Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · The Power of Dhyāna, and the Experience of It
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
1.
ధ్యాన
ప్రభావము,
దాని
అనుభూతి
విషయములకు
ప్రాధాన్యమిచ్చుట
విషమునకు
ప్రాధాన్యమిచ్చుటే
మానవుడు
లేచినది
మొదలు
నిద్రించునంతవరకు
(పుట్టినది
మొదలు
చచ్చు
వరకు)
ఏదో
ఒక
కర్మను
ఆచరించుచునే
యుండవలెను.
దానిని
చేయక
ఊరకుండుటకు
వీలులేదు.
ఎట్టివాడయినను
దీనికి
గురికావలసినదే.
అయితే
ఇట్టి
కర్మలలో
ఎట్టి
కర్మ
చేయుదురను
విషయమును
ప్రతియొక్కరు
గుర్తెఱుగవలెను.
ఉన్నవి
రెండు
మార్గములు.
1.
విషయ
కర్మ,
2.
శ్రేయో
కర్మ.
కాని
లోకమున
విషయ
కర్మలు
విపరీతములై
అవే
విషమ
పరిస్థితికి
గొంపోవుచున్నవి.
వాటిమూలమున
కలుగు
సుఖశాంతులు
అత్యల్పములు.
2
▾
Meaning
Keep
శ్రేయో
కర్మ
-
ఇది
ప్రతి
ప్రవర్తనయందును
శ్రేయస్సును
(మంగళమును)
ఇచ్చుచున్నది.
ఇది
కేవలము
ఆత్మానంద
మార్గమునందు
తప్ప
బాహ్యానందమునందు
కాలిడదు.
ఆచరించునది
బాహ్యమునందయినప్పటికిని,
అంతర్ముఖమునకు
ఆకర్షించును.
అదే
సత్య
మార్గము.
3
▾
Meaning
Keep
బాహ్య
విషయములందు
కర్మ
నాచరించుటే
విషయ
కర్మ.
దానిలో
తత్ఫలితము
కోరి
చేయుదురు.
తత్ఫలితమును
కోరుటచే
మమకార,
అహంకారములకు,
కామినీ
దయ్యములకు
గురియగుదురు.
వీటి
మార్గమున
పోయిన
యజ్ఞగుండమున
పడిన
నెయ్యివలె
భగ్గున
మండును.
విషయములకు
ప్రాధాన్యమిచ్చుట,
విషమునకు
ప్రాధాన్యమిచ్చుటే
గాన,
ఆ
విషయమున,
కర్మమున
తత్ఫలితమును
కోరకుండిన,
మమకార,
అహంకార,
కామినీ
గ్రహముల
జయించుటయే
కాక,
అట్టివాటికి
దూరమగుదురు.
వాటి
బాధలే
మానవునిలో
చేరవు.
అట్టి
పవిత్ర,
నిర్మల,
నిస్స్వార్థ,
నిశ్చయ
మార్గమైన
కర్మయే
శ్రేయో
కర్మ.
దాని
గుర్తులే
గీతయందు
దెల్పిన
నిష్కామ
కర్మ
మార్గమునకు
నిండు
ప్రాధాన్యము
చూపుట.
అట్టి
సాధనాంశములే
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలు.
ఆ
మార్గములతో
పాటు
భగవన్నామ
చింతనను
సాధన
యందు
చేర్చుకున్న,
అంత
కంటే
జీవికి
వేరు
సుఖసంతోషములు
ఎక్కడున్నవి?
అదియే
చాలును.
4
▾
Meaning
Keep
ఇట్టి
పవిత్ర
మార్గమును
ప్రతి
మానవుడు
ఆచరించుచుండిన
తనకేది
యవసరమో,
ఏది
అర్హమో,
ఏది
శాంతియో
వాటిని
పరమాత్ముడే
ప్రసాదించుచు
వచ్చును.
తత్ఫలితమును
కోరక
సర్వమును
సర్వేశ్వరునకు
అర్పించుట
అమిత
సుఖము.
అతి
సులభము.
అసత్యము
పలుకవలెనన్నను,
అధర్మమున
ప్రవర్తించవలెనన్నను
అతి
కష్టము.
కాని
సత్యమును
పలుకుట,
ధర్మమున
నడచుట
చాల
సులభము.
ఉన్నది
చెప్పుట
ఉల్లాసమే
కాక,
యోచన
కూడ
యుండదు.
