Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2007 · Depend on God alone
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Depend on God alone
14 April 2007, Tamil New Year; Viṣu, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
(ఏప్రిల్
14వ
తేదీన
సాయికుల్వంత్
హాలులో
తమిళ
సంవత్సరాదిని
పురస్కరించుకొని
ఏర్పాటైన
సభలో
భగవాన్
తమ
దివ్య
సందేశాన్ని
ఇవ్వటానికి
ముందు
తమిళనాడు
రాష్ట్ర
శ్రీ
సత్యసాయి
ట్రస్ట్
కన్వీనర్
శ్రీ
జి.కె.
రామన్
స్వామిని
ప్రార్థిస్తూ
తమిళనాడు,
ఆంధ్రప్రదేశ్
సరిహద్దునుంచి
సత్యమూర్తి
సాగర్‌వరకు
ఉన్న
25
కి.మీ.ల
కాలువ
శిథిలమవడంతో
నీరు
సాఫీగా
ప్రవహించడంలేదనీ,
అందువల్ల
దాని
మరమ్మత్తు
పనిని
అనుగ్రహించమని
వేడుకున్నారు.
భగవాన్
తమ
దివ్యోపన్యాసాన్ని
ఈ
కాలువ
మరమ్మత్తునిగురించిన
ప్రస్తావనతోనే
ప్రారంభిస్తూ,
ఆ
25
కి.మీ.ల
కాలువ
మరమ్మత్తు
పనులను
తామే
చేయిస్తామన్నారు.
(స్వామి
ప్రసంగం
పూర్తి
పాఠం
ఈ
క్రింద
ప్రచురింపబడినది)
ఇంతవరకు
భక్తులు
చెప్పినట్లుగా
మద్రాసుకు
త్రాగునీరు
ఇచ్చాను.
పంటలకు
కూడా
నీరిచ్చాను.
కాని,
కెనాల్‌ను
కేవలం
ఆంధ్ర
సరిహద్దువరకు
మాత్రమే
బాగు
చేయటం
జరిగింది.
మద్రాసులో
ఉన్న
భాగమును
మేము
ఏమాత్రము
ముట్టలేదు.
అక్కడివరకు
ఏమాత్రం
కష్టము,
నష్టము
లేకుండా,
ఒక్క
చుక్క
నీరుకూడా
ఇంకి
పోకుండా
కెనాల్‌ను
మంచిగా
చేశాము.
అక్కడివరకు
కృష్ణానది
జలము
చక్కగా,
ఆనందంగా
చేరిపోతున్నది.
కాని,
ఆంధ్ర
సరిహద్దు
దాటిన
తరువాత
కెనాల్
సరిగా
లేకపోవడంవలన
నీళ్ళు
కొన్ని
వృథా
అవుతున్నాయి.
మద్రాసువైపున
ఇంకా
25
కిలోమీటర్ల
కెనాల్
రిపేర్
చేయవలసి
ఉంది.
దానికి
ముప్ఫై,
నలభై
కోట్లు
ఖర్చవుతుంది.
ఇది
మద్రాసు
గవర్నమెంటువారు
చేయ
వలసిన
పని.
కాని,
వారు
చేయలేదు.
‘ఈ
పని
ఇంకా
పూర్తి
కాలేదే’
అన్న
అసంతృప్తి
ప్రజలను
బాధపెడుతున్నది.
కనుక,
మిగిలిన
ఈ
25
కిలోమీటర్ల
కెనాల్నుకూడా
బాగుపరచి
మద్రాసుకు
వాటర్
సప్లై
చక్కగా
జరిగేటట్లు
నేను
చేస్తాను.
2
▾
Meaning
Keep
మీరు
ఎవరిపైనకూడను
ఆధారపడ
నవసరం
లేదు.
భగవంతుణ్ణి
ప్రార్థించండి,
అదే
చాలు.
అత్యంత
త్వరలోనే
నేను
ఈ
పని
పూర్తి
చేయించి,
మద్రాసు
ప్రజలకు
త్రాగునీరు
పూర్తిగా
అందునట్లుగా
చేయగలను.
నేను
త్వరలోనే
అక్కడికి
ఇంజనీర్లను
పంపిస్తాను.
ఆవైపున
కాలువ
దెబ్బతినడంవల్ల
నీరు
చాలా
వృథా
అయిపోతున్నది.
అక్కడినుండి
సత్యమూర్తి
సాగర్‌కి
చేరవలసిన
నీరు
నిలిచిపోతున్నది.
ఇప్పుడు
సత్యమూర్తి
సాగర్‌కి
సత్యసాయి
వాటర్
చేరేటట్లు
నేను
చేస్తాను.
మద్రాసు
ఉండినంతవరకు
ఈ
వాటర్
పర్మనెంటుగా
సరఫరా
అవుతుంది.
ఎవ్వరూ
చేయలేనటువంటి
పనిని
సాయి
చేయగలడు.
మిగిలి
పోయిన
ఆ
కాలువకుకూడను
చక్కగా,
మంచిగా
సిమెంటు
లైనింగు
వేయిస్తాను.
