Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2007 · Akhaṇḍa Bhajan
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Akhaṇḍa Bhajan
13 November 2007, Akhaṇḍa bhajan, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
అఖండ
భజన
అనగా
ఏమిటో
మీరు
అర్థం
చేసుకోవాలి.
రెండు
విధములైన
భజనలు
కలవు
-
ఒకటి
ఖండ
భజన,
రెండవది
అఖండ
భజన.
అప్పటికప్పుడు
భజన
సల్పుకోవడం,
తెల్లవారి
లేస్తూనే
దైవాన్ని
తల్చుకోవడం,
భజన
టైమ్లో
కొద్దిసేపు
పాడుకోవడం...
ఇది
కేవలం
ఖండ
భజన.
“సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరిచింతనం”
అన్నట్లు
ప్రొద్దున్న,
సాయంకాలము
మాత్రమేకాక
జాగ్రత్స్వప్న
సుషుప్తులు
మూడింటియందు
భగవంతుని
తలుచుకోవడమే
అఖండ
భజన.
మీరు
గడియారమును
చూస్తున్నారు
-
అందులో
సెకెన్ల
ముల్లు
పొడవుగా
ఉంటుంది.
దానికంటే
చిన్నది
నిమిషాల
ముల్లు,
ఈ
రెండింటికంటే
చిన్నది
గంటల
ముల్లు.
సెకెన్ల
ముల్లు
అరవై
ఇళ్ళు
దాటిన
తరువాత
నిమిషాల
ముల్లు
ఒక
ఇంటికి
కదులుతుంది.
నిమిషాల
ముల్లు
అరవై
ఇళ్లు
చుట్టిన
తరువాత
గంటల
ముల్లు
ఒక
ఇంటికి
కదులుతుంది.
అయితే,
ఇందులో
ఏది
ప్రధానమైనది?
గంటల
ముల్లే!
సెకెన్ల
ముల్లును
మనము
లెక్కచేయము.
అదేవిధముగనే,
కేవలం
ప్రొద్దున్న,
సాయంకాలము
మాత్రమే
నామస్మరణ
చేయడం,
ఏదో
కొద్దిసేపు
భజన
చేయడం
...
ఇది
సెకెన్ల
ముల్లువలె
అంతగా
ప్రాముఖ్యత
లేనిది.
అఖండ
భజనయే
చాలా
ముఖ్యమైనది.
ఒక్కొక్క
నామమునందు
ఒక్కొక్క
శక్తి
ఉన్నది.
ఆ
దివ్యశక్తిని
మనం
సద్వినియోగం
చేసుకోవాలంటే,
శాశ్వతంగా
నిలుపుకోవాలనుకుంటే
అఖండ
భజన
చేయాలి.
రామనామ
మహిమ
ఒకానొక
సమయంలో
నారదుడు
శ్రీమహావిష్ణువువద్దకు
వెళ్ళి
తనకు
రామనామ
మహిమను
తెలియజేయవలసిందిగా
కోరాడు.
నారాయణుడు
“నారదా!
నీకు
రామనామ
మహిమ
ఇంతవరకు
తెలియదా!
అయితే,
అదిగో
ఆ
చెట్టుపైనున్న
చిలుకను
అడుగు”,
అన్నాడు.
2
▾
Meaning
Keep
నారదుడు
ఆ
చిలుక
దగ్గరకు
వెళ్ళి,
“ఓ
చిలుకా!
నాకు
రామనామ
మహిమను
చెబుతావా?”
అని
అడిగాడు.
అతను
‘రామా’
అని
చెప్పేటప్పటికి
ఆ
చిలుక
తక్షణమే
క్రింద
పడిపోయి
ప్రాణం
విడిచింది.
‘అయ్యో,
నేను
రామనామము
చెప్పడంచేత
ఈ
చిలుక
ప్రాణం
విడిచిందే”
అని
చింతించి
నారదుడు
నారాయణుని
దగ్గరకు
పోయి
జరిగిన
సంగతి
చెప్పాడు.
“సరే,
చిలుక
పోతే
పోయింది.
ఇప్పుడే
ఒక
బ్రాహ్మణుని
ఇంట్లో
ఆవు
ఈనింది.