లేనిది
తెలుపవలెనన్న
లేని
వాటిని
యోచించవలెను.
అది
భయభ్రాంతులతో
చేరి
అశాంతి
ఆవరణమున
నిలిచి
అవస్థలు
పడుచుండును.
కాన
అశాంతిని
ప్రసాదించు
ఇన్ని
విషయ
కర్మలను
ఆచరించుటకన్నను
సత్యమైన,
నిత్యమైన,
పవిత్రమైన,
శ్రేయో
మార్గమును,
ఆత్మానంద
మార్గము
నాచరించండి.
అందులో
ఉత్తమ
మార్గమే
ధ్యానము.
5
▾
Meaning
Keep
ఆ
ధ్యానము
నేరీతిగా
చేయటయనియు,
ఎందుకు
చేయవలెననియు
ఇప్పటి
నవీన
వ్యక్తులు
తర్కించుచుందురు.
అయితే
వారికి
రుచి
కాని,
శుచి
కాని
తెలియదు.
కనుకనే
తర్కమునకు,
పరిహాసములకు
చోటిచ్చుచుందురు.
కాన
అట్టి
వారికి
తెలుపుటయే
ఇప్పటి
నా
సంకల్పము.
కాన
తెలుపుచున్నాను.
6
▾
Meaning
Keep
మనోబుద్ధులను
అంతఃకరణముతో
సంధించి
పరమాత్మ
వైపు
నడిపించుటయే
ధ్యానము
చూడు!
లోకమున
ప్రతివ్యక్తి
కూడ
బాహ్యమున
ఒక
రీతిగను,
అంతరమున
మరొక
రీతిగను
తలంచి
ప్రవర్తించు
గుణము
కలిగియుండుట
అందరికీ
తెలిసిన
విషయమే
కదా!
అయితే
సాధారణ
మానవులు
వాటినంతగా
వ్యత్యాస
భావమున
ప్రకటించరు.
ఎవరైనను
వారి
కుటుంబమునందు
అనేక
ప్రతిపక్షములుండిన
తనకు
లభించిన
సుఖమును
సహితము
నెట్లు
కోల్పోవుచున్నాడో,
అదే
విధముగా
శరీర
సంబంధమైన
ప్రతిపక్షములనేకముగా
వెంటాడుచుండిన
ఆంతరిక
సంబంధమైన
ఆనందమును
కోల్పోవుచున్నాడు.
7
▾
Meaning
Keep
ఇందుకు
ఒక
ఉదాహరణము.
ఒక
బండియున్నది.
అది
తనంతట
తానే
కదలలేదు
కదా!
దానికి
రెండు
ఎడ్లు
కట్టినప్పుడే
అది
కదలగలదు.
ఆ
ఎడ్లకు
అప్పుడప్పుడు
బండిని
లాగు
అభ్యాసము,
ఆయా
రోడ్లలో
ప్రయాణము
చేయు
నభ్యాసముండియుండిన
ఆ
బండి
తగు
జాగ్రత్తతో
ప్రయాణము
చేయును.
అట్లుగాక,
బండిలాగుటే
తెలియక,
తాను
ప్రయాణము
జరుపవలసిన
మార్గములో
నడువక,
ఇల్లు
వదిలి
బయటికి
పోక,
గాటి
చుట్టు
తిరుగుచు
గంజు
కంపులలో
తిరుగుచున్న
ఎడ్లను
బండికి
కట్టిన,
ప్రయాణము
సాగకుండుటయే
గాక
బండికి
అపాయము
సంభవించును.
అట్లే
అంతఃకరణములు
తమంతట
తాము
కదలలేవు.
వాటికి
బాహ్యసంబంధమైన
ఎడ్లు
కట్టినప్పుడు
అవి
దానిననుసరించి
నడచును.
8
▾
Meaning
Keep
అంతఃకరణమను
బండికి
బాహ్యసంబంధమైన
బుద్ధి,
మనస్సులను
ఎడ్లను
కట్టినప్పుడే
అది
కదలగలదు.
దానికి
మునుపు
బుద్ధి,
మనస్సులను
ఎద్దులకు
అంతఃకరణములు
పోగోరునట్టి
గ్రామములకు
దారి
తెలిసియుండవలెను.
వాటికి
ఆ
అభ్యాసము
నేర్పియుండవలెను.
