Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · The Growth of the Sāttvic Is Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
14.
సాత్త్వికాభివృద్ధియే
ధ్యానము
మనసునందలి
మాలిన్యములన్నియు
ధ్యాన
బలమువలన
నిర్మూలింపబడును
గర్వము,
అహము,
తన
గొప్పతనమందలి
(గొప్పవాడినని)
రాజస
స్వభావము,
కోపము,
ఇతరులలో
లేనిపోని
మంచి
చెడ్డలు
తెలిసికొనవలెనను
ఆసక్తి,
కపటము
మొదలగునవన్నియు
ధ్యానమునకు
ఆటంకములు.
ఈ
మార్గము
యొక్క
సూక్ష్మ
వాసనలు
మనస్సునందు
దాగియుండును.
2
▾
Meaning
Keep
ఒక
గదిని
కొన్ని
మాసములు
మూసిపెట్టి,
తరువాత
తెరచిన
ఎంత
మలినము
చేరియుండునో,
అట్టి
గదిని
శుభ్రము
చేసిన
మలినమంతయు
పోయి
ఎట్లు
శుభ్రమగునో,
ఆ
ప్రకారమే
మనస్సునందలి
మాలిన్యములన్నియు
ధ్యాన
బలము
వలన
పూర్తిగా
పోవును.
3
▾
Meaning
Keep
సాధకులు
లోచూపు
నిలిపి,
వారి
మనస్సులను
పరీక్షించుకోవలెను.
సరియైన
పద్ధతులు
ఉపయోగించి
యందుండు
మాలిన్యములను
క్రమక్రమేణ
ఒకదాని
వెంట
నొకటి
తీసివేయవలెను.
గర్వము
చిరకాల
స్థాయియై
(చిరకాలమునుండి
నెలకొని)
విడువనిదిగా
నుండును.
రజో
గుణము
గల
మనస్సునందు
అది
అనేక
విధములైన
ఉపశాఖలు
గలిగి
అన్ని
వైపుల
వ్యాపించును.
అట్టి
ఉద్రేకమెప్పుడో
ఒకప్పుడు
తాత్కాలికముగా
తగ్గినను,
తిరిగి
కనిపించుచునే
యుండును.
అవసరము
వచ్చినపుడంతయును
గర్వము
బయటపడి
దాని
ఆధిక్యము
చూపుచునే
యుండును.
4
▾
Meaning
Keep
సాధకుడు
స్వల్ప
విషయములందు
కూడ
నిదానము
చేయక,
త్వరగా
కోపము
తెచ్చుకొనుచుండును.
అట్లుండిన
ధ్యానమున
అతడెంత
మాత్రము
వృద్ధి
పొందలేడు.
అట్టివాడు
సౌమ్యమైన
ప్రేమ
భావము
నలవరచుకొనవలెను.
అప్పుడు
ఉన్న
చెడు
అలవాట్లు
తగ్గిపోవును.
5
▾
Meaning
Keep
అంతర్ముఖమైన
చూపు
లేక
సాధకుడు
తన
తప్పును
తాను
ఏనాటికి
తెలుసుకోలేడు
కొంతమంది
సాధకులు
వారిలోనున్న
చెడు
అలవాట్లను
బయటపెట్టిన
మరింత
ఎక్కువగా
కోపగించుకొందురు.
ఇది
మరింత
చెడ్డది.
సాధకుడు
వ్యక్తియందు
అంతర్ముఖమైన
చూపు
లేక,
ఎల్లప్పుడు
మనసు
బహిర్గతముగా
నుండిన
అట్టి
సాధకుడు
తన
తప్పును
తానేనాటికి
తెలిసికొనలేడు.
6
▾
Meaning
Keep
గర్వము
అడ్డముగా
నుండి
మనో
దృష్టిని
చెడగొట్టును.
సాధకుడు
వృద్ధి
పొందవలెనని
కోరికయే
యున్న
తన
తప్పులితరులు
కనిపెట్టి
చెప్పిన
వాటిని
శిరసావహించి
యొప్పుకొని,
తిరిగి
నట్టివి
రానీయక
తనయందు
కలుగకుండ
చేసికొనుటకు
ప్రయత్నించవలెను.
