Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2006 · True education is that which nurtures the moral, the dhārmic and the spiritual
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
True education is that which nurtures the moral, the dhārmic and the spiritual
22 November 2006, 25th Convocation of the University, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
‘చదివితి
సకల
శాస్త్రములు,
నే
చదివినవి
కలవు
పెక్కులు’
అని
ఈనాటి
మానవుడు
గర్విస్తున్నాడేగాని,
చదువులలోని
మర్మమును
తాను
గ్రహించలేకపోతున్నాడు.
ఈనాటి
చదువులలో
లౌకిక,
భౌతిక
విషయములు
తప్ప
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక
విషయములు
ఏమాత్రము
కనిపించడం
లేదు.
ప్రపంచంలో
ఈనాడు
పిల్లలను
చదివించే
నిమిత్తమై
తల్లులు,
తండ్రులు
అనేకవిధములైన
పాట్లు
పడుతున్నారు.
కాని,
చదువంటే
ఏమిటి?
అనే
విషయమును
గుర్తించడానికి
ఎవ్వరూ
ప్రయత్నించడం
లేదు.
అనేక
గ్రంథములు
చదివినంత
మాత్రమున,
చక్కగా
మాట్లాడగలిగినంతమాత్రమున
మానవుడు
విద్యావంతుడనిపించుకోలేడు.
ఇది
కేవలం
అక్షర
జ్ఞానమే
తప్ప
అన్యము
కాదు.
అష్టదిగ్గజాలకు
కృష్ణదేవరాయలు
పెట్టిన
పరీక్ష
శ్రీకృష్ణదేవరాయల
ఆస్థానంలో
‘అష్టదిగ్గజాలు’గా
ప్రసిద్ధికెక్కిన
అల్లసాని
పెద్దన,
నంది
తిమ్మన,
మాదయ్యగారి
మల్లన,
ధూర్జటి,
అయ్యలరాజు
రామ
భద్రుడు,
పింగళి
సూరన,
రామరాజభూషణుడు,
తెనాలి
రామకృష్ణుడు
అనే
ఎనమండుగురు
కవులుండేవారు.
ఒక
పర్యాయం
కృష్ణ
దేవరాయలు
ఆ
ఎనమండుగురు
కవులను
ఉద్దేశించి,
“మీరంతా
గొప్ప
పండితులు,
సరస్వతీ
పుత్రులు.
అయితే,
నేను
మిమ్మల్ని
ఒక
ప్రశ్న
అడుగుతున్నాను.
మీలో
ఎవరైనా
సరే,
ఐదు
వేర్వేరు
భాషలకు
చెందిన
ఐదక్షరాలను
చేర్చి
ఒక
అర్థవంతమైన
వాక్యమును
చెప్పగలరా?”
అని
అడిగాడు.
ఆ
ఐదు
అక్షరాలూ
ఆయా
భాషలలో
ఒకే
అర్థాన్నిచ్చేవిగా
ఉండాలని
అన్నాడు.
మరునాడు
ఉదయానికల్లా
తన
ప్రశ్నకు
సమాధానం
చెప్పిన
కవిని
ఘనంగా
సత్కరిస్తానని
ప్రకటించాడు.
2
▾
Meaning
Keep
తెనాలి
రామకృష్ణుడు
లేచి,
“మహారాజా!
నేను
మా
గ్రామానికి
వెళ్ళి
రేపు
ఉదయానికల్లా
తిరిగి
రావడం
సాధ్యం
కాదు.
కాబట్టి,
ఈ
రాత్రికి
ఈ
ఊర్లోనే
బస
చేసి,
బాగా
ఆలోచించి
రేపు
ఉదయం
వచ్చి
మీ
ప్రశ్నకు
సమాధానం
చెబుతాను”,
అన్నాడు.
సభ
ముగిసిన
తరువాత
రామకృష్ణుడు
అదే
ఊరిలో
ఉన్న
తన
బావమరిది
ఇంటికి
వెళ్ళాడు.
ఆ
రాత్రి
పడుకోవడానికి
రామకృష్ణునికోసం
అతని
బావమరిది
ఒక
మంచం,
పరుపు
ఏర్పాటు
చేశాడు.
అప్పుడు
రామకృష్ణుడు,
“బావా!
మహారాజు
ఒక
ప్రశ్న
అడిగారు.
దానిగురించి
నేను
ఈ
రాత్రి
బాగా
ఆలోచించాలి.