అప్పుడు
ప్రయాణము
సునాయాసముగా,
సురక్షితముగా
చేయగలదు.
అట్లుగాక
ఆ
బుద్ధి
మనస్సులను
ఎద్దులకు
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ
అనే
రోడ్లే
తెలియకున్న,
ఎప్పుడు
కూడ
ఆ
మార్గములో
ప్రయాణము
చేయకున్న
అంతఃకరణమను
బండికే
హాని
కలుగును.
ఎంత
కాలము
ప్రయాణము
చేసినా
అవి
ముందు
రోడ్డును
త్రొక్కక
అభ్యాసమైన
అశాంతి,
అన్యాయ,
అక్రమ,
అనాచార,
అసత్యమను
అభ్యాసమైన
బాహ్యపు
దొడ్డి
వాకిటికే
పరుగిడును.
ఇంక
ప్రయాణమెప్పుడు?
స్థలమును(గమ్యమును)
చేరుటెప్పుడు?
9
▾
Meaning
Keep
కావున
మొదట
బుద్ధి,
మనస్సను
ఎడ్లకు
రోడ్లపై
నడుచుట,
బండి
లాగుటలను
విద్యలను
నేర్పటమే
జపధ్యానములని
యందురు.
అట్టి
ధ్యాన,
జపములనే
విద్యలను
నేర్వక
ఆ
మార్గమున
ప్రయాణము
చేయనొల్లని
బుద్ధి,
మనస్సులను
అరికట్టక
పరిపరి
విధముల
పారిపోవు
అంతఃకరణముల
వల్ల
మానవుడు
నిరాశ,
అపజయములను
పొందుచున్నాడు.
అట్టి
సమయమున
మానవుని
మనస్సునందున్న
పరస్పర
విరుద్ధ
సంకల్పములను
చల్లార్చవలెను.
మనస్సును
ఏకదృష్టితో
నడిపింపవలెను.
మానవుడు
యే
మార్గమున,
యే
కార్యమును
చేయ
తలపెట్టినాడో
ఆ
దిక్కునకు,
ఆ
కార్యమునకు
నేకాగ్రముగా
సర్వ
శక్తులను
వినియోగించి
నడువవలెను.
అట్లు
చేసిన
వెనుకకు
లాగెడి
శక్తి
మరియొకటి
యుండక,
తాను
చేరవలసిన
స్థానమును
చేరి,
పొందవలసిన
స్థానమును
పొందగలడు.
10
▾
Meaning
Keep
మానవుడు
తనలోని
అనంత
శక్తిని
కనుగొనుటకు
జప,
ధ్యానములు
అవసరము
పరమాత్మపై
దృష్టి
యుంచి
పరిపరి
విధముల
పరిభ్రమించు
మనస్సును
పరమాత్మ
నామస్మరణలో
దించిన,
సూర్యుని
కిరణములను
భూత
దర్పణమున
(అద్దము)
ప్రవేశపెట్టి
ఏకాగ్రత
గావించిన
నా
కిరణములకు
దహించు
శక్తి
ఎట్లు
తక్షణము
కలుగునో
అట్లే
మనస్సు,
బుద్ధి
యను
భావములను
ఆత్మయను
అద్దముపై
ఏకాగ్రత
గావించిన
ఆ
భావములకు
ఆత్మశక్తి
ప్రాప్తించి
సర్వ
దుర్గుణములను
ధ్వంసము
చేసి,
సర్వ
సంతోషములకు
నిలయమైన
సర్వేశ్వర
జ్యోతిని
చూపించును.
ఈ
లోకమున
జీవిత
వ్యాపారములందుకాని,
వృత్తులయందు
గాని,
సఫలత
పొందు
మానవులందరు
తమ
తమ
ఏకాగ్రత
వల్లనే
సఫలీకృతులగుచున్నారు.
ఏ
చిన్న
కార్యము
సైతము
ఏకాగ్రత
లేక
జరుగుట
లేదు.
ఎంత
కఠిన
సమస్యలైనను
నిశ్చల
ప్రయత్నము
వల్ల
సాధ్యమగుచున్నవి.
11
▾
Meaning
Keep
మానవుని
యందు
అనంత
శక్తి
దాగి
యున్నది.
అది
లేనివాడే
లేడు.