అట్లుండిన
ధ్యానమున
త్వరత్వరగా
అభివృద్ధి
పొందగలడు.
ఆనందమును
అనుభవించగలడు.
7
▾
Meaning
Keep
అహము
పోగొట్టుకొనుట
అతి
కష్టము.
ప్రతి
వ్యక్తియు
తన
జీవితము
ఆనాదినుండి
నిర్మించుకొనుచు
వచ్చుచున్నాడు.
వాడు
తన
రాజసిక
మనస్సును
దాని
ఇష్టము
వచ్చినట్లు
పోనిచ్చుచున్నాడు.
అట్టి
జీవితము
బాగా
బలపడి
గట్టి
పడియుండును.
దానిని
ఇష్ట
ప్రకారము
వంచవలెనన్న
చాల
కష్టము.
8
▾
Meaning
Keep
అహముతో
కూడిన
వ్యక్తి
ఇతరులపై
అధికారము
చేయుటకు
కోరుచుండును.
ఇతరులు
చెప్పు
సమాధానములకు
అతను
ఇష్టపడకుండును.
అవి
మంచివయినను
తన
పంతము
వల్ల
తనకు
నచ్చక
యుండును.
ఇట్టివాడు
అహముతో
కూడిన
పచ్చకామెరల
కన్నులు
కలిగియుండును.
నేను
చెప్పినదే
సరియైనది,
నేను
చేయునదే
సరియైనదను
అహముతో
కాలము
గడుపుచుండును.
ఇవి
అన్నియు
సాధకులకు
సరియైనవి
కావు.
9
▾
Meaning
Keep
తన
తప్పు
నెవరు
చెప్పినను
నొప్పుకొనుచు
సరియైన
యోచనలు,
మార్గము
లెవరు
చెప్పెదరా
యని
కాచుకొని
యుండవలెను.
తన
తప్పును
సమర్థించు
కొనుటకు
ప్రయత్నింపకూడదు.
అదియుగాక
లేనిపోని
వాదనకు
దారి
తీయుదురు.
వాదనలో
తాను
నెగ్గక
పోయిన,
పోట్లాటకు
సిద్ధమగుదురు.
ప్రజల
మర్యాదలకు
ప్రాకులాడకూడదు.
వారు
మర్యాద
చేయకున్న
కోప
పడకూడదు.
ఇట్టివే
మొదట
సాధకులు
నేర్చుకొని
ఆచరణలో
నిత్యము
నాచరింపవలెను.
స్తోత్రమునకు
సంతోషించకూడదు.
ఇది
చాల
ప్రమాదము.
అంతియే
గాక
దారి
తప్పి
పోవును.
ఆధ్యాత్మిక
రీత్యా
యెన్నటికి
కూడ
వృద్ధికి
రాడు.
10
▾
Meaning
Keep
ఏకాగ్రతాభ్యాసముతో
ఇచ్ఛా
శక్తి
బలపడును
మొదట
మానసిక
పద్ధతులు
మార్చుకొనవలెను.
ఇతరులను
నొప్పించని
అభ్యాసములు,
ఇతరుల
ఉపదేశములు
తెలిసికొని
అతనికి
మంచిది
అని
తోచిన
వాటి
ప్రకారము
నడచుకొనుట,
ఇట్టివి
ప్రయత్నించవలెను.
అమర్యాద,
ఆక్షేపణ,
భూషణములవలె
దలంచవలెను.
ఇతరులెట్టి
వారైనను
సరిపెట్టుకొనుటకు
ప్రయత్నించవలెను.
సాధనయందు
ఇట్టి
అవాంతరములు
కలిగినను,
ధ్యాన
ధారణలను
అభ్యసించుటకు
సంతోషముండదు.
ఇట్టి
అడ్డంకులను
మనస్ఫూర్తిగా
ప్రార్థించి
తొలిగించుకొనవచ్చును.
11
▾
Meaning
Keep
అడ్డంకులు
పోగొట్టుకొనుటకు
పలువురు
పలువిధములైన
మంత్రములు,
జపములు
చేయవలెనని
తెలిపిరి.
