Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Principle of the Avatāra
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
1.
అవతార
తత్త్వం
భక్తులతోడను,
భగవంతునితోడను
మిక్కిలి
సంబంధము
కలవారి
చరిత్రలన్నియును
భాగవత
చరిత్రలనియే
చెప్పవచ్చును.
భగవంతుడు
అనేక
రూపములను
ధరించి,
అనేక
ప్రకారముల
లీలలను
గావించును;
అట్టి
లీలలకు
ఉపకరణములైన
వారును,
కృపకు
పాత్రులైన
వారును,
ఆ
భక్తులకు
సాక్షాత్కరించిన
అనేక
రూపములునూ
ఏకీభావమైన
స్థితి
చరిత్రను
కూడనూ,
భాగవతమని
అందురు.
భాగవతము
సమస్త
వైదిక
ఆచార్యులకు
సామాన్యమైనది.
దైహిక,
దైవిక,
మానసిక
సంబంధమైన
భవవ్యాధులకు
ఇది
దివ్య
ఔషధము.
భాగవతము
రసవత్తరమైనది,
అమృతోపమైనది,
లీలాదేహదుల
వర్ణనారూపమైనది.
భాగవతమునకు
ముఖ్య
ఆధేయము
అవతార
తత్త్వము.
అవతార
కథలో
రక్తి,
సక్తి
భాగవతుల
సమావేశమొక్కసారిగా
కలుగుచున్నది.
నీరసకార్యము,
యెక్కువ
కాలము
నిలువలేదు.
రుచి
లేక
చేసిన
కార్యములో
రసము
లభించదు.
అందువలననే
ప్రప్రథమమున
జిజ్ఞాస
కలిగిన
వారికి
భగవత్
రక్తిని
పెంపొందించుకొను
భక్తిభావములు,
బాహ్య,
అంతర్
ఇంద్రియముల
ద్వారా
అనుభవించుటకు
ఆరాటపడుదురో,
అట్టి
వారిని
భాగవతులని
అందురు.
2
▾
Meaning
Keep
భక్తుల
ఆనంద
రసమే
అవతారము
భగవదవతారములు
కేవలము
దుష్టశిక్షణ,
శిష్టరక్షణ
కొరకై
వచ్చుచుండునని
లోకము
సామాన్యముగా
తలంచుట
సహజము.
కానీ
అది
అవతారమునందు
ఒక
భాగము
మాత్రమనే
చెప్పవచ్చును.
అవతారము
భక్తుల
తృప్తికొరకు;
ధర్మరక్షకొరకు;
సాధు
పోషణకొరకు.
భక్తులయొక్క
భావరూపమే
అవతారము;
భక్తుల
ఆనందరసమే
అవతారము;
కనుక,
భక్తులకొరకే
అవతరించుననని
దృఢముగా
చెప్పవచ్చును.
ఆధారము
ప్రధానము;
ఆవు
తన
దూడ
కొరకే
పాలను
కలిగియుండును.
దూడ
కొరకై
కలిగిన
పాలను
ఇతరులు
కూడను
ఎట్లు
ఉపయోగించుకొందురో,
ఇతరులకెట్లు
ప్రయోజనమో,
అటులనే
భగవంతుడవతరించుట
కేవలము
భక్తులననుగ్రహించుటకే
అయిననూ,
దానికి
అవాంతరఫలములైన
దుష్టశిక్షణ,
ధర్మరక్షణ
ప్రయోజనార్థములగుచుండును.
అవతరించు
భగవదవతారములు
కేవలము
మానవ
రూపముననే,
భూమియందే
కలుగవలయుననను
సిద్ధాంతము
లేదు.
యే
రూపమునైననూ
ధరించవచ్చును;
దేనియందైననూ
చేరవచ్చును.
భక్త
రక్షణకు
యే
రూపమున,
యే
స్థానమున,
యెట్లు
అవసరమో
ఆయా
సమయసందర్భములను
అనుసరించి
తన
సంకల్పముచే
ఆయా
రూపముల,
ఆయా
స్థానముల
అవతరించును.
