Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · "The Mahārāja Has Reached Gopāla"
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
42.
"మహారాజు
గోపాలుని
చేరెను"
కారాగారమున
వాసముచేయుచున్న
దేవకీ
వసుదేవులు
చూచుటకొక
పిచ్చివారెలవలే
మారిపోయిరి.
కురుల
సంస్కారము
కానీ,
కాయమునకు
తగిన
ఆహారము
కానీ
తీసుకొనక,
చేసుకొనక
నిరంతరం
పుత్రశోకముతోనే
మాడిపోవుచుండిరి.
రెండవ
సంవత్సరము
ప్రవేశించగనే,
దేవకీ
అష్టమ
గర్భము
ప్రారంభమాయెను.
అది
మహదాశ్చర్యము!
వాడిపోయిన
దేవకీ
వసుదేవుల
ముఖ
కమలములు
అప్పటికప్పుడు
విచ్చిన
కమలములవలె
తేజస్సుతో
నిండెను.
ఎండిన
మొద్దువలే
పట్టులుదీరిన
వారి
కాయము
బంగారు
వర్ణముగా
ప్రకాశించెను.
దేవకి
ఉన్నగది
నిరంతరము
సువాసనలతో,
ప్రకాశములతో,
నృత్యగీతములతో
కనిపించుచూ
వినిపించుచూ
వుండుట,
దేవకీ
వసుదేవులు
మాత్రమే
గమనించి
ఈ
విచిత్రమును
కంసునికి
తెలిపిన
మరింత
హింసించి
అసలు
గర్భమునే
ముక్కలు
చేయునేమో
అను
భయముతో
తమలో
తాము
అనుభవించుచూ
పుట్టబోవు
అష్టమ
పుత్రుని
భవిష్యత్తు
ఎట్టి
స్థితిని
అందుకొనునో
అను
ఊహలతో
కాలము
గడుపుచుండిరి.
ఇక
కంసుడు
తన
కాలము
అగుచున్నదని
తలంచి
దాని
నెట్లయిననూ
తప్పించుకొని
దేశమును
ఏకచ్ఛత్రాధిపతిగా
ఏలవలెనను
దురాశ
హృదయమున
అవతరించి,
దురాలోచనకు
దాసుడై,
తన
రాజ్యమున
గల
యదు,
వృష్టి,
భోజ,
అంధకులను
రాజులు
యాదవ
రాజాలలో
వున్న
వారలను
అన్యాయ,
అక్రమ
2
▾
Meaning
Keep
అనాచారములతో
జయించి,
ఆ
రాజ్యములను
నాలిగింటినీ
హస్తగతమొనర్చుకొని,
తన
స్వేచ్ఛా
పరిపాలనకు
అడ్డుతగులకుండుటకై
తన
స్వంతపు
తండ్రియైన
ఉగ్రసేనుని
కూడనూ
కారాగారమందుంచి
తన
యిష్టాను
సారము
పరిపాలన
జరుపుచుండెను"
అని
శుకులవారు
చెప్పుచుండ,
పరీక్షిత్
మహారాజు
ఆతురతతో
"ఏమీ!
కాలమాసన్న
మగుచున్నదని
తెలిసియూ,
అష్టమ
గర్భమున
హతమార్చువాడు
అభివృద్ధి
గాంచుచున్నాడను
ఆకాశవాణి
కర్ణములందు
ధ్వనించుచూ,
ఆకాశవాణి
అబద్ధము
కాదని
తెలిసియూ,
కంసుడింతటి
దురాశకు,
దుర్మార్గమునకు
కంకణము
కట్టెనా?
ఇది
మహా
విచిత్రముగా
నున్నది
స్వామీ!"
అని
ఆశ్చర్యపు
పలుకులు
పలికెను.
దేవాసురభావముల
తారతమ్యము
శుకమహర్షి
దానికి
ఫక్కున
నవ్వి
"మహారాజా!
అందరూ
మీవలే
కాలమాసన్నమయినదని
తెలిసి,
కాలస్వరూపుని
దర్శించ
పరితపింతురని
తలంచిరి
కాబోలు.
చేసిన
పుణ్యపాపములను
పురస్కరించుకొనే
ఇట్టి
భావములు
పుట్టుచుండును.
కాలమాసన్నమయినదని
తెలిసి
మీరు
చేయు
పనికినీ,
కాలమాసన్నమగు
చున్నదని
కంసుడు
చేయు
పనికినీ
ఎంత
వ్యత్యాసమో
మీరే
యోచించుడు.
వీటినే
దేవాసుర
భావములని
అందురు.