కృష్ణుడు
కూడ
ద్వాపర
యుగమునందు
ఈ
రీతిగా
దెల్పెను.
“మచ్చిత్తస్సర్వ
దుర్గాణి,
మత్ప్రసాదాత్తరిష్యసి”
(అనగా
నా
మీదనే
చింత
కలిగిన
నా
కటాక్షమువల్ల
అన్ని
చింతలు
తొలగి
పోవును)
ధ్యానాభ్యాసమందు
నియమము
ననుసరించవలెను.
ధ్యానమున
నియమమే
ముఖ్యమైన,
అవసరమైన
విషయమైయున్నది.
సాధకుడట్టి
నియమములతో
పనిచేసిన,
తొందరగా
ఉత్తీర్ణుడు
కాగలడు.
12
▾
Meaning
Keep
భవమున
ధ్యానము
మొదటి
రకపు
మందు.
వీటిలో
మరొకటి
ప్రధానముగా
అలవరుచుకోవలసియున్నది.
అదియే
తృప్తి.
అది
మనస్సున
గలవారికి
అంతులేని
పండుగగా
నుండును.
ఆశ
వల్ల
మనస్సు
చంచలముగా
నుండును.
ఆశ,
శరీరములో
ఒక
మంటవంటిది.
మనుజుని
క్రమేణ
దహించుచు
వచ్చును.
అట్టి
ఆశకు
విరుగుడే
తృప్తి.
తృప్తి
యొక్క
ఆనందమే
ధ్యానమునకు
రాచబాట.
ఏ
ప్రకారము
ఎఱ్ఱటి
యెండలో
సంచరించి,
ప్రయాణము
చేసి
అలసిన
సమయమున
చన్నీటి
స్నానమెంత
హాయిని,
శాంతిని
చేకూర్చునో,
అట్లే
ఆశయను
అగ్నివల్ల
కాల్చబడుచున్న
దురాశగల
వ్యక్తి,
తృప్తియను
జలాశయములో
స్నానము
చేసిన,
పూర్తిగా
సౌఖ్యము
ననుభవించవచ్చును.
13
▾
Meaning
Keep
అసలు
మోక్షమునకు,
సాక్షాత్కారమునకు
మూడు
ద్వారములు.
ప్రతి
ద్వారము
దగ్గర
ఒక్కొక్క
కాపలావాడు
కావలి
కాచుచున్నాడు.
వారే
శాంతి,
సంతోషము,
విచారణ.
వీరిలో
ఏ
ఒకరిని
మీరు
స్వాధీనము
చేసికొన్నను
మిగిలిన
వారు
వారంతట
వారే
మీకు
స్వాధీనము
కాగలరు.
14
▾
Meaning
Keep
మొదట
సంతోషమను
కాపలా
వానిని
స్వాధీనము
చేసికొనవలసి
యున్నది.
అప్పుడు
తృప్తి
గలుగును.
తృప్తి
కన్న
గొప్ప
సుగుణము
మరొకటి
లేదు.
అదే
సర్వమునకు
చక్రవర్తి.
దీనిని
వృద్ధి
చేసికొనుటకు
ప్రయత్నించుడు.
లేకున్న
కామలోభత్వము
వలన
వివేకము,
విచారణ
శక్తి
శూన్యమగును.
15
▾
Meaning
Keep
కామమునకు
ముఖ్య
అధికారి
లోభము
(ఆశ).
కామమున్న
చోట
లోభము,
లోభమున్న
చోట
కామము
తప్పక
నుండును.
వీటి
మూలమున
ఆలోచన
మందగించి,
బుద్ధి
అనుచిత
మార్గమున
సంచరించును.
కాన
తృప్తి
యను
సద్గుణమును
వృద్ధి
చేసికొనవలెను.
16
▾
Meaning
Keep
అట్లుగాక
మనసులో
నొక
దానిపై
ఆశ
పెట్టుకొని,
ఆలోచన
చేయుచు,
అది
విడిచి
వేరొక
విషయమునకు
పరుగిడుచుండిన
మనుజునకు
విశ్రాంతియే
లేక
తిరుగుచుండును.
