Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Success in Dhyāna, and Its Fruit
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
2.
ధ్యానసిద్ధి
-
సఫలత
ఆత్మసంబంధ
విషయములే
జపధ్యాన
సారములు
లోకమున
సాధకులు
జపధ్యానములు
చేయుచుండుట
సహజము.
అయితే
మొదట
ధ్యానము,
జపము
దేని
నిమిత్తమను
విషయమును
దృఢము,
స్థిరము
చేసికొనవలెను.
అట్లుగాక
కేవలము
జపధ్యానములు
ప్రకృతి
సంబంధమైన
వాంఛాఫల
నిమిత్తమనియు,
దాని
సారము
విషయ
వాసనలలో
చూపుననియు
తలంచి
ప్రారంభించుచున్నారు.
ఇది
చాల
పొరబాటు.
2
▾
Meaning
Keep
జపధ్యానములు
భగవంతునిపై
యేకాగ్రదృష్టిని
నిలుపు
నిమిత్తము.
విషయ
వాసనలను
విసర్జించి,
విషయ
రూపానందమును
పొందు
నిమిత్తము,
పరిపరి
విధముల
పారిపోవు
ఈగలవలె
గాక,
అనగా
ఈగ
లడ్డు
అంగడియందు
నివసించును.
పాకి
బండ్లపైకి
పారిపోవును.
అట్టి
మార్గములో
తిరుగుచున్న
మనసను
ఈగకు
కూడ
లడ్డు
మాధుర్యమును,
పాకి
బండియొక్క
అపవిత్రతను
తెలిపి,
లడ్డు
అంగడిని
వదలక,
పాకి
బండ్ల
వెంబడి
పడకుండునట్లు
శిక్షణ
నిచ్చుటయే
ధ్యానము.
అదే
తేనెటీగ
చూడుము.
ఎక్కడ
మధురమైన
తేనెయుండునో
ఆ
పుష్పమును
మాత్రమే
చేరును.
కాని
వేరు
చోటునది
ఆశించదు.
చేరదు.
అట్లే
ఈ
ప్రపంచ
విషయ
వాసనలను,
ఈ
అస్థిర,
అసత్యపు
బండ్లపై
వాలక,
సాధ్యమైనంతవరకు
సర్వేశ్వరుని
మధురానందమును
ప్రసాదించు
పవిత్ర
గుణములపై
వ్రాలునట్లు
చేయవలెను.
అట్లు
చేయుటకు
కొంత
కాలము
పట్టును.
ఆ
కాలము
కూడ
చేయునట్టి
మనో
వాక్కాయ
కర్మలపై,
వాటి
ప్రభావములపై
నాధారపడి
యుండును.
భగవద్విషయమున
ముఖ్యముగా
గమనించవలసినది
ఏమనగా
ఎంత
ఖర్చు
చేసి
నేను
భగవంతుని
ప్రార్థించుచున్నాను?
ఎన్ని
యేండ్లనుంచి
ప్రార్థించుచున్నాను?
ఏ
నియమములతో
ప్రవర్తించుచున్నాను?
ఎన్ని
గ్రంథములు
చదివినాను?
అనునది
కాదు.
ఏ
మనసున
చేయుచున్నాను?
ఎంత
శాంతముతో
కాచియున్నాను?
తనపై,
తన
స్మరణపై,
తన
కార్యములపై
ఏ
విధమైన
శ్రద్ధ
జూపుచు,
విసుగుపడక,
సౌఖ్యములెంతమాత్రము
ఆశించక,
భగవత్
సంబంధమైన
సౌఖ్యమునే
ఎంత
మాత్రము
కోరుచున్నాను?
అనునది
మాత్రమే
యోచించిన,
తత్ఫలితము
వారిది
వారికే
తెలియును.
అదిగాక
కేవలము
తాను
చేసిన
నీమము,
తాను
గడిపిన
కాలము,
ఖర్చు
కూడుకుంటు
కూర్చున్న
అవి
ప్రకృతి
సంబంధములోనే
చేరును
తప్ప,
ఆత్మ
సంబంధమునకు
అసలు
కలియవు.
జపధ్యానములు
కేవలము
బాహ్యవృత్తుల
ఫలములపై
విచారించకూడదు.
అంతర్
విషయములపై
అలోచించవలెను.
ఆత్మ
సంబంధ
విషయములే
జపధ్యాన
సారములు.
అమరత్వమైన
ఆత్మానుభవములను
క్షుద్రమైన
లోక
వ్యాపారములతో
చేర్చకూడదు.
3
▾
Meaning
Keep
మనోబుద్ధుల
నిర్మలత్వమునకు
సాత్త్విక
ధ్యానమే
ఉత్తమమైనది
అట్టి
క్షుద్రమైన
విషయముల
తలంచనుకూడ
తలంచరాదు.