పరుపుపై
పడుకుంటే
నాకు
హాయిగా
నిద్రవస్తుంది.
కాబట్టి,
పశువుల
కొట్టంలో
నాకొక
మంచం
వేయించు”,
అన్నాడు.
అతని
కోరికమేరకు
పశువుల
కొట్టంలో
ఒక
మంచం
ఏర్పాటు
చేశారు.
రామకృష్ణుడు
ఆ
మంచంపై
నడుంవాల్చి
మహారాజు
అడిగిన
ప్రశ్నగురించి
ఆలోచిస్తున్నాడు.
రాత్రి
ఒంటి
గంటకు
ఆ
పశువుల
కొట్టంలో
ఒక
ఆవు
ఈనడానికి
సిద్ధంగా
ఉంది.
అది
గమనించి
రామకృష్ణుడు
లేచి
తలుపు
తట్టి,
“బావా!
బావా!
ఒక
ఆవు
ఈనుతుండాది”
అని
చెప్పాడు.
లోపలినుండి
బావమరిది,
“ఏ
ఆవురా
బావా?”
అని
అడిగాడు.
ఎందుకంటే,
ఆయన
తన
ఆవులకు
లక్ష్మి,
సరస్వతి,
రాధ....
అని
పేర్లు
పెట్టుకున్నాడు.
ఈ
మాట
వినేసరికి
రామకృష్ణునికి
కావలసిన
సమాధానం
దొరికిపోయింది.
పట్టలేని
ఆనందంతో
తానుకూడా
“ఏ
ఆవ్
రా
బా
వా!”
అన్నాడు.
బావమరిది
మళ్లీ,
“ఏ
ఆవురా
బావా?”
అని
అడిగాడు.
రామకృష్ణుడు
“ఏ
ఆవ్
రా
బా
వా!”
అని
జవాబు
చెప్పాడు.
రాత్రి
సరిగా
నిద్ర
లేనందువలన
బావగారికి
మతి
చెడిపోయింది
కాబోలు
అనుకున్నాడాయన.
రామకృష్ణుడు
“ఏ
ఆవ్
రా
బా
వా!”
అనేది
మనసులో
పెట్టుకొని
తెల్లవారు
ఝామున
లేచి
స్నానం
చేసి
రాజాస్థానానికి
వెళ్ళాడు.
రాయలు
“నేనడిగిన
ప్రశ్నకు
ఎవరైనా
జవాబు
తెచ్చారా?”
అని
అడిగాడు.
రామకృష్ణుడు
లేచి,
“మహారాజా!
‘ఏ
ఆవ్
రా
బా
వా!’
అనే
వాక్యంలో
మీరు
కోరినట్లుగా
ఐదు
భాషలకు
చెందిన
ఐదక్షరాలున్నాయి.
అవి
ఆయా
భాషలలో
ఒకే
అర్థాన్నిస్తాయి.
మరాఠీలో
‘ఏ’
అంటే
‘రా’
అని
అర్థం.
అదేరీతిగా,
హిందీలో
‘ఆవ్’
అన్నా,
తెలుగులో
‘రా’
అన్నా,
కన్నడంలో
‘బా’
అన్నా,
తమిళంలో
‘వా’
అన్నా
అర్థం
అదే”,
అన్నాడు.
3
▾
Meaning
Keep
రామకృష్ణుడు
చెప్పిన
సమాధానానికి
ఎంతో
సంతోషించి
కృష్ణదేవరాయలు
బంగారు
కాసులు,
నవరత్నాలు,
ఇంకా
అనేక
ఇతర
కానుకలతో
అతనిని
ఘనంగా
సత్కరించాడు.
రాజుగారిచ్చిన
కానుకలన్నింటినీ
మూటకట్టుకున్నాడు,
రామకృష్ణుడు.
“ఈ
బహుమతులను
నేను
సంపాదించుకున్నానుగాని,
వీటిని
దక్కించుకోగలనా?
భద్రంగా
కాపాడుకోగలనా?”
అని
అతనికి
సందేహం
కలిగింది.
తాను
ఇంటికి
చేరుకొనేంతవరకు
తనకు
సహాయంగా
ఇద్దరు
భటులను
ఇచ్చి
పంపవలసిందిగా
రాయలవారిని
కోరాడు.
