Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Account of Śrī Kṛṣṇa's Birth
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
41.
శ్రీకృష్ణుని
జన్మ
వృత్తాంతము
మనోలయమొనర్చిన
మహారాజు
మాధవుని
జన్మఘట్టమును
వినగోరి,
చేతులు
జోడించుకొని
"స్వామీ!
కాయమునకు
కాలమాసన్నమయినది.
మహాబుషి
శాపఘడియలు
కూడనూ
పరుగిడివచ్చుచున్నవి.
అందుకు
నేను
కూడనూ
సర్వసిద్ధముగా
సంతోషముగా
యున్నవాడను.
అయితే
కాయమున
జీవుడున్నంత
కాలము
సత్
చింతన,
సత్
స్మరణ,
సత్
శ్రవణము
గావించవలెనను
దీక్ష
పూనుటచే,
దీక్షకెట్టి
భంగమూ
కలుగకుండటకై
ఈ
శేషకాలము
కూడనూ
ఆ
నంద
నందనుని
సుందరవదనారవిందము
హృదయమున
చిందులు
ద్రొక్క
తన
లీలారూపములు
మనసున
నింప
ఆశించుచున్నాను.
గోపాలుని
జన్మ
శుభసమయము
ఎట్టిదో,
జన్మ
కాలమున
ఎట్టి
చిత్రవిచిత్ర
శుభములు,
మంగళములు
లోకమున
కనుపించెనో,
కంసునకు
ఆ
బాలుని
చంపవలెనను
క్రోధము
ఎందువలన
దినదినాభివృద్ధి
గాంచెనో,
ఆ
కంసుని
జన్మవృత్తాంతము,
గోపాలుని
జన్మవృత్తాంతము
నా
అంత్య
సమయమున
వినిపించి,
నా
ప్రాణమును
గోపాలునిలో
అంతమొనరించుము"
అని
ప్రార్థించెను.
శుకుడు
మరింత
ఆనందహృదయుడై
"మహారాజా!
నీవు
కోరినటుల
ఈ
మిగిలిన
కొద్దికాలమునూ,
గోపాలుని
లీలాశ్రవణముతోనే
గడుపుట
నాకునూ
అత్యంతానందము.
గోపాలుని
జన్మము
ధర్మస్థాపన
నిమిత్తము.
అది
మహామర్మము.
కర్మ
పరిపక్వమయిన
వారలకే
ఆ
జన్మరహస్యము
2
▾
Meaning
Keep
గ్రాహ్యమగును.
కానీ,
వారలకు
లోకమే
ఒక
పాపకూపము.
అందులోనే
మునిగి
అందులోనే
తేలి
అందులోనే
లయమందుదురు.
అట్టివారి
చింత
మన
కవసరములేదు.
తరింపగోరువారలము
తగిన
పరప్రసాదముల
నందుకొందము.
దేవకీ
వసుదేవుల
వివాహము
మహారాజా!
పూర్వము
ఆహుకుడను
రాజు
యదువంశమున
లోకమును
పాలించుచుండెను.
అనేకమంది
సామంతరాజులు
అతనికి
లొంగి,
అతనిని
అనుసరించుచూ,
అడుగులకు
మడుగులొత్తుచూ
అతని
పరిపాలనలో
కాలము
గడుపుచుండిరి.
అతనికి
దేవకుడు,
ఉగ్రసేనుడు
అను
ఇరువురు
కొమరులు
కలిగిరి.
వారు
పెరిగి
పెద్దయి,
రాజ్యాధిపత్యములు
చూచుకొను
వయసు
రాగా,
వారలకు
పెండ్లి
చేసి
తగిన
బాధ్యతలను
తలపై
పెట్టెను.
తదుపరి
ఈ
రీతిగా
రాజ్యపాలన
జరుగుచూ,
యేండ్లు
గడచిపోయెను.
దేవకునకు
ఏడుగురు
ఆడబిడ్డలును,
ఉగ్రసేనునకు
తొమ్మండుగురు
కొమారులునూ
కలిగిరి.
దేవకుని
పెద్ద
కూతురే
దేవకి.
ఉగ్రసేనుని
పెద్ద
కొమారుడే
కంసుడు.