అట్లు
తలంచుచు
విసుగు,
అలసటలు
పొందుచు
ఫలమింకా
లేదే
లేదే
యని
యోచించుచుండిన
అవి
కేవలము
ఫలాపేక్షతో
కూడిన
జపధ్యానములగును.
జపధ్యానములకు
ఒకటే
ఫలము.
అది
బాహ్యము
నుండి
అంతర్ముఖమునకు
మరలుట.
అంతర్ముఖము
ఆత్మానంద
స్వరూపమును
చూపును.
దానికి
ఎన్ని
దినములైన,
ఎంత
కష్టమైనా
ఓపికతో
సాధింపవలెనని
ఉత్సాహముండవలెను.
కాని
కష్టనష్టములకు,
కాలమునకు
పోల్చుకొనకూడదు.
అనుగ్రహమునకు
కాచుకొనవలెను.
దానినే
ధ్యాన
తపమని
కూడ
అందురు.
ఆ
దీక్షను
మార్చకుండుటే
తపము.
ఇట్టి
ధ్యాన
మార్గములో
మూడు
రకములైన
ద్వారములు
చేర
ప్రయత్నించుచున్నారు.
అదే
సాత్త్విక
మార్గము,
రాజసిక
మార్గము,
తామసిక
మార్గము.
4
▾
Meaning
Keep
సాత్త్విక
సాధన:
అది
జీవిత
కర్తవ్యముగా
భావించి
ఎన్ని
బాధలకైనను,
ఎన్ని
కష్టములకైనను
సహించి
ఇవన్నియు
మిథ్యయని
దృఢ
నిశ్చయుడై,
సర్వకాల
సర్వావస్థలయందును
మంచినే
చేయుచు,
మంచినే
కోరుచు,
సర్వులకు
ప్రీతి
హితుడై,
సర్వేశ్వర
స్మరణ,
జపధ్యాన
చింతలయందు
కాలమును
గడుపుచుండవలెను.
దాని
ఫలము
సహితము
సర్వేశ్వరుని
అనుగ్రహముపైననే
వేయునే
గాని
ఆశింపడు.
5
▾
Meaning
Keep
రాజసిక
సాధన:
అడుగడుగున
తత్ఫలమునే
కోరుచుండును.
అట్టి
ఫలితము
లేకున్న
విసుగు,
విరక్తి
పడుచు
తానాచరించు
ఆరాధన,
జపధ్యానములు
క్రమేణ
సన్నగిల్లుచు
వచ్చును.
6
▾
Meaning
Keep
తామసిక
సాధన:
అది
మరింత
మోసము.
ఆపదయందు,
బాధలయందు
కష్టనష్టములయందే
పరమాత్ముడు
స్మరణకు
వచ్చును.
అట్టి
సమయమున
నీకు
ఈ
పూజ
చేతు.
ఇంత
నైవేద్యము
పెట్టుదు.
నీకు
గుడి
కట్టుదునని
ఇటువంటి
ప్రార్థనలు
చేయుచుందురు.
వారు
కేవలము
చేసిన
నైవేద్యము,
కట్టిన
ముడుపులు,
పెట్టిన
నమస్కారములు,
తిరిగిన
ప్రదక్షిణలు
లెక్కించుచు,
దానికి
తగిన
ఫలములు
కోరుదురు.
7
▾
Meaning
Keep
ఇట్టి
అపేక్షలతో
ధ్యానించువారికి
మనోబుద్ధులు
నిర్మలము
కానేరవు.
కేవలము
లోకమున
చాల
మంది
ఈ
రజస్తమో
మార్గములందే
ధ్యానము
చేతురు.
ధ్యానజపమనగా
మనోబుద్ధుల
నిర్మలమొనర్చుటయే!
ఇట్టి
నిర్మలత్వమునకు
ప్రథమ
సాధనమైన
సాత్త్విక
ధ్యానమే
ఉత్తమమైనది.
మనసు,
బుద్ధి
నిర్మలమెప్పుడగునో,
అట్టి
వారి
ఆత్మ
యెఱుక
అనబడు
తేజస్సుతో
ప్రకాశించుచుండును.
ఎవనియందు
ఈ
యెఱుక
పరిపూర్ణముగా
ప్రకాశించునో
అతనినే
ఋషియని
యందురు.
8
▾
Meaning
Keep
ఆత్మనెఱుగువాడు
ఆత్మయే
యగుచున్నాడు
“బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి”
ఆత్మనెఱుగువాడు
ఆత్మయే
యగుచున్నాడు.
ఆత్మ
లేక
జీవ
బీజమగు
శుద్ధమైన
నెఱుకను
కనుగొనుటయే
జీవిత
గమ్యస్థానము.
అదియే
జన్మ
సార్థకము.