ఇప్పుడే
పుట్టిన
ఆ
దూడదగ్గరకు
పోయి
అడుగు,
చెబుతుంది”
అని
చెప్పాడు,
నారాయణుడు.
నారదుడు
ఆ
దూడదగ్గరకు
వెళ్ళి
“ఓ
దూడా!
రామనామ
మహిమ
ఏమిటో
నాకు
చెబుతావా?”
అని
అడిగాడు.
తక్షణమే
ఆ
దూడకూడా
ప్రాణం
విడిచింది.
నారదుడు
మళ్ళీ
నారాయణుని
దగ్గరకు
వెళ్ళి
“స్వామీ!
చిలుకకు
పట్టిన
గతే
దూడకు
పట్టింది.
ఇదేనా
రామనామ
మహిమ?”
అన్నాడు.
నారాయణుడు,
“నారదా!
కాస్త
ఓపిక
పట్టు.
ఇప్పుడే
ఫలానా
మహారాజుకు
లేకలేక
ఒక
కుమారుడు
పుట్టాడు.
వెళ్ళి
ఆ
పసిబిడ్డను
అడుగు”
అన్నాడు.
నారదుడు
“స్వామీ!
ఆ
చిలుకకు,
ఆవుదూడకు
ఎవ్వరూ
దిక్కులేరు.
కనుక,
వాటి
ప్రాణం
పోయినా
నన్ను
పట్టుకొని
అడిగేవారు
లేకపోయారు.
ఇప్పుడా
రాజకుమారుడే
గనుక
మరణిస్తే
నా
ప్రాణం
కూడా
పోతుంది”,
అన్నాడు.
“లేదు,
నీవు
తప్పక
వెళ్ళి
అడగాల్సిందే”
అని
ఆదేశించాడు,
నారాయణుడు.
దైవాజ్ఞకు
ఎదురు
చెప్పలేక
నారదుడు
వెళ్లాడు.
నారదుణ్ణి
చూసి
ఆ
మహారాజు
ఎంతో
ఆనందంతో
స్వాగతం
పలికి
“రండి
స్వామీ!
రండి.
మంచి
సమయానికే
వచ్చారు.
ఇప్పుడే
నాకొక
కుమారుడు
పుట్టాడు.
వానిని
ఆశీర్వదించండి”
అన్నాడు.
నారదుడు
లోలోపల
భయపడుతున్నా
పైకి
మాత్రం
చిరునవ్వులు
చిందిస్తూ
ఆ
రాజకుమారుని
దగ్గరకు
వెళ్ళి
నెమ్మదిగా
“ఓ
రాజకుమారా!
రామనామ
మహిమ
ఏమిటో
చెప్పగలవా?”
అని
అడిగాడు.
ఆ
రాజకుమారుడు
పక్కున
నవ్వి,
“బ్రహ్మమానస
పుత్రా!
64
విద్యలను
నేర్చిన
మీకే
రామనామ
మహిమ
తెలియదా?
నేను
చెబుతాను
వినండి.
నేను
చెట్టుపై
చిలుకగా
ఉన్నప్పుడు
మీరు
వచ్చి
రామనామ
మహిమ
ఏమిటని
అడిగారు.
ఒక్కతూరి
రామనామము
వినేటప్పటికి
నా
జన్మ
సార్థకమైపోయింది.
వెంటనే
ఆ
దేహాన్ని
విసర్జించి
ఒక
బ్రాహ్మణుని
ఇంట
ఆవుదూడనై
పుట్టాను.
మీరు
అక్కడకుకూడా
వచ్చి
అదే
ప్రశ్న
వేశారు.
రెండవ
తూరి
రామనామం
విని
ఆ
దేహాన్ని
కూడా
విసర్జించి
ఇప్పుడు
రాజకుమారునిగా
పుట్టాను”
అన్నాడు.
3
▾
Meaning
Keep
నామమును
మనస్ఫూర్తిగా
ప్రేమతో
ఉచ్చరించినప్పుడే
దివ్యత్వాన్ని
పొందవచ్చు
చూశారా!
నామాన్ని
కేవలం
ఒక్కతూరి
శ్రవణం
చేసినంతమాత్రమున
చిలుక
ఆవుదూడగా
పుట్టింది,
దూడ
మనుష్యత్వాన్ని
పొందింది.