పుణ్య
కార్యములు,
మంచి
తలంపులూ,
దైవ
విశ్వాసములు,
భూతదయా,
పశ్చాత్తాపములు,
సత్యాహింస
ప్రేమలూ
అగు
దైవ
భావములు
కలవారలకు
అంత్యమున
దైవచింతనే,
పవిత్ర
కర్మనే
చిత్తమున
మొలకెత్తును.
అట్లుగాక,
స్వార్థ,
అహంకార,
దురాశ,
దుర్గుణ,
హింస,
అధర్మములు
కలవారలకు
కడకాలమున,
ఇట్టి
కఠిన
బుద్ధులు
పుట్టి
కడకు
అంతమొందుదురు.
వీటినే
ఒకటి
కైవల్య
ప్రాప్తి,
మరొకటి
నరక
ప్రాప్తి,
అని
అందురు.
కాయములను
ప్రాణములు
వీడుట
మన
కంటికి
కనిపించు
సమాన
కర్మ
అయినప్పటికినీ,
ప్రాప్తి
స్థానములు
అగోచరమైన
స్థితిలో
నుందును.
దానికి
అంత్యమున
ఉద్భవించు
చింతలే
ప్రత్యక్ష
ప్రమాణములు.
వినాశము
ఒకటి,
విష్ణు
సందర్శనము
మరొకటి.
అందుకనే
లోకులు
"వినాశకాలే
3
▾
Meaning
Keep
విపరీత
బుద్ధిః'
అని
అందురు.
వినాశ
స్థితి
నందుకొను
వారలకే
ఇట్టి
విపరీత
బుద్ధులు
పుట్టును.
విష్ణు
సందర్శన
మందుకొను
వారలకే
ఇట్టి
విజ్ఞాన
బుద్ధులు
పట్టుబడును,'
అని
శుకులు
పరీక్షిత్
మహారాజును
గురించి
హృదయపూర్వకమైన
పలుకులు
పలికెను.
పరీక్షిత్
మహారాజు
'స్వామీ!
ఇది
నా
ప్రాప్తి
కాదు.
మా
తాతలు,
తండ్రులు
చేసుకొన్న
మహద్భాగ్యమే
నన్నిట్టి
ఉత్తమ
గతికి
గొంపోవుచున్నది.
అన్నింటికీ
మీబోటి
జ్ఞాన
రత్నముల
ప్రకాశము,
కృష్ణమూర్తి
అనుగ్రహరసమే
నాలో
భక్తి
రసమును
పెంపొందించినది.
దీనికి
సంఘ
ఫలము
కూడా
కొంత
మేలు,
కీడు
చేయును.
నా
జీవితమునకు,
పుట్టుక
మొదలు
నేటివరకూ,
దైవ
కటాక్షమే
రక్షగా
నిలిచి
సంరక్షించెను.
సత్
పురుషుల
సంఘము,
ధర్మాత్ముల
స్నేహము,
పండితోత్తముల
పరిచయము,
పవిత్ర
తాతల
కీర్తులు
నన్నింతటి
మూర్తిగా
చేసెను.
బుద్ధిమంతులగు
మంత్రులు
కూడనూ
నాకు
కుడిభుజములుగా
ఉండి
పవిత్ర
ప్రజల
అభిమానమును
నేనింత
జుఱ్ఱుకో
గల్గితిని.
కానీ,
కేవలము
నా
ప్రయత్న
మొక్కటియే
కాదు.
విత్తనమెంత
ఉత్తమ
జాతిదైనను,
భూమి
సారవంతమైనది
కాకున్న,
ఉత్తమ
ఫలము
నందుకోలేము
కదా?
నా
రాజ్యమున,
నా
పూర్వీకులు,
బుషులు,
పండితులు,
మంత్రులు,
ప్రజలూ,
సరియైనవారు
కాకుండిన,
నాకెంతటి
ఉత్తమ
భావములుండిననూ,
భాండము
నిండుకూ
పవిత్రమైన
పాలుండిననూ
ఒక్క
చుక్క
పుల్లటి
మజ్జిగ
పడెనా,
పాలంతయు
గడ్డకట్టి
పోయినట్లు,
నా
ఉత్తమ
భావములు
చిత్తమునుండి
ఎగిరి
చుట్టూ
ఉండు
వారల
భావములే
నాలో
చేరి,
నేనునూ
కంసుని
వంటి
కఠిన
హృదయుడనై
యుండెడి
వాడను.