భగవంతుడు
దేశ,
కాల,
బంధములకు
అతీతుడు;
గుణరహితుడు;
గుణాతీతుడు,
ఆయనకు
జీవులన్నియూ
సమానములే!
మానవ,
దానవ,
దైవ,
పశు,
పక్షి,
మృగాదులు,
క్రిమి
కీటకములు,
రూపనామములందు
భేదములేకానీ,
జీవభావములందు
అన్నియునూ
ఒక్కటియే.
ఒక్కొక్క
ఉపాధిలో
ఒక్కొక్క
ప్రక్రియ
జరుగుచుండును.
అంతమాత్రమునకే
జీవభేదములు
పాటించరాదు.
మచ్చునకు
ఒకే
కరెంటు
వివిధములైన
యంత్రములందు
వివిధ
ఫలముల
నందించుచుండును.
3
▾
Meaning
Keep
అంతమాత్రమున
కరెంటునందు
భేదమును
కల్పించుట
అజ్ఞానలక్షణము;
తెలియని
తత్త్వము.
అటులనే
ఒకే
పరమాత్మ
ఒక్కొక్క
ఉపాధియందలి
జీవతత్త్వమును
ఒక్కొక్క
మార్గమున,
ఒక్కొక్క
ఫలము
నొసంగుచు
నడిపించుచుండును.
పామరుల
దృష్టికి
అది
భిన్న
భేదములుగ
గోచరించిననూ,
పరమాత్మ
దృష్టికి
అది
సమానమే.
భావాద్వైతమునే
భగవంతుడు
చూచును
కానీ,
కర్మాద్వైతమును
పాటించడు.
కర్మఫలములు
కాయభ్రాంతి
కలవారికే
కాని,
ఆత్మభ్రాంతి
కలవారికి
అన్వయింపవు.
అంతియేకాక,
అతని
అవతారములకు
అంతులేదు.
లెక్కలేనన్ని
అవతారములు;
అందులో
కళావతారములు
కొన్నియు,
అంశావతారములు
కొన్నియు,
ఆవేశావతారములు
కొన్నియు,
యుగావతారములు
కొన్నియూ
ఈ
విధముగ
మొదలుకొని
వివిధ
నామములతో
అవతరించుచుండును.
భక్తులతో
భగవంతుని
లీలలే
భాగవతము
యుగావతారముయొక్క
కథాశ్రవణమునకే,
భాగవతసేవ
అని
అందురు.
భక్తులయొక్కయు,
భగవంతునియొక్కయు,
లీలానాటకమైనది
భాగవతము;
కనుక,
అట్టిదాని
శ్రవణము
ఆత్మ
సాక్షాత్కారమునకు
మూలాధారమని
భావించి,
అనేకమంది
మహాఋషులు
భాగవత
శ్రవణమునకు
ఇంతటి
పవిత్ర
స్థానమును
భావసారమును
కలిగించిరి,
అందించిరి.
సామాన్యముగా
లోకమునందలి
మానవులకు,
విషయములందే
రుచి
మెండు.
యెందుకన,
విషయభోగములకు
శిక్షణ
నివ్వనక్కరలేదు.
అది
జన్మాంతర
సంస్కారము
ననుసరించి
పరంపరముగా
వెంటాడుచుండును.
పుట్టిన
తక్షణమే
పిల్లవాడు
పాలుత్రాగును;
ఆవుదూడ
తల్లి
పొదుగు
దగ్గర
చేరును.
ఈ
అభ్యాసము
యే
శిక్షణతో
యేర్పడినది?
యెవరు
నేర్పిరి?
అయితే,
పిల్లవాడు
నడువవలెనన్ననూ,
మాట్లాడవలెనన్ననూ,
దానికి
మాత్రము
కొంత
శిక్షణ
అవసరము.
కారణమేమి?
అన్నియూ
జన్మాంతరము
ననుసరించియే
వుండవు.
4
▾
Meaning
Keep
కొన్ని
కర్మలు
ప్రస్తుత
జన్మమున
కూడనూ
కొంత
శిక్షణచే
అభివృద్ధి
అగుచున్నవి.