కాని,
ఈనాటి
మానవుడు
ఒక్కతూరి
కాదు,
అనేక
పర్యాయములు
భగవన్నామము
నుచ్చరించినప్పటికీ
వాడు
మారటం
లేదు.
భగవన్నామమును
మనస్ఫూర్తిగా
ప్రేమతో
ఉచ్చరించాలి.
విశ్వాసమెక్కడో
ప్రేమ
అక్కడ.
ఆ
ప్రేమవల్లనే
మానవుడు
దివ్యత్వాన్ని
పొందగలడు.
ఈనాటి
మానవుడు
భగవన్నామమును
ఉచ్చరిస్తున్నాడు
కాని,
ప్రేమపూర్వకంగా
ఉచ్చరించటం
లేదు.
దృష్టిని
అటూ
ఇటూ
త్రిప్పుతూ,
‘వాడు
బాగా
పాడుతున్నాడా,
వీడు
బాగా
పాడుతున్నాడా,
వాడి
శ్రుతి
సరిగా
ఉందా,
వీడి
శ్రుతి
సరిగా
ఉందా,
వాని
రాగము
సరిగా
ఉందా,
వీని
రాగము
సరిగా
ఉందా’
అని
ఇతరుల
తప్పొప్పులు
చూసుకుంటూ
భజనలో
పాల్గొంటున్నాడు.
ఒకరు
ఒక
పాట
పాడుతుంటే
తాను
రెండవ
పాట
ఏది
పాడాలా
అని
యోచన
చేస్తుంటాడు.
ఈరీతిగా
చంచలమైన
మనస్సుతో
ఎన్ని
పర్యాయములు
నామమును
ఉచ్చరించినప్పటికీ
వాడు
మారే
అవకాశం
లేదు.
కనుకనే,
మానవుడు
మానవుడుగానే
ఉంటున్నాడు.
ఐతే,
భగవచ్చింతన
చేయడంచేత
తాను
కొంతవరకు
పవిత్రుడవుతున్నాడు.
ఆ
పవిత్రత
అందరికీ
తెలిసేది
కాదు;
తనకు
మాత్రమే
తెలుస్తుంది.
నామమును
అనేక
పర్యాయములు
చెప్పినప్పుడే
అది
మీ
మనస్సులో
నాటుకొనిపోతుంది.
నిరంతరము
చెబుతూ
ఉండాలి.
“సతతం
యోగినః”,
నిరంతరం
యోగిగా
ఉంటూ,
తన
మనస్సును
నామముపై
సూటిగా
పెట్టినప్పుడు
మానవుడు
ఎంతైనా
మారగలడు.
ఏ
పనైనా
భగవదర్పిత
భావముతో
చేసినప్పుడే
అది
పవిత్రమవుతుంది
నీ
పని
నీవు
వదలిపెట్టనక్కర్లేదు.
నీ
పని
నీవు
చేసుకుంటూ
“ఈ
పని
భగవంతునిదే”
అని
భావించు.
మాటలాడినా,
ఆటలాడినా,
ఏమి
చేసినా
“ఇవన్నీ
భగవంతునివే”
అనే
భావముతో
చేస్తూ
రా.
నీవు
తప్పక
ధన్యుడవవుతావు.
4
▾
Meaning
Keep
ఇంటిలో
ఆడవాళ్లు
వంట
చేస్తుంటారు.
ఇంత
ఉప్పు
వేస్తారు,
ఇంత
పప్పు
వేస్తారు,
ఇంత
కారము
వేస్తారు.
అయితే,
ఎన్ని
వేసినప్పటికీ
‘ఇదంతా
భగవంతునికే,
ఇదంతా
భగవంతునికే’
అని
దైవార్పిత
భావముతో
చేస్తూ
వస్తే
అదంతా
పవిత్రంగానే
రూపొందుతుంది.
అట్లుకాకుండా,
“మా
ఇంటివారు
తినడంకోసం
వంట
చేస్తున్నాను.
వారికి
రుచిగా
ఉండాలని
చేస్తున్నాను”
అనే
భావంతో
చేస్తే
అది
ఏమాత్రం
భగవంతునికి
చెందదు.