కాన
ఈ
పాప
కార్యములకు
ఆ
రాజ్యమందలి
పెద్దలు,
పండితులు,
ప్రజలు,
మంత్రులు
కొంత
దుర్గుణవంతులై,
దయాదాక్షిణ్య
రహితులై
యుందురనియే
తలంతును.
నా
ఊహాగానము
యొక్క
సత్యాసత్యములు
తామే
నిర్ణయించ
సమర్థులు'
అని
అంతటితో
'ఉన్న
ఈ
కొద్ది
కాలమును
పరుల
తప్పొప్పుల
నెంచుటలో
పాడు
చేయక,
పవిత్రము
చేయుట
మంచిది.
కనుక
నా
4
▾
Meaning
Keep
ప్రాణ
సమాన
గోపాలుని
జన్మ
గడియలు
ఎట్లు
సమీపించెనో
తెలుపు'మని
నమస్కరించి,
కన్నులు
మూసుకొని,
ఆలకించుటకు
ఆతురతతో
శుకుల
వచనములకు
వేచియుండెను.
బలరాముని
జన్మవృత్తాంతము
అంత
శుకులు
"మహారాజా!
యేడవ
గర్భమందున్న
పిండము
యెనిమిదవ
గర్భమయిన
గోపాలునకు
తోడుగా
ఉండుటకై,
'యోగమాయ',
అనగా
దైవశక్తి
ఆ
పిండమును
తీసికొనిపోయి
నందుని
మందలో
వున్న
వసుదేవుని
భార్యయయిన
రోహిణి
గర్భమందు
ప్రవేశింపజేసెను.
కనుక,
అది
రోహిణి
గర్భమునుండి
పుట్టి,
'బలరామ'
అను
నామముతో
దిన
దిన
ప్రవర్ధమానుడై
అతి
బలముతో
అందరినీ
రమింపజేసే
కాయముతో
మెరయు
చుండుటచే
గర్గుడు
అతనికి
బలరాముడనియూ,
దేవకి
గర్భము
నుండి
సంకర్షింపబడుటచేత,
అతనికే
సంకర్షణుడనియూ,
రెండు
పేర్లతో
పిలువబడుచుండెను.
ఇంతలో
దేవకికి
నవమాసములు
నిండె.
దేవకీ
వసుదేవులు
ప్రాణములు
చేతియందుంచుకొని,
యే
నిమిషమున
ప్రసవమగునో,
కంసుడు
ఏ
నిమిషమున
చంపునో
ఏమి
హింసించునో
అని
భయచిత్తులై
నిద్రాహారములు
లేక
ఒకే
చింతలో
కూర్చొనియుండిరి.
నవమాసములు
నిండినవని
తెలియగనే
కంసుడు
మరింత
భద్రమైన
యేర్పాట్లు
గావించి,
దేవకీ
వసుదేవుల
కాళ్ళకు
సంకెళ్ళు
వేయించి,
ద్వారములకు
మహా
భద్రమైన
తాళములు
తగిలించి,
చుట్టూ
పారావారలను
పటుత్వమైన
వారలను
నీమించి,
ప్రతి
ఐదు
నిమిషములకూ
లోనికి
వెళ్ళి,
దేవకీ
వసుదేవులను
చూచుచుండునట్లు
యేర్పాట్లు
గావించి,
తాను
కూడనూ
ఏమి
జరుగునో
అను
భయముతో
నిరంతరం
చింతించుచుండెను.
దైవ
మాయనెరుగనెవరితరము?
దైవ
సంకల్పమునకు
అడ్డు
ఒకటి
వుండునా?
సత్యమును
తెలిసికొనలేని,
దైవశక్తిని
గుర్తించలేని,
విశ్వసించలేని
మూర్ఖులకు
తమ
ప్రయత్నములు
తమను
రక్షించుననియూ,
జయింపచేయుననియూ
తలంతురే
కానీ,
దైవ
ఆజ్ఞలేక
యెట్టి
చిన్నదానినైననూ
సాధింపజాలరు.
అట్లని
దైవ
5
▾
Meaning
Keep
సంకల్పముండిన
అదే
అగుననని
మనమూరకుండ
కూడదు.
పురుషార్థము
కొంత
ప్రయత్న
పూర్వకము
కావలెను.
ఉన్న
శక్తి
యుక్తులను
ప్రయోగ
పెట్టి
దైవముపై
భారమువేసి
కార్యదీక్షకు
కంకణము
కట్టుకొనవలెను.
శ్రీమన్నారాయణ
దర్శనం
దైవానుగ్రహము
లేకున్న
అన్నియూ
ఫల
శూన్యమే
కాగలవు.