అయితే
దానిని
తాను
తెలుసుకోలేక
దారి
తప్పుచున్నాడు.
అట్టివి
తెలుసుకొనుటకే
పెద్దల
సాంగత్యము,
సాధన,
జప,
ధ్యానములవసరము.
ఇంటియందు
సర్వ
సామగ్రి
యుండియు
వంట
చేయు
విద్య
రానప్పుడు
ఎంతయుండియు
నెట్లు
నిష్ప్రయోజనమో,
అట్లే
మానవుని
హృదయమున
సర్వ
సామగ్రి
సమకూరియే
యున్నవి.
అయితే
వాటిని
వినియోగించుకొను
విధానము
తెలియక,
ఉన్నవన్నీ
వృథా
అయి,
దాని
విలువను
తెలిసికొనక
తేలికగా
భావించుచున్నారు.
మానవునికి
బాహ్యమున
కనబడు
ఎన్నో
విధములైన
రూపములకు
మూలాధారమైన
అద్వితీయమైన
శక్తిని
మానవుడు
కనుగొనవలెను.
వెతుకవలెను.
మనస్సు
పరిపరి
విధముల
పరుగిడుచుండును.
దానిని
ఏకాగ్రము
గావించు
మార్గమునే
ధ్యానమని
యందురు.
12
▾
Meaning
Keep
విషయ
సంబంధము
ప్రకృతి;
స్వరూప
సంబంధము
వేదాంతము
పవిత్రమైన
పరమాత్మ
ధ్యానమువలన
మనసు
తన
ఇంద్రియ
విషయముల
నుండి
ఉపసంహరింపబడుచున్నది.
అట్టి
సమయమున
బుద్ధి
అధికారము
వహించి,
మూలాధారుని
ఆలోచన
తప్ప
యితర
చింతలను
చేర్చకుమని
మనసు
నాజ్ఞాపించుచుండును.
తన
నిజ
స్వరూపమును
తెలిసికొనిన
మనసు
అస్థిర,
అసత్య,
దుఃఖములవల్ల
భ్రమనొందక
క్షేమ,
సంతోష,
సత్యమార్గాభివృద్ధికి
చోటిచ్చును.
కష్టములకు,
దుఃఖములకు
చలించదు.
ఎందుకన
ప్రకృతి,
ప్రాణము
నాశ
రహితము
గదా!
ఈ
రెండింటి
సమ్మత
స్వరూపమగు
ప్రకృతి
విషయవస్తువునకును
ఒక
కొత్త
విలువ
సమకూర్చుచున్నది.
అదే
రీతి
ధ్యాన
సాయమున
మనోబుద్ధులనబడు
సామగ్రిచే
సచ్చిదానంద
స్వరూప
సాక్షాత్కారము
పొందుటవలన,
మానవుని
జీవితము
తేజోవంతము
గావించుచున్నది.
ఫలములు
పూర్తిగా
వినియోగింపబడినవనుటకు
తినుటలో
శేషము
లేకుండ
(మిగులకుండ)
తిన్న
యెడల
దాని
రుచి
తెలియును.
ధ్యానమును
ప్రతి
మానవుడు
నేటి
నుండియే,
ఈ
నిమిషమునుండియే
మొదలిడుడు.
దాని
ఫలితమును
రుచి
చూసిన
మానవుడు
తర్కము,
సందియము
సమసింప
జేసుకుని
సంతోషము
పొందును.
13
▾
Meaning
Keep
క్రమమును
తప్పక,
శ్రద్ధ
పూర్తిగా
వహించి,
నమ్మకమును
ప్రధానముగా
పెట్టుకొని
ఉత్సాహముతో
ధ్యానము
చేయవలెను.
అట్లు
చేయుచుండిన
దాని
మూలమున
సర్వ
సుఖములే
గాక,
సర్వ
కార్యములందు
జయమే
గాక,
సాక్షాత్కారము
ప్రాప్తించును.
దీనితో
కేవలము
వేదాంత
శాస్త్రమునకే
కాక,
ప్రకృతి
శాస్త్రమునకు
కూడ
సన్నిహిత
సంబంధమున్నది.
ఈ
రెండింటికి
ఒక
విషయమున
మాత్రము
తారతమ్యమున్నది.
ప్రకృతి
శాస్త్రజ్ఞులు
జీవిత
విషయములందు
నిమగ్నులగుచున్నారు.