అటులనే
విషయభోగములు
శిక్షణ
అవసరము
లేకయే
అలవడుచున్నవి.
కోప,
తాప,
ఈర్ష్య,
అసూయ,
డంబా
ఇత్యాది
దుర్గుణములు
పెరుగుటకు
విషయభోగములే
మూలకారణము.
వాటిని
అరికట్టునట్టి
కొన్ని
పవిత్రసాధనలైన
జప,
తప,
ధ్యాన,
ధర్మ,
ఉపవాస,
సంధ్యావందనాదులకు
యెంత
శిక్షణ
నిచ్చినను,
యెంత
యెంత
ప్రశంస
చేసినప్పటికినీ,
వాటిమీద
రుచి
కలుగకుండును.
కారణము,
విషయాసక్తి
హృదయమున
పాతుకొని
వుండుటచే
పవిత్ర
కర్మలపై
ప్రేమ
ప్రాకకున్నది.
అటులని
దానిని
మానకూడదు.
రుచి
కలుగు
వరకూ
శిక్షణను
మానరాదు.
ప్రారంభమున
మానవునకు
దేనియందునూ
అంత
రుచి
కలుగదు.
కానీ,
నిరంతరము
దానినే
చేయుటవలన
దానిపై
స్వతఃరుచి
యుత్పన్నమగును.
యెటులన,
బాల్యకాలమున
చంటిపిల్లలకు
పాలరుచి
తెలియకుండిననూ,
నిరంతర
అభ్యాసముచే
యెప్పుడైననూ
పాలను
వదలి
అన్నము
నందించిన
దానిని
ఆరగించరు.
పాలను
విడువరు.
అయితే,
తల్లి
వారికి
మెల్ల
మెల్లగ
అన్నమును
కలిపి
కొంత
కొంత
సేవనము
చేయుచుండును.
నిత్య
సేవనముచే
అన్నమునందలి
రుచి
మరగి
పాలను
వదలుదురు.
పాలే
యెంత
సహజమని
భావించి
ఆరగించిరో
వారికి
నేడు
అభ్యాసముల
ద్వారా
అన్నము
అంత
సహజముగా
మారెను;
అన్నమునే
సహజముగా
ఆరగించుటకు
మరిగిన
మానవుడు
ఒక
దినము
అన్నము
లేక
నిలువజాలడు.
భగవత్కథా
శ్రవణంలోని
ఆనందము
అటులనే,
ప్రప్రథమమున
విషయభోగము
సహజమైననూ
అభ్యాసముద్వారా,
శిక్షణచే,
జిజ్ఞాసువులు
కథాకీర్తనమునే
అనురక్తిగా
భావించి
మెల్లమెల్లగ
దానియందు
రుచిని
బలపరచుకొనిన,
కొంత
కాలమునకు
భగవత్కథా
శ్రవణమె,
కీర్తనమె
తనకు
ఆహారముగా
కలిగి,
ఒక
నిమిషమైననూ
5
▾
Meaning
Keep
దానిని
వదలని
వాడై
అందులోనే
రసమును
ఆస్వాదన
చేయుచూ
ఆనందములో
కాలమును
గడుపును.
అట్టి
వారలు,
సామాన్యులు
నలుగురు
చేరిన
స్థానమున
చేరక,
విషయ
సంబంధమైన
సంభాషణలలో
నిలువక,
భగవత్
కీర్తనలు,
కథలు
జరుగు
స్థలములకు
పోయి
ఆనందముగా
కాలమును
గడుపుదురు.
సజ్జనులనుటకు
ఇట్టి
ప్రవర్తనలే
సరియైన
గుర్తులు.
అట్లుకాక,
మేము
సాధకులమని
చెప్పుకొనుచు,
భగవత్
భక్తులమని
బాహ్యాడంబరములు
చేయుచు
యెక్కడ
వెళ్ళిననూ
విషయ
సంబంధమైన
ఆటలు,
మాటలు
ఆడిన
అది
సాధకత్వమునకు
స్థానము
కాదు.