ప్రతి
ఒక్కటికూడను
భగవద్భావంతో
చేయాలి.
ఏ
పని
చేసినా,
ఒక
అడుగు
ముందుకు
పెట్టినా
“రాం,
రాం,
రాం”
అని
స్మరిస్తూ
ఉండాలి.
‘ఇది
భగవంతుడు
పెట్టించేటటువంటి
అడుగే’
అని
భావించాలి.
భగవంతుడు
ప్రతి
అణువునందు,
ప్రతి
కణమునందు
సూక్ష్మస్వరూపాన్ని
ధరించి
ఉన్నాడు.
ఈ
సత్యాన్ని
గుర్తించినప్పుడు
మీరు
వేసే
ప్రతి
అడుగుకూడను
భగవంతుని
సమీపానికే
పోతుంది.
అది
గుర్తించుకోలేక
కొందరు
“నేను
నడుచుకుంటూ
వచ్చాను.
నేను
ఇన్ని
మైళ్ల
దూరం
నడిచాను”
అని
భావిస్తున్నారు.
కాని,
ఆ
భావముతో
ఎన్ని
మైళ్లు
నడిచినప్పటికీ
అది
కేవలం
భౌతికమే
అవుతుందిగాని,
ఆధ్యాత్మికము
కాదు.
మనం
ఏ
పని
చేసినా
భగవద్భావంతో
చేయాలి.
“అంతా
భగవంతునియొక్క
ఆజ్ఞనే”
అని
భావించాలి.
ఇట్టి
పవిత్ర
భావముతో
ఒక్కతూరి
నీవు
ప్రొద్దున్న,
సాయంకాలము
‘రామా’
అని
తలుచుకో,
చాలు.
ఏ
నామమైనా
సరే,
హృదయపూర్వకంగా
చెప్పు,
చాలు.
గడియారంలో
సెకెన్ల
ముల్లు
ఊరకే
తిరుగుతూ
ఉంటుంది.
కాని,
దానికి
విలువ
ఇవ్వము.
గంటల
ముల్లుకే
మంచి
విలువ.
అదేవిధంగా,
హృదయంనుండి
కాకుండా
కేవలం
పెదవులనుండి
నామాన్ని
ఎన్ని
పర్యాయములు
చెప్పినప్పటికీ
దానికి
విలువలేదు;
హృదయ
పూర్వకంగా
ఒక్కతూరి
తలుచుకున్నా
దానికి
ఎంతో
ఫలితం
ఉంటుంది.
చిత్తశుద్ధితో
నామస్మరణ
చేస్తే
పోయిన
ప్రాణం
కూడా
తిరిగి
వస్తుంది
ఎవరైనా
ఏమైనా
చెప్పనీ,
దానిని
నీవు
లెక్క
చేయనక్కర్లేదు.
భగవన్నామాన్ని
నీవు
హృదయ
పూర్వకంగా
చెప్పు.
కాని,
హృదయపూర్వకంగా
చెప్పేవారి
సంఖ్య
ఈనాడు
చాలా
తక్కువగా
ఉంటున్నది.
“ఈనాడు
నాకు
గొంతు
సరిలేదు.
నాకు
జలుబు
చేసింది.
కనుక,
నేను
పాడలేను”
అంటారు
కొందరు.
5
▾
Meaning
Keep
నీకు
జలుబురానీ,
దగ్గురానీ,
ఏమైనా
కానీ,
నీవు
నీ
లోపలనే
పాడుకో.
అదే
నీకు
అన్నివిధాలుగా
శక్తి
నిస్తుంది.
ఎందుకంటే,
భగవన్నామము
చాలా
పవిత్రమైనది.
ఒక్కతూరి
చెబితే
చాలు,
పోయిన
ప్రాణముకూడా
వస్తుంది.
సావిత్రి
తన
పతిని
కోల్పోయి
చాలా
దుఃఖిస్తూ
వచ్చింది.
ఆమె
చేసిన
హృదయ
పూర్వకమైన
ప్రార్థనచేత
సత్యవంతుడు
తిరిగి
లేచి
వచ్చాడు.
ఈవిధంగా
చనిపోయినవారిని
బ్రతికించిన
స్త్రీలు
ఒక్క
భారతదేశములో
తప్ప
మరొక
దేశములో
కనిపించరు.