అట్టి
వానికి
ధారణా
శక్తి
యెట్లు
ప్రాప్తించును?
ధారణ
చేయలేని
వాడు
ధ్యానము
నెట్లు
సాధింపగలడు?
ధ్యానము
లేక
దైవము
వశము
గాదు.
17
▾
Meaning
Keep
అట్లు
చలనముగా
నున్న
సమయమున
“ఓ
మనస్సా!
అపవిత్రమైన
ఈ
కోరికలయందును,
విషయ
సంబంధమైన
వస్తువులయందును
నన్ను
లాగకుము.
నీ
నడకలు
నన్ను
చెడగొట్టుచున్నవి.
నేను
భగవంతునిపై
వ్రాలునట్లు
ప్రయాణము
సాగింపుము”
అని
మనసుకు
బోధించుము.
18
▾
Meaning
Keep
నీకు
ఉన్నత
స్థితి
పొందవలెనని
ఆసక్తి
యుండిన,
ఆశలను
వదలి
తృప్తితో
తానొక్కడు
తప్ప
వేరు
నాకవసరము
లేదని
నామము,
తన
రూపము
మాత్రము
జపించుచు,
ధ్యానించుచుండిన
అదే
శాంతి,
సంతోషము,
తృప్తి.
19
▾
Meaning
Keep
తృప్తి
యెవ్వరిని
సోమరిగా
చేయదు.
అది
పరమ
సాత్త్విక
గుణము.
అది
యెల్లప్పుడు
మనస్సును
పరమాత్మపైనే
మరలియుండునట్లు
చేయును.
అనవసరమైన
స్వలాభ
ప్రయత్నములకు
ప్రాకులాడకు.
మానుష
శక్తిని
సాత్త్విక
వాహినులవైపుకు
లాగుచుండును.
తృప్తి
గలవాడు
పూర్తిగా
సత్యము
కలవాడగును.
లోనుండు
ఆత్మతో
సమ్మేళనము
కలిగించుకొనును.
అతనెంత
కాలమైనను
విసుగు,
విరామము
లేక
ధ్యానమునందే
లీనము
కాగలడు.
అనేక
విధముల
సరిపోవు
మనో
వికారములను
కేంద్రీకరించునట్టిది
ధ్యానమొక్కటియే
వేరొకటి
లేదు.
20
▾
Meaning
Keep
ఏకాగ్రతాభ్యాసము
ఇచ్ఛాశక్తిని
బలపరచుకొనుటకు
చాల
ఉపయోగపడును.
నీవు
మనస్సు
యొక్క
పోకడలను
జాగ్రత్తగా
కనిపెట్టుకొనవలెను.
అదెట్లు
సంచరించునో,
ఎట్లు
పనిచేయునో
యోచింపవలెను.
చంచల
స్వభావము
గల
మనస్సు
స్వాధీన
పరచుకొనుటకు
ధ్యానము
తప్ప
వేరే
గతి
లేదు.
21
▾
Meaning
Keep
ముందు
సాత్త్విక
భావములను
బలపరచి,
రాజసిక,
తామసిక
భావములను
నిర్మూలించునదే
ధ్యానము
చెడు
పరిసరముల
విషయములే
సమయమునందును
యోచించరాదు.
నీవు
వెళ్ళు
స్థలములయందు
కొన్ని
కష్టములు,
ఇబ్బందులుండవచ్చును.
ప్రతి
చోట
ప్రతి
పనియందు
నీ
మనస్సును
భ్రమింపజేసిన
అట్టి
అడ్డంకులను,
కష్టములను,
సరియైన
మార్గముల
ద్వార
తొలగించుకొనవలెను.
22
▾
Meaning
Keep
నీకు
ఉపయోగించని
చెడు
పరిసరములనుండి
నీవు
పారిపోవుటకు
ప్రయత్నించకుము.
అక్కడే
నిల్చి
పరమాత్ముని
ప్రార్థించి,
ధ్యానించి
“భగవాన్!
ఈ
దృశ్యములు
లేక,
ఈ
తలంపులు
లేక,
నీ
దృశ్యము,
నీ
తలంపులు
ప్రసాదింపుము”
అని
ప్రార్థించుము.