భగవత్సంబంధమైన
విషయములు
జరుగు
స్థానముననే
కాలమును
గడుపవలెను
కానీ,
వాటికి
విరుద్ధమయిన
ప్రదేశములందు
యెట్టి
విచిత్రములు
జరిగిననూ
తాను
చేరరాదు;
చూడరాదు;
వినరాదు.
ఇట్టివే
భాగవతుని
లక్షణములు.
పవిత్ర
ప్రదేశమున,
దేవాలయములందో,
లేక
మందిరములందో,
పూజా
గృహమునందో
లేక
మహనీయుల
ఆశ్రమములందో,
సాధుసజ్జనుల
సంఘములందో,
యేదియును
లేక,
విశాలమైన
ప్రదేశములందో,
యేకాంత
స్థానములందో
కృష్ణ
కథాలోలుడై
కీర్తనలు
చేసిన,
ఆనందమున
మునిగి
అన్నియూ
మరతురు.
అటుల
కాదేని
భగవత్
కథాలోలురగు
మహాపురుషుల
సమీపమున
నుండి
వారిని
శ్రద్ధాభక్తి
పూర్వకముగ
సేవా
సత్కారములచే
ప్రసన్నుల
గావించి
అట్టివారితో
గూడి
భగవత్కథా
శ్రవణము
చేయవలెను.
ఇట్టి
అభిరుచి
కలుగుట
జన్మాంతర
పుణ్యఫలము.
అట్టి
ఫలము
లేనివారికి
పవిత్ర
పరమాత్మ
కథల
శ్రవణప్రాప్తి
లభించదు.
ప్రారంభమున
జిజ్ఞాసునకు
పవిత్ర
కథలయందు
మనసు
లగ్నము
కాకపోయినప్పటికినీ
సాధుసంఘముల
మధ్య
కూర్చొని
శ్రవణమయిననూ
చేసిన
చాలును.
మెల్లమెల్లగ
కథ
మీద
రుచి
పెరిగి,
విషయమును
తెలిసికొనుటకు
మొదలిదును;
విషయ
విచారణపై
మనసు
తిరుగును.
6
▾
Meaning
Keep
పఠనము
కంటెను
కథాశ్రవణము
అధిక
రుచిని
కలిగించును.
లేక
శ్రవణ,
పఠనలు
కూడనూ
చేరవచ్చును.
శ్రవణముపై
రుచి
గలవారు
వంటరిగా
వినుటకంటె
కొంతమంది
జిజ్ఞాసులతో
చేరి
వినుట
మంచిది.
సామాన్య
జిజ్ఞాసువులతో
చేరి
వినుటకంటె
మహనీయుల
జతచేరి
వినుట
మరింత
మంచిది.
మహనీయుల
జతయందుండి
వినుటకంటెను,
మహనీయుల
నోటినుండియే
వినుట
మరింత
ఫలము.
యెందుకన,
మహనీయులు
అనుభవ
స్వరూపులై
ఆనంద
భాష్పములతో,
వికసిత
ముఖమున
వివరించుచుండగ
శ్రోతలు
కూడను
మరింత
రససహితమై
పరవశమందగలరు.
యెట్లన
దుఃఖముతో
కొందరు
కుమిలి
కుమిలి
యేడ్చుచుండ,
అట్టి
వారలను
చూచువారల
కన్నుల
యందునూ
నీరు
కారును.
నవ్వుచున్న
పిల్లలను
చూచిన
చూచువారలకు
కూడను
నవ్వ
వచ్చును.
అటులనే,
రసపూరితమైన
హృదయము
గల
మహనీయుల
వచనములు
శ్రోతల
హృదయములను
కూడను
రస
భరితము
చేయును.
మహనీయుల
చెంతచేరి
స్వయముగా
వారు
చెప్పు
భగవత్
కథలను
శ్రవణము
చేయుటచే
కలుగు
లాభము
ఇంతా
అంతాయని
తెలుప
సాధ్యము
కాదు.
అట్టి
పవిత్ర
శ్రవణముచే
కలుషపూరితమైన
హృదయములు
కాంతిరూపమై
స్వచ్ఛ
ప్రకాశమును
పొందును.
విషయవాసనలనబడు
దుర్వాసనలకు
విశ్వేశ్వర
కథాశ్రవణము
దివ్యసువాసన.