9
▾
Meaning
Keep
వాస్తవముగా
మానవుని
మనోభావములు
స్థూల
శరీరముపైన
ప్రకటిత
మగుచుండును.
స్థూల
శరీర
స్థితి
నిలకడ
కూడను
మనోభావములను
నిర్ణయించి
నియమించగలుగుచున్నది.
ఇట్లు
శరీర
స్థాపనకును,
మానసిక
భావములకును
అన్యోన్య
సంబంధము
కనబడుచుండును.
10
▾
Meaning
Keep
ఒక
ఉదాహరణము.
గోచి
పైకి
చెక్కి,
చొక్కా
మడచి,
నడికట్టు
కట్టి,
ముష్టిని
ప్రదర్శించుచు,
అతని
ప్రేమను
కాని,
భక్తిని
గాని
వెలిబుచ్చ
జాలడు.
మోకాళ్ళపై
వంగి,
నిమీలిత
నేత్రుడై,
చేతులు
పైకి
జోడించి
ఎగ
జూచుచు
తన
యొక్క
క్రోధమును,
క్రూరత్వమును
ప్రకటించ
లేడు
గదా!
దీనిని
బట్టియే
పూర్వపు
ఋషులు,
సాధకులు
కూడ
విపులముగా
తెలుపుచుండెడివారు.
ప్రార్థనకు
గాని,
జపధ్యానములకు
గాని
తదనుగుణ
దేహ
స్థాపన
అత్యవసరమని
కోరుచుండిరి.
ఆ
విధముగా
మనో
చాంచల్యమణగుట
సాధ్యమని
వారు
కనుగొనిరి.
ఉత్తీర్ణుడైన
సాధకుడు
ఎట్టి
తీరు
దేహ
నిర్మాణముతో
నైనను
ధ్యానించగలుగుట
సాధ్యము.
శిక్షణ
పొందని
వానికి
మాత్రము
సాధ్యము
కాదు.
అందుకనే
శరీర
మానసిక
శిక్షలు
అనుభవించినను,
వాటిని
మిథ్యగా
నెంచి,
సత్యమైన,
నిత్యమైన
ఆత్మను
పొందుటకై
సాధన,
ధ్యానములను
పట్టువిడువక
సాధింపవలెను.
11
▾
Meaning
Keep
ధ్యాన
సాధన
సలుపువారు
నిర్ణీత
క్రమములను
అనుసరించియే
తీరవలెను
ధ్యాన
సిద్ధి
కలుగునంతవరకు
నిర్ణీత
ఆసన
క్రమములను
అవలంబింపవలెను.
అంతవరకు
క్రమశిక్షణను
పాటించవలెను.
ధ్యాన
సంపద
కలిగిన
తరువాత
అనగా
మనోబుద్ధులు
వశమయిన
తరువాత,
తాను
పరుండిన
పడకపై
సహితము,
కూర్చున్న
కుర్చీ
మీద,
మరే
యితర
బండ
మీద,
బండి
మీద,
యెచ్చట
నైనను
సరే,
ఎట్టి
పరిస్థితిలో
నైనను
సరే,
ఎట్టి
సమయములో
నైనను
సరే
ధ్యానము
సలుప
సాధ్యమగును.
12
▾
Meaning
Keep
ఒక
పర్యాయము
మోటార్
సైకిలు
నడుప
నేర్చుకొనిన
యెడల
నెట్టి
రోడ్డు
నందైనను
దానిని
ద్రొక్క
సాధ్యమగును.
కాని
ఆ
మోటారు
సైకిలు
త్రొక్క
నభ్యసించు
కాలమున
మాత్రము
త్రొక్కువాని
క్షేమమునకు,
చుట్టు
ప్రక్కల
వారి
క్షేమమునకు
విశాల
మైదానము,
సైకిలు
మీద
నిలబడగల
తూనికకు
అనుగుణమగు
చట్ట
క్రమములను
ఆరంభించవలెను.
అది
అత్యావశ్యకము.
13
▾
Meaning
Keep
అటులనే
ధ్యాన
సాధన
సలుపవలసినవారు
నిర్ణీత
క్రమములను
అనుసరించియే
తీరవలెను.
అందులో
యే
మార్పును
చేయకూడదు.
అయితే
రజస్తమో
గుణ
సాధనలు
మాత్రము
ధ్యానమనిపించుకొనవు.
అట్టి
వాటిని
అణగద్రొక్కి
కేవల
సాత్త్విక
సాధనమే
చేసిన
అది
ధ్యానమనిపించుకొనును.
అదే
ఉత్తమ
స్థానము,
ఉత్తమ
సాధన.
ఒక
విషయమును
మాటలతో
వర్ణించుటకు
కష్టమే
గాక,
విసుగు
కూడ
జనించును.
దానిని
కార్య
రూపమున
చేసి
చూపుట
అతి
సులభము,
ఆనందము
కూడ.
