Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Birth of the Foremost of Bhāgavatas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
2.
భాగవతోత్తముని
జన్మము
వీరస్వర్గము
నందుకొన్న
అభిమన్యుని
ఆత్మస్వరూపుడగు
బరీక్షిన్మహారాజు
ఉత్తర
గర్భమున
పెరుగుచుండగా,
అశ్వత్థామ
విడిచిన
దివ్యాస్త్రము
నిప్పులు
గ్రక్కుచూ
అతివేగమున
తన
వైపునకు
వచ్చుచుండగా
ఎవరో
ఒక
దివ్యసుందరుడు
హస్తమున
చక్రము
ధరించి
అతివేగముగ
వచ్చుచున్న
అశ్వత్థాముని
అస్త్రమును
ముక్కలు
గావించుట
గర్భమందున్న
పరీక్షిత్
మహారాజు
కన్నులారా
చూచుచూ
ఆశ్చర్యపరవశమందుచూ
ఈ
విధముగ
తలంచెను.
"నాతోపాటు
ఈ
గర్భమున
నివసించుచూ
నన్ను
హతమార్చుటకై
వచ్చుచున్న
అస్త్రమును
దునుమార్చుచూ
నన్ను
రక్షించు
ఈ
బాలుడు
యెవరయివుండవచ్చును?
నేనున్న
గర్భమందే
తానునూ
నివసించుచుండుటచే
ఇతడు
నా
సోదరు
డనుకొందునా?
అటులైన
ఇతనికి
చక్రమెక్కడిది?
అతనికి
చక్రముండిన
నాకు
కూడనూ
అట్టి
చక్రముండి
యుండవలెను
కదా?
కాన,
సామాన్యమైన
మానవుడు
కాదు
ఇతను"
అని
తలంచుచూ
తనలో
తాను
అనేకవిధముల
ఊహించుచుండగా,
గర్భమున
తనను
రక్షించిన
బాలుడు
కోటి
సూర్యులకాంతి
కలిగి
శ్యామ
సుందరుడై
తనను
సమీపించి,
అంతర్ధానమాయెను.
ఈ
దృశ్యమును
కన్నులారా
చూచుచున్న
బాలుడైన
పరీక్షిన్మహారాజు
నిరంతరమూ
ఆ
దివ్యసుందర
విగ్రహమునే
స్మరించుచూ
గర్భమందు
2
▾
Meaning
Keep
పెరుగుచుండెను.
ఈ
రీతిగా
రెండయిదునెలలు
కాగానే,
ఉత్తర
గర్భమునుండి
తేజోవంతుడైన
బాలుడు
ఉద్భవించెను.
పుట్టుట
తోడనే
బాలకుని
తేజస్సు
పురిటి
యిల్లును
ప్రకాశింపజేసెను.
అక్కడున్న
స్త్రీల
కన్నులకు
మిరుమిట్లు
గొలిపించెను.
ఆ
బాలకుని
తేజమును
చూడలేకపోయిరి;
కొన్ని
నిమిషములు
బుద్ధులు
మొద్దుబారెను.
ఎట్లో
తెప్పరిల్లిన
సుభద్ర
ఈ
శుభవార్తను
ఒక
దాసీ
ద్వారా
యుధిష్ఠిరునకు
చెప్పి
పంపెను.
వేచియుండిన
పాండునందనులకు
ఈ
శుభవార్త
తెలియగనే
ఆనంద
పరవశులై
అన్ని
మంగళవాయిద్యములనూ
వాయించమని
ఆజ్ఞాపించిరి.
ఫిరంగులు
పేల్చిరి.
మా
వంశము
నిలిచినదని
మధురానంద
మొందిరి.
ఇంతలో
యుధిష్ఠిరుడు
యింటి
పురోహితునకు
కబురు
పంపెను.
మంగళవాయిద్యములను
విన్న
పురప్రజలు
కారణమును
విచారించుచూ
కట్టలు
కట్టలుగా
బారులుదీరి
ఇంద్రప్రస్తమువైపు
పరుగిడి
వచ్చిరి.
ఆనాడు
ఒక
ఇంద్రప్రస్తమే
కాక,
దేశమంతయూ
ఈ
ఆనందమును
అనుభవించిరి.
వచ్చినవారలకు
యుధిష్ఠిరుడు
అనేక
విధములైన
తీపులను
పంచిరి.
బ్రాహ్మణులకు
గోవులను
దానము
చేసిరి.