యెట్లన,
కథాశ్రవణము
కర్ణముల
ద్వారా
మనసున
చేరి
హృదయమును
శుద్ధము
చేయును.
పరిశుద్ధ
హృదయమే
భగవంతుని
స్థానం
అట్టి
శుద్ధమైన
హృదయమే
భగవంతునకు
యోగ్యమైన
స్థానము;
పీఠము.
అట్టి
హృదయ
కుహరమున
భగవంతుడెపుడు
నివాసము
చేయునో,
నివాస
మేర్పరచుకొనునో,
అపుడు
అంతకు
పూర్వము
ఆ
హృదయమున
స్థాన
7
▾
Meaning
Keep
మేర్పరచుకొని
వుండిన
అరిషడ్వర్గములనబడు
కామ
క్రోధ
లోభ
మోహాదులు
నెత్తిన
బట్ట
వేసుకొని
కాలికి
బుద్ధి
చెప్పి
కదలిపోదురు.
హృదయమును
వీడి
దుర్గుణములు
యెపుడు
కదలిపోవునో
అపుడు
వాటికి
పరివారముగా
అనుసరించిన
దుర్వాసనలు
కూడనూ
వాటితో
పాటు
గూడా
గుడారములు
యెత్తివేసి,
ఉత్తచేతులతో
పత్తాలేకుండా
పారిపోవుదురు.
అపుడు
మానవుడు
తన
నిజస్వరూప
స్వభావములైన
సత్య,
ప్రేమలతో
సాక్షాత్కార
ప్రాప్తికై
సాధనలు
సాగించి,
సాయుజ్యమును
పొందును;
మాయను
వీడును;
మనసును
బాయును;
మర్మము
నెరుగును;
మాధవత్త్వమును
గాంచును.
ప్రేమయే
మానవునకు
స్వభావము.
మానవుడు
ప్రేమలేక
ఒక
నిముషమైననూ
నిలువలేడు.
ఇంతవరకూ
ప్రేమించుచుండిన
చెడు
గుణములనబడు
కామ,
క్రోధ,
మోహాదులు
మానవుని
హృదయము
వీడిపోగానే
ప్రేమ
వంటరిగా
నుండనొల్లక,
వంటరితనమును
సహించలేక,
హృదయ
పీఠముపై
స్థానము
నేర్పరచుకొని
యుండిన
నిర్మల,
నిస్స్వార్థ
స్వరూపుడగు
నీల
నీరద
విగ్రహుడైన
మదనమోహనుని
ప్రేమించుటకు
ప్రయత్నించును;
ప్రాకులాడును.
వేరొకరికి
అందులో
స్థానము
లేదు
కనుక,
ఇంకొకరు
చేరుటకు
వీలుకానందున,
విధిలేక
పరమాత్మ
ప్రేమయే
క్రమముగ
గాఢమై,
నిర్మలమై,
నిస్స్వార్థమై,
సర్వసంగపరిత్యాగ
స్థితిని
పొంది,
సాయుజ్యమును
సాధించును.
కనుక
మానవుని
హృదయమందు
వాసుదేవ
వాసము
చేసిన,
వసుదేవుడు
చేరుటకు
వీలుండదు.
అట్లుకాక
వసుదేవునికే
హృదయమును
పీఠముగా
ఏర్పరచిన,
వాసుదేవు
దేనాటికినీ
అందులో
వాసము
చేయడు.
పోనీ
అటులకాక
ఇరువురకూ
స్థానమిచ్చుననిన
అది
సాధ్యము
కాదు.
అంధకారము
ప్రకాశము
రెండునూ
ఒకే
కాలములో
ఒకే
స్థానమున
చేరవు;
నిలువవు.
ధనస్థానమున
దైవమును,
దైవస్థానమున
ధనమునూ
చేర్చిన
కడకది
దైవమునూకాక,
ధనమునూకాక
దయ్యముగా
మారును.
8
▾
Meaning
Keep
మానవుడు
మానవునిగా
ప్రవర్తించిననూ
మంచిదే
లేక
మాధవునిగా
మారిననూ
మంచిదే!