మీరు
చూశారు,
ఇప్పుడు
ఎంత
నీరు
వేస్టు
అవుతున్నదో!
వాటరు
ఒకరి
సొత్తు
కాదు.
ఇది
భగవంతుని
సొత్తు.
భగవంతుని
ప్రోపర్టీకోసం
వీళ్ళంతా
పోట్లాడటం
జరుగుతున్నది.
ఈవిధంగా
ఫైట్
చేయటానికి
ఎవ్వరికీ
అధికారం
లేదు.
భగవంతుడు
ఇచ్చిన
ప్రసాదంపై
అందరికీ
హక్కు
ఉంది.
ఈ
సంవత్సరము
సర్వజిత్
నామ
సంవత్సరము.
‘సర్వజిత్’
అనగా
ఏమిటి?
సమస్తమును
జయము
గావించేటటువంటిది.
వ్యవసాయము,
వ్యాపారము,
విద్య
మొదలైన
అన్ని
రంగములయందును
ఇది
జయము
చేకూరుస్తుంది.
కనుక,
మన
కార్యముకూడా
జయప్రదమవుతుంది.
మీరెవ్వరూ
ఏవిధమైన
ఇబ్బంది
పడకుండా
నేను
చేయగలను.
ఎన్ని
కోట్లయినా
ఖర్చు
కానీయండి.
పంచభూతముల
నందించినవాడు
పరమాత్మ.
పంచభూతములలో
నీరొకటి.
అదికూడా
భగవంతుని
చేతిలోనే
ఉంటున్నది.
కాబట్టి,
ఎవ్వరి
దగ్గరికీ
మీరు
పోనక్కర్లేదు.
ఈ
పని
తప్పక
నేను
చేయగలను.
ఈవిషయం
కరుణానిధికి
చెప్పండి.
మీ
మద్రాసు
ప్రజలకుకూడా
ఈ
శుభవార్త
నందించండి.
చిన్నచిన్న
పిల్లలందరూ
ఆ
పిచ్చినీరు
త్రాగి
ఆరోగ్యాన్ని
పాడుచేసుకుంటూ
వచ్చారు.
ఇకమీదట
మీరు
సుఖంగా,
ఆనందంగా
ఈ
స్వీట్
వాటర్‌ను
తీసికొని
మీ
ఆరోగ్యాన్ని
కాపాడుకోండి.
ఈనాడు
ఇక్కడికి
వచ్చిన
మీరందరూ
ఎంతో
ఆనందంగా
తిరిగి
వెళ్ళండి.
మీకు
జీవితంలో
ఎట్టి
కొరతలూ
ఉండవు.
అందరుకూడను
నవ్వు
మొహాలతో
ఆనందంగా
జీవించండి.
నిరంతరం
భగవచ్చింతన
చేయండి.
అదే
మీకు
సర్వవిధములైన
రక్ష.
అట్టి
పవిత్రమైన
రక్షను
పొందినటువంటి
ప్రజలు
ఎందుకు
బాధపడాలి!
3
▾
Meaning
Keep
Why
fear
when
I
am
here!
(నేనుండగా
మీకు
భయమెందులకు!)
ఈ
సర్వజిత్
నామ
సంవత్సరంలో
సత్యమూర్తి
సాగర్‌కు
నీరందిస్తాను.
మీరేమీ
యోచన
పెట్టుకోకండి.
మీ
తిండితీర్థాదులనుగాని,
ఇంకేవిధమైన
కార్యములను
గాని
భగవంతుడే
చూచుకుంటాడని
విశ్వసించండి.
ఈనాడు
పవిత్రమైన
సర్వజిత్
నామ
సంవత్సరము
ప్రారంభమైంది.
ఇది
మీకు,
కేరళవారికి
అందరికి
కూడను
చాలా
ప్రధానమైనటువంటి
దినము.
కేరళ,
మద్రాసు
ప్రజలందరికీ
నా
సంపూర్ణ
అనుగ్రహ
మున్నది.
నాకు
చెన్నపట్టణముపైన
ఉన్న
ప్రేమ
వర్ణించటానికి
వీలుకానటువంటి
ప్రేమ.
చెన్నపట్టణమంటే
నాకు
చాలా
ఇష్టము.
లేకపోతే,
ఎక్కడ
పుట్టపర్తి!
ఎక్కడ
చెన్నపట్టణము!
ఎవరు
వచ్చి
ప్రార్థించారు
నన్ను?
ఎవ్వరూ
రాలేదు;
సాయియే
అక్కడికి
వచ్చి
మీకు
నీరు
అందిస్తున్నాడు.
కనుక,
మీరందరూ
ఆనందంగా,
ఆరోగ్యంగా
చక్కని
నీరు
త్రాగి,
మంచిగా
భోజనం
చేస్తూ
ఆరోగ్యాన్ని
కాపాడుకోండి.
Previous
←
Your very heart is Rāma's temple
Next
Along with ‘Education’, ‘Educare’ is most essential
→