స్త్రీలకు
బంగరు
గిన్నెలలో
పసుపుకుంకుమ
లందించుటకు
అంతఃపురమునకు
కబురంపిరి.
నిమిషములలో
నగరమంతయూ
సుందరమైన
దివ్యమందిరముగా
తయారుచేసిరి.
పట్టు
పీతాంబరములు,
నవరత్నములు
ఇత్యాది
వెలగల
పదార్థములను
బ్రాహ్మణులకు
పంచిపెట్టిరి.
పురప్రజలందరునూ
పాండవాంకురము
జన్మించినదని
పరవశులై
జయ
జయధ్వనులు
జేయుచుండిరి.
ఈ
రీతిగా
పరీక్షిన్మహారాజు
జననదినము
నగరమున
పగలు
రాత్రియనక
పలువిధములైన
వినోదములతో
పురప్రజలు
ఆనందమును
అనుభవించిరి.
రెండవదినమున
యుధిష్ఠిరుడు
కులపురోహితుడైన
కృపాచారిని
పిలిపించి
జాతకర్మాది
సంస్కారములు
గావించిరి.
వచ్చిన
బ్రాహ్మణులకు
విలువగల
ఆభరణములు
ఇచ్చి
సంతుష్టులను
చేసి
పంపిరి.
వచ్చిన
పండితులు
బాలుని
అనేక
విధముల
ఆశీర్వదించి
వారివారి
గృహములకు
వారు
వెళ్ళిరి.
3
▾
Meaning
Keep
మూడవదినము
యుధిష్ఠిరుడు
భరతవర్షమునకు
గల
కమనీయ
కీర్తికి
కళంకము
రాకూడదను
కాంక్షతో
రాజ్యమునందుగల
ప్రసిద్ధ
జ్యోతిష్కులను,
సాముద్రికులను,
భవిష్య
వక్తలను
పిలిపించి
వారికి
తగిన
ఆసనములమర్చి
సుగంధ
పరిమళములతో
స్వాగతమొసంగి
ధనకనక
వస్త్రముల
నందించి
ఉన్నతాసనముల
నలంకరించమని
కోరిరి.
దైవజ్ఞులు
పరీక్షిత్తుని
జాతక
ఫలములను
చెప్పుట
వచ్చిన
ప్రసిద్ధ
పురుషులు
వారివారి
స్థానములను
వారు
అలంకరించిరి.
యుధిష్ఠిరుడు
చేతులు
జోడించి
వారలకు
నమస్కరించి
ఇట్లు
ప్రార్థించెను
"భూత
భవిష్యత్
వర్తమాన
కాలముల
నెరిగిన
త్రికాల
జ్ఞానులారా!
మాకుపుట్టిన
పిల్లవాని
జన్మలగ్నమును,
గ్రహస్థితులను
గాంచి
వాటి
ఫలమును
తెలుపుదురని
నా
ప్రార్థన"
అని
జన్మించిన
కాలమును
ఒక
కాగితముపై
వ్రాసి
బంగరు
తట్టయందుంచి
వారలకందించెను.
అంత
దైవజ్ఞులైన
బ్రాహ్మణులు
మొదలు
ఆ
బంగరు
పళ్ళెమందున్న
కాలపత్రమును
అందుకొని
శిశువుయొక్క
లగ్నచక్రమును
వేసి
గ్రహస్థానముల
నేర్పరచిరి.
ఎవరికి
వారు
ఆహా!
ఆహా!
యని
ఆనందమును
వెలిబుచ్చుచూ
ప్రసన్నచిత్తులై
ఆనందమును
ననుభవించుచూ,
ఒకరికంటే
ఒకరు
దానిని
వర్ణించుచూ,
ఏమి
చెప్పుటకునూ
తోచని
స్థితిలో
మునిగిపోయిరి.
అందులో
అగ్రస్థానమును
అలంకరించిన
పండితోత్తముడు
లేచి
"మహారాజా!
నేటివరకు
ఎన్నియో
జాతకములు
చూచితిని.
చక్రములు
వేసితిని.
కాని,
ఇట్టి
పవిత్రమైన
లగ్నచక్రమును
కనీ
వినీ
ఎరుగను.
సర్వసుఖములు
ఒక్కచోట
చేరినవి.
సాక్షాత్
విష్ణుస్థానమును
చేరినది.
సర్వ
సద్గుణములూ
ఉట్టిపడుచున్నవి.
వేయేటికి
తిరిగి
మీ
వంశమున
సాక్షాత్
మనువే
జన్మించెననుటలో
సందియము
లేదు"
అని
కూర్చొనెను.
