
ఇంతమంది
ఉన్నప్పటికీ
అందరియందు
ఉన్న
ప్రేమతత్త్వం
ఒకటే.
ప్రాపంచికమైన
సంబంధ
బాంధవ్యములలో
వ్యత్యాసం
ఉండవచ్చుగాని,
అందరియందున్న
దైవత్వం
ఒక్కటే.
కనుక,
అందరూ
అక్కచెల్లెళ్లు,
అన్నదమ్ముల
మాదిరి
అన్యోన్యంగా
మెలగాలి.
ఇంద్రియ
నిగ్రహంలోనే
క్షేమమున్నది
ఈనాడు
అనేక
విద్యాసంస్థల్లో
ఆడపిల్లలు,
మగపిల్లలు
కలిసి
చదువుకుంటున్నారు.
దానిని
‘కో
ఎడ్యుకేషన్’
అంటున్నారు.
అటువంటి
కాలేజీల్లో
విద్యార్థినీ
విద్యార్థులు
సోదరీసోదరులవలె
మెలగాలి.
అంతేగాని,
‘స్త్రీలు,
పురుషులు’
అనే
భేదభావము
వారిలో
రాకూడదు.
ఇటువంటి
భేదభావము
ఎవరిలో
వస్తుందో
వారు
ఫెయిలైపోతారు.
ఎందులో?
హృదయ
సంబంధమైన
ప్రేమలో!
ప్రాపంచికమైన
పరీక్షలో
పాస్
కావడం
గొప్పతనం
కాదు.
చదివితే
అందరూ
పాసవుతారు.
హృదయ
సంబంధమైన
ప్రేమలో
ఫెయిలై
లోక
సంబంధమైన
పరీక్షలో
పాసయితే
ప్రయోజనమేమిటి?
దివ్యమైన
ప్రేమలో
పాసయినవాడే
జీవితంలో
విజయం
సాధించినవాడవుతాడు.
అందరూ
భగవంతుని
బిడ్డలే.
కనుక,
అందరూ
అన్యోన్యంగా,
అనురాగంగా,
అన్నదమ్ముల
వలె,
అక్కచెల్లెళ్ళవలె
ఒకరినొకరు
ప్రేమించి,
ఆదరించి,
ఒకరికొకరు
సహాయం
చేసుకొని
జీవిస్తూ
రావాలి.
ఎటువంటి
సమయమునందుకూడను
ఒకరిపై
ఒకరికి
క్రోధము,
ద్వేషము
రాకూడదు.
ద్వేషమును
అణగద్రొక్కుకోవాలి.
ఇంద్రియాలను
కంట్రోలు
చేసుకోవాలి.
అందులోనే
క్షేమమున్నది.
మీకు
తెలుసు
-
రైల్వే
స్టేషన్లో
కంట్రోల్స్
సరిగా
పనిచేయనప్పుడు
రైళ్ళు
పట్టాలు
తప్పుతాయి.
అదేరీతిగా,
మన
దేహమునందున్న
సర్వ
శక్తులకు,
సమస్త
భావములకు
మనస్సు
కంట్రోలర్
వంటిది.
8
▾
Meaning
Keep
కాబట్టి,
మనస్సును
స్వాధీనం
చేసుకుంటే
ఇంద్రియాలుకూడా
స్వాధీనమైపోతాయి.
విద్యార్థులారా!
మీరందరూ
బంగారు
బిడ్డలే.
మీ
మాటలు
మధురంగా
ఉన్నాయి.
మీ
నడతనుకూడా
అందుకు
తగినట్లుగా
తీర్చిదిద్దుకోండి.
ఎక్కడికి
పోయినప్పటికీ
సత్యసాయి
కాలేజీ
పిల్లలు
ఆనందంగా,
ఆదర్శంగా
ఉంటుండాలి.
తెల్లడ్రస్సు
వేసుకున్నంత
మాత్రమున
మిమ్మల్ని
సత్యసాయి
పిల్లలని
చెప్పడానికి
వీలుకాదు.
మీరు
ధరించిన
దుస్తులకు
తగినట్లుగా
మీ
మనస్సును
స్వచ్ఛంగా,
హృదయాన్ని
పవిత్రంగా
ఉంచుకోండి.