ధ్యానము
చేసి,
తెలిపిన
నీమము
ననుసరించి
ధ్యాన
మార్గమును
తెలిసికొనుట
మంచిది.
14
▾
Meaning
Keep
నేను
వ్రాయుట
వల్ల,
మీరు
పఠించుట
వల్ల
అంత
సులభముగా
మీకు
తెలియదు.
ధ్యానము
వల్ల
మానవుడు
అంతరమున
అత్మను
కనుగొనగల
దివ్యానుభవమును
పొందుచున్నాడు.
ధ్యానము
వల్ల
సాధకుడు
భ్రాంతి
కలిగించు
ఆవరణములనుండి
పొరలు
పొరలుగా
ఉపసంహారము
పొందుచున్నాడు.
ప్రపంచ
విషయానుభవములనుండి,
ఇంద్రియ
వ్యవహారమును
వెనుకకు
మరల్చుచున్నాడు.
ఇట్టి
పవిత్ర
స్థానమును
పొందగోరుటే
ధ్యానమనబడును.
దీనికి
ప్రధానముగా
మానవుడు
చక్కని
నీతి
నియమములు
కలిగియుండవలెను.
ప్రపంచ
విషయములు,
అందుగల
తీవ్ర
ఆకర్షణల
యెడ
విరాగము
కలిగి
యుండవలెను.
ఎట్టి
సమయమునందైనను
ఉత్సాహ,
ఆనందములతో
మెలగవలెను.
ఏ
కార్యము
చేసినను
జీవిత
మార్గమునకు
కాక
ఆత్మానందమునకని
భావించవలెను.
తన
శరీరమును
చక్కని
ఆసనమున
నుంచగలిగి,
అంగములు
ఒదులు
చేసి
(సళ్ళు
పరచి),
శరీరము
యొక్క
బరువు,
ఒత్తిడియు
తన
మనో
దృష్టిని
లాగకుండునట్లు
నిలుపుటకు
అభ్యాసము
చేయవలెను.
ఇదియే
సాత్త్విక
ధ్యాన
సాధన
అనబడును.
దీనికే
క్రమము
ముఖ్యావసరము.
15
▾
Meaning
Keep
కేవల
సిద్ధాంతములు,
వేదాంతము
మానవుని
వ్యక్తిగత
దోషములను
నివారింపలేవు
ఇది
వరకు
పోయిన
సంచికలో
తెలిపిన
విధానములను
ఉపయోగించుట
వల్ల,
మానసిక
దుర్వ్యాపారములను
తొలగించుటయందు
గల
సామాన్య
కష్టనష్టములన్నియు,
క్రమాభ్యాసమువల్ల
దొలగును.
సాధకుడు
అనుష్ఠానము
చేయుటే
మిగిలియున్నది.
ఎంత
గొప్ప
మందైనను
క్రయమిచ్చి
తీసినంత
మాత్రమున
రోగము
నివారణ
కాదు.
రోగి
దానిని
క్రమశిక్షణ
ననుసరించి,
కొద్ది
కొద్దిగా
తిని,
అది
దేహమున
జీర్ణమగునట్లు
పాటుపడవలెను.
మందుయొక్క
సారము
దేహమాద్యంతము
వ్యాపించవలెను.
దేహమే
ఔషదమయము
కావలెను.
అట్లే
సిద్ధాంతమును,
వేదాంతములు
మనుష్యుని
వ్యక్తిగత
దోషములను
పూర్తిగా
తొలగింప
శక్తి
లేకున్నవి.
16
▾
Meaning
Keep
మానవునకు
పూర్తి
ఫలము
లభింపవలెనన్నచో,
అసత్య
దోష
భావములను
తొలగించి,
ఆ
వేదాంత
సిద్ధాంతములందు
తెలిపిన
సత్య
విషయములను
ఆచరించుచు
వచ్చిన,
సర్వ
శక్తులు
సమకూరును.
సాధకుడు
తన
అంతర్జీవితమున
నిర్మల
వ్యవహారము
గలిగియుండుటే
ధ్యానము
యొక్క
కార్య
సిద్ధి
రహస్యము.
సాధకుడు
సన్మార్గపు
విలువలతో
జీవించు
కొలది,
వాని
ధ్యానము
సఫలత
పొందుచున్నది.
ప్రతియొక్కరును
ఇట్టి
ఉన్నత
శక్తి
సామర్థ్యములు
పొందగల
హక్కు
తనలో
గలిగియున్నాడని
నే
మెల్లగ
చెప్పుట
లేదు;
గంటగా
మ్రోగుదును.
కనుక
ధ్యానించి
అభివృద్ధి
పొందుడు;
ఆత్మను
గాంచుడు!
Previous
←
The Power of Dhyāna, and the Experience of It
Next
The Destruction of the Manas Is the Goal of Dhyāna
→