యుధిష్ఠిరుడు
తన
అదృష్టమును
కొనియాడుచు,
ఆనందమున
చేతులు
జోడించి,
ఈ
రీతిగా
జవాబు
చెప్పెను.
"పెద్దల
అనుగ్రహము
చేతను,
భగవత్
4
▾
Meaning
Keep
కృపాకటాక్షముచేతను,
మీ
బోటి
పండితోత్తముల
ఆశీర్వచనముల
చేతను,
మా
వంశమున
తిరిగీ
యిట్టి
పుత్రరత్నమును
పొందగలిగితిమి.
లగ్నచక్రమున
ఎట్టి
శుభలక్షణము
లుండినప్పటికినీ,
మా
సంప్రదాయము
ననుసరించి,
పండితులను,
బ్రాహ్మణులను,
సాధువులను
సేవించునట్టి
సద్గుణములు
లేకున్న
సార్థకమేమి?
కాన,
అట్టి
పవిత్ర
సద్గుణములు
ఈ
బాలునకు
అలవడునా?
లేదా?
తమరు
లగ్నచక్రమును
చూచి
తెలిపిన
ధన్యుడను"
అని
తిరిగీ
తెలిసికొనకోరెను.
అందులకు
దైవజ్ఞుడైన
బ్రాహ్మణుడు
"మహారాజా!
అందులకు
మీరేమాత్రము
అనుమానింప
నవసరము
లేదు.
దేవ
బ్రాహ్మణ
భక్తుడు
కాగలడు.
యజ్ఞయాగాది
క్రతువులు
చేయగలడు.
మీ
పూర్వీకుడగు
భరతుడెట్టి
సత్కీర్తిని
సంపాదించెనో
అట్టి
ఖ్యాతిని
అందుకోగలడు.
అశ్వమేధాది
యాగములను
కూడను
నొనర్చగలడు.
భూమిపై
తన
వంశగౌరవమును
విస్తరింపజేయును.
దైవ,
దానవ,
మానవుల
మన్ననలను
పొందగలడు.
ముందెన్నడును
మీ
వంశమున
ఇట్టి
మహాపురుషుడు
పుట్టి
యుండడనియే
చెప్పవచ్చును"
అని
అనేక
విధములైన
సద్గుణములను,
సదాచారములను
నిరూపించిరి.
ఇంకనూ
ఎన్నియో
శుభములును,
సద్గుణములునూ
వుండినప్పటికినీ
దైవజ్ఞులు
చెప్పుటకు
ధైర్యము
చాలక
అధికముగా
చెప్పిన
అతిశయోక్తి
అని
తలంతురేమో
అని
ముఖ్య
విషయమును
మాత్రము
ముచ్చటించి,
మౌనము
వహించిరి.
ఇంతలో
బాలుని
సుగుణములను,
సదాచారములను
వినుచుండిన
ధర్మజునకు
ఎంతవినినను
తృప్తి
తీరక,
ఇంకనూ
ఏమేమో
తెలిసికొన
గోరుచుండెను.
అతని
ఉత్సాహము
కనిపెట్టిన
జ్యోతిష్కులు
వారల
ఉత్సాహమునూ
తెలుపగోరి
"రాజా!
మీరేదియో
ఇంకనూ
తెలిసికొన
గోరుచున్నారు.
సంశయించక
అడుగవచ్చును.
తెలుపుటకు
మేము
కూడనూ
ఆనందించుచున్నాము"
అని
వినయమున
విన్నవించిరి.
సమయమును
పురస్కరించుకొని
యుధిష్ఠిరుడు
ఉత్సాహపూరితుడై
ముందునకు
వచ్చి
"విప్రులారా!
ఈ
బాలుని
పరిపాలనా
5
▾
Meaning
Keep
కాలంలో
ఇతనికి
యుద్ధములేవైననూ
సంభవించునా?
అట్లు
సంభవించిననూ
ఇతనికి
జయము
చేకూరునా?"
అని
ప్రశ్నించెను.
అంత
విప్రులు
"మహారాజా!
ఇతని
పరిపాలనా
సమయములో
ఇతనికి
విరోధులనువారే
ఉండరు.
ఇక
యుద్ధ
భయమెందులకు?
ఇతని
జీవితములో
అపజయమనేదే
రాదు,
లేదు.