రామకృష్ణుని
కోరికమేరకు
రాయలవారు
ఇరువురు
అంగరక్షకులను
అతనికి
సహాయంగా
ఇచ్చి
పంపించాడు.
రామకృష్ణుడు
తన
ఇంటికి
చేరుకున్న
తరువాత
ఇద్దరు
దొంగలుకూడా
తనను
అనుసరిస్తూ
వచ్చి
ఇంటి
వెనుక
గల
తోటలో
దాగుకొని
ఉన్నారని
గ్రహించాడు.
‘ఇంత
విలువైన
నవరత్నాలను,
బంగారు
కాసులను
నేనెక్కడ
దాచిపెట్టేది?’
అని
యోచించాడు.
అతనికొక
ఉపాయం
తట్టింది.
వెంటనే
తన
భార్యను
పిలిచి,
‘మన
ఊర్లో
దొంగల
బెడద
విపరీతంగా
ఉంది
కదా!
కాబట్టి,
రాజుగారిచ్చిన
ఈ
కానుకల
మూటను
మన
పెరట్లో
వున్న
బావిలో
పడేస్తాను.
అక్కడైతే
ఇవి
భద్రంగా
ఉంటాయి’,
అన్నాడు.
ఆ
మాటలు
దొంగలకు
వినపడేటట్లుగా
గట్టిగా
పలికాడు.
వెంటనే
కొన్ని
రాళ్ళను
మూటకట్టి
తెచ్చి
ఆ
బావిలో
పడవేశాడు.
ఆ
తరువాత
భార్యాభర్తలు
తలుపులు
వేసుకొని
నిద్ర
పోతున్నట్లు
నటించారు.
ఆ
‘బంగారు
కాసుల
మూట’
దొరుకుతుందేమో
అనే
ఆశతో
రాత్రంతా
దొంగలు
ఆ
బావినుంచి
నీళ్ళు
తోడుతూనే
ఉన్నారు.
కాని,
ఎంతసేపు
తోడినా
బావిలోని
నీరు
తరిగి
పోలేదు.
చివరకు
విసుగొచ్చి
తమ
దారిన
తాము
వెళ్ళిపోయారు.
తనకు
ఏమాత్రం
శ్రమ
లేకుండా
తన
తోటలో
ఉన్న
మొక్కలన్నింటికీ
సమృద్ధిగా
జలము
అందినందుకు
రామకృష్ణుడు
సంతోషించాడు.
‘చావు
లేని
చదువు
చదువవలయు’
విద్యార్థులారా!
మీరు
పెద్దపెద్ద
పుస్తకాలు
చదువుతున్నారు.
కాని,
అందులో
వున్న
పదములు,
అక్షరములయొక్క
అర్థాన్ని
సరిగా
తెలుసుకోవడం
లేదు.
4
▾
Meaning
Keep
మన
ప్రాచీనులు
ప్రతి
అక్షరముయొక్క
అర్థాన్ని
చక్కగా
గుర్తించేవారు.
అక్షరములు,
పదములు,
వాక్యములు
-
ఈ
మూడింటియొక్క
అర్థాన్ని
చక్కగా
గుర్తించి
నటువంటివాడే
నిజమైన
కవి.
కవిం
పురాణ
మనుశాసితారమ్
అణోరణీయాంస
మనుస్మరే
ద్యః
సర్వస్య
ధాతార
మచిన్త్య
రూపమ్
ఆదిత్య
వర్ణం
తమసః
పరస్తాత్
కాని,
ఈనాటి
ఉపాధ్యాయులు
కేవలం
లౌకికమైన,
భౌతికమైన
విషయములనే
బోధిస్తున్నారుగాని,
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మికములకు
సంబంధించిన
అర్థములను
ఎవ్వరూ
బోధించడంలేదు.
కనుకనే,
ఎన్ని
చదువులు
చదివినా
ఏమాత్రము
ఫలితం
లేకుండా
పోతున్నది.
నైతికము,
ధార్మికము,
ఆధ్యాత్మికము
-
ఈ
మూడింటినీ
మీరు
పోషించాలి.
అదియే
నిజమైన
చదువు.
ఈనాటి
పిల్లలు,
“ఏమి
చేస్తున్నావు
నాయనా?”
అని
అడిగితే
“చదువు‘కొంటున్నాము”,
అంటారు.
ఇలాంటి
చదువు
చదువు
కాదు.