ఒకనాటి
రాత్రి
దేవకీ
వసుదేవులున్న
గదిలో
ప్రసవవేదన
పడుచున్న
దేవకి
దైవమును
స్మరించుచూ,
వత్తి
దీపమును
చూచుచూ
"ఇపుడు
నాకెవరు
దిక్కు?
నా
గతి
యేమి?"
అని
విలపించుచుండ,
ఉన్నట్లుండి
ఆ
వత్తి
దీపము
ఆరిపోయెను.
ఇంతలో
దివ్యకాంతిగల
ఒక
స్వరూపము
కంటికి
కనుపించెను.
ఇతనెవరా
అని
వసుదేవుని
పిలిచి
"కంసుడేమైననూ
ఏతెంచెనా?
ఈ
రాజ
పురుషుడెవరని"
దేవకి
కంగారుపడుచుండగనే,
శంఖ,
చక్ర,
గదాధారియై
అభయము
నిచ్చుచు
"దుఃఖించకుము,
నేను
నారాయణుడను.
మీ
బాధలు
తీర్పగోరి,
ఆనాటి
మీ
తపః
ఫలమునకు
ఇచ్చిన
వాగ్దానముచే
నేనే
మీ
గర్భమున
కొన్ని
నిమిషములలో
పుట్టబోవుచున్నాను.
నా
విషయమై
మీరే
మాత్రమూ
దుఃఖించక,
జరుగు
నాటకమును
చూచుచుండుడు.
నాకు
కీడు
చేయువాడు
ఈ
పదునాలుగు
భువనములందునూ
పుట్టడు,
పుట్టబోడు.
పుత్రవాత్సల్యముచే,
మాయగప్పిన
మనసుచే
తాత్కాలికంగా
కొంత
విచారము
కలిగిననూ
వెంటనే
విచిత్రమైన
అద్భుతమును
అనుభవింతురు.
నేను
పుట్టగనే
మీ
బంధములు
త్రెగిపోవును,
ద్వారములు
తెరువబడును.
ఎవ్వరికి
తెలియక
నన్ను
తీసికొనిపోయి
వ్రేపల్లెలోని
నందుని
యింట
యిదే
సమయమున
ప్రసవవేదన
పడుచున్న
యశోద
ప్రక్కన
వుంచి,
అందు
పుట్టిన
బాలికా
రూపమును
తెచ్చి
మీ
చెంత
పెట్టుకొని
కంసునకు
కబురంపుడు.
అంత
వరకూ
మధురయందుకానీ,
వ్రేపల్లెయందు
కానీ,
మిమ్ముల
నెవ్వరూ
చూడక,
పట్టక,
నే
చూచుకొందును
అని,
దివ్యకాంతులతో
దేవకీవసుదేవులను
ఆశీర్వదించి,
జ్యోతిరూపుడై
దేవకీ
గర్భమున
చేరెను.
చేరిన
కొన్ని
నిమిషములలోనే
ప్రసవమాయెను;
అది
అర్ధరాత్రి
మూడున్నర
గంట,
బ్రహ్మ
6
▾
Meaning
Keep
ముహూర్తము.
విష్ణుమాయ
అగుటచే,
అందరికీ
భరించలేని
నిద్రలు
ప్రవేశించి
ద్వారము
కాయువారూ,
చుట్టూ
పహారా
తిరిగేవారూ,
ఎక్కడి
వారక్కడే
పడి,
నిద్రించుచున్నారు.
వసుదేవుని
చేతులకు,
కాళ్ళకూ
వేసిన
మంచి
బలమైన
యినుప
గొలుసులు
పట్టుమని
తెగినవి.
ద్వారములు
తెరువబడినవి.
బయట
చూతమా;
ఆ
రాత్రి
వేళయినప్పటికీ
కోకిలలు
కూయుచున్నవి.
చిలుకలు
కిచకిచలాడుచున్నవి.
నక్షత్రములు
మినుకు
మినుకు
మని
నవ్వుకొనుచున్నవి.
వరుణుడు
పుష్పవర్షమును
కురిపించుచున్నాడా
అన్నట్లు
చిన్న
చిన్న
చినుకులు
పడుచున్నవి.
ఆ
చెరసాలచుట్టూ
రకరకములైన
పక్షులు
కిలకిలా
రావములు
జరుపుచున్నవి.
ఇదంతా
దైవమాయ
అని
తలంచి,
ఆ
పుట్టిన
బిడ్డను
చూడగ
వసుదేవుడు
భ్రమించుచున్నానా?
నిజమా?