ఇది
సత్యము,
సత్యము"
అని
విప్రులందరూ
ఏకకంఠమున
బలుకుటతోడనే
యుధిష్ఠిరునితోపాటు
వింటు
ఆనందించుచున్న
భీమార్జున
నకుల
సహదేవాదులు
ఒకరి
ముఖమును
ఒకరు
చూచుకొని
ఆనందమును
వెలిబుచ్చుకొనిరి.
కారణము
నిమిత్తము,
కర్మ
జరుగక
తీరదు
ఇంతలో
ధర్మజుడు
"అటులయిన",
అని
ఏదియో
అడుగబోయి,
మరియు
ఏమియు
మాటాడక
తల
ఊపుచు
ఏదియో
యోచించునటుల
కనుపించెను.
విప్రులు
"మహారాజా!
తమరు
అడుగదలచినది
ఏదియో
యున్నది.
మేము
సర్వ
విషయములు
సంశయించక
చెప్పుటకు
సిద్ధముగా
యున్నాము.
కాన
దాచక
వెల్లడి
చేయుడు"
అని
ధైర్యము
నందించిరి.
అంత
ధర్మజుడు
"ఆ
యేమియూ
లేదు.
బాలకుని
గుణగణములు
గొప్పవనియు,
అతనికి
విరోధులెవ్వరు
వుండరనియు,
యజ్ఞ
యాగాది
క్రతువులు
గావించుననియు,
వంశోద్ధారణ
మొనరించుననియు,
యుద్ధములే
లేవనియు,
అపజయమను
మాటనే
అతని
జీవితమున
రాదనియునూ
తమరు
శెలవిచ్చితిరి.
చాల
ఆనందము.
కానీ,
అతని
అంతిమగతి
యెట్లుండునో
అది
ఒకపరి
వినగోరుచున్నాను"
అని
కొంత
తడబడుచూ
అడుగుట
చూచి
సోదరులు
"ఇపుడీ
సందియమెందులకు?
అప్పటి
స్థితి
అపుడు
చూచుకొందము.
దానికి
కారణము
నిమిత్తము
కర్మ
జరుగక
తీరదు.
పుట్టినది
గిట్టకపోదు;
అన్నగారికి
ఆనందమధికమగుకొలదీ
విషయము
దారి
తప్పుచున్నది.
ఇంతటితో
చాలును.
ఆ
పై
దైవేచ్ఛ
యెటులనో
అటుల
జరుగగల"దని
వూరకుండిరి.
ధర్మజుడు
అంతటితో
వూరుకొనక,
తెలిసికొనవలెనను
కుతూహలము
తీవ్రమగుటచే
ఇట్టి
గుణశాలియొక్క
6
▾
Meaning
Keep
అంతిమగతి
చాలా
అద్భుతమైనదిగా
ఉండవచ్చునని
తలంచి
ప్రశ్నించగా,
బ్రాహ్మణులు
తిరిగి
కొన్ని
చక్రములు
వేసి
గుణించి
కొంత
ఆలోచనలో
మునిగిరి.
దీనిని
చూచి
ధర్మజుడు
ఆతురతతో
అడుగ
నారంభించెను.
అపుడు
దైవజ్ఞులు
"మహారాజా!
ఇతను
ఒక
ముని
శాపమువలన
రాజ్యము
త్యజించగలడు"
అని
తెలిపిరి.
ఆ
మాటతో
ధర్మజుడు
అదిరిపడి
"యేమీ!
ముని
శాపమా?
విరోధులే
లేరనియు,
సర్వుల
మన్ననలను
సంపాదించుననియూ,
దైవ,
దానవ,
మానవాదులు
సహితము
అతనిపై
మంచి
భావమును
కలిగియుందురనియు,
దేవ
బ్రాహ్మణ
భక్తులను
సేవించుననియు
తెలిపిరి.
అట్టి
సదాచార
సంపన్నుడు
ముని
శాపమునకెట్లు
గురికాగలడు?
అట్టి
తప్పు
తానేమి
చేయును?
ఆశ్చర్యముగ
నున్నదే!"
అని
యోచించెను.
అంత
బ్రాహ్మణులు
జ్యోతిష్క
గణితమును
పట్టి
అతనిని
పాము
కాటువేయగలదని
తేలుతున్నదని
తెలిపిరి.
ఆ
మాట
వినగానే
ధర్మజుడు
క్రుంగిపోయెను.
అంతకాలము
అనుభవించిన
ఆనందము
క్షణములో
సమసిపోయెను,
విచారము
పెరిగిపోయెను.
Previous
←
The Principle of the Avatāra
Next
The Voice of the Future
→