చదువుయొక్క
సరియైన
అర్థమును
గుర్తించి
వర్తించాలి.
ఈనాటి
చదువులన్నీ
కేవలము
భౌతికమైన
చదువులే!
ఎన్ని
చదువులు
చదివినప్పటికీ
ఏదో
ఒకనాటికి
ఇవన్నీ
వదలిపెట్టి
పోవలసిందే!
కాబట్టి,
చావు
లేని
చదువు
చదవాలి.
అట్టి
చదువులో
ప్రధానంగా
ఉండే
విలువలు
ఐదు.
మొట్టమొదటిది
సత్యము.
Truth
is
one,
not
two.
సత్యము
ఒక్కటే.
సత్యమునకు
మరణం
లేదు.
సత్యమునుండి
ధర్మము,
ధర్మమునుండి
శాంతి
లభిస్తాయి.
నాల్గవది
ప్రేమ.
పుట్టిన
బిడ్డ
మొదలుకొని
మరణించే
వృద్ధునివరకు
అందరిలోనూ
ప్రేమ
ఉన్నది.
ప్రేమకు
మరణం
లేదు.
ఐదవది
అహింస.
“అహింసా
పరమో
ధర్మః”
అని
ప్రబోధించాడు,
బుద్ధుడు.
ఈ
ఐదు
విలువలను
అభివృద్ధిపరచుకోండి.
అదే
చావు
లేని
చదువు.
సత్యమును
పలకండి,
ధర్మము
నాచరించండి.
శాంతిని
అనుభవించండి.
ప్రేమను
ఆనందంగా
పంచుకోండి.
అహింసామార్గంలో
జీవితాన్ని
గడపండి.
ఇదే
విద్యయొక్క
సారము.
ఈ
ఐదు
విలువలను
మీరు
ప్రపంచానికి
బోధించండి.
ఇవి
శాశ్వతమైనవి.
ఈనాడు
ప్రపంచంలో
అందరూ
అశాశ్వతమైన
వాటికోసమే
ప్రాకులాడుతున్నారుగాని,
శాశ్వతమైన
ఆనందంకోసం
ఎవ్వరూ
పాటుపడడం
లేదు.
5
▾
Meaning
Keep
విద్యార్థులారా!
మన
భారతదేశం
ప్రెసిడెంటు
చాలా
ముఖ్యమైన
విషయాలు
మీకు
బోధించాడు.
వాటిని
మీరు
నిజంగా
ఆచరిస్తే
ఎంతో
ఉన్నతస్థితికి
రాగలరు.
మానవాకారము
ధరించినంతమాత్రమున
మీరు
మానవులనిపించుకోరు.
మానవతా
గుణములు
గలవాడే
నిజమైన
మానవుడు.
ఈ
‘పంచప్రాణాలను’
పోషించుకుంటే
మనమే
పరమాత్మ
స్వరూపుల
మవుతాము.
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలు
దైవమునుండియే
ఆవిర్భవించినవి.
ఈ
ఐదింటినీ
మనము
చిన్నతనమునుండియే
పిల్లలలో
అభివృద్ధి
పరచాలి.
సత్యమును
మనము
ఆధారము
చేసుకుంటే
ఎంతటి
ఘనకార్యమునైనా
సాధించవచ్చును.
ఆచరణలో
లేని
విద్యలు
అవిద్యలే!
‘ఏకాత్మా
సర్వభూతాంతరాత్మా.’
పేర్లు,
రూపములు
వేర్వేరుగా
కనిపిస్తున్నాయి
గాని,
అందరి
యందున్నది
ఒకే
ఆత్మ!
మీకు
ఎన్ని
కష్టములు
కలిగినా,
ఎన్ని
నష్టములు
సంభవించినా
అన్నింటినీ
ఆత్మవిశ్వాసంతో
ఎదుర్కోండి.
ఏది
జరిగినా,
‘ఇది
నా
కర్మయొక్క
ప్రతిఫలమే’
అని
భావించండి.
ఎవరిని
చూసినా
‘వీరు
నా
ప్రతిబింబమే’,
అని
భావించండి.
భగవంతుడు
గుణాతీతుడు,
కర్మబంధ
రహితుడు.
అట్టి
దైవత్వమును
పొందాలంటే
త్యాగమే
ప్రధానమైనది.
‘నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానశుః’.
మీరు
దేనినైనా
త్యాగం
చేయడానికి
సిద్ధంగా
ఉండాలి.