ఈ
ఇరువురూ
మన
చరిత్రకు
ప్రధాన
వ్యక్తులు.
పూర్వము
యాదవరాజుల
కందరికీ
మధురాపట్టణమే
రాజధానిగా
నుండెడిది.
శూరసేన
దేశాలను
పాలించుచున్న
…
రాజు
కూడనూ
మధురాపురముననే
తన
నివాసమేర్పరచుకొని
యుండెను.
అతనికి
పదుగురు
కొమారులును,
ఏడుమంది
కుమార్తెలును
కలిగిరి.
అందులో
పెద్ద
కొమారుడే
వసుదేవుడు.
పెద్ద
కుమార్తెయే
కుంతి.
ఈ
రీతిగా
వారి
కుటుంబమట్లు
దిన
దినాభివృద్ధి
నొందుచూ
కొమార్తెలు,
కొమారులు
పెరిగి
పెద్దవారగుచూ
వచ్చిరి.
కాలవేగము
అతి
తీవ్రముగా
చుట్టుకొనివచ్చి
కార్యరూపమున
కారణములను
కట్టివేసెను.
కంసుని
పినతండ్రి
అయిన
దేవకుని
కూతురైన
దేవకిని,
శూరదేశరాజు
కొమారుడైన
వసుదేవునకు
యిచ్చి
వివాహమొనర్ప
సర్వసన్నాహములు
గావించిరి.
వివాహము
అత్యంత
వైభవముగా
జరిపిరి.
3
▾
Meaning
Keep
రాజులు,
రారాజులు,
సామంతరాజులు,
సర్వాధికారులూ,
పండితోత్తములూ
అందరూ
క్రిక్కిరిసి
పోయిరి.
అన్నింటియందు
కంసుడు
అతిశ్రద్ధవహించి,
తనకు
స్వంతము
అక్కచెల్లెంద్రు
లేకపోవుటచే,
పినతండ్రి
బిడ్డయగు
దేవకినే
తన
స్వంతపు
సోదరివలే
భావించి,
ఆమెకు
కావలసిన
సర్వసామగ్రి,
సమస్త
ఆభరణములూ
తానే
స్వయముగా
గావించి,
కల్యాణము
కన్నుల
పండువుగా
జరిపించెను.
మూడవనాడు
సారెలుపెట్టి
అత్తవారింటి
కంపుటలో
తానే
రథసారధిగా
నిలిచి,
చెల్లెలినీ
బావగారినీ
రథములో
ఎక్కించుకొని
పుర
వీధులలో
ఊరేగించుచూ
మహా
వైభవముగా
తరలిపోవుచుండ,
ఆకాశమున
మెరుపు
తీగవలే
ఒక
ప్రకాశము
కన్నులకు
మిరుమిట్లు
గొలిపెను.
ఇంతలో
పెద్ద
ప్రళయ
శబ్దము
వచ్చెను.
ఈ
ప్రకాశ,
ప్రళయ
శబ్దమును
చూచి,
వినిన
ప్రజలు,
రాజులు
ఎక్కడివారక్కడ
స్తంభించిపోయిరి.
వాయిద్యములు
నిశబ్దమాయెను.
పురవీధి
అంతయూ
ప్రశాంతముగానున్న
సమయమున
ఆకసమునుండి
కొన్ని
స్పష్టమైన
పదములు
వెలువడెను.
కంసుని
ఆకాశవాణి
హెచ్చరించుట
అవియేవన,
"ఓ
కంసభూపాలా!
ముందు
సంగతి
తెలియని
మూర్ఖుడవైతివి.
ప్రాణసమానముగా
యే
చెల్లెలిని
ప్రేమించి
రథమున
నిడుకొని
అత్యంత
వైభవముగా
రథమును
నడుపుచున్నావో,
ఆ
చెల్లెలి
అష్టమ
గర్భమందే
నిన్ను
హతమార్చువాడు
పుట్టబోవుచున్నాడు.
ముందు
సంగతి
యోచించు"
మని
ప్రకాశవంతమైన
ఒక
దివ్యరూపము
కనుపించి
అంతర్ధాన
మాయెను.