భగవత్
శక్తి
ప్రపంచములో
సర్వత్రా
ఉండినప్పటికీ
ఒక్క
భారతదేశమునందు
మాత్రమే
అది
అధికంగా
వ్యక్తమవుతూ
ఉంటుంది.
అయితే,
పవిత్రమైనటువంటి
చిత్తము
కలిగినటువంటివారికి
ఎక్కడైనను
విజయమే.
చిత్తశుద్ధితో
నామస్మరణ
చేస్తే
ఎంతైనా
ఫలితం
వస్తుంది.
మీరా
చేసిందికూడా
అదే!
“నేను
సముద్రములో
మునిగి
మునిగి
నామమనే
ముత్యమును
తెచ్చుకున్నాను.
ఆ
విలువైన
ముత్యము
నా
చేయినుండి
జారి
తిరిగి
సముద్రములో
పడిపోకుండా
చూసుకో
స్వామీ!”
అని
ఆమె
ప్రార్థించింది.
మీరు
ఈ
ప్రపంచంలో
పుట్టారు.
మీ
పుట్టుక
సార్థకం
కావాలంటే
భగవంతుని
నామమును
గానం
చేయాలి.
భగవద్గీతలో
కృష్ణుడు
చెప్పాడు,
“మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః.”
“నా
అంశమే
మీరందరూ.
కనుక,
నేను
ఏవిధంగా
ఉంటానో
మీరుకూడా
అదేవిధంగా
ఉండాలి.
నా
ప్రేమ
ఎంత
పవిత్రంగా
ఉంటుందో
మీ
ప్రేమకూడా
అంత
పవిత్రంగా
ఉండాలి.”
భగవంతుని
తలుచుకున్నప్పుడు
అదే
పవిత్రత
మీకు
వచ్చేస్తుంది.
అంతా
‘రిఫ్లెక్షన్,
రియాక్షన్,
రీసౌండు.’
“సనాతన
కాలమునుండి
కూడను
మీరందరూ
నా
అంశమే”
అన్నాడు,
కృష్ణుడు.
భగవద్గీతలో
ఇదొక్కటే
గొప్పగా
బోధించాడు.
దీనిని
మాత్రము
మీరు
మరువకూడదు.
ఇది
ఒక్కటి
మీ
మనస్సులో
ఉంటే,
భగవద్గీతనంతా
చదివినట్లే!
విశ్వాసము,
సత్యము,
ప్రేమ
-
ఈ
మూడూ
ఉంటే
ఎంతైనా
సాధించగలము
ప్రతి
మానవుడుకూడను
ఏదో
ఒక
ధర్మాన్ని
అనుసరిస్తున్నాడు.
కాని,
ఆ
ధర్మము
ఎక్కడినుండి
వచ్చింది?
అది
ఒక
పవిత్రమైన
భావమునుండి
వచ్చింది.
అట్టి
పవిత్రమైన
భావము
విశ్వాసమునుండి
వచ్చింది.
విశ్వాసమనేది
ఉండినప్పుడే
ధర్మమనేది
పుడుతుంది.
6
▾
Meaning
Keep
విశ్వాసమే
దైవము.
ధర్మమే
దైవము.
సత్యమే
దైవము.
ప్రేమయే
దైవము.
కాబట్టి,
ప్రేమలో
జీవించండి.
విశ్వాసము,
సత్యము,
ప్రేమ
-
ఈ
మూడింటినీ
మనము
పెట్టుకున్నప్పుడు
ఎంతైనా
సాధించగలము.
మీకు
ఎన్నో
కష్టములు,
నష్టములు,
బాధలు
కలుగవచ్చును.
అవి
అలలమాదిరి
వచ్చి
పోతుంటాయి.
అవి
వచ్చినప్పుడల్లా
మీ
విశ్వాసమును
మార్చుకుంటూ
ఉండకూడదు.
దీనిని
ఎప్పటికీ
ఒకటిగానే
ఉంచుకోవాలి.
అలలన్నీ
వచ్చి
పోయేటటువంటివే!
కాని,
జలము
మాత్రం
స్థిరంగా
ఉంటుంది.