అట్టి
ఆదర్శవంతులైన
విద్యార్థులను
స్వామి
ఇంట,
వెంట,
జంట,
కంట
ఉండి
కాపాడుతుంటాడు.
వారికి
ఏమి
కావలసినను
నేను
ఇస్తుంటాను.
ఈరీతిగా,
ఎందరినో
ఎన్ని
విధాలుగానో
కాపాడుతున్నాను.
కాని,
ఎవ్వరుకూడను
ఈ
సత్యాన్ని
ఈనాటికీ
కనుక్కోవడం
లేదు.
సత్యము
ననుసరిస్తే
సర్వమును
సాధించగలరు
ఆత్మయే
దైవత్వము.
అదియే
ఈశ్వరత్వము
అనే
భావమును
మీరు
మనసులో
దృఢం
చేసుకోవాలి.
మీ
భావములందు
ఈశ్వరత్వమే
లేకపోతే
మీరు
మనుష్యు
లెట్లవుతారు?!
ఈశ్వరత్వమే
మీ
ప్రాణము.
అదే
సర్వము.
ప్రేమయే
ఈశ్వరత్వము.
కాబట్టి,
ప్రేమలో
జీవించండి.
ప్రేమ
అనేది
కేవలం
ఒక
వ్యక్తికి
పరిమితం
కాకూడదు.
ప్రేమను
అందరికీ
పంచాలి.
ఈ
భావనను
మీరు
మనసులో
దృఢం
చేసుకుంటే
దేశానికి
ఆదర్శం
నిరూపించగలరు.
‘భగవంతునిపై
మీకు
నమ్మకం
ఉందా?’
అని
అడిగితే
పిల్లలంతా
‘యెస్
స్వామీ,
యెస్
స్వామీ’
అంటారు.
‘యెస్’
అనే
పదము
కేవలం
నోటినుండి
వస్తే
ప్రయోజనం
లేదు;
హృదయంనుండి
రావాలి.
చేసిన
తప్పుకు
‘సారీ’
చెపితే
సరిపోదు;
ఆ
తప్పు
మళ్ళీ
చేయకుండా
ఉండాలి.
సత్యమే
మనకు
ప్రధానమైనది.
Truth
is
God.
Don't
speak
untruth.
సత్యమును
అనుసరిస్తే
మీరు
సర్వమును
సాధించగలరు.
సత్యమే
మనకు
రక్ష.
సత్యమే
మనకు
అండ.
మనకు
అండ,
దండ
ఉండే
సత్యమును
వదలిపెట్టి
అసత్యాన్ని
పలికితే
మనం
మానవుల
మెట్లవుతాము?!
ఎలాంటి
పరిస్థితియందు
కూడను
అసత్యాన్ని
పలుకకూడదు.
సర్వమునకు
నాయకుడు
భగవంతుడు
ఒక్కడే.
God
is
the
only
leader.
9
▾
Meaning
Keep
ఏది
న్యాయమో,
ఏది
అన్యాయమో
నిర్ణయించగలవాడు
భగవంతుడు
ఒక్కడే.
అటువంటి
సర్వజ్ఞుడు,
సర్వవ్యాపకుడు,
సర్వశక్తిమయుడైన
దైవాన్ని
మీరు
మరువకూడదు.
‘స్వ,
పర’
భేదమును
విడిచిపెట్టి
సమత్వంగా,
ఆనందంగా
అందరితో
కలసి
మెలసి
జీవిస్తూ
సత్కీర్తిని
సాధించాలి.
అందరుకూడను
భగవంతుని
రక్షణను
సంపాదించాలి.
(భగవాన్
తాము
వేదికపైకి
రప్పించిన
విద్యార్థికి
పచ్చ
పొదిగిన
ఒక
బంగారు
ఉంగరాన్ని
సృజించి
అనుగ్రహించారు.
అనంతరం,
తమ
దివ్యోపన్యాసాన్ని
కొనసాగిస్తూ
ఇలా
అన్నారు)
పచ్చ
అనేది
క్షేమమునకు
ప్రతీక.
అటువంటి
క్షేమమును,
దైవప్రేమను,
భక్తిని
మీరు
పెంచుకొని
దైవానుగ్రహము
నందుకోవాలని
నేను
ఆశిస్తున్నాను.
దుర్గుణాలను
దూరం
చేసుకున్నప్పుడే
మీరు
స్వామికి
సమీపులు
కాగలరు.