ఆ
మాటలు
విన్న
రాజులు,
ప్రజలు
భయభ్రాంతులకు
లోనై,
ఉన్న
ఉల్లాసము,
వైభవము
ఒక్క
మారుగా
మటు
మాయమాయెను.
రథమందున్న
కంసునకి
కడుపులో
నిప్పులు
రేగెను.
తడబడుచూ
తోచక
కరములు
గుఱ్ఱముల
పగ్గములు
వీడెను.
హృదయము
రౌద్రముచే
నిండెను.
ఆలోచనలు
అత్యంత
వేగముగ
వికార
స్వరూపమును
ధరించెను.
4
▾
Meaning
Keep
కడకు
ఒక
నిర్ణయమునకు
వచ్చి,
చెల్లెలున్న
కదా
ఆమె
గర్భమున
నన్ను
చంపువాడు
పుట్టుట,
ఆమెనే
లేకుండగ
చేసిన,
ఆ
హంతకుడు
జన్మించడు
కదా!
అని
తలంచి,
వెనుకన
కూర్చొన్న
చెల్లెలి
కురులు
పట్టి
ముందుకు
లాగి
ఖడ్గము
తీసెను.
ఈ
ఘోర
దృశ్యమును
చూచుటకు
ఎట్టి
వారికిని
మనసొప్పలేదు.
ప్రాణసమముగ
ప్రేమించి,
అన్ని
వైభవములు
తన
చేతులారనే
చేసి,
చంప
ప్రయత్నించుట
విరుద్ధముగనూ,
విచిత్రముగనూ,
ఘోరముగనూ
కనిపించెను.
ఎవ్వరేమియూ
చేయజాలరైరి.
ఇంతలో
దేవకీ
నాథుడైన
వసుదేవుడు
బావ
చేతులు
పట్టుకొని,
"బావా!
ఆకాశవాణి
పలికిన
పలుకు
నేను
కూడనూ
వింటిని
కదా!
నీ
కీడు
మాకు
మాత్రము
ఇష్టమా?
నిరంతరం
నీ
క్షేమము
నాశించు
మేము
నీ
కీడు
నేనాటికినీ
కోరము.
ఈ
మంగళములో
అమంగళమును
జరుప
నీబోటి
సోదరులకు
న్యాయము
కాదు.
మీ
చెల్లెలిని
వదలుము.
పుట్టబోవు
వాని
వలన
నీకిట్టి
ప్రమాదము
కలుగునని
ఆకాశవాణి
మాటలపై
నీకంత
విశ్వాసమున్న
పుట్టిన
ప్రతి
బిడ్డనూ
నీకప్ప
జెప్పుదును.
ఇది
నా
ప్రమాణము.
ఇంత
మాత్రమునకు
నిందు
ప్రాణమును
ఇట్లుచేయుట
నీకునూ
నీ
రాజ్యమునకునూ
క్షేమము
కాదని
ప్రార్థించెను.
కంసుని
దురాగతము
ఇందులో
కొంత
సత్యముందుటచే
తృప్తినొంది,
దేవకిని
వదలి,
"బావా!
నీ
మాటను
నీవు
దక్కించుకొనుట
చూచుకొమ్మ"ని,
ఆ
రథమున
తన
సోదరుని
నీమించి
తాను
వెనుకకు
మరలిపోయెను.
మరలిపోయెనే
గానీ,
ఒక
వైపున
తన
ప్రాణభయము,
మరొక
వైపున
సోదరి
ప్రేమ,
దేనిని
వదలుటకూ
వీలులేక
హంస
తూలికా
పాన్పుపై
పరుండినాడేకానీ
చంద్రనిప్పులో
పరుండినట్లున్నది.
ఆహార
నిద్రలు
అంతకంతకు
తగ్గిపోయినవి.
నిరంతరము
చావుచింతనలో
మునిగినాడు
కంసుడు.
ఈ
రీతిగా
ఒక
సంవత్సరము
గడచెను
బావ,
బావమరుదులకు
ఉత్తర
ప్రత్యుత్తరములు
జరుగుచునే
యున్నవి.
కడకు
దేవకికి
నవమాసములునిండి,
5
▾
Meaning
Keep
కొమరుని
కనెను.