వేదాంత
శాస్త్రజ్ఞులు
జీవ
స్వరూపములోనే
నిమగ్నులగుచున్నారు.
మానవుడు
ఈ
రెండింటియందు
సంబంధము
కలిగియున్నాడు
కదా!
విషయ
సంబంధము
ప్రకృతి;
స్వరూప
సంబంధము
వేదాంతము.
మానవుని
జీవితము
బాహ్యాంతరములందు
తేజోవంతము
కావలెనన్న
కర్మ
సాధనా
విధానములలో
ఉత్కృష్టమైనది
ధ్యానము.
14
▾
Meaning
Keep
ఇష్టనామమును,
రూపమును
ఓంకారముతో
జత
పరచాలి
భూమి
కంటే
కొంత
ఎత్తైన
ప్రదేశములో
అనగా
ఒక
అంగుళము
రెండంగుళములుండవచ్చును.
దానిపై
దర్భ
చాప,
దానిపై
కృష్ణాజినము,
దానిపై
తెల్లటి
పల్చని
గుడ్డను
పరచి,
ఆ
ఆసనముపై
ధ్యానము
చేయువారు
పద్మాసనములో
కూర్చునవలెను.
కుడికాలు
ఎడమకాలు
మీద,
ఎడమ
కాలు
కుడికాలు
మీద
నుండవలెను.
రెండు
కాళ్లును
ఆసనమును
అంటియే
యుండవలెను.
వ్రేళ్లను
వ్రేళ్ళతో
కలిపి,
చేతులు
ముందుకు
వదలవలెను.
కన్నులు
సగము
తెరచి
యుంచుకొనవలెను
(అర్ధ
నిమీలిత
నేత్రము)
లేక
పూర్తిగా
మూసికొనియైన
నుండవచ్చును.
15
▾
Meaning
Keep
మానసమున
దేహముయొక్క
ఒక్కొక్క
భాగమును
మాలీషు
చేయవలెను.
మెడ,
భుజము,
చేతులు,
రొమ్ము,
ఒళ్ళు,
కడుపు,
వ్రేళ్ళు,
వీపు,
మోకాళ్ళు,
తొడలు,
పాదములు,
కండరములు
వదులుగా
విడువవలెను.
(ఒదులు(సళ్ళు)
చేయవలెను).
అదైన
తరువాత
తమ
తమ
ఇష్ట
నామమును,
రూపమును
ఓంకారముతో
జతపరచవలెను.
16
▾
Meaning
Keep
అది
చేయు
సమయమున
మానసమున
ఏ
ఆలోచనలు
లేక
స్థిమితముగా
నుండవలెను.
గడచిన
పాత
యోచనలు
గాని,
కోపతాపములుగాని,
దుఃఖ
చింతనలు
గాని
తలంపునకే
రాకూడదు.
వచ్చినను,
తలంచకనే
తనకు
ఉత్సాహమును
కలిగించు
భావములను
యోచించవలెను.
ఇది
ప్రప్రథమమున
కొంత
కష్టముగనే
కనిపించును.
17
▾
Meaning
Keep
ఈ
రీతి
ధ్యానమునకు
తెల్లవారు
ఝామున
(3
గంటలు
మొదలు
5
గంటలలోపు
ఎప్పుడైనను
సరే)
4
గంటలకు
లేచిన
నిశ్శబ్దముగా
నుండును.
సాధనకు
ఉత్తమ
సమయము.
మొదట
నిద్రనరికట్టవలెను.
అది
యత్యవసరము.
కాని
కాలక్రమములు
మార్పు
రానీయకుండుటకు
4
గంటలకు
అలారం
పెట్టుకొనవచ్చును.
అదియు
సాధ్యము
కాక
నిద్ర
వచ్చుచుండిన
చల్లని
నీటితో
స్నానము
చేసిన
దాని
బారినుండి
తప్పించుకొనవచ్చును.
స్నానము
అవసరమని
యేమియు
లేదు.
నిద్ర
యెక్కువగా
నుండిన
మాత్రము
చేయవచ్చును.
18
▾
Meaning
Keep
ఈ
రీతిగా
ధ్యాన
మార్గమును
అభ్యసించిన
అతి
త్వరితముగనే
అనుగ్రహమునకు
పాత్రులు
కాగలరు.
Next
Success in Dhyāna, and Its Fruit
→