అన్నట్లు
స్తంభించిపోయినాడు.
కృష్ణ
జన్మ
కథ
విన్న
పరీక్షిత్తు
పాముకాటుతో
మరణించుట
"మహారాజా!
పుట్టిన
బిడ్డకు
చుట్టూ
ప్రకాశము
మెరయు
చుండెను.
అమ్మ
నాన్నలను
చూచి
ఫక్కున
నవ్వి,
యేదో
చెప్పబోవుచున్నట్లు
తెలియుచున్నది.
యేమన
"ఇక
ఆలస్యము
చేయక
నన్ను
వ్రేపల్లెకు
గొంపొండు!"
అను
శబ్దము
వినగనే
వసుదేవుడు
ఆలస్యము
చేయక
ఒక
వెదురు
తట్టలో
తన
పాత
పంచను
పరచి,
దేవకీ
దేవి
చీరపైట
చించి
పైన
కప్పి,
తలపై
పెట్టుకొని
వెళ్ళుచుండ,
చిన్న
చిన్న
చినుకులు
పడుచుండ,
ఇంతలో
వసుదేవుడు,
'అయ్యో!
ఈ
గాలివానకు
బిడ్డ
తడువవలసి
వచ్చెనే'
అని
చింతించి
వెనుక
చూడ,
ఆదిశేషులు
తన
పడగను
బాలునిపై
అడ్డుపెట్టి
వసుదేవుడు
నడచినట్లంతా
తానునూ
ప్రాకుచూ
వెళ్ళుచుండెను.
దారి
పొడవునా,
అన్నియూ
శుభ
సూచనలే.
కొలనులో
సూర్య
కిరణములు
రాకపోయిననూ
కమలములు
వికసించి
వసుదేవునివైపు
వూగుచున్నవి.
ఆనాడు
చంద్రుడు
లేని
రాత్రి
అయిననూ
కృష్ణమూర్తిని
చూడవలెనను
ఆపేక్ష
కాబోలు!
ఆకసమున
చంద్రుడు
పూర్ణుడై
చల్లని
కిరణములతో
మేఘముల
మధ్యనుండి
తట్టనున్న
బిడ్డను
చూచుచున్నట్లు
వెన్నెల
ఆ
తట్టపై
మాత్రమే
పడుచుండెను.
ఇట్టి
విచిత్ర
శుభ
సూచనలో
జన్మమొందిన
బిడ్డను
7
▾
Meaning
Keep
నందుని
ఇంట
విడిచి,
అక్కడ,
అప్పుడే
పుట్టిన
ఆడబిడ్డను
తెచ్చి
దేవకి
చేతికిచ్చెనో
లేదో
కెవ్వున
ఏడ్వసాగెను"
అని
చెప్పుచుండగనే
పరీక్షిత్
మహారాజు
"కృష్ణా!
కృష్ణా!"
అని
గట్టిగ
అరవ
జొచ్చెను.
'ఏమి'
అని
అందరూ
చెంతచేర,
ఒక
నాగము
కుడికాలు
బొటనవ్రేలుపై
కాటువేసి
సరసర
పరుగిడుచుండెను.
అది
గాంచి
మహారాజున
కివి
అంత్యగడియలని
తలంచి,
అందరూ
కృష్ణా!
ద్వారకావాసా!
బృందావనవిహారీ!
అని
అంటూ
అందరూ
ఒకే
స్మరణలు
చేయజొచ్చిరి.
"కృష్ణా!
కృష్ణా!
కృష్ణా!"
అని
మహారాజు
నేలవ్రాలెను.
పండితులు
వేదములు
చదివిరి.
భక్తులు
భజనలు
చేసిరి.
బుషులు
జప,
ధ్యానములు
మొదలుపెట్టిరి.
శుకుడు
ఆనంద
బాష్పములు
రాల్చుచు
"మహారాజు
గోపాలుని
చేరెను"
అని
చేరిన
వారలకు
తెలిపి,
ముందు
కార్యక్రమములు
కొనసాగించమని
తెలిపి,
శుకుడు
ఎవరికీ
కనిపించక
వెడలి
పోయెను.
వేదమను
వృక్షమునుండి
భాగవతమను
ఫలమును
త్రుంచి
ప్రజలకందించిన
చిలుకయే
ఆ
శుకుడు.
అందించిన
ఈ
ఫలమును
ఆరగించి,
జీర్ణించుకొని,
ఆత్మానందము
నందుదురు
గాక!
ఆ
నందనందనుని
పొందుదురు
గాక!
Previous
←
The Account of Śrī Kṛṣṇa's Birth