ఇచ్చిన
మాటతో
కదా
నీ
ప్రాణమును
నేను
దక్కించుకొంటినని
దేవకీదేవికి
నచ్చచెప్పి,
చెప్పిన
మాట
ప్రకారము
ఆ
పసిగందును
పురిటిబట్టలో
చుట్టితెచ్చి
కంసున
కప్పజెప్పెను.
అంత
కంసభూపాలుడు
ఆ
పసికందును
చంప
మనసొప్పక,
ఇచ్చిన
మాట
ప్రకారము
మాట
దక్కించుకొనెనని
కంసుడు
వసుదేవుని
సత్యవ్రతమునకు
సంతసించి
"బావా!
ఈ
బిడ్డవలన
నాకెట్టి
కీడునూ
లేదు.
ఆకాశవాణి
అష్టమ
గర్భమని
తెలిపినది
కాన
ఈ
బిడ్డను
నీవే
గొనిపొమ్ము',
అని
మరలా
అతనికే
యిచ్చివేసెను.
అందులకు
వసుదేవుడు
కొంత
సంతసించి,
తిరిగి
ఆ
బిడ్డను
దేవకీదేవికి
అప్పజెప్పి
ఆ
ప్రథమ
పుత్రుని
దక్కించుకొంటిని
కదా
అని
దైవమును
అనేకరీతుల
ప్రార్థించి
చెప్పలేనంతటి
ఆనందము
ననుభవించుచుండెను.
ఇంతలో
రెండవ
గర్భము
ప్రారంభమాయెను.
వారలకు
బిడ్డలు
కావలెనను
ఆశ
ఒక
దిక్కు
ఉండినను,
పుట్టిన
బిడ్డ
దక్కునో
లేదో
అనుభూతి
మరొక
దిక్కు
వారలను
బాధించుచుండెను.
యింతలో
త్రిలోక
సంచారియగు
నారదుడు
తిరిగి
తిరిగి
కంసుని
కడకేతెంచి,
క్షేమ
వార్తలు,
రాజ్యపు
స్థితిగతులు
విచారించుచూ
మాటల
సందర్భమున
మీ
యాదవులందరూ
దేవతలనియూ,
కంసుడు
అందులో
కాలనేమి
అంశవలన
పుట్టెననియు,
ఈ
యాదవులందరికీ
దేవకీదేవి
అష్టమ
గర్భమున
పుట్టబోవు
కొడుకుచే
ముసలము
కలుగుననియు,
ఆ
బాలకుని
చేతనే
కంసుడు
కూడనూ
మరణించుననియూ
మందుకట్టెపై
తైలము
పోసినట్లు
మరింత
క్రోధమును
రగుల్గొల్పెను.
అంతటితో
ఊరుకొనక,
తాను
కంసునిచే
శెలవు
తీసుకొని
వెళ్ళుచూ,
'కంసా!
దినము
గడుపుట
యుగముగా
భావించు.
మరణ
మేనాడో
అని
అలక్ష్యము
చేయకు'
అని
హెచ్చరించుటచే,
కంసుని
మనసు
కంగారయి,
పుట్టిన
పిల్లలలో
కూడనూ
నన్ను
చంపువారుండురో
యేమో
అని
వసుదేవునకు
కబురంపగా
వసుదేవుడు
ఏమి
ప్రమాదము
జరుగునో
అని
వణుకుచూ
కంసుని
సమీపించ,
కంసుడు
మహాఉగ్రుడై
కండ్లెఱ్ఱజేసి,
గర్జించుచూ
ఇప్పటికెంత
మంది
పిల్లలు
గలరని
ప్రశ్నించ,
చెప్పుటకు
నోరాడక,
చెప్పిన
6
▾
Meaning
Keep
యేమగునో
అను
దుఃఖము
లోన
అడ్డుపెట్టుచూ,
పెదవులు
అదురుచుండ,
ఇప్పటికి
ఆరుగురు
బిడ్డలని
చెప్పలేక
చెప్పెను.
సరి
అటులయిన
రేపటి
తెల్లవారగనే
ఆ
ఆరుమంది
బిడ్డలను
నాకప్పజెప్పవలెనని
ఆజ్ఞవేసెను.