కానీ,
దానవునిగానో,
వానరునిగానో
మాత్రము
మారరాదు.
యెందుకన
పూర్వము
ఖనిజముగా
పుట్టి
ఖనిజముగా
చచ్చి
వృక్షముగా
బుట్టినదనియు,
వృక్షముగా
చచ్చి
జంతువుగా
బుట్టినదనియు,
జంతువుగా
చచ్చి
మానవునిగా
పుట్టెననియూ
భౌతిక
శాస్త్రము,
ఆధ్యాత్మికము
అంగీకరించినది.
అట్టి
మానవజన్మము
మానవునిగా
వచ్చి
మానవునిగా
పుట్టిననూ
చిత్రము
కాదు.
లేక
మృగముగా
పుట్టిననూ
కీర్తి
రాదు.
దైవముగా
పుట్టిననే
సార్థకము.
కనుక,
హృదయమున
దుర్గుణములను
చేర్చక
సద్గుణముల
సాంగత్యముతో
సర్వేశ్వరునికి
తన
హృదయమును
పీఠముగా
నొనర్చి,
సర్వ
వాసనలను
నిగ్రహించిన
మానససరోవరము
క్షీరసాగరముగా
మారును;
జీవరూపుడగు
హంస
అందులో
విహరించును;
ఆనందము
ననుభవించును.
భగవత్
లీలలకు
ఆద్యంతములు
లేవు
అనంతమైన
సముద్ర
తరంగములకు
ఆదికానీ
అంత్యముకానీ,
యెవరు
నియమింతురు?
అది
సాధ్యము
కానిది.
ఆద్యంతములను
తెలుపవలెనని
సంకల్పించిన
యే
తరంగంనుండి
లెక్కింప
మొదలు
పెడుదురో
అదే
ఆది;
యే
అలతో
లెక్కించుట
నిలిపి
వేతురో
అదియే
అంత్యము
అని
తలంచవచ్చును.
అనగా,
తాను
లెక్కించుటకు
ఆది,
అంత్యము
వున్నది
కానీ
అలలకు
ఆది,
అంత్యము
లేదు.
అది
కనిపెట్ట
నెవరితరమూ
కాదు.
అటులనే,
భగవత్
చరిత్రకు
కూడనూ
ఆద్యంతములు
లేవు.
తెలియని
అపారసముద్రము
వంటిది.
దీనిని
యెవరు
యెక్కడ
ప్రారంభింతురో
అది
మొదలనియు,
ఎక్కడ
విరమింతురో
అది
అంత్యమనియు
తెలుపుదురు.
అంతేకానీ,
అపారమైన
పరమాత్మ
లీలలకు
ఆది
యెక్కడ,
అంత్యమెక్కడ?
భగవత్
కథలకు,
లీలలకు
ఆద్యంతములు
కలవని
వాదింతురా?
తలంచువారి
తరంగ
భావములకు
ఆద్యంతములే
కానీ,
భగవత్
లీలానాటక
9
▾
Meaning
Keep
రంగమునకు
కాదు.
దానికి
హద్దులు
లేవు.
భగవత్
చరిత్రలో
యెటు
చూచిననూ
సుధాపరిపూర్ణమే
కానీ,
విషయాంతరము
లేదు.
సుధారససాగరమున
యెవరు
యిష్టమొచ్చినపుడు
వారు
చేరవచ్చు.
యెక్కడ
చేరిననూ,
యెక్కడ
త్రాగినను
మధురమే
కానీ,
మలినము
వుండదు.
యే
విధముగ
అనుభవించిననూ
భగవత్
ప్రేమ
పరిశుద్ధమై,
పవిత్రమై,
ప్రభావమై
ప్రకాశించును.
పటిక
బెల్లమును
పగలు
తిన్ననూ,
రాత్రి
తిన్నను
తీపు
తీపేకానీ,
వేరురుచి
రాదు.
తినువానికి
చీకటి
వెలుతురు
కానీ,
పటిక
బెల్లమునకు
కాదు.
Next
The Birth of the Foremost of Bhāgavatas
→