కనుక,
మీరు
విశ్వాసమనే
జలమును
స్థిరంగా
పెట్టుకోండి.
ఈ
కష్టాలూ
బాధలూ
అనేటటువంటివి
కేవలం
కదలిపోయే
మేఘాలు.
మీరు
ప్రేమను
పెంచుకుంటూపోతే
సాధించలేనటువంటిది
ఒక్కటీ
ఉండదు.
దేనినైనా
సాధించ
వచ్చును.
భూమిని
ఆకాశంగా
మార్చవచ్చును,
ఆకాశాన్ని
భూమిగా
మార్చ
వచ్చును.
ప్రేమలో
ఉన్నటువంటి
శక్తి
మరి
దేనియందూ
లేదు.
హృదయంలో
భగవన్నామాన్ని
దృఢంగా
పెట్టుకోండి.
అదే
భక్తి
...
శక్తి
...
ముక్తి
కొందరు
భగవన్నామాన్ని
స్మరించమంటే
అలక్ష్యం
చేస్తారు.
అది
చాలా
పొరపాటు.
దాని
విలువ
అనుభవించినటువంటివారికి
మాత్రమే
తెలుస్తుంది
గాని,
అందరికీ
తెలియదు.
తళుకు
తళుకుమనే
రాతిని
చూసి
‘డైమండ్’
అనుకోకూడదు.
నిజమైనటువంటి
‘డైమండ్’
వేరే
ఉంటున్నది.
ఏమిటది?
‘డై-మైండ్’
(Die-mind).
అదే
నిజమైనటువంటి
‘డైమండ్’.
అదే
దైవనామము.
కాబట్టి,
ఆ
నామమును
మీరు
భద్రంగా
పెట్టుకోండి.
ఎలాంటి
కష్టములూ,
దుఃఖములూ
కలిగినప్పటికీ
వాటిని
మీరు
లెక్కచేయకండి.
అవి
వస్తుంటాయి,
పోతుంటాయి.
మీలో
ఉన్న
తత్త్వము
దృఢమైనది.
అది
నిత్యమూ,
సత్యమూ
అయినటువంటిది.
అట్టి
నిత్యసత్యమైనటువంటి
తత్త్వాన్ని
వదలిపెట్టి
అనిత్యమూ,
అసత్యమూ
అయినటువంటి
‘అలలను’
మీరు
‘ఫాలో’
చేయకూడదు.
కాని,
ఈనాడు
అందరూ
అనిత్యమూ,
అసత్యమూ
అయినటువంటి
‘అలలను’
పట్టుకొని
తమ
జీవిత
ప్రయాణాన్ని
సాగిస్తున్నారు.
వీటిని
పట్టుకుంటే
మీకు
ఎప్పటికైనా
మోసమే!
‘కదలిపోయే
మేఘాల’ను
పట్టుకొని
మీరుకూడా
కదలిపోకూడదు.
దృఢమైనటువంటి
భగవత్
పాదమును
పట్టుకోవాలి.
ఒకతూరి
పట్టిన
తరువాత
దానినింక
వదలకూడదు.
ఎక్కడికి
వెళ్లినా
అది
మీ
వెంటనే
ఉంటుంది.
7
▾
Meaning
Keep
హృదయంలో
భగవన్నామాన్ని
దృఢంగా
పెట్టుకోవాలి.
అప్పుడే
మీరు
ధన్యులవుతారు.
మీ
జీవితం
సార్థకమవుతుంది.
అదే
మీకు
భక్తి.
అదే
మీకు
శక్తి.
అదే
మీకు
ముక్తి.
దీని
నిమిత్తమై
సంవత్సరమునకు
ఒక
పర్యాయము
‘అఖండ
భజన’
అని
పెట్టాము.
నీ
పని
నీవు
చేసుకో!
అన్నీ
చేస్తూ
భగవంతుని
తలుచుకుంటూ
ఉండు
అఖండ
భజన
అనగా
పూర్తి
24
గంటలసేపు
భగవంతుని
నామస్మరణ.
కాని,
మధ్యమధ్యలో
మీరు
లేచి
పోవడం,
రావడం
జరిగితే
...
అది
ఖండ
భజనే.
నామస్మరణ
మధ్యమధ్యలో
ఆవిధంగా
‘కట్’
కాకుండా
చూసుకోవాలి.