ప్రేమస్వరూపులారా!
ఇప్పటికే
కాలాతీతమైనది.
ఇక
ఎక్కువసేపు
మాట్లాడి
మీకు
ఇబ్బంది
కల్గించడం
నాకిష్టం
లేదు.
ముఖ్యంగా
ఈ
ఐదు
మానవతా
విలువలను
మనస్సులో
పెట్టుకొని
నిత్యజీవితంలో
ఆచరణలో
పెడుతూరండి.
మానవతా
విలువలనుగురించి
కేవలం
చదివినంతమాత్రమున,
వ్రాసినంత
మాత్రమున
అవి
అర్థం
కావు.
ఆచరణే
ప్రధానమైనటువంటిది.
ఆచరణలో
లేని
విద్యలు
అవిద్యలేగాని
నిజమైన
విద్యలు
కావు.
కనుక,
ఏ
ఒకటి
రెండైనా
ఆచరణలో
పెట్టండి.
అప్పుడే
మీరు
ధన్యులవుతారు,
పుణ్యులవుతారు,
సరియైన
మార్గాన్ని
అనుసరించినవారవుతారు.
6
▾
Meaning
Keep
విద్యార్థులారా!
మీరు
నా
మాటలు,
కలామ్
మాటలు
ఎన్నో
విన్నారు.
అయితే,
ఒక
చెవితో
విని,
మరొక
చెవితో
వాటిని
బయటికి
పంపిస్తే
ప్రయోజనంలేదు.
ఇలాంటి
పవిత్రమైన
విషయాలను
బోధించేవారు
ఈనాడు
చాలా
అరుదుగా
ఉన్నారు.
మీకు
చిక్కిన
ఈ
సదవకాశాన్ని
మీరు
దక్కించుకోండి.
మీ
జీవిత
లక్ష్యమును
సాధించండి.
‘నీవు,
నేను
ఒక్కటే’
దైవము
ప్రత్యేకంగా
లేడు.
ఎక్కడ
చూసినా
భగవంతుడే
తప్ప
అన్యపదార్థము
కనిపించదు.
నీవే
భగవంతుడవు.
“దైవం
మానుషరూపేణ.”
మానవులందరూ
దైవస్వరూపులే!
అందరిలో
ఉన్న
ఆత్మతత్త్వం
ఒక్కటే!
మీరు
ప్రత్యేకమైనవారు
కాదు.
“మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః”.
“మీరందరూ
నా
అంశములే”.
అందుకు
తగినట్లుగా
నడుచుకోండి.
వట్టి
మాటలతో
కాలమును
వ్యర్థం
చేయకండి.
ఎక్కడ
చూసినా
ఉన్నది
ఏకత్వమే.
“నీవు,
నేను
ఒక్కటే.”
భక్తులు
నన్ను
అడుగుతుంటారు,
“స్వామీ!
ఎవరు
మీరు?
మీ
నిజస్వరూప
మేమిటి?”
అని.
నేను
చెబుతాను,
You
and
I
are
one.
నీవు
వేరు,
నేను
వేరు
కాదు.
‘వారు,
వీరు,
నేను’
అనే
భేదము
కేవలము
భ్రాంతి
తప్ప
మరొకటి
కాదు.
మీరందరూ
ఏకాత్మస్వరూపులే!
కాబట్టి,
అందరినీ
అన్నదమ్ములుగా,
అక్కచెల్లెళ్ళుగా
భావించి,
ఒకరితో
ఒకరు
సంబంధ
బాంధవ్యాన్ని
బలపరచు
కోవాలి.
అందరూ
ఐకమత్యంగా
ఉండాలి.
కోప,
తాప,
అసూయ,
డంబములకు
అవకాశమివ్వకూడదు.
ఇవన్నీ
ఒకరినుండి
ఒకరిని
దూరం
చేసే
దుర్గుణములే!
ఇటువంటి
దుర్గుణములను
త్యజించి,
ఒకరికొకరికి
మధ్య
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమును
అభివృద్ధి
చేసే
సద్గుణములను
అలవరచుకోవాలి.
దేనికైనా
భగవంతునిపై
భారం
వేయండి.
ఇదే
ఈనాడు
నేను
మీకందించే
ప్రధాన
సందేశము.
Previous
←
‘Dharma protects those who protect it’
Next
The service of society is the service of the Lord of all
→