మారు
మాటాడక,
ఇచ్చిన
మాటను
మీరలేక,
పితృప్రేమను
మరువలేక
తూలుచూ,
వూగుచూ,
దేవకీదేవిని
చేరి
ఆమెకీ
వార్త
తెలుపగా
ఆమె
ఆ
ఆరుమంది
బిడ్డలను
ఒడిలో
వుంచుకొని
యెంత
బాధపడెనో
అది
వర్ణనాతీతము.
ఊహాతీతము.
మహారాజు
ఒక
ప్రాణము
నిమిత్తము
ఇందరి
నిరపరాధుల
ప్రాణములు
తీయుట
యెంత
పాతకమో;
అని
యోచించవచ్చును.
కానీ
భగవత్
లీలలు
అర్థములు
కావు.
బాహ్యముగ
పసిబిడ్డల
ప్రాణములు
తీసెనని
భావించవచ్చు.
అంతరార్థమున
వారి
శాపము,
పాపము
పండి,
ఉత్తమ
జన్మలు
రావచ్చు.
వారి
పూర్వజన్మ
రహస్యమేమిటో,
పుట్టబోవు
జన్మల
పవిత్రమేమిటో,
మధ్యనున్న
వాటిని,
కంటికి
కనిపించు
వాటినే
చూచి
లోకులు
విచారింతురు.
లోకేశుడు
అట్లు
కాదు
కదా!
త్రికాల,
త్రిలోక,
త్రిగుణములందూ
యోచించి,
ఆశించును.
మనకన్ననూ
మాధవునికే
దయ
అధికమని
భావించు.
మనమేలు
మనకంటే
మాధవునికే
బాగుగా
తెలియును.
కాన
సర్వము
భగవదేచ్ఛ
అనుకొని
నిశ్చింతగా,
దైవచింతన
చేయుట
ఉత్తమోత్తమము.
మహారాజా!
రెండవ
దినము
సూర్యోదయము
కాగానే,
ఆరుమంది
బిడ్డలను
విడువలేక,
విడువలేక
పరిచారకులను
వెంటబెట్టుకొని,
కన్నులు
మూసుకొని
వసుదేవుడు
కంసున
కప్పజెప్పి
ఘోడున
యేడ్వసాగెను.
స్వార్థ
పరుడగు
కంసుడు
నిర్దాక్షిణ్యముగా
ఆ
పసిగందుల
కాళ్ళుపట్టి
నేలకు
కొట్టెను.
ఒక్కొక్క
వేటుతో
బిడ్డల
రూపుమాపెను.
చేయునది
లేక
వసుదేవుడు
భారమైన
హృదయముతో
తన
విధిని
నిందించుకొని,
యే
పాప
ఫలమో
అని
తలంచి,
ఇల్లుచేరి
దేవకీ
వసుదేవులు,
పుత్ర
శోకముతో
క్షణ
క్షణమునకూ
సమసిపోదొడగిరి.
వారల
జీవితములే
వారలకు
భారములాయెను.
దైవేచ్ఛ.
ఆయువున్నంతవరకూ
బ్రతుకు
తప్పదు,
అని
మొండిజీవులై
కంటిధారలతో
వారి
7
▾
Meaning
Keep
కాయములు
కరిగించుకొనుచుండిరి.
ఇంతలో
ఏడవ
గర్భము
ప్రారంభమాయెను.
అది
మరింత
ఆశ్చర్యము!
యేడు
మాసములయినదే,
అంతర్ధానమాయెను.
గర్భ
స్రావమాయెను.
కంసున
కేమని
చెప్పుట!
వారికేమి
తోచలేదు.
ఎట్లో
ఈ
వార్త
కంసునకు
తెలుపగా
బావాచెల్లెలేమో
మోసము
చేసిరని
అనుమానముతో
ఆనాటినుండీ
వారలను
అతి
భద్రమైన
కావలా
వారలతో
చెరసాలయందు
ఉంచెను.
బిడ్డల
శోకముతో
కుములుచున్న
వసుదేవదేవకీలకు
కారాగారము
కూడనూ
ఒక
బాధగా
మారెను."
Previous
←
"Mṛtyor Mā Amṛtaṃ Gamaya" — "Lead Me from Death to Immortality"
Next
"The Mahārāja Has Reached Gopāla"
→