నీవు
ఇంటికి
పోతే
అక్కడకూడా
నామస్మరణ
చేసుకో!
నీవు
భోజనము
చేస్తూ
కూర్చున్నప్పుడు
అక్కడకూడా
నామస్మరణ
చేసుకో!
దేనినీ
వదలమని
చెప్పడం
లేదు,
భగవంతుడు,
“నీ
పని
నీవు
చేసుకో!
అన్నీ
చేస్తూ
నన్ను
తలుచుకుంటూ
ఉండు”
అంటున్నాడు.
అందుకోసమనే
కృష్ణుడు
భగవద్గీతలో
చెప్పాడు,
“మామనుస్మర
యుధ్యచ”.
“అర్జునా!
నన్ను
తలుచుకుంటూ
నువ్వు
యుద్ధం
చేయి.
అదికూడా
నీకు
నా
స్మరణే.
నువ్వు
చేయవలసినది
చేస్తే
చావవలసినవాళ్లు
చనిపోతారు,
బ్రతకవలసినవాళ్లు
బ్రతుకుతారు”
అన్నాడు.
నీ
పని
నీవు
చేసుకుంటూ
ఉండాలి.
ఎప్పుడూ
నవ్వుతూ
నవ్వుతూ
పనిచేయాలి.
Smiling
face
(నవ్వుమొహం)
కావాలి.
అది
లేకుండా
ఎప్పుడూ
castroil
face
(ఏడుపు
మొహం)
వేసుకొని
కూర్చుంటే
ప్రయోజనం
లేదు.
Happiness
is
union
with
God
(భగవంతునితో
తాదాత్మ్యం
చెందడమే
ఆనందము).
మీకు
ఏవో
కొన్ని
చింతలు
రావచ్చు.
కొంతమందికి
‘మ్యారేజి’
(పెళ్ళి)
చింత
వస్తుంది.
‘అయ్యో,
నాకీ
చింత
వచ్చింది,
ఆ
చింత
వచ్చింది’
అని
చింతలతో
నీవు
జీవితాన్ని
నాశనం
చేసుకోవద్దు.
ఏది
వచ్చినా
అది
భగవంతుని
సంకల్పమే
అన్న
భావాన్ని
దృఢంగా
పెట్టుకున్నప్పుడు
నీవు
ఎంతైనా
ధన్యుడవవుతావు.
8
▾
Meaning
Keep
రాగ,
తాళములు
ప్రధానం
కాదు;
హృదయ
రాగము
ఒక్కటి
ఉంటే
చాలు!
నామస్మరణ
ఎవరు
చేసినప్పటికీ,
ఎక్కడ
చేసినప్పటికీ,
ఏది
చేసినప్పటికీ
వారు
ధన్యులవుతారు,
పుణ్యులవుతారు.
నీవు
రాగ,
తాళములు
చూసుకోనక్కర్లేదు.
హృదయ
రాగము
ఒక్కటి
ఉంటే
చాలు.
హృదయమునుండి
వచ్చేటటువంటి
‘సో...హం’,
‘సో...హం’...
దానిని
మీరు
వదలిపెట్టకూడదు.
ఆ
ఒక్క
‘ట్యూన్’
(రాగము)ను
మీరు
పెట్టుకుంటే
తప్పక
అన్నీ
జయప్రదమవుతాయి.
నామస్మరణ
అప్పుడప్పుడు
జరుగుతూ
ఉండడం
చాలా
అదృష్టం.
ప్రశాంతి
నిలయంలో
మీకిక్కడ
ప్రొద్దున్న,
సాయంకాలం
నామస్మరణ
జరుగుతూనే
ఉన్నది.
ఇది
గొప్ప
అదృష్టమే.
ఈ
అదృష్టాన్ని
పాడుచేసుకోకండి.
దాన్ని
మీరు
సార్థకం
చేసుకుంటే
అప్పుడే
మీ
జన్మకూడా
సార్థకమవుతుంది.
దీనికోసమే
అప్పుడప్పుడు
అఖండ
భజన
పెడుతుంటాము.
Previous
←
Follow Satya and Dharma, and they will protect you in every way
Next
Only one who recognises that all are one is truly educated
→