నీవు
సౌఖ్యములను
కోరవద్దు.
సౌఖ్యమే
యున్నచో
త్వరగా
ధ్యానమునందు
శక్తి
వంతుడవు
కాలేవు.
23
▾
Meaning
Keep
కాన
మరొకటి
క్రొత్తది
నేర్చుకొనవలెను.
అదియే
అన్ని
స్థలములయందును
సౌఖ్యము
లేకున్నను,
వీలు
కలుగజేసుకొని
ఉన్నదానితోనే
సరిపుచ్చుకొని
ఆనందింపవలెను.
నీవుండవలసిన
నీ
మనః
ప్రపంచమందు
నీవుండి,
అందులో
నీవు
ధ్యానించుము.
నీకు
ప్రీతి
గలిగించు
పరమాత్ముని
నీవు
నీలోన
నిర్మించుకొని
యుండిన,
ఎవరును
నిన్ను
కలవర
పెట్టలేరు.
ఏ
ప్రదేశము
నిన్ను
భ్రమింప
జేయలేదు.
విసిగింప
సాధ్యము
కాదు.
24
▾
Meaning
Keep
గర్వము
వలన
విషమ
మనస్సు
కలుగును.
అట్టి
సమయమున
దానిని
తక్షణము
సరిచేసికొనుటకు
ప్రయత్నించుము.
కాలయాపనము
చేయకూడదు.
నిర్మలమైన
ఆలోచనలతో
ఏకాంతముగా
కూర్చుని,
కొన్ని
నిమిషములు
ధ్యాన
మాచరించుము.
అట్లు
చేయక,
అట్టి
విషమ
మనస్సును
సరిచేయక
ఆలసించిన,
ఆ
పని
భగ్నమగును.
“ఆలస్యమమృతం
విషం”
అను
లోకోక్తి
ముఖ్యముగా
ఇట్టి
సమయములందు
జ్ఞాపకముంచుకోవలెను.
మనస్సు
ఆందోళన
లేకుండ
నిర్మలముగా,
సంతోషముగా
నుంచవలెనన్న
ధ్యానమే
ప్రధాన
సాధనము.
25
▾
Meaning
Keep
ప్రపంచమందు
ప్రజలలో
అనేకులు
ఎంతో
విద్యావంతులయి
కూడ
నిర్ణీతమైన
ఉద్ధేశముతో
జీవయాత్ర
గడుపుట
లేదు.
కాబట్టి
వారు
సముద్రములో
ఇటుఅటు
కొట్టుకొనిపోవు
కఱ్ఱవలె
ఒక
చోట
నిల్వక,
వారేమి
చేయవలెనో
వారికే
తెలియక
మనస్సును
ఒక
విషయమునందు
స్థిర
పరచక,
ఒక
మాటనే
పలు
విధములు
మార్చుచుందురు.
26
▾
Meaning
Keep
చెప్పునదొకటి,
చేయునది
మరొకటిగా
నున్నది.
దీనికి
కారణము
నీమము
(నియమము)
లేని
ఉద్ధేశమే.
దానికే
ధ్యానము
అతియుక్తము.
భావములు
కూడ
సరిజేసుకొనవలెను.
భావమనగా
మానసిక
స్థితి.
వీటి
భాగములే
సాత్త్విక,
రాజసిక,
తామసికములు.
మొదట
సాత్త్వికమును
బలపరచి,
మిగిలిన
రాజసిక,
తామసికముల
నిర్మూలించునదే
ఈ
ధ్యానము.
దీనికి
తగిన
అస్త్రము
వేరు
లోకములలో
గాని,
మరో
లోకమున
అయితే
నేమి
గాని,
ఏ
సాధనయందయితే
నేమి
లేదు.
ఈ
ధ్యాన
మార్గము
అజ్ఞాన
ధ్వంసము
చేసి,
బ్రహ్మముతో
నైక్యత
సాధించును.
27
▾
Meaning
Keep
-:సంపూర్ణము:-
Previous
←
Fixing the Mind on One Thing Is the Essence of Dhyāna