పంచభూతాలను
సద్వినియోగం
చేసుకోండి.
పంచేంద్రియాలను
స్వాధీనం
చేసుకోండి.
అప్పుడు
దైవత్వము
మీ
ఇంట,
వెంట,
జంట
ఉండి
మిమ్మల్ని
కాపాడుతూ
ఉంటుంది.
కేవలం
భజనలు,
ప్రార్థనలు
చేసినంత
మాత్రాన
దైవత్వము
లభించదు.
దానికి
తగినట్లుగా
హృదయాన్నికూడను
భగవంతునికి
అర్పితం
గావించాలి.
మీ
మనస్సును,
బుద్ధిని,
చిత్తమును
దైవంతో
చేర్చండి.
అప్పుడు
మీ
మనస్సే
దైవంగా
మారిపోతుంది;
మీ
బుద్ధియే
దైవంగా
మారిపోతుంది;
మీ
చిత్తము
దైవంగా
మారిపోతుంది.
పంచభూతాలే
తానైయుండగా
ఇంక
భగవంతుడు
వేరే
ఎక్కడుంటాడు?!
తాను
ప్రత్యేకంగా
ఉండడానికి
వీలే
లేదు.
భగవంతుడు
పంచభూతాలకంటే
వేరుగా
ఉన్నాడని
భావించడం
చాలా
పొరపాటు.
దైవమే
మీ
సర్వస్వమని
భావించి
మీ
ఇంద్రియాలను
దైవార్పితం
చేయండి.
ఈ
సులభమైన
మార్గమును
అనుసరిస్తే
ఘనమైన
మోక్షము
మీకు
ప్రాప్తిస్తుంది.
మోక్షమనగా
ఏమిటి?
మోహక్షయమే
మోక్షము.
లోపల
మోహము
పెట్టుకొని,
‘రాం,
రాం,
రాం,
రాం....’
అని
జపిస్తూ
కూర్చుంటే
ప్రయోజనం
లేదు.
ఏ
పని
చేసినా
భగవత్ప్రీత్యర్థం
చేయండి.
ఏ
వ్యక్తిని
చూసినా
దైవ
స్వరూపునిగా
భావించండి.
మీ
ఇంటి
ముందుకు
వచ్చి
భిక్షమడిగే
‘బెగ్గర్’ను
కూడా
దైవస్వరూపునిగా
భావించండి.
దేహరీత్యా
అతను
‘బెగ్గర్’
కావచ్చుగాని,
ఆత్మదృష్టిలో
అతనుకూడా
దైవస్వరూపుడే.
10
▾
Meaning
Keep
మహారాజైనా,
బెగ్గరైనా
అందరిలో
ఉన్నది
ఒకే
దివ్యత్వమే.
దైవప్రేమకు
మీరు
పాత్రులు
కండి.
దైవప్రేమకు
అర్పితం
కండి.
దైవార్పిత
భావంతో
పనిచేయండి.
దైవార్పితభావంతో
చదవండి.
తప్పక
మీరు
ఫస్టు
క్లాసులో
పాస్
అవుతారు.
విద్య
అంటే
కేవలం
పుస్తకాలు
చదవడం
కాదు.
డిగ్రీలు
తీసుకున్నంతమాత్రాన
మీరు
గొప్పవారు
కారు.
డిగ్రీలు
గొప్పవి
కాదు;
‘డివైన్’
గొప్పది.
దానిని
మీరు
సంపాదించండి.
అప్పుడే
మీరు
ధన్యులవుతారు.
మీరు
చదివిన
చదువు
సార్థకమవుతుంది.
మీ
తల్లిదండ్రులు
కూడా
ఆనందిస్తారు.
వాళ్లు
ఎంతో
ఆశతో
మిమ్మల్ని
ఇక్కడ
చేర్చారు.
మీరు
వాళ్లను
నిరాశపరచకూడదు.
తల్లీ,
తండ్రీ,
గురువూ,
దైవము
నలుగురినీ
మీరు
మెప్పించాలి.
సద్భావములచేత,
సదాచారములచేత,
సత్ప్రవర్తనచేత
మీరు
సార్థకతను
పొందాలి.
Previous
←
He alone is truly educated who knows the Ātma within
Next
Material learning has its worth only when spirituality goes with it
→